చక్కట్ల దండ




మహాకవి దాసు శ్రీరాములు





ప్రకాశకులు

మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి

వాణీ సదనము. 3 - 4 - 885/A, బర్కత్‌పురా

హైదరాబాద్ 27

ప్రథమ ముద్రణ 1930

ద్వితీయ ముద్రణ 1984

500 ప్రతులు


సర్వస్వామ్య సంకలితము


వెల రు. 7-00


ముద్రణ:

వాణీ ప్రెస్

విజయవాడ-2

కృతజ్ఞతలు


గ్రంథమునందు ముద్రణా స్థాలిత్యము లోదవుకుండుటకు ఋజు పత్రము (ప్రూఫు)ల సరిదిద్దిన 'గాన కళాప్రపూర్ణ' సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ యన్.సిహెచ్. కృష్ణమాచార్యులవారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మా యందత్యభిమానముతో ఈ గ్రంథమునకు పీఠిక వ్రాసి యిచ్చిన డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. రీడర్ & హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలుగు, ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతా శతశతములు.

విజయవాడ
1-9-1984

దాసు పద్మనాభరావు

అధ్యక్షుడు
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి

page=6

'మహాకవి'

దాసు శ్రీరామ పండితులు

పీఠిక

- డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి


తెలుగులో వ్రాయాలి, అచ్చ తెలుగులోనే వ్రాయాలి అనే కోరికా పూనికా మధ్య మధ్య కొందరికి కలిగింది. అటువంటి రచనలవల్ల రచయిత పూనిక నెరవేరుతుంది. పాఠకులకు భాషా పరిజ్ఞానము కలుగుతుంది. కాని దానివల్ల చాలా కృతకమైన భాష ఏర్పడుతుంది కూడా. పుడమిదయ్యము, బొమ్మ గ్రుడ్డు, కడలి మొల, నూలుచేడియ, కనినపడుచు, మంచిమెడ, యెకిమీడు మొదలైన పదాలకీ, ఈ పూనికకి పేగు సంబంధం ఉంది. ఆయాపదాలు ఆయా కావ్యాలకు ముందూ లేవు; తర్వాత వాడుకలోకి రాలేదు; అవి ఆయా కవుల కిట్టింపు ధోరణికి, అతుకుల బుద్ధికి పరిమితమయిపోయాయి; లోకానికి క్షేమం.

దాదాపు నూరేండ్ల క్రిందట అచ్చ తెలుగులో ఈ 'చక్కట్ల దండ' వెలసింది. లౌకిక నీతి మాలిక అన్న సంస్కృత సమాసానికి తెలుగులో ఏర్పడిన అతుకుల బొంత పేరు చక్కట్ల దండ. అయితే ఒక్క పేరులో తప్ప, సామాన్య పాఠకులకు సులభంగా అర్థంకాని పదాలు ఇందులో లేనట్లే; సంతోషం.

దాసువారు సంస్కృత సమాలను ఈ శతకంలో వాడలేదు. ఇది అచ్చ తెలుగు కావ్యాల పద్దతియే, అచ్చ తెలుగులో అదృశ్యమైనది సంస్కృత సమం మాత్రమే కాని ఆంగ్లమూ, ఉర్దూ చొరబడ్డాయి. అవి తెలుగులో ప్రవేశించి వాడుక లోకి వచ్చాయికదా అని కవిగారి వాదం. సంస్కృత పదాలూ ప్రవేశించినాయి కదా? మరి వాటికిలేని స్థానం ఉర్దూ, ఇంగ్లిషులకు ఎల్లా దక్కింది?

దీనికి చారిత్రక కారణం వెతకాలి. తెలుగులో అచ్చ తెలుగు కావ్యాలు పుట్టేనాటికి సంస్కృత సమాలే ఎక్కువగా ప్రవేశించాయి. కనుక అచ్చ తెలుగు అనగానే సంస్కృత పదాలను పరిహరించవలసి వచ్చింది. అచ్చ అంటే, 'సంస్కృత సమేరకంబయిని భాష' అని లక్షణ వేత్తలు నిర్ణయించారు. దానువారు ఈ సంప్ర దాయాన్నే కొనసాగించారు. కాని అచ్చ తెలుగుమీద, వల్ల మాలిన వ్యామోహం లేకపోవడంవల్ల, దైనందిన వ్యవహారంలోని విదేశీ భాషాపదాలను వీరు వాడినారు. అస్తు.

నీతి పద్యాల్లో సువతీశతకం మకటాయమానమైనది; వేమన పద్యాలు అత్యంత సుందరాలు. అయితే సామాజిక పరిస్థితులను బట్టి అనేక నీతి పద్యాల శతకాలూ (విశేషించి సీసపద్య శతకాలు) సంపుటులూ వెలువడ్డాయి. చక్కట్ల దండ ఒక చక్కని పద్య శతకం. (తెలుగు శతకాలు సర్వసాధారణంగా అష్టోత్తర శత సంఖ్యా విస్తృశం. చక్కట్లదండ శతమాన పరిమితం.) దాసు శ్రీరాములుగారు...బహుముఖ ప్రజ్ఞాశాలి; ప్రతిభా వ్యుత్పత్తులు సమపాళ్లలో రంగరించుకొన్న కవి, గొప్ప ధారాశుద్ధిగలిగిన రచయిత. న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, జ్యోతిశ్శాస్త్రవేత్తగా ప్రసిద్ధులు. వారి లేఖిని మంచి వెలువడిన ఈ చక్కట్ల దండ- కి శ. 1894 వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తి అయినదని కవి యిల్లా అంటున్నారు.

జయ సంవత్సరం (గెలుపు సాలున) వర్షర్తవునందు (వానకారు) శ్రావణమాసంలో (మింటి నెలయందు) కృష్ణపక్షంలో (వన్నెతగ్గెడినాళ్లు) పంచమినాడు (పడగ తాల్పెడి రోజు) అశ్వనీ నక్షత్రమందు. (జేజేల వెజ్జులు) వృశ్చికలగ్నంలో (చెలగిన తేలు) అనగా అపహార్ణం 3-00 గంటలకు ఇది పూర్తి అయింది. (వృశ్చిక రాశియని' పొరపాటున వడి ఉండవచ్చును.)

కవిగారు చక్కని ధారాశుద్ధిగలిగిన రచయిత అన్నాం. క్రింది పాదాల్లో అది ప్రస్ఫుటం.

 
1.కురియక కురియక కురిసెనా మొయివారి
        యెడవాన పొలమెల్ల యెద్దుకన్ను
   కాయక కాయక కాచె నా తరం బూచి
       గున్న మామిడి కొమ్మ కోటివేలు .....

2. పొరుగు వారికి మేలు పొందరాదందువా
        ఇరుగువారికి నీవ పొరుగువాఁడు
   ఇరుగు వారికి మేలు పొందరాదందువా
        పొరుగు వారికి నీవ ఇరుగువాఁడు
        
3. నెలదప్పి నంతనె నిసువు పుట్టఁగఁ బోదు
        నిండఁ దొమ్మిది నెలలుండవలయు
   వరినాటి నంతనే వడ్లురాలవు పంట
        కళ్లాల దనుకనుఁ గాయవలయు ...
        
కవిగారు హాస్యప్రియులు: ఉదాహరణకు

1. పడి సెంబు పట్టిన పాదుషా మీఁగడ
        చీదునా చీమిడిఁ జీఁదుఁగాక..

  

2. వేదు రెత్తినకుక్క వేఁటకై కొనిపోవ
       కట్టి పెంచిన వాని కాలుఁ గఱచు
       
3. తేలుకుట్టినవాని మేలె న పల్లకి
       మీఁద నెక్కించిన బాద లేదే....
       
రంధ్రాన్వేషణ తత్పరులను హాస్యధోరణిలోనే మందలిస్తూ-

1. సానితో నిచ్చ ముచ్చటలాడు విటగాఁడు
       గుడిసెవేటును కూడు కోడెఁదూరు,
   గొడ్డునంజుడు కొనిపోయెడి గొడారి
       పనికిమాలిన దెత్తుపాకిఁ దిట్టు,
   తగునంచు గంజాయి దమ్ముఁగొట్టు పిసాసి
       కల్లుఁద్రావెడి దోసకారి చెంచు
   ఏటిటి దినసారి కేఁయు బాపఁడు పొడె
       దాల్బు బాపని నెగతాళి సేయు . . . .

అని వ్రాశారు.

బరుపు చేటగు అరువు సొమ్ము లనర్థకాలని, హేళన చేసారు కవిగారు, క్రింది ధోరణిలో వ్రాశారు.

1. వేసాల పేడికి మీసా లనుర్చిన
       మూతి బిగియ పట్టి మొత్తుకొనును....
   గమిడి బజ్జెకు గుడ్డగండోల్గట్టిన
       చీదరించుక పట్టి చించివై చు....
        
2. గుఱ్ఱంబు డెక్కను గోసి రెండొనరింపఁ
       బుఱ్ఱెపైఁ గొమ్ములు పుట్టఁబోవు
   కంద మ్రోకను దలక్రిందుగాఁ బ్రాతిన
       కాడమీఁదనుఁ గాయగాయఁబోదు....

కవిగారికి కొన్ని మోజులున్నాయి, చూడండి.

  
1. విక్టోరియారాణి వెలసి యేలుటఁ బట్టి
       యిండియా పొగడిక యెక్కువాయెఁ
   బండ్ల తోటలు దొడ్డపైరులఁ బట్టి
       మద్రాసు ప్రెసిడెన్సి మంచిదాయె
   తియ్యఁజక్కెరవంటి తెలుఁగును బట్టి గో
       దావరి డిస్ట్రిక్టు ఠీవిఁగాంచె
   మేలైన పని తివాచీల నేఁతను బట్టి
       యేలూరు పెద్ద పేరెక్కెనాయే....

2. గెలుపిండియానాడ! గెలుపింగ్లీషు మాట!
       గెలుపు వేలుపుఁబాస : గెలుపు తెలుఁగ!
   గెలుపు స్టీమరులార! గెలుపురెల్రోడ్లార!
       గెలుపు హైస్కూళ్లార: గెలుపు సైన్స !
   గెలుపు కాలువలార! గెలుపు సోద్దెపు టాన
       కట్టలారా! టెలిగ్రాపులారా !
   గెలుపు డార్విన్ భేరీ! గెలుపు థియోసఫీ :
       గెలుపు నేషనలు కాంగ్రెస్స నీకు :
   గెలుపు విక్టోరియా రాణి! గెలుపు గెలుపు
   గెలుపు గెలువని పలుకుటె గెలుపు మనకు...

ఇల్లా చూపించుకొంటూపోతే, పుస్తకముతా ఉదాహరించాలి; ప్రతి పద్యంలోనూ, ప్రతిపాదంలోనూ ఏదో ఒక విశేషం ఉంటోంది మరి!

మరి సెలవు

పీఠిక

ఈ చిన్న పుస్తకము పేరు "చక్కట్ల దండ ఈ పేరు అచ్చతెలుగు మాటలతో గూర్చబడినది. ఈ గ్రంధము సంస్కృతి సమములు అనగా తత్సమపదములు చేరకండ వ్రాయబడినది. కావున దీని పేరు అట్లుగానెయుండుట యుక్తమని యేర్పరుపబడినది. చక్కట్లు = లౌకికనీతులు; దండ= మాలిక కావున లౌకిక నీతిమాలిక యను నర్ధమిచ్చుచున్నది. ఇది నూరు సీసపద్యములు కలదయి యున్నది. ప్రతి పద్యము యొక్క తుదను గీతచరణములు రెండుమాత్రము అన్ని పద్యములకు సమానము. అవి యేవనగా "అనిపలుకు దానురాముడిట్లచ్చతెనుఁగు|కబ్బమందము నిండ జక్కట్ల దండ|". ఈ గ్రంధమును సులభ శైలిలో వ్రాయుటయేకాక లోకానుభవమువలన మనకు దెలియుచున్న వస్తువులు వాని గుణములు క్రియలు మాత్రమే దృష్టాంతములుగా గయికొనబడినవే కాని దేవతలు పిశాచములు రాక్షసులు స్వభావ విరుద్ధములై గ్రాంధికములయి కనుపట్టినవి దృష్టాంతములుగా జేకొనబడలేదు. కాని మొదటి పద్యమునందు దేవతాస్మరణము నుద్దేశించియు పదునొకండవ పద్యము యొక్క 1.3.4 పాదములయందు హిందూ దేశవాసులు సుప్రసిద్ధముగా నెరిగి యున్నట్టి దేవతలు పేర్కొనబడిరి.

"డకినీ" భాషలోనుండి తెలుగులో వాడుకగానుండు పదములును ప్రకృతదేశాధీశులగు నాంగ్లేయుల భాషలోని పదములును అచ్చటనచ్చట సందర్భానుకూలముగా బ్రయోగింపబడినవి. వక్రగతులు ప్రక్రమభంగములును సాధ్యమయినవట్టు లేకుండునట్టు జాగరూకతతో వ్రాయబడినది ఇది జయసంవత్సర శ్రావణశుద్ధ ప్రతివత్తునాడారంభింపబడి శ్రావణ బహుళ పంచమీ జయవాసరమునాటి రెండుజాముల పగలింట ముగింపబడినది. హూణశకము 1894వ సంవత్సరము ఆగస్టు నెలయగుచున్నది. మొదటి వద్యములో బ్రహ్మదేవునకు బెమ్మయని పలుకబడినది. గ్రాంధికమగు తద్భవము బమ్మయయినను బెమ్మయనివాడుట గ్రామ్యములయందు బ్రసిద్ధమయి యున్నఁదునను తద్భవములకు లోకప్రసిద్ది ముఖ్య ప్రమాణమయి తద్విరుద్ధమగు శబ్దజ్ఞసమయము లేదు గావునను సందర్భమునందు శ్రావ్యముగా జూపట్టినందునను అట్లు ప్రయోగింపబడియె. రేఫ,శకట రేఫల వెధర్మ్యము లేదను వారి మతమే చేకొనంబడియె, సందర్భానుకూలముగు క్రొత్తపోలికలు దొరకని పట్టులమాత్రము పూర్వమునుండి ప్రసిద్ధిగావచ్చు పోలికలు వుచ్చుకొనబడియె. ఇవి గ్రంధమందంతటను పదిపండ్రెండుండును.

నుజనులు దోషములనుబోవిడిచి గుణములున్న యెడల వానికి మాత్రము సంతసించి నన్నుంధన్యుఁజేయగోరెద.

ఏలూరు,
21.6.1894

విధేయుడు

దాసు శ్రీరాములు

శ్రీరస్తు

చక్కట్లదండ

యను

లౌకిక నీతిమాలిక

  


సీ౹౹ సిరికిఱొమ్మిచ్చి మచ్చిక సేయు నిచ్చలు| వెన్నుండు దావేల్పు వేలువయిన
మిన్నేటిచెలి నెత్తిమీద బెట్టుకు మోచు |ముక్కంటి జేజేల ముదుకయయిన
పలుకువెలది నోటబట్టి ముచ్చటలాడు| బెమ్ము దాదిరగంటి పెద్దయయిన
కలువకంటులగిద్దె గదలనీ కాడింత్రు| దెసరేండ్లు బాసవాల్దిట్టలయిన

గీ॥ కస్తి రానీక నిల్లాండ్ర గాచువారి| యింట సేమంబు దరుగళ యుంట నిజము
అని పలుకు దాసురాముడి ట్ల చ్చతెనుగు| కబ్బ మందమునిండఁ జక్కట్ల దండ ...1

సీ౹। బంగారుబొమ్మకు రంగు బూయగనేల| పేడబొమ్మకు బూయగూడుగాక
పాసెంబునకు సూరుఁ బద్ద నంజగనేల| చోడంబలిని నంజ గూడుగా క
పెద్దమఱ్ఱికి గాలిబెట్టు బెట్టగనేల | మేడి మ్రోకకు బెట్టగూడుగాక
వెండిగిన్నెకు జింతపండు పుల్కా పేల | వాడ నిత్తడికిడ గూడుగాక.

గీ౹౹ వాసిగలవారి కింకొక్క వాసితోడువల దలంతికి నెపుడుగా వలయుగాక.
అని పలుకు . . . . . 2
   
సీ।౹ కోతి దాఁజెట్టెక్కి కూసినంతనె క్రింది | కొదమసింగము వాసి కొరతవడునె
లంజరాయని మెప్పురా మరుల్కొల్పిన | నిల్లాలి మరియాద చెల్లకున్నె
పుల్లేరు దానెంత పౌరలివచ్చిన బెద్ధ | కొల్లేటి కడుపు దాగొదవయగునే
ప్రాఁచితీగెలు చాల ప్లయిబారి పెరిగిన|మద్ది మానికి లావు కొద్దియగునె

గీ॥ క్రి౦చుమానికి తానెంత గింజుకొన్న మంచివాని పొగడ్తలు మాన్పలేడు
అని పలుకు . . . . . 3
  

 


సీ౹౹ కాన్పుఁగత్తె యెరుంగు గాక యెన్నటికైన |గొడ్డురా లెరుఁగునా బిడ్డకుట్టు
గండుదేటి యెరుంగుగాక యెన్నటికైన |చిరుకప్ప యెరుగునా విరులతావి
కలమానిసి యెరుంగుగాక యెన్నటికైన |పట్టు పుర్వెరుఁగునా బట్టసాంపు
కాపుబిడ్డ యెరుంగుఁగాక యెన్నటికైన పిడుకరుంగునె పాలతొడుకుపాడి

గీ॥ ఎరుక గలవా రెరుంగుడు 'రెద్దియని | యెరుకమాలినవారి కెట్లెరుకపడును
అని పలుకు . . . . . 4.
  
సీ౹౹ తాటిబెల్లము వెన్నతోటి గల్పినమాత్ర| పారుబంతులకు ణ్ణేరమగునె
గులకరాతికిఁ బైడి కుప్పె బెట్టిన మాత్ర | కాసులదండ మేల్పూస యగునె
చెట్టగాడ్దెకు జీను గట్టితీర్చినమాత్ర | రౌతెక్క ననిలో నరబ్బి యగునే
కారుదున్నకు గొల్చుఁ గట్టికట్టినమాత్ర అంబారిగట్ల రాహుత్తి యగునె
   
గీ॥ కొంచెగానికి బొంకము ల్కూర్చినంత| గొప్పవారలతో సరిగొల్పవశమె
అని పలుకు . . . . . 5

సీ౹౹ ఉసిరికాయనుఁ దేనె నూరెఁ బెట్టుదురుగా | కుల్లి పాయనుఁ బెట్టనొల్ల డొకడు
కమ్మనూనెనుఁ గచో రమ్మిడి కాతురు | పేరామిదములోన బెట్లడొకడు
క్రొత్త చీరెల గేదగులు సేర్తురేకాని గోచి ప్రాంతలఁ జేర్చ కోరడోండు
తగుతలాటము స్వారి దండె బెట్టునుగాని | దంపనాగఁటికిడఁదలచఁడొకడు
  
గీ॥ మేటులగు వారికేగాక మేల్మి పొత్తు | కొలది వారికి రాదెంత కొట్టుకున్న
అని పలుకు . . . . . 6

సీ౹౹ ముత్యాలసరిఫణీ ముసలమ్మతలకేల| కలికిమిఠారి వేనలికిగాక
అద్దాలకిటికి తాటాకు గుడ్సెకు నేల | బెడఁగైన రచ్చచావడికిఁగాక
బలుసీమశాలు పుప్పరి నెత్తిపయినేల | మేటి నేర్పరి మేనిమీదఁ గాక
తాటిపట్టెకును ముతాకి జెక్కగనేల | గణితంపుఁ టేకు చెక్కల కెగాక
  
గీ॥ విలువమాలిన వానికి విలువలేల | విలువగల మేటివలఁతుల కలరుఁగాక
అని పలుకు . . . . . 7

సీ౹౹ వడిసెంబు బట్టిన పొదుషా" మీఁగడ । చీదునా చీమిడి జీదుగాక
జవరాలికిని యుబ్బ దవిలేనా పన్నీరు | బుట్టునా చెమ్మట బుట్టుగాక
చెరుకుతోటకుఁ బుప్పి పెరిగెనా కలకండ | రాలునా మలుపిప్పి రాలుగాక.
బూతపిల్లికి ముడ్డిపుచ్చెనా జవ్వాజి | కట్టునా చెడుచీము కట్టుగాక

గీ॥ ఎట్టివానికి నైనను జెట్టదొడమి | చెటబుట్టించుఁగాని మేల్చేయదెన్న
అని పలుకు . . . . . 8

  


సీ౹౹ ఇసుక దాపరికాఁడ యిడక యెల్లెడఁ బ్రాకు| మంచినేలను మల్లె బెంచవలయు
గువ్వ రాళ్ళూర కడ్గులవంటుఁ బొలముల | గనిబాటువడి రవ గాంచవలయు
పిల్లికూనలు తామె యిల్లిల్లు గ్రుమ్మరు | వేమంది పులికూన వెదుకవలయు
కొరమాలి నాళువల్ కొలఁకు లన్ని టనుండు | కళకు ముత్తెపు జిప్ప కడలి దొరకు

గీ॥ కొంచెగా ర్రెల్ల తావుల గొదువపడరు| గొప్పవారుందు రరుదుగాఁ గొన్ని యెడల
అని పలుకు . . . . . 9
              
సీ౹౹ గుడిసెఁ గట్టిన లంజ కొడుకెంత ఙదివిన | తండ్రిపేరునుఁ జెప్ప దడివికొనఁడె
సాహెబు మెడ రెండు జందె పోవులు వైవ సందెముక్కను నయిజా న్తయనడె
పిల్ల కుక్కను దెచ్చి పల్లకీపై బెట్ట| ఆరతిచ్చిన దివ్వె లార్పబోదె
ఊబజవానికి నొక్క యువిదనుముడి బెట్ట|నగరు పెండిలినాడు నగవుగాదె

గీ॥ తగనివానికి నొక దొడ్డతనముగూర్ప | నగడు పడుటయెకాని పోదలతిదనము
అని పలుకు . . . . . 10
              
సీ౹౹ ఆలి లోపలియింట నడచి పెట్టంగానె | కూళగండడు రాచకొమరుడగునె
దుడ్డుగోలను బట్టి దున్న నెక్కంగానె |మాలండు పెతరుల వేలు పగునె
గొల్ల గుడ్డలదోచి కొమ్మపై కూర్చున్న| కాటితెక్కలి తమ్మికంటి యగునే
తగవేదిగండని తలమీద నెక్కినగ| య్యాలి మిన్నేటి కన్నె యగునె
  
గీ॥ చేతనయినట్టి యొకచెట్టచేతజేసి|చవుకమానిసి బలునకు సాటియగునె
అని పలుకు . . . . . 11
              
సీ॥ గొరియమందలగాచు గొల్ల నమ్మిన కుక్క| వతికి గాచుకయుండు వదురు నక్క
యేటనీళ్ళకు నాసయిడు రాచయేనుగు| మురిగిన జలదారి కరుగు బంది
పెనిమిటిమాట చొప్పునబోవునిల్లాలు| తుంటరీండ్రమ గొల్బు తులువ లంజె
రాచకోటలమెప్పు రాగాచు జెగబెట్టి| సందు గొందుల రేయిజరుగు దొంగ

గీ॥ మంచివారల నడవడుల్మంచిచోట| చెడ్డవారల నడవడుల్పెడ్డచోట
అని పలుకు . . . . . 12
   
సీ౹౹ గుర్రంబుడెక్కెను గోసి రెండొనరింప| పుర్రెపై గొమ్ములు పుట్టబోవు
కంద్రమోకను దల కిందుగా బ్రాతిన| కాడమీదను గాయ గాయబోదు
కొండ మ్రుచ్చును దోకగోసి | యింటనె పెంప ఆనువెఱిన మాటలాడబోదు
పటికరాతిని సావబట్టించి తెచ్చిన| నుక్కు పొగరి దెబ్బ కోర్వలేదు.
              
గీ॥ పుట్టుసారయయెట్టిఱ కట్టెనిలచు | పెట్టుసారలు వారల చెట్టకొరకె
అని పలుకు . . . . . 13

  


సీ౹౹ గంజికూటికి నుప్పుగల్లు సంగతంబు| పాలపొంగలికిని బంచదార
తంబాకు సారాయితడువుచే గాటెక్కు | కమ్మ వీడ్య మునకు గప్పురంబు
నిప్పట్టునక మంచినీళ్ళతో నేస్తంబు | బూందిమిఠాయికిం పొం దునేయి
వరిగకూటికి లేత గురుగాకు బొారికూర | వరిబువ్వకును మంచి వరుగు లిగురు

గీ॥ నీటు నీటునుఁ గూడియే మేటి యగును|నీచు నీచునుఁలగూడి యే నిచ్చి బొలయు
అని పలుకు . . . . . 14

సీ౹౹ తేనె గూర్చిన యూగ తిని చచ్చునోలేదో|తెగదావి జుమ్మంచు దేటి తిరుగు
నిట్టబారిన మున్గ నిలుచునో నిల వదో| గుజ్ఞుమామిడి మ్రాను గొమలు సాగు
సాగుచేయని నేల చవుడెక్కి చెడిపోవు | పెడగట్ట దున్నిన మడియపండు
బలిసివీగిన మావు పౌరునో పొరదో| పయిగో వటంగనా పారుగాక
 
గీ॥ పిసినిగొట్టుతనంబును బేరజంబు |సోమరితనంబు మేనివేరా ముదగవు
అని పలుకు . . . . . 15

సీ౹౹ గున్నమామిడి లేజిగురు మేయు గోయెల|గొవ్ప రక్కె న పంచ్లుగొ రకుగాకి
ఏనుంగు తలనెత్తు రేక్రోలు సింగంబు| పీతబొక్కల మూతిబెట్టు నక్క
నును దమ్మితూడులం దిని రాయంచ చేపజెల్లల మట్టుసేయుమను గొంగ
పడగలెత్తిన నాగు బాములదిను నెమ్మి చచ్చిన పసుల కాసపడు బందు

గీ॥ చాలినాతిడు మేటికర్జంబు సేయు పంద నిచ్చలును మెతకపనులు సేయు అని,
అని పలుకు . . . . . 16

సీ౹౹ దూబరదిండి పొత్తున వేయిమాడలు పొదుపరి చేతి డబ్బుసకు లోటు
వదురు బోతాడెడి పదివేలమాటలు చదువరి యొకమాట సాటిగావు
గుడిసె వేటిడిన పెట్టెడుసామ్ము బంగాఠ మిల్లాలి మెడతాళి కీడుగాదు
చండిపోతొక, హరుసాలు చేసినపని. వనివాని యరజాము పనికి లొంగు

గీ॥ చెడుగు దానెంత పొడునైన నడిగియుండు మంచి కొంచెంబెయైవను మించియుండు
అని పలుకు . . . . . 17

సీ౹౹ కన్నపుగత్తి దొంగల యక్కరకెకాక పనికి వచ్చునె మేటి బవరములకు
తాటాకు రేక కాల్దాగుట కె కాక పాటింతురే జారు పాసె మాన
ఇనప మేకులు గొయ్య నెనయించుటకె కాక కదియ గొట్టుదురె బంగార మదుక
పోతువేటలు మారిజాతరల కెకాక జరుగునే తిరునాళ్ల సామి మ్రోల

గీ॥ క్రించు గ్రించులకే కాక మించు మెపుడు మేడి పనులకుఁ గొఱగాడు నూడిదసారి
అని పలుకు . . . . . 18

  


సీ౹౹ ములుదోటకూఱ కొడలుమాడ్చికయికొండ్రు| పెరుగుతోటాకిడి పెంచితిండ్రు
నత్తగుల్లలను సున్నముజేసి యిడుకొండ్రు | ఆణీముత్యముదాల్తుర ఱ్తిదండ
వులిజంపి గోళ్ళు త్రోళులు వాడుకొందురు | ఏనుగు వాదర.... కేర్పరింతు
కాకిరెక్కలుగడ గట్టిబీతార్తురు | చిలుక బంజరమున నిలిపికొండ్రు

గీ॥ చెడుగు మంచుల కొక్కచో విడిదియైన | పనుల బొసగించునెడజేయు పనులు వేరు
అని పలుకు . . . . . 19

సీ౹౹ బంగారుపుల్ల తో బండ్లుదోము నెవండు | వేవపుల్లను దోమి విడుచుగాక
కమ్మనినేతితో గాళ్ళుగడ్గునెవండు| కడవలో నీటితో గడుగుగాక
కురువేరితో జుట్టకుదురుగట్టు నెవండు | వరిగడ్డితో గట్టివాడుగాక
రతనాలతో మూసలతికించునెవ్వాడు | సుద్దగడ్డల జేయ జూచు గాక
                 
గీ॥ కొంచెపాటులనగునట్టి కొరలు విలువ | మంచియన్నట్టి వానిచే మెలపబడవు
అని పలుకు . . . . . 20

సీ౹౹ కాడుగాచుక యుండు తో డేలునకుగాలు | కుంటైన దోమంగ గోరునెవడు
సిగ్గుమాలినగాలి చెడి పెకు గీల్గంటు | వీడిపోయిన ముడ్చువాడెవండు
చెట్ల జుట్టెడు కొండచిలువ నోటనుబెద్ద | యెమ్ముజిక్కిన బోవరెమ్మునెవడు
గచ్చరుప్పలకు బై పెచ్చూడి పోయిన | పేడ బూయగబోవువాడెవండు

గీ॥ కౌరకు మాలినవారల గొడవ యడప | గనికరము మీరగా సమకట్టడొకడు
అని పలుకు . . . . . 21

సీ౹౹ కురియక కురియక కురిసెనా మొయివారి | యెడవానపొల మెల్ల యెద్దుకన్ను
కాయక కాయక కాచెనాతగబూచి | గున్న మామిడికొమ్మ కోటివేలు
ఇవ్వక ఇవ్వక ఇచ్చెనాతెగబారి | నిలువడేసినవాడు నిలువు దోపు
దాటకదాటక దాటినా దరిమీరి | పెరిగిన మున్నీరు ఫీరుఫారు

గీ॥ కాకకాక యెకప్పుడు గలిగినట్టి | కర్ణములు వింతలయి పొడకట్టుచుండు
అని పలుకు . . . . . 22

సీ౹౹ బావనయ్యుఅజుట్టు బట్టియాడ్చినకాపు |వెన్నుమీదను దన్ను వెట్టిమాల
అ త్తగారినిఁ గాఱు లాడి కొట్జిన రాంగ |గొంతు బట్టి పిసుకుఁ గొడుకు నాలు
లొజ్జు నౌకర్లఁ గాల్చుక తిన్న పయివాడు | సరదారు చేకిలో జచ్చువాఁడె
జాలి లేకనుఁ గప్పం జంపఁ జూచిన యెల్క | పడుఁ గాక యొక్కప్డు పొమునోట

  


గీ॥ గడిమిఁ జూచుక సాదుల నడఁచు వారి | గడిమి యెక్కువ గలవారలడఁచు చుంద్రు
అని పలుకు . . . . . 23

సీ॥ గంతఁ దీసిననైన గంగిరెద్దు పొలాన | మెడ ద్రిప్పుడోలు చవ్వడులు నిన్న
విసము బిండినినైన బెను బాము బుస్సని | కాటందునెద్దేని గంటబడిన
ఆట నేర్చినసాని పీటపై గూర్బున్న |నడుగార్పు మద్దెల సడిని విన్న
వేట బాఱిన కుక్క రాట గట్టినగాని | పఱవ జూచునుగాటి పందిగన్న

గీ॥ బాగుగా నొక్క డలవాటు పడిన పనిని | మఱువ డాపనిమానిన తఱులనయిన
అని పలుకు . . . . . 24

సీ॥ ఓరు పింతయులేక యుడుకు పీరయిమండులుచ్చాకు సాదుపల్కులు ములుకులు
పున్నెంబు గానక పొరుగు మిండల కేడ్చు | లమిడికి మగని చల్లాట తీట
బుద్దిలే కాటల బొద్దు బుచ్చెడు కుఱ్ఱ | బడవాకు వఱపడి వ్రాతకోత
చేటుపాటెరుగక చెఱలాడు బోకిరీ |బే హాకు బెద్దల పేళ్ళుతేళ్ళు

గీ॥ దారి మంచిది కాని పింజారులకును| తిన్నదన మబ్బునది కలగన్న వితము
అని పలుకు . . . . . 25

సీ॥ వెఱ్ఱి గొల్లల మ్రోల వీణె బాడిన బంబ| నాదు తోడను సాటి రాదటండ్రు
కాటి రెడ్లకు హోళిగలు బెట్ట జిట్టారి| కలయట్లతో సరిగావటండ్రు
వెట్టిమాలకు సన్నబట్ట గప్పగ నిడ్డ | ముతక కంబడి కంటె మెతకయనును
ఒడ్డె యెడ్డెకు నత్తరుడిక లోనిచ్చిన | చేవమానియ పాటిసేయదనును

గీ॥ కొంచెగా డెప్డు గొప్పను గొలదిసేయు కొలదియగు దాని గొప్పగా దలచు చుండు
అని పలుకు . . . . . 26

సీ॥ తగువులో నాయంబు దప్పకున్నే చాటు | లంచాల కాసించు లత్తుకోరు
పెండ్లాము బలువెతల్ పెట్టుకున్న లంజె| మంచాల కాసించు మంకుబడ వ
కాపు పేదరికంబు గన కీడ్వడే పుట్ట| కుంచాల కాసించు గుండగొయ్యి
గేస్తు లోగిటిమేలు కీళ్ళారయునె తేర | కంచాల కాసించు గాలి గ్రుడ్డు

గీ॥ తగవు పున్నెంబు దలచునే తప్పు పనుల| కెప్పుడును ఱెప్పదప్పని మొప్పెకూళ
అని పలుకు . . . . . 27

సీ॥ తుమ్మెద జేరెనా కమ్మతావులనాను | చీడపురుగు చేరి చెరచు దమ్మి
చిట్టూద మొలచెనా చెలువు దప్పడు నేల | బిట్టల్లి మొంచి పోగొట్టు బైరు

  


చక్కెర గలసెనా మిక్కిలి చవిగొల్పు | చవుడు గలసి చేదు సలుపు నీటి
పచ్చక పము చొఱబారెనా కాకార్చు | గండ్రయినుము సాచ్చి కలచుగన్ను

గీ॥ మంచి పొత్తైన నెందేని మంచిగాంచు| చెడుగు దలవడి కొరగాని చెయ్వు సేయు
అని పలుకు . . . . . 28

సీ॥ చీమ కానుపు ప్రొద్దు జెప్ప నేర్పు నెవండు| చామ కానుపు జెప్ప జాలు గాక
పిణుజుు కాల్బందంబు బెట్ట నేర్బునెపండు | కణుజు కాళ్ళకు బెట్ట గలుగు గాక
నత్తచే గుగ్గిళ్ళు నమలించునెవ్వాడు | గిత్తచే నమలింప నెత్తుగాక
మేడి చెట్టున నుయ్యెలాడించునెవ్వాడు । తాడి చెట్టున నిల్పువాడు గాక

గీ॥ క్రించు వారలకెప్పుడు మించు వారి | చెలిమి గలుగదు మించు వారలకె కాన
అని పలుకు . . . . . 29

సీ॥ అల్లారు ముద్దుగా నాడించు పసిబిడ్డ | మెడమీద గూర్చుండి యొడలు చెఱచు
నేయి ముద్దయు బెట్టి నెయ్య మిచ్చిన పిల్లి | ఉట్ల పై కెగసి పాలొలుక బోయు
పంచదారను మేపి పలుక నేర్చిన చిల్క | ముద్దు బెట్టగలోప మూతి గఱచు
కమ్మని గుగ్గిళ్ళు గంపనిండగ బెట్టి | గట్ల మేపెడి యెద్దు కర్ర గొఱుకు

గీ॥ ఎరుక మాలిన వారల కెంత మేలు | గూరిచిన దాని దెలియంగ లేరుసుమ్ము
అని పలుకు . . . . . 30

సీ॥ వేదురెత్తిన కుక్క వేటకై కొని పోవ | కట్టి పెంచిన వాని కాలు గఱచు
కుళ్ళు గుమ్మడికాయ కూరవండుకతిన | నింటివాని కడుపుమంట బుట్టు
తిట్టు బోతగునాలి దీండ్రంబుగొని పోవ | కట్టుకొన్నాతని బెట్టు జెఱచు
కారు బారని సీతు కవులు దీసిన పంట | కాపు దీరువ దండుగలనె ముంచు

గీ॥ చెడ్డ సాదన గయికోలు చేసినటి | వాని కెప్పుడు బెడదలే వచ్చుచుండు
అని పలుకు . . . . . 31

సీ॥ సరదారులకు లంజె బొరి దార్చు బేషరమ్ | ధగిడీలు తదుదురే తగవుదీర్ప
కల్లు సారా మస్తుగా ద్రావునట్టి పుం | డాకోరు దొరయె బడా కచేరి
తెన్ను గానక గడ్డిదిని పొడి దప్పుజ | టాకోరు సర్కారు నౌకరగునె
చేరు గొండల నొద్ద జేర్చి పొటించు జు| వ్వాకోరు మంచి హోదాకు దగునె

గీ॥ ప్రజల సేమంబు నరసిన పబువులెల్ల| జబ్బువారల గొప్ప దర్జాల నిడరు
అని పలుకు . . . . . 32

  


సీ॥ కొట్టిలేపిన కోడిగూసినమా త్రాన| నద్దమరేయెట్లు పొద్దుపొడుచు
బిడ్డలాటలకు గొబ్బిళ్ళిడ్డమాత్ర వే| సవినెట్లువచ్చును సంకురాత్రి
చీకటింటను దివ్వెజేర్చినంతనె పట్ట| పగలింట నెట్లు జొప్పడును సందె
పెరటిలో చెట్లెల్ల పురుగుచే మోడైన |రహీవానకారాకు రాలుపగునే

గీ॥ ఎద్ధియెప్పుడు గాదగునద్దియప్పు | డొదవు మనమెంత జేసిననొండుకాదు
అని పలుకు . . . . . 33

సీ॥ పెద్దలందరు గూడి పెండ్లి సేయగబూవ |జోగిసన్నా సికిజుట్టె మెరుపు
మున్నీ ట దోరణమ్ములుకట్ట సమకట్ట | వెదురుగుంజలు బ్రాత గుదురె కరవు
మినపగారెలు వండగను బెట్టజిల్లికి కేలులేనమ్మకు వ్రేలెకొదువ
సాతాని రామానుజయ్య జంగముసేయ | బిలువబోవంగొనె పేరెతప్పు

గీ॥ క్రొత్త పని యొక్కటొనరింప గోరెదేని |కొత్తలోక మరికొన్నిటి గూర్పవలయు
అని పలుకు . . . . . 34

సీ॥ ఇచ్చలేనల్లున కెంతయొడ్డించిన | నీలకూరకు నుప్పు చాలదనును
ఈసుబట్టిన య త్తనేలాగు బొగడిన | ఎగతాళి మాటలకేమి యనును
తనివిదీరని గూళతలయెత్తు బోసిన | జుట్టుమిగిలెనేని కొట్టుకొనును
తగవు మాలిన మొప్పె దప్పుపై బెట్టిన| తప్పు జూచినవాని దన్ను మనును

గీ॥ తగినవారికి మేల్చేయ దగును గాని| తగనివారద్దిచేతురు తారుమారు
అని పలుకు . . . . . 35

సీ॥ కలుద్రావిపాలన్న కల్ల దీని బడాయి | కట్ట లేమే యొక్క గడియలోన
పెరిగిన కడుపులో బిల్లయో బల్లయో | తెలియలేమే రెండు నెలలలోన
ఏటి నీళ్ళుగదోచు నెండమావుల జాడ | యగుపడదే నాల్గడుగులలోన
తెరగ్రుడ్డి పెండ్లి కూతురి మేని పొంకంబు | పట్టలేమే తలఁబ్రాలతరిని

గీ॥ మంచికానిది కొన్నాళ్ళు మరగియున్న| తుదకు నొక్కప్డు నిక్కంబు దోచకున్నె
అని పలుకు . . . . . 36

సీ॥ తరితప్పిపెట్టు విత్తనమెంతమంచిదై ! ననుబాగుపడునని నమ్మరాదు
ముదుసలి కట్టుకొన్నది పైడిబొమ్మయై | ననువలపిడునని నమ్మరాదు
పడుచుసన్నా సెంత వడిగల నేర్పరై | ననుబాళిబడడని నమ్మరాదు
కడుపూవ యెంతటి కావుదీరినదియై | ననుదియ్యనగునని నమ్మరాదు

  


గీ॥ ఎప్పుడెయ్యదిచేసిన నెసగునప్డు |తగును గావింపగా దేని తప్పినడుచు
అని పలుకు . . . . . 37

సీ॥ ఈడిగాతని సారె యాడింప బూన్చిన| గల్లు బుడ్లను వాని కడను విడుచు
ఱంకులాడికిని బేఱంటంబు సెప్పిన | గోర చూపుల మగవారి దనుపు
కొంటె బాతాఖాని గొప్ప కొల్వున నుంప | ఏలినవాని సొమ్మింట జేర్చు
గొట్టె కాపరి గొల్ల గొడ్డు కాపరి జేయ | పాలు పిండుచు గాలు పట్టి యెత్తు

గీ॥ ఎద్ది యెవ్వడు పనుపడు నద్దిసేయ | నొద్ది కగునొండు సేయంగ నోర్వడెందు
అని పలుకు . . . . . 38

సీ॥ కన్నముల్వైచు దొంగలకు బక్కాదగా | కోరు పంచాయతీదారు సుమ్ము
తెగిమండి పడు నగ్గి దేవరకును మంట | గాలి దేవర చెలికాడు సుమ్ము
మాల మాదిగ తందనాల జాత్రకు బంబ | దాసరిమేటి సర్దారు సుమ్ము
మగువ నేడ్పించెడి మగనికి గయ్యాళి| గట్టువాయగు తల్లి పట్టు సుమ్ము

గీ॥ కీడు సలి పెడి వారికి గీడు సలుపు |వారలేతోడు మరి లాతివారు కారు
అని పలుకు . . . . . 39

సీ॥ ప్రాతి పెట్టిన సొమ్ము పయికి లాగినగాని| మారదు బంగారు మాడలయిన
కడుపులో దెవులు నేర్పడగ జాటినగాని| కుదరనేందు రాచ కొమరుడయిన
గాదెలో సరకు లంగడిని బెట్టినగాని| మనవారు కొనరెంత మంచివయిన
మొదవు చంటను బాలు ప్రిదికి దీసినగాని| పనిజేయదది యెట్టి పాడిదై న

గీ॥ నలుగు ఱెఱిగిన వానికే చెలువమెందు| జాటుగా నున్న వానికి దీటులేదు
అని పలుకు . . . . . 40

సీ॥ మొఱయు లేనంతనే మెఱుగై న బంగారు|కంచుకంటేను గ్రించు గాదు సుమ్ము
మెదుకు లేనంతనే మేలైన బాపండు| కాపు కంటెసు లోపుగాడు సుమ్ము
కైపు లేనంతనే కడతావిజవ్వాజి |కాచుకంటెను నీచుగాదు సుమ్ము
కడువీగ నంతినే కమ్మని కొతిమెర | గాదకంటెను బీదగాదు సుమ్ము

గీ॥ విలువ వంగడమును బట్టి కలుగుగాని| అందముల చందముల బట్టి పొందబోదు
అని పలుకు . . . . . 41

  


సీ॥ తేలు కుట్టినవాని మేలైన వల్లకి | మీద నెక్కించిన బాదలేదె
సంచి బోయినవాని నంచఱెక్కల పాన్పు | పై బండబెట్టిన బాదలేదే
ముక్కు గత్తిని గోసి ముద్దరాల్బెక్కిళ్ళు |మీద ముద్దిడుచున్న బాదలేదె
వది మడుంగుల బర్వుపై నెత్తి పై మేడ |మీద నెక్కించిన బాదలేదె

గీ॥ కస్తి లేనప్పుడింపగు కుస్తరింపు | కస్తికల తఱి మదికింపుగాదు సుమ్ము
అని పలుకు . . . . . 42

సీ॥ దవకనంపు మొలక నెత్తావి గూర్పనే కాని | తగునే తరిగివండ నిగుఱుగూర
కమ్మనావుల పాలు కాఁచి త్రాగనె కాని | తగునే కడవ దొల్పి తానమాడ
చదువరి మాట ఱచ్చల జెల్లునే కాని | తగునె గామి ఖసాయి తగవు దీర్ప
ఇల్లాలు జాణైన నిలు దీర్పనగుగాని | తగునే ఫిరంగీల జగడమాడ

గీ॥ ఎవరినే యక్కరను గుార్తుకెల్ల వారు | వారి నా యక్కరను గూర్పపలయు సుమ్ము
అని పలుకు . . . . . 43

సీ॥ కుందేటికిని లేడి కొమ్మలు రెండిడ్డ |మోర యోరగ జేసి పౌడువ గలదె
బోసికి దుప్పికొమ్మన బండ్ల మర్పిన |గట్టి సెన్గలు కఱకఱనమలునె
గొడ్డు రాలికి జంక బిడ్డ నొక్కనినిడ్డ |గొన గొన పాల్చేపి కుడుప గలదె
మఱుగుజ్జువానికి మఱ్ఱుగాళ్ళు కట్టిన | నొప్పుగా మడచి కూర్చుండ గలడె

గీ॥ తనకు లేనట్టి యందంబు దాల్చుకొన్న| దాన గలిగెడి కర్జమింతయునులేదు
అని పలుకు . . . . . 44

సీ॥ ఏనుగు నెక్కగానే కాడు బలురేడు | ప్రజల కస్తుల నెడ బాపవలయు
మేరిను జంపగానే గాడు సోమాసి | బావలతనివి దీర్పంగ వలయు
ఎగసిత కైక్కగానే కాడు తీర్పరి | అందఱి నొకటిగా నరయ వలయు
ఈటె చేపట్టగానే కడు పోటరి |పులిమీద మార్కొని పొడువ వలయు

గీ॥ జాణనని పూనినంతనే జాణగాడు| ఏర్పడిన పని నెరవేర్చి నేర్పరియగు
అని పలుకు . . . . . 45

సీ॥ తల్లి పొట్టిదియైన బిల్లదా బొడుగైన | ఆ తల్లి కాపిల్లయమ్మ గాదు
బాపండు బడుగైన గాపంద గాడైన |కాపు బాపని మ్రొక్కు గాంచలేడు
కత్తి చిన్నదియైన గాయ పెద్దదియైన |కాయ కత్తిని బట్టి కోయలేదు
పుత్తడి సేరైన ని త్తడి మణుగైన | పుత్తడిత్తడి గుత్త కెత్త నగునె

గీ॥ తక్కు వొక్క వితాన దానెక్కుడైన| నిక్కమున కెప్డు దక్కువ తక్కువయగు
అని పలుకు . . . . . 46

  


సీ౹౹ సానితో నిచ్చ ముచ్చటలాడు విటగాడు | గుడిసెవేటును కూడు కోడె దూరు
గొడ్డునంజుడునెత్తి కొనిపోయెడి గొడారి | పనికిమాలినదెత్తు పాకిఁదిట్టు
తగునంచు గంజాయిదమ్ముగొట్టు పిసాసి | కల్లు దావేడి దోసకారి చెప్పు
ఏటేటి దెవసాలకేగు బాపడు పాడె| దాల్పు బాపని నెగతాళిసేయు

గీ॥ తప్పుగలవారు తమతప్పులొప్పుచును | తలచి యొగ్గింత్రుదమకంటె దప్పులాండ్ర
అని పలుకు . . . . . 47

సీ౹౹ వానమిక్కిలెయైన వరదంగలారవు|వరపు మిక్కిలియైన కరవుబెడద
పొడవువానికి నె త్తిబొప్పుల పెనుబాద | పొట్టివానికి నీళ్ళపట్టుగొడవ
ఉ ప్పెక్కువగు దోసెపప్పచ్చిఁ దిన గోడు |చప్పిడి దినగవాచవికినిడుమ
బడబడవాగిన వదురుబోతను దూరు |అరుదు బల్కినమూగయ నెడి కొదువ
 
గీ॥ ఎప్పటికినేని మిక్కిలి మెప్పుపొందు| తప్పదందున నొక కీడు దాపరించు
అని పలుకు . . . . . 48

సీ౹౹ తేలఁ బండిన పండు తియ్యగానేయుండు | వగరెక్కదే కోయ బచ్చికాయ
ముఱగ దున్ని నదమ్ము విరుగ బండునుసుమ్ము | కలయగట్టదు చాలగట్టినేల
మెదిగిన బియ్యము మెరుకుగమ్మదనమ్ము | చేబియ్య పోరెమ్ము సేగిసుమ్ము
ముదిరిన చింతమ్రానది చేవయెక్కును | లేతమొలకవ్రాలుఁ జేత ద్రుంప

గీ॥ పనులగడిదేరినట్టి నేర్పరు నెకాక| కొరవడినవారు పూనిరా చెరుపుగల్గు
అని పలుకు . . . . . 49

సీ౹౹ కుక్కనెక్కి సవారుగొట్టచేర్సినకోతి | గుర్రమెక్కిసవారు గొట్టగలదె
ఈళ్ళజిక్క గబట్టి వెళ్ళించునీర్పెన | లేళ్ళమందల నప్పళించగలదె
చేరునుఁగట్టగూర్చిన చిన్న దారంబు | తేరునుఁబట్టి రాదీయగలదె
ఎద్దుమీదనుకట్ట నేర్పరించినగలత | ఏనుగువీవుతట్టై నయగలదె

గీ॥ ఏదియెంతటి కొనగూడు నెప్పుడేని | దానినంతటి కొనగూర్పదగును సుమ్ము
అని పలుకు . . . . . 50

సీ౹౹ ప్రొద్దుటొడవంగానే పోవు జుక్కలదీటు | ప్రొద్దు గుంకిన వెన్క దద్ద మెరయు
బడిపంతులేదుట గుర్ర డు కాల్గదల్పడు | పంతులు చాటైన బంతులాడు
కడలిపోటైన వెన్కకు బట్టి చనునేరు | పాటై నచోజొచ్చి పారుచుండు
ఆత్తగా రున్న నాళ్ళరవనీరదు కోడ | లాదటజూపు గయ్యాళితనము

  


గీ॥ తనకు హెచ్చిన వారలెందాకనుందు | రంతదనుకఁ దనమెప్పులడగియుండు
అని పలుకు . . . . . 51

సీ॥ నెలదప్పినంతనె నిసువు పుట్టగబోదు | నిండదొమ్మిదినెల లుండవలయు
వరినాటినంతనె వడ్లురాలవు పంట | కళ్ళాలదనుకనుఁ గాయవలయు
ప్రోయినిప్పిడగానె బోనంబురాలేదు| వార్చిడించిన దాక నోర్చవలయు
మ్రానుగొట్టంగానే మద్దెలకాలేదు! తొలిచి మూసినదాక నిలువ వలయు

గీ॥ ఎప్పుడెయ్యది కాదగు నప్పుడగును | గాని పూనిన తోడనే కాదు సుమ్ము
అని పలుకు . . . . . 52

సీ॥ క్రొవ్వినజెల్ల నిక్కుచు నీళ్ళమిడిసిన | గట్టుపైఁడుఁ బెద్ద గ్రద్ధనోట
పోతరించినపాము పుట్టెక్కి తలయెత్త | గక్కున గడదేరు గరుడినోట
పొగరుకొన్న పొటేలు తెగిమందబాసిన |వీలు జిక్కు దోడేలుబారి
గుంజబట్టిన నల్లి కోడెక్కి నిలిచిన |గాసిచెందును సొంతగాని చేత

గీ॥ కన్నుగానక నెళవులు గదలిమిట్టి | పడినవారికి నిక్కంబు గొడవ వచ్చు
అని పలుకు . . . . . 53

సీ॥ బోనకత్తెకు దిస్టిబూది బెట్టిననెంత | వచ్చునంతియ రాణి వాసమునకు
కడలికిఁ దియ్యనీర్కట్టి పెట్టిననెంత |వచ్చునంతియ మిన్ను వాక కెన్న
ఆసహెచ్చినవాని కరువదిచ్చిననెఁత |వచ్చునంతియ రాయబారి కెన్న
మరుగుదొడ్డిక నెరమన్ను బూసిననెంత |వచ్చునంతియ పాలగచ్చుగదికి

గీ॥ మొద్దునెప్పుడు తప్పులు దిద్దలేము | తప్పులెరుగనివాని దిద్దంగనేల
అని పలుకు . . . . . 54

సీ॥ వేసాల పేఁడికి మీసాలమర్చిన| మూతిబిగియ బట్టి మొత్తుకొనును
గమిడి బర్రెకు గుడ్డ గంగడోల్కట్టిన |చీదరించుకపట్టిచించి వైచు
కోడితోకకు నొక్క కుంచెగట్టించిన | నెగయనేరక నేల బొగిలిపడును
తుట్టెపుర్వునకొక్క త్రోలుపడగ బెట్ట | దలయెత్త నేరక దన్నుకొనును

గీ॥ ఒకరి వలెనుండవలెనని యొకటిసీయ| నకట నదియెక్క పెనుబాదయగును సుమ్ము
అని పలుకు . . . . . 55

  


సీ॥ వరి వెన్ను విడిచి కొబ్బరికాయ కాసించు | చీలుకేమిదను ముక్కు చెడుటగాక
గాద టోవిడిచి దిగ్గన నగ్గిపై బడు | మిడుతేమి దినుమంట బడుటకాక
బుట్ట గింజలుమాని బోనులో బడు పంది| కొక్కేమిదిను లోన జిక్కుగాక
చిఱి చేపలను మాని యెర పుర్వునకు బోవు | మీనేమీదిను వ్రయ్యలౌను గాక

గీ॥ తినుచునున్నది విడిచి యింకనొక పెద్ద | తిండి కాసించు పోవునతండు చెడును
అని పలుకు . . . . . 56

సీ॥ బోసి కుక్కకు దొడ్డ ముడుసెమ్ము దొరికిన| గొరుకనేరదు పాసి యుఱకలేదు
ముసలాతనికి నొక్క ముద్దరాల్దొరికిన | కూడ నేరడు పొత్తు వీడలేడు
తిమ్మన చేనొక్క తెంకాయ దొరికిన | కొట్టలేదు విడిచి పెట్టలేదు
కచ్చసానికి బాట కచ్బెరి దొరికిన| పాడనులేదు మాటాడలేదు

గీ॥ తినఁ గలిగిఁనట్టి వారికి దియ్యగూర | లేనివారికి విడువంగలేని యేడ్పు
అని పలుకు . . . . . 57

సీ।। తన యింటి దివ్వె చేతను బట్ట గాలదే ! తనయాలు పడచిన దప్పుగాదె
తాను దీర్పరియైన దగవేద పచ్చునే |తాను ద్రావిన కల్లు పానకంబె
తన కోడి వెన్క దీసిన గెల్పు గల్గునే | తనమేని కంపు నెత్తావి యగునే
తన వెండ్రుకలు గట్ట దంబుర మ్రోగునే | తా బెట్టుకొను పట్టు తప్పనగునే

గీ॥ ఎన్నటికినైన పెరల యందేది యెగ్గు తనకు దానిన యెగ్గుగా దలపపలయు
అని పలుకు . . . . . 58

సీ॥ పొరుగువారికి మేలు పొందరాదంటివా| ఇరుగు వారికి నీవ పొరుగువాడు
ఇరుగు వారికి మేలు హెచ్చరాదంటివా |పారుగువారికి నీవ యిరుగువాడు
ఇరుగు బొరుగును మేలెనయరాదంటివా | యిరుగు బొగ్గునకీవ యిరుగుబొరుగు
ఇరుగు బోరుగు నీవు నెనయ రాదంటివా | ఇంక నెవ్వరికి మేలెనయవచ్చు

గీ॥ ఎల్లరకు మేలుగోరుట చెల్లు గాని | తనకు మేల్పెరలకు గీడు దలపరాదు
అని పలుకు . . . . . 59

సీ॥ తాతి గట్టిన నూయి తప్పదెన్నటికని| యుప్పు నీళ్ళను ద్రావు మొప్పెగలడె
పెద్దలందరు గూడి పెండ్లి చేసి రటంచు | జెడిపె బెండ్లామును జెందగలడె
కట్టుబోతులు వాడ గలరు పెక్కండ్రని | పలికి బెండిలిసేయువాడు గలడె
బావల దీవనల్ బమ్మ దీవనలని | తన యాలి నెరవిచ్చు చెనటి గలడె

గీ॥ కాన రానట్టి యొక బల్మికలదటంచు | కనులకును దోచు గీడెడుర్కొనగలండె
అని పలుకు . . . . . 60

  


సీ౹౹ ఎలుకలల్లరిచేసి చెలఱేగినంతనే| పెణకచూరున నిప్పు బెట్టునెవడు
పంట కాలువ లోతుబారే దాటుట కంచు | కట్టల్కతో నెండగట్టు నెవడు
జలుబు చేసిన జీద జాలనటంచును | ముక్కు గోసికొనెడి మొప్పెయెవడు
పసి పాపలకు జంటి పాలు చాలవటంచు | మేలైన యాలిబోద్రోలు నెపడు

గీ॥ కొద్ది జబ్బొండు గలదని గొప్పదాని |మొదలు చెడ గొట్టుకొనువాడు మొదలెచెడున
అని పలుకు . . . . . 61

సీ౹౹ పాలు మంచివి యెన బాసెంబు మంచిది | గాలి మంచిదియైన గాఱునుంచి
పోగు మంచిదియైన బుట్టంబు మంచిది | పొదుగు మంచిదియైన మొదవుమంచి
బసిడి మంచిదియైన బట్టెడ మంచిది |నీరు మంచిదియైన నేరు మంచి
మాట మంచిదియైన మరియాద మంచిది | యీటె మంచిదియైన బోటు మంచి

గీ॥ మంచిగోరిని వాడెప్డు మంచిదై న | పని యొనర్పక యూఱ కేర్పడదు మంచి
అని పలుకు . . . . . 62

సీ౹౹ తన కొంప దక్క నందరి కొంప లురలంగ| చెడుగు మానిసికోరు జిల్లి పిడుగు
తన పైరు తడిసి యందరి పైరు లెండంగ | చెనటి వా డాసించు జెదురు మబ్బు
తన యింటనుండి యందరి యింట లేకుండ | తుంటరి తలపెట్లు గుంటి లచ్చి.
తనమేలె చూచి యందరి మేల్కనక యుండ | కొంటె యూరయు మెల్ల కంటి వేల్పు

గీ॥ ఎల్లరకు మేలుగోరుట చెల్లుగాని | తనకే కాపలెననుకొన్న దరమె పడయ
అని పలుకు . . . . . 63

సీ౹౹ కప్పగంబము చేరి కౌగలించిన గూట | ములు లేనిదే బిడ్డ కలుగబోదు
గాము గంగక మీదు గట్టినంతనే తిండి | తినకున్న నాకలి తీరబోదు
పడమటి దెసనుండి బల్లి పల్కంగానె | దొర జూడనిదె కొల్వు దొరకబోదు
చందురుండును బ్రోద్దు చాలి యుండంగానె |పడుచునాడక పెండ్లి నడవబోదు

గీ॥ సామిగొల్చిన సగినము ల్చక్కనైన |తనదు పూనిక లేనిదే పనులు గావు
అని పలుకు . . . . . 64

సీ౹౹ పాలు పిండెడి గొల్లవాని జూడంగానె | పంచడిల్లదె మంచి పాడి మొదవు
కాసు విడుచు నీటుకాని జూడంగానె | కన్నులార్పదె వెలవన్నె కత్తె
మేసి వచ్చిన తల్లి మేక జూడంగానె| చిట్టాడికూయవే చిరుత బొదులు
మదికి నిలవగు చందమామ జూడంగానె | పొంగాఱదే మిన్ను ముట్టి కడలి

గీ॥ తనకు మేల్చేయు వారం గనిన నొక్క డుబ్బి చెలరేగనట్లుగా కున్నలేదు
అని పలుకు . . . . . 65

  


సీ॥ మొలక పాటున నడ్డిమలచి కట్టినగాని | తడబొంగు పల్లకి దండె గాదు
లేత పాటున జివ్వి పాత్ర గట్టినగాని | మండ చక్కని యంటు మావి కాదు
దూడ పాటున ద్రిప్పియాడ నేర్పినగాని | ఎద్దు పన్నిన గంగిరెద్దు కాదు
నారు పాటున దీసి నాటి పెంచిన గాని | దుక్కి మూసిన వరి దుబ్బుగాదు

గీ॥ పాటుపడి నేర్వవలె జిన్ననాటనుండి | కాని యెడ నెందునను జాణగాడు సుమ్మి
అని పలుకు . . . . . 66

సీ॥ కాళ్ళు బోయినవాడు కాళ్ళకై తిరుపతి |గట్టెక్కబోయిన గదలుటెట్లు
కనులు బోయిన వాడు కనులకై తాగండ | జోతి జూడగ బోవ జూచుటెటు
చెవులు బోయినవాడు చెవులకై సుద్దులు | వినగబోయిన జేరి వినుట యెట్లు
మాట బోయినవాడు మాటకై మంతరాల్ | చదువబోయిన బట్టి చదువటెట్లు

గీ॥ కానరానట్టి మేలొండు కలదటంచు | కాని పనిసేయగా సమకట్టదగదు
అని పలుకు . . . . . 67

సీ॥ పట్టజాలము నీళ్ళుపాలలో గలసిన | తెలియమే పెరుగులో గలసినపుడు
ఈనెలేము కపురంబు గాలితో గలసిన | నెరుగమే దివ్వెతో బెరసినపుడు
పొడ కట్టలేము పుప్పొడి నేల గలసిన | కానమే పూవుతో గలసినపుడు
ఎరుగలేము కనాడు దరబారు గలసిన | చీలదే పూరితో జేరినపుడు

గీ॥ ఒక్కడొక్కని గలసిన జక్కసదుకు | నతడె వేరొండు గెలసిన నదుకడేపుడు
అని పలుకు . . . . . 68

సీ॥ పొట్ల కాయకు రాయి గట్టుట తిన్నగా | బెరుగుటకే కాని విరుగ గాదు
పసిడి రేకులకుప్పుము సరి కాల్చుటవన్నె | పెరుగుటకే కాని తరుగ గాదు
చదివెడి వానికి జబుకు దెబ్బలు బుద్ధి| వచ్చుటకేకాని నొచ్చగాదు
జక్క పిల్లకు గాళ్ళు నొక్కుట జక్కగా| జరుగుటకే కాని విరుగ గాదు

గీ॥ తొలుత నొక్కింత బాదగా దోచియున్న | మంచి కై చేయు పనిని మన్నించ వలయు
అని పలుకు . . . . . 69

సీ॥ జొన్నకూటిని దిన్నయన్న కంటెను లావె |సన్న బియ్యము దిన్నయన్న బలిమి
దస్తు మస్తుగు జమీదారాస కెక్కుడే |నాటి బువ్వడగు సన్నాసియాస
నడుము గట్టిన బోయి నడకకు మిక్కిలే | యందలంబెక్కిన యతని పరుగు
పుట్టు వడుగు సేయునట్టి పాటున కంటె | పలువు రాండ్రగు గేస్తు సలుపుపాటు

గీ॥ మంచి చెడ్డల కానవాళ్లెంచి చూడ| కలిమి పేదరికంబులు గావు సుమ్ము
అని పలుకు . . . . . 70

  


సీ॥ చేదస్తమున నేళ్ళు చెల్లిన బాపండు| పెద్ద చెర్వున జల్లు బేడనీళ్ళు
కలవాడనని కన్ను గానని మతకరి | నెదురైన బావని జదియగొట్టు
కడుపు గట్టుక మూట గట్టు పిసినిగొట్టు | గవ్వబోయిన పూట బువ్వమాను
మరులెక్కి యొడలు తిమ్మిరిగొన్న తుంటరి| వరుసవావుల బెద్దవాక గలుపు

గీ॥ మంచి చెడ్డల నరయక మదికి దోచి |నట్టి యొకపట్టు బట్టుట చెట్ట సుమ్ము
అని పలుకు . . . . . 71

సీ॥ నారు బోసినవాడు నీరు దా జల్ల డే| బల్లె దెచ్చినవాడు పలుపు వేడె
చెలము ద్రవ్వినవాడు చేము ద్రాడుంచడే | యెడ్లను గొన్నవాడేరు కొనడె
గుడిసె గట్టినవాడు తడక దాగట్టడే | పిల్ల బెంచినవాడు పెట్టెగొనడె
ఊరు గాయిడెడివాడుప్పు దాబడయడె | జిగిజక్కి కొనువాడు జీనుగొనడె

గీ॥ గొప్పంగు నట్టివాని గై కోలు సేసి కొదువ సేయునె వలసిన కొంచెములను
అని పలుకు . . . . . 72

సీ॥ గచ్చాకు పుచ్చాకు కలిపి నూరినయుండ | మంచి మందై తెగుల్మాన్ప జాలు
చెడు చెట్టు వడు చెట్టుచేరి క్రమ్మిన పట్టు | అడవి మైకలప లేవడుల దీర్చు
చిరుగవ్వ మరుగవ్వ చేర్చి పెట్టిన | ప్రోగు కూరాకు లేనట్టి కొఱత దీర్చు
తడచువ్వ మడచువ్వ తడకగా గట్టిన | గుక్క గుడిసే దూరు కొదువ దీర్చు

గీ॥ పలు దినుసులందు నది కొంచెపాటిదైన| నక్కఱకురాని దొక్కటియైనలేదు
అని పలుకు . . . . . 73

సీ॥ నెఱసిన ముసలమ్మ నెఱులు జవ్వనమున | దుమ్మెద టెక్కల తోటిసాటి
ఉడికి ముద్దైన గుమ్మడిపండు మున్నుపా | దుననున్నపుడు కుండతోటి సాటి
చిలికి గుల్లై వంటచెఱకు జేసిన చేవ | తొలుత మాకుననుక్కు తోటిసాటి
పగిలి పెంకై నేలబడిన చిళ్ళప నంటి పాటున జట్రాతి తోటి సాటి

గీ॥ కలిమి బలుములు సతములు కావుసుమ్ము | కాఱుమారిన కొలదిని మాఱుచుండు
అని పలుకు . . . . . 74

సీ॥ పెద్దకెంపొక్కటి పెంటలో దొరికిన | విలువ తగ్గదు దానివెలుగు పోదు
కమ్మ గుమ్మడిపండు కంచెలో కాసిన | చక్కదనముబోదు చవియుబోదు
మల్లె పూవులు మాలపల్లె లో పూసిన | ఠీవితగ్గదు కమ్మతావిబోదు
గొప్ప నెమలి గుడ్డు కోడి దా పొదిగిన | చిన్నె మాఱదు కుంచె వన్నె పోదు

గీ॥ వాసిగల వంగసము గలవాని కెపుడు | చోటు మాఱిన మాఱునే సొంపు బెంపు
అని పలుకు . . . . . 75

  


సీ॥ అచ్చి అచ్చలకెక్కునని బుచ్చి పెండ్లాడ | బుచ్చి మిండలవెంట బోవమరుగు
తోటాకు పసరంచు దోసకాయను తిన్న | దోసకాయది జల్బుచేసి విడుచు
కోడూరు బురదని మేడూరు బోయిన |మేడూరిలో జాస్తి మెట్టశిస్తు
జక్కిదాణాకోడ స్వారెక్క పూనిన | బోయి బత్తెములకే పోవుగడన

గీ॥ కొంచెమిబ్బంది కలదని క్రొత్తబూని | ప్రాత విడిచిననది దాని తాతయగును
అని పలుకు . . . . . 76

సీ॥ మాఱ్చజాలక నేల మంటిలో బ్రాతిన| రూక కంటెను బుచ్చుపోక హెచ్చు
కట్టజాలక మూలబెట్టెలో దాచిన | చీరకంటెను గోగు నారబాగు
అన్నెంబు పున్నెంబు సరయజాలక పెంచు | మేను కంటెను ద్రోలు జీను మేలు
మోహరించిన జోదుమూక జూచిన బారు| రౌతు కంటెను దున్న పోతు మిన్న

గీ॥ కలిగి యున్నది నలుగురు గాంచి మెచ్చ|నక్కఱకురాని దున్న లేనట్టే సుమ్ము
అని పలుకు . . . . . 77

సీ॥ కఱచిన వేపి కాల్గఱను వాడుండునే |కాక ఱాకును డబ్బు గట్టుగాక
దోచిన దొంగ యిల్దోచు వాడుండునే | అచ్చలో ఫిర్యాదు దెచ్చుగాక
కుట్టిన తేల్కొండి కుట్టు వాడుండునే | గచ్చగందము రాచి కాచుగాక
పట్టిన దెయ్యంబు బట్టు వాడుండునే|గాలి బూదిడియాన గట్టుగాక

గీ॥ చెడుగు చేసినపని జేయ జెరుపుబోదు| చేయవలసిన పని జేయ జెందుమేలు
అని పలుకు . . . . . 78

సీ॥ కొమ్ముకోతిని నెరుంగుదునన్నవాడు రెం| డన్న నేమవి పదాఱన్న నేమి
తనతల్లి గొడ్డురాలని వాడది పెద్ద |దన్ననే మైదేండ్ల దన్న నేమి
పనస పూచేనని చెప్పినవాడు వేరున | నన్ననే మాకుల నన్న నేమి
యినుము బంగరు జేతుననిన వాడఱగాంచి | యన్న నేమది కాచ కన్న నేమి
అని పలుకు . . . . . 79

గీ॥ దబ్బరల బన్నుగడ సేయు ధగిడి కొడుకు | దొక్కదబ్బర చాలదే తక్కు విడువ

సీ॥ ఏగాని సొఱ బుఱ్ఱ కాగానె రచ్చల | గాణ బాడగవీణె కాయగాదె
అడవిలో బెరిగినదై నంతనే మద్ది | కొయ్య రాగద్దియ కోళ్ళుగాదె
యడుసులో బెరిగిన యంతనే నెత్తమ్మి | దేవేరికెంగేల దివియరాదె
పులిమేయు మెకముతోకలనున్న సివిరి | రాయల వింజామరమ్ముగాదే

గీ॥ మొదల దానెంత కొలదియై యొదవి యున్న | నక్కరకువచ్చుపనిబట్టి యెక్కుడగును
అని పలుకు . . . . . 80

  


సీ॥ తోడుపాటున కెద్దు దున్ను కోనిచ్చిన| మొగము మాడుపుకాపు ముట్టె జూచు
పున్నెంబునకు గాపు పుట్టెడాళ్ళిచ్చిన | ఆసదీరని బాపడడ్డ జూచు
కనికరానకు నత్త గారెబూరెలు బెట్ట | కొంటె కోడలు పుట్టినింటి కంపు
పరువుకై కోడలువడి యూడిగము సేయ | గట్టువాయత్త కాళ్లడుగు మనను

గీ॥ తనివిగల వారికిని జేయుపనులు సెల్లు | తనివి లేనట్టివారికి దగదుసేయ
అని పలుకు . . . . . 81

సీ॥ రాని కన్నడబాస పూని మాటాడబో | భేకు జెప్పగబోయి సాకఁ జెప్పు
తెలియని వాని మద్దెలగ్గొట్ట బెట్టిన | నంటు బోనము కుడినదికి మొత్తు
అలవాటులేని సాములు సేయజని గత్తి |మొనచేత జట్టుక మొదల బొడుచు
ఎరుగనివాడు తానేరు బన్నగబోయి | దుంపకాడిని పై చితుదను దున్ను

గీ॥ అబ్బెసములేని పనులు సేయంగ రాదు | చేసెనేనియు దప్పులు సేయకున్నె
అని పలుకు . . . . . 82

సీ॥ పనస వంకరయైన దొనలు పుల్లనగావు | చెరుకు వంకరయైన జేదుగాదు
యేళ్ళు వంకరయైన నీళ్ళు కారెక్కవు | మెరుపు వంకరయైన మెరుగు బోదు
మడి వంకరైన జూములు పొల్లుగా బోవు | పూవు వంకరయైన దానిబోదు
కుడుము వంకరయైన గడుపులో నొచ్చదు | వెండి వంకరయైన విలువ చెడదు

గీ॥ వంకరలకేమి గొనమె కావలయుగాక | యెంచి చూచిన వంకర యెందులేదు
అని పలుకు . . . . . 83

సీ॥ కాపులందరు గూడి గంగజాతర జేయ | దొలగునే సివమాడు తొత్తుకొలువు
వదుగు రూరనులంచ పంచాలు బెట్టంగ | తప్పునేచాటు చందాల పోటు
సాటివారలు వెట్టిచాకిరీ కొడబడ్డ | దీరునే వినక సర్కారుహుకుము
వాడలో వారెల్ల, వలస బోయిననెట్టు | లెత్తిపోవున బుట్ట నెత్తి బెట్ట

గీ॥ నలుగురేగిన దారినే నడువు మంద్రు | మంచిదో కాదౌయది యేరు నెంచలేరు
అని పలుకు . . . . . 84

సీ॥ కల్లందరికి నొక్కకంపె కొట్టునుగాని |కంపు త్రావెడివాని కింపుసుమ్ము
వల్లమందెన్న సందరికి జేదేకాని | మంచు మ్రింగెడివాడు మానలేదు
గంజాయి యేరికి గై పొక్కటియె కాని | కయిపు గొట్టెడువాని గలచలేదు.
చెడిపి పొందేరికీ జెరుపు తెచ్చును గాని | చెడిపె నుంచినవాడు విడువలేడు

గీ॥ చెడ్డచెడ్డయె మంచిమంచియె దలంప | వానియందిచ్చ యలవాటువలన బెరుగు
అని పలుకు . . . . . 85

  


సీ॥ నల్లి కోసరము మంచంబు దెబ్బలపడు| కురుపుకోసము త్రోలుగోయబడును
పగవానికయికోట బగుల గొట్టగబడు | బలుమీలకయి చెర్వు కలచబడును
పొడపామును బెద్దపొదలు గొట్టంబడు | కడ్డిజీరకు బై డి కరుగబడును
చెదలపుట్టకు గోడ జదియగొట్టగబడు | మురికికై బుట్టంబు మొత్తబడును

గీ॥ చెడుగుతోబొత్తు తప్పక చెరుపెతెచ్బు | మంచితనమునదామెంతమించియున్న
అని పలుకు . . . . . 86

సీ॥ చినుకుగారనిమబ్బు చెరగులన్నియుగ్రమ్మ|పూతబూయనిమావి పొలము నిండు
దారబిండనిబర్రె తవుడు తట్టెడు మేయు|కొండ్రదున్నని దున్న కొమ్ముపొడుగు
వలపులేని వెలంది నగలు వడ్డికి బారు | ఏలలేనిమగని బాళి మెండు
తెగులుదాకిన లంజె మొగముమిసిమి హెచ్చు | కొలము తక్కువరాయితళుకులెస్స

గీ॥ చెట్టవారికిగల యట్టి మిట్టిపాటు | మంచివారికి గానరాదెంచిచూడ
అని పలుకు . . . . . 87

సీ॥ స్వారెక్కు సన్నాసి సానినుంచిన నేమి | తొడగు అంగీలను దొడిగె నేమి
జందెమూడ్చిన గేస్తు సార దాగిననేమి | తెల్లుల్లి నీరుల్లి దీన్న నేమి
చెడినబమ్మాసారి సీగను బెంచిననేమి | మొల్లలు మల్లెలు ముడిచెనేమి
తనివిలేని తపసి దారిగొట్టిననేమి | పులుల నెలుంగుల బొడిచేనేమి

గీ॥ చెడ్డపని యొక్క టేచాలు జెరుపునకును ! గడమ పనులెల్ల దానికెక్కుడులుగావు
అని పలుకు . . . . . 88

సీ॥ కొంచెగానికి లచ్బి కూడివచ్చినదేని | గొడుగుదే తెమ్మను నడిమిరేయి
కొంటె ముక్కళి గొప్ప కొణవులోబెట్టిన| అందలంబున మేను గందుననును
పనికిమాలిన కూళ బడి పెద్దజేసిన | బసివాండ్రదనకాళ్ళ బిసుకుమనును
చెలువెరుంగని మోట సింగారమబ్బిన నరకాళ్ళజమురు నత్తరువునగరు

గీ॥ అలతికిని గొప్పతన మొక్కటబ్బెనేని | ఆదరి పాటక్కరకుమాలినంతజూపు
అని పలుకు . . . . . 89

సీ॥ గుడిబట్టి దిగమ్రింగు గొప్పదెయ్యానకు |గుడితలు పెన్ననప్పడముగా దె
కడలిదోయిట బట్టు గండ్ర దేవరకెల్ల |చెరువులు నెగయ తుంపురులుగావే
పెద్దకొండలబట్టి పెకలించు దిట్టకు | చరియలందరి రాలు మొరముగాదే
గొప్పయోడలను లోగొని కొట్టుమీలకు |చలపతెప్పలు జంతికలునుగావె

గీ॥ అలవికానట్టివని సేయువలతులకును | కొలదిపని యొకపని యని తలరాదున
అని పలుకు . . . . . 90

  


సీ॥ మోట నాల్గింగిలీష్ ముక్కలు నేర్పి ఫూల్ | గూస్ నాన్సెన్సయూగో వెయను ను
అలతి యైదారూళ్ళు కమలు దారీచేసి | ఖబరుదార్ బాత్ న కొకాన పడకడను
మొద్దొక పల్లెకు మున్సఫీ సేయుచు | గాడ్డెకొడుక పన్ను కట్టుమనును
చండి యొక్క ముఠాకు సముతుదారాయెనా | కొంటెబడవరయితుగొట్టుమనును

గీ॥ చదువు చదివిన హోదాలు చక్కబడిన| నోటిపట్టము గలవారికేటిపాటి
అని పలుకు . . . . . 91

సీ॥ ముషిణికాయనుగాకి ముట్టకుండగగుడ్డ |కట్టకట్టిననేమి కలుగునందు
పిల్లకాకిని గూటబెట్టియోరెము బెట్టి | యక్కక్కయననేమి యబ్బునందు
పొట్టేలునకు-వాగె బెట్టిగట్టిగ బట్టి | కడను నేర్పిననేమి యొదవునందు
పడుపుబానిస తొత్తు మెడను బంగరు తాలి | బొట్టు బెట్టిన నేమి పొసగునందు

గీ॥ తగనివారల నొక మంచి దారిబెట్ట |గలుగు కర్జంబోకింతైన గానరాదు
అని పలుకు . . . . . 92

సీ॥ వ్రాతకరణ మెప్డు వ్రాయుచుగూర్చుండ | మేతకర్ణముదిన రైతు సొమ్ము
మంతరాల్పెప్పుచు మల్లుబొట్లుండగ | నేగాని దిగమ్రింగు నెల్లుబొట్లు
కూచమ్మకుండలో గూర్పిబెట్టుచునుండ |మాచమ్మతాజేరి మాయజేయు
కంపునోరగుమామ గడియించుచుండగా| మంచినోరల్లుడు మట్టపరచు

గీ॥ పాటుపడువారలోక్కరప్పాటువలన | కడుపునిండించుకోన చుండ్రు కడమవారు
అని పలుకు . . . . . 93

సీ॥ తాడి క్రిందను బాలు ద్రావినప్పటికేని ! కల్లు, ద్రావినవానిగా దలంత్రు
వలికి లోసున్నంపు బట్టి బెట్టిననేమి | పీనుంగు కాడుగా బేరుకొండ్రు
మరుగుదొడ్డికి జాటుమాటాడబోయిన |రెండు వ్రేళ్ళకు నయియుండు నండ్రు
సానియింటికి సందెజాము పోచిళ్ళకు| బోయిన దగులాట మాయెనండ్రు

గీ॥ కానిచోట సలుపు మంచి కర్జమేని | కాని పనిగా దలంపక మానరెందు
అని పలుకు . . . . . 94

సీ॥ అలిగెజాండరు చాల బలిమి వాడంటిమా | గుజిని మామూదెంత గొప్పవాడు
గుజిని మామూ దెంత గొప్ప వాడంటిమా| ఔరంగజీబెంత పేరివాడు
ఔరంగజేబెంత పేరివాడంటిమా | ఫ్రాంసు బుస్సీ యెంతపని యొనర్బె
ఫ్రాంసుబుస్సీ యెంతపనివాడంటిమా | యింగిరీజలను క్లయివెంతవాడు

గీ॥ కలిమిగలవారు పెక్కండ్రుకలరుపుడమి |నొకరనిన వారికంటె మరొకరుగలరు
అని పలుకు . . . . . 95

  


సీ॥ తెలియునే యీనేల తిరుగునం చై రోపి |యనుల గొబర్నికనునకుమున్ను
ఒకదానినొకటి యీడ్చుకొనుపోడిమియున్న| దనిచదివిరెన్యూటనునకుమున్ను
ఎరుగుదురే తపాల్ మెరుగు వేగిరమున| నడచునంచునుహూళునకునుమున్ను
కనుగొనిరే తెడ్డుగాలి లేకనెయోడ | చనునంచు జేమ్సువాటునకు మున్ను

గీ॥ తెలిసినది తక్కలేదని తలంచం | క్రొత్తలింకను దెలియగా గోరవలయు
అని పలుకు . . . . . 96

సీ॥ నిండియున్న పనంటి నిలిచితాలిమియుండ| వెలితికుండ తొళుక్కు తొళుకు మనదె
అన్ని బెట్టినవి స్తరణగి మణగి యుండ | నేమిబెట్టనివిస్తరె గిరిపడును
తెలివి నిండినవారుథీష్టులై యొప్పంగ | మిడిమిడ చదువరుల్సుడి యెధీస్ట్లు
గవర్నర్ జనరలు కరుచిచ్చి పనిగొన్న | విల్లే జి మునసపు వెట్టిగొనును

గీ॥ ఎక్కుడగు గొంచెగాండ్రకే యెగిరిపాటు|అణగియుందురు నెరజాణలై నవారు
అని పలుకు . . . . . 97

సీ॥ గెలుపుసాలిది మంచిగెలుపు నిచ్చుచునుండ| వానకారది యడ్డువచ్చునొక్కొ
మింటినెల కడింది మేలె సేయుచునుండ| వన్నె తగ్గెడనాళ్ళ వాసిచేడునె
పడగదాల్చెడి రోజు వట్టిమేల్సేయగా| పుడమిబుట్టిన యొక్కడడచగలడే
జేజేలవేజ్జులు చేరి పోచుచునుండ | చెలగిన తేలేమి సేయగలదు

గీ॥ మొత్తమున మంచిదాదలయెత్తియుండ |చిన్ని దొనగులు పడియేమి సేయగలవు
అని పలుకు . . . . . 98

సీ॥ విక్టోరియారాణి వెలసి యేలుటబట్టి యిండియా పొగడిక యెక్కువాయె
పండ్లతోటలు దొడ్డవంట పైరుల బట్టి| మద్రాసు ప్రెసిడెన్సి మంచిదాయె
తియ్యజక్కెర వంటి తెలుగునుబట్టి గో| దావరి డిస్ట్రిక్టు ఠీవిగాంచె
మేలైన పనితివాచీల నేతను బట్టి |యేలూరు పెద్ద పేరెక్క నాయె

గీ॥ యేదయిన నొక్కవిన్నాణ మెనచుకున్న | నెవ్వ డేనియు నెన్ని కకెక్కలేడు
అని పలుకు . . . . . 99

సీ॥ గెలుపిండియానాడ గెలుపింగిలీష్ మాట | గెలుపు వేలువుబాస గెలుపు తెలుగు
గెలుపు స్టీమరులార గెలుపు రై ల్రోడ్లార | గెలుపు హైస్కూళ్ళార గెలుపుసైన్ప
గెలుపుకాలువలార గెలుపు సోద్దెపుటాన |కట్టలారా టెలిగ్రాపులార
గెలుపుడార్విన్ ధీరి గెలుపు ధియాసఫీ | గెలుపునేషనలు కాంగ్రెప్పనీకు

గీ॥ గెలుపు విక్టోరియారాణి గెలుపు గెలుపు | గెలుపు గెలువనిపలుకుటె గెలుపుమనకు
అని పలుకు . . . . . 100

చక్కట్ల దండ ముగిసెను

చక్కటదండ

ఈ గ్రంధమునందు 98 సీసమువలన కవిగ్రంధ సమాప్తి నొందించిన కాలము తెలియును. 99వ సీసము వలన గ్రామము తెలియును. 88వ సీసము రెండర్థములు కలదిగా నున్నది. మొదటి యర్ధము వలన నీతియు రెండవ యర్ధము వలన గ్రంథసమాప్తి జేసిన కాలమును దెలియును.

కావున నిట్టి రెండర్థములు నందరికి సులభముగా తెలియు కొఱకు ఈ దిగువనా యర్ధములు వివరింప బడినవి.

పదము నీతినిఁ దెలుపు నర్థము కవి గ్రంధసమాప్తిజేసిన
కాలమునుఁ దెలుపునర్ధము
గెలుపుసాలు జయకరమగుసంవత్సరము జయవత్సరము
వానకారు వానలుగురియు కాలము వర్షాకాలము
మింటినెల ఆకాశమునందలి చంద్రుడు నభోమాసము అనగా
శ్రావణ మాసము
వన్నె తగ్గేడినాళ్ళ కళలు క్షీణించు దినముల
యందు
బహుళ పక్షమందు
పడగదాల్పెడిరోజు ధ్వజమెత్తు దినము
మంగళకరదినము
సర్పతిధి అనగా పంచమి
పుడమి బుట్టిన
యొక్కడు
భూమియందు
బుట్టిన యొకానొకడు
భూమియందుబుట్టినకుజుడు
అనగా మంగళవారము
జేజేల వెజ్జులు దేవతావై ద్యులు అశ్వనీనక్షత్రము
చెలఁగినతేలు చెలరేగిన వృశ్చికముు వృశ్చిక రాశి అనగా
ఆనాడు మూడుగంటలకు


@@&&&@@

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.