చంపూరామాయణము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
చంపూరామాయణము
చతుర్థాశ్వాసము
అయోధ్యాకాండము
క. | శ్రీ వెల్లంటి కులాధిప, సౌపస్తిక విప్రభక్తిసంపన్నమనీ | 1 |
చ. | పరదురవాపబాహుబలభాస్వరుఁ డుత్తరకోసలావనీ | 2 |
దశరథుఁడు రామునకుఁ బట్టాభిషేకము చేయఁ దలఁచుట
శా. | అంత న్విశ్వభరస్వయంవహభుజోదంతు న్విదేహాత్మజా | 3 |
క. | చింతించి తనదుకోరికి, మంత్రుల కెఱిఁగించి గురుసమావనయశ్రీ | 4 |
సీ. | ఆచక్రవాళక్షమాచక్రధౌరేయు లాజన్మశుద్ధవృత్తానపాయు | |
గీ. | లైనమాపెద్దలచరిత్ర మతివిచిత్ర, మనుచుఁ గొనియాడుకొనఁ జెల్ల దందుకెల్ల | 5 |
క. | వేదము మీయంగీకృత, వాదము లోకత్రయానివారితనిజమ | 6 |
సీ. | దోషాచరీహారదూరీకృతి ఘటించు నతిరథత్వమునను నాఁపశాక | |
| వైరివీరముఖేందు వైవర్ణ్యరచనానిదానోగ్రసేనకు లోనుగాక | |
గీ. | తేఁటిలేబోఁటిగమికిఁ బూఁదేనెసోన, విందు సవరించువికచారవిందవాటి | 7 |
ఉ. | కాన భవన్మతం బగునొకానొకపల్కు వచింతుఁ బార్థివో | 8 |
మ. | అనుసీతాదయితాభిషేచనకరవ్యాహార మారాజసిం | 9 |
క. | ననజోద్ధతమధునిభవ, క్త్రనటన్మోదాశ్రు వయ్యె రఘుపతి నభిషే | 10 |
మ. | మనువంశాగ్రణి జాగ్రదగ్రసుతసామ్రాజ్యగమప్రాజ్యమ | 11 |
ఉ. | నే మవనప్రసక్తి నవనిన్ భరియింప ని దే మొకో జన | 12 |
ఉ. | ధారణి నావరించి యవదాతయోనిభు లైనమీర లు | 13 |
క. | అనియెడు మంత్రులుఁ దారు, న్జను లపుడు వసిష్ఠుశాసనంబున నభిషే | 14 |
గీ. | రాము వినయాభిరాము సుత్రామసదృశ, ధాము రావించి యోవత్స తావకీన | 15 |
చ. | అని నియమించి పంచినయజాత్మజుయత్నము కోసలేంద్రనం | 16 |
మ. | రఘురామోదయవార్తఁ దోచు జనహర్షశ్రీలకున్ గేహగే | 17 |
కైక రెండు వరము లడుగుట
చ. | హరిహయకంటకాన్వయలయావహవైఖరి కెల్ల యైన క | 18 |
మ. | పటుఝంఝానిలపేషదోష ముదయింపన్ శీతలాంభోధర | 19 |
శా. | ఆశాతోదరి మందరారమణి దయ్యంబో యనం జిత్తమా | 20 |
ఉ. | కైకయి వేఁడుతద్వరయుగంబు నిశాతశరాకృతిం జెవుల్ | 21 |
గీ. | వ్రాలి త్రెప్పిఱి నరపాలమౌళి దా న, సత్యభయశీలి గావున జాలిగొలుపు | 22 |
గీ. | జయమానస్థిరాకీర్తిజాయ మాన, వేమి నీసుతుఁడా రాజ్య మేలు మేలు | 23 |
క. | అపరీతరామ మగుతఱి, విపరీతము గాకపోదు విధికృత మగునీ | 24 |
చ. | అతివ నిరర్గళస్మితవదానన యై కితవాత్మనీన వాం | 25 |
మ. | తనమే మాంసము గోసియిచ్చిన కపోతత్రాణశీలిన్ శిబిన్ | 26 |
మ. | అకటా యాడినమాట చెల్లుబడి సేయంజూడు మారీతిఁ జ | 27 |
ఉ. | నావిని యీవినాదయవు నాదయితామణివా భవాదృశ | 28 |
సీ. | మణిమయప్రాసాదమహి మెలంగుపదంబు లడవుల నడచిన నడచుఁగాక | |
గీ. | కైక యేవీఁకఁ బవళించు లేకలేక | 29 |
గీ. | అనెడు పతిజంకెనఁ గరంగదయ్యె నకట, మందరాక్రాంత మగుకైకమానసంబు | 29 |
మ. | పతి యాదుర్మతికిం బరాఙ్ముఖత దోఁపం గొంతసే పూరకుం | 30 |
కైక రామునకుఁ దనవరములం జెప్పుట
మ. | తనయాసక్తియు సత్యసూక్తియు విరోధంబొందఁ జింతాంబుధిన్ | 31 |
మ. | భరతుం డేమి తలంకునో మహిభరింపన్ రాముఁ డుగ్రాటవిన్ | 32 |
చ. | నను వని గాత్రమాత్రభరణంబునకున్ నియమించి యాచతు | 33 |
గీ. | జనకుఁ డనుజాభిషేచననోత్సవశుభంబు, వీనులకు విందుగాఁ దానె యానతిచ్చి | 34 |
చ. | కులిశనిపాతభీత మగుకొండవిధాన దవానలావళిం | 35 |
క. | అన దండమిడి తదాజ్ఞన్, ననదండగతిన్ శిరంబునం దాల్చి ధరా | 36 |
క. | మనుజేశునగరు వెలువడి, జననిగృహంబునకు నరిగి సవినయనతుఁడై | 37 |
రాముఁ డడవికిఁ బైనమగుట
చ. | ధర జలజాదిచిహ్నములు దావుకొనంగ జగత్రయీశివం | 38 |
వ. | అని యిత్తెఱుంగున నమ్మత్తకాశినీరత్నంబు చిత్తంబు శోకాయత్తంబుగా వర్తిల్ల నత్తఱి సుమిత్రానందనుం డమిత్రానందకుధరబృందసంక్రందనుం డగుదశస్యందనాగ్రనందనుని తాలిమి యనెడు తూలంబున రవుల్కొనిన కోపశిఖి యాటోపంబు సూప నిట్లనియె. | 39 |
చ. | కలితవివేకపాక యగు కైక నయేతరవావదూకయై | 40 |
చ. | ముది మది దప్పియున్న యతీమూర్ఖునకు న్నిజ మేది? నిన్ననే | 41 |
చ. | అడగకమున్న నీకు నిఖిలావని తండ్రి యొసంగి యుండఁ ద్రొ | 42 |
మ. | అరుణత్వంబు వహింప నేమిటికి నీ యంఘ్రుల్ వనాటాట్య మ | 43 |
వ. | అని పలుకు ననుజు నలుకయుం గలంకయుం డోలంగ సాంత్వవాదమాధురీరచితసీధుసాధురీతిలాఘవుం డగుచు రాఘవుం డి ట్లనియె. | 44 |
మ. | జనకాదేశము భానువంశజుల కాచార్యం బగుం దండ్రిపం | |
| జననీహత్యకుఁ బ్రాయ మిచ్చుజరకుం దో రొప్పియున్ సాధువ | 45 |
గీ. | అనియుఁ దమ్ముఁడు వెంటరా జననితోడఁ, గైకయీవాక్యనిశమనగ్లపితనృపతి | 46 |
చ. | జనశుభవాదమోదభరసంగత సీతవసించుమేడకుం | 47 |
క. | ఆననము [2]దగనులివమే, రాన నముచిదమనురమణి కధికవు నీవా | 48 |
గీ. | అనెడు విభువారణోక్తుల వెనుకదీయ, | 49 |
చ. | ధనదంతావళధోరణీమణిగవాద్యం బైన యీవి న్సుయ | 50 |
సీ. | దండకావిపినవాస్తవ్య మౌనివితానసంకటం బెడలించు కంకటంబు | |
గీ. | దెచ్చుట కనుజ్ఞ వడసి యాత్మీయవిత్త, రాశి కోసలజాశ్రితాగ్రజున కొసఁగి | 51 |
మ. | అజరాదు ల్పొడగాంచఁగూడని యసూర్యంపశ్య నారాము దే | 52 |
ఉ. | వెండియు రాఘవుండు పృథివీపరిణీమణియింటికి న్సుమం | 53 |
క. | చింతిలి సుమంత్రుఁ డాజగ, జంతం గైకేయిఁ జూచి సడలందగదే | 54 |
సుమంత్రుఁడు కైకను నిందించుట
చ. | మును పొకనాఁడు ఱేఁడు తనమ్రోలఁ బిపీలిక లాడుముచ్చటల్ | 55 |
క. | అసమంజు వెడలనడిచిన, వసుధేశ్వరుఁ డేజనాపవాదముఁ జెందెన్ | 56 |
క. | సరయూపాతితపౌరో, త్కరుఁ డౌయసమంజురీతి దాశరథి యిఁకన్ | 57 |
చ. | వనికి గురూక్తిఁ దోఁచుపరివారఫుబొంద పయి న్నిరీహుఁడై | 58 |
క. | వల్కలధృతి నజగవహృతి, శుల్కాత్తకళత్రుఁ డతఁడు సుషమవహింపన్ | 59 |
మ. | అనఘుల్ గన్గొననోఁచు రాఘవునియాథాత్మ్యంబు భావించులీ | 60 |
క. | కులగురువారితనిజవ, ల్కలధృతియై యపుడు సీత కౌసల్యపదం | 61 |
చ. | ఖరకిరణాతపోత్కరనఖంపచజాగ్రదరణ్యమార్గసం | |
| దిర వగు నిన్నుఁ జూచి వనదేవత లాత్మనిమేషకల్పనా | 62 |
వ. | అని యనుఝ్ఝితానపాయవాత్సల్య యగుకౌసల్యకు సుశీలచారిత్ర యగుసుమిత్రకుఁ ద్రిలోకీహితాచరణకార్మణవరోత్సేక యగుకైకకు విశకలితమనోరథుం డగుదశరథునకు ననవరతనిష్టాగరిష్టుం డగువసిష్ఠునకుఁ బ్రయాణోచితప్రదక్షిణయుతప్రణామంబు లాచరించి కాంచనమయం బగునిశాంతంబు వెలువడి నివార్యమాణానుసారిదౌవారికవితానుం డగుచు జానకీసౌమిత్రియుక్తంబుగా నమేయగుణసముద్రుం డగు రామభద్రుండు తండ్రియానతి సుమంత్రుండు మున్కొని హజారంబు చాయ కాయితం బొనర్చి తెచ్చిన మరుచ్చటులజవనిరాఘాటఘోటకానుషంగం బగుశతాంగంబు నుత్తుంగరంగసానుశృంగంబు నారోహించు చంచలామణిధనురుదారధారాధరంబు డంబు మెఱయ నెక్కి యొక్కటం గ్రిక్కిఱిసి గుమురుగుము రై వెంబడించు నాగరకసముదయంబు పదరయంబువలన నుదయంబుఁ జెందు పెందూళి మైథిలీజాని [3]లేనియారాజధాని విడుచుపుడమి వడువునం దొడరి సీత యడవికై నడచు నెడ నిది యమంగళం బనుచుఁ దత్ప్రజానయనజాలకీలితానల్పబాష్పపూరంబు దూరంబు గావింప సాంతఃపురంబుగాఁ బురంబును వినిర్గమించి యొక్కించుక తడవునకుఁ దనరథం బతీతలోచనపథం బగుటయు వగం బొగిలి మూర్ఛిల్లి పరిజనానీతశిశిరోపచారగౌరవానీతచేతనుం డై తనూజుండు పురికి మరలి కోసలకుమారికాగారంబు చేరి వర్తింప నిటు నివారింప రానిమానవపరంపరల సందడుల మందమందగమనుం డై చనిచని వికసదరివిందసందోహశోణిమాళీకలో చక్షురాలోక దూరీతకృతావగాహిదేహి మోహసంతమస యగు తమస డాసి వాసరకరుండు తనదువనరాశి జిగమిష ననుకగింపక యపరవనరాశి గదియు పగిది నస్తమించుటయుఁ దత్తటినీతటతరుతటాంచలాస్తీర్ణపర్ణశయనాయతనరీతి నుల్లంబు పల్లవింపంజేయ నెల్లవారు శయనించురాతిరి నిశీధసమయంబున నమాత్యు నాలోకించి వంచితజనప్రపంచవేగసంచారచారు వగు తేరు దోలించి వేగాసాదిత వేదశ్రుతిగోమతినిషందికాహ్వయనదీత్రయాలంకృతియు నిక్ష్వాకునకు మనువితీర్ణియు నగువసుమతిం గడచి జాహ్నవీసముద్వేలకల్లోల మాలికాను | |
| వేలశీతలవిశాలమూలంబుగను నదూరమందాకినీసలిలశీకరాసారతోషితానేకశాఖాశిఖానిరంతరకులాయవిశ్రాంతబహువిధశకుంతవారంబును నభంగశృంగిబేరనగరశృంగారంబును నగుహింగుదీపాదపంబుచాయ నిరవుకొని యున్న సమయంబున. | 63 |
గుహుఁడు రాముం జూడవచ్చుట
మ. | జనిసాహస్రతపఃఫలం బితని సాక్షాత్కార మీస్వామి కై | 64 |
మ. | భటదుర్గోద్భటదుర్గవజ్జనపదప్రాజ్యంబు నారాజ్య మె | 65 |
శా. | [4]నామందాధిపుఁ డాదరింపఁదగు నన్నన్ రాఘవుం డంబకు | 66 |
సీ. | హరులపగ్గము లూడ్చి యంబువు ల్గ్రోలించి సారథి దరితరుచ్ఛాయ నిలుప | |
గీ. | ధనువు చేఁబూని భిల్లుండు దవుల నుండ, లక్ష్మణుఁడు నిద్ర సౌవిదల్లత భజింప | 67 |
క. | మఱునాఁ డరుణోదయమున, భరితజటాభారుఁ డగుచు భాగీరథి ది | 68 |
సీ. | కంజాతవిమతశేఖరజట్టాకోటీరకౌబేరవారిజాకరమరాళి | |
గీ. | ఆహరిద్వారవార్ధిపర్యంతచార, జటిహితనిమిత్తవిధికృతస్ఫటికరథ్య | 69 |
మ. | అని మంత్రిం బురికి న్మరల్చి తరిచే నామింటిమున్నీటి జ | 70 |
సుమంత్రుఁడు శూన్యరథంబుతో నయోధ్యకు వచ్చుట
చ. | చనిచని కాంచె దాశరథి సానుఝరీతటజాతచూతచం | |
ఉ. | కాంచి వసించి దైవతశిఖామణి కోకిలకంఠకాహళీ | 72 |
వ. | అంతట సుమంత్రుండు కాంతారవైరస్యంబున రఘువతంసంబు మరలునో యనుదురాశం జేసి యాశృంగిబేరనగరంబున గుహసకాశంబునం దొన్ని వాసరంబు లుండి వేసరి కతిపయప్రయాణంబులఁ బరీక్షీణోత్సవప్రజాసమేతం బగుసాకేతంబు సొచ్చి దాశరథివిరహిత నిజసమాగమసంజాత శోకాతిరేక నాగరకలోక బహువిధాక్రందమందీభవన్నేమినిస్వనతరంగం బగుశతాంగంబు డిగ్గి నగరు సొచ్చి యచ్చట మహీపతికి నతి యొనర్చినఁ దనవిారఘుపతిసమాగతిం దిరోభూతచేతనుం డగుచు నతండు కోసలసుతాసుమిత్రాసమాశ్వాసితుండై రాఘవుం డేగతిం బదాతి యయ్యె, సీత యేమి యనియె, సౌమిత్రి యెట్లు మెలంగె నని చిప్పిల్లు కన్నీళ్ల నడరు గద్గదిక నడుగ మగుడ నడుగులకు నెరఁగి యిట్లనియె. | 73 |
క. | నీరథమునకుం బౌరమ, నోరథమునకున్ భవత్తనుజు లెడలిరి మీ | 74 |
మ. | కటువై తోఁచుదురుక్తు లేమిటికి వక్కాణింతు వైరించియం | |
| ల్పుటకుం జాలకయున్న కుంతలభరంబు న్నీతనూజుడు చెం | 75 |
చ. | ఘనతతిఁ దోచుకొమ్మెఱుఁగుకైవడిఁ గాఱడవిం జరించు న | 76 |
మ. | వనమార్గంబున రాత్రులుం గిసలయవ్రాతంబుచే రామభ | 77 |
క. | అని సుతులయునికిఁ దన కా, యన దెలుప నృపాలుఁ డప్పు డపరాద్రికిఁ బ్రా | 78 |
క. | మగువా నీకిఁక వగవం, దగవా విను మిందుకు న్విధానము మున్నే | 79 |
చ. | యతిసుతుఁ డొక్కనాఁటినిశి నంబువు ముంచురొద న్మ ధేభమ | 80 |
క. | కలిగితినిల శూద్రావై,శ్యులవలనఁ దపస్వి నగుచు నోనృపపర సం | 81 |
దశరథుని మరణము
క. | వశమా యటుగావున దు,ర్దశమాన్పఁగ రాదు రామరామా యనుచో | 82 |
సీ. | అమరావతీపురం బాఁగుకోఁజూచెనా యేనిశాచరకులాధీశుఁ డైనఁ | |
గీ. | హరి యనఁడు తేరు వెదకఁడు కరినిఁ గోర, డేనిమిత్తంబు వినువీటిపైన మితని | 83 |
ఉ. | అత్తఱి దృగ్ఘనోదయత నశ్రుఝరంబులు గండమండలిన్ | 84 |
ఉ. | సూనృతవాది రా జనెనుసుద్దులు నిమ్మళమాయెఁ గైకసం | 85 |
క. | భరతాగమపర్యంతము, ధరణీపాలకుని మేనుఁ దైలద్రోణిం | 86 |
గీ. | అర్హ మాయెఁ గృతాధ్వరుం డైనయతని, దేహము తిలోత్తమోదితస్నేహమునకు | 87 |
భరతుఁ డయోధ్యకు వచ్చుట
వ. | అంతట ననుక్తపంక్తిరథవిరామవారతానీతభరతు లగుటకు వసిష్ఠుచే ననుజ్ఞాతు లైన దూత లతిపవనజవనయవనహాయసంకోచితసరణులై తురగపతినగరి కరిగి దుస్వప్నదూయమానుం డైన కైకయీసూనునకు గురునిదేశంబు విన్నవింప నాతని మాతామహుండును యుధాజిత్తుండు ననుపం గతిపయదినంబుల నపశకునసంపాతసాతంకచేతస్కుం డగుచు దుర్దినంబుకరణి నస్ఫురద్దివంబై వీరభటజనంబుగతి నసీతాసహాయఖేలనం బై నిదాఘసమయసరసిజాకరంబువైఖరి ననూర్మిళాపాన్వితం బైనసాకేతంబు సొచ్చి, యచ్చొటు యథాపురప్రచారచారుపౌరంబు గామికి విచారంబు దోఁప భూపతియగారంబు దరిసి యరసి యం దెవ్వరిం గానక మగిడి జనని నగరి కరిగి మాత కానతుం డై తండ్రిసేమం బడుగఁ బరుషతరవావదూక యగుకైక యి ట్లనియె. | 88 |
చ. | అడవికిఁ దండ్రిపంపువడి యాలును దమ్ముఁడుఁ దానుఁ జెంచుకై | |
| దడయిడలేమి గైకొనియెఁ దగ్గతి నింకఁ గళంకు లేక నీ | 89 |
క. | కేకయజోక్తి మయూరీ, కేక యహిం గలంచువీఁకఁ గీలితపరితా | 90 |
శా. | కైకా యెంతటి పాతకంబు ఫలమోకా తల్లి వై తీ వికఁన్ | 91 |
క. | మాతృవ్యాజము గాంచిన, పాతకధోరణి వటంచు భరితక్రోధుం | 92 |
గీ. | మనుకులంబుఁ గాల్తు నని కంకణము గట్టు, కొన్నయట్టి చెట్ల కొఱవి యుండ | 93 |
శా. | హల్యన్మోచి కొమాళ్లు దున్నఁగఁ దదీయశ్రాంతి యెంతో మన | 94 |
చ. | తనవిధిచే నరేంద్రుఁ డవితర్కితమంత్రగతి న్వసింప నా | 95 |
గీ. | ఆత్మవృత్తి కర్హ మగుదైత్యకులము లె, న్నేని యుండఁ గేకయేశునింట | 96 |
క. | జననీతి కెడయు మామక, జననీతిగ్మత నయంబు సౌజన్యంబుం | 97 |
చ. | అనుజునితోడఁ గైకనగ రాతఁడు వెల్వడి కోసలేంద్రనం | 98 |
క. | జనకుం డీగతిఁ బితృవన, మునకుం జన భ్రాతృవనసముత్సుకుఁ డగు న | 99 |
వ. | వచ్చి యంత యథావిధిసమాహితౌర్ధ్వదైహికచతుర్దశదినుం డగుచు నాఘనుం డున్నయెడ జలజహిత కులహితాచరణ జాగరూకం బగుపౌరలోకంబు సప్రధానానీకంబై మకుటభరణార్థంబు తన్నుం బ్రార్థింప నప్పార్థివతనూజుం డిట్లనియె. | 100 |
శా. | చాలింపుం డిది యేటిమాట యకటా సౌమిత్రి చారిత్రమే | 101 |
చ. | అని వనయాత్రఁ దెల్పె నతఁ డంతిపురంబున కేగి యచ్చటన్ | 102 |
వ. | ఇట్లు తెలిపి యద్దేవి మొదలైన జననీజనంబు వెంబడింప నగరంబు వెల్వడి యనల్చశిల్పికల్పితసమీకృతసమాచీన కాననపథంబు వట్టి ఘోట్టాణవారణఘటావీరభటశతాంగసంఘసంఘాతభూతలోదితపరాగయోగపంకిలనభోవిటంకరింఖ ఝ్ఝురీపరీవాహుండును సుమంత్రమంత్రిమణి ఫణితగుణనివహగుహసహాయతానిస్తరిత భాగీరథీపురస్సరసరిద్వ్యూహుండును నై ముందట భరద్వాజు నాశ్రమద్వారంబునందుఁ బరివారంబు డించి యాతనిం గతిపయసమన్వితుం డగుచుఁ బొడగాంచి యావిరించిప్రభావుం డమేయనిజయోగమాయాబలానీయమాన సంతానకామధేనువైమానికచకోరలోచనా సమాచారితోదాత్త తత్తజ్జనోచిత నిమజ్జనానులేపనాభరణభోజనాది బహువిధోపచార గౌరవతృణీకృతశచీసహచరత్రిదివపదనైపథ్యం బైన యాతిథ్యంబు సలుపం బొలు పెసంగుసేనతో నాఁ డచట నుండి మఱునాఁడు తన్మౌని యనుప ననుసమచిరత్న రత్నవిచిత్రకూటం బగు చిత్రకూటంబు డగ్గఱి యగ్గిరియుపత్యకావకాశంబునందు సేనానివేశంబునుంచి చెంచుఱేఁడునుం దానును | |
| జానకీజాని నన్వేషించి యంచిత హవిర్గంధగంధవహకిశోరహెూమధూమదూరతోవిభావ్యమానంబును నచలితహరిణగణలిరోహితశరీర వనదేవతావితాన శీలితోపహారప్రసూనంబును నిశీధినీచరపిశాచవాటీ సముచ్చాటనప్రవీణ మంత్రాయమాణ రామానుజధనుర్నినదనిశమనసముచితసమీపఘటితదళకుటీరజటికుటుంబ పరిచయకరంబితమహీభాగంబును, ననేకశాఖిశాఖావలంబమాన వల్కలాజినప్రతానంబును, నంబరపురాయాత దివిజశాతోదరీకరకిసలయానీతపారిజాత సౌరసదవారిజాత కీలితవితానసీతావిహరణాగార తరుతలప్రచురవిచికిలలతాజాయమానకాయమానంబును, నధ్యుటజచత్వరాలక్షితసాలమూల హిమకరోపలవితర్దికానిహితసితకృపాణతూణీర వారవాణ బాణాసనవతంసంబును, నతిథికులసపర్యాపర్యుత్సుక సుమిత్రాపుత్రనిత్యాహితామందకందమూలఫలకోశమందిరాయితైకదేశంబును, నవిరహిత ధరణితనయాచరణవిన్యాసధన్యతా పరిహసితసాకేతరామణీయకంబును నగురామాశ్రమంబు నొంది కైకయీనందనుండు కందళితమానసానందుండై యంతట. | 103 |
సీ. | మినుమినుక్కను సీతమేనికాంతఁ గడానివలువత ళ్కొలయు వల్కలమువాని | |
గీ. | తమ్ములనదమ్ములనెడునేత్రములవాని, నునుమొయిలుచాయలుడివోనితనువువాని | 104 |
చ. | కని యారామసమీపసీమ లతయై కన్పించు క్రొమ్మించుఁ బో | 105 |
ఉ. | ఏనృపుఁ డాసుమిత్ర కుదయించియుఁ దా నితరానవాప్యరా | 106 |
చ. | మరుగతి మండువేసవిని మ్రగ్గి తలంకెడు జింక పంకజా | |
| బురుహమదాళి యై జనకుపోకడ నేడ్పొదవ న్వచించుచు | 107 |
క. | ఆలో నంతఃపురజన, జాలోదితరోదనార్తి చదలంట నిడన్ | 108 |
గీ. | తెలివి ఘటియిల్ల నంతటఁ గులగురూక్త, సరణి రఘువీరుఁ డామరసైంధవాప | 109 |
మ. | మనువంశంబునకున్ యశంబునకు ధర్మశ్రీకిఁ బ్రాక్పుణ్యవ | 110 |
మ. | సకృదుధ్యేతచిరేతరాంశునిభరాజ్యశ్రీమదావేశి చి | 111 |
చ. | మనము గురూక్తి సత్యగరిమం దొరయింపమి రాజధర్మమే | 112 |
క. | ఎందాఁక రామువనగతి, యందాఁక వసింతు నిచట ననుపూనికతో | 113 |
క. | దాశరథిజటాధరభయ, దాశరధిక్కృతి ఘటింప నంతట మర్యా | 114 |
ఉ. | లేటికులంబు నోటఁ గబళించిన దర్భ త్యజించి సోగకన్ | 115 |
గీ. | అత్రికనకగాత్రి యవనిపుత్రికినంగ, రాగ మొసఁగె సానురాగసరణి | 115 |
| చ. వననిధిమేఖలావలయవారిజనీరజనీభవన్నరా | 117 |
ఉ. | చంద్రధరప్రభావ శతచంద్రధరోపమరూప శ్రీహరి | 118 |
క. | కిన్నరనిధినాయకనిభ, కిన్నరకంఠీనవీనకేళిన్యధిపా | 119 |
కవిరాజవిరాజితము. | భరతభగీరథనైషధవాహుషపఙ్క్తిరథాత్మజరంతియుధి | 120 |
గద్యము. | ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాద సమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్టాసంపాదక ఋగ్వేదికవి తిర్వేంగళార్యకలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాత కవిరాజుకంఠీరవబిరుదాంక వేంకటాచలపతిప్రణీతం బైన చంపూరామాయణం బను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము. | |