గోపీనాథ రామాయణము/పీఠిక
పీఠిక
శ్లో. | నమస్తస్మై కస్మై చన భవతు నిష్కించనజన | |
ఈశ్వరసృష్టమగు నీసంసారచక్రమునందు బరివర్తమాను లగుసకలచేతనులకు ధర్మార్థకామమోక్షము లను నాలుగు పురుషార్థములు నత్యంతాదరణీయములు. మహాభారతమునందు—
| "ధర్మం చార్ధం చ కామం చ యథావ ద్వదతాంవర! | |
"వక్తలలో శ్రేష్ఠుఁడా! కాలోపయోగముం దెలిసినవిచక్షణుఁడు కాలమును విభజించి ధర్మార్థకామములు సేవింపవలయును. ఈపురుషార్థము లన్నిటిలో మోక్ష మనునది యుత్కృష్టశ్రేయము నిచ్చునది” అని యుధిష్ఠిరునితో భీమసేనుఁడు చెప్పియున్నాఁడు. కావున మోక్ష మితరపురుషార్థములకంటె మిక్కిలిహితకరము ముఖ్యతమము. ధర్మాదులుగూడ మోక్షమునకును సాధనము లగుటవలననే పురుషార్థము లని వ్యవహరింపఁబడుచున్నవి. వీనిలో ధర్మము ప్రవృత్తిరూప మనియు నివృత్తిరూప మనియు ద్వివిధము. ఇందు మొదటిది యిష్టాపూర్తాదికర్మరూపము[1]. ఇది స్వర్గాదిలోకప్రాప్తికి సాధనము. రెండవది, యైహికాముష్మికాల్పాస్థిరసుఖసంధాయకము లగుకర్మలఁ బరిత్యజించి కేవలపరమాత్మానుసంధానపరుఁ డై యుండుట. దీనికిఁ బ్రమాణము—
| "ప్రవృత్తిసంజ్ఞికే ధర్మే ఫల మభ్యుదయో మతః, | |
“ప్రవృత్తిరూపధర్మమువలన స్వర్గాదిపారలౌకికసుఖమును, పశుపుత్త్రవృష్ట్యన్నాదిలాభమును నివృత్తిరూపధర్మమువలన మోక్షమును సంభవించును” ఇ ట్లుభయలోకశ్రేయస్సాధన మగునది ధర్మము; ఇది యతీంద్రియము (చక్షురాదింద్రియాగోచరము.) ఇట్టిధర్మమును బోధించునది వేదము
| "ప్రత్యక్షే ణానుమిత్యా వా య స్తూపాయో న బుధ్యతే, | |
"ప్రత్యక్షానుమానప్రమాణములచే బోధింపఁబడనియుపాయము దేనిచేఁ దెలియఁబడునో దానికి వేద మనిపేరు." ఇట్టిమూలప్రమాణమగు వేదము పౌరుషేయమువలె భ్రమవిప్రలిప్సాదిదోషజుష్టముగాక యపౌరుషేయమును స్వతఃప్రమాణము నయి యనాదినిధనావిచ్ఛిన్నసంప్రదాయప్రవర్తమానము నయి యున్నది. "యః కల్పస్య కల్పపూర్వః" అనున్యాయము ననుసరించి యీసంసార మనాది. సర్వజ్ఞుం డగునీశ్వరుండు గతకల్పమందలి వేదము నీకల్పాదియందు స్మరించి "యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తసె” అనుప్రమాణానురోధముగఁ బ్రథమజుఁ డగుచతుర్ముఖున కుపదేశించి నతఁడు మరీచ్యాదులకును, వారు తమశిష్యసంఘమునకును, నుపదేశింప నీరీతి నుపదేశపరంపరాప్రాప్త మయ్యె నని పూర్వమీమాంసకులసిద్ధాంతము. మఱికొందఱు శాస్త్రజ్ఞులు (నైయాయికులు) వేదము లీశ్వరప్రణీతము లందురు. "అస్య మహతో భూతస్య నిశ్వసిత మేత దృగ్వేదో యజుర్వేద స్సామవేదః" అనునది వారికిఁ బ్రమాణము.
ఇట్టి వేదము కర్మభాగ మనియు బ్రహ్మభాగ మనియు భాగద్వయాత్మకము. ఇందుఁ గర్మభాగము భగవదారాధన క్రమమును, బ్రహభాగము భగవత్స్వరూపరూపగుణవిభూతులను దెల్పుచున్నవి. ఇట్లు భగవత్ప్రతిపాక మగునీవేదము సంసారిచేతనులకు దత్త్వజ్ఞానము నొదవించుటయందు ముఖ్యసాధనము. తత్త్వజ్ఞాన మనఁగా; సర్వస్మాత్పరుఁ డైనశ్రీమన్నారాయణునకు సర్వప్రకారములఁ బరతంత్రము లగునీయాత్మలకు స్వరూపానురూపపురుషార్థ మగుభగవత్ప్రాప్తిని నిరోధించు ననాదికర్మసంబంధమును నివర్తింపఁ జేయునుపాయము. ఇది యర్థపంచకజ్ఞానమూలము. అర్థపంచకజ్ఞాన మనఁగా: స్వస్వరూప పరస్వరూప పురుషార్థస్వరూ పోపాయస్వరూప విరోధిస్వరూపముల యథార్థముగ నెఱుంగుట. వీనిలో స్వస్వరూప మాత్మస్వరూపము. (ఆత్మలక్షణ మిట్టిదని యెఱుంగుట. ) పరస్వరూప మీశ్వరస్వరూపము. పురుషార్థస్వరూపము మోక్షలక్షణము. ఉపాయస్వరూపము కర్మజ్ఞానభక్తిప్రపత్తిలక్షణము. విరోధిస్వరూపము భగవత్ప్రాప్తిప్రతిబంధకీభూతానాదికర్మబంధము ఇ ట్లర్థపంచకజ్ఞానపూర్వకముగఁ బరతత్త్వమగు శ్రీమన్నారాయణుని పాదారవిందములయందు నన్యస్తాత్మరక్షణభరుండై యతని కత్యర్థప్రియుఁడై మెలఁగుటయే మోక్షసాధనములలో మౌళీభూత మని సర్వవేదాంతతాత్పర్యము.
అనంతశాఖాంచితచతుర్దశవిద్యాస్థానోపబృంహిత మై దుర్జ్ఞేయార్ధప్రతిపాదక మగు వేదమును గూలంకషముగ జదివినఁ గాని పరబ్రహ్మతత్త్వనిర్ణయసామర్థ్యముఁ దత్త్వజ్ఞానముఁ గలుగదనియు, రాఁబోవుకలియుగమునందలిజను లల్పాయువులు, రోగపీడితులు నగుటచే నిట్టిదుర్ఘటజ్ఞానమును సంపాదింపఁజాల రనియు నూహించి సకలభూతానుకంపాసంపన్నచిత్తులుఁ, బరావరతత్త్వయాధాత్మ్యవిదులు, దేవతాపారమ్యవేత్తలు నగుపరాశరవ్యాసవాల్మీకాది మహర్షులు “ఇతిహాసపురా ణాభ్యాం వేదం సముపబృంహయేత్" "ఇతిహాస (భారతరామాయణాదిపూర్వరాజవృత్తము,) పురాణము (సర్గప్రతిసర్గాదిపంచలక్షణసనున్వితము) లచే వేదార్థమును వివరింపవలయును" అను న్యాయమునుబట్టి దురవగాహ మగువేదార్థమును దాము చక్కఁగఁ బరిశీలించి మేఘముచేఁ ద్రావఁబడి విసృష్ట మైనసముద్రజలము సర్వజనోపజీవ్య మగునట్లు పండితపామరసామాన్యముగ నెల్లరకు సులభముగఁ దెలియురీతిఁ బరతత్త్వనిర్ణయమును, మోక్షోపాయనిష్కర్షమును జేసి బద్ధచేతనులకు సంసారసుఖసంతరణోపాయమును దెలిపిరి.
వాల్మీకి - శ్రీ రామాయణము
సంసారార్ణవనిమగ్నచేతనోద్ధరణార్థ మై పరమకారుణికత్వము నవలంబించి వేదార్థోపబృంహణము నొనరించినవారిలో వాల్మీకి ప్రథమగణ్యుఁడు.
| "వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే | |
"వేదముచేఁ దెలియఁబడు పరమపురుషుఁడు దాశరథి యై జనింప నావేదము కూడ వాల్మీకివలన రామాయణరూపముగఁ బరిణమించెను” అనున ట్లితఁడు సాక్షాద్వేదసమ్మిత మగురామాయణమును రచించి,
| "ఇతిహాసపురాణాభ్యాం వేదాంతార్థః ప్రకాశ్యతే, | |
"వేదముయొక్క యుత్తరభాగార్థము (ఉపనిషదర్ధము) ఇతిహాసపురాణములచేతను, బూర్వభాగార్థము ధర్మశాస్త్రముచేతను వెల్లడియగుచున్నది.” అనురీతి నందు సకలముముక్షుజనోపజీవ్యము లయిన వేదాంతార్థములను సంపూర్ణముగఁ బ్రతిపాదించియున్నాఁడు.
శ్రీరామాయణోత్పత్తికి మూలమగుకథ
ఒకనాఁడు వాల్మీకి యదృచ్ఛగా దయచేసిననారదమునివలన శ్రీరామచరిత్రమును సంగ్రహముగ నుపదేశము నొంది యంత మాధ్యాహ్నికస్నానార్థము జాహ్నవీనదీసమీపమున నుండుతమసానది కరిగి యచట నిటునటుఁ జూచుచు సంచరించుచుండ నొకబోయ యానదీతీరవనమందు విహరించుక్రౌంచపక్షిమిథునములో మగపిట్టను గొట్టఁగాఁ జూచి కరుణార్ద్రచిత్తుఁడై యాకఱకుటెఱుకును గోపముతోఁ దిట్టఁగా నది యొకశ్లోకముగ వెలువడెను.
| “మా నిషాద! ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః, | |
హఠాదావిర్భూతసారస్వతఝరీనిష్యందరూపం బగునీశ్లోకమును విని శిష్యుఁడు వెఱఁగంద నాసంయమీంద్రుఁ డప్పుణ్యనదిని దీర్థ మాడి యథోచితముగ సంధ్యా విధి నాచరించి నిజాశ్రమమునకుం బోయి సుఖాసీనుఁ డై తచ్ఛ్లోకభావమును శిష్యునకుఁ జెప్పుచుండ సత్యలోకమునుండి పరమేష్ఠి యచ్చటి కేతెంచి "ఓతాపసోత్తమా! మత్ప్రసాదవిశేషమున నీ కిట్లు సరస్వతి స్వతః ప్రాదుర్భావము నొందె, కావున నారదునివలన నీవు వినిన రామచరిత్ర మంతయు నీతపోమహిమచే నీకు గోచర మగును. కాన దాని నేతాదృశశ్లోకములచే సవిస్తరముగఁ జెప్పుము. లేశమయిన నీవాక్కున నసత్యముండదు.” అని చెప్పి తిరోహితుఁ డగుడు వాల్మీకి, శ్రీ రామాయణకావ్యరచనోద్యతుం డయ్యెను.
శ్రీరామజననము, విశ్వామిత్రయాగసంరక్షణము, సీతావివాహము, పట్టాభిషేకవిఘ్నము, రామవివాసనము, సీతాహరణము, వానరసేతుబంధము, రావణవధము లోనగు పూర్వరామచరిత్రము జరిగినకొంతకాలమునకుఁ దరువాతఁ దిరిగి రాముఁడు రాజ్యమును బాలించుచున్నసమయమున వాల్మీకి యీరామాయణమును రచించినట్లు రామాయణవచనప్రామాణ్యమువలననే కానవచ్చుచున్నది.
(రామా. బాల. 3.4-7)
ఈకథ జరిగిన కొంతకాలమునకు మహర్షి గ్రంథలేఖన మారంభించి మొదటియాఱుకాండములు వ్రాసి పిదపఁ గొంతకాలమునకు రామునిచే లోకాపవాదభీతివలన నరణ్యమునందు విడువఁబడిన గర్భవతి యగుసీత తనయాశ్రమముఁ జేరి యచట నామె కనినకొడుకు లగుకుశలవులు పెరిఁగి ద్వాదశాబ్దవయస్కు లయినపు డుత్తరకాండమును వ్రాసి గ్రంథమును ముగించి యాకుశలవులచే నీగ్రంథమును సాకల్యముగఁ జదివించిన ట్లీ క్రింద వ్రాసిన శ్లోకములవలనఁ గానవచ్చుచున్నది.
(బాల 3-35; 4. 1-4.)
వాల్మీకి రామునకు సమకాలికుఁ డని నిర్ణయించుటకు మన కింతకన్న దృఢతరప్రమాణ మెద్దియుఁ గానరాదు. వాఙ్మయచరిత్రమును విమర్శింప నితఁ డాదికవి యనియు, నితఁడు రచించిన రామాయణ మాదికావ్య మనియు నిశ్చయింపవచ్చును. ఎట్లన:-"వాల్మీకినాదశ్చ ససర్జ పద్యం జగ్రంథ యన్న చ్యవనో మహర్షి!”అని యశ్వఘోషుఁడును, “ప్రాచేతసోపజ్ఞం రామాయణమ్” అని కాళిదాసును, “ఆద్యః కవి రసి తద్భ్రూహి రామచరితమ్” అని భవభూతియును, “బభూవ వల్మీకభవః కవిః పురా” అని రాజశేఖరుఁడును, ఈరీతిగఁ దక్కినకవిసత్తము లందఱును దమతమగ్రంథములలోఁ గృత్యాదిని వాల్మీకి నాదికవి యని శ్లాఘించి యున్నారు. మఱియు—
| "శ్రుత్వా పూర్వం కావ్యబీజం దేవర్షే ర్నారదా దృషిః, | |
అనురామాయణప్రామాణ్యముచేతను,
| "ఋగ్యజుస్సామాథర్వా చ భారతం పాంచరాత్రకమ్, | |
అనుస్కాందపురాణవచనమువలనను, ఈరామాయణము సర్వాలంకారశాస్త్రలక్షణోపేత మై సకలభారతవర్షీయప్రత్ననూత్నవాజ్ఞ్మయగ్రంథసమితికి నిదానమై, సకలపురుషార్థప్రద మై విరాజిల్లుచున్నది. ఏతత్కథాశరీరసంబద్ధులగు రామలక్ష్మణభరతశత్రుఘ్నహనుమద్విభీషణాదిమహాపురుషులసచ్చరిత్రములు వినుట వలన మాతాపితృభక్తి, సోదరప్రీతి, జ్యేష్టానువర్తనము, లోకమర్యాదానువర్తనము, స్వప్రతిజ్ఞారక్షణాభినివేశము, శబ్దాదివిషయవిరక్తి, ఆశ్రితవాత్సల్యము, స్వామికార్యనిర్వహణతత్పరత్వము, స్వార్థపరతానివృత్తి, చిత్తశుద్ధి, పరోపకారబుద్ధి మొదలగు సద్గుణములు గలిగి లోకము సద్వృత్తము నేర్చికొనును.
వాల్మీకి యిట్టిలోకోత్తరమహాకావ్యరచనాపటిష్ఠత కాకరమైన తపోమాహాత్మ్యము, దివ్యజ్ఞానసంపత్తియుఁ గలవాఁడని ప్రసిద్ధి నొందుటయే కాక యితఁడు ఛందశ్శాస్త్రమున కొక క్రొత్తయుగమును గల్పించి యాశాస్త్రమున కత్యద్భుతపరిణామమును గల్పించెను.
మొట్టమొదట వైదికఛందస్సులను లౌకికసంస్కృతశ్లోకరచనకొఱ కుపయోగించినవాఁ డితఁడే ఇతనికిముందు శ్లోకములు లేవు. ఇతనికిఁ బూర్వు లగుమహర్షు లందఱు గద్యమునే వ్రాసి రనుటకు నీ క్రిందఁ గనఁబఱిచినరఘువంశశ్లోకముయొక్క హేమాద్రివ్యాఖ్యాన ముచితప్రమాణము—
| "నిషాదనిద్ధాండజదర్శనోత్థశ్శ్లోకత్వ మాపద్యత యస్య శోకః.” (రఘు. స. 14.70.) | |
| “వ్యా. చాండాలనిద్ధక్రౌంచమిథునదర్శనోత్థేన శోకేన చాండాలం యదా౽భర్తృయత్ | |
వైదికలౌకికఛందస్సులతారతమ్యవిమర్శన మతిలాభకరము గాన, వానిని వాల్మీకి యె ట్లభివృద్ధి నొందించెనో యాయంశ మిచటఁ గొంత చర్చించెదము.
అనుష్టుప్ఛందస్సునకుఁ బ్రత్యేకముగ నెనిమిదేసి యక్షరములు గల నాల్గుపాదము లుండును. వేదమునందును ఈరామాయణ ప్రయుక్తానుష్టుప్పు గలదు. దీని కుదాహరణము ఋగ్వేదసంహితలో
| “ఆత్వా గ్రావా వద న్నిహ సోమో ఘోషేణ యచ్ఛతుః | |
ఇందుఁ బాదమున కెనిమిదేసియక్షరముల చొప్పున నాల్గుపాదములకు ముప్పదిరెండక్షరములు సరిగ నున్నవి. అయినను వైదికానుష్టుప్చంద స్సగుటచే నీవర్ణములు దీర్ఘములుగను, నీవర్ణములు హ్రస్వములుగ నుండవలయు ననునియమము లేదు. కాఁబట్టి పై వైదికానుష్టుప్పు లిట్లుగాక యంతట నవ్యభిచరితముగ రెండునియమములతోఁ గూడియున్నవి. ప్రథమతృతీయపాదములలోని పంచమాక్షరము దీర్ఘముగను, ద్వితీయచతుర్థపాదములలోని సప్తమాక్షరము హ్రస్వముగ నుండవల యును. వైదికవృత్తములకంటెఁ బృథగ్లక్షణము గలిగి లయానుగత మగునొకనూతనవృత్తజాతి వాల్మీకి కల్పించెను. ప్రతిపాదమునందలియక్షరములలో నివి గురువు లివి లఘువు లని నిశ్చితమైన యేర్పాటు గలదీర్ఘవృత్తములజాతి యింకొకటి కాలక్రమమునఁ గలిగినది. లౌకికవృత్తముల గురులఘువర్ణానుపూర్వియు వైదికవృత్తముల గురులఘువర్ణానుపూర్వినే యనుసరించియున్నది. ఉదా—
| "సహస్రశీర్షా పురుష స్సహస్రాక్ష స్సహస్రపాత్ | |
ఈదిగువ నుదహరించిన త్రిష్టుప్ఛందస్సును కొంతమార్పు చేసిన లౌకికము లగు నింద్రవజ్రోపేంద్రవజ్రావృత్తములవలెఁ జదువవచ్చును.
వైదికము
| ఉదీర్ష్య నా ర్యభిజీవ లోకం | |
లౌకికము
| ఉదీర్ష్వ నారీ అభిజీవ లోకం | |
వైదికానుష్టుప్ఛందస్సును వాల్మీకి లౌకికానుష్టుప్చందస్సునుగా నెంతసులభముగ మార్చెనో చూడుఁడు. ఇతని మార్గమునే వ్యాసాదులు ననుసరించిరి. త్రిష్టుప్ఛందోమూలకము లగువైదికదీర్ఘవృత్తము లాధునికము లగునింద్రవజ్రోపేంద్రవజ్రవృత్తములుగ మాఱెడుదశలో వ్రాయఁబడిన శ్లోకములు భారతమునఁ గానవచ్చుచున్నవి. ఇవిగాక మఱికొన్నివృత్తములు వైదికఛందోబద్ధముగనే కనఁబడుచున్నవి. ఉదా—
| "ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరా వాశంసామి తపసా హ్యనంతౌ, | |
(భార. ఆది. పౌష్యపర్వ. ఆ. 3.)
బ్రహ్మ వేదములకువలె వాల్మీకి సంస్కృతశ్లోకనిర్మాణమునకును సంస్కృతకవనమునకును జనకుఁడు, కవి యనఁగా వాల్మీకి. "కవి ర్వాల్మీకిశుక్రయోః” అని విశ్వనిఘంటువు. కాళిదాసుగూడ నీయర్థమున నుపయోగించెను. “కవిః కుశలవా వేవ చకార కిల నామతః." రఘు. 14-32.
మఱియుఁ దైత్తిరీయప్రాతిశాఖ్యయందును, వాజసనేయసంహితయందును వాల్మీకినామ ముదాహరింపఁబడుటచే నితఁడు శ్రుతిప్రత్యభిజ్ఞతమాహాత్మ్యము గలవాఁ డని స్పష్టము.
(తైత్తి. ప్రాతి. 5.36; 9.4; 18. 6.)
————
బుధనరుల కొళవిజ్ఞ ప్రీ
ఆర్యులారా! మొ క్రియమిత్రులు, నాంధ్ర భాహాభివృద్దికి6 జరకాలమునుండి పాటువడుచుండువా రిలో న్య గణ్య్రలునగు బ్రహ్మశీ,; వావిళ్ల. చేంకళుశ్వరులుగారు గోవీ నాథము 'వేంకటకవిశిరోమణివిరచిత మగునీయాం ధ్ర రామాయణమున ఫొళఠ యుపోబ్యాతము వ్రాయుమని కొంతకాలము క్రిందట నన్నుంబ్రోత్సాహము నేయంగా నాజుమోసముల క్రిందట నారంభించి నేంటికి ముగింపంగలిగతిన, శ్రీరామాయణ మునంటి మహానీయ్య్ర ంథముయొక్క_ . విశేషార్థములను సాకల్యముగా వివరించుట యెన్వరివ్లై న నళక్థము అందులో ముఖ్యముగా గోవిండదరాజీయ వ్యాఖ్యానము, తని న్లోకి మొదలగు గ్రురథములయ రదుం బ్రతిపాడింపంబడిన యర్థములభే స్వీకరించితిని గాని స్వాతం శ్రముగా నెద్దియ వ్రాయలేదు తుదను న్రాసీిసరామోయణ భుట్టముల యొక్క. పరిపహ్కారనులను బ్రహ్మశ్రీ, వావిళ్ల. రాముస్వామిశొద్ర్రిగారు సంస్కృత వాల్మీకి రా హమాయణమునకు వ్రాసీన సంస్కృతీ పోళ్తూతమునుండి తేనింగించినం గవా ముగా వ్రాసితిని, గుణపోవవిమర్శికు లగసబుథధజనులు నాయందు దయ'సేసి యందలి వోవములను విడనాడి గుణములను గ్రహింతుకుగావుత మని యొబ్లపుడును శ్రా్థిం చుచున్నాండను,
ఇట్లు, విన్నవించు బుధజనవిళేయుండుు
విజయనగరము ] శ్రీవిజయనగర మజోరాజనం పీళాంచ్లేయపాఠశాలా 26మే, 1916 సంస్కృృృతభా పూధ్యావకుందు.
- ↑ యాగము సేయుట, చెఱువులు త్రవ్వించుట మున్నగుపను లిష్టాపూర్తకర్మలు