క్షాత్రకాలపు హింద్వార్యులు/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి యుడుపులు
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు.
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
పురుషు లా కాలమున ధరించుచుండిన యుడుపు లనగా, ఎక్కువ పొడవు తక్కువ వెడల్పుగల రెండు విడివస్త్రములు మాత్రమే యైయుండవచ్చును. ఒకటి కట్టుకొనుటబడునది. రెండవది కప్పుకొనబడునది. మొదటిది నడుముననుండి క్రిందిభాగమును గప్పుచుండెను; రెండవది నడుము మీదిభాగ్ము నాచ్చాదించుచుండేను. ఈ యూహ కేవలము కల్పితమైనదని తలపగూడరు. ఇది సప్రమాణమనుట నిస్సంశయము, ద్రౌపది కౌరవసభలోనికి లాగికొని రాబదినపుడు, దుర్యోధనుడు ఆమె చూచుచుండగా దన కుడ్తొడమీది వస్త్రమును దొలగించెనని మహాభారమందున్నది. దాదాపుగా నిన్నటికాలమున వాడుక యందున్న విధమున ధోవతిగట్టికొనిననే కాని అతడట్లు తన కుడితొడను అనాచ్చాదితముగా జేయుట సంబవింపదు. రాజు మొదలు జనసామాన్యమువఱకు నందఱును ధోవతినే కట్టుకొనుచుందినట్లుకూడ తోచుచున్నది. భేధమేమైన సుండినచో వస్త్రముయొక్క మృదలత్వమునందును నేతయొక్కసన్నదనము
ఏ, ఎల్, ఎల్, బి గారు క్షాత్రయుగము వైశాల్యమును ఇంచుమించుగా క్రీ.పూ.3000 నుండి క్రీ.పూ.250 వఱకు నిర్ధారణచేసియున్నారు. వీరి యభిప్రాయముతొ నంద ఱేకీభవింపకపోయినను, వీరు చెప్పిన యంశములను వివరములను మనసు పాశ్చాత్యవిద్యాంసులచే నిశ్చయింపబదిన క్షాత్రయుగమునకే వర్తించునవి యని యూహించుకొనవచ్చును. వైద్యాగారి మతమున భారతయుద్ధమును క్రీ.పూ.3101 వ సంవత్సరమున జరిగినది. గ్రంధము తరువాత కొలదికాలమునకేవ్రాయబడెనని వారభిప్రాయపడుచున్నారు.
వారియుడుపులు.
నందును ఉండవచ్చును. ధృతరాష్టృడు పుత్రుని శరీరము కృశించి నందునకు గారనము నడుగు సందర్భమున నిట్లనినును "నీవు ప్రావారనస్త్రములను ధరించుచున్నావు. మాంసముతో నన్నమును భుజించుచున్నావు. దివ్యాశ్వముల నెక్కి సవారీచేయుచున్నావు. ఇట్టి నీవు కృశించుటకు గారణమేమి?" 'ప్రావారనస్త్రము ' లనగా నేమో వ్యాఖ్యాతవివరించలేదు. అయినను పైశబ్దమునకు మనము అందమైన వస్త్రములని యర్ధము చెప్పిన చెప్పవచ్చునని తలచెదను. శరీరోర్ద్వభాగము నాచ్చాదించుచుండిన రెందవ వస్త్రమును గుఱించి మనకంతగా దెలియదు. మతగ్రంధములళో వచ్చిన 'ఉత్తరీయ ' శబ్ధమునుబట్టి మన మీరెండవ వస్త్రముండెనని నిశ్చయించుకొనవలసిన వారమైతిమి. ఈవస్త్రము వెనుక జెప్పిన ప్రకారము శరీరోర్ద్వభాగమున గప్పికొనబడుచుడెడిది. కొన్ని వేలలయందు కుడిచేయి అనాచ్చాదిత ముగా వదలివేయబడు చుండెను. అట్టి సమయమున నీయుత్తరీయము కుడిచంకక్రిందనుండి యెడమభుజముమీదికి బోవుచుండెనని యూహిమపవలయు ' నని మనుస్కృతి విధించి యున్నది. *దీనికి వ్యాఖ్య్హత ఉత్తరీయము కప్పక బయటకు దీసియుంచవలయునని యర్దము చెప్పియున్నరు. పురరనకాలపు హింద్వార్యులు యుద్ధసమయములందు ఉత్తరీయము నిట్లే వైచికొని దాని చెఱగులను ఎడమభుజముపైన గట్టిగామిడివేసికొనుఛుండి రని తొచుసున్నది. _____________________________________
*నిత్యముద్ధృతపాణిస్యాత్. 4క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
వెనుక జెప్పబడియున్న రెండు వస్త్రములు తప్ప, అధవపక్షము క్షాత్రయుగారంభమున, హింద్వార్యులు మఱే యడుపులను ధరించియుండినవారు కారు. లాగులు జాకెట్లు ఎట్టివో వరెఱుగరు, కోట్లు చొక్కాలు వారికి దెలియవు. బట్టలను గత్తిరించి తీరుతీరు ఉడుపులుగా గుట్టుట ఆ కాలమున లేదు. కుట్టుపని మొట్టమొదట బహుశ *'సెమిటిక్కు 'లలో బుట్టినదై యుండవచ్చును. అది గ్రీకులు పంజాబుదేశమును జయించిన కాలముననో, అంతకు బూర్వము హింద్వార్ల్యులకు పారసీకులతో సంబంధము కలిగినట్టి డెరయను పరిపాలన కాలముననో మనదేశముల్న బ్రవేశించి యుండవచ్చును. రామాయణమున z కుట్టుపనివాడు వచ్చియున్నాడు, కాని మహాభారతమున వానిజాడ ఎచ్చటను కానరాదు. ఇంతమాత్రమున మహాభారతము రచింపబదిన కాలమున కుట్టుపనివాడు ఉండనేలేదను X అభానవాదమున కవకాశము లేదు. అది యటుండ నిండు, మొత్తముమీద క్షాత్రయుగారంభమున హింద్వార్యులలో పురుషులు రెండువస్త్రములలో నొకదాని గట్టికొని రెండవదాని గప్పుకొనుచుండిరని విశ్వసించుటయందభ్యంతర మేమియు లేదు.
___________________________________________
- ఇది ఏష్యాఖండముయొక్క పశ్చిమభాగముననుండిన యొకజాతి.
z తున్నవాయి
X అభావవాదమనగా, ఒకగ్రంధమున ఒకానొకవస్తువు ప్రసక్తిలేదు. కనుక ఆగ్రంధము రచింపబడిన కాలమున అట్టివస్తువే యుండలెదని వారించుట. పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/23 6
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
ధరింపబడుచుండెననియు, మొలనూలువంటి దేదియు నుండలేదనియు, ఇప్పుడు ఉత్తరహిందూస్థానమునందు వాడుకలోనున్న లంగావంటిదానిని వారు తొడుగుకొనుచుండలే దనియు తేలుచున్నది లంగావంటి వస్త్రమేయైనయెడల నంత యవలీలగా నూడియుండునా? ఆ కాలమున రవికయనబడునదికూడ నుండలేదని తోచుచున్నది.
ఈ సందర్భమున నొక చిత్రము చూడదగియున్నది. పురాతన కాలపు గ్రీకు స్త్రీ పురుషులు ధరించుచుండిన యదువులను హోమరు వర్ణించియున్నాడు. అవి మన హింద్వార్యుల వస్త్రములను బోలి యున్నవి. హోమరు కాలపు స్త్రీ ముసుకుగాక ఎక్కువ పొడవు తక్కువ వెడల్పుగలట్టిదియు దేశములోనే తయారయినట్టియు కత్తిరింపువాని కుట్టుపనిగాని లేనట్టిదిల్యు నగు నొక వస్త్రమును గట్టుకొనుచుండేను; ఆ వస్త్రము భుజముపైన నొకసూదితోను నడుముచుట్టు మొలనూలుతోను బిగింపబడుచుండెను; చేతులు బయటనే యుందుచు వచ్చెను". ॥ పురుషులకు మొలనూలు ఉండలేదు. పైన నుల్లేఖింపబడిన ముసుకు హిందార్యస్త్రీల యుత్తరీయమువంటిదే యని వేఱుగా జెప్పబనిలేదు. "హోమరుకాలపు స్త్రీదు:ఖసమయములందును, స్వతంత్రముగా నేదయన పని చేయవలసివచ్చినప్పుడును, ముసుకునుతీసి వేయుచుండెడిది" సీత తన్ను పరుడోకడు బలాత్కారముగా చెఱగొని పోవునపుడు ఆసమాచారము భర్తకెఱుక పఱచు నుద్దేశముతో దన యుత్తరీయమును వానరసేనారీనృ
_______________________________________
॥ Women of Homer by Walter Capt.Perry. వారియుడుపులు.
తుదకు సుగ్రీవుడుండిన ఋష్యమూకముపైన బడవైచెను. కనుక హింద్వార్యస్త్రీయును హోమరునాటి స్త్రీయును ఉత్తరీయము నొక్కొక్కమారు వదలివేయచుగూడ నుండ్రి. హిందూస్త్రీవలెనె హోమరుని స్త్రీకిగూడ కంచుకముండలేదను సంగతి హోమరు వర్ణనములవల నేమి పురాతన గ్రీకుల విగ్రహము లవలననేమి మనకు దెలియుచున్నది.
దక్షిణహిందూస్థానమున నిప్పుడు వాడుక యందున్న గోచీ పెట్టుకొనుపద్ధతి ఆ కాలమున లేదని తోచుచున్నది. గోచీ పెట్టుకొని నాచారము స్త్రీలళొ నాకాలమున నుండినయెడల ద్రౌపది కట్తు పుట్టము దుశ్శాసను డట్లు ఊడగుంజుటకు వీలులేక యుండును. మహాభారమునం దెచ్చటను నీగోచీమాట రానేలేదు. బాలురకు ఉపనయన సమయమున కౌపీనము పెట్టించుపద్ధతి ననుసరించియే స్త్రీలలో నిట్టి యాచారమారంభమై యుండవచ్చును. పురుషులకు ఉపనయనమెట్టిదో స్త్రీలకు వివాహ మట్టిదగుట చేతనే కాబోలును వివాహితలయిన స్త్రీలవిషయమున మాత్రమే గోచీపద్ధతి విధింపబడియున్నది. దక్షిణహిందూస్థాన మందు సయితము కన్యలుగోచీలేకుండనే బట్టగట్టుకొనుచున్నారు. క్షాత్రల్యుగమున నుత్తరీయమును గౌరవనీయురాండ్రు మాత్రమే ధరించుచుండిరి. కావుననే ద్రౌపది సైరంధ్ర్రివేషముతో విరాటుని పురమున నుండినపుడు ఏకవస్త్రముగనే సుధేష్ణయెద్దకు వచ్చినది. X బహిష్టులుగా నున్నపుడుకూడ స్త్రీలకు ఉత్తరీయముతో బనిలేకయుండెను. ఇంట గృహకృత్యములను నెరవే
________________________________________
X వాసశ్చపరిధాయైకం కృష్ణానుమలినం మహత్ కి విరాటహేక్షిణ క్షాత్రయుగమునాటి హింద్వార్యులు
ర్చువేళసయితము వారుత్తరీయమును వేసికొనకుండిరి. వితంతువు లాకాలమున చెల్లని యుత్తరీయముల ధరించుచుండిరి. అరణ్యముననుందిన ధృతరాష్ట్రుని దర్శించుటకై అతని కుటుంబములోనివారగు వితంతువులు పాండవుల రాణివాస్దముతొ బోయినప్పుడు వారు తెల్లని యుత్తరీయములను ధరించి యుండిరని చెప్పబడియున్నది. Xదీనినిబట్టి యాలొచించగా, తెల్లని యత్తరీయము వితంతువులకొఱకు మాత్రము విధింపబడి యుండెననియు తదితర స్త్రీజనము ఎఱుపు నలుపు మొదలగు రంగుల యుత్తరీయములను వేసికొనుచుండి రనియు తేలుచున్నది. ఇప్పటీకాలమున వితంతువుల వస్త్రములు ఎఱ్ఱగానుండిన మంచిదని తలంచుచున్నారు. ఇది ప్రాయశ:భౌద్ధభిక్షునుల పద్ధతి ననుసరించి వచ్చిన యాచారమై యుండవచ్చును. వివాహితులగు స్త్రీలు కట్తుకొని బట్టలుకూడ వేఱువేఱు రంగులుకలవిగా నుండవచ్చును. కట్టికొనువస్త్రము లును ఉత్తరీయములును ఇప్పటికాలము వానివలె అంచులు కలవై యుండెనని తోచెడిది.
ఇక శిరోవేష్టములను గురించి విచారింతము. ఆకాలమున స్త్రీలకు శిరోవేష్టము లుండినట్లు కానరాదు వారి తలలకు తోపీకాని మఱేదయిన నాచ్చాదనముగాని యుండలేదు. zవితంతువుల తెల్లనివస్త్రములనుగుఱించి వెనుక నుల్లేఖింప బ
డిన శ్లోకపు మొదటి చరణము 'ఏతాస్తుసీమంతశిరోరుహాయా '
X శుశ్లోత్తరీయాం నరరాజసత్న్యంకి ఆశ్రమకి 157 16.
z బయటకు వెడలినప్పుడుమాత్రము వారుతలలపై నుత్తరీయమును గప్పికొనుచుండిరనుట నిశ్చయము. వారియుడుపులు
అనునది. ఇది చతుర్ధరుని గ్రంధమునందలి పాఠము. అతడు దీనికి బదులుగా, ఏతాస్త్వీసీమంతశిరోరుహాయా!, అని యుండిననింత కంటె బాగుండూని వ్రాసియున్నాడు. పాపడను చూణన్ ముతో నలంకరిచుటకై వెంట్రుకలను రెండు పాయలుగా దీసి తలముడుచు టకు 'సీమంత 'మనిపేరు. ముత్తయిదువులగు స్త్రీలు మాత్రమే ఈ విధముగాతలలముడీచికొనుచుండిరికనుక వితంతువులనుయిట్టి యలంకరణము లేనివారినిగావణీన్ చుటసహజము. ఇంతేకాదు. "సర్వజనసంహారముజరగి పృధ్వియంతయు శోకమయమై ఉత్తమ స్త్రీల సీమంతము తీసివేయబడినప్పుడు..." అను నర్ధముగల శోకము X కూడ సీమంతము పొవుట వైధవ్యముయొక్క ముఖ్య లక్షణమని స్పష్టముగా జాటుచున్నది.
మర్యాదగల పురుషులు వెండ్రుకలను ముడివేసికొనుచు బయటికి వచ్చినపుడు తలగుడ్డ పెట్టుకొనుచు నుండిరి. ఈ తల గుడ్దపద్ధతి హిందువులు స్వయముగా నేర్పఱచుకొనినదేకాని ఇతరులను జూచి నేర్చుకొనినదికాదని తొచుచున్నది. ఇప్పటి వలెనేఋ ఆకాలమునందును వరు ఢరించు తలగుడ్డ యొక పొడుగుపాటి వస్త్రము. దీనిని వారు తలచుట్టును వివిధములుగా జుట్టుకొనుచుండిరి. యుద్ధరంగమునకు బొవుసమయమున భీష్ముడు తెల్ల తలరుమాలును ధరించినట్లు చెప్పబడియున్నది. ద్రోణుని విషయమునంగూడ నట్టివర్ణనయేకలదు. కనుక వయసు మీరిన వారి శిరోవేష్టము సాధారణముగా తెల్లరంగుది గాన్ యోవనుల
X శ్లోకి సంహారేసర్వతోజాతే పృధిజ్యాం శోకసంబావె! బహూజా నుత్తమస్త్రీణాం సీయంతొద్దరగేతధా ॥శల్యకి21॥20
క్షాత్రయ్హుగమునాటి హింద్వార్యులు.
తలగుడ్డ యెర్రగానో లేక ఏదయిన మరియొక రంగుదిగానో యుండ వలెను. హిందువుల తలగుడ్డలు గ్రీకులకు విచిత్రముగ గాన్పించినట్లు తోచుచున్నది. కనుకనే'ఏరియను ' గ్రంధకారుడు 'ఇండికా ' యను గ్రంధమున నిత్లు వచించియున్నాడు. "హిందువులు దూదితో నేయబడిన యొకవస్త్రమును గట్టుకొనెదరు. అదిమోకాళ్ళకును చీలమండలకునను మధ్యభాగమున వఱకుండు ను. ఇదిగక వేఱోకవస్త్రమును పయినవేసికొందురు. దీనిలో కొంతభాగమును వారు భుజములపయిన గప్పికొని తక్కిన భాగమును తమ తలకు జుట్టుకొనెదరు. *'ఏరియను ' చెప్పినట్లు ఒకటేవస్త్రమును తలకు జుట్టుకొనుటకును శరీరమును గప్పికొను టకుగూడ్ వాడుకొనువారు బహుశ: బీదవారయి యుండవలెను. గొప్పవారి తలగుడ్డ ప్రత్యేకవస్త్రమై యుండవచ్చును. 'కటిన్ యనురూఫను ' అను గ్రంధకారుడు హిందూదేశమును హిందువులను వర్ణీంచుచు "వీరు తమశరీరమును పాదములవరకు మృదువైన సన్న సన్నని వస్త్రములతో నాచ్చాదించుకొనెదరు. పాదుకలు తొడిగెదరు. దూదితో జెయబడిన బట్టను తలకు జుట్టుకొందురు." X అనిచెప్పియున్నాడు అయినను అప్పటితలగుడ్డ ఇప్పటికాలమున మనదేశమందలి కొన్ని ప్రాంతములలోనున్నంత చిక్కులు కలదిగాను పొడుగుగాను ఉండలేదని తోచుచున్నది. దానిని జుట్టుకొనుపద్ధతి బహుశఇప్పుడు ఉత్తరహిందూస్థానములోని పేదవాండ్ర పద్ధతివంటిదై యుండఫచ్చు
- Ancient India. Megasthanes and Arrian by Mac Crindle p.219
X Invasion of India by Alexander. Mac Crindle P.188 ను. ప్రతివాడును తన తలగుడ్డను తానే చుట్టుకొనుచుండెను. రాజులు మాత్రము కిరీటముల ధరించుచుండిరి. దుర్యోధనుడు భీమునితోజేసిన తుది ద్వంద్వయుద్ధముసమయమున కిరీటము అతని తలపైనుండెను. భగ్నోతుడై నేలబడిన పిమ్మట నాతని తల పయిన నదియట్లేయుండెను. కావుననే భీముడు దాని కాలితో దన్న గలిగెను. ఆ కాలమున కిరీటము శిరమునకు గట్టిగా బిగింపబడు చుండెననియు బుధముల వదలించిననేకాని వీడి రాకుండనుండెనని వీడిరాకుండెననియు మనమూహింపవచ్చును.
హిందువుల వస్త్రములు తఱచుగా దూదితో నేయబడుచుండె డివి. ఆ కాలమున హిందూదేశమున తప్ప మఱెచ్చటను ప్రత్తి పండుచుండునట్లు కానరాదు.. అట్లుకాదేని "హించువులు చెట్ల పై పండు ఉన్నితో జెయబడిన వస్త్రముల్ను ధరింతురు" అని గ్రీకులు వ్రాసియుండరు. ధనవంతులు అందు ముఖ్యముగా స్త్రీలు పట్టు బట్టలు ధరించుచుండిరి. X రాజాంత: పురములలోని స్త్రీలు "సీతకాశే య వాసిరునులు" గా వర్ణీంపబడి యున్నారు. పురుషులుకూడ పసుపుపచ్చనబట్టలు ధరించుచుండినట్లు కానవచ్చుచున్నది. మన దేశములోని కాశ్మీరము, పంజాబు, గాంధారములలో బహుశ: ఉన్ని బట్టలుకూడ వాడబడుచుండెడివి. భర
X సుభద్ర మొట్టమొదట వచ్చి గోపాలిక వేషమున ద్రౌపదితో గలసి కొన్నప్పుడు ఆమె ఎర్రని పట్టుపుట్టమును ధరించియుండెను.
శ్లో॥ సుభద్రాంత్వరమాణాశ్చరక్త శాసేయవాసినిం పార్ధప్రస్తావయా మాసకృత్యూఅగోపాలకనవు: అదికి21కి12 క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
తుని తాతయగు కేకయరాజు మనుమనికి కంబశాసనములనేక ములు బహుమానపూర్వకముగా వచ్చినట్లు రామాయణము నందున్నది. ఇప్పటికాలమున నెట్లో యట్లే క్షాత్రయుగము నందును + సొగసైన నేతయును, మిగుల వెచ్చదనమును గల ఉన్ని శాలువ లకు పంజాబు కాశ్మీర దేశములు ప్రసిద్ధి వహించియుండవచ్చును. నూలుబట్టలు వీనికంటెనెక్కువ సన్ననినేత గలిగియుండి రాణివాసము వారును, గొప్పవారును ధరించుటకు దగినవిగా నుండెనని భారతరామాయణములు చెప్పుచున్నవి.
నూలు, పట్టు, ఉన్నితో మాత్రమేకాక గడ్డితోగూడ వస్త్రములు నేయుచుండెనని వీరకావ్యములవలన దెలియుచున్నది. వీనిని తానసులు ధరించుచుండిరి. సీతారాములు తానవేషముతో నరణ్యమునకు బోవునపుడు వారు కుశనిర్మితములగు వస్త్రముల ధరించియుండిరి. అట్లే పాండవులరణ్యవాసమునకుజనినపుడు ఆజనములను ఉత్తరీయములుగా వాడుకొనిరి. *ధృతరాష్ట్రుడు వానప్రస్థుడు గాన నరణ్యమునకుఇబొవు వేళ వల్కలాజనములను ధరించెను. ^ ఋషులును ఇతరతావసులును వల్కలాజిన ధారులుగా వర్ణింపబడియున్నారు.. ఒక వీరకావ్యమలలోనేగాక, వానితరువాత రచింపబడిన వందల
+సామానబృహతీగౌరీసూక్ష్మకంబంవాసినశికర్ణ॥4413
- శ్లో॥ తతపరాజితా: సాధాకాననిసాయదీక్షితా॥అజనసమ్యత్త రీయాని జగృహశ్చయధాక్రమంకీనభా॥1341
వారియుడుపులు
కొలది గ్రంధములలో తాపసులు ధరించు వల్కలాజనములు వచ్చినవి. కాని ఇట్టివస్త్రములు ఏగడ్డితో జేయబడుచుండేనో ఎట్లు జెయబడుచుండెనో కానరాదు. ఇప్పటి కాలమున మాత్రము మనదేశమున కేవలము గడ్డితో చేయబడువస్త్రములు ఎచ్చటను కానబడవు. అయినను ఒకప్పుడు మనదేశమునందు గడ్దితో జేయబడు వస్త్రములుండెననుసంగగిమాత్రము నిజము. "ఈ హిందువులు గడ్డితో చేయబడు బట్టలను గట్టుకొనెదరెఉ. వారు నద్లలో రెల్లును గొనితెచ్చి చీల్చి చపవలెనల్లి వస్త్రముగా ధరింతురు" అను హిరోకోటనుఇ వ్రాత పైయంశమును బలపఱచుచున్నది.
----