క్షాత్రకాలపు హింద్వార్యులు

విషయానుక్రమణిక.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1

14

37

60

83

1. మ॥ రా॥ రా॥ శ్రీ సూర్యాపేట వర్తకసంఘము.

2. మ॥ రా॥ రా॥ శ్రీ నాయుని వెంకటరంగారావుగారు,

జమీందారు, మునగాల.

3. మ॥ రా॥ రా॥ శ్రీ వేంకట ముత్యంరావుగారు,

సర్దేశముఖు, సర్కారు ఆరామగిరి,
ఇందవరం, చెన్నూరు తాలూకా,
అద్లాబాదు జిల్లా.

కృషిప్రచారిణీ

గ్రంథమాల.

ప్రధాన పోషకులు.

1. మ॥ రా॥ రా॥ శ్రీ జువ్వాడి ధర్మాబూక్కారావుగారు,

దేశముఖు ముఖ్తేదార్,
భీమవరం, జగ్త్యాల తాలూకా.

2. మ॥ రా॥ రా॥ శ్రీ జువ్వాడి ధర్మా వేంకటజగపతిరావుగారు,

ముఖ్తేదార్, చలగల్లు,
జగ్త్యాల తాలూకా.

పీఠిక

ఈ పుస్తకములోని (5) వ్యాసములును, క్షాత్రయుగము (Epic age) నాటి యార్యుల జీవన విధానమును దెలుపుటకై వ్రాయబడినవి. ఇవి కొన్ని సంవత్సరములక్రింద బెజవాడయందు వెలువడుచుండిన "గ్రంథాలయ సర్వస్వము" అను త్రైమాసకపత్రికయందు అప్పుడప్పుడు ప్రకటింపబడుచు వచ్చినవి. ఆవ్యాసములనే ఇప్పుడు మాన్వితృలగు శ్రీయుత పువ్వాడ వేంకటప్పయ్యగారు (కృష్ణ ప్రచారిణీ గ్రంథమాల సంపాదకులు) నాయందు వారికిగల యభిమాన విశేషమున గ్రంథరూపమున వెలువరించుచున్నారు.

దీనిలోని వ్యాసములను రచించుటయందు స్వతంత్ర కల్పనము (originality) ఏమాత్రమును లేదు. బొంబాయివాస్తవ్యులును, మన్వితృలునునగు రావుబహద్దరు చింతామణిరావు వైద్యా, ఎం. ఏ. ఎల్. ఎల్. బి., గారు వ్రాసిన విఖ్యాతమగు "ఎపిక్ ఇండియా" (Epic India) అను ఆంగ్లగ్రంథములోని వ్యాసములకు నారచన కేవలము అనుకరణము. అంతే రావుబహద్దరు వైద్యాగారి గ్రంథమున క్షాత్రయుగము నాటి ఆర్యులనుగూర్చి తెల్పు వ్యాసములింకను ఎన్నియోకలవు. అవియు తెనుగున ప్రకటింపబడినచో, పేదయైయున్న ఆంధ్ర చారిత్రక వాజ్మయమునకు కొంత పుష్టికలుగుననుట నిశ్చయము. గ్రంథాలయ సర్వస్వ ప్రకటన మాగిపోవుటతో, నాకు నీ గ్రంథవిషయముల తెనిగించు నుత్సాహము ఆగిపోయెను. ఇందునకు నేనెంతయు చింతిల్లుచున్నాను.

రావుబహద్దరు వైద్యాగారు మన దేశచరిత్రములోని హిందుమహాయుగమున నిపుణులు. వారి వచనా విధానమును అద్వితీయమని నావిశ్వాసము. చారిత్రక వాజ్మయము చదువు వారందరికీ ఎక్కువయుత్సాహము గొలుపునది కాదు. అట్లయ్యు కీ. శే. కొమర్రాజు లక్ష్మణరావు ఎం. ఏ. గారివలెనే శ్రీవైద్యాగారును చరిత్రను మనోహరముగా నొనర్చుటయందు సమర్థులు. వీరు ఆంగ్లమున రచించిన గ్రంథములలో ముఖ్యములు "మహాభారత సమక్షణము" (Mahabharata a criticism) "రామాయణ సమస్య" (The riddle of Ramayana) "హిందూదేశ క్షాత్రయుగము" (Epic India) "హిందూమహాయుగము యొక్క మధ్యకాల చరిత్ర" (History of Medeaval Hindu India) అనునవి. ఇవు అన్నియు విజ్ఞానప్రదములును, మనోహరములును, పరిశౌధనా పూర్వకములును నగు గ్రంథములు. ఆంధ్రసోదరులు వీనిని పఠించినచో అనేక నవీనవిషయముల నెరుగగలరు. పైవానిలో "మహాభారత సమీక్షణము" అనుగ్రంథము నావలన తెనిగింపబడినది. దీనిలోని కొన్ని యధ్యాయములు "ఆంధ్రభారతి" (మచిలీపట్నము) ఆంధ్రాభ్యుదయము (హనుమకొండ) దేశబంధు (వడ్డెపల్లి) మాసపత్రికలలో ప్రకటితములైనవి. తక్కిన గ్రంథములను తెనుగు వ్రాయదలచితినిగాని, అవకాశము లభింపకపోయెను. ఈ వ్యాసముల వ్రాయ నన్ను బురికొల్పిన నామిత్రులగు శ్రీయుత నడింపల్లి జానకిరామయ్యగారికిని, వీనిని గ్రంథరూపమున ప్రకటించుచున్న కృషిప్రచారిణీ గ్రంథమాలా సంపాదకులును, నిర్దుష్టముగాను చక్కగాను దీని నచ్చొత్తించుచున్న వాణీముద్రాలయము వారికిని కృతజ్ఞఉడను.

ఆంధ్రకుటీరము

రెసిడెన్సిబజారు, హైదరాబాదు,

15-1-1927.

మాడపాటి హనుమంతరావు.

సంపాదకీయ భూమిక

కృషి ప్రచారిణీ గ్రంథమాల చందాదారులకు విన్నపము.

  మా చందాదారులు మాకుపరమహితులు. మేము గ్రంధమాల స్థాపించి మూడువర్షములైనను, యింతవరకొక్క కుసుమంకు మాత్రము ప్రచురించి మామిత్రులసహవాసము నఱచితిమి. అంతమాశతృపక్షమువారు కొందరుమమ్ములను స్థానిక పత్రికలమూలమున హెచ్చరించిరి. కొందరుమమ్ములను స్థానిక పత్రికలమూలమున హెచ్చరించిరి. కొందరు సమక్షముననే పరిశీలించిరి. వీనికన్నిటికిని ప్తర్యుత్తరములు వివరముగాతెలిపి యున్నాము. ఇందుమూలమున మాచందాదరులును, మిత్రవర్గములోని మరికొందరు  వెలమమహాశయులును, మాయార్ధిక లోపమును గ్రహించి మాకన్నివిధముల సహాయమొనర్చి, తిరిగి కార్యనిర్వహణం క్రియారూపముదాల్చుటకు తోడ్పడినందుల కెంతయు శ్లాఘించుచున్నాము.
    క్షాత్రకాలపు హింద్వార్యులు శ్రీయుత మాడపాటి హనుమంతరావు పంతులుగారు వ్యాసరూపమున గ్రంధాలయ సర్వస్వమునందు చిరకాలము క్రిందటనేవ్రాసిరి. మేము మాగ్రంధమాలకొక గ్రంధమువ్రాయుడని ప్రార్ధించినపుడు, శ్రీపంతులుగారు మావేడుకను నిరాకరింపజాలక, యీ గ్రంధము ప్రకటించునెడ జనోపయోగముగానుండునని సలహానిచ్చుచు తమగ్రంధ మును ప్రేమపూర్వకముగ నూకొసం నందులకు వినయపూర్వక

వందనములర్పిస్తూ యున్నాము.

ఈగ్రంధమునందు భారతగాధయందలి యెన్ని యో నిద ర్శనములు స్మరణకు దెచ్చి పూర్వపు యితిహాసములను దృక్పధ మున తెప్పించినవారైరి. గ్రంధము రసవంతముగా వ్రాసిరని నే నంతగావ్రాయుట అనవసరము. ఏలయన శ్రీయుతి మాడపాటి హనుమంత రావు పంతులుగారు విఖ్యాత పురుషులు, ఆంధ్రావనికి చిరపరిచయులు; మరియు జగద్విదితులు “జగమెరిగిన బ్రాహ్మణు నకు జంద్యమే యన్నట్లు" శ్రీ పంతులు గారిని గూర్చి వ్రాయుట ముమ్మాటికీయనవసరము: అయిననుయీసందర్భమిన మ. రా.రా. శ్రీగారిని గూర్చి రెండుమాటలు చెప్పదలచితిని. పంతులుగారు నిజాము రాష్ట్రాంధ్రోద్యమస్థాపకులు. భాషాసేవకులు. దయార్ధ హృదయులు. దేశసేవాదురంధరులు. పరోపకారులు. ఇవన్నియు వ్రాయుటకన్న నిజాము రాష్ట్రాంధ్రమండలమునకు మాణిక్యమ ని యొక్క మాట బల్ది కిన చాలును.

శ్రీయుతులు రాష్ట్రములోని భాషాసంస్థల కొనర్చిన మేలు వ్రాయబూనిన గ్రంధములుచాలవు. పలువిధముల విద్యాభివృద్ధికై పాటుబడుచు తమ జీవితమును దేశసేవకే ధారవోయు చున్నారు.

మాగ్రంధమాల కుసుమము ముద్రణ కాక పూర్వమే యొకఐర్షము పఠనీయ గ్రంథముగా నియమించి మా సంస్థకు గౌరవ మొసంగిన గృహవిద్యాపరి సంఘము (Research University) మాసంస్థకుగౌరవ వారువందనీయులు. కృషిప్రచారిణీ గ్రంధమాలనుండి నిజాము రాష్ట్ర భావ్యభివృద్ధి ప్రబోధకములగు వివిధ గ్రంధ రాజములు వ్రాయించి యుడతాభక్తిని ఆంధ్రభారతీచరణ పూజనొనర్చి కృతార్ధుడ కాదలంచి, మామిత్రుల ప్రోత్సాహమున తొలుదొ సూర్యాపేటయందు మాసంస్థ నెలకొల్పి తిమి. అంతమాపాలి సె ద్దమ్మ మాకడ్డమువచ్చి యెన్ని మోయాటంకములు కలుగజేయుటయేగాక మాసదుద్దేశ్యములు సంపూర్తి నెర వేర్చినది కాదని వ్రాయుటకు మిక్కిలి చింతిలుచున్నారము. నెలకొల్పగనే సూయు ద్యోగ పాశ ుంధములు దేవరకొండ, భువనగిరి, మిర్యాలగూడెం నల్లగొండమున్నగు వివిధస్థలము:లకు యీడ్వబడినవి. నూతోడ నే గ్రంధమాలయు డొల్లగింతలు కొట్టినది. గాని యాయాస్థలములలో గ్రంధమాలకు తగినన్ని సౌకర్యములు లభింపక, మామి త్రులపాలిటి ద్రోహుల మైతిమని చింతులుచుండ మమ్మసగౌరవముగ నాహ్వానించి, మాక్షీగ్రంధమునకు యమః లుస్వహస్త పరహస్తములచే సహాయమొనర్చిన చలగల్లు మత్తేదారు।ుగు మ. రా.రా. శ్రీ. ధర్మా వెంకటజగపతిరావుగాX కృతజ్ఞతకు పాత్రులు. ఇదేరీతి మరికొందరు కొన్ని గ్రంధముల వ్రయము నిచ్చుటకు వాగ్దానము చేసిరి. వారందరును మాయెడ మహోపకారులు,

ఇటులనే పండితమహాశయులనేకులు వారు వ్రాసిన సన్ద్రం ధము: శీత్తుమని తెలిపిరి. ఏదియెటులున్నను గమ్ములదు ఖాబ్ధినుం శ్రీ లేవనె తిరి. ఇంతలోమాగ్రంధమాల ముఖ్యోద్దేశ్యము నెరవేర్చు పెట్లని యోచించుచుండ, విదేశపర్యటన మొనర్చి వ్యవసా యపరీక్షలో కృతార్ధులై అనుభవమును సంపాదించి, ప్రజాహిత కార్యములో నెక్కువగా పాల్గొనుచు ఖ్యాతి చెందిన సంఘసంస్కర్తలగు శ్రీయుత దర్శి చెంచయ్య బి. యస్. డి. గారు వ్రాసిన వ్యవసాయశాస్త్ర చరిత్ర నొసంగుట కయ్యకొనినందులక భినందిస్తూయున్నాము.

మేమో వర్షమునింక శశికళయను నవలయు, అనుబంధముగ జర్మనీయుద్దమును, వ్యవసాయశాస్త్ర చరిత్ర (History of the development of Agriculture) యనుగ్రంధములు ప్రక టించి ప్రధమసంవత్సర కార్యము మఃగింతము. అటు వెనుక పద్మినీ బాయి రెండుభాగములును, వ్యవసాయ చరిత్ర రెండు భాగములు గలసి నాల్గుగ్రంధములు సక్రమముగా చందాదారులకు చేయగలము. చెంద

ప్రధమవర్షగ్రంధములు శివరాత్రికిని, ద్వితీయవర్షపొ త్త ములు ఉగాదికిని పంపగలము. మాకుస్వంత ముద్రణాలయము లేనికతమున యిట్టివిరామమునకు హేతువైనది. ఇకముందునిగా మము లేక సక్రమపద్ధతుల గ్రంధమాల నిర్వహింపగలము. ఈ విషయమున మాకు వర్తక సోదరులునగు శ్రీయుతయామారామ నర్సయ్యగుప్తగారు కుడిభుజను గనిలబడి తోడ్పడినందుల కెంతయు ప్రశంసించుచు, మాయెడ విశ్వాసముంచుడని మాచందా వారుల నింకొకమారు ప్రార్ధించుచు, నింతటితో మాస్వవిషయ మును విరమించుచున్నాము. సూర్యాపేట 2 891-8-SE విధేయుడు, పువ్వాడ వెంకటప్పయ్య, సంపాదకుడు.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.