కోపమా సామి యేమిర - కోపమా
పల్లవి:
కోపమా సామి యేమిర - కోపమా ॥కోపమా॥
అనుపల్లవి:
ఆపరాదుర మోహము పరి - తాప మందెర దేహము, నను
రాపు జేయుట ద్రోహము నీ - రూపమైన జూపవేమిర ॥కోపమా॥
చరణ:
వాదమా సామి నాతో - వాదమా
లేదురా బలవంతము - ఇదికాదురా యొక పంతము, సడి
రాదురా అత్యంతము నీ - మీది తమితో నేమి తోచదు ॥కోపమా॥
వీడరా మోడి నాపై - వీడరా
ఆడుదానిరా దోసము కా - పాడరా పరిహాసము, నిను
గూడని నావేసము మా - టాడనైన గూడదటరా ॥కోపమా॥