కోదండరాములు
ధన్యాసి రాగం తిశ్ర ఏక తాళం
ప: కోదండరాములు మముగన్న వారు
కుదురుగ మము పెంచి విడనాడలేరు || కోదండరాములు ||
చ 1: ముదముతో కూడుకొని తమ్మునితోడ ఖలులు
బాధించు వేళ నాకు భక్తి తోడు || కోదండరాములు ||
చ 2: సీతారమ నామములే మా జిహ్వయందు - యమ
దూతల పారద్రోలు దొడ్డమందు || కోదండరాములు ||
చ 3: పట్టాభిరాముల చేపట్టి నాము మేము
గట్టిగ యమునికి నామమిడి నాము || కోదండరాములు ||
చ 4: ప్రేమతో భద్రగిరీశ రామదాసుని
రామస్వామి వేగ రక్షింపుమయ్యా || కోదండరాములు ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.