కాశీయాత్ర చరిత్ర/మొదటి ప్రకరణము

శ్రీరామజయము.

శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారి

కాశీయాత్రచరిత్ర

మొదటి ప్రకరణము.

జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింప దలచి నన్ను నేలుచున్న సూప్రీంకోరటు [1] దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830 సంవత్సరము మే నెల 18 వ తేది కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము జేరినాను. అది తండయారువీడులోనుండే నాతోటకు 3 గడియల దూరము, కీనీరుభూమి, మధురమయిన జలసమృద్ధి గలది. ద్రావిడ వైష్ణవుల నివాసము. వారు సమిదెలు వగయిరాలు చెన్నపట్టణములో అమ్మి జీవింపుచున్నారు. దోవలో ఉప్పుకయ్యయున్నది. అందులో కాక్రయన్ దొర పడవలు నడిచే పాటికాలువ తొవ్వించి వారధులు కట్టించి యున్నాడు.

19 తేది ఉదయాన అక్కడనుండి పాలవాయి సత్రము మీదుగా వెంకటేశ నాయడి సత్రము చేరినాను. అది శిథిలమై యున్నది. తటాకమున్నది. అంగళ్ళు గలవు. అది మాధవరమునకు 5 గడియల దూరము. దోవనరాళము. బండ్లు నడుచును. ఆ రాత్రి పెద్దపాళెము చేరినాను. దోవలో కొరతలేరు దాటవలెను. దగ్గిర దగ్గిర గ్రామాలున్నవి. బాట నరాళము. ఆ పాళెములో శక్తిరూపములో పరమాత్ముడు తామస పూజల నంగీకరించి లోకుల కిష్టసిద్ధిని జేయుచున్నాడు. ఆ శక్తి చిన్న లింగము జూడగా భూమిలో నుద్భవించి యున్నది. ఆ గుడి బహుచిన్నది. శూద్రపూజ. ఆ పాళెము అరణ్య నదీ తీరము. వాసయోగ్యము. బ్రాహ్మణాగ్రహారము, శివాలయము, పలపట్రల యిండ్లున్నున్నవి. ఈ పాళెము, పై సత్రానికి ఆమడదూరము. 20 తేది పగటిమీద నక్కడనుండి తర్లి రాత్రి తిరువళ్ళూరు చేరినాను. దోవ సరాళము. మళ్ళీ కొరతలేరు దాటవలెను. దోవలో వెంగలియనే గ్రామమువద్ద సత్రమున్నది. తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని యనే తీర్థమున్నది. అందులో ప్రాథః నెలవారు బెల్లము వేయుచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహా ప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది వేట స్థలము. అన్ని వస్తువులు దొరుకును. అదిపై పాళెమునకు 24 ఆమడ దూరము.

21 తేది పగటిమీద రామంజేరి మార్గముగా రాత్రి కనకమ్మ సత్రము జేరినాను. 2 ఆమడమూరము. దారిలో నొక నది దాట వలెను. రామంజేరి వద్ద దోవ రాతిగొట్టు; మిగత సరాళము. ఆ సత్రము బొమ్మకంటి శంకరయ్య కట్టించినది. వేట స్థలము. కోమట్లు సంపన్నులు. అగ్రహార మున్నది. అది మొదలుకొని కార్వేటినగరము వారిసీమ సత్రపు కోనేటినీళ్లు లెస్సయున్నవి.

22 తేది పగలు బుగ్గగుడి చేరినాను. బాట సరాళము. 1 ఆమడ. పుణ్యక్షేత్రము. శాశ్వతముగా మూడు జలధారలు - గంగా యమునా సరస్వతు లనిపించుకొని గుడికింద స్రవించి అరణ్యనదిలో బడుచున్నవి. కాశిగుడిరీతిగా మూర్తులకు పేర్లుగలిగియున్నవి. దగ్గిర గ్రామములు, యిండ్లు లేవు. పదార్థములు దూరమునుండి తెచ్చుకొని గుడివద్ద తోపులో వంట చేసుకొనవలెను. రమ్యప్రదేశము. అరణ్య నదీతీరము. ఆ రాత్రి నగిరె మీదుగా పుత్తూరు చేరినాను. 1 ఆమడ దురము. నగిరెవద్ద కనమ దాటవలెను. అది రాతిగొట్టు బాట. 4 గడియల దూరము ప్రయాస; అవతల సరాళము. నగిరె పేట స్థలము. ముసాఫర్లకు అన్ని వస్తువులు దొరుకును. అక్కడ వెంకటేశ నాయుడి కొడుకు గొప్ప సత్రము కట్టను యత్నము చేయుచున్నాడు. పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రమున్నది. బ్రాహ్మణులకు గోసాయిలకు బైరాగులకు ---- యిచ్చుచున్నారు. అక్కడ కుంఫిణీవారు దొరలకు ముసాఫరుఖానా కట్టియున్నారు. చిన్న పేట స్థలము. రమ్య ప్రదేశము. చుట్టుకొండ లున్నవి. కావలసిన వస్తువులు దొరుకును. బ్రాహ్మణుల యిండ్లున్నవి. మంచినీళ్ళ గుంటయున్నది.

23 వ తేదీ అంజాలమ్మ కనమదాటి వడమాలపేట సత్రము చేరినాను. ఆమడదూరము, అక్కడి కనమ రాతిగొట్టయినా నడచుట నిండా ప్రయాసగాదు. అక్కడ అంజాలమ్మ అనే శక్తి ప్రతిమ పందిటికింద యుంచబడియున్నది. అందులో పరమాత్మ చతన్యము ప్రతిఫలించి ప్రార్తించినవారి యిష్టసిద్ధిని జేయుచున్నది. బాటసరాళము. ఆసత్రము కొల్లాపెద్దసామి శెట్టి కట్టించినది. విశాలముగా నున్నది. బ్రాంహ్యణులకు మాత్రము సదావృత్తి యిచ్చుచున్నారు. వేటబస్తియైనది. కోమట్లు విస్తదించి యున్నందున వారు విరాళమువేసుకొని గోసాయిలకు బైరాగులకు సదావృత్తి యిచ్చున్నారు. తద్ద్వారా సత్రమునకు యశస్సు కలిగియున్నది. కనకమ్మ సత్రము మొదలుకొని యిదివరకు కార్వేటి నగరమువారి సీమ. ఆరాత్రి అలమేలు మంగాపురము మీదుగా దిగువ తిరుపతి చేరినాను. ఆమడదూరము. దొవలో సువర్ణముఖి యనే నదియున్నది. బాటసరాళము. కొంతదూరము చెరువు కట్టమీద నడవవలెను. దోవలో కొన్నిబస్తీ గ్రామములునవి. అక్కడ 2 దినములుంటిని. అందులో నొకనాడు వెంకటాచలపతి దర్సనార్తమై కొండయెక్కి దిగినాను. మరునాడు కపిలతీర్ధములో సమారాధన చేసినాను. దిగువ తిరుపతిలో గోవిందరాజులగుడి కోదండరామస్వామి గుడియు నున్నవి. రామస్వామి గుడికి సరకారు కుమ్మక్కు కొంచమైనాలేదు. గోవిందరాజులగుడి ఆచార్యపురుషుల అధీనముగానున్నది. అయినా సర్కారు విచారణకలదు. త్రిమతస్తులయిండ్లు 200 దనుక గలవు. గురునాధశెట్టి స్మార్తులకు అన్నసత్రము పెట్టియున్నాడు. మునియప్పపిళ్ళ 12 మంది చిన్నవాండ్లకు పాఠకశాల యేర్పరచి అన్నంపెట్టి వేదము చెప్పించుచున్నారు. చందులాలా* వగయిరా ముగ్గురు పుణ్యాత్ములు గోసాంఖాలు వగైరాలకు సదావృత్తి యిచ్చుచున్నారు. మూడు రామానుజ కూకటములున్నవి.


  • చందూలాళ్ హైదరాబాదులో దివాన్ పేష్కారు. వాటిలో వైష్ణవులకు ప్రతిదినము ప్రసాద మిచ్చుచున్నారు. తిరుపతి భారీగ్రామము. అన్ని వస్తువులు దొరుకును. అన్ని పనివాండ్లు కలరు. పంగులూరు గురునాధ శెట్టి వగైరా సాహుకార్లు వున్నందున షహరుస్థలము రీతిగానున్నది. కోతుల తొందరకలదు. సరసింహ తీర్ధజలమే సానార్హముగాని వేరే లేదు. 2 గడియల దూరములో కపిలతీర్ధమున్నది. అది రమ్య ప్రదేశము. గంగధార సదా పడుచు కింది తటాకముగా నిలిచియున్నది. చుట్టు విశాలమైన మంటపము కట్టియున్నది. అది బ్రాహ్మణ సమారాధనకు యోగ్యమయినది. ఆచుట్టుపక్కల దేశస్థలములలో చందులాలా ధర్మములు నిండాగా జరుగుచున్నవి. గాలి కాలము గనక కొండమీద నొక్క పగలుంటిని. దిగువతిరుపతికి కొండమీద స్వామిగుడి 14 ఆమడ. గాలిగోపురమువరకు నెక్కడము, దిగడము బహుప్రయాస. ఆవల కొంతభూమి సమముగా నున్నది. మళ్ళీ యెక్కడము, దిగడము కలిగియున్నా అంతప్రయాసకాదు. దారిలో నిలుచుటకు జలవసతి గల మంటపాలు చాలాగలవు. గాలిగోపురము వద్ధ నొక్క బైరాగి శ్రీరామవిగ్రహపూజ చేయుచు, వచ్చినవారికి మజ్జిగ మొదలైనవి యిచ్చి ఆదరించుచున్నాడు. వెంకటేశ్వరునికి ప్రార్థనలు చెల్లించే లోకులవలన కొంఫిణీవారికి సాలుకు సుమారు లక్షరూపాయీలు వచ్చుచున్నవి*, కొండమీద యేధర్మ కార్యము చేసుటకున్ను

  • నూరేండ్లనాటి దేవాదాయాలు, ధర్మాదాయాలు:- ఇంగ్లీషు వర్తక కంపెనీవారు మనదేశాన్ని ఆక్రమించిన తరువాత చాలాకాలం వరకు హిందువుల దేవాలయాలను తురకల మశీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్యయంగా పరిపాలించేవారు. దీనిని గురించి కొన్ని కట్టుబాట్లు చేస్తూ క్రీ.శ. 1810 సం|| వంగరాష్ట్రములో నొక శాసనం చేశారు. అలాగే మద్రాసులో 1817 వ సంవత్సరపు 7 వ రెగ్యులేషను అనబడు చట్టాన్ని శాసించారు.. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతోపాటు జిల్లాకలెక్టర్లే వసూలుచేసి దేవుడి ఉత్సవాలు, అర్చనలు, భొగాలు స్యయంగా జరిపించేవారు. మిగిలిన సొమ్ము కుంపినీ వారి ఖజానాలోకి చేరేది. ఈ కలెక్టర్ల పైన రివిన్యూ బోర్డువారికి పై తనిఖీ అధికారం వుండేది. మనదేశంలో ఇంగ్లీషువారి అధికారం బలపడినకొద్దీ దేశ ప్రభుత్వంలో క్రైస్తవ మిషనరీల పలుకుబడి ఎక్కువ కాసాగింది. ఈక్రైస్తవుల ప్రభుత్వం ఇలాగ హిందువుల విగ్రహారాధనను, తురకల మశీదులను ప్రోత్సహించడం అసభ్యంగా వున్నదని మిషనరీలు ఇంగ్లాం సర్కారుకు రూక యివ్ఫవలెను. అచ్చట పర్మాత్ముడు సంపూర్ణ కటాక్షముతో లోకుల పాపములను వారివిత్తముగుండా హరించి యిష్టసిద్ధిని చేయుచున్నాడు. కొండమీద శ్రీనివాసమూర్థి దివ్యమంగళంగా నున్నది. దేవతలో దేవతలంతవారో, పూర్వము ఆమూర్థి ని ఆరాధించినట్టుతోచుచున్నది. అచ్చట గోసాయి, బైరాగులకు గురుపీఠముగా నుండే మహంతుమఠమొకటి అతి విశాలముగా కట్టియున్నది. ఆమహంతుకు శిష్యార్జన విశేషించి కలదు. కొండమీద యిండ్లు సంకుచితములుగా నున్నవి. చైత్రము మొదలు జ్యేష్టమువరకు ఉదయాన చలిగాలి కొట్టుచున్నది. దానివలన శీత జ్వరాది రోగములు పుట్టుచున్నవి. కోతుల తొందర హేచ్చు. అడవి పందులు నిదుపద్రవముగా మనుష్యులనడుమ సంచరింపుచున్నవి. గాలి కాలములో మనుష్యులు నిండా కొండమీద నుండరు.

30 తేదిరాత్రి ఆమడలో నున్న కరకంబాడు చేరినాను. తిరుపతి వగైరా వూళ్ళ కానలికిగాను ఆ కరకంబాడున్ను, యింకాకొన్ని గ్రామాలున్ను అచ్చటి పాలెగానికి కుంఫిణీవారు జారీగా నడిపించు


మేలో ఆందోళన చేయగా 1833 మొదలు కుంపినీవారు దేశీయ మతములతో జోక్యం కలిగించుకో గూడదనే భావంతో ప్రవర్తింపసాగినారు. గాని తిరుపతి జగన్నాధం మొదలయిన దేవస్థానాల పరిపాలన మాత్రం ఎప్పటిలాగునే కుంపిని ఉద్యోగులు నిర్వహింఛేవారు. తుదకు 1843 లో కుంపినివారు తమవశంలో వుండిన దేవాలయాలను మశీదులను కొందరు ప్రయివేటు వ్యక్తులకు కొన్ని సంఘములకు ఇచ్చివేశారు. ఆ ధర్మాదాయముల తాలూకు తమవద్ద నిల్వ యుండిన లక్షలాది ద్రవ్యం మాత్రము ఇచ్చివేయలేదు. ఆసందర్బంలోనే తిరుపతి దేవస్థానాన్ని అప్పటి మహంతుకిచ్చారు. అంతట ఈ ధర్మాదాయాలు, సరియైన సట్టుబాటులేక పాడైనాయి. ఈ ధర్మాలు స్శిస్తూవున్నా ధర్మకర్తలు సొమ్మును ఎంత దుర్వినియోగం చేస్తూవున్నా కుంపినీవారు జోక్యం కలిగించుకోకుండా వుపేక్షించారు. 1817 వ సంవత్సరపు శాసనమునుబట్టి వానిని, సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యతను గాలికి వదలివేశారు. ఈఅరాచకం ఇరవై సంవత్సరాలు జరిగింది. తరువాత 1863లో ఒక క్రొత్త ధర్మాదాయములచట్టం శాసింపబడింది. ఈ చరిత్రంతా 1871 లో మద్రాసు గవర్నరు కవుంచిలు మొదలైన వెంబాకం రామయ్యంగారు వ్రాసియున్నారు. (31-12-1872 తేదీగల మద్రాసు గవర్నమెంటు జుడీషియల్ ప్రొసీడింగ్సు చూడండి) చున్నారు. ఆయూరు వసతిగాకపోయినా అవతల మహారణ్యము గనుక విధిలేక అక్కడ దిగవలసి యున్నది. పోష్టాఫీసు వున్నది. యధోచితముగా వస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది.

31 తేది 2 గంటలకు శెట్టిగుంట చేరినాను. దోవ మహారణ్యము, రాతిగొట్టు, మిక్కిలి దొంగలభయముగలది. నడమ మామండూరు కృష్ణాపుర మనే రెండు పాలెగాండ్ల వూళ్ళున్నవి. వారిసహాయములేక మాతుబర్లు నిర్భయంగా ఆ యడవిదాటలేరు. కలకటరు ఆదోవను నిర్భయంగా చేయను చేతగాక నున్నారు. మామండూరుకి ఈవల 8 గడియల దూరాన బాలపల్లె యున్నది. అది మొదలు కడపజిల్లా సరిహద్దు. బాలపల్లెలో ముసాఫరుఖానాయున్నది. ఆభూమి జలము బహురోగప్రదము. అచ్చట రెండుమూడు నదుల వంటి కాలువలు దాటవలెను. కనమ యొకటి దాటవలెను. భాట బహురాతిగొట్టు. ఎక్కుడు దిగుడుగా నున్నది. అక్కడ బహు దట్టమయిన వెదురడవి. ఆ శెట్టిగుంటలో మంచినీళ్ళు చెరు వున్నది. రెండు బ్రాహ్మణుల యిండ్లున్నవి. పేటస్థలము అన్నివస్తువులు దొరకును. బాలపల్లె మొదలుకొని కడప కలకటరు అడవికొట్టి బాట వెడల్పుచేసి అక్కడక్కడ ఠాణా లుంచియున్నారు. కరకరంబాడి నుండి ఆ పాళెగాండ్లను మంచితనము జేసుకొని యిరువైమంది తుపాకీల వారిని శెట్టిగుంట దనుక తెచ్చినాను. నాడు 3 ఘంటలకు శెట్టిగుంట విడిచి ఆమడదూరములో నున్న కోడూరు వద్దనుండే అగ్రహారమువద్ద సత్రము జేరి నాను. కోడూరు బస్తీ. పేటస్థలము ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్కణ గృహములేదు. పై యగ్రహారమందు యేమిన్ని దొరకదు. అంగళ్ళులేవు. ఆ బ్ర్రాహ్మణులు పరోపకారులుగాదు.

జూన్ 1 తేది 5 ఘంటలకు లేచి ఆమడ దూరములో నున్న వోరంబాడు 9 ఘంటలకు చేరినాను. అది పేటస్థలము. అన్నివస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది. బాటసరాళము. శెట్టిగుంటనుంచి కోడూరికి అదివిలో దండు భాట యొకటి పోవుచున్నది. పల్లెలమీదుగా కాలిబాట యొకటి పోవుచున్నది. కాలిభాటలో సనా రీలు రావచ్చును. అడివిభయము కోడూరితో సరి. అవతల భూమి తెరపగా నున్నది. దగ్గిరదగ్గిర గ్రామాలు, పైరుపొలాలు, జలసమృద్ధిన్ని భాటలో కలిగియున్నవి. అంతటయున్ను చింతచెట్లు గలవు. బాలపల్లె వద్ద కొండవాగు నీళ్ళు నాబోయీలు వగైరాలు తాగినందున నొక బోయిన్ని, ఒకకావటివాడున్ను జ్వరము తగిలి ఖాయిలాపడిరి. గనుక దగ్గిరి నోరంబాడిలో మధ్యాహ్నము నిలిచినాను. పై బాలపల్లెనది వాగువద్ధ శ్రీనివాసమూర్తిపాద మొకటి చేసియున్నది. అక్కడనుంచి పడమటి దేశస్థులు కొండ యెక్కుచున్నారు. ఆదినము 3 ఘంటలకు లేచి 2 గడియల దూరములో నున్న పుల్లంపేట గడియు ప్రొద్దు ఉండగానే చేరినాను. అది పేటస్థలము. ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్మణుల యిండ్లు గలవు.

2 తేది రాత్రి 3 ఘంటలకు లేచి 2 ఆమడ దూరములో నున్న నందలూరు చేరినాను. భాట సరాళమే. ఊరివద్ద చెయ్యా రనే నది గడియ దూరము వెడల్పు గలిగియున్నది. నదికి నిరుపక్కల గుళ్ళున్నవి. అది పుణ్యక్షేత్రము. పరశురాముని మాతృహత్య నినర్తించిన స్థలము. అక్కడికి 2 ఘడియల దూరమందు అత్తిరాల యనే మహాస్థలము అగ్రహారసహితముగా నున్నది. ఊరు తురకలతో నుండియున్నది. మొసాఫరుఖానాకలదు. పేటస్థలము, సకల వస్తువులు దొరుకుని. బ్రాంహ్మణుల యిండ్లు వసతిగా నున్నవి. ఆదిన మంతయు అక్కడనే యుంటిని.

3 తేది రాత్రి 2 ఘంటలకు లేచి 9 ఘంటలకు 2 ఆమడ దూరములో నున్న భాకరాపేట చేరినాను. దోవమంచి దయినను రాతిగొట్టు. కొండపక్కను భాట పోవుచున్నది. పొడిచెట్లు అడివి, దోవలో వొంటిమిట్ట యనే గ్రామమున్నది. అక్కడ నాల్గు పక్కల కొండలే కట్టగా గల్గిన యొక్క భారీ చెరువున్నది. చెరువు కట్టమీద భాట. ఆ వొంటిమిట్టలో చూడ వేడుకలయిన గుళ్ళున్నవి. ముసాపరుఖానా యున్నది. బస్తీ గ్రామము. ఆ భాకారాపేట పేటస్థలము. అన్ని వస్తువులు దొరుకుని. అంతటా రాళ్ళున్నవి. వసతి యయిన బ్రాహ్మణ గృహములేదు. నాడు 3 ఘంటలకు లేచి రాత్రి 2 ఘంటలకు కడప చేరినాను. దారిలో కొండలు, కనమలు దాటవలెను. దారి బహు రాతిగొట్టు; జలవసతి లేదు. కడపలో 4 దినము లుంటిని. ఆది మంచి పట్టణ మనబడి యున్నది. అన్నిపనివాండ్లు గలరు. జిల్లాకోరటున్ను కలకటరుకచ్చేరి గలవు. ఆయాయిలాకా మనద్దీలు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దగ్గిర నది యున్నది. ఊరి నడుమ నొక బుగ్గ యున్నది. ఇండ్లు సంకుచితములు. ఊరివద్ద నొక రెజిమెంటు ఉన్నది. అందులో ఆ యిలాకా దొరలు కాపుర మున్నారు. మరియొక పక్క సీవిలు దొరలు కాపుర మున్నారు.

7 తేదీ ఉదయాన 5 ఘంటలకు కడప విడిచి 9 ఘంటలకు పుష్పగిరి చేరినాను. దోవ సరాళము. కడపవద్ద నొక నది దాటవలెను. అది వాన కిరిసినప్పుడు అతివేగముగా ప్రఫహించి వెంటనే తీసి పోవుచున్నది. పుష్పగిరి పుణ్యక్షేత్రము పినాకినీనదీ తీరము. నదిగట్టున కొండ వెంబడిగా రమణియమైన యొక దేవస్థల మున్నది. అది హస్థినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్థ పీఠాధిపరి యయిన పుష్పగిరి స్వాములవారు అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. భ్రాంహ్మణ గృహములున్నవి. అక్కడి బ్ర్రంహణులు కొంత వేదాంతవిచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకున్ను పేటకు పోవలెగాని, అక్కడదొరకవు. నదిదాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నదిదాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది. ఆదినము 3 ఘంటలకు బయలుదేరి కొన్ని పినాకినీ నది కాలువలు దాటి 5 గడియల దూరమందున్న కాజీపేట చేరినాను. బాట నిండామంచిదికాదు. అది పేటస్థలము. వసితిగా నుండే యిండ్లు లేవు. అయినా బ్ర్రాంహ్మణులున్నారు. 8 తేది రాత్రి 3 ఘంటలకు లేచి 14 ఆమడలో నున్న దువ్వూరు 9 ఘంటలకు చేరినాను. దోవలో అడివిలేదు. బయలు పొలము లెస్సగా నున్నది. ఆ గ్రామములో వసితిగా నున్న యిండ్లు, చావిళ్ళు గలవు. చేరినట్టు పేటయున్నది. అక్కడ అన్ని వస్తు వులు దొరుకును. అదివరకు కడపజిల్లాలో చేరినభూమి. ఆ యూరు 3 ఘంటలకు వదిలి 5 గడియల దూరమందున్న వంగలి గ్రామమును గడియ ప్రొద్దుగద్దనంగనే చేరినాను. అక్కడ గొప్ప యిండ్లు, చావిళ్ళున్నున్నవి. దగ్గిర పేటగలదు. అదికందనూరు వబావగారిది. రూపశింగనేసరదారుల్ని కొలువుకు గాను, ఈగ్రామము వగైరా కొన్ని యూళ్ళు జాగీరుగా నివ్వబడినవి. దువ్వూరు మొదలుకొని ప్రతి గ్రామమందున్న కొండ కరంకలవాండ్లు ఇనపరాళ్ళతో నినుము జేయుచున్నారు.

9 తేదీ వాననుంచి మధ్యాహ్మము వరకు నిలచి 12 ఘంటలకు బైలుదేరి దారి చూపను అచ్చటి వారిని తీసుకొని అరగడియ ప్రొద్దుకద్దనంగనే 14 ఆమడలో నున్న అహోబళ క్షేత్రమును చేరినాను. గోప సరాళము. అడుగడుగుకు గ్రామములున్నవి. ఒక చిన్న నదిన్ని, వాగుకాలువలున్ను దాటవలెను. అయితే అడివిభూమి. ఆక్షేత్రమందు యెగువ అహోబళము, దిగువ అహోబళమని రెండు స్థలములు ఒకదాని కొకటి 4 గడియల దూరమందున్నవి. నడమ చీకటిగల యడివి. యెగువ అహోబళానికి పైన కొండమీద ఉక్కుస్తంభమని చెప్పబడే స్తంభముగల పుణ్యక్షేత్రమున్నది. అక్కడి అడవి నడుమ కాలిబాట. ఒక సవారిన్నిపోదు. అది నరసింహ్వమూర్తి ఉద్బవించిన స్థలము. దిగువనను, యెగువనను నరసింహమూర్తి ప్రతిమ లనేక యవనరాలుగా చేసి బెట్టి ఆరాధింపుచున్నారు. ఈస్థలము కుంభకోణము వద్దనుండే అహోబళంజియ్యరువారి యొక్క అధీనము. వారి ముద్రకతన్ అహోబళానకు రెండు కోసుల దూరమందున్న బాచపల్లెలోనిండి ఆస్థల విచారణ జేయుచున్నాడు. ఆముద్రకతన్ యెగువ దిగువ స్థలములలో అర్చన చేసే అర్చకుల కిద్దరికిన్ని అప్పుడప్పుడు నెల 1 కి 6 రూపాయిలు జీతము యేర్ప రచుచు వచ్చుచున్నాడు. గుడి ఖర్చులకు జియ్యరు పంపింఛే అయివజు దప్ప మరియే అకరమున్ను లేదు. రాజా చందులాలా* యీస్థలానకు ప్రయాధన్ మైన సాలుకు రూపాయలు ఇప్పింపుచున్నాడు. యెగువ అహోబళానకు


  • రాజా చందులాలా హైదరాబాదు నివాస పేష్కారు. సవారీలు వెళ్ళడము ప్రయాస. దిగువ అహోబళములో శూద్రగుడిశెలు కొన్ని యున్నవి. యెగువ అవిన్నీలేవు. జనులు దేవాలయములందే దిగవలసినది. చీకారణ్యప్రదేము. మృగభయము గలదు. జలము రోగప్రదము. మనుష్యులు నివసింపను భయపడుచున్నారు. దేవస్థలలు శిధిలము లయినందున జెల్లేడు, పల్లేరు మొలచి యున్నవి. అచ్చట ఫాల్గునమందు బ్రంహ్మోత్సవము. అప్పుడు జనులు వచ్చుచున్నారు. ఉత్సవకాలమందు 200 వరహాలు హాళ్ళీలు వసూలవుచున్నవి. వాటినంతా కందనూరి నబాబు పుచ్చుకొని వెనక గుళ్ళ సంగతినే విచారింపడు. ఈ స్థలములలో ప్రతిఫలించి యున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశముచేత లోకులకు భక్తిని కలగ చేయుచున్నది గాని, అక్కడ నడిచేయుపచారములు దానికి నేపాటిన్ని సహకారిగానుండలేదు. ఈ 2 స్థలములలోను న్నొక వస్తువున్ను దొరకదు. ఉప్పుతో తొమ్మిదిన్ని బాచపల్లెలో నుంచి తెచ్చుకోవలెను. ఆ రాత్రి అక్కడ నిలిచినాను. బాచపల్లె కుంఫిణీ వారిది. మంచి గ్రామము.

20 వ తేడి పగలు 12 ఘంటలకు గిదువ అహోబళములో నిలిచి చేతనున్న వస్తువులతో నక్కడి బింబములను ఆరాధించి 1 ఘంటకుప్రయాణమై 6 ఘంటలకు శ్రీరంగాపురము చేరినాను. అది 14 ఆమడదూరము. దోవ సరాళము. మిక్కిలి అడివి. పడమరుద్రవఠమనే బస్తీగ్రామ మున్నది. అది కడపజిల్లాలో ఛేరినది. గొప్ప ఫేటస్థలము. కావలసిన వస్తువులు దొరుకును. సరాబు అంగళ్ళు, బ్రాహ్మణ గృహములు గలవు. శ్రీరంగాపురము చిన్నది; బస్తీగ్రామం; కొంఫిణీవారిది; ఇండ్లు చిన్నవి; ఉదకసౌఖ్యములేదు.

22 తేది రాత్రి 3 ఘంటలకు లేచి 8 ఘంటకు ఆమడలో నున్న మహానంది యనే మహాస్థలము చేరినాను. దోవసరాళము. మహాదేవపురము, బసవాపురము అనే బస్తీ గ్రామములు దోవలో నున్నవి. ఆ మహానంది చీకారణ్యములో నున్నది. కొండ సమీపము గుడి చుట్టు సకలవృక్షములు నున్నవి. గుడి సమీపమున ఒక గుడిశయున్నులేదు. అన్ని వస్తువులు జననాపురమునించి తెచ్చుకొనవలెను. నిప్పు దొరకటమున్ను ప్రయాస. అచ్చట రాత్రిపూట మనుష్యులు నిలవరు. ఆ గుడిలో లింగమునకు దిగువగుండా తీర్థము స్రవించి ఒక తొట్టెలో నిలిచి అవతల ప్రవహింపుచున్నది. గుడి తీర్థము రమణీయ్య మైనది. శాస్త్రసిద్దమైన స్థలము. అర్చకుడు తంబళమువాడు. వచ్చినావారు తామే యీశ్వరుని అభిషేకము చేసి పూజింపు చున్నారు. అర్చకుడు ప్రతిదినమున్ను ఉదయమయిన జాముకు వచ్చి గర్భగృహము తలుపు తెరుచుచున్నాడు. గోసాయీలున్ను బయిరాగులున్ను 2, 3 దినములు ఆ స్థలమందు నిలిచి పునశ్చరణ చేయుచున్నారు. అక్కడ 2 ఘంటల దనుక నుండి రాత్రి ఆమడదూరములో నున్న బండాతుకూరు సాయంకాలమునకు చేరినాను. దోవ రేగడభూమి. ముండ్లు విస్తరించి యున్నవి. దోవలో నొక చిన్న నదిన్ని, మరికొన్ని కాలువలున్ను దాటవలెను; అడివి లేదు. ఆ యూరు కందనూరు వారిది. బస్తీ గ్రామము. అన్ని వస్తువులు దొరుకును. ఇండ్లు గొప్పవి. ఆప్రాంతములలో ఆవులకు పాలు పితుకుట లేదు. దూడలను ఆవులతో కూడా మేతకు తోలుచునున్నారు. అక్కడివారికి యెనప పాడి సహజముగా నున్నది. పశువులకు తాము కాపురముండే యిండ్ల కంటే చక్కగా కొఠములు కట్టి బాగా కాపాడుచున్నారు. ఆ ప్రాంతములలో వరిపంట లేదు. పుంజధాన్యములు సమృద్ధిగా పండుచున్నవి. శూద్రులు బాగా కష్టపడి కృషిచేయుచున్నారు. బ్రాంహ్మణులకు భూజీవనము పుష్కలముగా కలిగియున్నది.

21 తేది రాత్రి 4 ఘంటలకు ఆమడలోనున్న వెలపనూరు చేరినాను. దోవ రేగడ, సరాళము, అడివినిండాలేదు. ఇండ్లు గొప్పవి. బట్టల అంగళ్ళు గూడా యున్నవి. సకల పదార్థములును దొరుకును. మంచి బ్ర్రాంహ్మణులున్నారు. గ్రామకరణ మయిన శేషప్ప అనేఅతడు అన్నదానము జేయిచున్నాడు. ధర్మ్మాత్ముడు. నవాబు తరపున ఉద్యోగస్థులు కొందరు ఆ గ్రామములో నున్నారు. ఉదకసౌఖ్యమునిండాలేదు. అక్కడికి ఓంకార మనే స్థలము 8 పరుగుల దూరములో అడవినడుమ నున్నది. ఆ దినము మధ్యాహ్నము 2 ఘంటలకు బయలుదేరి 2 ఘడియల ప్రొద్దు కలదనంగా ఆమడదూరమున నుండే పేంపెంట్ అనే గ్రామము చేరినాను. దోవ అడివి బలసినది. మృగుభయము కలదు. గులక, రేగడ కలసిన భూమి. ఆ యూరు నవాబు యిలాకాలో చేరినది. భెబందు గ్రామము. చిన్నయిండ్లు పదార్ధాలు విశేషముగా దొరకవు.

13 తేదీ వుదయమైన గడియకు బయలుదేరి ఆమడదూరములోనుండే ఆత్మకూరు చేరినాను. భాట మంచిది. అడివి నిండాలేదు. ఆ యూరు కందనూరు నవాబు తాలూకా ఉద్యోస్థులుండే కనుబాస్థలము. ఆ కందనూరు నవాబు తాలుకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్కమేటీకి నొక్కొక్క ఆములుదారుని నేర్పచినాడు, కొంతతాలూకా తన వద్ది నవుకరులకు జీతానికి బదులుగా జాగీరుకా నిచ్చినాడు. ఆ నవాబు, కుంఫిణీకి సుమారు లక్షరూపాయీలు సాలెనా కట్టుచున్నాడు. అతని రాజ్యము భళ్ళారి జిల్లా కలకటరాజ్ఞకు లోబడినది. కలకటరు తరఫున నొక వకీలు కందనూరులో కాపురమున్నాడు. ఆ నవాబు రాజ్యస్థులకు స్వంతముగా నొక ఖాజీకోటు పెట్టి న్యాయవిచారణ చేయుచున్నాడు గాని, జిల్లా కుంఫిణీ కోరటుకు నిమిత్తములేదు. నవుకరులకు జీతము క్రమముగా ముట్టచెప్పడములేదని వదంతిగా నున్నది. అందరికి జీతము బహుస్వల్పము. తాలూకా అములుదారుల మీద అకబరునివీను అని ఒక ఉద్యోగస్థుని ఉంఛియున్నందువలన పనులు హామీ భరాయించి చూడడమునకు నెవరికిన్ని స్రాతంత్ర్యము లేక నున్నది. ఆ యాత్మకూరు దూరము నించి వినడానకు గొప్పయూరు; పేటస్థలము. ప్రతి ఆదివారమున్నుసంతకలదు. సంతలో సకల పదార్ధములు దొరుకునని ప్రసిద్ధి కలిగియున్నది. వచ్ఫివిచారించగా తద్వ్యతిరిక్తముగా నగుపడును. సంతలో ముసాఫరులకు అక్కరలేని పదార్ధాలు విక్రయింపుచున్నారు గాని ఉపయోగించునవి విశేషించి లేవు. ఆయాత్మకూరులో శ్రీశైల స్థలమందలి యాచకులున్ను యాత్రచేయను వచ్చిన వారివద్ద హాశ్శీలు పుచ్చుకునే నవాబు ముసద్దీలున్ను ఉన్నారు. అక్కడికి శ్రీశైలము నాలు గామ డని చెప్పుచున్నారు. ఆ నాలు గామడ దూరములో నడమ కొన్ని యూళ్ళున్నా, పదార్తములు ఎంత మాత్రమున్నూ దొరకవు గనక నక్కడనుంచి బయలు వెళ్ళీనది మొదలు మళ్ళీ ఆ స్థలముచేరేవరకు కావలసిన సామానులన్ని మరచిపోకుండా తీసుకొని పోవలసినది. మరచిన పరార్ధములు తక్కువ పడే యుండును. శ్రీశైలయాత్రకు తీసే హాశ్సీలు కందనూరునవాబుకు చేరుచున్నది. శివరాత్రి ఉత్సవములో శూద్రజనము 1కి ర్పూ 2, గురానికి ర్పూ 5, అభిషేకమునకు ర్పూ 3, వాహనోత్సవము చేయిస్తే ఉత్సవపు సెలవులు గాక గ 3, దర్మణసేవోత్సవమునకు ర్పూ 3. ఈప్రకారముగా పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలమునకు నాలుగు భాటలు. ఎటుపోయినా నీశ్వర సంకల్పమేమో 4 ఆమడదూరము; ఛీకారణ్యమయిన దోవ. ఒక భాట నెల్లూరు మీద నచ్చి చుక్కల పర్వతము నెక్కవలసినది. మరియొకటి కంభం దూపాటి మీదవచ్చి చుక్కలకొండ నెక్కవలెను. మరియొక భాట పడమటి దేశస్థులు కృష్ణానది దాటి రావలసినది. ఆ కృష్ణ పాతాళగంగయని పేరువహించి శ్రీశైలము క్రింద ప్రవహింపుచున్నది. శ్రీశైలమునుంచి ఆగంగకు పోవలెనంటే రెండుకోసుల దూరము. దిగియెక్కవలెను. కొంతదూరము సుళువైన డోలీమీద పోవచ్చును. మెట్లు పొడుగుగనుక నెక్కడము, దిగడము కష్టము. నేను వచ్చిన యీ యాత్మకూరు భాట తప్పమిగతా మూడు భాటలు ఉత్సవకాలములలో నడవవల్సినది గాని తలుచుకొన్నప్పుడు నడవకూడదు. మృగభయము, చెంచువాండ్ల భయమున్ను విస్తరించియుండును. ఆ ఛెంచువాండ్లు అడివి మనుష్యులయినను యాత్రకు వచ్చేవారిని యాచించి తినే వాడికే పడియున్నారు. శివరాత్రి మొదలు చైత్రమాసమువరకు శ్రీశైలము మీద ప్రతిదినమున్ను పల్లకీసేవ అనే ఉత్సవము జరుగుచున్నది. ఛైత్రమాసములో భ్రమరాంబ యనే దేవికి తామసపూజ చేసి శ్రీశైలముమీద వచ్చియుండే జనులు విరామమును బొందుచున్నారు. అటుపిమ్మటనొకరిద్దరు అర్చకులు మాత్రము మార్చిమార్చి ఆయాత్మకూరు నుంచి వచ్చి యుంచున్నారు. ఎక్కువ దినములుంటే అక్కడి నీళ్ళు ఒంటక జ్వరము, మహోదరము, సోభ మొదలయిన రోగములు కలుగుచున్నవి. శ్రీశైలమున గుడికి సమీపముగా 20 చెంచుగుడిశేలున్నవి. వారున్న ఆ గుడిశెలు వదిలి భాద్రపద మాసములో వలస పోవుచున్నారు. అప్పటికి వర్షాకాలము తీరి యీగెల ఉపద్రవము కలుగుచున్నది. అది సహించతగినది కాదు. గుడివద్ద స్వామికి ఆవులు 100 దనుక నున్నవి. కడప విడిచిన వెనుక ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని ఇతర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టుచున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పసువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరుసీమనించి తెచ్చే వారివద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికే గాని అచ్చటి దున్నలు ఆభూమిని నిగ్గి దున్న నేరవు. తడవకు 18-20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. ఆ యాత్మకూరి కాపురస్థులు అనేక పర్షన్ వాండ్లను గొప్ప, చిన్నలను చూచి మెరుగైనవారై యున్నారు. ముసాఫరులకు దేవి యాచకులయిన తెనుగు బ్ర్రాంహ్మణులు రెండిండ్లవారున్ను, స్వామి యాచకుడయిన జంగవాడొకడున్ను - వీరే స్థల మివ్వవలసినది గాని, యితరుల యిండ్లు గొప్పలయినను స్థల మివ్వరు. 2-3 చిన్న దేవస్థలములు, చావిళ్ళున్ను న్నవి. తప్పితే అందులో దిగవలసినది. ఆయాత్మకూరినించి పట్టణపు షవారీల మీద కష్టముగా శ్రీశైలపర్వతమునకు పోయి చేరవచ్చునని తెలియనందుచేత మూడు డోలీలు 2 రూపాయీలకు చేయించినాను. వాటిని నొక దినములో అక్కడి వడ్లవాడు చేసినాడు. అక్కడి రూపాయికిన్ని చెన్నపట్టణపు రూపాయికిన్ని సుమారు కాలురూపాయి భేదమున్నది. పట్టణపు రూపాయి 1 కె అక్కడి రూపాయి12 ఎనిమిదిమంది కూలి బోయీలను అక్కడి వారిని శ్రీశైలమునకు పోయి రాగలందులకు జనము 1 కి రూపాయిలు 4 లెక్కను కుదుర్చుకొన్నాను. నా వుప్పాడాబోయీలను 8 మందిన్ని వారికి సామాను తేను 3 బోయీలనున్ను నాసామాను తేను నాకావటి వాండ్లను ఆర్గురు నిన్ని తీసుకున్నాను. వారి సామనున్ను బంట్రోతులకు నలుగురికి భోజన సామానున్ను తేను ఒక కావటివాని కూడా తీసుకోన్నాను. నాపరివారమైన్ 25 మంది బ్రాంహ్మణులకు 5 దినముల మెనూను (భత్యము) తీసుకొని 25 వ తేది ఉదయాన 3 ఘంటలకు ఆత్మకూరు వదిలి 4 కోసుల దూరములో నుండే నాగులోటి అనేగుడి లో ఘంటకు ప్రవేశించినాను. దోవలో రాధాపురము, కృష్ణాపురము, వెంకటాపురము, సిద్ధాపురమున్ననే గ్రామములున్నవి. బహు చిన్నవి. చెంచు వాండ్లు, యితరులున్ను కలిసి కాపురమున్నారు. ఆ వెంకటాపురము వరకు భాట సరాళము; వెల్లడిగా నున్నది. అది మొదలు నాగులోటి గుడివరకు భాట సరాళమయినా యిరుపక్కలనున్ను దట్టమయిన అడివి. ఆ సిద్ధాప్;ఉరములో చెంచువాండ్లకుగాను నవాబు మనుష్యులు మనిషి 1 కికె 3 డబ్బులు హాళ్ళీలు పుచ్చుకొనుచున్నారు. డబ్బులు అనగా చెన్నపట్టణపు రెండు దుడ్లు. అక్కడ అణాలు, అర్ధణాలు, పావులాలు దొరకవు. అక్కశడ దబ్బులు మార్చి పెట్టుకొని సెలవు చేయవలసినది. అణాకు మూడుడబ్బులవుచున్నవి. ఆడబ్బులు ముందరి పట్నం లింగిశెట్టి దుడ్లవలెనే అరిగిపోయి యున్నవి. ఆ నాగులోటి వరకు సవారీ మనుష్యులున్ను సాధారణముగా పోవచ్చును. నాగులేటిలొ సిద్ధాపురములో కాపురమున్న చెంచువాండ్లు వేటకు రాగా వారింజూడవలసినదేగాని యితరులు పరిష వారికి కనుబడదు. ఆ గుడి మజిలీ చేసి దిగను నయిపు (వీలు) గా జలవసతి కలిగి యున్నది. ఆ గుడి వీర భద్రస్వామిది. ఒక జంగము ఆత్మకూరిలోనుంచి వారానికి 2 ఆవృత్తులు వచ్చిపూజచేసి పొవుచున్నాడు. అక్కడ మధ్యాహ్న భోజనము చేసుకొని 3 ఘంటలకు బయలు దేరి అక్కడికి అయిదు కోసుల దూరములో నున్న పెద్దచెరువు అనే యూరు 9 గంటలకు చేరినాను. నాగులోటి వదిలనది మొదలు కోసేడు దోవపర్యంతము కష్టమయిన కొండ యొక్కుడు, దిగుడుగానున్నది. మెట్లు బాగా కట్టియున్నవి. ఆ కోసెడు మిక్కిలి ప్రయాస. అవతల 2 కోసులు ఎక్కడము, దిగడము లేక పోయినా దోవ రాతిగొట్టుగాను న్నిరుపక్కల దట్టమయిన అడివిగాను నున్నది. సవారీలు వస్తే చెట్లకొమ్మలు వాటికి తగులును. ఆరాతిగొట్టు దారిని దాటిన వెనుక పెద్ద చెరువుదాకా గుర్రపుబండ్లు పొయ్యే పాటిగా, భాట విశాలముగా సమముగా నున్నది. పెద్ద చెర్వునుంచి పచ్చేటప్పుడు రెండుమూడు భాటలు చీలిపోవు చున్నవి. తెలిసిన చెంచుగాండ్లను పిలుచుకొని నాగులోటె చేరవలసినదిగాని స్వతంత్రముగా బోనే తప్పిపోదురు. కుడిచేతి పక్క చీలే భాటలు వదిలి యెడమ చేతిపక్కభాటను పట్టి వస్తే నాగులోటికి రావచ్చును. ఆ పెద్దచెరువు విడిచి శ్రీశైలము చేరేవరకు గాని నాగులోటి వదిలినది, మొదలుచేసుకొనిగాని యెక్కడనున్ను ఆవరణ సంబంధమయిన నీడయున్ను, జలవసతి గల ప్రదేశమున్నులేవు. ఆపెద్దచెర్వు అనే యూరిలో పందులు తోలను చాలేపాటి 20 కిరాతకుల గుడిశలున్నవి. మరి వేరేనీడలేదు. చెరుఫులో రమణియ్యమయిన రామరస పుష్పాలుగల జలము కలిగి యున్నది. చెన్నపట్టణపు కొణ్నూరు నీళ్ళు వదిలిన వెనక నింశపాటి యుదకము నేను చూచినవాడను గాను. అందరున్ను ఆ చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని వానవచ్చునేని ఆ గుడిశలలో కూర్చుండి యుండవలసినది. ఆయూరి చెంచు బోయీలనే కిరాతకులకు నొకడు యజమానుడుగా నాయకుడనే బిరుదు వహించియున్నాడు. వాడు ధర్మ్మాత్ముడు. పరషవారివద్ద నవాబు సరకారుయొక్క ఆజ్ఞప్రకారము మనిషికె 3 డబ్బులవంతున హాశ్శీలు తీసుకొన్నా పస్తుగా నుండేవానికి బియ్యమిచ్చి పాత్ర యిచ్చి వంటచేసుకొనుమని ఉపచరింపుచున్నాడు. ఆమార్గముగా శ్రీశైలమునకు వెళ్ళేవారికి పొయ్యేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ నిస్సందేహముగా విధిలేక మజిలీ చేయవలసి యున్నది. నేను తిరుగుదలై పచ్చేటప్పుడు పదిరూపాయీల్లో నొక చావిడి విశాలముగా కట్టవచ్చునని ఆనాయకుడు మొదలైన వారిగుండా తెలుసు కోంటిని. అక్కడి వాడిక ప్రకారము వెదురు తడికలతో గోడలుపెట్టడము వలన నన్ను, అడివి వెదురు మయంబు నందుననున్న ; అక్కడి వెదురు తడికెలు మట్టి గోడలకంటె ద్విగుణ మయిన బలము కలవి గనుకనున్ను బహు బల మయిన కొయ్యసామాను అతినయముగా దొరుకుచున్నది. గనుకనున్ను వారు చెప్పిన ప్రకార మొక చావిడి కట్టదానకు రూ 20 చాలు నని తోచినది. ఆరాత్రి చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని ఉదయమయిన 4 ఘంటకు బయలుదేరినాను. ఆరాత్రి మిక్కిలి చల్లగాలితో కూడామబ్బు తుంపర పడుచుండెను గనుక నొక బోయిగుడిశె ఖాళీ చేయించి అందులో పండుకొన్నాను.


రెండవ ప్రకరణము

16 రతేదీ అక్కడికి 4 కోసుల దూరములో నుండే శ్రీశైలము 12 గంటలకు చేరడ మయినది. పెద్దచెరువు విడిచి వెంబడిగానే కొండయెక్కను ఆరంభించవలసినది. ఒక్ కోసెడు యెక్కుడు, దిగుడుగా నుంచున్నది. అయితే మెట్లువైపు (వీలు)గా కట్టియున్నవి. నిండా ప్రయాస కాదు, ఇరుప్రక్కలా అడివి. అటుపిమ్మట కోసెడు దూరము సమభూమి. అందులో పొయ్యేదారి రాతిగొట్టుగా నుంచున్నది. అటుపిమ్మట భీముని కొల్ల మనే$ అగాధాఇన కొండ్ పల్లమువరకు కొండ యెక్కుడు దిగుడుగా నుంచున్నది. అక్కడ మెట్లు ఏర్పరచి కట్టియున్నవి. ఆయాగాధ మైన కొండదొవలో నొక వాగు పారుచున్నది. అక్కడ ఆసోదా చేసుకొని కొండయేడుతిరుగుళ్ళు, రెండువేల మెట్ట్లు పర్యంతము, మిక్కిలి పొడుగుగా నెక్కవలసినది. ఆ ప్రదేశములో నెక్కేటప్పుడు, దిగేటప్పుడున్ను వాడికె లేనివారికి చుట్టూ చూస్తే కండ్లు తిరుగును. మెట్లు బాగుగా నెక్కవలసినంత దూరము కట్టి యున్నవి. చుట్టు ఏతట్టు చూచినా నవ్రతములున్నవి. యీప్రకారము రెండుకోసులు ఎక్కిన వెనుక సమభూమిలో రాతిగొట్టు గల మార్గము శ్రీశైల పర్యంతము పోవుచున్నది. ఆ కొండ యెక్కుటుకు, దిగుడుకు తిరుపతి బోయీలు డోలీకి 6 మంది అయినట్టయితే

  1. సుప్రీంకోర్టు చెన్నపట్టణమున క్రీ.శ. 1800 మొదలు 1862 వరకు అనగా మద్రాసు హైకోర్టు స్థాపింపబడువరకు నుండిన ఉన్నత న్యాయస్థానము. దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సహాయ న్యాయమూర్తులు నుండేవారు.