కాశీయాత్ర చరిత్ర/ఐదవ ప్రకరణము

ఇట్టి నియమములంతా స్వతంత్ర ప్రవృత్తి నివృత్తులను కలవి గనుక ఈ ఆచారము ప్రమాదమైనది కాదు. అయినా ఆ స్థలము యుక్తముగా తోచనందుననున్ను, బ్ర్రాంహ్మణ యిండ్లలో జాగా కునందిగనుకనున్ను మరిన్ని వారి యాచారవ్యవహారాలలొ శూద్రులగుండా ఉదకము తెప్పించుకొని వాడుకొనేటట్టుగాకూడా ఉన్నది గనుక నున్ను వాగువొడ్డున డేరాలు వేసి దిగి ఆ యూరిలో ఆ రాత్రి వసించినాను. దారిలో దాకిలి ఘాటుదాకా కొన్ని యూళ్ళున్నవి. మజిలీ చేయడానికి యోగ్యములు కావు. హయిదరాబాదు మొదలుగా మంచి యిండ్లు కట్టుకొనేవారు మట్టిమిద్దె నొక అర యింటికిగాని, కూటానికిగాని వేసి పైన పెంకుల పూరితో నొక కట్టడి యేర్పరచి పైన నెక్కడానకు, ఒక నిచ్చెనగాని, పొడుఘుమెట్లుగాని కట్టి పెట్టుచున్నారు. సాధారణముగా ఇండ్లు కట్టే వారు పెంకులతోను, పూరితోను కట్టుచున్నారు. యెదులాబాదువరకు నుండే పెంకులు దక్షిణదేశములో నీళ్ళకాలువలకు పెట్టే కోవుల మాదిరిగా నుంచున్నది. ఆయూరికి ఇవతలి పెంకులు దక్షిణదేశములో మిద్దెలకు వేసే చదరపు పెంకుల జాడగా నడమ కొంచమువంపు కలిగి యున్నవి.

ఐదవ ప్రకరణము

14 తేది ఉందయాన 7 ఘంటలకు ఈ యూరు వదిలి యిక్కడికి 4 కోసుల దూరములో నుండే నాగపూరు షహరు 10 ఘంటలకు ప్రవేశించినాను. దారి ఘట్టి నల్ల రేగడభూమి; అడివి కలదు. రాతిగొట్టులేదు. బాట కిరుపక్కల కనుచూపుమేరకు చదరముగా నుంచున్నది. నాగపూరు ముందర నగలేరు అనె పెద్దవాగు దాటవలెను. నాగపూరు షహరువద్ద శీతాబులిడి అనే ప్రదేశ మున్నది. అక్కడ రెసైడెంటు ఇల్లు, తోటలు కలుగ జేసుకొని యుంచున్నాడు. చుట్టున్ను కొన్ని ఇండ్లు అంగళ్లు తోటలు న్నవి. చెన్నపట్టణపు కాపురస్తుడయిన వీరాసామిమొదలారి పోష్టాఫీసు రయిటరుగా ఇక్కడ నున్నాడు. గనుక నితో హయిదరాబాదులొ కమ్మిస్సెరియాట్ మ్యానేజరు రామస్వామి మొదలారని విహితపరచు కొన్నట్టే విహితము చేసుకొని అతని గుండా మోతీ బాగు అనే బహువసతి అయిన తోటలో బంగాళాలో దిగినాను.

ఈ నాగపూరు రాజ్యము పూర్వ పూర్వకముగా కొండరాజులది. వారి అడివిని బలము చేసుకొని కొండల దుర్గ ప్రదేశాలను ఆశ్రయించుకొని భాటసార్లు కూడా తమభూమిలో రాకుండా వుండేటట్టు ఘాతచేయుచు ద్విపాతృశువులుగా సకల విధాల నటించి ఈ రాజ్యము ననుభవించు వచ్చినారు. సుమారు 200 ఏండ్లకు మునుపు బుద్ధోజీ అనే అతని పెద్దలు షాహురాజు సుతులు గనుక *[1] పూనా శ్రీమంతునికి షాహురాజు రాజ్యమును దానము చేసి జ్ఞాతులను కొండరాజ్యముల సాధించుకొని శ్రీమంతుని ఆజ్ఞకింద నుండు డని నియమించినారు. ఈ నాగపూరు సమీపర్తి అయిన భూమిని బుద్ధోజీయొక్క పెద్దలు సాధించినారు. తదనంతరము క్షాత్రధర్మము చొప్పున క్రమక్రమముగా ఈ కొండరాజులను పూర్తిగా సాధించి యీ నాగపూరును రాజధానిగా చేసుకొని రాజ్యము చేయుచు వచ్చినారు. షాహురాజు యొక్క మరియొక తెగ జ్ఞాతులు దక్షిణ రాజ్యములో ప్రవేశించి తంజావూరి సీమసాధించి దొరతనము చేయుచు వచ్చినారు. ఆషాహురాజవంశము భోసల వంశమని చెప్పబడు చున్నది. సాతారా అనె షహరు షాహురాజుకు రాజధాని. ఆ షాహురాజును డిల్లీ పాదుషా కూతురు మోహించి వివాహము చేసుకోవలె నని యుండగా ఫాదుషా షాహురాజును చంపినాడు. అతని కొడుకు చిన్న షాహురాజును ఫాదుషా కూతురు పెంచి యీ సాతారాకు రాజుగా చేసెను. వనక రాజ్యము చేయుచున్న అతని వంశస్థులకు పుత్రసంతతి లేనందున ఆశ్రయించి యున్న భ్ర్రాంహ్మణునికి రాజ్యమును దత్తము చేసినాదు. జ్ఞాతులను, కొండ రాజ్యములను పయిన వ్రాసిన ప్రకారము సాధించుకొని తాను రాజ్యదాన మిచ్చిన బ్రాంహ్మణునియొక్క ఆజ్ఞకులోబడి నడుచుకొనుడని ఉత్తరువు చేసినాడు. ఆబ్ర్రాంహ్మడే శ్రీమంతుడు. బుద్ధోజీ రాజ్యతంత్రము చేయగా బహు ప్రబలమయిన దశను పొంది ప్రసిద్దికెక్కినాడు. ఈ బుద్ధోజీ తండ్రి యయిన రఘోజీ అనే అతనికి మరి కొందరు కొడుకు లుండగా వారికి రాజ్యము పంచిపెట్టినాడు. బుద్ధోజీ నాగపూరిని రాజధాని చేసుకొన్నాడు. మరియొక కొడుకు చందా అనే వూరిని రాజధాని చేసుకొన్నాడు. ఇద్దవు రత్నపూరును, నంది గ్రామమునున్ను రాజధానులుగా చేసుకొని రాజ్యము చేయుచువచ్చిరి.

బుద్ధోజీ దినములు మొదలుగా యింగిలీషువారు విహీత రీతిగా ఈరాజ్యములొ ప్రవేశించి అతని కొడుకులయిన రఘోజీ వగైరాలతో యుద్ధ ప్రసక్తి కలగ చేసుకొని కాలు నిలగడ చేసుకొన్నారు. పిమ్మట రాజ వంశస్థులు ప్రత్యేకముగా రాజధానులు కలగ చేసుకొన్న వారిలో కొందరు లయ మయిరి. మిగిలి యున్నవారు ఒకరిని ఒకరు విశ్వాసఘాత చేసి చంపుకొన్నందువల్ల రాజ్యమంతా యేక ముఖమయి తుదను అప్పాసాహెబు అనేవాని అధీనమయినది. అతడు యిక్కడ చేరియున్న యింగిలీషువారిని వెళ్ళకొట్టవలె నని యత్నము చేసినందున దేశ భ్రష్టుడై యిప్పట్లో మృతజీవిగా నున్నాడు. ఇప్పుడు యింగిలీషువారు రఘోజీ దౌహితృనికి పట్టము కట్టే వయసు వచ్చేదాకా రాజ్యతంత్రము తామే విచారింపుచువచ్చి కొన్ని ఖరారుమదారుల మీద విడిచి పెట్టినారు. ఆ చిన్నవానికి రఘోజీ అని పేరు పెట్టినారు. ఆఖరారుల ప్రకారము సం. 1 కి తొమ్మిది లక్షల రూపాయీలు కుంఫిణీవారికి కట్టవలచినది. వీరి రాజ్యము గత కాలములో తూర్పున కటకము వరకున్ను, దక్షిణమున నరదానది వరకున్నూ పడమట పునా వరకున్ను, ఉత్తరమున జభ్భలపూరు దాకానున్ను ఉండినది. రఘోజీ దినములు మొదలుగా కలహ పడ్డప్పుప్పుదంతా కొంచెము కొంచెముగా తూర్పు దేశోత్తరములను కుంఫిణీవారు ఆక్రమించినారు. అప్పట్లో నాగపూరికి ఉత్తరమున 13 కోసులమీద కొంఫిణీవారు అధికారము గాని నాగపూరు రాజుకు నిమిత్తములేదు. రామటెంకితో నాగపూరువారి రాజ్యపు సరిహద్దు ముగిసియున్నది. యీ నాగపూరి రాజు మరాటీజాతి తంజావూరి రాజు బంధువు. ఆ రాజువంశస్థులు శ్రేయస్కాములయి యుండగా దేవ బ్రాంహ్మాణ పూజ చాలాగా చేయుచు వచ్చినారు. ఈ సరికి కుంఫిణీ వారి కలకటరులు నియమించిన తహశ్శీలుదారులు వగైరాలగుండా రాజ్యతంత్రము గడుచుచున్నది. రాజ్యములో నుండేవారు రాజులకు రాజ్య మివ్వడవల్ల ఏమాత్రమున్ను సంతుష్టిని పొందియుండలేదు. ఈ రాజుకు సాలుకు ఇంతమాత్రమని రూకలు కట్టే జమీందారులు కొందరు ప్రబలులుగా నున్నారు. శీతాబులిడి యనే కొండవద్ద ఇదివరకు రాజుకున్ను, ఇంగిలీషువారికిన్నీ కొన్ని యుద్ధములు జరిగినవి. చుట్టూ కొన్ని జాతుల వారి యిండ్లున్ను, ఆర్సనలు అనే ఆయుధశాల, పోస్టాఫీసు మొదలయినవి కట్టియున్నవి. పాషింజాతివారు బొంబాయినుంచి సీమ వస్తువులు తెచ్చి యింగిలీషు లాయఖు అయిన షాపులు ఉంచుకొనియున్నారు. ఇక్కడ నొక బజారు, కొన్ని హిందువుల యిండ్లు కలిగియున్నవి. యిక్కడ విడవలిపూరి అల్లే నాజూకు బహువింతగా, అతి సుందరముగా నున్నది.

యీ నాగపూరికి 3 కోసుల దూరములో కామిటి అనే పేరుకలిగిన ప్రదేశములో యింగిలీషువారు అయిదు బటాలాలబారునున్ను అందుకు తగిన యధికారస్థులనున్ను, ఉద్యోగస్థులనున్నుంచి యున్నారు. యీ కామిటి పెద్ద బస్తీ గ్రామము. దండులో లెక్కలు వగైరాలంతా యిగిలీషు భాషతో వ్రాయవలసి యున్నది. గనుక మధ్యదేశస్థులు బహుమంది అరికాటు మొదలారులు మొదలయినవారు చేరయున్నారు. వారు స్వదేశస్థులు వచ్చినంతలో ప్రీతి చేయడము మాత్రమే కాకుండా యీ దేశస్థులకంటె ఎక్కూవగా తాము పరస్పరా భిమానము కలిగి ఒక పొట్లముగా మిత్రభావమును పొందియున్నారు. యిదివరకు జాతుల వారు యీదేశములో ప్రవర్తించుటలో స్వజాతి వైరము లేక ఒకరికొకరు ఉపకారము చేయ నిచ్చ కలిగి యుండడము వీరి దేశ సంప్రదాయము కాబోలనుకొంటిని. యిప్పట్లో యీ కామిటిదండు ప్రవే శించిన వెనక సహజముగా పరదేశానికి మరియొక దేశస్థులు కొందరు పోయిన ట్టయితే కానని యిష్ట పదార్ధాము అపూర్వముగా కనుటచేత నొక విశ్వాసము అందరికిన్ని జనియింపుచున్న దని నిశ్చయించినాను.

యిప్పట్లో హిందువులుచేసే యుద్యోగాలలో హయిదరాబాదు, నాగపూరు, జాలనా, మహినూరనే ఈ నాలుగు స్థలముల కమ్మిస్సేరైయాటు ఉద్యోగాలు ఉత్తమములుగా దోచుచున్నవి. కమ్మిస్సేరైకి వచ్చే దొరలు కత్తికట్లున్ను అట్లాగే బంగాళిదండున్ను బహుదినములు ఇక్కడ వసించి బ్యారుకునులు, వారధులు మొదలయిన పబ్లికు బులుడింగును అనే గృహశాలలు శానా కట్టించినారు. ఇటువంటి పనులకు చెన్నపట్టణపు గవునరుమెంటువారి శాంకిస ననే అనుజ్ఞ దుర్లభము గాని, బంగాళా గౌనరుమొంటు వారు ధారాళముగా అనుమోదింపుచున్నారు.

యీ శీతాబులిడి మొదలు కామిటిదండు దాకా గుర్రపుబండ్లు పోయి వచ్చేటందుకు యోగ్యముగా శాలవేసి నడమనుండే వాగులకు వారధులు కట్టియున్నవి. అయితే దారి యడారిగా నున్నది. నాగపూరు షహరులో సుమారు యిరువైవేల యిండ్లు ఉండవచ్చును. బహు చిన్నయిండ్లు. చూపుకు లక్ష్మీకరములుగా, వాసయోగ్యములుగా నుండలేదు. బాజారులు శానావున్నవి. సకల భోజన పదార్ధాలున్ను, ఆ దేశపు ఫస్త్రాలున్ను సమృద్దిగా దొరుకును. పనుల విశేషాలు తెలిసిన వారి విస్తరించి లేరు. నివసస్థులు కృత్రిములుగాని, హయిదరాబాదు షహరు వారివలెనే మాటకు మునుపు ఆయుధమును వాడేవారు కారు. స్త్రీలు పురుషులున్ను బలిస్టులుగానున్ను, రూపవంతులుగా నున్నున్నారు. సకల ఫలజాతులు దొరుకును. కమలాపండు కాలమందు బహు మంచివిగా, విస్తారముగాఇక్కడ ఫలింపుచున్నవి. సీమ అత్తి పండ్లు, సీమ పన్నీరు పూలున్ను, అమితముగా ఫలింఉచున్నవి. సారవంత మయినభూమి. అనేక తోటలు షహరుచుట్టు ఉన్నవి. అరటిచెట్లు సమృద్ధిగా వేస్తారు. వీధులు కుసంది. ఇప్పట్లో కొత్తవాల్ చేసే తురక షహరులో నడివీధిలోవేసిన వస్తువు వేసినవాడువచ్చి వెతికి యెత్తుకొనేదాకా పడి యుండేటట్లు ఆజ్ఞ చేయుచున్నాడు. సందుకు ఒక ఠాణా ఉంచియున్నది. ఈ రాజుకు ఈ విషయములో బహు శ్రేయస్సు గలిగేలాగు తోచుచున్నది. కుంఫిణీ వారు దొరతనములోగాని న్యాయవిచారాణలోగాని యెంతమాత్రము సంబంధపడి యుండలేదు. మారుజాతివారు కొందరు గోసాయిలున్ను యిక్కడ కోఠీలు వేసుకొని సాహుకారు పనులు గడుపుచున్నారు. ఒక మాత్రపు రత్న వర్తకమున్ను వీరివల్లనే జరుగుచున్నది. రాజునగిరిలో మాత్రము రెండు దేవాలయాలు అలంకారముగా కట్టియుంచి పూజ జరిగింపబడు చున్నది గాని మరియెక్కడను లేదు. నాలుగు సత్రాలలో రాజు అన్న ప్రదానము నిత్యము నూటికి జరిగింపుచున్నాడు. అధ్యయన పాఠశాలలు లేవు. అధ్యయనము వినవలసి యుంటే ఆ జ్ఞాన నిమిత్తమై యిక్కడ వచ్చియుండే మధ్యదేశ బ్ర్రాంహ్మణుల గుండా వినవలసినది. యీదేశస్థులు హరికధ చేయడము చేయించడము వలన ఇహ పరాలు సాధించేటట్టు నాకు తోచుచున్నది. హయిదరాబాదు మొదలుగా కట్టియుండే దేవాలయాలలో నంతా ఒక గర్బగృహమున్ను తగుపాటి ముఖమంటపమును అరటిపువ్వు చందముగా నొక స్థూపిన్ని నిర్మంపబడి యున్నది.

ఈ దేశస్థులయొక్క ఆచారము మన దేశానకు యోగ్యము గాకున్నా శాస్త్రసమ్మత మైనదే కాని వేరే కాదు. ఆచారాలు, అలంకారాలు, ఆహారాదులున్నూ దేశానికి తగినట్టుగా పెద్దలు స్మృతుల గుండా యేర్పరచి యున్నారు. అది తెలియక ఒక దేశస్థులు మరియొక దేశస్థులను అన్యాయముగా నిందింపు చున్నారు. ఇందుకు దృష్టాంత మేమంటే యీ దేశములో భోజనానికి దృష్టి దోషమున్ను, ఉదకానికి స్పర్శదోషమున్ను అక్కర లేదని అంగీకరించి అలాగే నటింపు చున్నారు. అయితే అందువల్ల విరోధమేమి? బ్ర్రాంహణులు పరిషేచనము చేయడము దృష్టి దోషము పరిహారమయ్యే కొరకే కదా? అటుగా దృష్టిదోషము కలదిని పాటింఛే పక్షమందు పరిషేచన విషయమైన ఆపస్తంబ సూత్రము వ్యర్ధమవుచున్నది. అయితే ప్రధమములో శూద్రదృష్టి కూడదని ఒక వచనము ప్రవతించి వున్నది గనుక అది పట్టుకొని పిమ్మట ఆపస్తంబులు సూత్ర ద్వారా వరిషేచన ప్రకరణము కలగచేసినా పరిషేచనమునున్ను చేయుచు శూద్రదృష్టిన్నిలేకుండా దేశమునేలే ప్రభువుల ఆదరణచేతను మధ్యదేశపు బ్ర్రాంహ్మణులు వగయిరాలు జరుపుకొనుచు వచ్చు చున్నారు. వృధివ్యప్తజోనాయ్వ్యాకాశాలు బ్రంహ్మాండానికి పంచమహాభూతాలయి యుండగా అన్నిటిని పరిశుద్ధి చేయగల జలమునకు దోషమెక్కడిది? ఒక గుంటలో సకల జారులున్ను నాల్గు రేవులలో దిగి సమకాలమందు స్నారము చేయలేదా? ఉదకము కొద్దిగానుండి స్పర్శదోషము పాటింపవలెనని చెప్పే పక్షమందు అప్పుడు సమమయిన భూతముగానుండే అగ్నికిన్ని ఆ దోషము చెప్పవచ్చునే? అగ్ని మాత్రము యెంత కొంచమైనా యెవరు తాకినా అంటు దోషల్ల్ములేక్ పోవలసిన దేమి? యిక్కడిక యాచారానికి ప్రతిగా మధ్య ద్రావిడ దేశములో పర్యుషితాన్నముతింటే పునరుపనయనము కావలసినదనిన్ని చింతపండు;తో మిరియాలు కలిసి పచనమయితే సురతో సమాన మనిన్నీ శాస్త్రము ప్రవర్చించియుండగా ఈ రెండున్ను లేకపోతే ఉష్ణవాయువు భూమిలో వసించేవారు చచ్చిపోదురు గనుక అవతార పురుషు డయిన అప్పయదీక్షితులు ఆ పదార్ధ భక్షణణకు అనుజ్ఞ ఇచ్చినారనే బలమునుబట్టి దక్షిల్ణదేశశ్థులు వాటిని పుచ్చుకొనుచున్నారా? లేదా? ఇతర దేశస్ధులు ఆ పదార్ధాలతో తమకు నిమిత్తము లేదు గనుక అహ్యాపి వాటిని నిషేధించే యున్నారు. కర్మద్వారా జ్ఞానము చంపాదించవలసి యున్నది గనుకనున్ను, కర్మములకు నియమములేక పూర్తికాదు గనుకనున్ను నానా విధములయిన్ నియమాలను ఆయాదేశములకు అనుగుణముగా స్మత్రలు ఏర్పరచినారు. ఇటువంటి ఆచారాలకు వచనాలచేతనే ప్రవృర్తిల్ నివృత్తులు కలుగవలసియున్నవి. యీ నియమాలన్ని వృధ్దాచారమువలన అనుసరించుటఛేత మనోబంధకము లయినవి. అందుకు దృష్టాంతముగా కొందరి యాచార మే మంటే నిన్నటి మడుగువస్త్రము నేటి దేవతార్చనకు పనికివచ్చునని దరింపుచున్నారు. కొందరు నాటి మడుగు వస్త్రమే కావలె ననుచున్నారు. ఇందులొ నేమి భేదము? ఒక వస్త్రము ఉతికి ఆరవేసి కాశీయాత్ర చరిత్ర

నాలుగు జాము లయితే మరి యొకటి రెండుజాములై యుంచున్నది. ఈరీతిగా న్యాయశాస్త్రమున్ను దేశానుగుణముగా స్మర్తులు ఏర్పరచి యున్నారు. అది యెట్లావంటే నిండు దక్షిణ దేశములో స్త్రీచాపల్యము విస్తారము గనుక తొడబుట్టిన దాని కొడుకు నిశ్చయముగా రక్తసంబందంధికుడని తెలుసుగదా! రక్తసంబంధికుడని తొచే కుమారుని కన్నా రక్తసంబంధికుడని తెలిసిన మేనల్లుడే మేలని తోడబుట్టు కొడుకే ధనానికిన్ని, కుమారునికిన్ని అధకారిగా చేయబడినాడు. నిండు ఉత్తరదేశములో స్త్రీ చాపల్యము తక్కువ గనుక "శరీరాధ్యంస్మృతా జాయా" స్మృ తి ప్రకారముగా అవిభక్త విషయములో బహుమంది అన్నదమ్ములున్నూ భార్యకు పతి సొత్తును గురించి అర్హత కద్దనినియమించ బడి యున్నది. మధ్య దేశములో స్త్రీల విషయముగా చాపల్యము మధ్యమముగా నున్నది గనుక పుత్రద్వారా సొత్తులో సకల స్వాతంత్ర్యమున్ను వారికి కలగచేసి అపుత్రవిషయములోనున్ను అవిభక్త విషయములో నున్ను పోషణకు మాత్రము వారికి అర్హత కలగ చేసి సొత్తును అన్నదమ్ములకు యిచ్చినారు. మెట్టుకు దేశాచారము లంతా శాస్త్రానికి, యుక్తికిన్ని విరుద్ధములుగా నుండవు గనుక అన్యదేశస్థులపట్ల వారి యాచార వ్యహారములు, అలంకారములు, ఆహారాదులున్ను భిన్నములుగా నున్నా వారియందు భక్తి విశ్వాసములను ఉంచి వారున్ను ఈశ్వరసృష్టితో చేరినవారు గనుక మనయొక్క అన్నదమ్ముల వలెనే సకల విషయములలో నున్ను వారిని విచారింపుచు రావలసిన దని తోచుచున్నది.

నాగపూరు షహరున్ను యింగిలీసు దండువుండే కామిటి అనే ప్రదేశమున్ను బహునల్ల రేగడభూమి; వర్షాకాలములో అట్టిభూమి యందు సంచరింఛే వాడికె లేనివారు చూస్తే అది బహు అసహ్యముగా తోచబడును, వర్షాకాలములో వీధులున్ను, సందులున్ను కాలు పెట్టడానికి యోగ్యములుగా నుండవు. శీతాబులిడెలోనున్ను, కామిటిలోనున్ను జాతులవారు మాత్రము గులకరాళ్ళు కలసిన ప్రదేశముగా చూచి శీతాబులిడిలో కొంఢ సమీపముగా నున్ను, కామిటీనది వొరగానున్ను తోటలు యిండ్లున్ను కట్టుకున్నారు. యీ ప్రాంతములలో జాజిపూలున్ను మొల్లపూలున్ను దొరుకునుగాని, మల్లెపూలు లేవు. శ్రీరంగ కస్తూరి పట్టెలు చెన్నపట్టణము వదలిన వెనక కండ్లచూడవలసినది లేదు. నాగపూవు రాజ్యము మొదలుగా యీనపుడకలు దొరకవు. ఈతాకులతో శృంగారకట్టలు కట్టుకొని పనులు గడుపుతారు. విస్తరాకులు జొన్నచొప్పతోను, వెదురు దబ్బలతోనున్ను కుట్టుకోవలసినది. సన్నిగల్లు గుండు కడప వదిలిన వెనక లోకులు వాడడము లేదు. నూరవలసిన పదార్ధాలంతా రోటిలోవేసి తొక్కవలసినది. నిండా మన దేశస్థులకు సన్నిగల్లు కావలసిన ప్రయత్నము చేస్తే కలవంగుండు సంపాదించి అందు గుండా పని గడుపు కొనవలసినది. కామిటి అనే కంటోనుమెంటు దండువుండే ప్రదేశములలో నున్ను పార్శివారు ఇంగిలీషు షాపులుకూడ వుంచి యున్నారు. ఊరున్ను, బజారు వీధులతో బస్తిగా కనుపడుచునున్నా హయిదరాబాదులో యింగిలీషుదండువుండే బస్తీకళలో శతాంశలలో నొక యంశయైనా లేకుండా వున్నది. అది యెందుచేతనంటే 'స్వయం రాజా స్వయంమంత్రి 'అనే న్యాయ ప్రకారముగా రాజ్యానికిన్ని దండుకున్ను యింగిలీషు వారే యిదివరకు ఖామందు లయి యుండినందున వీరి ప్రాపును అనుసరించి వీరి దండులో లోకులు చేరవలసిన అగత్యము యిదివరకు లేకుండా వుండిపోయినది. అంతేకాకుండా యీసరికి హయిదరాబాదు ప్రభువు 'లేస్తే కొరగాని చేను తోలే మంచమీది మొండివానివలె 'గౌరవములను కాపాడుకొనుచు వచ్చుచున్నాడు గనుకనున్నునాగపూరు వారు స్నానము చేసి చలి భయమును పోగొట్టుకున్నారు గనుకనున్నుయింగిలీషువారి దాపున్ను, చెల్వమున్ను హయిదరాబాదు వారి దేశములో వెశేషముగా నున్నది.

ఇంతే కాకుండా ప్రపంచంలో ఒక మంచితో కూడా, ఒక చెడు కలిసి యుంటేనే సౌఖ్యహేతువుగా తొచుచున్నది. నాగపూరు రెసైడెంటు అయిన *[2] మేస్తర్ గ్రీన్ దొరగారితో ప్రపంచ సంబంధము లయున కొన్ని మాటలు మాట్లాడుచు నుండగా ప్రపంచమే పుణ్య పావ మిశ్రమమయినదనిన్ని పుణ్యము నిర్గుణ బ్రహ్మసంబంధ మయినదనిన్ని పాపము సంకల్పద్వారా స్పష్టమయిన మాయ సంబంధమయిన దనిన్ని ఈరెండున్ను కలిసి ప్రపంచము నిర్మించబడ్డది గనుక ఎట్టి మంచిపనిలో నున్ను చెడుకలిసి యుంచున్నది. అందుకు దృష్టాంత మే మంటే హిందువులు మూఢులకున్ను, బాలులకున్ను దైవమందు భక్తి కలిగే నిమిత్తమయి బింబాల యెడల దైవత్వమును ఆరోపించుటచేత పరిపక్వ కాలాలయందు కూడా ఆ నమ్మికె నిలవబడి మనుష్యకోటిని ముంచివేయుచున్న దనిన్ని, తద్వ్య్హతిరిక్తముగా విలాయతీ క్రీస్తు మతస్థులు ఈశ్వర స్వరూపము సర్వభూతాత్మక మని ఆదిలోనే బోధచేయు తలచుట చేత మూఢులున్ను, బాలులున్ను ఈశ్వరుడు కలడనే జ్ఞానమే లేక మణిగి పోతారనిన్ని, హిందువులు ద్వితీయ వివాహము స్త్రీలకు లేక చేసుట చేత బహుమంది బాల్యమున విధవలయిన స్త్రీలు మిక్కిలి కష్టపడు చున్నారనిన్ని దానికి వ్యతిరిక్తముగా యింగిలీషు జాతి వారు స్త్రీలకు ద్వితీయ వివాహానికి అనుజ్ఞ యిచ్చుటచేత స్త్రీలకు చాపల్యము సహజముగా నుండబట్టి స్వపురుషునియెడల భయభక్తులు తక్కువయి వాణ్ని కృత్రిమముచేత చంపి వేరే పురుషుని వివాహము చేసుకొను చున్నారనిన్ని ఒక మంచిని ఊహించితే ఒక చెడు ప్రపంచ స్వభావద్వారా ఆ మంచిలో జనింపుచున్న దనిన్ని యివి మొదలయిన హేతువులచేత చెడు కలియని మంచి పని ప్రపంచములో లేదనిన్ని నిశ్చయించినాము. పయిగా ఈయనేక జగత్తుల సృష్టిని పరబ్రఃహ్మ తన చిద్విలాసార్ధ మయి చేసి నందున ప్రతిదేహానికిన్ని ప్రకృతి వేరువేరుగా నున్నది. ప్రకృతి భేదము మనసువల్ల జనిత మయినది. మనస్సు బుద్ధి జనిత మైనది. కాష్టములో అగ్ని ప్రవేశించి యున్నట్టు బుద్ధిలో పరమాత్ముని చైతన్యము ప్రతి ఫలించియున్నది. కాష్టభేదములు అనేక భేదములయి నట్టు బుద్ధిభేదములు అనేకములుగా నుంచున్నవి. ఒకరాజుకు అధీనములుగా అనేక మండలాలు ఉండుటకు బదులుగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రాజూ ఉండినట్టయితే బుద్ధి భేదముల చేత నున్ను, ఒకరి యుక్తిమీద నొకరు తమ బుద్ధిద్వారా మొదటి వాని యుక్తిని కారణ మగురూప దేశముగా నుంచుకొని తాము యెక్కువ యుక్తిని కలగచేసి రాజ్య తంత్రము గడుపుదురు. పయిగా తల్లి దండ్రులుగల బిడ్డలు తల్లి కొపము చేస్తే తండ్రివద్దకిన్ని, తండ్రి కోపముచేస్తే తల్లి వద్దకిన్ని యెట్లా పోవుచు వచ్చుచు నుందురో హయిదరాబాదు యింగిలీసు దండులలో నుండేవారు ఒక ప్రభువును వదిలి మరియొక ప్రభువు వద్దికి పోవుచు, వచ్చుచు నెట్లా ఆనందింపుచున్నారో అలాగే ప్రజలు సుఖపడవచ్చునని తోచుచున్నది. యీ యుక్తి చేతనె యీశ్వరుడు (విభ్రాతి విశేషాలను భూరి దక్షిన పంఛినట్టు ఆయాకాలాలలో పాత్రమెరిగి పంచిపెట్టుచు వచ్చుచున్నాడు.

యీ నాగపూరు రాజ్యానకు చెన్నపట్టణపు దండు రాక మునుపు చింతపండు దేనికి ఉపయోగమయ్యేదిన్ని తెలియదు. ఈదేశస్థులు వేడిగా కాచకనే పచ్చి మజ్జిగెగాని పెరుగుగాని పోసుకొనరు. దక్షిణ దేశపు శూద్రులు రాత్రిలో మజ్జిగ పెరుగు పోసుకుంటే యెట్లా, జలుబు చేసునని భయపడుదురో అలాగే ఒక భయము వీరికి జనియించి యున్నది. ఆహార విశేషాలు జాఠరాగ్నికి స్నేహమయ్యేదాకా ఎటువంటిదిన్ని అనుకూలిందు; స్నేహమయిన వెనక బాధించదుగనుక మేమురాత్రిలో, పగటిలోనున్ను ఈ రాజ్యములొ విశేషముగా దొరుకుటచేత మజ్జగెగాని పెరుగుగాని తాగడమువల్ల మాకు ఏమిన్ని విరొధము చేసినది కాదు. యిందుకు దృష్టాంతము వనములో సంచరించే మనుష్యులు విషజంతువుల భీతి లేక నుండే కొరకు మనిషిని చంపదగిన గరళమును, ముష్టివిత్తులనున్ను తిని జీర్ణము చేసుకొనుచున్నారు. గనుక దేశాచారమునిబట్టి వాడికె యయిన ఆహారపదార్ధాలు విడవతగ్గవి కావని తోచుచున్నది. దేశాటనము చేయడములో పోష్యులుగా నుండే దారాపుత్రాదులను కూడా తీసికొని విషయాపేక్ష నివృత్తిపొందక వచ్చినా, తృణాగ్రముగాని భగవదాజ్ఞ లేక చలించ దనే సత్యవార్త పెద్దలకుండా వినపడినట్టు రాజఠీవిగా శ్రీరాములు ఇదివరకు దోవలో నాకు జోసింపుచు వచ్చినారు. ఈషణ త్రయాలమీది యభిమానము నిరోధిస్తే అది సచ్చిదానందము కలుగచేయగల మాయద్వారా ఆశ్ఛర్యకరమయిన భయహేతువుగా మనసుకు తోచుచున్నందున అయోధ్య మొదలయిన మహాస్థలములకు స్వదేశములో నున్నప్పుడు అనుకొన్న ప్రకారము సయిపు చేసుకొని పోదామనే తాత్పర్యము ఇక్కడవదిలినది. కర్మద్వారాజ్ఞానము సంపాదించవలెననే అస్మదాదులకు నమ్మికచేత కడతేరవలసినది గనుక మిత్రబోధవత్తుగానుండే స్మృతి వాక్యముల ప్రకారము గంగాస్నానము, గయావ్రజనమున్ను చేసి స్వదేశానికి రావలెనని యున్నాను. స్వదేశ పక్షపాతము లోకులకు ఈచొప్పున కలగడానికి ముఖ్యకారణ మేమని విచారించగా ధరించి యుండే దేహము మీద యభిమానము కలవారు బాల్యాదారభ్యతమతో సహవాసపడిన వారు బహుమంది స్వదేశములో నుండుట చేతనున్ను, మనసుకు దేహము నావవంటిది గనుకనున్ను మనసనే నావ తిప్పేవాడు జాగరూకుడు గాకపోతే యేలాగు వాడస్వేచ్చగా కొంతకాలము సంచరించగా ఆబాడవాడు వాడకు అధీనమైపోవునో అలాగే యీదేహము మనసు అధీనమయి నా దేహసౌఖ్యము తనదనే భ్రాంతిని పొంది యుండుటవల్ల మనసు దేహాధీనమయి స్వదేశగమనమును నిరీక్షింపుచున్నది.

ఇటువంటి నాగపూరు పట్టణములో ఒంటికంభం డబ్బల్ టాపు కావాతులు కల డేరా ఒకటిన్ని, వంట భోజనాలకు కంబళి దేరా ఒకటిన్ని సంపాదించు కొనుటకున్ను పల్లకి మరమ్మతు చేయించు కొవడమునకున్ను ఆగష్టు 14తేది మొదలు 20 తేది వరకు నిలిచి నాను. హయిదరాబాదు షహరువలెనే యీషహరులో నేను ప్రవేశించిన కాలమందు కృష్ణ నవరాత్రి యుత్సవము మధ్య దేశములో పసల పొంగలికి జరిగించే ఆగమమంతా పశువుల విషయముగా నున్ను మనుష్యుల విష్యముగానున్ను జరిపింపు చున్నారు. హయిదరాబాదులో నుంచి తెచ్చిన ప్రయివేటు టెంటును అనే శిఫాయి డేరాలను ఇక్కడ వదిలి, నూతనముగా సంపాదించిన డేరాలకు గాను ఆరుగుర్రాలను కాశికి పొవడానకు గుర్రము 1 కి రూపాయిలు 15 లెక్క బాడిగకు మాట్లాడి జుములా గుడారాలు 4 కంబళి 1 అందుకు తగ్గ బొంగులు, మేకులు, కింద వెయ్యడానకు కీలుచాపలు, ఇవంతా ఆ యారు గుర్రాలమీద సాగించుకొని రావడ మయినది. హయిదరాబాదు నుంచి వచ్చిన యెద్దులకు మళ్ళీ అవి స్థలము చేరడానికి 14 దినముల జీతము కట్తియిచ్చి పంపించివేయడ మయినది. యింతే గాకుండా ఒక కావటి మనిషి బళువులో 3 మంచాలు కావలసినప్పుడు తీసి మళ్ళీ జోడించేటట్టు చేయించి, డేరాలలో చెమ్మగా నున్నా పండుకొవడానికి విరోధము లేక నుండేటట్టు చేసుకొన్నాను.

ఇక్కడ నాగపూరి రూపాయి యనేది ఒక్కటే చెలామణి. రూపాయల మార్పులో హయిదరాబాదు వలె చేతికి చెయ్యి నష్టము తగలదు. దుడ్లుమాత్రము నాలుగేసి యూళ్ళకు ఒక్కొక్క మాదిరి చలామణి అవుచున్నవి. ముందు చెలామణి దుడ్ల వయినము విచారించుకొని అప్పటప్పటికి దుడ్లు మార్చుకొనుచు రావలసినది. నాగపూరు రూపాయి 1 కి ఇక్కడి దుడ్లు 32 దుడ్ల భేదము కొద్ది సంఖ్యవ్యత్యాస మవుచున్నది.

నేను చెన్నపట్టణము వదిలి నప్పుడు కావలసిన సామానులనుంచు కొనేటట్టు పల్లకీలో జాగా చేయవలె నని తోచినది. పిమ్మట పల్లకీ బళువుచేత దారి సాగక పోయినంతలో వేసుకొనే పరుపుకూడా తీసివేసినారు. గనుక పాలకీ దొవప్రయాణానికి చులకనగా ఉండుట మేలు.

ఇక్కడ 13 సంవత్సరములుగా వాసము చేయుచు నుండే డాక్టరు వొయిల్ (Dr.Wylie) గారితో మాట్లాడగా నాగపూరు మొదలుకొని జబ్బలపూరు వరకి అడివి బలిసిన భూమి గనుక అది కొత్త నీళ్ళతో తడిసి ఆ యడవిలోని ఆకులు మురిగి వాటి రసముతోనే వూట యెక్కుటచేతను ప్రతి సంవత్సరమున్ను ఆగస్టు ఆఖరు మొద్లుగా ఆకుటోబరు పర్యంతము చలిజ్వరాలు తగులు చున్నది; నీవు త్వరగా జబ్బలపూరు చేరవలసిన దని చెప్పినాడు. ఈ దేశస్థులున్ను ఆ మాట నిజమే నని ఒప్పుకొన్నారు. హయిదరాబాదు వద్ద ఒక మనిషిని బహుదుష్ట సర్పము కరిచి నంతలో పాముచెక్క నూరి యిచ్చి యేడులూనున్ను తాగించినాను. 3 ఝాములకు మనిషి లేచి తన యింటికి నడిచిపోయినాడు. చలిజ్వరాలకు లింగకట్టు బ్యార్కు ఇచ్చుచు వచ్చుచున్నాను. కొంత అభిముఖమయిన వెనుక భేదికి యిచ్చుచున్నాను. శ్రీరామ కటాక్షముఛేత గుణ మవుచు వచ్చినది. కూడావచ్చేవారికి నేను యిచ్చే ఔషధాలు గుణముఖానికి తెచ్చేటందున దిగేయూరిలో నొప్పిగలవారు కునుపడితే మాయజమానునివద్ద మంచి మదులున్నవనిన్ని ధర్మానికి యిచ్చుననిన్ని రహస్యముగా నా మనుష్యులు చెప్పుచు వచ్చినారు. వారు వారు వచ్చినన్ను శ్రమపెట్టసాగిరి. తెలిసి తెలియని చికిత్స చేయడమువల్ల బహుపాతక మని చెప్పి ఉన్నది గనుక, హయిదరాబాదు మొదలుగా నాపరివారము వినాగా ఇతరులకు ఆపదలేని విషయములో మందులు ఇవ్వడము లేదని నిశ్చయము చేసి ఆప్రకారము జరిపింపుచు వచ్చుచున్నాను.

దక్షిణదేశములో తిరుపతి తిరుణామలె యాత్రచేసిన వారిని అనేకులను చూడడము ఎట్లా సహజమో ఆరీతిగా ఈ నాగపూరు రాజ్యములో కాశీయాత్రచేసి దారి ఖుల్లనుకూడా చెప్పగల వారిని అనేకులను చూడవచ్చును.

ఇటువంటి నాగపూరి షహరు ఆగష్టు 21 తేది వదిలి ఆ దిన మున 2 ఘంటలకు కామిటి అనే యింగిలీషు దండుండే స్థలము ప్రవేశించినాను. కామెటీశ్వర ఘట్టం రేవులోను అక్కడి ఖననానదిని దోనెల కుండా 23 తేది దాటి అక్కడికి 7 కోసుల దూరములోనుండే రామ టెంకి అనే గుహస్థలము పగలు 2 ఘంటలకు చేరినాను. నేను ఉదయాన కామిటి వదిలి బయలుదేరేటప్పుడు 3 ఘంటలు. అప్పుడు త్యాజ్యశేషమూ ఉండినది. దానిఫలమేమంటే నదరహీనది దాటడానికి నాలుగయిదు రేవులలోను న్నుండే పదవలకు కర్నల్ ప్యారన్ మొదలయిన దొరలు వారికింది యధికారస్థులకు తొలుదినమే ఉత్తర్వుచేసినందున కింది అధికారస్థు లందరు నాతో కూడా దోవ పంపించను నదిదాకా వచ్చిన్ని పడవవాండ్లు యీరేవున దాటుతారని ఆరేవువారున్ను ఆరేవున దాటు తారని యీ రేవువారున్ను సందేహముతో హాజరులేక తుదను ఒక యొంటికొయ్య దోనెను 2 ఘంటలకుపట్టి దానిగుండా 1 ఘంటసేపులో మూడు సవారీలనున్ను దాటించుకొని యివతల సాగివచ్చినాను. దారిలో వర్షముచేత రామటెంకిముందర కొంచముగా తడిసి నాము, సామానుకావిళ్ళు పోయినదోవ తెలియక కొంతసేపు వ్యధపడితిమె.

కామిటినుంచి రామటెంకీకి మూడు దోవలు వున్నవి. కామిటేశ్వర ఘట్టమువద్ద ఒక చిన్న శివాలయము వున్నది. అక్కడ ఖనానా అనే నదిని దాటి వచ్చేదారి రాజమార్గము. నాసామాను కావళ్ళూ మరియొక రేవున దాటి వేరేమార్గముగా పోయి కేడి అనే ఊరి వద్ద కలుసుకొన్నై. మరికొందరు పరిజనులు రామటెంకి యూరిముందర కలుసుకొన్నారు. దారి నల్లరేగడ. అడివి లేదు. మామిడిచెట్లశాల వేసియున్నది. కొన్ని వాగులు దాటవలెను. చిన్న యూళ్లు కొన్ని దారిలో నున్నవి. వాటివేళ్ళు యీ అడుగున వ్రాసినాను.

నెంబరు 1- బరోడా 1 - అగోరి 2 - కేడి 3 - సాటక్కుర హూరా 4 - రామటెంకి 5.

ఈ రామటెంకి రామక్షేత్రము; షహరువంటి యూరు. కొండచుట్టుకొనియున్నది. నాల్గువేలయిండ్లు కలవు. నాలుగయిదు చెరువులున్నవి. బహుజలవసరి. తమలపాకుల తోటలు అనేకముగా మజుబూతి అయిన పందిళ్ళు పెట్టివేస్తారు. యిక్కడ తమలపాకులు బహు ప్రసిద్ధిపొందినవి. దక్షిణమున హయిదరాబాదు వరకు, ఉత్తరమున ప్రయాగవరకున్ను పోవుచున్నవి. రాజాధిరాజులు టప్పవుంచి యీ తమలపాకులు తెప్పించు కొనుచున్నారు. నెలదినములవరకు కాపాడుచు వస్తే ఆకులు చెడిపొకుండా వుంచున్నవి. యీ ఆకుల గుణ మేమంటే పండినవెనక చెన్నపట్టణపు రవేసాకులంత సన్నములుగా మృదుత్వముకలిగి వుంచున్నవి; రుచిగాను న్నుంచున్నవి. ఈయూరిలో సకలపదార్ధాలున్ను దొరుకును. ఈయూరికి అర కోసెడు దూరములో కొండలమధ్యే అంబరీషతీర్ధ మనే కోలను దివ్యోదకముకలిగి చుట్టు అనేక మంటపాలతోకూడా వున్నది. తీర్ధా కాశీయాత్ర చరిత్ర

నికిచుట్టు కొన్ని తీర్ధవాసుల యిండ్లున్ను ఇతరల్పరిజనుల యిండ్లున్ను నాగపూరిరాజు నగరు వొకటిన్ని వున్నవి. యీ నగరు అతి విశాలముగా కట్టియున్నది. యిక్కడ బ్రంహ్మోత్సవము తిరుణామలెవత్తుగా కార్తీక శుద్ధ పున్నమకు జరిపింపుచున్నారు. లక్షజనులు చేరుచున్నారు. కొండమీద దేవాలయానికి 700 మెట్లు ఎక్కిపోవలసినది. దేవాలయము చిన్నదయినా సుందరముగాను, పరిష్కారముగానున్ను కట్టియున్నది. కొండమీద నరశింహమూర్తి కిన్ని వరాహమూర్తి స్వామికిన్ని రెండాలయాలు కట్టి మూర్తులను స్థాపించినారు. ఆ రెండు మూర్తులున్ను అతిగాత్రములుగా, హధాశాస్త్రముగా జీవకళ తనకు దానేకలిగి యుండేటట్టు చేసియున్నవి. దేవాలయములో సకల రాజోపచారములతో నాగపూరిరాజు సం|| 1 కి 400 రూపాయిల ఖర్చుతో పూజలు బ్రాంహ్మణులకుండా నడిపింపుచున్నాడు. కొండమీదనుంచి చూస్తే ఆయూరి విస్తారము చక్కగా తెలియుచున్నది. యీగుళ్ళన్నీ కాశీ దక్షిణద్వారమని ఒక వాకిలి ఉత్తరపు పక్కనున్నది. తీర్ధమునుంచి కొండ నెక్కడానికి మెట్లుకట్టి యుండడముమాత్రమేకాక ఊరిలోనుంచి కొండ యెక్కడానకు వేరే మెట్లు సుందరముగా కట్టియున్నవి. రాజునగరులో దిగి క్షౌరము తీర్ధశ్రాద్ధము మొదలయిన క్రియలు చేసినాను. ఇక్కడి తీర్ధవాసులు మధ్యదేశజనులయినా ఆచార వ్యహార భాషలు దాక్షిణాత్యులతో భేదించియున్నవి. అరువై బ్రాంహ్మణుల యిండ్లు ఇంత యూరికి ఉండియున్నవి. తీర్ధమునము చుట్టున్ను మంటపాలు, ఫల వృక్షాలున్ను విస్తారముగా నుండుట చేతను చుట్టూ కొండ అవరించుకొని యుండుట చేతనున్ను బహు తపస్విజన వాసయోగ్యముగా నున్నది. కొందరు ప్;ఉనశ్చరణ తీర్ధతీరమందు దత్తత్రేయల వారి ప్రతిమ యొకటి మహా సుందరముగా చేసి ప్రతిష్ట చేయబడియున్నది. తీర్ధమధ్యే అంబరీష మహారాజు సువర్ణ మయముగా గుడికట్టి నాడనిన్ని అది కదాచిత్తుగా ఉదకము లోపమయిన కాలాలలో అగుపడుచున్న దనిన్ని తీర్ధ వాసులు చెప్పుతారు. ఆ కొలను తీర్ధ హీనముగా ఎన్నటికిన్ని కాతగ్గదిగా నుండలేదు. ఆతీర్ధము పాతాళలోక జనితమయిన దనిన్ని యేట్లా ఊర్ధ్వలోకానికి భాగీరధిన్ని ఉన్నచో తద్వత్తుగా పాతాళలోకానికి భోగవతి అనే తీర్ధమిది యని పురాణ నిశ్చితమైయున్నది. అంబరీష మహారాజు అతిధిరాకను నిరీక్షించనందున దుర్వాసుల శాపగ్రస్తుడయి యుండగా ఈతీర్ధము ఆశాపమును నివర్తింపచేసినది. అంబరీష మహారాజు ఇక్కడికి 4 కోసుల దూరములో నుండే నంది గ్రామములో రాజధాని కలగ చేసుకొని దొరతనము చేసినాడు. రుక్మాంగదుని రాజధాని యెంత విచారించినా ఉయిదివరకు తెలిసినది గాదు.

ఈ పర్వతము పేరు సింధురాజ పర్వతము. శ్రీరాములు తన దొరతనములొ బ్రాంహ్మణ శిశువూయొక్క మరణ హేతువుని కనిపెట్టే కొరకు వెతకగా శూద్రుడు తపస్సు చేయుచు నుండను గనుక వాని సంహరించిన వెనుక వాడు నమ్రతను పొంది ప్రార్ధనచేసి నందున వాని లింగాకృతి చేసి తాను సీతాలక్ష్మణ, హనుమత్సమేతుండై యిక్కడ వసింపు చున్నాడు. యిది యీస్థల మహాత్మ్య పురాణ బోధితముగా నున్నది. ఈ స్థలమందు 28 తేది రాత్రి వరకు ఉందినాను.


ఆఱవ ప్రకరణము

29 తేది ఉదయమున 6.4 ఘంటకు లేచి అక్కడికి 6 కోసుల దూరములో నుండే దొంగల తళావు అనే వూరు 1 ఘంటకు ప్రవేసించినాను. ఈదినమున్ను కొంచెము త్యాజ్యశేషము ఉండగా ప్రయాణ మయినందున చెన్నపట్టణము వదలిన యిన్ని దినములు వర్షాకాలములో ప్రయాణ మయి నడిచి నందుకు సెలవుగా నేటి దినమున అడవిమధ్యే ఒక ఘంటసేపు నంతతొద్ధారమయిన వర్షములో తడియడ మయినది. దారి బహుబాగా ఉన్నది. నిర్మల నది

  1. * ఈ పునా శ్రీమంతుడు పీష్వా అని చరిత్రలో ప్రసిద్ది వహించిన మహారాష్ట్ర నాయకుడు. శ్రీ శివాజీ తరువాత మహారాష్ట్రరాజు ఆయన మనమడగు షాహు పేరుకు రాజు. ప్రధానమంత్రి బ్ర్రాహ్మణు డగు పీష్వాయే నిజమగురాజు.
  2. *Mr.Groeme.