కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/336వ మజిలీ
గీ. రాముఁడు మురారి నిజము సుర ప్రవరులు
కపిభటుల, నాదు దోర్బలగరిమ సురలు
బందెఁ బడలేదే ? మురవైరి యందులేఁడె ?
భయ మికేటికి నాబహిఃప్రాణథనమ !
మఱొక్కచోట రావణవధానంతరము వాని నుద్దేశించి కొందరు సుర ద్వేషులు పలికిన విచారభాషణముల నింకొకచిలుక యిట్లు పఠించుచుండెను.
ఉ. హా ! దశకంఠ హా ! ప్రభువ ! హా ! సురశాసక ! హా ! మహోగ్రకా
ర్యాదర ! యెందునుంటివొగదా ? నినుఁబాసిన యిప్పురంబు మ
ర్యాదలఁ జూడు నీదుభవనాంగణఘృష్ణులనైనఁ ద్రొక్కగా
రాదను దివ్యు లిందిపుడు ప్రస్తుతిగాంతురు పూజ్యులైసదా.
వేఱొక్కచోట శూన్యాయతన మండప గర్భమందు విశ్రాంతికై చేరిన వై దేశికనిశాచనులు రావణవధావిధానమందలి విధివైపరీత్య వృత్తాంతమును విచారభావ మునఁ జెప్పుకొనుచుండ నిట్లు వింటిని.
గీ. సేవకులుగా మెలంగిన దేవసంఘ
మమర వానరజాతియం దధిభవించి
కడక దశకంఠుఁ బొరిఁగొనఁ గలుగు డహహ !
దైవవైపరీత్యమునఁగదా ! తలంప.
ఇట్లు లంకాపురమున రామరావణ మహాసంగ్రామ సంబంధమగు వృత్తాంత మనేకవిధముల నెరుంగుచు నందందుఁ దిరుగుచుంటిని. అపూర్వ తపస్విని యేతెంచె నని నాచుట్టును మూగు వృద్ధసమూహము మూలముననైన నుదయసుందరి వార్తఁ దెలిసి కొనవచ్చునను నాసతో నానగరమందు లోపలను, వెలుపలను, మూలమూలఁ బరి భ్రమించి యెందును నామెసడిఁ దెలిసికొనఁజాలక నిరాశఁ జేసికొంటిని. ఇంతలో యువతీరత్నాపహరణంబున బ్రసిద్ధికెక్కిన విద్యాధర కుమారుల మాట జ్ఞప్తికి వచ్చు టయును వారికిఁ క్రీడాస్పదంబులగు మలయాది గిరిగహ్వరములయం దామెజాడఁ దెలిసికొనవచ్చునని దలంచి యందుఁ బోవ గగనంబున కెగిరి యతిజవమున నరుగు చుంటిని.
336 వ మజిలీ
ఇట్లేఁగుచుండ నొకచోఁ బ్రాంతగిరి గహ్వరమునందు రక్షింపుము రక్షింపు మని పూత్కారపూర్వకముగ నాక్రోశించు బ్రాహ్మణరూపధరుండగు నా నిశాచరాప సదునిఁ గనుంగొంటిని. అయ్యో ! బ్రాహ్మణుండాపన్నుఁడై యున్నాఁడని దలంచి జాలిఁగొని ససంభ్రమంబునఁ జేరువకుఁ బోయి సాదరవాక్యముల నోబ్రాహ్మణుఁడా ! నీయాపద దేనివలనఁ దీరునని యడుగఁ గళ్యాణీ ! నీవలననే నాబాధ తొలగఁగలదని వచించెను. అప్పుడు నే నోహో ! నే నొనర్పఁ దగిన దేమో సత్వరమ జెప్పు మందు లకుఁ దగిన ప్రతీకార మొనర్చి నీబాధఁ దీర్చెదనని పలుక వాఁడు సంతోషస్వాంతుడై యిట్లనియె. సుందరీమణీ ? నా బాధఁ దీర్చెదనని నీవు ప్రతిజ్ఞ జేసితివి గావునఁ జెప్పెద వినుము, వికసితానేక నవలతావిరళ పరిమళ మిళితమై మనోజ్ఞమగు నీ ప్రదే శమున సదృష్టశరీరహతకుని నుండి యేతెంచిన పుష్పశిలీముఖ సహస్రముల వలన నాడెందము పగులుచున్నది. కరుణా తరంగితాంతరంగవై రక్షింప నీవె సమర్దురాల వని పలికెను.
ఆ పలుకులు ములుకులవలెఁ జెవులకు సోక, ఛీ ! అనంగశర పీడితుండగు నీ దురాత్ముని మాటల వలన నిష్కారణమ మోసపోతిని. బ్రాహ్మణుఁ డెవఁడైనఁ దపస్వినులం జూచి యిట్లు మదనమోహితుండగునా ? వీఁడు నిక్కముగ బ్రాహ్మణా కృతినున్న యొక తుచ్చుండు. నే నిప్పుడేమి చేయఁదగును ? కానిమ్ము. వీ డొనర్చిన మాయకుఁ బ్రతిగ మాయయే ప్రయోగించి యవ్వలకుఁ బోయెదంగాక యని మదిలోఁ దలంచి నాపైనున్న వల్కలంబునఁ గొంత విడఁజింపి మహానుభావా ! దీనిం గైకొని మీఁద గప్పికొనుము. అట్లొనర్చితివేని దళసరిగానున్న యీ వల్కలఖండము నీకుఁ గవచప్రాయమై కట్టెదుటి విటపికుసుమ మందలి శిలీముఖమె కాకుండ నీవనకుసుమకుటీ రముల నివసించియున్న మధువ్రతనితతి నెల్ల నిన్నంటకుండిఁ జేయఁగలదు. పుష్ప శిలీముఖ బాధనుండి నిన్ను రక్షించుటకు నాకుఁ దోచిన యుపాయ మయ్యదియ నీ మాటల విని నే నొనర్చిన ప్రతిజ్ఞ నిట్లు నెరవేర్చుకొంటిని. తథ్యవచననై నాదారిని నేను పోవుచున్నానని పలికి యీవల్కలశకలము వానిఫైఁ బడవైచి వాఁడెవఁడో నేనొన ర్చిన దానికిఁ గోపించి నాకేమి కీడు సేయఁ దలంచునో యను భయంబెన వేధించు చుండ నతిరయంబున నంబరంబున కెగిరి పోవుచుంటిని.
వాడును నిజాభిప్రాయవిరుద్ధముగ నట్లు జరుగుటకు పూత్కార మొన ర్చుచు నేను ప్రతిన నెరవేర్చుకోగలిగితినో నా మాటల ధోరణి నెరింగి మహాక్రోధ మున మండిపడుచు నోసీ ! పాషండినీ మృషాపాండిత్యలవదుర్విదగ్ధా ! పుష్పశిలీసుఖ శబ్దమునకు బుష్పశరుడగు మనోభవుండును నర్ధముండగా పుష్పమందలి శిలీముఖ మగు భ్రమరమని శ్లిష్టార్ధవ్యాఖ్యాన మొనరించి నన్ను వంచించి పోవజూచుచుంటివా ? ఎందు బోగలవు ? యిప్పుడు నన్ను జూడుము. బలాత్కారముగ నిన్ను బరి గ్రహించెదను. అప్పుడైన నన్నంగీకరింపకుందునా ? అంగీకరింపకున్న నృశింహ ఖర ఖర తీవ్రంబగు కృపాణమున నీ కుత్తుక నుత్తరించి వై చెదనని నిష్టురముగ వచించుచు నత్యంత భాసురమదభ్ర దంష్ట్రాకరాళవదనమున నొప్పు నిజభయంకర రాక్షసస్వరూపమును బూని గగనమార్గమున నా వెంటబడెను.
అప్పుడు నేనతి భయమున ముందు బరువెత్తుచు నెట్లో యిచ్చటకు జేరు కొని యిందు గనంబడిన మహాంధకూపము మార్గమున నధోభువనమున కేగు దలం పున దానియందు బడితిని. కాని యా పాపాత్ముండు విలపించుచున్న నన్ను బట్టు కొని ప్రహరింపనెంచి యిష్టదైవమును స్మరించుకొమ్మని పలుకుచుండగనే నా సుకృత విశేషమున మీరేతెంచి మృత్యుముఖకందరమునుండి నన్నుద్ధరించితిరి.
నాప్రియసఖికి బ్రాణప్రియమైన భవదీయాకారము జిత్రపటమునం దీక్షించి నప్పుడు చిత్రకారు డెవడైన దన నైపుణ్యము నిరూపించుట కట్లూహించి చిత్రించి యుండెనా ? లేక తన ప్రభుని యాకృతికి విశేషగుణముల గల్పించి లిఖించియుండెనా? కాక మరొక చిత్రకారునితో బందెము వైచుకొనే యపురూపపురూపమును నిర్మించి యుండెనా ? అటుగాదేని యెవడైన నెవనికొరకైన బుద్ధికుశలత్వము మీర నా క్రియ వ్రాసియుండెనా? యని సందియమందితిని. లావణ్యమున మన్మధునికన్న మిన్నగ జిత్రింపబడిన యే నరేంద్రుని స్వరూపమునుగాంచి విరహాతురయై యుదయసుందరి యట్టి యవస్థపాలైనచో యట్టి స్వరూపము నేడిందు నాకు బ్రత్యక్షమయ్యెను. కాని యా యన్నులమిన్నయెక్కడ నెట్లు కాలము గడుపుకొనుచున్నదో యెరుంగ నైతినని యనుకొని సఖీదుఃఖసంభారమున గన్నులనుండి బాష్పముల విడచితిని.
దేవా ! ఇదియే నా వృత్తాంతము. నీవే నా ప్రాణసఖికి జీవితేశ్వరుండవు. మీ దేశ మెద్దియో చక్రవర్తి లక్షణముల బొల్పొందుచున్న మీకు రాజధానియైన నగ రము పేరెయ్యదియో పుణ్యపురుషుండవగు నీవు జన్మించుటకతన నే కులము బవిత్ర వంత మయ్యెనో, మా యుదయ సుందరీ మదనజ్వరాపహరణ మంత్రంబగు భవదీయ యోగ్య నామధేయ మేమో, యెరుంగ మిగుల గుతూహలపడుచుంటిని. త్రిభువనశ్రీ సర్వమై, మదనుని మొలకయై శంఖపాలకులి జీవితమై యొప్పు నా యనుంగుసఖి యిప్పుడెందున్నదో గదా ? బంగారమందు మాణిక్యవర్తివలె నిన్నెన్న డైన గూడి భాసిల్లగలదా ? భవదీయ విరహదాహార్తదశ నెన్న డైననామె విడచిపెట్టి సుఖించునా ? నాకెన్నటికైన నామెను వెదకుచు దిరుగు కష్టముదీఱునా? యని బలుకుచు భూమీంద్ర నందనుని వదనముఫై జూడ్కులు బఱపుచుమిన్నకుండెను. రాజేంద్రుండు దన కుదయ సుందరీ సంఘటనము దుష్కరమని వాడిన ముఖపద్మమువలన సూచించుచుండ, విశ్వభూతి యేది యెట్లు జరుగనున్నదో యట్లే జరుగగలదని బోధింప దారావళి నచ్చ
టనే నిద్రింపవిడచి తాను నిజనివాసమునకు బోయెను.
గీ. సుదతి నెఱిఁదినకతన సమ్మదరసంబు
నామెఁ గాంచక కడువిషాదాతిశయము
రెండును విరుద్ధగతిఁ బ్రసరించి వాని
నిద్రను హరింపగా శయనించె నతఁడు.
337 వ మజిలి
ఇంతలోఁ దెల్లవాఱెను. అతివికట కుక్కుటకుటుంబ కటురవంబున
మేల్కొన్న విలాసవనవిహంగమశ్వ్రేణుల కలకలం బతిశయింప, దేవాలయమందిరంబుల
మ్రోగింపఁబడు నవసరవాదిత్ర సమూహధ్వనులు జెలంగ, విబుర్ధసింధురనియంత్ర
మునకై హస్థిళారాంతరాళంబులకుఁ గొనిపోఁబడిన శృంఖలాక్వణత్వారరవంబు
మిగులఁ, గలళంబులం బితుగఁబడుచున్న క్షీరధారల మూత్కారడంబరం బడరఁగుల
కాంతలు దధిమధనం బొనర్పఁ బెరుకుకుండల మధ్యంబునఁ బెట్టి వడివడిగాఁ ద్రిప్పు
కవ్వముల ధరత్కారంబు నివ్వటిల్ల, నదీస్నానోపకరణంబులఁ గానక కలవరంపడు
శ్రోత్రియద్విజుల కోలాహలంబు బెంపెక్కఁ, బాంధుల ప్రయాణసన్నాహనిస్వనంబతి
శయింప, రాత్రియెల్ల మేల్కొనియుండుటచేఁ దూలుచు నిజగృహంబుల కేఁగు యామిక
జనులసందడి మీఱ, రతిరస నిద్రాల సవిలోచనలై బిరబిర పూఁదోటలకు బరువెత్తు
మాలాకారతరుణుల పదఘట్టనలు మితిమాఱ, నిద్రం జొక్కియునప్రగల్భతర భుజంగ
సంఘమును మేల్కొల్పు వేశ్యాంగనల హుంకారధ్వనులు బెచ్చు పెఱుగ, నన్యకాంతా
సక్తుఁడై ప్రియుం డరుగ వలవంతంబడి యతం డరుదెంచినతోడనే కలకలఁదేరి ఎదురు
వచ్చు మానివతుల సాధువచనంబులు జెలరేగ, గృహజనుల మొదట మేల్కొల్పు
పంజరస్థశారికానికరములపలుకుల రొదల ప్రబలమగుచుండ, మిధునవృత్తి నుదీర్ణములై
నిద్రాంతోన్మిషితసంస్కారములైన క్రీడాశుకములకలకలంబతిశయింప, బుణ్యపధాను
వృత్తులై హరికీర్తనలఁ బాడువృద్దులపాటలసవ్వడి బెంపెక్క ఱుఁగ, ధర్మక్రమాను
లగ్నులై దేవస్తుతులఁబఠించు మునిమాణవకో త్తముల సందడి యలరారఁ, గ్రమక్రమ
ముగా నిద్రనుండి లేచి ప్రాతఃకృత్యంబులఁ బ్రవర్తించు సకలజనపదాలాపనిస్వనంబు
మితిమీఱ, దిగ్ముఖములం దతిపృధుప్రభాటల సముదయోదయంబై శుభమయారంభ
సంరంభమై ప్రభాతం బతిమనోహరంబయ్యెను.
అప్పుడు దినరాజలప్రవేశంబునకు జేయఁబడిన సముచిత శుభసత్కారముల లీలఁ బ్రతిగృహంబుముంగిటను గలయంపులుజల్లి మనోహర రంగావళులు దీర్పబడి యుండెను. సాయంకాలమున వికసించి తెల్ల వారుసరికి తొడిమలపట్టువదలి నేలరాలి యున్న మాలతీకుసుమ నికురుంబమువలన నతిమనోహరంబుగఁ బుడమియెల్ల నలంక రింపఁబడి యుండెను. మేల్కొన్న యన్ను మిన్నల వదన సరోజామోదమునకు
----- మధుకరశ్రేణు లడుగడునకుఁ గట్టఁబడిన తోరణములవలె నలరారుచుండెను.