కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/335వ మజిలీ

భూధరములందును, జాహ్నవీ రేవారి మహానదులందును, సర్వప్రదేశములందును, జలాశయములందును, నుచితరీతుల భూలోకమునఁ దిరుగు భుజంగభటులకుఁ గమల కంఠుఁడు నాయకుఁడై యుండవలెను.

జంబూద్వీపంబున కావలఁ గల మహాద్వీపము లారింటిలో శాకద్వీపంబున దుర్మదుండును, కుశద్వీపంబునఁ గాలాంజనుండును, గ్రౌంచద్వీపంబునఁ జక్రాహ్వ యుండును, శాల్మలీద్వీపంబున సరళుందును, గోమేదంబున నసీముఖుండును, బుష్క్ల రంబునఁ దాపిచ్చకుండును బరికింపవలెను. అందులవణసాగరము మొదలు స్వాదూరక సముద్ర పర్యంతము గలసప్తాంబుధులయందునగమేద్యదణుప్రభృతి సర్పశౌండీరు లెల్ల దిరుగవలెను. పిమ్మట హృదయవేగుండు నాయకుండుగా నెనమండ్రు కాకోదర భట శ్రేష్ఠు లష్టదిక్పాలుర నగరంబుల సంచరింపవలెను. పిదప స్వర్లోకమున కేఁగి త్రిదశుల రాజధానుల, సిద్ధుల నగరంబుల, విధ్యాధనుల పురంబుల, మిగిలిన దేవతా స్థానముల, బ్రహ్మలోకమువరకు మేరుపర్వతము జుట్టును, వెదకుచు, సప్తోర్ధ్వలోక ములు సంచరించవలెను. ఈ సేన కెల్ల నింద్రవీలుం డధిపతిగా నుండఁగలవాఁడు అని యిట్లు పురాణకమఠమునుండి బ్రహ్మలోక పర్యంతము గల బ్రహ్మాండగర్భ మెల్ల గాలించి యుదయసుందరి యెచ్చటనున్నదో తెలిసికొనవలెనని యా భుజంగ వీరులనెల్ల నుత్సాహపరచి యతిత్వరితగతి నాశిఖండతిలకుఁడు వారిఁ బంపివేసెను.

335 వ మజిలీ

నేను నుదయసుందరీవియోగదుఃఖమును భరించి స్వయముగా నామె ప్రవృత్తి నరయదలంచి యామెకెట్టిగతి గలిగెనో తెలిసికొని యట్టిగతినే పొంద నిశ్చ యించుకొని యిట్లని యాలోచించుకొంటిని. ఉదయసుందరి కెట్టిగతి గలిగెనో యెరుంగకుండ ముందు నే నేమి జేయగలను ? అమె యెవనిచేతనై న నపహరింపఁబడి యుండునను ననుమానమున నెచ్చటికి బోదును ! సీతాపహరణమువలన స్ఫుటప్రతీతు లగు రక్కసులు స్త్రీల నపహరించుటయందు సహజవ్యసనులుగదా ? అట్టిరక్కసు లకు నిలయమైన లంకాపురం బీసముద్రాంతర ద్వీపమునకు సమీపముననే కలదు. కావున ముందుగ నందు వెదకి పిదప మఱొక చోటికిం బోయెదంగాక. భాగ్యవశమున నాకచ్చటనే యామె గనుపించిన నాహృదయవాంఛిత మీడేరగలదు యువకులకు విరాళిగొల్పునిట్టి తరుణీరూపమున నేనందు బోయియింటింటికి దిరుగుచున్న యెడల నాకు గూడ హాని గలుగగలదు. కావుల భస్మ జటావల్క_లాదులచే గృత్రిమతాపసిత్వమును వహించి యందు జరించెదంగాక యని నిశ్చయించి యప్పుడే యట్టివేషమును దాల్చి విమానమువలె నభమున నతిజవమున గొనిపో దగిన పాదుకల సంపాదించి వానిం దొడిగికొని నిర్గమించి లంకాపురమున కేగితిని. పూర్వము శ్రీరామునిచే బరిగృహీతమైన రణాధ్వరకుండమున బ్రజ్వరిల్లు ప్రతాపానలజ్వాలలవలె ప్రకాశించుచున్న కనకమయా శేష దివ్యమందిరాగార ప్రాకారద్యుతికలాపముల దూరము నుండియే తిలకించితిని, పిమ్మట నుదయసుందరిని వెదకుటకు నగరపరిసరమునకరిగియందు సీతామహాదేవి నివసించుటచే బవిత్రవంతమై శింశుపాతరువుమూలమున బ్రసిద్ధికెక్కి రావణనిర్మిత మగు నుద్యానమున బ్రవేశించితిని.

తొల్లిబందిగమందుంపబడిన సీతనేత్రములనుండి యజస్రముస్రవించిన కాటుకకంటిధారలచే మలినమగుటవలన భూదేవి కూతున కబ్చిన కష్టములుగాంచి దుఃఖాతిదాహదగ్ధయైనట్లు శ్యామలత్వమును వహించియున్న శింశుపావృక్షచ్ఛాయలం దిలకించితిని. కుపితుడగు హనుమంతుని కరతలచ పేటాస్ఫాలనమున విదళితుండెన యక్షయకుమారుని వధ్యస్థానమందలి రక్తపాతమ లీల గైరిక రాగముచే నెఱ్ఱనైన క్రీడా గిరిపరిసరమును జూచితిని.

అచ్చటకు సమీపమున నక్షవధాస్వాదలుబ్ధుడగు హనుమంతునిచే జంప బడిన జంబుమాల్యాది రాక్షససేనలయస్థిముకురములవలె దెల్ల నైన ఱాళ్ళచేజుట్టును నరు గులుగట్టబడిన వృక్షములు గాంచితిని. మారుతిని బంధింపవిడువబడిన పరుషపాళోరగ గరశానల శిఖలవలన దహింపబడుటచే తృణవిటపిశూన్యమైన యింద్రజిత్తుయుద్ధ భూమిని గనుంగొంటిని. ఉదయసుందరిని వెదకుచు నే నాయారామమున దిరుగుచుండ రామలక్ష్మణ భుజాస్త్రధారా వకర్తనోచ్చలిత మౌళివలయులగు మేఘనాధప్రభృతి రాక్షసవీరుల పాదఘట్టనములవలనను, దత్కబంధ తాండవమువలనను సమతలంబైన ప్రదేశములు గొంచె మచ్చటచ్చట గోచరించుచుండెను.

మరియును దాశరధి కరళరాఘాతవిఘటితాయుష్యుండగు కుంభకర్ణుని కులాచలసన్నిభంబగు కళేబరము బడుటచే దృటితమై త్రికూటగిరిశిఖరశిలాఖండము పడుటవలన బలమైన ప్రదేశము వీక్షించితిని. అతికుతూహలమున నంబరమందు గూడి యున్న సురశిబిరము కరములనుండి యెడతెగక పడిన పారిజాతకుసుమ సముదాయా మోదమున నిప్పటికిని బరిమళించుచున్న రామరావణసంగ్రామ స్థలమును గనుం గొంటిని. పిదప దశకంఠుని రాజధానిం జొచ్చితిని. అందొకచోట సంగ్రామవృత్తాంత మెరిగి భయచకితురాలైన మండోదరి నూఱడింప బలికిన రావణునిమాటలను నేర్చు

కొని యొకపంజరమందున్న చిలుక యిట్లు పఠించుచుండెను.


గీ. రాముఁడు మురారి నిజము సుర ప్రవరులు
    కపిభటుల, నాదు దోర్బలగరిమ సురలు
    బందెఁ బడలేదే ? మురవైరి యందులేఁడె ?
    భయ మికేటికి నాబహిఃప్రాణథనమ !

మఱొక్కచోట రావణవధానంతరము వాని నుద్దేశించి కొందరు సుర ద్వేషులు పలికిన విచారభాషణముల నింకొకచిలుక యిట్లు పఠించుచుండెను.


ఉ. హా ! దశకంఠ హా ! ప్రభువ ! హా ! సురశాసక ! హా ! మహోగ్రకా
    ర్యాదర ! యెందునుంటివొగదా ? నినుఁబాసిన యిప్పురంబు మ
    ర్యాదలఁ జూడు నీదుభవనాంగణఘృష్ణులనైనఁ ద్రొక్కగా
    రాదను దివ్యు లిందిపుడు ప్రస్తుతిగాంతురు పూజ్యులైసదా.

వేఱొక్కచోట శూన్యాయతన మండప గర్భమందు విశ్రాంతికై చేరిన వై దేశికనిశాచనులు రావణవధావిధానమందలి విధివైపరీత్య వృత్తాంతమును విచారభావ మునఁ జెప్పుకొనుచుండ నిట్లు వింటిని.


గీ. సేవకులుగా మెలంగిన దేవసంఘ
   మమర వానరజాతియం దధిభవించి
   కడక దశకంఠుఁ బొరిఁగొనఁ గలుగు డహహ !
   దైవవైపరీత్యమునఁగదా ! తలంప.

ఇట్లు లంకాపురమున రామరావణ మహాసంగ్రామ సంబంధమగు వృత్తాంత మనేకవిధముల నెరుంగుచు నందందుఁ దిరుగుచుంటిని. అపూర్వ తపస్విని యేతెంచె నని నాచుట్టును మూగు వృద్ధసమూహము మూలముననైన నుదయసుందరి వార్తఁ దెలిసి కొనవచ్చునను నాసతో నానగరమందు లోపలను, వెలుపలను, మూలమూలఁ బరి భ్రమించి యెందును నామెసడిఁ దెలిసికొనఁజాలక నిరాశఁ జేసికొంటిని. ఇంతలో యువతీరత్నాపహరణంబున బ్రసిద్ధికెక్కిన విద్యాధర కుమారుల మాట జ్ఞప్తికి వచ్చు టయును వారికిఁ క్రీడాస్పదంబులగు మలయాది గిరిగహ్వరములయం దామెజాడఁ దెలిసికొనవచ్చునని దలంచి యందుఁ బోవ గగనంబున కెగిరి యతిజవమున నరుగు చుంటిని.

336 వ మజిలీ

ఇట్లేఁగుచుండ నొకచోఁ బ్రాంతగిరి గహ్వరమునందు రక్షింపుము రక్షింపు మని పూత్కారపూర్వకముగ నాక్రోశించు బ్రాహ్మణరూపధరుండగు నా నిశాచరాప సదునిఁ గనుంగొంటిని. అయ్యో ! బ్రాహ్మణుండాపన్నుఁడై యున్నాఁడని దలంచి జాలిఁగొని ససంభ్రమంబునఁ జేరువకుఁ బోయి సాదరవాక్యముల నోబ్రాహ్మణుఁడా ! నీయాపద దేనివలనఁ దీరునని యడుగఁ గళ్యాణీ ! నీవలననే నాబాధ తొలగఁగలదని వచించెను. అప్పుడు నే నోహో ! నే నొనర్పఁ దగిన దేమో సత్వరమ జెప్పు మందు లకుఁ దగిన ప్రతీకార మొనర్చి నీబాధఁ దీర్చెదనని పలుక వాఁడు సంతోషస్వాంతుడై యిట్లనియె. సుందరీమణీ ? నా బాధఁ దీర్చెదనని నీవు ప్రతిజ్ఞ జేసితివి గావునఁ జెప్పెద వినుము, వికసితానేక నవలతావిరళ పరిమళ మిళితమై మనోజ్ఞమగు నీ ప్రదే శమున సదృష్టశరీరహతకుని నుండి యేతెంచిన పుష్పశిలీముఖ సహస్రముల వలన నాడెందము పగులుచున్నది. కరుణా తరంగితాంతరంగవై రక్షింప నీవె సమర్దురాల వని పలికెను.

ఆ పలుకులు ములుకులవలెఁ జెవులకు సోక, ఛీ ! అనంగశర పీడితుండగు నీ దురాత్ముని మాటల వలన నిష్కారణమ మోసపోతిని. బ్రాహ్మణుఁ డెవఁడైనఁ దపస్వినులం జూచి యిట్లు మదనమోహితుండగునా ? వీఁడు నిక్కముగ బ్రాహ్మణా కృతినున్న యొక తుచ్చుండు. నే నిప్పుడేమి చేయఁదగును ? కానిమ్ము. వీ డొనర్చిన మాయకుఁ బ్రతిగ మాయయే ప్రయోగించి యవ్వలకుఁ బోయెదంగాక యని మదిలోఁ దలంచి నాపైనున్న వల్కలంబునఁ గొంత విడఁజింపి మహానుభావా ! దీనిం గైకొని మీఁద గప్పికొనుము. అట్లొనర్చితివేని దళసరిగానున్న యీ వల్కలఖండము నీకుఁ గవచప్రాయమై కట్టెదుటి విటపికుసుమ మందలి శిలీముఖమె కాకుండ నీవనకుసుమకుటీ రముల నివసించియున్న మధువ్రతనితతి నెల్ల నిన్నంటకుండిఁ జేయఁగలదు. పుష్ప శిలీముఖ బాధనుండి నిన్ను రక్షించుటకు నాకుఁ దోచిన యుపాయ మయ్యదియ నీ మాటల విని నే నొనర్చిన ప్రతిజ్ఞ నిట్లు నెరవేర్చుకొంటిని. తథ్యవచననై నాదారిని నేను పోవుచున్నానని పలికి యీవల్కలశకలము వానిఫైఁ బడవైచి వాఁడెవఁడో నేనొన ర్చిన దానికిఁ గోపించి నాకేమి కీడు సేయఁ దలంచునో యను భయంబెన వేధించు చుండ నతిరయంబున నంబరంబున కెగిరి పోవుచుంటిని.

వాడును నిజాభిప్రాయవిరుద్ధముగ నట్లు జరుగుటకు పూత్కార మొన ర్చుచు నేను ప్రతిన నెరవేర్చుకోగలిగితినో నా మాటల ధోరణి నెరింగి మహాక్రోధ మున మండిపడుచు నోసీ ! పాషండినీ మృషాపాండిత్యలవదుర్విదగ్ధా ! పుష్పశిలీసుఖ శబ్దమునకు బుష్పశరుడగు మనోభవుండును నర్ధముండగా పుష్పమందలి శిలీముఖ మగు భ్రమరమని శ్లిష్టార్ధవ్యాఖ్యాన మొనరించి నన్ను వంచించి పోవజూచుచుంటివా ? ఎందు బోగలవు ? యిప్పుడు నన్ను జూడుము. బలాత్కారముగ నిన్ను బరి గ్రహించెదను. అప్పుడైన నన్నంగీకరింపకుందునా ? అంగీకరింపకున్న నృశింహ ఖర ఖర తీవ్రంబగు కృపాణమున నీ కుత్తుక నుత్తరించి వై చెదనని నిష్టురముగ వచించుచు నత్యంత భాసురమదభ్ర దంష్ట్రాకరాళవదనమున నొప్పు నిజభయంకర రాక్షసస్వరూపమును బూని గగనమార్గమున నా వెంటబడెను.

అప్పుడు నేనతి భయమున ముందు బరువెత్తుచు నెట్లో యిచ్చటకు జేరు కొని యిందు గనంబడిన మహాంధకూపము మార్గమున నధోభువనమున కేగు దలం పున దానియందు బడితిని. కాని యా పాపాత్ముండు విలపించుచున్న నన్ను బట్టు కొని ప్రహరింపనెంచి యిష్టదైవమును స్మరించుకొమ్మని పలుకుచుండగనే నా సుకృత విశేషమున మీరేతెంచి మృత్యుముఖకందరమునుండి నన్నుద్ధరించితిరి.

నాప్రియసఖికి బ్రాణప్రియమైన భవదీయాకారము జిత్రపటమునం దీక్షించి నప్పుడు చిత్రకారు డెవడైన దన నైపుణ్యము నిరూపించుట కట్లూహించి చిత్రించి యుండెనా ? లేక తన ప్రభుని యాకృతికి విశేషగుణముల గల్పించి లిఖించియుండెనా? కాక మరొక చిత్రకారునితో బందెము వైచుకొనే యపురూపపురూపమును నిర్మించి యుండెనా ? అటుగాదేని యెవడైన నెవనికొరకైన బుద్ధికుశలత్వము మీర నా క్రియ వ్రాసియుండెనా? యని సందియమందితిని. లావణ్యమున మన్మధునికన్న మిన్నగ జిత్రింపబడిన యే నరేంద్రుని స్వరూపమునుగాంచి విరహాతురయై యుదయసుందరి యట్టి యవస్థపాలైనచో యట్టి స్వరూపము నేడిందు నాకు బ్రత్యక్షమయ్యెను. కాని యా యన్నులమిన్నయెక్కడ నెట్లు కాలము గడుపుకొనుచున్నదో యెరుంగ నైతినని యనుకొని సఖీదుఃఖసంభారమున గన్నులనుండి బాష్పముల విడచితిని.

దేవా ! ఇదియే నా వృత్తాంతము. నీవే నా ప్రాణసఖికి జీవితేశ్వరుండవు. మీ దేశ మెద్దియో చక్రవర్తి లక్షణముల బొల్పొందుచున్న మీకు రాజధానియైన నగ రము పేరెయ్యదియో పుణ్యపురుషుండవగు నీవు జన్మించుటకతన నే కులము బవిత్ర వంత మయ్యెనో, మా యుదయ సుందరీ మదనజ్వరాపహరణ మంత్రంబగు భవదీయ యోగ్య నామధేయ మేమో, యెరుంగ మిగుల గుతూహలపడుచుంటిని. త్రిభువనశ్రీ సర్వమై, మదనుని మొలకయై శంఖపాలకులి జీవితమై యొప్పు నా యనుంగుసఖి యిప్పుడెందున్నదో గదా ? బంగారమందు మాణిక్యవర్తివలె నిన్నెన్న డైన గూడి భాసిల్లగలదా ? భవదీయ విరహదాహార్తదశ నెన్న డైననామె విడచిపెట్టి సుఖించునా ? నాకెన్నటికైన నామెను వెదకుచు దిరుగు కష్టముదీఱునా? యని బలుకుచు భూమీంద్ర నందనుని వదనముఫై జూడ్కులు బఱపుచుమిన్నకుండెను. రాజేంద్రుండు దన కుదయ సుందరీ సంఘటనము దుష్కరమని వాడిన ముఖపద్మమువలన సూచించుచుండ, విశ్వభూతి యేది యెట్లు జరుగనున్నదో యట్లే జరుగగలదని బోధింప దారావళి నచ్చ

టనే నిద్రింపవిడచి తాను నిజనివాసమునకు బోయెను.


గీ. సుదతి నెఱిఁదినకతన సమ్మదరసంబు
   నామెఁ గాంచక కడువిషాదాతిశయము
   రెండును విరుద్ధగతిఁ బ్రసరించి వాని
   నిద్రను హరింపగా శయనించె నతఁడు.

337 వ మజిలి


ఇంతలోఁ దెల్లవాఱెను. అతివికట కుక్కుటకుటుంబ కటురవంబున మేల్కొన్న విలాసవనవిహంగమశ్వ్రేణుల కలకలం బతిశయింప, దేవాలయమందిరంబుల మ్రోగింపఁబడు నవసరవాదిత్ర సమూహధ్వనులు జెలంగ, విబుర్ధసింధురనియంత్ర మునకై హస్థిళారాంతరాళంబులకుఁ గొనిపోఁబడిన శృంఖలాక్వణత్వారరవంబు మిగులఁ, గలళంబులం బితుగఁబడుచున్న క్షీరధారల మూత్కారడంబరం బడరఁగుల కాంతలు దధిమధనం బొనర్పఁ బెరుకుకుండల మధ్యంబునఁ బెట్టి వడివడిగాఁ ద్రిప్పు కవ్వముల ధరత్కారంబు నివ్వటిల్ల, నదీస్నానోపకరణంబులఁ గానక కలవరంపడు శ్రోత్రియద్విజుల కోలాహలంబు బెంపెక్కఁ, బాంధుల ప్రయాణసన్నాహనిస్వనంబతి శయింప, రాత్రియెల్ల మేల్కొనియుండుటచేఁ దూలుచు నిజగృహంబుల కేఁగు యామిక జనులసందడి మీఱ, రతిరస నిద్రాల సవిలోచనలై బిరబిర పూఁదోటలకు బరువెత్తు మాలాకారతరుణుల పదఘట్టనలు మితిమాఱ, నిద్రం జొక్కియునప్రగల్భతర భుజంగ సంఘమును మేల్కొల్పు వేశ్యాంగనల హుంకారధ్వనులు బెచ్చు పెఱుగ, నన్యకాంతా సక్తుఁడై ప్రియుం డరుగ వలవంతంబడి యతం డరుదెంచినతోడనే కలకలఁదేరి ఎదురు వచ్చు మానివతుల సాధువచనంబులు జెలరేగ, గృహజనుల మొదట మేల్కొల్పు పంజరస్థశారికానికరములపలుకుల రొదల ప్రబలమగుచుండ, మిధునవృత్తి నుదీర్ణములై నిద్రాంతోన్మిషితసంస్కారములైన క్రీడాశుకములకలకలంబతిశయింప, బుణ్యపధాను వృత్తులై హరికీర్తనలఁ బాడువృద్దులపాటలసవ్వడి బెంపెక్క ఱుఁగ, ధర్మక్రమాను లగ్నులై దేవస్తుతులఁబఠించు మునిమాణవకో త్తముల సందడి యలరారఁ, గ్రమక్రమ ముగా నిద్రనుండి లేచి ప్రాతఃకృత్యంబులఁ బ్రవర్తించు సకలజనపదాలాపనిస్వనంబు మితిమీఱ, దిగ్ముఖములం దతిపృధుప్రభాటల సముదయోదయంబై శుభమయారంభ సంరంభమై ప్రభాతం బతిమనోహరంబయ్యెను.

అప్పుడు దినరాజలప్రవేశంబునకు జేయఁబడిన సముచిత శుభసత్కారముల లీలఁ బ్రతిగృహంబుముంగిటను గలయంపులుజల్లి మనోహర రంగావళులు దీర్పబడి యుండెను. సాయంకాలమున వికసించి తెల్ల వారుసరికి తొడిమలపట్టువదలి నేలరాలి యున్న మాలతీకుసుమ నికురుంబమువలన నతిమనోహరంబుగఁ బుడమియెల్ల నలంక రింపఁబడి యుండెను. మేల్కొన్న యన్ను మిన్నల వదన సరోజామోదమునకు

----- మధుకరశ్రేణు లడుగడునకుఁ గట్టఁబడిన తోరణములవలె నలరారుచుండెను. వికసితనదకుసుమలాటికలఁ జెలంగు మాలినీలతా సీమంతసిందూరధోరణి విపంచిత

మహోత్సవాచారము లీల భాసిల్లెను. క్రీడాసరో‌వరంబులఁ బుండరీకమును జెలఁగి యుండెను. సహజశీతలంబగు ప్రభాతమందమలయానిలయంబు హృదయంగమమై యొప్పియుండెను. కాలక్రమంబున గతించిన నిశీధివీకపాలములీలఁ దెల్లనగు హిమాంశు బింబమస్తశైలకూలంబునఁ గూలిపోయెను. అంత--


ఆ. వె. ఉడుగణంబు విడువకుండె నిప్పటికైన
        భృగుగురుప్రధానవిబుధుల నని
        తీవ్రకోపమూను దినకటాక్షచ్ఛాయఁ
        బుట్టై నరుణ రేఖ పెడుపుగొండ.

పిమ్మటఁ బ్రభాత లక్ష్మీసింధూరతిలకంబులీల నంబరంబున నర్కబింబము బొడసూపెను.


గీ.‌ సర్వజగదుగ్రరోగముల్‌ సంహరించు
    సూర్యభగవానుఁ డుదయింప జుక్కలనెడి
    కుష్టరోగంపుమచ్చ లకుంఠగతిని
    నంతమొందెను నంబర మందునెల్ల

అంత దిక్కు నెల్లనహస్కరుకిరణసహస్రంబులఁ బ్రకాశించుచుండెను. జలాశయంబులఁదమ్ములు వికసించుచుండెను. నికేతనంబులఁ దల్చంబులనుండిలేచిన మానినుల కటాక్షములు విలసిల్లుచుండెను. అట్టి ప్రభాతసమయంబున వందిమాగధుల స్తోత్రపాఠంబులను, మంగళతూర్యనాదంబులను బుండరీక రాజేంద్రుండు నిద్ర మేల్కొని శయ్యనుండి లేచివచ్చి ప్రాతఃకృత్యముల నిర్వర్తించుకొని ప్రియమిత్రుం డగు కుమారకేసరిం బిలిపించి వానితో రాత్రిజరిగిన వృత్తాంతమెల్లఁజెప్పి యుచితరీతిని దరుణేందు శేఖరు నతిభక్తినిత్యానుక్రమణికంబుగ నర్చించెను. మదనమోహితుండగు నతండు రాత్రిజరిగినదియెల్లఁ గలలోనివార్తవలెఁ దలంచుచు నిజమెఱుంగ వెండియుఁ దారావళిని దర్శించి యామెకుఁ జిత్రపటమును‌ జూపించి యుదయసుందరీకథావర్ణన రసైక సౌఖ్యం బనుభవించుచు ననంగమార్గణోదగ్రవేదనాదుఃఖమును బోఁగొట్టుకొన నెంచి యీశ్వరాయతనవృత్తాంతము నెఱింగించిన కుమారకేసరితో భద్రదంతావళము నెక్కి విశ్వభూతిమఠమున కరిగెను. మఠద్వారప్రదేశమునందే పరిజనులనెల్లనుండ నియమించి తాను గుమారకేసరితో విశ్వభూతి శిష్యవర్గము దారిఁజూపుచుండ లోనికరిగి యందుచితస్థానంబున నాసీనుఁడై యుండెను. వానిరాక నెఱింగి విశ్వభూతి తారావళితో నటకేతెంచి నాఱేఁ డాతపస్వినికిఁ బ్రణమిల్లి యాశీర్వాదములఁ బడసి యామె యొసం గిన కుసుమదామమున వినయంబున గ్రహించెను. పిమ్మట విశ్వభూపతి వచ్చా ! షి ఒఆంపోజ ము న్‌ంచుక యవిష్టమున్నది. దానం వాస నాంతలను అంతవరకు దారావ? మీసన్సి తనుండ్‌ యఖీష్షకథా ప్రసంగమునఁ బ్రొద్దుపుచ్చఁగలదని వచించి లోనికఱిగెను. పిమ్మట రాజేంద్రుండు తారావళితో సగౌరవంబుగ రాత్రి సుఖముగా నిద్రించితివాయని ప్రశ్నించుచు గను సన్న నామెకుఁ గుమార కేసరిం జూపి భగవతీ ! ఈతఁ డెవ్వఁడో జ్ఞాపకమున్నదా? యని యడుగుటయును నామె వానింజూచి మందహాసభాసురముఖారవిందయై దేవా ! ఎఱుంగుదును. సముద్రాంతరమందలి శంకరాలయమున మా యుదయసుందరికిప్రాణ ప్రదంబైన చిత్రపటముతో శాపోపహతుండైన మహాత్ముఁడే యీతఁడు ఈతఁడెప్పగిది స్వస్వరూపమునుబొంది మిమ్ముగలసికొనఁ గల్గెనోయెఱుంగఁ గుతూహలపడుచుంటినని పలుక నా రాజేంద్రుఁ డావృత్తాంతమెల్ల నామూలచూడముగా నామెకుఁ దెలిపి తాంబూలకరండ వాహిని చేతియందున్న యాచిత్రపటమును స్వయముగాఁ గైకొని తారావళి కందిచ్చెను.

చిత్రగతమైయున్న యుదయసుందరీ స్వరూపమును జూచినతోడనే తారా వళి విరహవ్వధాగాఢపీడనంబున నంతఃకరుణయంత్రమునుండి వెల్వడుచున్నట్లునయన ద్రోణులనుండి బాష్పధారలు గారుచుండ జాలిమొదవురీతి హా ! ప్రియసఖీ! యుదయ సుందరీ ! చిరకాలమునకు నిన్ను జిత్రముననైనఁ జూడఁగల్గితిని. అభీష్టజనుల నెల్ల విడిచి నీ వెచ్చట కాలముగడుపుకొనుచుంటి వని విషాదమేదుర హృదయారవిందయై మైమరచి చేతనున్నపటమును జారవిడచి కరయుగంబు ఫాలతలంబునఁ జేర్చుకొని మోమువంచి కన్నీరు కాల్వలై పారఁ బెద్దయెలుంగునఁ రోదనం బొనర్పసాగెను.

అట్లు రోదనంబొనర్చుచున్న యామెంగాంచి యా రాజమార్తాండుండు మారాడఁజాలక కరుణాకటాక్షములఁ గుమారకేసరిపైఁ బరగించుటయును నతం డేలిక యభిప్రాయమెఱింగి తారావళి నిట్లని‌ యూరడింపఁదొడంగెను. భగవతీ ! అభీష్టవస్తు వియోగంబున హృదయవిదారకంబుగ విలపింపని ప్రాణి యెందును నుండడుగదా ! అందును స్త్రీలు దుఃఖమాపుకొనఁజాలరు. ధీమంతులు జిత్తమును స్వాయత్తముగ నొనర్చుకొనవలెను. విధినియోగంబున నెప్పుడేది సంభవించినను దానినెల్ల నోర్పున ననుభవించుటయు కర్తవ్యము. సర్వతత్వవిశేషంబుల నెఱింగిన నీకు నే నేమని యుప దేశింపఁగలను ! నీ హృదయంబును బాధించు ప్రేమబంధమును ద్రెంపివేయుము. ఉదయసుందరి నేరీతిఁ గనుంగొనవచ్చునో యాలోచించి యట్టి ప్రయత్న మొనరించు టయే యిప్పుడు జేయవలసిన కృత్యమని కుమారకేసరి బోధించుచున్నసమయంబున విశ్వభూతి తారావళి యాక్రందనము విని యం దేతెంచి సాదరవాక్యంబుల నామె నోదార్చెను. వారి యనునయవాక్యంబుల సేదదేరి తారావళి విశ్వభూతి యొసంగిన గమండలూదకముచే ముఖకమలసమ్మార్జనం బొనర్చుకొని యెఱుపెక్కిననాసాపుటంబు లమర నీరెలుంగున నిట్లనియె. రాజచంద్రమా ! నీయంతికమున నా ప్రియసఖిం గాంచక నిముసమైన నేనిందు నివసింపఁ జాలను. ఈ చిత్రపటమును జూచుచున్న కొలఁది నా హృదయానుతాప మభివృద్ధి జెందుచుండెనని పలుకుచు విచారోద్రేకంబున నింకేమియు మాటాడఁజాలక మిన్నక గన్నీరు విడువఁదొడంగెను.

తారావళి దుఃఖమును గాంచి పుండరీకుండును దన కుదయసుందరియందుఁ గల యనురాగంబుకతన బుట్టినవిచారము నెడద నడంచుకొని దీర్ఘ నిశ్వాసంబులవిడుచు చుండఁ దిలకించి కాలోచితంబుగ విశ్వవిభూతి వాని కిట్లనియె వత్సా ! నీవేల నట్లుం డెదవు ? సంవియోగంబున నతిచంచలహృదయైయున్న యామె చిత్రప్రదర్శనంబున విచారాంబుధి మునింగియున్నది. ధీరోదాత్తుండవగు నీవు ముందుచేయఁదగిన కృత్య మేమో యెట్లాయుదయసుందరిని గనుంగొనవలెనో, యిందుల కెవరిసహాయము గావ లెనో, యెచ్చటెచ్చటి కెవరెవరిని బంపించవలెనో, యాలోచింపుము


చ. సకలసముద్రముద్రితవిశాల ధరాతల చక్రమందునన్‌
    బ్రకటమహాహిలోకమున స్వర్భువనంబున‌ నెందునున్నఁ గొం
    కక వెదకించి యాతరుణిఁగాంచి రయంబున నిందుఁదెచ్చి ము
    ద్రికగతి హస్తమందుఁ గడుప్రీతిధరింపుమ ధర్మసిద్ధికై.

మర్త్యలోకమం దవతరించిన సువర్ణావాహనుండవగు నీరసాధ్యమెందును లేదు. కావున సత్వరమ యిందుండిలేచి పౌర్వాహ్ణికకృత్యంబులనెల్ల నిర్వర్తించు కొనుము వేళ యతిక్రమించుచున్నది అని తారావళి మొగంబై తారావళీ ! నీవిట్లేల యింకను పరితపించెదవు ? మహారాజు స్వయముగా నామెను వెదకించుటకుఁ బ్రయత్న మొనరింపఁగలఁడు విధికూడ వీనికి వెఱచును. కావున నవ్విధి యనుకూలుఁడై యచిర కాలముననే మీ కాయుదయసుందరిని సమకూర్పఁగలడు. అని విశ్వభూతి పలుకఁ దారావళి స్వస్థచిత్తయై పూజ్యురాలవగు నీమాటలు యధార్దములగుగాక యని వచించి రాజుతో వాని నివాసంబున కేగవలెనని దలంచియు నట్లొనర్చుట గౌరవలోపమనియెంచి విశ్వభూతి ననుసరించి పోయెను.

రాజును నిజనివాసంబున కేగి యధోచిత కాలకృత్యంబుల నిర్వర్తించు కొనుటయం దనాకులుఁడై యున్నను గుసుమశరశిలీముఖ పరంపరాఘాతముచే డెంద మునఁబడిన బెద్దగాయము తారావళినయన జలబిందువుల నీరుపట్టి బాధించుచుండ నిట్లు దీర్ఘ ముగ విచారింపఁ దొడంగెను. అన్నా ! ఆ మోహనాంగి నెందుఁగనుంగొన గలను ? సౌధశిఖరంబున నిద్రించు నామెను దద్రూపమోహంబున నెవ్వఁడో యపహ రించియుండును. అట్టి యువతీరత్నము నీక్షించి యెవఁడు గైకొనక విడిచిపెట్టఁ గలడు ? నిఖిలసులక్షణలక్షితమగు నామె కళ్యాణరూపమున కెన్నడు నపాయము గలుగనేరదు. ఈ బ్రహ్మాండగర్భమున నామె యెచ్చటనున్నదో యే యపాయంబుఁ దెలిసికొనఁగలను ? ఆమె జనకుండగు శిఖండతిలకుండు తదన్వేషణంబునకై పెక్కు మంది దూతలంబుచ్చెనని వింటినిగదా ? వా రామె నెందైనఁ గనుంగొని పాతాళము నకుఁ దోడ్కొనిబోయినచో నాకెట్లు గోచరముకాగలదు. అట్లు నిక్కముగఁ బితృ గృహంబునకుఁ గొంపోబడియున్నచోఁ దారావళి సహాయమున్నను నా కామె లభింపఁ గలదని యెట్లూహింతును ? ఇంతకు నామె యెచ్చటనున్నదో తెలియక నేనేమి చేయఁ గలను? ఎచ్చట వెదుకఁగలను? మనుష్యులకు నరలోకమును దాటి పోవుటకు శక్తిలేదు గదా? ఎల్లలోకములఁ దిరుగశక్తిఁగలవారు సురసిద్ద విద్యాధరోరగయక్షరాక్షసులని యావాక్యాంతమందలి రాక్షసశబ్దమున స్మృతినభినయించుచు బాగు బాగు చక్కఁగా జ్ఞప్తికి వచ్చినది మదీయ విక్రమైకలభ్యమిత్రుండగు మాయాబల నిశాచర వీరుండు కలఁడుగదా? వానిచేత నాయిందుముఖిని నెల్లలోకముల యందును వెదకింపవచ్చును. దీనికై యింక యలజడిం బడనేమిటికని తలంచి నిశ్చలచిత్తుఁడై యామాయాబలుని ధ్యానించెను.

అంతలో సౌమ్యుఁడగు విప్రుని యాకారంబున మాయాబలుం డేతెంచి దేవా ! నీ వెవనిని ధ్యానించితివో యతఁడే నీ ముందున్నవాఁడని యెఱుంగుము. ఎందుకొఱకు నన్ను దలంచితివో యా పనికి సత్వరమ నియోగింపుము. బ్రహ్మాండ శిఖరము మొదలు బాతాళము వఱకును దిరిగి యెట్టి దుర్ఘటకార్యమునై నను క్షణములో సాధింపఁగలనని చేతులుజోడించుకొని నమస్కరించుచు ఱేనియెదుట నిలువఁబడి యుండెను.

అంత నా రాజముఖ్యుండు జిత్రగతమైయున్న యుదయసుందరీ స్వరూప మును జూపించుచు వయస్యా ! ఈ యాకృతిఁగల లలనారత్నము త్రిభుజవనంబుల నెందున్నఁదో వెదకిరమ్మని యాదేశింత నానక్తంచరవీరుం డతిరయంబున నంతర్హి తుండయ్యెను. వాఁ డరిగిన పిదపఁ బుండరీకుండును మాయాబలుండు తప్పక యా వేదండయానను గనుంగొనిరాఁగలఁడను నాశతో నాదినమును గడపెను. మఱియు నుదయసుందరియందలి గాఢానురాగంబుకతంబున నతం డంతరంగమున దశవిధ విరహాస్థలపాలగుచు నిట్లని వితర్నించుకొనెను.


మ. చలియో వేడియో భూమిదాటునెడ విస్తారంబుగాఁబుట్టి పెన్‌
     గలతన్‌ బెట్టఁగ నూత్నబందిగమునన్‌ గాడాంబుగా నాయెడన్‌
     గల మోహమందున మన్మధాస్త్రవిహతిన్‌ గాయంబునుగాంచి, గా
     సిలి యాకాంత లతాంగమక్కటకటా! జేటందెనేమోగదా ?

అయ్యో ! అశేషశుభసంపదల కాస్పందబగు నా నారిశిరోరత్నము నశించె నని సంశయించుట ప్రమాదముగదా ?


మ. సతిపై కోర్కెఁజరించు నాహృదయా మాశ్యామాతితారుణ్యసం
     భృతసర్వాంగయుతాంగజోత్సవలసద్రీతిన్‌ నితంబోదరా


    యత వక్షోజముఖాదిసంపదలచే నాతిథ్యమున్‌ బొంది యం
    చితలీలన్‌ సుఖియించుచుండ నింక హానింగాంచు టెట్లొప్పెడిన్‌.

గీ. అట్లు చిరకాల మాకోమలాంగియందుఁ
   దవిలి సుఖియించు నాదు చిత్తంబదెల్లఁ
   దద్వశంబయ్యె నింకెట్లు తరలఁగలదు ?
   ఉవిద విడనాడివచ్చుట‌ యొదవుటెట్లు ?

కావున

గీ. అరయ బ్రహ్మండమను వార్ధి నధిమధింప
   గలుగు శ్రీదేవివోలె నాకలికిమిన్నఁ
   బడిసి యురమందుదాల్చి నే వసుధయందు
   నచ్యుతుఁడనై చెలంగెడ నహరహంబు.

మఱియు నాదృష్టి యనంగతాప దుస్థితింబడు విరహిణివిధంబునఁ జరణ పల్ల వాస్తరణంబున నెప్పుడు పొర్లాడును ? ఎప్పుడు చిగిర్చిన లతవలె జంఘోరు దండము నూతగొని మహానందంబునఁ బ్రసరించును ? విలాసవతియగు వేశ్యలాగున నెప్పుడు జఘనాంగణంబున నిలచియుండును ? భయాకులయైన భుజగిపోల్కె నాభీ రంధ్రంబున నెప్పుడు బ్రవేశించును? విస్మయప్రచారంబున నలసటంబడిన పడతిగతి నెపుడు త్రివళిమండపము నాశ్రయించి యుండును ? యౌవనవిడంవితయగు స్వైరిణి లీలఁ గురులాంధకారంబున నెపుడు సంచరించును ? రాగిణియను సిందూర లేఖచాడ్పున సీమంతసీమ నెపుడుజేరును ? హర్షోద్రేకంబునఁ ద్రుళ్ళిపడు శహాచందమున నెపుడు లావణ్యపయోధి నెల్లెడల విహరించును ? హృదయమునకు సుఖమొనఁగూర్చు నామె మంజులాలాపములు మదీయకర్ణ వివరంబున నెన్నదఁబడును ? పర్యంత తీక్ష్ణ‌మగు తూలికకరణి నామెదృష్టి యెప్పుడు నాయంగభిత్తికపైఁ బరిభ్రమించును? కళ్యాణవతి యగు నామెనిధానకలశముభాతి మత్కర మందెపుడుబడును? రత్నమాలపోలిక నవరుచిస్థానమగు మదీయకంఠము నెన్నఁ డామె యాలింగన మొనర్చుకొనును? అని యీ రీతి ననేక విధంబులఁ దద్రూపభావనా విశేషంబున ననుక్షణము హృదయంబునఁ బుట్టు కోర్కెలచేత విశ్రాంతి నెఱుంగక మన్మధపరితాపంబున నాఁడు గడపెను.

338 వ మజిలీ

మఱునాఁడు ప్రాతఃకాలమునఁ గృపావతియను విశ్వభూతి శిష్యురాలు రాజుసమక్షమున కేతెంచి జయజయధ్వానంబున వాని నాశీర్వదించుచుఁ బద్మదామం బుపాయనముగ నొసంగి యుచిత గౌరవమంది రాజున కిట్లనియె. రాజచూడామణీ ! నీవు మఠమునఁ దారావళిని విడచివచ్చినపిమ్మట మా నిర్బంధంబున నామె యాహ్ని విధుల నెట్లో నిర్వర్తించి యుదయసుందరికొఱకు బెంగఁగొని సంతతము గన్నీరు విడచుచు నారాత్రియెల్ల గడపినది. ప్రభాతంబుననే లేచి పుష్పావచయము నెపంబు,న గుసు... వాటికకుఁ బోయెను. కాని యామె తిరిగిరాలేదు. ఉదయసుందరీ వియోగ దుఃఖమున నొంటరిగా నెచ్చటికింబోయి యుండెనో యెఱుంగజాలక మే మామెకొఱ కం దందా దినమంతయును వెదకితిమిగాని యామెజాడ యేమియును దెలిసినదికాదు. తమతోఁగూడ జెప్పకపోవుటచేతఁ “బూర్వపరిచితుఁ డెవఁడైన గనంబడి యామెను నిజనిలయంబునకు సగౌరవంబుగ నాతిథ్య మొసంగ దోడ్కొనిపోయి యుండవచ్చును. మాతోఁ జెప్పకయె పోవుటకు దారావళి యవివేకురాలా యేమి? ఉదయమునఁ దప్పక తిరిగిరాఁగల” దని‌ తలంచితిమి. కాని యట్లు రాలేదు. నేఁటి కామె యరిగి మూఁడు దినములై నది. ఉదయసుందరిని విడచియున్న నిన్నుఁజూడజాలక యామెను వెదకి తెచ్చుటకు వెనుకఁ దనయింటినుండి యెట్లు వెడలివచ్చినదో యట్లే యిపుడును బోయి యుండును. కావున మీరామెకొఱకు విచారంపఁబనిలేదు. ఆమెను వెదుకఁ జూచుటవలన నిసుమంతయును బ్రయోజనములేదు. ఆ యన్వేషణ ప్రయాస ముదయసుందరికొఱకు బడుట యుక్తము. తారావళియును నుదయసుందరిని వెదుక నెల్లెడలఁ దిరుగుచుఁ దనంతట తానేరాఁగలదు అని యిట్లు విశ్వభూతి యాదేశ మెఱింగించిఱేని సమ్మతింప జేసి వాని నాశీర్వదించి సంతసంబున‌ నిజవాసంబున కరిగెను.

పిమ్మట నా రాజేంద్రుండు తారావళి మాయమగుటకు విస్మయంబందుచు నుదయసుందరీ సంస్మరణంబు మాత్రంబుననే మదన మూర్చితుండగుచు స్త్రీరత్న ఫలితమగు దన యాశాకల్పలతికకు మూలమై చెంతనున్న కుమారకేసరి నమృతరసావ నేకశుభగంబులగు చూపుల నీక్షించుచు నిట్లనియె మిత్రమా! తారావళి యెందేగి యుండును ? ఏ మార్గంబునఁ బోయియుండును ? అమె నిక్కముగఁ బ్రియసఖి నీ భూమండలంబున వెదకుటకే యరిగియుండునా ? మార్గమధ్యమం దెందైన నపాయము సంభవింపదుగదా ? ఏమిజరగియుండునని యడుగుచు నంతలో నీకా యుదయసుందరి యెచ్చట గనంబడెను? ఎట్లు చూచితివి? అందేమి చేసెను ? ఏమని పలికెను ? ఎచ్చటనుండి యేతెంచెను? ఏ కులంబునఁ బొడమెను ? ఎచ్చట దిరుగుచున్నది ? అని ప్రశ్నించుచు జెప్పినది చెప్పినట్లు వినినది వినినట్లు తెలిసినది తెలియనట్లు మఱల మఱల నడిగినదే యడుగుచు హృదయానువర్తియగు గుమారకేసరివలన మాటిమాటి కా వృత్తాంతమును వినుచున్నను మరచుచు నా రాజేంద్రుండు కొన్ని దినంబులు గడ పెను.

మేఘముల నలుపును బాపుచు నేను కూడదన్న హరిణలాంఛలుండు విశేష దీప్తింగాంచి నిజకరంబుల ననంగశరాహతి నవసియున్న యీఱేని బాధింపఁగలడని శరత్కాలము గతించెను. నిరంతరము నుదయసుందరీ థ్యాననియతుఁడైయున్న యా


నియమంబునకుఁ క్రొత్తవరిచేలయందుఁ దిరుగు క్రౌంచపక్షుల కఠని
నేనుండి యంతరాయము గలిగింపరాదని హేమంతము నిష్క్ర మించెను. స్మరానలదందహ్యమానుండగు భూమండలా ఖండలునకుఁ జిత్తసంతాప

శమనం బొనర్పఁదగు పద్మకాననమందలి యివకఁ బోఁగొట్టుచు నేనుండుటఁ దగదని శిశిరంబ దృశ్యమయ్యెను. మలయగిరి శిఖరసరసీతరంజల సంపర్కంబునఁ జల్ల నైన పిల్ల వాయువులు వ్యజనోపకరణంబుగ గ్రహించి యవిరళవకుళకుసుమకోశము లందలి మధురసజలంబును నార్ద్రోపకరణంబుగఁబూని వికలదతివిశది సిందురారసంభృతాసల్ప తరపరాగంబు స్వేదాపహరంబగు కర్పూరచూర్ణంబు డంబునవహించి నవీన కోమల తరుప్రవాళ నికరంబును మృదుతల్పంబుగఁ గల్పించి సమయమునకుఁ దగినరీతి నీ రాజేంద్రున కుపచారముల నొనరింతునని వసంత మేతెంచెను.


మ. అతిసౌఖ్యాస్పదమౌ వసంతమునఁ జూతాంకూరమే మన్మధా
     యతబాణంబయి మానినీవిమలశీలాకర్షమున్‌‌జేసి, యు
     ద్దత రాగాంధులఁ జిత్తముల్‌ గలచి నిత్య౦బున్‌ వియోగిన్య సు
     ప్రతతిన్‌ బుచ్చుచుబాంధులన్‌ గెడపుచున్‌ బాధించుముల్లోకముల్‌.

మఱియును,

ఆ. వె. ఇంపుమీఱు నామ్రసంపదలను మించు
        నవ్వసంతసమయమందుఁ గలుగు
        పికరుతంబుదోచె విరహుల మదినాటు
        స్మరుని బాణశల్య శబ్దమట్లు.

త్రిభువనంబుల కానందమును‌గూర్చు నట్టిపసంత సమయంబున మలయ కామినీ కర్ణపూరారవిందకోశంబులం బ్రవేశించు నుత్సాహంబున నలసి పయోధితటా రామంబుల విశ్రమించుచు తా మపర్ణీ తరంగడోలికల శిశువువలెనే గేరింతములుగొట్టుచు గావేరీకూల లతాగృహంబులయం దతిధులవలెనే నివసించుచు గోదావరీజల తుషారము లతో బధికులవలెనే కరసికొనుచు, మృగమదమషీలిఖితంబులగు పాండీకపోలవ్రతంబుల బండితులవలెనే విమర్శించుచుఁ, గంతలీధమ్మిల్ల వేలీగతంబులగు కుసుమమంజరుల మాలికాకారుల విధంబున సరిఁజేయుచు, మన్మధనిధానములగు నాంధ్రసీమంతినీ స్తనకలశంబులసు సిద్దులవలెనే బయల్పెట్టుచు, పున్నాగమధురసస్వేదంబులగు మహా రాష్ట్ర కుటుంబినుల యూరుస్తంభంబుల మల్లురవలెనే కలయఁగలుపుచు, పరిమళ మిళితాళికవచంబులఁ జెలంగులాట లీలావతుల వళులను వీరభటులవలెనే యెగఁబ్రాకుచు గర్ణాటనారీకుచపత్ర కస్తూరికాప కిలపధంబున మందగమనంబు నందుచు త్రిలింగ తరుణీకురుల వనశీతలచ్చాయల సేవించుచు సవిభ్రమాభీరభామినీముఖా మోనంబునఁ బరిమళించుచు, జందనగిరిపరసరోద్యానమండలంబునఁ జలించి గుసుమలతికలకు హస్తకాభినయానాదుల నేర్పు భరతాచార్యునివలె నలరారుచుఁ జల్లనిపిల్ల వాయువులు దక్షిణదిగంగనాశ్లేష మిళితతర్పూరసౌరభంబుతోఁ బ్రసరించుచుండెను. అట్టి యుత్కృష్టవసంతసమయంబునఁ బుండరీకరాజేంద్రుండు సర్వదా యుదయసుందరినే ధ్యానించుచు మదనతాపంబునఁ బొగులుచుండెను. ఒకనాఁ డతఁడు ప్రియవయస్యుండగు కుమారకేసరింగూ ప్రమదావనంబున విహరించుచు నొకచో నక్షివిక్షేపంబున ముందుజూపుచు వాని కిట్లనియె. సఖా ! ఆకాసారతీరంబున నీక్షిం పుము.


ఉ. ఆనళినీవనంబున నితాంతము గాంతనుబాసి విభ్రమా
     సూనమనఃప్రవృత్తిని మనోజమహాగ్రహమేచఁగాఁ బ్రలా
     పానుగతుండునై యళుఁ డహా ! యదె తమ్మిదుమారమూని పె
     న్దీనత శూన్యమందచటఁ ద్రిమ్మరు బంభరడింభకాళితో.

గీ. కేళికావనసీమ నీక్షింపు మదిగొ
    ప్రధిత పున్నా గపుష్పపరాగమెల్ల
    నరయ గంధోపలక్షోదమట్లె యువక
    హృదయముల నంగజాగ్ని దీవింపఁజేయు.

గీ. మలయమారుతడోలిక నలరి మొదలు
    విడచు ఘనరేణుధోరణి వెలయుచున్న
    చూతమంజరి క్రకచికఖాతి నహహ
    విరహుల మనంబులనునెల్లఁ దరుగఁదొడఁగె.

ఇట్లు మదనోన్మాదుండై పలుకుచున్న యా రాజేంద్రుని మాటల నాలకించి కుమారకేసరి డెందంబున నిట్లు తలంచుకొనెను. ఔరా! ఈ మహారాజిప్పుడు మన్మధ హతకునకుఁ బూర్తిగా వశ్యుఁడై యుండెనుగదా! ఇచ్చటనుండి వీనిని వేఱొకచోఁటికిఁ దీసికొనిపోవుట సాధ్యముగాదు. మఱియు నిట్టిప్రదేశమును విడిచిపోయిన విరహార్తుఁడగు వీన బాధ తగ్గనేరదు. కావున నిచ్చటనేయుండి వీనికిఁ గలిగిన మన్మధవ్యధ యేయుపా యంబున నివర్తింపఁబడఁగలదో యర సెదం గాక యని ముందుజూచి ససంభ్రమంబున ఱేని‌ కిట్లనియె. దేవా! అటుచూడుము వనవీరుఁడను కిరాతరాజువలనఁ నెచ్చటనుండియో సంపాదించికొనిరాఁబడుచు దారకుఁడు గళ్ళెమును బట్టుకొని నడిపింప జీనుగట్టఁబడి, సర్వర్తురాజగు వసంతుఁడుబంపిన కానుకయట్లు దిక్పాదులుకు నీవు నడచుట కిష్టపడక యొసంగినదానివలె ననన్యయోగ్యమగుటచే దేవేంద్రునివలనఁ నొసంగఁబడిన యుపా యమునవోలె, నీకుఁ దగినవాహనముగ విధాతచేత నిర్మింపఁబడినవోల్కె నొప్పుచుఁ బ్రభూతవేగంబున రూపొందిన వాయువురీతి, సాక్ష్కాత్కరించిన మనస్సుగతి, రూపాంతరోత్పత్తివిధ౦బున నలరారుచు, సర్వాంగసుందరమై, శుభలక్షణలక్షితమై యదృష్టపూర్వమగు మనోహరాకారమున మించు నాయశ్వ శ్రేష్టమును దిలకింపుమని కుమారకేసరిపలుక‌ నారాజేంద్రుండు విస్మయంబున నావైపు దిలకించెను. ఇంతలో నాయశ్వముతోఁ గిరాతరాజు సమీపమున కేతెంచి రాజునకుఁ బ్రణామము లాచరించి యిట్లనియె దేవా! నేఁడు నేను వింధ్యగిరిపరిసరారణ్యంబునఁ దిరుగుచుండ నొకచో నాయెదుట నంబరతలంబునుండి యీయశ్వరాజు మత్యంతహరిత దూర్వాస్తంబంబుపై మోరబై కెత్తుకొనిబడెను. అంబరమ నందలి రవిరథతురంగము సరసదూర్వాహారకాంక్షచే క్షోణీతలంబున కవతరించెనో లేక యీ యద్రిశిఖరమున నమతుఁ డెవ్వఁడై న విహరించుచుండ వాని వాహనము బ్రమాదమునఁ గ్రిందఁబడెనో నే నెఱుంగను. కాని దాని యద్బుతసుందరాకారమును దిలకించి విస్మయపడుచు నేనిట్లు తలంచుకొంటిని. ఆహా ! అసదృశాకారముననొప్పు నీయశ్వ మెవ్వరిదై యుండును? ఎచ్చటనుండి వచ్చినది? రవిరధతురంగమస ప్తముకన్న మిన్నగ దీనిని విధాత నిర్మించి యుండవచ్చును. సముద్రగర్భమునుండి వెల్వడిన యుచ్చైశ్రవంబు దీని నీక్షించి సిగ్గు పడుటచేతనే దానికి పుడమినుండుభాగ్యము లేకపోయెను. ఇట్టి వాహనరత్నమును బరిత్యజించి హరిణమునెక్కి దిరుగుటచేతనే సమీరణునకుఁ జంచలుఁడని లోకంబునఁ బ్రతీతిగల్గెను. దేవతలగుఱ్ఱముకన్న నుత్కృష్టాకారమున నొప్పు నీయశ్వము నధిరో హించుటకు మనుష్యమాత్రుం డర్హుండు గానేరఁడు. అధిష్టించినను నడిపింపనోఁడు. కావున దీనిని నతలోక దేవేంద్రుండవగు నీకుఁ గానుకగా సమర్పింపఁదలంచి యశ్వ శిక్షానిపుణుండగు దారకునిచే దీనిని బట్టించి జీనుమొదలగు పరికరంబుల నాయత్తపరి పించి దేవరసమక్షమునకుఁ దోడ్కొని‌వచ్చితిని. పిమ్మట దేవరయే ప్రమాణమని యూరకుండెను.

అప్పుడు కుమారకేసరి “ఆహా రాజేంద్రుని మనంబును రసాంతరంబునకు ద్రిప్పుటకు మంచియుపాయమే దొరకెను. ఈ యశ్వము నెపంబున వీని విరహావర్దను మరపించెదంగాకయని దలంచి యీయశ్వము సర్వాంగములఁ బరీక్షించి రాజేంద్రున కిట్లనియె. స్వామీ ! అవధారు అశ్వజాతులు తొమ్మిదింటియందును నుత్తమంబగు “తో కోరా” జాతియం దియ్యది సంభవించినది. శ్రేష్టంబులగు నశ్వలక్షణంబు చెనమి దింటిని దాల్చియున్నది. ఎత్తు పొడవు లావు యెన్నియంగుళము లుండవలెనో‌ యట్టి పరిమాణము గలిగియుండుటచే నతియుత్కృష్టమైనది. చెవులు శాస్త్రమందుఁ జెప్పఁ బడినట్లు లఘువులై శ్రేషత్వముకు దెల్పుచున్నవి. కేసరత్వక్తనూరుహంబు లెట్లు మృదువుగానున్నవో దిలకింపుము. జానుజంఘాననంబులు బుష్టిలేకయుండుట పరికిం పుము. నయనదళనస్తంబులు స్నిగ్ధములై యుండెను. మెడ నిడుపైనది. డెక్కలు గఠినములై యున్నవి. లలాటకటిస్కంధపుష్టాక్ష వక్షస్థలంబులు విశాలంబులై యున్నవి. వర్ణచతుష్టయంబులో ముఖ్యమైన పాటలవర్ణంబు గలగియున్నది. ఎచ్చట శుభావర్తము యుండవలెనో యచ్చటనే యవి చిహ్నితములై యుండెను. శంఖధ్వనిఁబోలు షేషారవం బునఁ జెలఁగియున్నది. దివసత్వంబును, నగ్నిచ్చాయమును బంకజసౌరధంబును, విలాసత్వరితగమనంబునుగలిగి, సప్తప్రకృతులయందును నుత్కృష్టుతులయందును నుత్కృష్టమగు సత్వప్రకృతిచే నలరారుచున్నది. వీని యదయవలక్షణము లన్నియును శ్రేష్టత్వమునే స్పష్టపరచుచున్నవి. ఇది యుత్తమాశ్వము దేవర యధిరోహింపఁదగి యున్నది. కావున నోదేవా ! నీవత్యంతముదంబున నీయశ్వంబు నధిష్టించి యశ్వశిక్షా నిపుణుండవై గతవిశేషంబుల నడిపింపుమని యాదరంబున మనవిసేయ నారాజేం ద్రుండు సకౌతుకంబున దాని నధిష్టించి వివిధగతుల నడిపింపఁ దొడంగెను.

ఇంతలో నతిరయంబునఁ గరభకుఁడను సేవకుఁడు రోఁజుచు యొడలెల్లఁ జెమ్మటలుగ్రమ్మ నిట్టూర్పులంబుచ్చుచుఁ బరువెత్తుకొని వచ్చి దేవా! మోసమయ్యెను. మోసమయ్యెను. ఎచ్చటనుండియో యొకదురాత్ముఁ డేతెంచి ధ్వంస మొనరంచు చున్నాఁడు. వానిని గ్రహింప మే మశక్తులమైతిమి ఉద్యానమును రక్షింపుము రక్షింపు మని భయగద్గదస్వరంబునఁ దడఁబడుచుఁ బలికెను. ఆ మాటలకు విస్మయమందుచు నందున్నవారు “ఓరీ! ఎవఁడు వాఁడని రెట్టించి యడుగ భయకంపితుండై “వాఁడు, వాఁడు” అని వచించు సేవకుని మాట లారాజముఖ్యునకు నవ్వుబుట్టించెను.

రాజు వాని పిరికితనంబునకు లోలోన నవ్వుకొనుచు మడమలచే నా తురంగము నదలింది బరువెత్తించి కుమారకేసరి ప్రభృతులు వెంటరా క్షణములో నా ప్రదేశమునుజేరి ముందు నలువంకలఁ బరికించెను. అందొక లతామండపమునుండి యింకొక లతామండపమునకు నొకచెట్టునుండి యింకొక చెట్టుమీఁదకును దుముకుచు, వనపాలుర బెదరింపుల లెక్కగొనక యతివిక్రమంబునఁ బరిభ్రమించుచు, ఱేని చిత్త వికారమును బోఁగొట్టు హాస్యరసంబున కాస్పదంబై దుర్ణయప్రవృత్తయై, వికటస్వ రూపయై చపలస్వభావయై, మాటి మాటికి నొడలు గోకికొనుచు, గోధుమవర్ణముగల త్రాచుబామువలెఁ బృష్టభాగంబున లాంగూలము వ్రేలాడుచుండ, నెఱ్ఱనిముఖమును దీర్ఘదంతములును జూపరులకు భీతిఁగొలుపుచుండ, దంతనిష్కర్షణంబున వనపాలకుల నెకసక్కెములాడుచు నటవీచరవేషముల యందు విదూషకపాత్రమువలె, కాంతార నగరమందలి విటునిలీల, నారామగ్రామఫలంబులకు భోక్త విధంబున నొప్పుచు నత్య ద్బుతమహాకారభాసురమగు నొకవానరశ్రేష్టము గనంబడెను.

దాని నీక్షించి యారాజేంద్రుడు తదీయస్వరూపంబునకువిస్మితుండగుచు, దాని చైతన్యప్రవృత్తి నగ్గించుచు, దానిఫలగ్రహణ సామర్థ్యంబు నెన్నుచు తిర్యగ్జాతి యందు బుట్టినను మనుష్యస్వభావ వ్యాపారంబుల మెలంగుదానిని బొగడుచు ప్లవగ జాతియందుఁ బుట్టినను నట్లు నిర్భయముగా రక్షకభటులనెల్ల మర్దింపఁగలిగిన దాని సామర్ద్యంబు నభివర్ణించుచు, నిట్లు మనంబున వితర్కించుకొనెను. ఔరా! ఎవ్వఁడైన నిజశరీరమును మరుగుపరచి యిట్టిస్వరూపంబున విహరించుటలేదుగదా? రామాయణం బున సుగ్రీవనలనీలోంగద ప్రభృతులు దివ్యాంశజులని విందుము. వారిలో నెవ్వఁడైన నిట్లేతెంచియుండలేదుగదా? లేక మధ్యలోకవర్తియగు నాహనుమంతుఁడే యిందు వచ్చి యుండెనేమో ! కానిమ్ము. ఈవానరచేష్టితం బులఁ బరికించి యేమిచేయవలెనో యట్లే యొనరించెదంగాక యని దలంచుచుండ‌ పసంతశీలుఁ డేతెంచి యిట్లనియె.

దేవా ! ఈకోఁతి యెచ్చటనుండివచ్చుచుండెనోగాని ప్రతిదినమిం దేతెంచి మమ్మెవ్వరిని లక్ష్యముసేయక నవపాకమధురంబులగు ఫలంబులేరి కోసికొనిపోవు చుండును. చిత్రమేమన దా నొక్కపండైన దినినట్లు గనంబడదు. ఆఫలంబుల నెచ్చటి కెందులకుఁ గొనిపోవుచుండెనో దీని నెట్లు నిగ్రహింపవలెనో మాకుఁ దెలియకున్నది. నేఁ డేలినవారు స్వయముగా నేతెంచిరి గావున జరిగినదెల్ల మనవి చేసికొంటినని పలుక నతివిస్మయావేశహృదయుఁడై యారాజేంద్రుండు దానిని స్వయముగా నిగ్రహింపఁ బూనెను. అప్పుడు -


గీ. శుభదళాప్రతిముఁడు భూభుజుండు నైన
    నతఁడు రా ధుర్దినమువోలె నాప్లవఁగము
    తరుణరవిక్తముఖముతోఁ దరలిపోయె
    వనమునందుండి ఫలసంపదను హరించి.

గీ. చరణవిన్యాసమున దూఁకు శక్తి దెలియఁ
    బూర్వదేహంబు నిగుడించి ముడుచుకొనుచు
    వడిగ నడచుచు మెడఁ ద్రిప్పు దెడపఁదడప
    నదిగొ యిదిగో యనఁగ మాయమయ్యెఁ గోఁతి.

అయ్యది యుద్యానమును ధ్వంస మొనరించెనను కోపంబును నందలిఫలం బులఁ దానుదినకుండ నేమిటికిఁ గొనిపోవుచుండెనోయను విస్మయంబును బొందుచు నారాజేంద్రుండు కళప్రహరంబున దురంగము నదలించి మహాక్రోధంబున నావాన రము పిరుంద నరిగెను. అతి జవంబునఁ బోవుచున్నదానిని బట్టుకొనుదలంపునఁ గుమారకేసరి ప్రభృతులు దన్ననుసరించి రాజాలక నిలిచియుండ నారాజేంద్రు డే కాకియై యాప్లవంగమువెంట మిగులదూర మరిగెను. అట్లు వాయువు కన్న వేగంబునఁ బోవు ప్లవంగ‌ము ననుసరించి పుండరీకునియశ్వమేఁగుచుండ దానినోటినుండి పడిన నురుగుముద్దలు వెనుకవచ్చు మారుతునకు మార్గముజూపు గుర్తులై యొప్పెను. ఒకదాని కన్న నింకొకటి ముందుండవలెనను స్పర్థచే దుముకుచున్న నగ్రచరణ ద్వంద్వముతో నాయశ్వము మహావేగంబున ముందుకుఁ బోవుచుండెను. ఆ యశ్వగమనవేగంబు నిక్షీంచి రాజు విస్మయమందుచు నౌరా! ఈ హయరత్నము వియత్పధంబున నెగిరి యరుగుచున్నదా యేమి? ఎవఁడయిన నదృశ్యరూపంబున దీనిని పైకెత్తుకొనిపోవు చుండలేదుగదా? ఎవఁడయిన మాయావి దీని నావేశించి యుండి యిట్లు బరువెత్తుచుండె నేమో ! లేకున్న దీని కిట్టివేగమెట్లు గలుగఁ గలదని బహువిద వితర్కవ్యగ్రహృదయం బున ముహూర్తమాత్ర మకృతావధానుఁడై యుండెను. అంత నొక్కచో ననేక తరుశకుంతకూజితారావతుములంబున దెలివిఁబొంది తా నొక మహారణ్యమధ్యంబునఁ దిరుగుచున్న ట్లెఱింగెను. ఎదుర నెందుఁజూచినను గొండలతో నిండియున్న ప్రదేశమేగాని యామర్కట మందుఁగనంబడదయ్యెను. ఇఁక ముందుఁబోవుట కశక్యమగురీతి నడ్డముగానుండి యగస్థ్యునివలన మోసగింపఁబడుట యెఱింగి రోషమొంది పెరుగుచున్న వింధ్యనగేంద్రములీల దక్షిణ దిక్కునెల్ల నాక్ర మించుకొనియుండి గౌరీతపశ్చరణపంచాగ్నులచే మంచు కరిగిపోయిన హిమాద్రివలె, హరపదస్పర్శాప్రభావంబున స్ఫటికపాండుకుష్టువుం బోఁగొట్టికొనిన కైలాసముగతి, వార్థక్యంబునఁ గాంచ నచ్చనింబాసిన మేరువువిధంబున నొప్పుచు నదభ్రశిఖర కృతా భ్రంబగు నొక్కభూభృద్వరంబును గనుంగొనెను.

అప్పుడు రాజు విస్మయమందుచు సత్వరంబునఁ గళ్ళెమును లాగిపట్టి గుఱ్ఱ మును నిలిపి దాని నవరోహాణం బొనరించి యలసట వాయ ఘనశీతలచ్ఛాయల నొప్పు నొకవృక్షముక్రిందకు జేరెను

339 వ మజిలీ

విచిత్ర సమ్మేళనము

అప్పు డాపుండరీకరాజేంద్రుండు నలువైపులం దిలకించి విభ్రాంతుఁడై యిట్లు చింతించెను. ఆహా ! ఇప్పుడు నే నేమహారణ్యంబునఁ జిక్కుకొనియుంటిని? ‌ బ్రహ్మాండవలక కీలకంబుగ నొప్పుచున్న యీ పర్వతము పేరేమి ? ఈ ప్రదేశమున కేనెట్లు జేరుకొంటిని ? కుమారకేసరి ప్రభృతిసహాయు లేమైరి ? మహాజపంబున నీ తురంగము నన్నెంతదూరము దీసికొనివచ్చినది ? నేను దీని వేగలాఘవంబులనెన్నుచు న న్నేమార్గమున విచ్చటకుఁ దీసికొనివచ్చెనో గమనింపనైతిని. దీనిని బట్టికొన నెంత దూర మేతెంచితినో, యామర్కట మేమైనది ? అదృశ్యభావమ దిన యొకమహాభూత మదికాదుగదా ? మాయావి యొకం డీరూపంబున నన్నిటకు లాగికొనివచ్చెనేమో ? ఇఁకముందు న న్నేమిచేయునో ? ఇందు దైవము కర్మానురూపమగు ఫలమెయ్యది నాకు సమకూర్చునో ? లేకున్న విధి నాకిట్లు ప్రతికూలుఁడై యుండుటెట్లు సంభ వించును ? నే నిప్పు డేమిచేయవలయును ? ఈ తురంగము నధిష్టించి వెనుకకుఁ బోదునా ? ముందున కరుగుదునా ? లేక యిచ్చటనేయుండి మాయమైన యా కోఁతిని వెదకుదునా ? ఈ యుత్తమాశ్వము నిముసములో నన్ను నగరమునకుఁ దిరుగ దోడ్కొనిపోఁగలదు. కాని మహాద్భుత రసాస్పదంబగు నా వాలీముఖంబును దిరుగఁ గావించు యెట్లు ? దగఁగొన్నవారు పరమ ధర్మార్తిభృత్తులను నితాంతసీతలస్వాదు జలంబులుగలిగి, తీరంబుల ఫలవృక్షములతో నొప్పుచుండు జలాశయంబులఁ దరుచుగ నాశ్రయించుచుందురు. కావున నిప్పు డట్టి ప్రదేశంబునకే బోయెదంగాక ! అచ్చట నైన నవ్వనచరంబు గనంబడకుండునా ? మనఃప్రవృత్తియే సంతోషవిషాదంబులఁ