కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/40వ మజిలీ
మా గుట్టుఁ దెలిసికొని మా యింటనున్న చిన్న దాని నెత్తుకొని పోయితివి. మా శక్తి యాహారము చెడఁగొట్టిన పాతక మూరకపోవునా ? మిమ్ము నందఱ నిప్పుడు మా తల్లి కి బలియిచ్చుచున్నారము. మీ యిష్టదైవమును బ్రార్థించుకొనుడని పలికిన విని గడ గడ వడఁకుచు నిగమశర్మ యిట్ల నియె.
బాబులారా ! నే నేమియు నెరుంగను. ఎవ్వఁడో యొక చిన్నవాఁడా చిన్నదానిని మా యింటికిఁ దీసికొని వచ్చి రాజుగారి కప్పగించుమని చెప్పెను. ధన మందలి యాసచే నేనే తీసికొని వచ్చితినని బొంకితిని. అందు వలన బ్రయోజనము లేకపోయినది. ఆ చిన్నది తండ్రితో యదార్థముఁ జెప్పుటచే నతం డనుమానముఁజెంది నా మాటలు నమ్మలేదు. ఇంతయు నిక్కువము ; నిరపరాధుల మమ్మేల చంపెదరు? రక్షింపుడు, రక్షింపుడని వేఁడుకొనిన సమ్మతింపక యాదస్యులు కత్తులు వారి కుత్తుకలపై వ్రేయఁ గమకించు సమయంబున వలదు, వలదు. వీరిఁ జంపకుఁడు. నే నింతటి నుండి మాంసోపహారముల నంగీకరింపను. కందమూల ఫలాదులే భుజింపుచుందు. నా యెదుట జీవహింస చేయరాదని యా శక్తి వారితోడఁ బలికినది
ఆ మాట విని చోరులు కత్తులు నేలఁ బాఱువై చి బాపనయ్యలారా! . బ్రతికి బోయితిరి. మా తల్లికి మీ యందు దయవచ్చినది. మిమ్మిచ్చటనుండి కదలనీయము. పశువులం బోలెఁ గట్టి మేపుచుందుమని చెప్పి యట్లు చేయుచుండిరి. సజ్జనులఁ బాధించిన పాతక మూరకపోపునా ? యని యెఱింగించి యప్పటికి వేళ యతిక్రమించుటయు నమ్మణిసిద్ధుండు తదనంతరోదంతంబు దరువాతి మజిలీయందిట్లు చెప్పఁ దొడంగెను.
నలువదియ మజిలీ
గోపా ! విను మట్లు విజయభాస్కరుండు దల్లి తోఁ గూడఁ జంద్రప్రస్థ నగరము విడిచి యడవి తెరువునంబడి నడిచి నడిచి కొన్ని పయనంబులకుఁ జిత్రకూటంబను నగ్రహారముఁ జేరెను. అయ్యగ్రహారంబు సకల విద్యావిలాసభాసురులగు భూసురులచే నలంకరింపఁబడి యున్నది. దూర మార్గగమన శ్రమచే డస్సినిట్టూర్పులు నిగుడింపుచు నా రాజనందనుఁ డందొక ధరణీ బృందారకుని మందిరము దాపున నిలువంబడి వాకిటికి వచ్చిన యాయింటి యజమానురాలిం జూచి అమ్మా ! మేము పరదేశులము. ఈమె మా తల్లి . దూరము నడుచుటచేఁ గడు డస్సినది. ఈ పూఁట మీ యింట మా కాతిధ్యమిత్తురే ? యనుటయు నా యిల్లాలు "రండు రండు. మీ వంటి వారూరక మా యింటికి వత్తురా ? మేము కృతార్థుల మయ్యెదము గదా ?" యని పొగడుచు నర్ఘ్యపాద్యాదులం దెచ్చి యిచ్చి యర్చించుచుఁ దమయరుఁగు పయిం గూర్చుండఁబెట్టి త్రుటిలో వంటఁజేసి భోజనమునకు లెండని నియమించి స్నానార్దమై యరుగుచున్న విజయభాస్కరునివెంటఁ దటాకముఁ జూపుటకై తన పుత్త్రుగుణ సాగరుఁ డనువాని నంపినది. అంతలోఁ జారుమతి మెల్లన లోనికిం జని యామెచే వేయఁబడిన పీట పయిం గూర్చుండి "సాధ్వీ ! నీకు బిల్ల లెందరు ? పతి యెక్కడి కేగెను ? భాగ్యమే పాటి ? వృత్తియేమి ? యీ యూరు పేరేమని యడిగిన నామె యిట్లనియె. అమ్మా ! నాకు నెనమండ్రు మగ పిల్లలు. నా భర్త గ్రామాంతరం బరిగిరి. ఇప్పుడే రావలయును. "బ్రాహ్మణస్య ధనం భిక్షం" అనినట్లు మాకు భిక్షమే వృత్తి మా భాగ్యము నీకుఁ గనంబడుచుండలేదా ? యీ యగ్రహారములలో మేమే పేదవారము.
పూర్వ మొకప్పుడు విక్రమార్క మహారాజు దేశాటనముఁ జేయుచు నిచ్చటికి వచ్చి యొక విప్రునింటఁ గుడిచి వారి యుపచారములకు సంతసించుచు నీ యగ్రహారము కొని వారికిచ్చెను. దీని పేరు చిత్రకూటమండ్రు. అప్పుణ్యాత్ముఁడు దానమిచ్చినవారి యిల్లు వేయు మొదళ్లైనది. వారందఱు భాగ్యవంతులే మే మొక్కరమే యీ యూర బేదవారమని యా కథయంతయు జెప్పినది. అంతలో రాజపుత్రుఁడు గుణసాగరునితోఁ గూడ స్నానముఁ జేసి యింటికి వచ్చెను. ఆ యిల్లాలు వారికి సంతృప్తిగా భోజనము పెట్టినది. కుడిచిన తరువాత రాజపుత్రుఁడు తల్లి తో రహస్యముగా "అమ్మా ! వీరి వృత్తాంతము నీవు వింటివా ? ఈ యగ్రహారము మా తాత యిచ్చినదేయఁట పాప మీ యూరిలో వీరే భాగ్యహీనులఁట. ఈ యిల్లాలి కెనమండ్రు పుత్త్రులు. తలయొక పనిమీఁదను బోయిరి. అందఱు చదువుకొనిరఁట. నాతో స్నానమునకు వచ్చిన గుణసాగరుఁ డొక్కఁడే విద్యరాని వాఁడట. అన్నదమ్ములందఱు వానిం గొట్టుచుందురఁట. మనతో వత్తునని చెప్పుచున్నాఁడు. వారి పరివేదనము విన లేక పోయితిని. చాల జాలి వేసినది. ఏమి చేయుదును ? మా తాతకు రాజ్యమున్నది. కావున భోజనముఁ జేసిన విశ్వాసమున నీయగ్రహారమిచ్చెను. నాకంతకంటెనెక్కుడు విశ్వాసమున్నది. నిర్ధనుండ నైతిని గదా ? యని విచారించిన విని తల్లి దుఃఖింపుచు "తండ్రీ దైవము మనల నిట్లు చేసెను. కానిమ్ము . ఎల్లకాల మిట్లే యుందుమా ? ధన మబ్బినప్పుడు జ్ఞాపక ముంచుకొని వీని కుపకారము చేయుదువుగానిలే" యని యోదార్చినది. చారుమతి కాలిలోని పొక్కులు చూచి యా యిల్లాలు వారి నా పూట కదల నిచ్చినది కాదు. రాజపుత్త్రుఁడు సాయంకాలము వఱకుఁ దల్లి యడుగు లొత్తుచు గమన శ్రమవాయ నుపచారములు చేయుచుండెను.
ఆ రాత్రి కాయింటి యజమానుఁడు దేవభట్టు వచ్చి వాకిట జారుమతిని బుత్రునిగాంచి లోని కరిగి వీరెవ్వరని భార్య నడిగెను. ఆమె వారి యాగమన ప్రకార మెఱింగించినఁ నలుగుచు నోహో ! యీ యూర నిందఱు భాగ్యవంతులుండ మనము గనంబడితిమా ? యని యడిగిన భార్య పోనిండు. ఇంతకన్న దారిద్ర్యము రాదుగదా వారు గడుమంచివారు. ఱేపు పోవుదురని చెప్పి మగని సమాధాన పరచినది ఆ రాత్రి భోజనానంతరమున విజయభాస్కరుఁడు దల్లి యు వాఁకిటి యరగుపయి బండుకొనిరి. ఆ యిల్లాలు భర్తతో మీరు మధ్యాహ్నమునకు వచ్చితిరి గారేమి ? యెక్కడనుంటిరని యడిగిన దేవభట్టు కొండవీటిలోనే యుంటిని. నేనిచ్చటికి రావలయునని పయనమగుచుండఁ గొందఱు రాజభటులు నవరత్న ఘటితమగు హేమావిగ్రహ మొకటి దీసికొని వచ్చి డిండిమముతో నూరేగించిరి. ఆవింతఁ జూచుచు నందాగితినని చెప్పిన నవ్వి గ్రహ వృత్తాంత మెట్టిదో చెప్పుఁడని యడిగిన భార్యకుదేవభట్టిట్ల ని చెప్పఁ దొడంగెను.
చంద్రావలోకుని కథ
ఇక్కడి కనతి దూరములో రత్నకూటమసు నగరము కలదు. ఆ పురము చంద్రావలోకుండను నృపాలుండు పాలించుచుండెను. రూపమునకు విలాస నివేశమనియు కార్యమున కాలవాలమనియు విద్యల కుత్పత్తి నికేతన మనియు విద్వాంసులా భూవల్లభుని వర్ణించుచుందురు. అతనికిఁ బెక్కండ్రు భార్యలు గలరు. కాని యొక్కరితయు నతని మదికెక్కిన చక్కఁదనము గలదికాదు. ఆ చింత యొక్కటియే యతనిం బాధించుకున్నది
ఒకనాఁడమ్మహారాజు వాఱువపుదళములు సేవింప వేటకై యరణ్యమున కరిగి యందు నాఖేటనపాటవంబు దేటపడ సింహశరభ శార్దూలాది మృగగణంబుల వాఁడితూపుల నేపుమాపి యొక్కచోఁ దనహయరత్నమును దీపప్రాష్ణిన్ ప్రహారంబునఁ బ్రేరేపించుటయు నవ్వారువంబు మిఱ్ఱుపల్లంబుల లెక్కఁగొనక పవనాధి జవంబున ముహూర్త మాత్రములోఁ బదియోజనముల దూరము తీసికొని పోయి మఱియొక యరణ్యములోఁ బ్రవేశ పెట్టినది.
అప్పుడా నృపతి యింద్రియ ప్రపంచమును మఱచి యెట్టులో యా గుఱ్ఱముపై నిలిచియుండెను. అత్తురగ మాఁగిన కొంతసేపటికిఁ గన్నులు దెఱచి చూచి నంత నమ్మహీకాంతున కాప్రాంతమందొక సరోవరము కన్నుల పండువు గావించినది. అత్తటాకమును జూచి సంతసించుచు గుఱ్ఱము దిగి కడిగి జలము ద్రాగించి చేరువ భూరుహంబునకుఁ గట్టివైచి మార్గాయాసంబువాయ దా నా తటాకంబునఁ దీర్దంబులాడి జలంబులు గ్రోలి తటనికటస్థవిటపిచ్చాయ విశ్రమించి రమ్యంబులగు తత్ప్రదేశ విశేషంబు లరయుచున్నంత ముందర.
సీ. వికసితవకుళమా . లిక మేఖలగఁ దాల్చి
నవరసాలములఁ గ • ర్ణములఁ బూని
కరవీర వల్ల రుల్ • గంకణంబులు సేసి
రమణీయకుసుమహా • రములువై చి
దానిమ్మ పూవులు • తాటంకములు గాఁగఁ
బున్నాగములు నాగ . ముగధరించి
మందారమంజరు • ల్మంజీరములుసేసి
విరకాజివిరులఁచే , న్వేణిఁ దురిమి
గీ. వల్కలపటంబు కటి నింపు • గుల్కమిగులఁ
బ్రధితసౌందర్యలలితలా • వణ్యకలిత
ఘనతపోవ్రతహితమోని • కన్యయొకతె
గానఁబడె ఱేని కొకయశో • కంబుచెంత.
సఖీ సహాయమై పుష్పదామంబులఁ గూర్చుచున్న యమ్మించు బోడింగాంచి పంచశరవిద్దహృదయుండై యా నృపాలుండు "అయ్యారే: యీ జవ్వనియెవ్వతయో ? నా చిత్తముత్తల పెట్టుచున్నది. దివసంబున నస్తమించిన చంద్రకాంతిరూపుఁ గై కొని తపం బొనరింప నిచ్చటికి వచ్చినదా ? ఆహా ! యీ మోహనాంగి నాతో మాటాడినఁ గృతార్థుండ నగదుఁ గదా ? పోయి పల్కరించెద" నని తలంచుచు నల్ల న నప్పల్ల వ పాణిచెంత కరిగెను. అక్కలికియు నృపతిలకునిం జూచి తదీయ సౌందర్యాతిశయమునకు విస్మయముఁ జెందుచు "ఔరా ? యీ మహారణ్యమున కరుదెంచిన యీ మనోహరుండు సిద్ధుఁడో : సాధ్యుఁడో : కావలయును. వీని చక్కఁదనముఁ జూచుటచే మదీయ నేత్రములు కృతార్థములై న" వని తలంచుచు దిగ్గునలేచి సిగ్గుచే నించుక తలవంచి యోర చూపులం జూచుచుఁ దొలఁగి చనఁబోయిన నప్పుడమిఱేఁ డిట్ల నియె.
యువతీ ! భవదీయ దర్శనమే ఫలముగా నెంచి యరుదెంచిన యీ యతిధిని స్వాగతమడుగక దూరముగాఁ బోయెదవేల ? ఈ యాశ్రమ మెవ్వరిది ? నీచే నెవ్వారి వంశము పవిత్రము చేయఁబడినది. శ్రోత్రానందస్యందములగు భవదీయనామాక్షరముల నుచ్చరింపుము. కుసుమసుకుమార మగు నీ శరీరము నేను గోర యిట్టి వ్రతములచేఁ గ్లేశపఱచు చుంటివి ? ఈ విజనారణ్యమున నొక్కరిత వేమిటికి వసించితివి? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన నప్పడఁతి లజ్జావశంబున నేమియు మాటాడినది కాదు.
అప్పుడు తత్సఖురాలు తదీయ మృదుమధుర వచన రచనల కెంతయు సంతసించుచు నార్యా ! యీ చిన్నది మేనకయను నచ్చర కూఁతురు దీనిపే రిందీవరప్రభ యండ్రు. ఆ దేవకాంత యీ బాలికంగని యి యడవిఁ బడవైచి దివి కరిగినది. దేవవ్రతుండను సిద్ధుం నాశిశివుం జూచి జాలిపడి తన యాశ్రమమునకుం దీసికొనిపోయి పుత్రికా నిర్విశేషముగాఁ బెంచి పెద్దదానిం జేసెను. ఇచ్చటికి స్నానార్దమై యరుదెంచినది. ఆ సిద్ధుని యాశ్రయ మిచ్చటి కనతి దూరములో నున్నదని యమ్మదవతి వృత్తాంతమంతయుం జెప్పినది. అప్పొలఁతి చరిత్రము విని నరపతి యుబ్బుచు గొబ్బునఁ దురగమెక్కి యా సిద్ధుని యాశ్రమంబున కరిగి తచ్చరణ సరసిజమ్ములకు మ్రొక్కుచు నతండడుగఁ దన వృత్తాంతమంతయు నెఱింగించుటయు నాలించి సిద్దుం డిట్లనియె.
రాజా ! సంసారమునఁ బ్రాణులకుఁ మృత్యువు వలనం గలిగెడు భయం బెఱుంగుదువు గదా ? నిష్కారణముగా నీ మృగముల నేమిటికి హింసించెదవు ? క్షత్రియునకు శస్త్రధారణము దీనరక్షణమునకుఁగా బ్రహ్మ విధించెను. కులఁబోఁ బ్రోసి బ్రజల న్యాయముగాఁ బాలింపుము. చలలక్ష్యాధి లక్షణంబుల నెఱుంగ సాధనముఁ జేయుము. రాజ్య సుఖం బనుభవింపుము. ధనం బర్దులకుఁ బంచి పెట్టుము. యశము దిక్కుల వెదజల్లుము. కృతాంత క్రీడితమగు హింసాకర్మమున కెప్పుడు నుద్యోగింపకుము. మృగయా వ్యసనంబునఁ బాండురా జెట్టి యిడుములఁ గుడిచెనో యెఱుంగవా ? యని బోధించిన విని సంతసించుచు, మహీపతి యిట్ల నియె.
మహాత్మా ! నే నిప్పుడు మీచే లెస్పగా శిక్షింపఁ బడితితిని. అనుగ్రహించితిరి. ఇఁక నెన్నఁడును మృగయా వినోదము సేయను. సత్వములు నిర్భయముగాఁ దిరుగుఁగాక మీ యానతి వడుపున మెలంగువాఁడ నని పలికిన సంతసించుచు నా సిద్దుండు రాజా ! నీవు ప్రాణుల కభయదాన మిచ్చితివి కావున నీ యందు నా కక్కటికము గలిగినది. నీ కిద్దియేని యభీష్ట ముండినం జెప్పుము దీర్పఁ గలవాఁడ నని యడిగిన నయ్యొడయం డిట్ల నియె. మహాత్మా ! మీకు సంతోషమేని యీ యిందీవరప్రభను నాకు వివాహము గావింపుడు. ఇదియే మదీయ వాంచితం బింతకన్న వేఱొక్క కోరిక నాకు లేదని పలికిన నా సిద్ధుండనుమోదించి స్నానముఁ జేసి యరుదెంచిన యమ్మించుబోడినప్పుడే యతని యధీనం గావించెను. చంద్రావలోకుండు గాంధర్వ వివాహంబున నిందీవరప్రభను స్వీకరించి స్వదేశగమనోత్సుకుఁడై యాసిద్దు ననుమతివడసి యప్పడఁతిని దత్తడిపై నెక్కించుకొని యుత్తరాభిముఖుండై యరుగు చుండ నింతలోఁ బద్మి నీకాంతుం డపరిగిరి శిఖరము నలంకరించెను.
అతండా రాత్రి వసింపఁ దగిన తావరయుచుండ నొక దండ సమృద శాఖపత్ర విచిత్రంబగు నశ్వత్థ పాదపంబు నయనోత్సవంబు గావించినది. తదగ్ర భాగమున శీతలజల భూ యిష్టంబగునొక దిగుడు బావి విరాజిల్లుచున్నది. తత్ప్రదేశంబు నివాసయోగ్యంబని తలంచి యజ్జనవల్ల భుం డప్పల్లవపాణితోఁ గూడ వాఱువమును దిగి జేరువ భూరుహమునకుం గట్టి యయ్యచ్చరపట్టి కేలు బట్టుకొని యర్వాపీపితా తలంబునకుఁ దీసికొనిపోయి శీతలవాత పోతములు గమనాయాసము బాయఁజేయ హాయిగ గొంతసేపందు విశ్రమించెను.
అంతలో శర్వరీ కాంతుఁడు పూర్వదిగ్వధూకబరికాకుసుమ వల్లరింబోలె నుదయించుటయుఁ గ్రమంబునఁ జంద్రిక రాలింగితములై దిక్కులు మిక్కిలి ప్రకాశింపఁ దొడంగినవి. అట్టి సమయంబున నన్నరపతి కుసుమశయ్యఁ గల్పించుకొని యం దయ్యిందీవర ప్రభాపరిష్వంగంబు గావించుకొని నూతన సంగమోర్కర్ష సంతోషంబునం దేలుచు తదీయ రావణ్యామృత నిష్యందములఁ గ్రోలునట్లు నేరములు: 1. మ : ముద్దుపెట్టుకొనుచు మోము ముసల న న ... ము. సవరించి సంపచనరచనలు ఆ సరయు నౌకణజు వెంటే... కృత్యంబులు నిర్వర్తించికొని యమ్మించుబోడితోఁగూడ గుఱ్ఱమునెక్కి యరుగఁబోవ నెంచు సమయంబున నయ్యశ్వత్థపాదపాగ్రంబునుండి.
సీ. మెఱపుతీగెలఁబోలు • కఱకువెండ్రుకలతోఁ
గజ్జలశ్యామలాం • గంబుతోడ
నంత్రమాలాకృతో • ద్యత్కిరీటముతోడ
దంష్ట్రాకరాళవ • క్త్రంబుతోడ
నురుకేశరచితయ • జ్ఞోపవీతములతో
గరదీప్తసరమస్త • కంబుతోడ
ఘనపావకార్చులఁ • గ్రక్కునాలుకతోడ
రూక్షంబులగుమిట్ట • గ్రుడ్లతోడ
గీ. దతకపాలాత్తరక్తంబు • ద్రావికొనుచు
నట్టహాసంబుతోడ నా • ట్యంబు సేయు
చాశ లద్రువంగఁ • జనుదెంచె నధికకోప
దక్షుఁ డగునట్టి యొక బ్రహ్మ • రాక్షసుండు.
అట్లు వచ్చి యానృపాలు వీక్షించి యోరీ | పాపాత్మా ! నేను భేతాళుని ప్రధాన కింకరుండ జ్వాలాముఖుండను బ్రహ్మరాక్షసుండ నీ యశ్వత్థంబు మదీయ నివాస దేశము. దీనిచెంతరా దేవతలు సైతము వెఱచుచుందురు. అట్టి నా యునికి పట్టునకు వచ్చుటయేకాక చేడియతోఁగూడి రమించితివి. ఇంతకన్న నపరాధ మేమి యున్నది ? రాత్రి నీవు గావించిన యవినయంబునకు ఫలం బనుభవింతువుగాక కామోపహతచేతస్కుండవగు నీహృదయంబు భేదించి రక్తంబు ద్రావెదఁ జూడుమా యని బెదరించుటయు నమ్మేది నీ విభు డతం డవధ్యుండని యెఱింగి గజ గజ వడంకుచుఁ జేతులు జోడించి సవిననయముగా నిట్లనియె. మహాత్మా ! నేనెఱుగక చేసిన యపరాధము మన్నింపఁ వేడుచున్నాఁడను. నీ యాశ్రయమున కతిథిగాఁ జనుదెంచితిని. నిన్నే శరణుజొచ్చితిని. రక్షింపక తీరదు. శరణాగతరక్షణంబు సకలధర్మ శ్రేష్ఠంబని పెద్దలు వాక్కాణించుచుందురు. మీ రెఱుంగనిదేది ? వినుండు,
శ్లో॥ చతుస్సాగరపర్యంతాం యోదద్యాధ్వసుధామిమాం,
యశ్చాభయంచ భూతేభ్యస్తయోరభయదోధికః !
చతుస్సముద్రముద్రితమగు భూమియంతయు దానమిచ్చినవానికంటె నభయదాన మిచ్చినవాఁడే యదికుఁడని శాస్త్రములు ఘోషించుచున్నవి. మఱియు నీవు గోరితివేని నాసనమగు నుపహారము నీకుఁ దీసికొనివచ్చి యర్పించెదను. న న్ననుగ్రహింపుమీ యని యనేక ప్రకారములఁ బ్రార్దించిన నాలించి యా బ్రహ్మరాక్షసుఁ డించుక శాంతుండై యిట్లనియె. రాజా ! నీ వినయంబున మా కించుక యనుగ్రహము గలిగినది. పదియాఱేఁడులు ప్రాయముగలిగి వివేకవంతుండై యొప్పు బ్రాహ్మణకుమారుం దీసికొనిరమ్ము . వాని చేతులు దల్లియుఁ గాళ్ళు దండ్రియుం బట్టుకొనియుండఁ దదీయగాత్రంబు ఖండించి నీవు నాకు నర్పింపవలయు నిప్పని నేఁటి కిరువదవనాఁడు కావలయునిందింత దప్పితవేని నిన్నుఁ బుత్రమిత్రకళత్రాదులతో నాశనము నొందించెదను సుమీ ! పొమ్ము వేగము రమ్మని యానతిచ్చి యా బ్రహ్మరాక్షసుఁ డంతర్దానము నొందె.
అప్పుడా రాజు “అయ్యో ! ఈ వేఁటకు నేనేమిటికి రావలయును ? వచ్చితిఁబో యీ చిన్న దానిం జూడనేల ? చూచినంతనే కోరనేల ? కోరియు నింటికిఁ బోకుండ నింతలోఁ దొందరపడనేల పాండునృపాలుండువోలె శాపదగ్దుండనైతిని గదా ? ఇంతలో నితండు నుడివినట్టి బ్రాహ్మణ కుమారుండు నాకెట్లు లభించెడిని ? ఇది నామరణమునకే వచ్చినది. కానిమ్ము . ఏమిచేయుదు" నని యనేక ప్రకారములఁ బశ్చాత్తాపముఁ జెందుచు నయ్యిందువదనతోఁ గూడ గుఱ్ఱమునెక్కి సత్వరముగాఁ దనపురంబున కరిగెను. మంత్రులును బౌరులు సామంతులు నూతన వధూయుక్తుఁడై యరుదెంచిన చంద్రావలోకునింగాంచి పరమానందమును జెందుచు ననేక మహోత్సవములు గావించిరి. అవి యా రాజున కేమియు సంతోషము గలుగఁజేసినవి కావు. మఱునాఁ డాఱేఁడు మంత్రులతోఁ దన వృత్తాంతమంతయుం జెప్పి దుఃఖించుటయు నందు సుమతియను ప్రధాని రాజు నోదార్చుచు -
హేమవిగ్రహము కథ
"దేవా ! విత్తంబునకు సాధ్యముగానిది లేదు. ప్రపంచమంతయు ద్రవ్యముతో వశమగును. తగిన ద్రవ్యము వ్యయపెట్టితిమేని యట్టి బ్రాహ్మణ పుత్రులు నూర్గురుఁ దీసికొని రాఁగలనని పలుకుచు నతని యనుమతి వడసి యప్పుడే స్వర్ణకారుల రప్పించి యిరువది బారువల బంగారముతో నొకవిగ్రహముఁ జేయించి యందు ననర్ఘములగు నవరత్నములు స్థాపింపఁజేసెను. ఆ విగ్రహము గన్నులకు మిఱుమిట్లు గొల్పుచున్నది. దాని కుడిహస్తమందొక దానపట్టము వ్రాసియుంచిరి. తనకుమారుని బ్రహ్మరాక్షసునికి బలియిచ్చువారికి నూరు గ్రామములతోగూడ నీ హేమవిగ్రహము నిచ్చుచున్నాము. అని యా దానపట్టములో వ్రాయఁబడియున్నది. మంత్రి యా కాంచన విగ్రహమును నగ్రహారములలో నూరేగింప నియమించెను. ఆ మాటలే డిండిమముతోఁ జాటించుచు నా విగ్రహము నట్లూరేగించుచున్నారు. నిన్న నా యగ్రహారములో నీ చరిత్ర యంతయు సవిస్తరముగా వక్కాణింప విని వచ్చితిని. ఆ యగ్రహారములో నెవ్వరు సమ్మతింపరైరి. మన యూరురమ్మని నేను జెప్పివచ్చితిని. ఱేపు ప్రొద్దుటి కిచ్చటికి వత్తురు. నీవునుం జూతువుగదా ? తరువాత నేమి యూహలు పుట్టునో యని యా వార్త యంతయుం జెప్పిన నప్పడతి యిట్లనియె. అయ్యో ! ధనమునకై పుత్రులఁ జంపువా రుందురా ? ఆ ప్రధాని మంచి యూహయే చేసెను. కాని యందుల కెవ్వరు ననుమోదింపరనుకుందును. ఏమో ! లోకములో నెంతవారైన నుందురుగదా ? యనుటయు దేవభట్టు ఏమే ! నేనొక్క మాటఁ జెప్పెదను. కోపము సేయవుగదా ! నాకిప్పు డరువదియేండ్లు వచ్చినవి. సుఖమను మాట యెఱుఁగను. పాపము నీవును నాతో దరిద్రపు కాపురము సేయుచు సుఖపడి యెఱుంగవు. పుణ్యాత్ములనఁగా ధనవంతులే సుమీ ? నూఱుగ్రామము లనఁగా దెలియునా ? అతని రాజ్యములో నాలుగవవంతు అట్టి యైశ్వర్యము పూర్వ పుణ్యపరిపాలకంబును గాక లభించునా ? ఏమనియెదవు ? నిజము చెప్పుమని భావగర్భితముగాఁ బలికిన నా యిల్లాలు గ్రహింపక "అవును అట్టి భాగ్యము పట్టుట దుర్ఘటమే" యని ప్రత్యుత్తరముఁ జెప్పినది. సాధ్వీ ! లోకములో బుత్త్రులనగా నెవ్వరో యెరుఁగుదువా ? పూర్వభవమున శత్రువులే యిట్లు పుట్టుచుందురు. అందులో మన గుణసారుని వంటివాఁడు పరమ శత్రుండు. రామ ! రామ ! యొక్క ముక్క యైన రాదుగదా ? నలుగురిలో వీఁడు నా కొడుకని చెప్పుకొనిన సిగ్గగుచున్నది
కుపత్త్రత్వంబుకంటె నపుత్త్రత్వమే శ్రేష్ఠమని పెద్దలు చెప్పుదురు. దెలిసినదా ! యేమనియెద ? వని యడిగినప్పటికిని గ్రహింపక యామె నేనేమనియెదను ? చదువుకొనవలసినదె. వాని కర్మము ! మన మేమిచేయుదుము ? పోనిండని యుత్తరముఁ జెప్పినది అప్పుడతండు "అయ్యో ! నా మాట దీని కర్దమైనదికాదు. ఇంత కన్న నేమి చెప్పుదును ? ఇఁక దాపనేల ? తెలియువఱకుఁ జెప్పవలసినదే. యేమనునో ? సమ్మతించునా ! ఏమో ధనముగదా ! యని తలంచుచు “అదికాదు. నా మాట నీకుఁ దెలియలేదుకాఁబోలు. మన పసవును వీరికిత్తమా ? యని యున్నది. ఏమనియెద" వనుటయు "మీ మాటలే నాకుఁ దెలియవు. వారికిఁ బశువేల ? మనుష్యుఁడు కావలయునని మీరు చెప్పలేదా ?" యని యామె పలికినది. దేవభట్టు పక పక నవ్వుచు ఓసీ! మూర్ఖురాలా! ఇంత తెలిసికొనలేక పోయితివేమి ? పశువనఁగా బశువు గాదు. విద్యలేనివాఁడే పశువు. అందువలనఁ బశువంటే మన గుణసారుఁడు. వాని నియ్యగూడదా ? యని నా యభిప్రాయమనుటయు నామె యురము పైఁ గర మిడికొని "అయ్యో! అయ్యో! యెంతమాట పలికితిరి. మీకు నోరెట్లాడెను. ధన మేమి చేసుకొనియెదరు? అది యెవ్వరికొఱకు ? చాలుఁ జాలు. ఎవ్వరును వినలేదుగదా" అని వెరఁగుపడఁ జొచ్చినది.
తలిదండ్రుల సంవాదమంతయు విని గుణసారుండు ఘోరముగా నేడ్చుచు నా రాత్రియెల్ల నిద్రబోవక తెల్లవారకమున్న లేచి విజయభాస్కరుని దూరముగాఁ దీసికొనిపోయి నమస్కరించుచుఁ జెప్పుటకు మాటరాక వెక్కి వెక్కి యేడువఁ దొడంగెను. వాని దైన్యముఁ జూచి రాజపుత్రుండు చింతించుచు మిత్రమా ! గుణసారా! నీ వేటికిట్లు చింతించెదవు ? నీకు వచ్చిన యాపదయేమి ? నాతోఁ జెప్పుము ప్రాణ మైన నిచ్చి నిన్నుఁ గాపాడెద నని యభయహస్త మిచ్చుటయు నతండు డగ్గుత్తిక యడంచుకొని యిట్లనియె.
వయస్యా ! నా యందు మావారి కెవ్వరికిని నిష్టములేదని నిన్న నీతోఁ జెప్పితినిగదా ? యిప్పుడీ క్రొత్తమాట వినుము. ఎవ్వఁడో రాజు వేటకుఁ బోయి యడవిలో నొక బ్రహ్మరాక్షసుని రావిచెట్టుక్రింద భార్యతోఁ గ్రీడించెనఁట. కోపించి యా బ్రహ్మరాక్షసుఁ డా రాజుం జంపబోయి యతండు వేడుకొన బ్రాహ్మణ కుమారుని దీసికొని బలియిచ్చినచో రక్షించెదనని చెప్పన నొప్పుకొని యప్పుడమి టే, డింటికివచ్చి బంగరుబొమ్మఁ జేయించి యూరూరఁ ద్రిప్పుచున్నాఁడఁట. నూరు గ్రామములతో నది వచ్చునని మా తండ్రి నన్ను బలియియ్యఁ దలఁచికొని రాత్రి మా తల్లి తోఁ బ్రస్తావించెను. ఆమె సమ్మతించినదికాదు. ఎట్లైన మగవాని మాట సాగును" అని యా కధ యంతయు సవిస్తరముగాఁ జెప్పి 'యసఘా ! నిన్నుఁ జూచినది మొదలు నాకు నీతో మైత్రిసేయవలయునని యభిలాషఁ గలుగుచున్నది. నాకుఁ దల్లిదండ్రులు లేరు. నీవే తల్లి యుఁ దండ్రియు. నీ వెంట నేనును వత్తును. నన్నుఁ దీసికొనిపొమ్ము. పోదము లెమ్ము తెల్లవాఱినచో నన్ను బలవంతమున నాపుదురు.' అని పలుకుచు బ్రతిమాలిన విని రాజపుత్త్రుం డిట్లనియె.
గుణసారా ! నీవు విచారింపకుము. నీ కభయహస్త మిచ్చియుంటినికాదా ? ఇప్పుడు పారిపోవనేల ? నీ నిమిత్తము నేనా బ్రహ్మరాక్షసుని కుపాహారముగాఁ బోయెద. నీవు సోదరులతోఁగూడ భాగ్యవంతుఁడవై సుఖింపుము. అదియే నాకుఁ బదివేలు. అని పలికిన విని యతండు వెఱఁగందుచు 'అయ్యో ! నీవు మాత్రము నా వంటి వాఁడవుకావా ? మీ తల్లి వినినఁ గోపింపదా ? నీ మాట యేమియు నాకు నచ్చలే" దని పలికిన భాస్కరుం డిట్లనియె. మిత్రమా ! ఆడితప్పిన దానికంటెఁ బాతక మెందైనఁ గలదా ? శరీర మెప్పుడైన నాశనము నొందునదే వ్యర్థముగాఁగాక గృధ్రములపాలు సేయుటకంటె మీ వంటి దీనుల కుపకారముగా విడుచుట యాధిక్యము గాదా ?
"ప్రతిక్షణ వినాశియై యధ్రువఁ బగు నీ శరీరముచేత ధ్రువంబగు ధర్మం బెవ్వఁడు సంపాదించుకొనఁడో వాఁడే మూర్ఖుడు" అని యార్యులు చెప్పుచున్నారు. ఇప్పుడు నీ కభయమిచ్చి యెట్లు మానుకొందును ? మా తల్లి కెఱిఁగింపవలదు. ఆ రాజు పరమ మూఢుఁడు తాను బ్రతికి యేమిచేయగలడు ? ఎన్నాళ్ళు జీవించును. ప్రజల దురాశపాలుఁ జేసి ఘోరకృత్యములు జేయించునా ? కొంచమైన భూతదయ యుండవలదా ? ఛీ ! యట్టివాని రాజుగాఁ జేసిన పరమేష్ఠిం దిట్టవలయుసని యా రాజును నిందించుచు ఈ మాట మీ తండ్రితో రహస్యముగాఁ జెప్పిరమ్మని నియోగించెను.
అంతలో దెల్ల వాఱుటయు నాసువర్ణవిగ్రహ మాయగ్రహారమునకుఁ దీసికొనివచ్చి డిండిమముతో నూరేగింపుచుండిరి. దేవభట్టు తన వాకిటఁ బెద్దతడవు నిలిపి యావిగ్రహమును దనభార్యకుఁ జూపెను. దానిం జూచిన సన్యాసులకుఁగూడ నాస గలుగకమానదు. ఆమె చూచియుఁ గుమారు నియ్య నిష్టములేక లోపలకుఁబోయి తలుపు వైచికొనియెను అప్పుడు దేవభట్టు భార్యను బ్రతిమాలుకొనుచుండగా గుణసారుఁడు తండ్రితో రహస్యముగా విజయభాస్కరుం డాడినమాటలన్నియుఁ జెప్పి యిట్లనియె. తండ్రీ ! నాకుపకారముఁ జేయుతలంపుతో నతం డీపని కంగీకరించెను. దీనవచ్చు లాభములో సగబాలు నాకియ్యవలయును. పిమ్మట నా సోదరులు కలహముఁ జేయుదురు ఇప్పుడే చెప్పుచున్నాడనని పలికిన విని సంతోషించుచు దేవభట్టి ట్లనియె. గుణసారా ! నిజముగా నతం డీపని కొప్పుకొనెనా ? పరిహాసమున కనెనేమో ? నా యెదుటఁ జెప్పింపు మనుటయు నతండు విజయభాస్కరుం దీసుకొని వచ్చిన వానితో దేవభట్టు 'చిన్నవాఁడా ! మా గుణసారునితో నేమో పలికితి వఁట. ఆ మాట యదార్థమే ?' యనుటయు రాజపుత్రుఁడు 'సందేహమేలా ? యదార్థమే. మీ పని మీరు కావించుకొనుఁడు. మా తల్లి కిఁ దెలియనీయకు' డని యుత్తరము సెప్పెను. బాలకా ! నీకట్టి వైరాగ్యము గలుగుటకుఁ గారణ మే మనపుఁడు నా భాస్కరుఁడు బ్రాహ్మణుఁడా ! నీ కా ప్రశ్నలతోఁ బనిలేదు. నే నాడి తప్పెడువాఁడనుగాను. మీ ప్రయత్నము చూచుకొనుఁడని చెప్పిన సంతసించుచు దేవభట్టు భార్యతో రహస్యముగా విజయభాస్కరుని మాటలన్ని యుంజెప్పి ఇఁక నీవు విచారింపనక్కరలేదు. పాపము వాఁడు మనవానికన్న వెఱ్ఱివాఁడు ! ప్రోడయైనచో నిట్టిపనికనుమోదించునా ? దీనిలో వానికేమి లాభమో తెలియదు. తన తల్లి కైన నేమియు నిమ్మని చెప్పలేదు. మన గుణసారుఁ డేమోయనుకొంటిని. మంచినేర్పరి యయ్యెంగదా ! వాని చెవిలో నేదియో యూది సమాధాన పఱపించెను. మనమీ రహస్యమెవ్వరికిం జెప్పవలదు మన వారినే యిత్తుమని యిక్కడఁ జెప్పుదము. అక్కడ వీఁడే మావాఁడని వారికిఁ జూపవచ్చును. ఇందులకైన నొప్పుకొనియెదవా ? యని చెప్పిన నామె నాలుక కఱచుకొనుచు నిట్ల నియె.
అయ్యో ! మనమెట్లు చింతింతుమో, వానికొఱకు వానితల్లి యట్లు చింతింపదా ? పుత్రశోక మందఱికి సమానమేకదా ? అదియు నాకు సమాధానము లేదని పలికిన విని యతండు నోరు మొత్తుకొనుచు నీవంటి మూఢురా లెందైనం గలదా ? పోనీ, నీ కుమారుని సమ్మతించితివికావు. మేమెవ్వరినైనం దెచ్చుకొనినను నీయడ్డమే రావలయునా ? నీ వొడంబడవేని యీ జన్నిదములు దెంపి నీమెడకుఁ జుట్టి సన్యాసము పుచ్చుగొని పోవుచున్నాను. చెప్పుమిదిగో త్రెంపుచున్నాను. చూడు మని యజ్ఞోపవీతములు సవరించుటయు నామె యేమియు మాటాడక మీ కర్మము నా కేమియుం దెలియదు. మీ యిష్టము వచ్చినట్లు చేసుకొనుఁడని లోపలికిఁ బోయినది.
అదియే సమాధాన వచనముగా నిశ్చయించి యా దేవభట్టు నిగ్రహముతో వచ్చిన రాజభటులతో నాకుమారు బ్రహ్మరాక్షసుని కుపహారముగా నిచ్చుచున్న వాఁడ. విగ్రహముతోగూడ నా గ్రామములు నాయధీనము సేయుఁడని కోరుటయు వాండ్రు 'అయ్యా ! మీరు పుత్త్రునితోఁగూడ నీ రాత్రికి మా రాజధానికి రండు. మానృపాలుం డంతయు నక్కడ సమర్పించు'నని చెప్పి యా విప్రునిచే నొడంబడిక పత్రికల వ్రాయించి పుచ్చుకొని యా విగ్రహముతోఁగూడ హేమకూటమునకుఁబోయి యా వృత్తాంతము రాజున కెఱింగించిరి.
అతండు ప్రహర్ష సాగరంబున మునుంగుచు వారిరాక కెదురుచూచు చుండెను. దేవభట్టు భార్య చారుమతిని గమనశ్రమ వాయువరకుఁ గొన్నిదినములు మాయింట నుండవలయునని ప్రార్థించినది. విజయభాస్కరుఁ డట్లు చేయుటయే యుచితమని తల్లికి బోధించెను. ఆమెయు మిక్కిలి డస్సియుండుటంజేసి యందుల కంగీకరించినది. నాడు దేవభట్టు భార్యాపుత్త్రులతో హేమకూటనగరంబునకుఁ బయన మగుచుండ రాజపుత్త్రుఁడు దల్లితో 'అమ్మా ! నాకిందేమియుఁ గాలక్షేపము గనంబడలేదు. వీరితోఁగూడ రాజధాని కరిగి వింతలంజూచి వచ్చెద నీవు భద్రముగానుండు మని పలికిన జారుమతి “నీవు దుడుకువాఁడవు. పట్టణములకు బోఁదగదు. అదియునుం గాక నేనొంటిగ నుండజాల"నని యడ్డు చెప్పినది. అప్పుడా రాజపుత్రుండు తల్లి గడ్డము పట్టుకొని అమ్మా ! నాకు బట్టణముఁ జూడవలయునని చాల వేఁడుకగా నున్నది ఒక్కసారిచూచి వెంటనేవత్తును. నా మిత్రుఁడు గుణసాగరుఁడుగూడ వచ్చు చున్నాఁడు. ఇందేమియుం దోచదు. పోనిమ్మని బ్రతిమాలిన నారాజపత్ని యెట్టకే ననుమోదించి దేవభట్టు భార్య కప్పగించుచు అమ్మా ! వీఁడు కడుదుడుకువాఁడు. సాహసము మెండు. చొరవ యధికము. వైరాగ్యము పెద్దది కనికరించి వీని వెంటబెట్టుకొని రమ్మని పలికిన విని యామెహృదయము ఝల్లుమన నేమియుం బలుకక యూరకున్నది. అప్పుడు రాజపుత్రుఁడే వారిపయనమునకు వేగిరపెట్టఁ దొడంగెను. ప్రయాణసమయమందు రాజపుత్రుఁడు తల్లితో “అమ్మా ! నీవు నావిషయమేమియుఁ జింతింపకుము వెనుకటి పద్యమే జ్ఞాపక ముంచుకొనుము.
క. గిరియెక్కిపడిన ధరసా
గరమున మునిఁగినను బావకముజొచ్చిన భీ
కరఫణులతోడ నాడిన
మరణ మకాలమునరాదు మహినెవ్వనికిన్.
చ. వనజదళంబులందెగడు • వాలుకనుంగవ పేరురంబు చ
క్కని నునుచెక్కు లందమగు • కంఠము సన్నని కొను సింహసం
హననము దీర్ఘ బాహువుల • మానుషతేజము గల్గు రాజనం
దనుఁ గని మేదినీపతి మ • నంబున విస్మయ మందెనెంతయున్.
ఆహా ! యీబాలునిఁ జక్రవర్తికడుపున బుట్టింపక పేదపాఱుని కుమారునిగాఁ జేసిన విధి నిందాపాత్రుఁడుగాడా ! ధన మెట్టి నీచపు పనులనై నం జేయించును. ఇట్టి సుందరాకారుని ద్రవ్యాశచేతనేకదా బలియిచ్చుట. కిట్టు వీరు తీసికొని వచ్చిరి ? కానిమ్ము. ఆవితర్కిముతో నాకేమిపని ? యని తలంచుచు శుభసమయుబున నా కుమారునికిఁ దలయంటి గంధమాల్యానులేపనాదులచేతను గనకమణిభూషణాంబరంబు లచేతనలంకరించి సపితృకముగా భద్రదంతావళపై నెక్కించి పటహభేరీమృదంగాది వాద్యములతో వారాంగనానృత్యగాన వినోదములతో నూరేగింపుచు సామంతమంత్రి హితపురోహితసహితుండై యాభూపతి యమ్మహారణ్యమున కరిగ పరివారమునెల్ల నా రావిమ్రాఁకున కల్లంత దూరములో నిలిపి తానును బ్రాహ్మణదంపతులు పుత్రుఁడు పురోహితుఁడు మాత్ర మారాక్షసనివాసమున కరిగి యాయశ్వద్దము మొదట వేఁడి గల్పించి సమంత్రకముగా నందగ్ని వేల్చుటయు నధ్యయనము జపించుచు నట్టి హాసముతో జ్వాలాముఖుం డందు వచ్చి నిలుపఁబడెను.
అప్పు డారాజు చేతులుజోడించుచు మహాత్మా ! మీతో నుడివినవడుపున మితిదాటకుండ నుపహారము దీసికొనివచ్చితి నంగీకరించి నన్నుఁ గృతార్థుంగావింపుఁ డని వేడికొనియెను జ్వాలాముఖు డాబాలక శిఖామణింగాంచి సంతసించుచు శిరః:కంపమున నంగీకార సూచనఁగావించుటయు నన్న రేంద్రుండు కరవలంబు ఝళిపించుచు నారాజపుత్రు ధాత్రీతలమున నడ్డముగాఁ బండుకొమ్మని నియమించి కాళులు దేవభట్టు పట్టుకొనియుండ నతనిభార్యను జేతులు బట్టుకొమ్మని యాజ్ఞాపించెను. అట్టిసమయమున విజయభాస్కరుండు గన్నుల నానందబాష్పములుగ్రమ్మ మందహాసశోభితవదనార విందుఁడై యాహా ! యిప్పుడు నేనీ దేహదానమున కధికమైన సుకృతము సంపాదించుకొనుచుంటిని ఉపక్రియాసహితం బను స్వర్గంబులు మోక్షంబును నాకక్కఱ లేదు. పరోపకారార్ధమై వెండియు నాకిట్టిదేహమే కావలయును. జన్మజన్మలకు నిట్లే యొరులకుప కారము సేయుచుండెదఁగాక యని సంకల్పించుకొనుచుండెను.
అప్పుడారాజు కరవాలమెత్తికుత్తుకపై నేయగమకించు సమయంబున జ్వాలాముఖుండు వారిముఖవిలాసముల నిరీక్షించి వలదు వలదు. ఏయకుమేయకుము. ఈకుమారుండు వీరి కుమారుండగునో కాదోయను సందియము గలుగుచున్నది. పుత్రఁడేయైనచో వీరించుకయైన విచారింపకుందురా ? వీరి హృదయములు సంతోష భరితములై యున్నట్లు కనంబడుచున్నవి. ఇందలి నిక్కువమరసి చెప్పుమని పలికెను. అప్పు డారాజు దంపతులతోఁ బ్రభువువారిమాటలు వింటిరా ? వీఁడు మీకుమారుఁడు కాఁడని సందేహపడుచున్నారు. నిక్కువము వక్కాణింపుఁడనుటయు సందేహమేల ? మాకుమారుఁడే యని స్వరము - మతము గ్రహించి : "S - 3.1.0 + s" vr: iv) సం . . . మ అన్న ... 3 : ని నవ్వని పుత్రుంతపు - వనతలు సచ్చి అపు... - మచడం.. ఇట్టమరణ సమయమున ససత్యము ....... . . aawr, "తపు సుసి : యస్. యడి గిన నా 8పు ముందు మన్న . . . . . . . . " నేటికి 1 కు కేతుం ను సృపం , ... - "మీరు నిండుకుండు. ఆయన తం చి పేరు. . ! ! ! -An... . కరములు » రము. వీరికి నే గతః పురుం. oులు ఒక సిన్నే ... విందులు, ఆయుడు. బుద్ధి పూర్వకంగనే పప్పని కంగీకరించింను చెప్పి పు. అమాయుని జలముందు ప్రసన్న ముఖుండై (టే..... : నీవు ఏక్రమార్కుని సుగుము ! యో ! నేఁ దెంత సుదినము . ప్రభుపు ఉంచుఁడు మీ అతడుఁ గింకుఁదే. తమ్ములమున నీకు నేను దాసుండనై తిని. నీ వర్గత్రయ పడగ నాకు :ుద్ధిపుట్టినది నయ... అపున్న బ్రమాదము వచ్చుంగబా : "ఈ పూట వినిన బేరాశుండు నన్నెంత మందలించును. వీండ్రు నిన్నెట్లు వెదకికొని తీసికొనవచ్చి ! నాతో ససత్యమాడిన యీ రాజును వీంద్రను హతము గావించెదఁ జూడుమా యని నాలుకి సప్పగించుటయు . Ir పుత్రుండట్ల నియె. స్వామీ : కపట మియు నా favorcకు ఈ దంపతులకు ఫోజు సముఁ జేసిన మిత్వాసమున నిట్లు చేయుపని నేనే బోధించితిని. వీరి యపూధమేమియు లేదు. మాకుఁ బరమపండై న చేరాశునికి మీరు ప్రణిధులు. ఇట్టి ఓ విషయంపై దేహము విడుచులు నాకుఁ బరమసంతోషము గదా. నా దేహ మాహారముగాఁ కొను దీని ప్రార్థించినఁ నెవులు మూసికొని శివ : అ'హటలు నా యొద్ద టలు కలవు. నీవు సాహస వితరణాది గుణంబుల మీ లాతను మించితివి. భూతదయ పరుచవు. ఈ గుణంబులకు ఎప్పువచ్చినది. నీను వరమీయనుంటి. నీ యభీష్ట సిద్ది మా ఒప్పుడు.. యడిగిన రాజకుమారుం డిట్ల సియె. స్వామీ ! నా లేటయుఁ గోమతము లేదు. భూత.... పర్వము ఉన్న నెక్కుడు వ్రతములేదు. మరింతటి నుండి జీవహింస చేయ పుతనం, మము 7 కియఁ బారించుచున్న వాన నది నే మరియు 5. సంజని పుత్వ in 10. 6 స్మరి తిగలిగి @ : నువు మనలను విను . . . . 15ము . n. పంచ లైన... ఇం. మన ముందు నైతపం 20 గొరించి కం: న . 1 నకు సోకింపుము. శాపవిముక్తుండనై పవిత్రుఁడ నగుదునని పలుకు చున్నట్లు చేసి వారినెల్ల వీడ్కొని జ్వాలముఖుం డంతర్థానమై పోయెను
అప్పుడు చంద్రావలోకుఁడు రాజపుత్త్రుం గౌగిలించుకొనుచు వత్సా ! నీవు విక్రమార్కుని మనుమఁడవా ? అయ్యో ! ఈ బ్రాహ్మణుఁడు తన కుమారుండని మోసముఁ జేసెనే ? నీ రూపము జూడ నా కప్పుడే సందేహము గలిగినది. మమ్ము నెల్లఁ గృతార్థులం గావించితివి నీ కతంబున నేను బ్రహ్మహత్యా పాతకముఁ జెంద నైతి నని స్తోత్రముఁ జేయుచు నచ్చటినుండి పరివారమును గలిసికొని యా వృత్తాంత మంతయుం జెప్పుచు వెండియు విజయభాస్కరు నా మత్తగజముపై నెక్కించి యధా తధముగా మేళతాళములతో నూరేగింపుచుఁ బట్టణములోనికి దీసికొని పోయి బెద్ద యుత్సవముఁ గావించెను.
ఆ రాజప్పుడు తన్నుఁ బునర్జీవితుఁగాఁ దలంచి విజయభాస్కరుని యనుమతి ప్రకారము దేవభట్టున కప్పుడే యా విగ్రహముతోఁ గూడ నూఱు గ్రామములు దాన మిచ్చి సగౌరవముగా వారి వారి యగ్రహారముల కని పెను రాజపుత్త్రునకుఁ దన యర్థ రాజ్యమిత్తునని చెప్పెను. కాని యతం డనుమోదింపక తల్లిం జూచు వేడుకతో వారితోఁ గూడ నృపతి యనుమతి వడసి యా యగ్రహారమునకుం బోయెను.
అక్కడ గుమారుండరిగిన వెనుక నిరుగు పొరుగువారు చారుమతి యొద్దకు వచ్చి "అమ్మా ! నీ వెంత వెఱ్ఱిదానవోకదా ! దేవభట్టు నీ కుమారు బ్రహ్మరాక్షసునికి బలియిచ్చుటకై తీసికొని పోయెనని చెప్పుకొనుచున్నారు. ప్రొద్దున వచ్చిన హేమ విగ్రహమును జూచి యతని కాశ జనించినది. తనకుఁ బదుగురు పుత్త్రులుండ నీ పుత్త్రుం దీసికొని పోనేల ? నీ వెట్లంగీకరించితి వమ్మా ! ఇప్పుడైనఁ దగవు వెట్టినచోఁ దీసికొని రావచ్చును. వీనిఁ దనకుమారుఁడని చెప్పి నూఱు గ్రామములు లాగ వలయునని తలంచుచున్నాఁడు. నీవీ మర్మమేమియు నెఱుంగవు కాఁబోలు నని యా వృత్తాంత మంతయుం జెప్పిన నేలంబడి మూర్చిల్లి యొడలెఱుంగక యొక్కింత తడవునకుఁ దెప్పిరిల్లి యిట్లు దలంచినది.
అయ్యో ! కుమారా ! నన్నెంత మోసముఁ జేసిపోయితివిరా ? గడ్డము పట్టుకొని బ్రతిమాలిన నేమోయనుకొంటిని. ఎప్పుడు నేమియు గోరనివాఁడవు కోరితివని యంగీకరించితిని. చివరఁ బద్యము జదివి నప్పుడై నఁ దెలిసికొనలేక పోయితినిగా ! అన్నన్నా ! బ్రాహ్మణుఁడా ! ద్రవ్యాశచేతఁగదా యిట్టి పనికిఁ బూనుకొంటివి ? ఆ యిల్లాలైనఁ జెప్పినది కాదే. గుణసారుఁ డెంతవాఁడయ్యెను ! నాతోఁ జెప్పి పోయిన నింత చింతయుండక బోవునే. అయ్యో ! హృదయములోఁ దరంగముల వలె నేవియో పుట్టుచున్నవి. ఎట్టు లణంచుకొందురు. నన్నోదార్చు వారెవ్వరు ? నీ ----------- కించుక యేదియేని సోఁకిన మే నంతయుఁ గందువది. యిప్పు డాబ్రహ్మరాక్షసుని వాడి కోరలు సోకిన నెట్లు సైతవురా ? నాయనా ! యని యనేక ప్రకారముల శోకిం పుచు నంతలో నతండు చదివిన పద్యమును జ్ఞాపకముఁ జేసికొనుచుఁ బలు తెరంగులఁ జింతా సముద్రములో మునింగి కొట్టుకొనుచు దేవభట్టు రాక కెదురు చూచుచుండెను.
అంతలో విజయభాస్కరుఁడు వచ్చి తల్లి కి నమస్కరించి అమ్మా ! అట్లు దుఃఖించుచుంటి వేమిటికని యడిగెను. ఆమె పుత్రునిం జూచి వీఁడు మా ముద్దుల తండ్రియే అయ్యో ! యెట్లు వచ్చితివి ? దేవభట్టుపై నిచ్చటివారలు వేసిన నిందలు వట్టివి కాఁబోలు. బహ్మరాక్షసుని కాహారముగా నిన్నుఁ దీసికొని పోయెనని వింటి. అబ్బా ! నా దుఃఖమేమని చెప్పుదును ? పోనిమ్ము కన్నులం బడితివి యింతియబాలు నని పలుకుచు నతని శిరము మూర్కొని చెక్కులు ముద్దుఁ బెట్టుకొనుచుఁ బెద్దతడవు గారవించినది. అప్పు డతండు నవ్వుచుఁ దనపోయి వచ్చిన వృత్తాంత మంతయుం జెప్పిన విని యామె నెరఁగు పడుచుఁ బుత్రా నా పనియేమి చేసి పోయితివని యడిగినది. అమ్మా ! నీకుఁ బలుమారు చెప్పనక్కఱలేదు. మరణము విధి విధించెనా యెక్కడున్నను దప్పదు లేనిచో నెక్కడికిఁ బోయినను భయము లేదు. ఇదియే నిశ్చయము ఇదియే దేవరహస్యము. అందరి పనియుం జేయువాడు దైవము. నాకేమియు భయము లేదని యెఱింగియే యటుపోయితిని.
మన వృత్తాంత మెల్ల రకుఁ దెలిసినది. ఇఁక మనమిందుండరాదు. ఎఱుఁ గని దేశమునకుఁ బోయి కాలము గడుపుకొనియెద మని పలికిన విని తల్లియు ననుమోదించినది. దేవభట్టు రాక పూర్వమే వారా యగ్రహారము విడిచి మఱియొకదేశమునకు బయనము సాగించిరి. నడుచు నప్పుడును చారుమతి వత్సా ! యెట్టియిడుములైనఁ గుడువ వచ్చునుగాని నడచుట గష్టము గదా ? నడక యనిన నాకు వెఱపు గలుగు చున్న దె. యెక్కడనైన నొక్కచో వసియించి యుదరపోషణ చేసికొనఁ జాలమా యెంతకాలమిట్లు తిరుగుచుందుము ? మనకు గమ్యస్థాన మేది ? యని యడిగినఁ కుమారుండు వగచుచుఁ దల్లీ ! సుగుణ సంపన్నుఁడగు రాజు నరసి యతని యొద్ద గొల్వుఁ జేసెదను. దానం గాలక్షేపము గాఁగలదు. నీవు చింతింపకు మని యోదార్చెను.
అయ్యో ! సేవకవృత్తి గడు దుర్ఘటమైనది గదా ! ప్రభువులమదినరసి యెట్లు వర్తింతువు ? అన్నా ! పెక్కండ్ర బరిచారకుల యూడిగములఁ గై కొని నీ విప్పు డొక్కని యాజ్ఞకులోనై పనులఁ గావింతువా ! యని చారుమతి విచారింపఁ జొచ్చినది.
అట్లు వారు కొన్ని పయనంబులు సాగించి యొకనాడు శోభావతియను పట్టణంబునకుం జని యందొక విప్రునింటఁ బసఁ జేసిరి. ఆ యింటి బ్రాహ్మణుని వలన యశస్కరుండను చరంబరఁగు నా పట్టణపు రాజు వృత్తాంతము విని యతండు సేవనీయుండని నిశ్చయించి తల్లి యనుమతి వడసి మఱునాఁ డుదయ కాలంబున నా రాజకుమారుఁడు తత్సమ యోచితమగు వేషముతో యశస్కరుని యాస్థానమునకుంజనియెను. ఆ రాజు రాజుపుత్రుని యాకార విశేషములం జూచి వెరఁగుపడుచు 'అనఘా ! నీ వెవ్వని కుమారుండవు ? నీ నివాసదేశ మేది ? యేమి పనికై యిక్కడకి వచ్చితివి ? నీ వృత్తాంతము జెప్పు' మని యడిగిన నతం డిట్ల నియె. దేవా ! నేను క్షత్రియజాతి వాఁడను. ఒక కారణంబునఁ దండ్రి కెడమై తల్లి తో వచ్చితిని. నా పేరు విజయభాస్కరుడండ్రు. జీవనాధారము దొరకక తిరుగుచున్న వారము. నీచపు పనులకు నా బుద్ధి చొరదు. నీవు సాధుచిత్తుండవని నిన్ను సేవింపవచ్చితిని. నాకు నెలకు నూరుమాడలు వేతన మిత్తువేని నీ యొద్ద నుండెదను.
మీరు చెప్పిన పనుల నమ్మకముగాఁ జేసి దయాపాత్రుండ నగుదునని చెప్పిన యా రాజు వాని మాటలు విని సంతసించుచు సప్పుడే వాని కట్టి యధికార పత్రికి నిచ్చి చేయఁదగిన పనుల ఱేపు నియమింతునని చెప్పి యప్పటికిం బంపెను.
రాజపుత్త్రుఁ డింటికిం బోయి "అమ్మా ! యీ రాజు కడు మంచి వాఁడు. గుణసంపన్నుండు నా కోరిన వేతన మిచ్చుటకు సమ్మతించెను. దీనం గాలక్షేపము కాఁగలదు. ఓపిన కొలఁది పరుల సంతసపరుపు" మని చెప్పి తల్లికి సంతోషము గలుగఁజేసెను. అతండు మఱునాడు సభకుఁబోయి నేఁ జేయఁదగిన పని నిరూపింపు డని యడిగిన నాకా కాలోచించి యేదియుం జెప్పుటకు సమాధానము లేక యూరక యా స్థానమునం గూర్చుండమని నియమించెను. ప్రతిదినము రాజపుత్రుండు సభకు వచ్చి పనియేమని యడుగుచుండ నేమియుం జెప్పక తన యెదుట గూర్చుండఁ బెట్టు కొనుచుఁ గొన్ని దినములు గడిపెను.
మంజువాణికథ
ఆ రాజు వాని ముఖలక్షణములఁ బరీక్షించుచు సత్యవచనుండనినిశ్చయించి వాని రాత్రులయం దంతఃపురముగాచునట్లు నియమించెను. రాజపుత్రుండు రాజు చెప్పిన చొప్పున ఖడ్గపాణియై రాత్రియెల్ల నిద్రఁబోవక యంతఃపురము గాచుచుండెను. అతని యనుమతి లేక చీమయైన లోపలికిఁ బోవుటకు వీలులేదు. రాజుగారి మూడవ భార్య మంజువాణి యను చిన్నది సుముఖుండను మంత్రిని వరించి యున్నది. రాజు గారొక్క భార్యయొద్దకు మూఁడుదినముల కొకసారి బోవుచుందురు. గావున నతండు రాని రాత్రుల సుముఖుండు రహస్యముగా మంజువాణి యంతఃపురమునకరుగుచుండెను. అయ్యంతఃపుర మా రాజపుత్రుండు గాచుచుండుటచే వాడుక ప్రకార మా మేడకుఁ బోవుటకు మంత్రికి వీలుపడినదికాదు. రాత్రియెప్పుడుపోయి చూచినను రాజపుత్త్రుఁడు ఖడ్గపాణియై యిటునటు తిరుగుచుండును. దానంజేసి సుముఖుండు దీనముఖుండై యేమియుం దోపక యెప్పుడైన నిద్రఁబోవునేమో యని యా యుతఃపురమున వేచి యుండెను. ఇంచుకయు నవకాశము దొరికినది కాదు.
మఱియొకనాఁడు సుముఖుండు పెద్దయుం బ్రొద్దు చింతించి దాసీ వేషము వైచికొని మొదటి యామముననే పోయి అయ్యా ! నేను మంజువాణికి మిత్రురాలను, ఆమె పుట్టినింటి కరిగి వచ్చితిని. ఆమెతోఁ గొన్ని వార్తలం జెప్పవలసియున్నది. నన్ను లోపలికిఁ బోనీయుఁడని వేఁడికొని యందులకు దృష్టాంతముగాఁ గొన్ని పత్రికలం జూపించుటయు రాజపుత్రుండు నమ్మి వాని లోపలికిం బోనిచ్చెను. అప్పుడా సుముఖుం డపరిమిత సంతోషముతో లోపలికింబోయి విరహ వేదనముచే బాధపడుచున్న మంజువాణిం గాంచి మేనం బులకలుద్బవిల్ల దానుబడిన యిడుమ లన్నియుం జెప్పుచు నామెతో నా రాత్రి గడిపెను. అంతలో వేకువజా మగుటయు మంత్రి యధా ప్రకార వేషముతో నరుగఁబోయెను. రాజపుత్రుండు చేయిపట్టుకొని సూర్యోదయము వఱకు నీవు పోవుటకు వీలులేదు. నిన్నుఁ బోనీయను. నిలుమని యదలించిన భయపడి యతండు వెనుకకుఁ బోయి యామాట మంజువాణి కెఱింగించెను. అప్పుడు మంజువాణి యాలోచించి మేలిముసుఁగు వై చికొని ద్వారముదాపునకుం బోయి రాజ పుత్రుంగాంచి విస్మయము జెందుచు సౌమ్యా ! యిది నాసఖురాలు అవసరమైన పనికిం బంపుచుంటిని. తెల్ల వాఱినఁ గార్యము మిగిలిపోవును. నేను రాజుపత్నిని, మంజువాణి యనుదాన. నామాట నీవించుక పాటింపవలదేయని సానునయముగాఁ బలికిన విని యతండు మఱుమాటాడక యతనిం బోనిచ్చెను.
తరువాత నాయువతీమణి రాజకుమారుని సౌందర్యాతిశయమును జూచి మోహించి అయ్యారే ! వీని రూపమద్భుతముగానున్నది. ఇట్టి సౌందర్యవంతుని సేవకునిఁగా జేసిన పరమేష్ఠి నిందాపాత్రుఁడుగాడా ? వీఁడు నన్ను మన్నించినఁ బంచశరుఁబరచరుగాఁ జేసికొననా ? పెరటిలోనున్న మాణిక్యంబును దెలిసికొనలేక గాజుపూసకై విదేశమున కరుగుచుంటినే ? వీనిం జూచిన నెట్టిపూఁబోడియు విరాళం గుందక మానదుగదా ! ఇట్టి సొగసుకాని నంతఃపురమునఁ గాపు పెట్టిన యీరాజు కంటె నవివేకి యెందైనంగలడా ? పాలకుండుండ మార్జాలమును గాపుపెట్టినట్లున్నదని యనేక ప్రకారములఁ దలంచుచుఁ బంచశరకరబెద్దహృదయయై యోరచూపుల నతనిం జూచుచు నట్లనియె.
చిన్న వాఁడా ! నీవెవ్వని కుమారుండవు ? పేరేమి ? నీకు వివాహమైనదా ? నీభార్య నీయందమునకుఁ దగియున్నదా ? లేదా ? చెప్పుము అని యడిగిన నతండు తలవాల్చుకొని యిట్లనియె. అమ్మా ! నేనొక పేదకుటుంబము వాఁడను. నాపేరు విజయభాస్కరుఁ డందురు నేనే సేవకుఁడనైయుండఁ బెండ్లి యాడి భార్యనెట్లు పోషింతును ? నాకుఁ బెండ్లికాలేదని యుత్తరముఁ జెప్పెను. అప్పు డబ్బిబ్బోకవతి మేనుబ్బ నవ్వుచు అయ్యో ! నన్నమ్మా యని పిలుచుటకు నేనంత పెద్దదాననుకాను. రాజుగారికి మూడవ భార్యను. నీకుఁ బెండ్లి కాలేదని విని నామది విచారముగలుగు చున్నదిగదా ! నీయౌనమిట్లు రిత్తసేయుట న్యాయమా ? నీమాట చోద్యముగా నున్నది. సేవకుఁడ వగుటచేఁ బెండ్లి మానితివా ? చాలుఁ జాలు దబ్బఱలాడుచుంటివి. మేము నీ భార్యను జూతుమని యట్లనలేదు గదా ! అవును. నీ కనురూపయగుమగువ లేకపోవుటచే మానితివి. సత్యమేయని యేమేమో పలుకుటయు నతం డమ్మా ! నాకు నీమాటలకేమియు నర్దముకాలేదు. నేను గలయందైన నసత్యమాడను. పెండ్లింజేసికొన లేదు. తెల్ల వారుచున్నది. లోపలికి దయచేయుమని పలికెను. అంతలోఁ దెల్లవాఱినది. కావున నందుండుటకు వీలులేక మంజువాణి లోపలికిఁ బోయినది.
అతనిరూపమే తలంచికొనుచు విరహాతురయై క్షణ మొక యుగములాగున గడపినది. మఱునాఁడు రాత్రి దిరుగా వచ్చి చిన్నవాఁడా ! నీతో నిన్ననొకమాటఁ జెప్ప మఱచితిని. నామాట పాటించురా ? మఱియొకటి వినుము. నీవు రాత్రియెల్ల మేల్కొని యుందువు నీకు నిద్రరాదాయేమి ? నిన్నుఁజూడ నాకు జాలి పొడముచున్నది. నీవొకసారి పండుకొనుము. నీకాపు నేఁగాచెదను. అవును. మన్మధుఁడు రాత్రుల నిద్రఁ బోవడఁట. నీవు నట్టివాఁడవే కావున నిద్రఁ బోకుంటివి. తెలిసినదని పలికిన నతండు అమ్మా ! నాకట్టిపోలికల నేమిటికి దెచ్చెదవు. నాతోఁ జెప్పవలసిన మాట యేదియో చెప్పిపొమ్మనుటయు నత్త్విని యిట్లనియె.
సౌమ్యా ! మఱేమియు లేదు. యౌవనము ద్రువమైనదికాదు గదా ? ఇట్టి ప్రాయమంతయు రిత్తచేయుచున్న వాఁడ వని విచారముగానున్నది. ఇఁక సుఖమెన్నఁ డనుభవింతువు ? నీకుఁ జక్కని కాంతంగూర్చెద ననుమోదింతువే ! యనిన నతండు అమ్మా ! నాకట్టి యభిలాషలేదు. పెండ్లియాడనని జెప్పలేదా ? ఆమాటకై తిరుగానింత శ్రమపడి రానేల ? యౌవనమునఁ జేయఁదగిన కృత్యంబులు వేనవేలున్నయవి. అవి యన్నియుం దీర్చుకొన్నఁ జాలదా ? పెండ్లి యేటి ? కని పలికెను.
అప్పుడా మంజువాణి భాస్కరా ? నీవేమియు నెఱుఁగనివాఁడవు. కావున నిట్లనుచున్నాఁడవు మహర్షులు సైతము వివాహమాడి యానందమనుభవించిరి. నీవు కోరిన నేయింతి యంగీకరింపదు ? ఆహా ! నిన్నుఁ జేపట్టిన జవరాలిదిగదా భాగ్యము ? అయ్యారే ! నీయిట్టి సొగసుకాఁడు మగఁడుగా నుండిన యింతికి సామ్రాజ్యమేల ? యని యూరక పొగడుచుండిన వారించుచు నతండిట్లనియె. అమ్మా ! మేదోమాంస రుధిరాస్థిమయంబై హేయంబైన యీకాయంబు నింత గొప్పగా వర్ణించెదవేల ? నీమాటలేమియు నామది కింపుగాలేవు నీవు రాజపత్నివి. కావున నేమనుటకుం గాదు. నాకు వివాహమునందభిలాష లేదు. నీవు వెళ్ళిపొమ్మని పలికెను.
అప్పు డామంజువాణి లోపలికిఁ బోయి మదనమంజరిక యను సఖురాలిం జీరి తన హృదయాభిలాషయెఱింగింపుచు నిట్లనియె వాల్గంటీ ప్రాణమువంటిదానవు కావునఁ జెప్పుచుంటిని. మనవాకిటఁ గావున్న చిన్నవానిం జూచితివా ? కాముఁడు గీముఁడు వాని గోఁటికిసాటిరాఁడుగదా ! బ్రహ్మ వానికిఁ ద్రిలోకమోహజనకమగు సౌందర్య మొసఁగి తగిన రసికత్వ మొసంగఁ డయ్యెను. ఏమి చేయుదును ? సిగ్గు విడిచి యభిలాష వెల్లడించినను వాని హృదయము గఱగినదికాదు. శృంగార మెఱుఁగునో యెఱుఁగడో తెలియదు ! వాని కదియే కలిగినచో బంగారమునకు సౌరభ మబ్బి నట్లుండును గదా ! వానిం గూర్చునుపాయ మరయుము. నీవు మిగుల బుద్దిమంతురాలవని చెప్పినవిని యా మదనమంజరిక యిట్లనియె. సఖీ ! నీవింత బేల తనముగా మాటలాడుచున్నావేమి ? మాటలకు వశముకానివారు క్రియలకు లోఁబడుదురు. వానితో నీ వన్ని పలికితివిగాని తటాలునఁ గౌఁగిలించితివేని యంగీకరింపకుండుటకు నతండు శుకుఁడా ? భీష్ముఁడా ? హనుమంతుఁడా ? పిమ్మట మదనుండే వాని కన్నియు నుపదేశించును. ఱేపైన నట్లుచేయుమని యుపదేశించినది.
అమ్మఱునాఁ డచ్చేడియ చక్కగా నలంకరించుకొని హంసగమనంబున సల్ల న నతనియొద్దకు వచ్చి మేనఁ జెమ్మటలు గ్రమ్మఁగంపముతో నతని నంటబోయి యంతలో సిగ్గున నిలువంబడి చిన్నవాఁడా ? నేనొక్కమాటఁ జెప్పుచున్నాను వినుము. నీవు మిగుల దయాళుండవని యెల్ల వారు చెప్పుచున్నారు. నేను మదనగ్రహ పీడితనై యున్నదాన. భవదీయ పాదమూలంబు శరణంబుఁ జొచ్చితిని. పరిష్వంగ మొసంగి కాపాడుము. లేకున్న బ్రాణంబులు విడుచుచున్న దాన నని పలుకుచుఁ దన మాటలకేమియు నుత్తరమీయక యథోముఖుండై యెద్దియో ధ్యానించుచున్న యా చిన్నవాని గౌఁగిలించుకొనినది.
అప్పు డతండు బలవంతముగాఁ గౌఁగిలి విడిపించుకొని రౌద్రావేశముతోఁ గత్తిఁ దీసి ద్రోహురాలా ? యేమి చేసితివి ? నా యభిప్రాయము గై కొనక వేగిరింతురా ? స్త్రీలకు శీలము లేకున్న దండింపఁదగినది. అందు రాజుభార్యవై నీచ కృత్యముల కుద్యోగింపుచుంటివి. నిన్ను శిక్షింతును. జూడుమని వ్రేయఁబోవుటయు నయ్యువతి 'చంపుము చంపుము. నీకృపాళుత్వము వెల్ల డియగునులే' యని పలికి మెడి యొగ్గినది. అప్పు డారాజపుత్త్రుండు చేతులురాక కత్తి నేలఁబాలువైచి 'సీ ! యీరాజు నన్నుఁ దగనితావునఁ గాపుపెట్టెను. ఇందుండరాదని' పలుకుచు నందువెడలి యవ్వలికిఁ బోఁదొడంగెను. అట్టి సమయమున మంజువాని లేచి యాకత్తిదీసికొని యహంకారముతో నతనిపై విసరినది. తాను వలచిన సమ్మతింపనప్పుడు స్త్రీలకుఁ గలుగు కోపమునకు మితిలేదుగదా ? తానొకటి దలఁప దైవమొకటి దలంచును. అంతకుఁ బూర్వమే మంత్రి స్త్రీవేషము వైచుకొని రాజకుమారుఁడు నిద్రఁబోవు నేమో సమయ మరసి లోపలికిఁ బోవలయునని యందొకచో బొంచియుండెను. విసరినకత్తి రాజకుమారునికిఁ దగులక యందు డాగియున్న మంత్రికిం దగిలి కంఠ ము త్తరించినది. ఆహా ! ఎంతచోద్యము ! ఆ ప్రక్రియ యేమియు రాజకుమారుం డెఱుంగఁడు కోటదాఁటి యయ్యర్ధరాత్రంబునఁ దిన్నగాఁ దన యింటికిఁబోయెను.
మంజువాణి దాసీముఖమున నావృత్తాంతమంతయు దెలిసికొని భయాక్రాంత స్వాంతయై పరితపించుచు నా యాపద దాటింపుమని మదనమంజరికను బ్రార్థించినది. అప్పు డాదాది చేయఁదగిన కృత్యమంతయు బోధించి ఆమంత్రిశవమును మూటగట్టి తీసికొనిపోయి కందకములోఁ బాఱవైచినది. అంతలోఁ దెల్లవారుసమయ మగుటయు మదనమంజరిక బోధించిన ప్రకారము మంజువాణి కేకలు వైచుచు నొడలు గీఱుకొని తలవిరియఁబోసికొని యేడువఁ దొడంగినది. ఆ సద్దు విని నృపాలుం డదరిపడి రెండవభార్య యంతఃపురమునుండి యక్కడికివచ్చి మంజువాణి యాకార వికారమునుజూచి భయపడుచుఁ బలుకులు దడఁబడ నేమి యేమని తొందరగా నడిగెను.
అప్పుడు మంజువాణి కొంతసే పేమియుం జెప్పక శోకమభినయించుచు నెట్టకేలకుఁ గన్నీరుదుడిచికొని మహారాజా ! పడుచు వాండ్ర నంతఃపురములలోఁ గాపు వెట్టిన నీకంటె నవివేకి యెందై నంగలఁడా ? ఆక్రూరాత్ముఁ డేమిచేసెనో చూచితిరా ? అయ్యో ? చెప్పుటకు నోరాడకున్నని. మీరు రానిసమయము కనిపెట్టి దొంగవలె వచ్చి ముచ్చటలాఁడ మొదలుపెట్టెను. నీ కిందేమి పనియున్నదని యడగిన నిన్ను వలచి వచ్చితినని చెప్పెను. ఆ మాటవిని నేను భయపడి మెల్లన లేచి లోపలికిఁ వోవఁ దలంచు నంతలోఁ జేయిపట్టుకొని యేమేమో చేయఁ దొడంగెను. నేను గేకలు వైచితిని. నా సఖురా లీమదనమంజరిక వచ్చి విడిపించినది. అంతలో వాఁడు పాఱి పోయెను. మంత్రి కాతెఱంగెఱింగింపుమని నా రెండవదాది నంపితిని. అదివోయి మంత్రిని లేపి యావార్తఁ జెప్పిన నతండు వానిం దఱిమికొని పోయెనని చెప్పినది. ఇంతవట్టునిక్కువము తరువాత నేమిచేయవలయునో మీరే ప్రమాణమని యూర కున్నది.
అప్పు డారాజు క్రోధావేశ హృదయుండై మదనమంజరిక నడిగిననదియు నట్లే చెప్పినది. ఔరా ! యౌవనమద మెట్టివానిని దుర్గుణుం జేయక మానదు. ఆ చిన్నవాఁ డుత్తముఁడని నమ్మి నేనే మోసపోయితిని. దాననే కదా పెద్దలు శుద్ధాంతముల వృద్ధులం గంచుకులఁగా నియమించి కాపు పెట్టుదురు. కానిమ్ము. ఇప్పు డేమి యనుకొనినను బ్రయోజనము లేదని తలంచుచున్న సమయములో నొక దాది వచ్చి సుములు నెవ్వరో చంపి కందకములోఁ బాఱవైచిరని చెప్పినది.
ఆ మాట విని రాజు --------- చిత్తముత్తల పెట్టి సత్వరముగాఁ బోయి చూచినంత మంత్రి కందకములో నీటిపైఁ దేలియుండెను. పరీక్షించినఁగంఠము నఱకబడియున్నది. ఆ కృత్యమా చిన్నవాఁడే చేసినట్టు నిశ్చయించి తానొక్కరుఁడ యా రాజపుత్రుఁడున్న మందిరమున కరిగెను. అట్టి సమయమున నతండు తల్లి తో "అమ్మా ! మన మిందుండరాదు. మఱియొక దేశమునకుఁ బోవుదము రమ్మని చెప్పుచుండ నాయనా ! అట్లనుచున్నావేమి ? యీ రాజు కడు ధర్మాత్ముండని చెప్పు చుందువే? యీతని కొల్వుమాను కొనునంత యవసర మేమి వచ్చినదని యడిగిన నా మాట కేమియు నుత్తరముఁ జెప్పక అది నా ప్రారబ్దమని పలికెను. ఆ మాటలారాజు చెవిని బడినవి. వాని సపరాధిఁగా నెంచి యా రాజు చయ్యన లోనికింబోయెను. రాజపుత్త్రుఁడు రాజుంజూచి యక్కజమందుడు లేచి నిలువంబడి నమస్కరించెను. అప్పుడా రాజు నిన్ను మేమంతఃపురములోఁ గాపు పెట్టితిమి గదా ? మా సెలవు లేనిదే నీవేమిటి కిట్లు వచ్చితివో చెప్పుమని యడిగిన నతండది నాదియే తప్పు. అందులకు నన్ను శిక్షింపుఁడని యుత్తరముఁ జెప్పెను. పిమ్మట రాజు 'కానిమ్ము. నీవు చేసిన తప్పిది యొక్కటియే కాదు. చాలగలవు, విచారించెదను. సభకు రమ్మని” పలికిన నతండించుకయుఁ గలఁతనొందక చిత్తము చిత్తము, ఇదె వచ్చుచున్నానని యతని వెంట నడువఁజొచ్చెను రాజు వానికి మంత్రి శరీరమును జూపి వీనినిట్లెవ్వరు చంపిరో యెఱుంగుదువా ? యనుటయు నది దైవమునకుఁ గాక యొరులకుఁ దెలియునా? యని యుత్తరముఁ జెప్పెను.
తరువాత సభకుఁ దీసికొనిపోయి మంజువాణి సఖురాలు మదనమంజరికను రప్పించి నిన్న రాత్రి నితండేమి చేసెనో చెప్పుమని యడిగిన నా చెడిపై సభ్యులెల్ల రు విన నిట్లు చెప్పినది. అయ్యా ! యీ చిన్న వాఁడు మా యమ్మగారి మేడలోపలికి వచ్చెను. నేను గదిముంగిటఁ గూర్చుంటి. నన్ను జూచి మంజువాణి యెందున్నదని యడిగెను. నీ కామె పనియేమి యున్నది ? లోపల నున్నారని చెప్పితిని. అవసరముగా మాటలాడవలయునిటు రప్పింపు మనుటయు నిజమనుకొని నేను దీసికొని వచ్చితిని. ఆమెం జూచి యాతండు నాకు దాహమగుచున్నది. యిచ్చెదవా ? యని యడిగెను. ఆమె నన్నిమ్మని సన్నఁజేసినది. అది యొరులిచ్చునది కాదు. నీ యధరామమృత మిచ్చినం గాని నా దప్పిదీఱదనిపలికెను. ఛీ: నీచా : అట్టిమాటలు ప్రేలెద వేల ? పో పొమ్మని యామె పలికి లోపలికిఁ బోవుచున్నంత వెనుక నరిగి యామె చేయి పట్టుకొని లాగెను. నేను బోయి వెనుకకు లాగితిని ఆమెయుందిట్టినది. అప్పుడు కోపము వచ్చి కత్తి దీసికొని మమ్ము నఱకఁ బోయెను. మేము కేకలు వై చినంతట బాఱిపోయెను - అప్పుడు నా చెల్లెలిచే మంత్రి కా వార్తం తెలియఁ జేసితిని.
అతండు వోయిన నాకత్తిచే నఱికి యతని యంగము కందకములోఁబాఱవై చెనఁట ఇదియే జరిగిన కృత్యమనిచెప్పినది. అప్పుడు రాజు వానింజూచి పుణ్యాత్మా ? యిది చెప్పిన మాటలు వింటివిగదా ? దీని కేమి యుత్తర మిచ్చెదవని యడిగిన నా రాజపుత్రుండు వెరగందుచు ఆహా ! స్త్రీ లెట్టిపనులకైన సాహసము గలవారు గదా ? ఇప్పుడు నేను యదార్ధముఁ జెప్పినను రాజు నమ్మఁడు నమ్మినంత నీ కాంతంజంపును. భార్యాభర్తలకు వియోగముఁ జేసినవాఁడనగుదును. నేను బ్రతికి యుండిన నేమి ప్రయోజనము? అని తలంచుచు నేమియుం బలుక యూరకుండెను. రాజు మఱల దీని మాటలకుఁ సమాధానము జెప్పవేమి ? యీ యపరాధముఁ జేసిన ట్లొప్పుకొనియెదవాఁ యని యడిగినఁ జిత్తము. ఒప్పుకొంటినని యుత్తరముఁ జెప్పెను. క్రమ్మిరమంత్రిని? గూడ నీవే చంపితివి కాదా ? యనుటయుఁ గారకుండను నేనే యని యుత్తర మిచ్చెను.
అప్పుడు రాజు మిగులఁ గోపించుచుఁ ద్రోహీ ! నీవు లనె పూసిన కత్తి వని యెఱుంగక నీ మాటల నమ్మి శుద్ధాంతమునఁ గాపు వెట్టిన నెట్టిపని జేసితివి ? క్రూరాత్మా ? రాజపత్ని నీకుఁ దల్లిగాదా ? అయ్యో ? కడుదయాళుండనని పలికితివే ? నా యంతవాని నీ మంత్రినెట్లు చంపఁ జేతులాడెనురా ? యని యనేక ప్రకారముల నిందింపుచు శాస్త్రవేత్తల రప్పించి వాని వృత్తాంతమంతయుఁజెప్పి వీనికేమి శిక్ష విధింపవలయు? నని యడిగిన వారు గాత్రము తున్కతున్కలుగా గోసి యుప్పుపాతర వేయవలయునని చెప్పిరి. ఆ మాటలు విని రాజు తిరుగనించుక విమర్శించి తదాకార చేష్టలఁ బరీక్షించి అన్నా ! వీని ముఖమున నించుకయు వికారము గనంబడదు అపరాధముఁ జేయని వాడుంబోలె గన్పట్టుచున్నాఁడు. ఉరిశిక్ష విధించిన వెరచినట్లు కనంబడఁడు. దీనిలోఁ నేదియో మర్మమున్నదేమో కదా ! పోనీ నే నెఱుంగననియుం జెప్పకున్నాఁడేమి? నిరపరాధుని శిక్షింతునేని నరకము పాలగుదునని తలంచుచుఁ జిన్న వాఁడా ! నీవు చేసిన తప్పునకు విద్వాంసులు చెప్పిన శిక్ష శాస్త్రచోదితమై యున్నది. అట్టి దాని ననుభవింతువా ? యనుటయు నతండించుకయు విచారింపక పూర్వముద్యోగ మిచ్చినప్పుడుబోలె సంతోషముతో మందహాసముఁ గావించెను. ధైర్యమునకు సభాసదు లెల్లరు ఆశ్చర్యపడఁ జొచ్చిరి.
అప్పు డారాజు హృదయంబునఁ బలుతెఱంగులఁ దలంచుచు నురిశిక్షకు సమ్మతింపక ద్వీపాంతర వాసశిక్ష విధించి తన యంతఃపురమున కరిగెను. రాజభటు లారాజపుత్రుని నిగళంబులం గట్టివైచి వీధులన్నియు నూరేగింపుచుఁ దల్లి యొద్దకుఁ దీసికొని పోయిరి. అంతకు ముందుతద్వృత్తాంతము విని విచారింపుచుఁ జారుమతి కుమారుం జూచి నాయనా ! నీ కిట్టియపవాద మెట్లు వచ్చినది ? కలయందైనఁ బరకాంత వార్త స్మరింపని నీవు రాజపత్నిం బట్ట గమకింతువా ? అయ్యో ? పరుల నిమిత్తము ప్రాణమును దృణముగా నెంచి విడుచువాఁడవు. మంత్రినెట్లు చంపుదువు ? తండ్రీ ! నీ వజాతశత్రుఁడవే ? యట్టి నీయం దీయపరాధ మెవ్వరు మోపిరి ? నీయం దెవ్వరు వై రముఁ బూనిరి ? తప్పుజేసిన వాఁడుంబోలె నీ వేమిటి కూరకుంటి ? వని యనేక ప్రకారముల విలపింప రాజుపుత్రుండు నవ్వుచు నిట్ల నియె. అమ్మా ! నేను బలుమాఱు బోధింపుచుండ నేమిటికి మఱచెదవు ? ప్రారబ్ధంబు భోగింపక తీఱునా ? యొరుల నిందించెద నేమిటికి ?
శ్లో॥ యత్కర్మబీజముప్తల యేనపు రానిశ్చితం స తద్భుజై
పూర్వ కృతన్యహి శక్యో విధినాపి నకర్తుమన్యధా భావః
శ్లో॥ తస్మాధ్యత్రయధాయద్భవితవ్యంయన్యడై వయోగేన
తత్రతధాతత్ప్రాప్తోవివశోసానీయలేత్రనభ్రాంతిః
పూర్వజన్మంబున నాటిన సుకృతదుష్కృత రూపమగు కర్మమను బీజము వృక్షమై ఫలియించును. దాని ఫలమునే జనుండు భక్షింపుచుండును. అట్టి పూర్వ కృత్యమును మార్పుటకు బ్రహ్మ దేవునకై నను శక్యము గాదు ఎక్కడ నెవ్వన కెంత యనుభవింపవలసి యుండునో వారినచ్చటికిఁ దీసికొని పోయి దైవము దానినిఁ గుడిపించును. అట్టి దాని విషయమై భ్రాంతిపడ నేమిటికి ? నేను బోయి వచ్చెద నాజ్ఞ యిమ్ము నా కొఱకుఁ జింతింపకుము. దేహ ప్రధానంబున నైన నొరుల కుపకారముఁ గావింపుము. నీ వెఱుంగని దానవు కావు. స్వార్థపరత్వ మెవ్వరికిని గూడదని యెన్నియో బోధించి యామె నూరడించెను.
పిమ్మట రాజభటులు లతనిం దీసికొనిపోయిరి. నిగళబద్ధుండైన యా రాజ కుమారునిం జూచి యావీటిలోఁ గన్నీరు గార్చనివారలులేరు. నిత్య మతనియొద్ధసత్కారముల నందు దరిద్రులు వాని వృత్తాంతము విని గోలున నేడ్చుచు వెంటబడిపోవఁ జొచ్చిరి. రాజభటులు వారినెల్ల వారించుచుఁ గ్రమంబునఁ బురనదీపట్టణారణ్యభూముల దాటించి సముద్రయానమున ద్వీపాంతరమునకుఁ దీసికొనిపోయిరి.
యశస్కరుని కథ
రాజు రాజపుత్రుని కట్టి శిక్షవిధించి యశస్కరుండు ఆముదిన్న పశువు వలెఁ గొట్టుకొనుచు నేమియు దోచక యెద్దియో విచారము చిత్తమున వేధింప నాఁటి రాత్రి నిద్రఁబోవక ప్రజలు తన్నేమనుకొనుచున్నారోయని యూహించి మాఱువేషము వై చికొని వీధులవెంబడిఁ దిరుగఁజొచ్చెను. అప్పుడొక యింటిలో భార్యాభర్తల కిట్టి సంవాదము జరిగినది.
భార్యా - ప్రాణేశ్వరా ! యిందాక శిక్ష పడిన చిన్న వానిం జూచితిరా ? పాప మెంత చక్కగా నుండెనో ? ద్వీపాంతరమునకుఁ దీసికొని పోయి వానిం జంపుదురా యేమి ?
భర్త - వానిం జూచిన నీకు జాలిపుట్టినదా ? వాఁడు చేసిన క్రూర కృత్యమున కాశిక్ష చాలదనియే నా యభిప్రాయము. ద్వీపాంతరమునఁ గొన్ని దినములుంచి పిమ్మట జంపుదురు.
భార్య - వాఁ డాయపరాధము చేసెననియా మీ యభిప్రాయము ? వట్టిది. వట్టిది రాజు గ్రహింపలేకపోయెను.
భర్త - అబద్దమని నీ వెట్లు చెప్పఁగలవు?
భార్య - నిజము బయలు పడకుండునా? (మెల్లగా) ప్రధానికిని మంజువాణికిని సంబంధ మున్నదను కింవదంతి మీరు విని యుండరా ?
భర్త - అది నే నెఱుఁగ. అదియా? తరువాత ?
భార్య - అతని రాక గ్రహించి ఆ చిన్నవాఁడు నిన్న రాత్రి మంత్రిని ఖండించియుండును. అది మఱయొక రీతి వీనిమీఁదఁ ద్రోసివేసిరి. కాకున్న నింటి యొద్దనున్న మంత్రిచావనేల ? యంతఃపురములో నపరాధము జరుగఁగా నచ్చటివారిని లేపక యెక్కడనో యున్న మంత్రితోఁ జెప్పుమనుటయు నా మాట విని యతండడ్డము పోయెననుటయు నెంత యుచితముగా నున్నదియో విచారింపుఁడు.
భర్త - అవును. ఇది యసందర్భముగానే యున్నది. కాని యా చిన్నవాఁ డాయపరాధము దాను జేసిన ట్లొప్పుకొనెనఁట. అది కాదనుట యెట్లు ?
భార్య - ఆ చిన్నవాఁడు కడు గుణవంతుఁడు అందులకుఁ గారణ మేదియో యున్నది. నాకు మఱియొక యూహగూడఁ దోచుచున్నది. వీఁడు కడుఁ జక్కనివాఁడు. రాజుభార్య వీనింజూచి మోహించి యుండును. వీఁడు సమ్మతింప నప్పు డీదారిఁ ద్రొక్కియుండును.
భర్త - అబ్బా ! యెన్ని సారాంశముల నేరుచుంటివి? నీకు ధర్మాధికార మిచ్చినచోఁ దీరుపులు చక్కగా దిద్దుదువు గదా !
భార్య – సందేహమేలా ? యీ యపరాధముల విమర్శింప నా కధికార మిప్పింపుఁడు. నిజము త్రుటిలో పట్టుకొని చెప్పించెదను.
భర్త - ఱేపు రాజుతోఁ చెప్పెద నుండుము. నీకు వేతనమేమి కావలయును?
అని పరిహాసముగా మాటలాడికొనిరి. వానిలోఁ గొన్ని మాటలు రాజునకు వినంబడలేదు. చివరి మాటలు మాత్రము స్పష్టముగా వినంబడినవి. ఆయిల్లు గురుతుఁ జూచుకొని మఱియొక వీధికిం బోయెను. అందుఁ జారుమతి యున్న యింటిపంచను నిలువంబడినంత నామె యిట్లు విచారింపుచున్నది.
సీ. పరులబ్రోవఁగ నిజ • ప్రాణముల్విడుచువాఁ
డెటు చంపు మంత్రిని • హేతుకముగఁ ?
దరుణులందఱ గన్న • తల్లుల గతిఁజూచు
పట్టి భూపతిపత్నిఁ • బట్టుటెట్లు ?
కలనైన ననృతంబు • దొలకనీయిని ధర్మ
శీలుఁ డుగ్రక్రియ • ల్సేయుటెట్లు ?
దీనుల దై న్యముల్ • దిలకింప విలపించు
కరుణాలుఁ డెట్టు ల • క్రమముఁ జేయు ?
గీ. నయ్యయో ? తెలియలేక రా • జతని చిత్త
వృత్తి యపరాధి యనుచు భా • వించి యకట
కఠినశిక్షవిధించె హా ! • కన్నతండ్రి !
కర్మసూత్రంబు నిన్నిట్టు • గట్టెనయ్య.
ఆ దీనాలాపము లాలించి యా రాజు డోలాయిత హృదయుండై యింటికిఁ జని మఱునాఁడు ప్రాతఃకాలంబునఁ జారుమతి వసియించి యున్న యింటి యజ మానుని సకుటుంబముగా సభకు రప్పించి యా చిన్నవాని గుణములు మీ యెఱింగి నంత యదార్ధము వక్కాణింపుడని యడిగిన నయ్యజమానుం డిట్ల నియె.
మహారాజా ! ఆ చిన్న వాఁడును దల్లియు వచ్చి సంవత్సరము క్రిందట మా యింటిలోఁ బ్రవేశించినారు అప్పటినుండియు వారి మే మెఱుంగుదుము. వారి చర్యలుచూడ రాజకుటుంబములోనివారివలెఁ గనంబడుచున్నారు ఆ చిన్నవాని సుగుణంబులు లెక్కింప సహస్రముఖుండైన శేషునికిసైతము శక్యముకాదని నా యభిప్రాయము. అట్టి ధర్మశీలున కిట్టివాడుక యేమిటికి వచ్చెనో తెలియదు. మీ రిచ్చు జీతములో షోడశాంశమైన వాఁడు తనకుఁగా నుపయోగించుకోలేదు. సంతతము నర్దులకుఁ బంచిపెట్టువాఁడు. మీరిచ్చునది పదిదినములకైన జాలునదికాదు ముందరి నెలజీత మిప్పుడే నిరూపించి యుంచువాఁడు. తాను భోజనముఁ జేయుచున్నను అన్నమని యఱచిన వానిమాటవిని లేచి యోపినంతఁబెట్టి యాఁకలిదీర్చువాఁడు. వాని తల్లి యొకనాఁడు రాత్రి నాలుగుసారు లన్నమువండి యర్థులకుం బెట్టినది. అబ్బా ! ఆ దయాళుత్వము నేను జెప్పఁజాలను. చీమను ద్రొక్కిన బ్రహ్మహత్యఁ జేసినంత పశ్చాత్తాపమును జెందును. పరస్త్రీల నెన్నఁడును గన్నెత్తి చూడలేదని నేను బ్రమాణము చేయఁగలను. మీ యొద్ద దాచనేల? నా కూతుండ్రును కోడండ్రును బలుమాఱు వాని నంధుడనియు మూఢుఁడనియు బరిహాసమాడిరని రహస్యముగా నా భార్య నాకుఁ జెప్పినది అట్టి ధర్మాత్ముఁడు పుడమిలోలేఁడు. సేవకవృత్తిలో నుండబట్టి వానిపేరు ప్రసిద్దికి వచ్చినదికాదు. వానికి రాజ్యమేయున్న బలి శిబి విక్రమార్కాది ధర్మాత్ములు వీని పాదాంగుష్టమునకు బోలుదురే. ఆహా ఆ మహాత్ముఁ డిట్టి యపవాదము వహించుట కేదియో కారణముండకపోవదు. వానికిఁగల భూతదయ యింతని చెప్పఁజాలను. అందలి సత్యాసత్యంబులు విమర్శింప మీరే యర్హులు. ఇదియే మేమెఱింగిన వృత్తాంత మని యా బ్రాహ్మణుఁడు వక్కాణించెను.
ఆ మాటలే యతని భార్యయుఁ గొడుకులు గోడండ్రు కూతుండ్రునుఁ జెప్పిరి. అప్పుడు రాజు మిక్కిలి దుఃఖింపుచు రాత్రి భర్తతో వాదించిన కాంతా రత్నమును రప్పించి నమస్కరింపుచుఁ దల్లీ ! నీవు నిన్నరాత్రి నీ భర్తతో నన్న మాటలు నేను విన్నాఁడను. నేను దప్పు శిక్షఁ జేసితినని పలికితివి. నాకును నను మానముగానే యున్నది నీ కిప్పుడు ధర్మాధికార మిచ్చితిని. అందలి నిజానిజంబులఁ దెలిసికొని యపరాధుల దండించి నన్నీ యాపదనుండి దప్పింపుము. నిజము దేలిచితివేని యా చిన్న వానిని గ్రమ్మఱ నిచ్చటికి రప్పింతునని చెప్పిన విని యామె యిట్లనియె.
దేవా ! మీరు సకలధర్మ స్వరూపులు. మీకంటె నే నెక్కుడుగా ధర్మ వివేచనము సేయఁగలనా? యేకాంతముగా నింటిలో నాడికొనిన మాటలు సభకెక్కునా ? అయినను మీరు నన్నుఁ బెద్దఁజేసి యింతగా మన్నించుచున్నారు. కావున నా యోపి నంత విమర్శించి నిజముఁ దేల్చెదనని యొడంబడి యట్టి యధికార పత్రికంగైకొని యప్పుడే యంతఃపురమున కరిగి మంజువాణియున్న గదులన్నియు విమర్శింపగా సుముఖుఁడు వ్రాసిన యుత్తరములు కొన్ని దొరికినవి. తరువాత నా యువతి మంజువాణిని వితర్క పూర్వకముగా నా చిన్న వాఁడు గావించిన కృత్యముల నడిగి శంకించుచు నా మాటలలోఁ బరస్పర విరోధములు నిరూపించి యామె చెప్పినదంతయుఁ దప్పని యామెచేతనే యొప్పించినది. తరువాత మదనమంజరికను దాని చెల్లె లిని వితర్కించి సాక్ష్యము పుచ్చుకొన్నది. అందొకరిమాట కొకరిమాట సరిపడినదికాదు. నిజ మంతయుఁ దెలిసికొని రాజునొద్దకుఁబోయి యా యిల్లాలు దేవా ! నిక్కము దొరకినది. నేఁ జెప్పిన మాటయే సత్యము నన్ను మన్నింతురేని యదార్థముఁ జెప్పింతునని పలుకుటయు నా రాజు తొందరపడుచు దల్లీ ! వేగముగఁ జెప్పి నా మనస్సంశయము పోఁగొట్టుమని ప్రార్ధించెను. అప్పుడు మదనమంజరికను రప్పించి ఓసీ ? నీవు రాజు నెదుట నిక్కము వక్కాణింపుము. నాకుఁ దెలిసినది. నీవు చెప్పకున్న నేను జెప్పెదను పిమ్మట నిన్ను దండింపఁజేసెదను. ఇప్పుడే చెప్పెదవే నిన్ను విడిపించెదనని బెదరించిన లఘుహృదయ యగు నాదాది భయపడి జరిగిన యదార్థమంతయు రాజు నెదుట బూస గ్రుచ్చినట్లు వక్కాణించినది.
ఆ కథ యంతయు విని యా రాజు కరవాలఖండితమగు కదళీ పాదపంబు చందంబున నేలంబడి పెద్దతడ వొడలెఱుంగక యెట్టకే చేష్టగలిగి గుండెలు బాదుకొనుచు హా ! గుణనిధీ ! హా ! దయాళూ ! హా ! ధర్మశీలా ! నీవంటి సద్గుణరత్నము నా వంటి నీచమతి చెంత నేమిటికి గౌరవముఁ జెందెడిని ? అయ్యో ? నిన్నూరక శిక్షించిన నా పాతకమున కంతమున్నదియా ? ఆహా! నీ సౌశీల్యముఁ గొనియాడ శేషునకైన శక్యమా ? నిన్నుఁ గ్రూరాత్మా ! యని నిందించిన నా నాలుక వేయిముక్కలైనది కాదేమి? యురిశిక్ష విధింతు నన్నను మొగంబునఁ జిఱనవ్వు వెలయించితివి. నీ విరక్తి యెవ్వరికిఁ గలదు ? నీ విషయపరాఙ్ముఖత మహర్షులకు సైతము గలదా ? ఆ ద్రోహురా లంత కపటముఁ బన్నిన నీవుచేసి నట్లొప్పుకుంటివి కాని కాదనవైతివి. అయ్యారే! నీ భూతదయకు మేర యున్నదా? భవదీయవితరణాది గుణంబు లాబ్రాహ్మణుఁడు పొగడెనేమో యనుకొంటిని. నీ గుణంబులు దలంచుకొని నీ తల్లి విలపించు చున్నది. నీ యట్టి పరమధర్మ స్వరూపుని శిక్షించితిని. నేను మూఢుఁడ. మహా ద్రోహుఁడ, క్రూరుఁడ, పాపుఁడ. నాకీ నరకము చాలదు. నేనిప్పుడు బలవంతముగా మృతినొందెదను. నా దేహము కాక గృధ్రములు సైతము ముట్టవు. రక్షకపురుషుల వెంటఁ బెండ్లికి బోవునట్లు పోయితివిగదా. సీ! యా యధమురాలి నిప్పుడేమి చేయుటకుం దోచకున్నది. అప్పుడు నిజమంత చెప్పితివేని నీయెదుట నుప్పుపాఁతర వేయక పోదునా ? మహాత్మా ! నిన్నుప్పుపాతర వేయింతునని పలికిన పలుకులు దలంచుకొనిన నా గుండె పగిలిపోవుచున్నది తండ్రీ ! యేమిచేయుదును. తల్లీ నీవు నాకుఁ గావించిన యుపకారమునకు మ్రొక్కుచున్నవాఁడనని యనేక ప్రకారముల నతనిం దలంచుకొని యున్మత్తుని క్రియఁ బలవింపఁ జొచ్చెను.
అందున్న సామంతరాజులెల్ల నతని నోదార్చుచు విజయభాస్కరుని తక్షణము తీసికొనిరమ్మని మఱికొందఱు రాజభటులను బంపి యా వార్త రాజున కెఱింగించిరి. అప్పు డా రాజు రౌద్రావేశముతో మంజువాణిం జంపించి యుప్పు పాఁతరవేయించి చారుమతియొద్ద కరిగి నమస్కరింపుచుఁ దల్లీ ! నే నీ కుమారుని నిష్కారణము శిక్షించిన పాపాత్ముండ. నా యపరాదములసైచి నీవు నా యింటికి వచ్చి రక్షింపుము. నా రాజ్యమంతయు నీ పుత్త్రున కిచ్చివేసితిని, అతనిం దోడ్కొనరా దూతలం బుచ్చితిని. శీఘ్రముగా రాఁగలండు నీయిచ్చవచ్చినట్లు ధన మర్దులకుఁ బంచిపెట్టుము. నే నీపాదసేవకుండనై యుండెద నని యెంతయో బ్రతిమాలెను.
చారుమతి కుమారుండు వచ్చువఱకుఁ గోటలోని కరుగుటకు సమ్మతించినది కాదు. యశస్కరుఁడు భాస్కరునిరాక నరయుచున్నంత నతనిం దీసికొని పోయిన దూతలు వచ్చి నమస్కరింపుచు రాజునకిట్ల నిరి. దేవా ! మే మా చిన్న వానినిఁ బ్రవహణ మెక్కించి ద్వీపాంతరమునకుఁ దీసికొని పోవుచుండఁగా సముద్రములో నొక చోట లోహధ్వజము బయలు వెడలినది దానింజూచి నావికులు తొందరపడుచు నందున్న వారితో నిప్పుడు గాలివాన రాఁగలదు ఈకలము లోహధ్వజమునకుఁ దగిలి మునిఁగి పోవును. మీలో నొక్కఁడు బలిగా సముద్రములోఁ బడెనేని నీ యుత్పాతము తగ్గిపోవును లేకున్న నందఱము మృతినొందుదుము. బలవంతముగాఁ దోయఁగూడదు. ఇందుఁ బరోపకారపారీణు లెవ్వరైన నుండిరేని బయలు పడవలయును అని యందంద చాటింపఁ దొడంగిరి.
ఆ మాటలు విని నేను బడియెదనని పలికినవాఁ డొక్కఁడును లేఁడు ఎవ్వనికి వాఁడే మిగులవలయుననియు మఱియొకఁడు పడి యందఱిని రక్షింపవలయు నని నీతులు చెప్పుచుందురు. ఆ వార్త ముఖాముఖిగా మన భాస్కరుఁడు విని యుబ్బుచు లేచి మీరందఱు సంతోషముగా నుండుఁడు. నేనిందుఁబడి మిమ్మురక్షించెద నింతకన్న నాకుఁ గావలసినది లేదు. అస్థిరమువిడిచి స్థిరము సంపాదించెదను. నా శరీరము జన్మజన్మమునకు నిట్లే పరోపకారముగా విడువఁబడునుగాక యని పలుకుచుఁ జేతులు జోడించి మందహాస శోభితవదనారవిందుండై సముద్రములో దుమికి మునిఁగి పోయెను.
అంతలో నా గాలివాన తేలిపోయినది. కావలసిన కార్యము గంధర్వులే తీర్చినారు గదా యని మేము సంతోషింపుచుఁ దిరిగి యింటికి వచ్చినారము. ఇదియే మా వృత్తాంతమని నుడివిరి. ఆ మాటలు విని యశస్కరుడు గోరుచుట్టుపై రోఁకలి పోటన్నట్లు పరితపించుచు మీకు మీము పంపిన దూతలు గనంబడలేదా? యని యడిగిన నెవ్వరు గనంబడలేదని వారుత్తరముఁ జెప్పిరి. యశస్కరుఁడు భాస్కరునిఁగుఱించి యున్మత్తుని క్రియ శోకింపుచుండఁ బ్రధానులు వారెంపుచు వై రాగ్యోపదేశముఁ గావించిరి. ఆ రాజు మంత్రి వాక్యముల నెట్టకేఁ దెప్పరిల్లి యవ్వార్త భాస్కరుని తల్లికిం జెప్పవలదని యెల్లరకుం బోధింపుచు మితిలేని ద్రవ్య మామెయొద్దకు బంపెను గాని యా సాధ్వీరత్నము వాని నేమియుఁ గైకొనక కుమారుని రాక యభిలషించి కాలము గడుపుచుండెను.
రాజు విరక్తుఁడై భాస్కరుని గుణములం దలచుకొని పరితపించుచుండ నొక నాఁ డిరువురు దూత లెద్దియో పత్రికం దీసికొనివచ్చి యిచ్చిరి. యశస్కరుఁ డది విప్పి చదువుకొని నిట్లున్నది. మహారాజా ! నాకు లేక లేక యొక పుత్త్రిక గలిగినది. దానిం బండ్రెండేండ్ల ప్రాయంబునఁ జోరులెత్తుకొనిపోయి యమ్మవారికి బలియిచ్చుచుండ నొక రాజకుమారుఁడు రక్షించి మా వీటికిఁ దీసికొనివచ్చి యొక బ్రాహ్మణుని యింట దిగవిడిచి యవ్వలికిఁ బోయెను. ఆ బ్రాహ్మణ పుత్రుఁడు తానా బాలికను దొంగలవలన విడిపించితినని చెప్పుచుఁ తనకుఁ బెండ్లిచేయమని కోరెను. నే నతని మాటలలోఁ బరస్పర భేదముల నరసి చేసిన ప్రతిజ్ఞకు భంగమైనను నిజము దెలిసికొనుటకై కొన్నిదినములు గాలహరణముఁ జేసితిని. ఇంతలో నా దొంగ లతని సకుటుంబముగా నెక్కడికో తీసికొనిపోయిరి. తండ్రియొక్కఁడు మిగిలియుండి విచారించుచు నొక్కనాఁడు వచ్చి యదార్ధము నాతోఁ జెప్పెను. అప్పుడు నేను సంతసించుచు నా చిన్నవానిని గుఱుతులుచెప్పి తీసికొనిరండని తగినదూతలను నానా దేశములకుఁ బంపితిని.
వారి జాడ యేమియుం దెలియలేదు. మఱియు విమర్శింప నా చిన్నవాఁడు. మీ యాస్థానములోఁ గొల్వుచేయుచున్నాఁడని తెలిసినది. వానిఁగాని పెండ్లియాఁడనని నా కూఁతురు కలభాషిణి శపథముఁ జేసికొనియున్నది. వానిపేరు భాస్కరుఁ డని వింటిమి. అతండు సుగుణంబుల పుంజమని చరిత్రవలనం దెలియుచున్నది. అతండు నా యల్లుఁడు కావున నీ పత్రికం జూచిన తత్‌క్షణము తల్లితోఁ గూడ వాని భద్ర దంతావళ మెక్కించి యిక్కడికిఁ బంపవలయును. ఇదియే మాకు బదివేల యుపకారములు. ఇట్లు విధేయుఁడు. అని యున్న పత్రికం జదువుకొని యశస్కరుఁడు శోకోపహతస్కుండై అయ్యో ? అట్టి సుగుణోత్తంసునిఁ బరాసుం గావించితినిగదా ? యిప్పు డీ యుత్తరమున కేమని ప్రత్యుత్తర మిత్తును? ఈ వార్త విన్నచో నా కలభాషిణి పతివ్రతయైనచో నితరుం బెండ్లియాదు. దుఃఖాక్రాంతస్వాంతయై యత్య యంబు నొందెడిని పురుషహత్యయు స్త్రీహత్యము బ్రహ్మహత్యయు నన్ను బాధించెడివి. యిఁక నే బ్రతుకనేల ? చత్తుమన్నను నరకమున బాదపడవలసి వచ్చును. నన్నీ పాతక మెట్లుపాయున నియనేక ప్రకారములఁ దలంచుచువారి కేమియుఁ బ్రత్యుత్తర మీయక రాజ్యము మంత్రుల యధీనముఁజేసి జటావల్కలముల ధరించి యా రాజు తీర్థాటనము గావింపఁ జొచ్చెను. ఆ దూతలు భాస్కరునివార్త యందలి జనులవలస విని విచారింపుచుఁ బోయి తమ ఱేని కెఱింగించిరి. అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించుటయుఁ దదనంతరోదంతము తరువాతి మజలీయం దిట్లని చెప్పదొడంగెను.
నలువది యొకటవ మజిలీ
హేమప్రభ కథ
అచ్చట భాస్కరుఁడు పరోపకారమునకై సముద్రములోఁబడి కొంతసేపునకుఁ గన్నులుదెఱచి చూచినంత మణిమయ స్తంభసుందరమగు నొక దివ్య మందిరములో శాకములతట్టలోఁ బడినట్లు తెలిసికొని యట్టె లేచినలుమూలలు చూచుచు నయ్యారే ! యిదియేమి చోద్యము? నేను సముద్రములోఁబడి మునిఁగితినిగదా ? యీ మందిరమెక్కడిది ? యిది ఇంద్రజాలమా ? లేక స్వప్నమా? యిందలి విశేషము లరయ స్వర్గమువలెఁదోచుచున్నది. నేను మృతినొంది స్వర్గమున కరిగితినా ? యిది నా పూర్వదేహమువలెనున్న దిగదా! ఆ తెలిసినది నేనీదేహముతోనే పుణ్యలోకమున కరిగితిని గాఁబోలు అగునిందలి విశేషము లరసెదంగాక! యని తలంచుచుఁ గొంత దూరము తిరిగి అదిగో ! యెవ్వతెయో భయంకరాకారముతో నిటువచ్చుచున్నది దీనింజూడ భయము గలుగుచున్నదిగదా ? ముక్కును మొగమును వికృతముగా నున్నవి. నోరు గుహవలెఁ దెఱవఁబడి యున్నది. నాలుక జ్వాలవలె వ్రేలాడు చున్నది పురాణములో రాక్షసస్త్రీనిట్లువర్ణింతురు. స్వర్గములో రాక్షసి యుండ నేమిటికోకదా ? దీనియెదుటఁ బడితినేని నన్నుఁ గబళములాగున నోఁటిలోవైచికొనును. దాఁగియుండెదనని తలఁచి యొకమూల నడఁగియుండెను. అంతలో నారక్కసి నిప్పులుగ్రక్కుచువచ్చి యందొకపీఠంబునం గూర్చుండి అయోముఖీ ? యెక్కడ నున్నావు ? ఆహారము సిద్ధపఱచితివా ? యని యడిగినది. అప్పుడొక మూలనుండి యయోముఖివచ్చి దేవీ ! యంతయు సిద్ధపఱచితిని. కాని అని యర్థోక్తిగాఁ బలికి యూరకున్నంత నాజ్వాలాముఖి సగముమాటాడి యూరకుంటివేమి ? మనుష్య మాంసము వచ్చినదా ? లోహధ్వజమును విడుచుట మఱచితిరాయేమి? యని యడిగినది.
దేవీ ! లోహధ్వజము వాడుకవేళనే విడిచితిని. ఏమికారణముచేతనో కాని మనుష్యశరీరమువచ్చి శాకములతట్టలోఁ బడియుండలేదు కాదీవఱ కెప్పుడును వలఁబడ్డ ---వలెవచ్చి చచ్చిన శవము శాకకుసూలములో నుండునది. ఒక్కొక్కసారి నేల బడిన మనుష్యులు వచ్చిపడియుండువారు. దానిగుఱి తప్పినదేమో తెలియదని చెప్పిన ------------ నాకు మయుఁడిచ్చిన వరమేల తప్పును ? నీవే కపటము జేసితివని