కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/39వ మజిలీ

నాకూఁతునకుఁ గనంబడిరఁట. అందలి సాంకేతిక మేమియో తెలియఁజేయవలయునని వేఁడుకొనియెను. అప్పు డయ్యోగి యించుక ధ్యానించి రాజా ! నీ సంతానము హరి యధికుండా ? శివుఁ డధికుఁడా? శక్తి యధికురాలా ? యను సందేహము గలిగి యా మువ్వురిలో జగత్కారణమైన వేల్పేదియో ! యని తీర్ధయాత్ర సేవించిరి గదా ? అందు దమ కేదియు నమ్మకము గనంబడినది కాదు. పిమ్మట నిందించిరి. వారి చిత్తములు యదార్థ నేత్తృత్వమందు నిశ్చయాయత్తములై యున్నవి. వారియందు భగవద నుగ్రహము గలిగినది. కావున నమ్మహాత్ముండు యదార్థమును జూపించెను. పరమాత్మతత్త్వ మొక్కటియే నిత్యమైనది. అది సుగుణ మనియు నిర్గుణ మనియు రెండు విధములు. హరిహరాది రూపకల్పనలు సగుణో పాసకులు సేయుచుందురు. తర్కింప నవియు యదార్ధములు కావు. మనుష్య లెట్లు కాలానుసరణముగాఁ బోవుచుందురో వారును బోవుదురని సూచించుటకై వాతాగ్ని ప్రకాహాదులు గనపఱచెను. కాల ప్రవాహంబునంబడి యెల్లరు గొట్టుకొని పోవుచు సుఖ దుఃఖముల నందుచుందురు అని తెలియుటకై నీ పుత్రులు తద్రూపమయిన సుఖదు:ఖముల నందిరి. ప్రపంచకము స్వప్న ప్రాయమని దీనం దెలియక మానదు. నీవు కడుపుణ్యాత్ముండవు ; నీ పుత్రులు కడు పవిత్రులు కృతకృత్యులైరని యాసంకేతము లన్నియుఁ దెలియఁ జేసెను. మాధవర్మ పుత్రులతోఁ గూడ నా వృత్తాంతమును విని పరమానందమును జెంది వారికిఁ గూడఁ దత్త్వోపదేశముఁ జేయుమని కోరికొనియెను. అప్పు డయ్యోగి, వారికెల్ల నద్వైతతత్వ మహత్వము నుపదేశించి కృతకృత్యుల గావించెను.

గోపా ! నీవు చూచిన పాషాణ పేటిక సుభద్రం గరుణించి యిచ్చిన బ్రహ్మరాక్షసుని భోజన పాత్రము. అల్ల నాఁడు శివవిష్ణు రాక్షసులు విసరిపాఱవైచిన నిచ్చట వచ్చిపడినది. నీ వెట్లయిన నన్ను విడువవని యా కథ యంతటితో ముగింపక సాంతముగా వక్కాణించితిని. ఇదియే దీని వృత్తాంతము అన యమ్మణిసిద్ధుండు శిష్యునితోఁ గూడిఁ దదనంతరావసధమునకుం జనియెను.

ముప్పది తొమ్మిదవ మజిలీథ.

ముప్పది తొమ్మిదవ మజిలీయందు గోపాలుండు వింతలంజూడ నరణ్యంబునకుం జని తిరుగుచు నొకచో రెండు బాఱల దంతమొకటి గనబడుటయు విస్మయముతో దాని వెండిదండము వోలె భుజమున నిడికొని తన యయ్యవారి యొద్దకువచ్చి నమస్కరింపుచు నా రదనం బతని కురంగట నిడి స్వామీ! ఇది దారువుగాదు, పాషాణము గాదు, లోహము గాదు. దీని స్వరూపముఁ జూడఁ బంటిపోలిక గనంబడు చున్నది. ఇట్టి పండ్లు ధరించిన జంతువు కళేబరమెంత యుండవలయును ? అది యే జంతువయి యుండును. దీని వృతాంతము విన వేఁడుక నాకు గాదు. మీకును సంతోషమే యైయుండక పోవదు. మీ మాణిక్యముచే దీనియుదంత మరసి వక్కాణింపుఁడని ...... మము నమ్మదసిద్ధుండు తదుభ్రాయమునకుఁ దాసును ఎగుపడుచు భోజ . 2001 స నొంలో సూర్చుండి మణి ప్రభాపమునం డల్పూర్వోత్తరముఁ డెలిసి 1. 3 కు మునయించుచు సకల త యిట్లు చెప్పండొరంగేసు. కిర్తి కే తు ని కథ ... . . . ధరలు సుల సంపపలకు వరంటి యజయి ల ల చున్నది. అప్పర... మన యకుండై పిక ar. A. ఆ సిప్పురము తన తముగా బ్రజలం • . . . . . . . . . . ఎచ్చర్య పోవాలా HA :ము! | | లి ని మహళాలు సర్ద avi iv : " , v : 0506న ము... ము లు తప్పు తను గీకేముందసు ... . . . . . . . . . రచిం. ఆ కలికలుం తప్పం కేతుం యొక్క గుణంబున - 10 సం. 'లక ఒపరీతమతి ప్రదారం... లూక్వాచారం: ల నావేపించుచు సింహాసన సిక్కిన కొన్ని వాసరముల కొకనాడు మం తులరా ఎంచి యమాత్యులారా! మనమంత వైశాల్యము గలది. అందాదాయ .ఇంత : వ్యయమంత. ఇప్పుడు కొక్కసముల లెక్క పెంత యున్నది ? చేయవలసిన పనులు ! సవి సరముగాఁ వక్కా. 50:3(డని యడిగిన నా సచివు లొంచరు లాలోచించుకొని యల్లన నీట్ల నిలి. డేనా ! మనదశ పటమీదిగో చూడుడు. కడు నేన్నది. దీనితో సగ మ సహారములకు గాను, దేవాలయములకుఁ గాను, సత్రములకు గాను విభజింపఁబడి యున్నది. మిగిలిన భూమి య దాయను కను స్వల్పము. వ్యయమునకు మితము లేదు. అమ్మహారాజు గడియకే కోటలకౌలఁది పంచి పెట్టు 9 (యు. ఆ దాత కీయూని అడిగిన 7 పాత్రుఁడు. దాపున పున్నవస్తు, చేయకు వినుండు. శ్లో॥ సిరి.. తె సహ సంతు నియతంతు ప్రజల్పిత పసితే లషమప్నోతి తుమై కోటి సృపె. అపధ్యాసుఁడు చూచిన యు , ఉటూడిన బడి..లు, స్వనల యు, సంత పనఁ గోటియు నిచ్చుడు. ఇప్పుడు నిలువ యేమియునులేడు. కాలివాహ సు. పై కంచెత్తునపు డి'కి బ్రాహ్మణుడు యాగార్దకు చ్చియు చించినంత అండా క... న్న వనమంతయఁ ద్రవ్వించి యిచ్చి ఆకు. మన దేశమునం గౌక నడుం దాయనడ సల్పఁబడిన సత్రమున నున్నయి, కెల్ల ( - పప్పును , పంపు సంచవలలు, -. వివసము - పరిజనము మనం డిగారు కాసిన జనం ద్విధ or గలసన యు యదుల మరుమల సంచిరి. అతండు

వస్తువులు విస్మయ మభినయించుచు నోహోహో ! మా తండ్రి యెంత యుక్తముగా రాజ్యము గావించెను. మీ మాటలు వినఁ జాల సంతోషము గలిగినది. దీనికంతయు మీమంత్ర బలమే సహాయ భూతమై యొప్పినది కాఁబోలు. దేశమే చిన్నదట దానిలో సగమగ్రహారములఁట. మిగిలిన సగము సత్రముల కంట. ఉన్న వారు మన్ను దినవలయు నంట చక్రవర్తి యని పేరంట మేలు మేలు, బాగు బాగు, సాధు సాధు. విక్రమార్కుఁడు మంచి యుక్తముగా రాజ్యముఁ జేసెను. మమ్ముల మంచి నిర్వాహకముఁ జేసెను. నిత్యము దలంచు కొనవలసినదే. బొక్కసములనే మైన రొక్కము మిగులు నేమో యని చావఁబోవు నప్పుడదియుం గడతేర్చి పోయెంగదా ? ఇకఁ గొడవయేమి ? ఛీ ! ఛీ ! యింత యవివేక మెందైనం గలదా ? యాగకుల స్తోత్ర పాఠములకుబ్బి సంసారము భ్రష్టముఁ జేసికొందురా ? బ్రహ్మవని పొగడినంతనే బ్రహ్మయయ్యెనా యేమి ? ప్రభుత్వము ధనమూలమై యున్నది. గ్రీష్మకాలంబున నల్పసరస్సులవలె ధనహీనుని ప్రయత్నము లన్నియు నశించును. ధనము లేనివాఁడేమి చేయఁగలడు? ఆదాయ మెఱిగి వ్యయము జేయవలయును. నీతి వాక్య మాయన చదివియుండలేదు కాఁబోలు. మీకైన బుద్ధిలేదా ? ఇసిరో యీ ధనహీన రాజ్యము నే నెట్లుపాలింతును. మా యధికార మర్దుల పొట్టలు విచ్చబెట్టుటకా ? యని క్రమముగా నభివృద్ధినొందు కినుకం గనుఁగనఁ గెంపుగదుర బలికిన విని బెదరుచు మంత్రు లిట్ల నిరి.

దేవా ! మే మేమి చేయుదుము. మీ జనంకుడు తానిచ్చుచుండ వలదనిన వానింబట్టి శిక్షించుచుండును. లుబ్ధజనులఁ దన రాజ్యములో నుండవలదని యాజ్ఞాపించెను. దానం జేసి యాయన ముందర నే మాటయుఁ జెప్పుటకు శక్యము గాదు. అదియునుం గాక ఆ పుణ్యాత్ముఁడు మన దేశములో ధనమెన్నఁడు స్వీకరింపలేదు. కోరినంతనే యాకాశము కాంచన వర్షము గురియుచుండును. ఆ దాత యెంత పంచి పెట్టినను గొడవలేక కావలసినంత విత్తము ప్రోగుపడినది. అతనికిఁ దైవ బలము గలిగి యున్నదని స్తుతించుటయుఁ బండ్లు పటపట గొఱుకుచు గీర్తికేతుం డిట్లనియె.

బాలికులారా ! మీ స్తుతివచనములు విరమింపుఁడు. నేను మా తండ్రివలే యాచకుల ముఖస్తుతి వచనముల కానందించను. అదృశ్యమైన యా ముష్మీకమునకై యైహిక సుఖముఁ జెడఁగొట్టుకొనుట నా దలంపుకాదు. ఏ వృత్తియుఁ గల్పించుకొనక దాన ధర్మములని బ్రాహ్మణులు ప్రజల బాధింపుచుందురు అగ్రహారముల కనియు, సత్రముల కనియు, దేవాలయముల కనియుఁ బేరులు చెప్పి దనము వాడి వాడుచుందురు. పుడమి వాండ్రకన్న వంచకులు లేరు. మా తండ్రి వట్టి వెఱ్ఱివాఁడు. వాండ్ర మాటల నమ్మి రాజ్యమంతయు శూన్యము గావించెను. ఇప్పుడు దానిని నేను మార్పు చేయ వలయును గదా. ఇటుపైన సత్రములన్నియు గట్టి పెట్టెంచిసామాన్యము విక్రయించవలయును. దేవజాతని సత్కారములు సాగింపకున్న మా ---------- గొడవలేదు. అగ్రహారముల కన్నిటికిఁ బూర్తిగాఁ బన్నులు గట్టవలయును. ఇక మన రాజ్యములో యాచించినవారి నపరాధులవలెఁ దండింపవలయును. అట్లయినయాచకులు లేకపోవుదురు. మా తండ్రి కోటులకొలఁది ధనమిచ్చియు మా రాజ్యము యాచక జన శూన్యముగాఁ జేయలేకపోయెను గదా : మీరు నా యానతి ననుసరించి --పటి నుండియుఁ గ్రొత్త శాసనముల దేశములోఁ బ్రకటింప వలయును. నా యాజ్ఞ మన్నింపని వాని నధికారము నుండి తొలగింతునని పలికి య నృపుం డంతఃపురమున కరిగెను.

సాధుమతులగు మంత్రులు తమ కిష్టము లేకున్నను రాజశాసన మా మఱు నాఁడే పట్టణములోఁ జాటింపజేసిరి. ఆ వార్త దాసీసముఖమున విని కీర్తి కేతుని పట్టమహిషి చారుమతి మిక్కిలి పరితపించుచు నొకనాఁడు రాత్రి సోపాలంభముగా మగని కిట్లనియె. ప్రాణేశ్వరా ! మీ తండ్రి సాహస వితరణాది గుణంబుల శివకర్ణదధీచాదుల సిగ్గు పరచుచుఁ ద్రిలోక విఖ్యాతమగు కీర్తిసంపాదించి నాకలోక మలంకరించిరి అమ్మహాత్ముని పేరు దలంచినంతనే మూర్ఖునకైన మైపులకింపక మానదు. అయ్యయ్యో ! అవదాన్యుఁడు వై చిన సత్రములన్నియుఁ గట్టిపెట్టించి దేవాలయముల మూయించియగ్ర హారములకుఁ బన్నులు గట్టించిరట. యెంత పాపము ! ఎంత మోసము ! దేవతాతిథిపూజలు సాగని రాజ్యము రాజ్యమా : కటకటా ! మీ బుద్ధి యింత విపరీతమైనదేమీ రాజ్యము మీ రొక్కరే చేసితిరా ? ఇంతకుఁ బూర్వ మెందరైరి. ఇఁకముం దెందరు గానై యున్నారు ? అట్టి యుత్తమునికి జనించిన మీయం దిట్టి నికృష్ట గుణంబులు సంక్రమించుటకుఁ గారణ మరయ వలసియున్నది వినుండు.


ఆ.. చంచల, పమ యౌవనం
మనం ఆలపే ): 0.4లం - సపమం జీవితం
చర్మం • సరికి నిశ్చలమతి స్వర్గారం దాటనం
పశ్చాత్తాపముతో బరాపయిత శోకాగ్ని నా దహ్యతే॥

సిరులు పాదరసమువంటివి. యౌవనము ప్రవాహవేగమైనది. జీవితము ధనమువల నాశనము నొందుచున్నది అని తెలిసికొని నాకద్వార కవాటములఁ బాటించు ధర్మమెవ్వఁడు చేయఁడో వాఁడు జరాపీడితుఁడయి పిమ్మట దుఃఖించునని పురాణములు ఘోషించుచున్నవి. ఈ సంసారము దీర్ఘస్వప్నమువంటిది. దీనినమ్ము పిత్రువార్జిత మగు యశమును గళంకపఱచెద రేమిటికి ? నా ప్రార్దనము మన్నించి ధర్మకార్యముల యధాగతముగా జరుగునట్లు నియమింపుడని వేఁడుకొనిన నతండిట్లనియె.

ఇంతీ ! నీ వేదాంతము నాస్వాంతమున కెక్కదు. మనము... - a . . . . వ్యయము సుమ ... " మన మంచిన, మా తం: సాయినది . : ఓం -3 ధనము సంపాదింపలేదు. నలు మరియు బోధింపవలదని చెప్పిన విని యప్పఁడతి చింతించుచు, వెండియు నిట్లనియె. నాథా : మనకు ధనము లేదని విచారింపవలదు. పెరటిలోఁ గల్పవృక్షమున్న మాట మీ రెఱింగినచో నిట్లనరుగదా : కోరినంత నాపాదపము వలసిన ద్రవ్యమిచ్చెడిని. మీకుమారుని తరముదాక నామ్రాకుఁ మనయిల్లువీడదు. మనసువచ్చినట్లు వ్యయముఁ జేసికొనవచ్చును. దేవతాతిథిపూజల మానిపింపనేల ? యని యడిగిన నాలుబ్ధుఁడు "ఓహో : నీ యూహమిదియా ? తెలిసినది. నీకన్నుల కదియొకటి నెఱసులాగున మెఱయుచున్నది. కాఁబోలు. పాప మాతెఱగంటిఱేఁడు మూఁడుతరములదాఁకా నామ్రాఁకు మనయింటనుండునట్లు వరమిచ్చెనుగాని కానిచో నామహానుభాఁడు దానిసైత మేబిచ్చగానికో యియ్యకపోవునా ? ఆవృక్షశాఖలవఱిచి పంచుమనియా నీయభిప్రాయము ? బాగు బాగు : అదియర్థుల కడుపునిండుటకు బ్రార్థింపఁదగినది కాదు. రాజ్యాంగవిషయమై పెద్దగా దానిఁ బ్రార్థింపవలసియున్నది. పోపొమ్ము ! రాజకార్యవిషయము లాఁడువాండ్ర కేమిటి"కని మందలించిన విని యమ్మించుబోఁడి ముక్కు పై వ్రేలిడుకొని వెఱఁగందుచు నిట్లనియె.

ఆహాహా : నీవా మహానుభావుని కెట్లు పుట్టితివోకదా ? నిన్న నవలసిన పనిలేదు. నీయట్టి యల్పబుద్ది నట్టివానికిం బుట్టించిన విరించిన దిట్టవలయును. నీ బానిసత్వము గ్రహింపక బుద్దిగఱపవచ్చిన నన్ను నేను నిందించుకొనుచుంటినని యేమోపలికి యందు నిలువక యక్కలికి లోపలికిం బోయినది. కిర్తికేతుండును దదీయవాక్యంబు లాలించి భజగమసంబు చందంబున రోజుచుఁ గంఠగతంబగు నహంకారముతో నామెమాటలు కేమియుఁ బ్రత్యుత్తరమీయక తన నివాసమున కరిగెను.

విజయభాస్కరునికథ


గీ॥ ధర్మముల యెక్క చారుసాం • చర్యరాశి
     సుగుణముల ప్రోగు శౌర్యతే • జోనిధాన
     మురుకళాస్పూర్తి విజయభా • స్కరుఁ డనంగఁ
     దనఱువాఁడు దదీయనం • దనుఁడు ఘనుఁడు.

పదియాఱేఁడులప్రాయముగల యబ్బాలుఁడు పాఠశాలనుండి యింటికివచ్చి మనోహరుని దుర్వ్యాపారమునకై యెద్దియో ధ్యానించుచున్న చారుమతిగాంచి "అమ్మా : నేను బ్రతిదినము బడినుండివచ్చువఱకు ముచ్చటగాఁ జూచుచుఁ జేతులు సాచి యెత్తుకొని ముద్దు పెట్టుకొనుదానవు. నేఁడు నాదెసఁజూడక చింతించుచుంటివేల ? కారణమేమని జేతులు -------- నడిగినఁ బుత్త్రుం

గౌఁగిటంజేర్చుకొని యా సతీతిలకము "నాయనా ! నేనేమని చెప్పుదును. మీ తాత మిగుల విఖ్యాతుఁడు. అతని కడుపునం బుట్టి మీతండ్రి విపరీతక్రియాతంత్రుడయ్యెనని విచారింపుచుంటి.


శ్లో॥ ఉపదేశోహి మూర్ఖాణాం ప్రపోపాయ నశాంతయే
      పయఃపానం భుజంగానాం కేవలం విషవర్థనం.

"పాములకుఁ బాలుపోసిన విషమగునట్లు మూర్ఖులకు మంచిమాటలు చెప్పినను గోపమునకుఁ గారణమగుఁ గాని శాంతిగలుగదు" అని యావృత్తాంత మంతయు జెప్పిమని ధర్మశీలుండగు నబ్బాలుండు "తల్లీ ! నీవూరడిల్లుము నేనించుక పెద్దవాఁడను గానిమ్ము. మాతాతరీతి నధికవిఖ్యాతి సంపాదించి సంతోషము గలుగఁ జేసెద" నని యూరడఁ బలికిన యాడింభకుని మాటల కాబోఁటి పరమానందముఁ బొందినది. మఱియు గీర్తికేతుండు శూన్యములగు భాండాగారముల గల్పవృక్షమును బ్రార్థించి నిస్తులకనకమణివస్తుపూరితములుగాఁ జేసికొని యందుఁ గాసైన బీరు పోనీయక బొక్కసములకు ముద్రలువై పించి యధిక పైసున్యవృత్తితో రాజ్యంబు సేయుచు -

సీ. అతివైభవాఢ్య దే . వాగారములను గ
             బ్బిలముల కునికిప • ట్టులుగఁ జేసె
    సతతభూసురసంఘ • సంకీర్ణసత్త్రమం
             దిరముల నెల్ల • నద్దియలకిచ్చె
    నవనీసురులు స్వేచ్ఛ • ననుభవించెడు నగ్ర
             హారంబులకుఁ గట్టె • నధికకరము
    నపరాధులను బోలె నర్ధుల బంధించి
             చెఱసాలఁ బెట్టించి • పరిభవించె

గీ. సప్తతంతుక్రియచార • సరణిమాన్పె
   వేదశాస్త్రాదివిద్యావి • వేశముడిపె
   దానధర్మము లను మాట . దప్పుఁ జేసెఁ
   గీర్తికేతుఁ డపఖ్యాతి • కేతుఁ డగుచు.

ధీరమతి యగు చారుమతి ప్రజల దైన్యోక్తుల విననోపక పరితపించుచు రహస్యముగా బొక్కసములనుండి రొక్కము సంగ్రహించి పాఠశాల కరుగునప్పుడు కుమారున కిచ్చి నిఱు పేదలకుఁ బంచిపెట్ట నియమించుచుండును. వితరణశీలుం డగు నబ్బాలుండును బ్రతిదినము గోటమాటున నిలిచి దీనులకా ధన మిచ్చుచుండును. దానం జేసి యారాజకుమారుండు బడికిఁ బోవుసమయ మరసి వేనవేలు దరిద్రులా ప్రవేశమున మూఁగికొని యుందురు. విజయభాస్కరుఁడు తల్లి తో జెప్పియు జెప్పకయు దోసిళ్ళకొలఁదిధనముదెచ్చి యర్దులకు విరజిమ్ముచుండుటఁజూచి విక్రమార్కునిఖ్యతి యితఁడే నిలుపఁ గలఁడని చూపఱులు గొనియాడుచుందురు. బోరులకుఁ జౌర్యంబునంబోలె గితవునకు జూదమున భాతిఁ జారునకుఁ గామ తంత్రంబునఁ జందమున నబ్బాలక శిఖామణికి గ్రమక్రమముగా వితరణగుణంబున వ్యసన మధికముగా జొచ్చినది. బడికిఁ బోవుటయుఁ జదువుటయు మాని యతండు రెండుపూటలయందు ధనము దొంగిలించివచ్చి రహస్యముగా నర్దిసాత్కృతముజేయఁ దొడంగెను.

ఇట్లవిచ్చిన్నముగాఁ గొన్నిదినములు జరిగినంత నొక్కనాఁడు కీర్తి కేతుఁడు బొక్కసములఁ బరీక్షించి రొక్కము తక్కువయగుటఁ దెలిసి కావలి వారలం బట్టుకొని నిర్బంధించుటయు వాండ్రు వెఱచి దేవా ! మీకుమారుఁడు మాతృబోధచే వీనిముద్రలఁ బాటవంబున భేదించి విత్తము సంగ్రహించుకొని వీధివీధులం దిరుగుచు నర్దులకుఁ బంచిబెట్టుచున్నవాఁడు. ఆచిన్నవాని నీపట్టణమెల్ల నెఱుంగునని యా యుదంతమంతయుం జెప్పిరి. అప్పు డతండు మండిపడి యేమేమీ ! విజయభాస్కరుఁడే యీధనము హరించినవాఁడు. అన్నన్నా ! ఇంటిదొంగ నెవ్వడు బట్టుకొనగలడు ? తల్లి చెడుబోధయేకదా దీనికిమూలము కానిమ్ము ఈకృత్యమునకుఁ దగినఫలము గుడిపించెదనని తుంచుచు నాకులపాంసునిఁ బట్టియిండని పలికి వారి వెంట విజయభాస్కరుఁడు దానమిచ్చు సమయమున కాప్రదేశమున కరిగెను. అందు-

సీ. భూధవాత్మజ ! నే ని . రాధారుఁడను దివ్య
                నుత : నేను జాల దీ • నుఁడ మహాత్మ !
    బహ్వపత్యుఁడ నేఁ గృ• పావరీతస్వాంత !
               యధికవిద్వాంసుఁడ • ననఘ : నేను
    నాకిమ్ము నాకిమ్ము • నాకిమ్మటంచు గుం
              పులు గుంపులుగఁ దన్న • మూగికొనుచు
    నర్దులు ఱొదసేయ • నలుక యించుక లేక
              మొగమునఁ జిఱునవ్వు • ముద్దుఁగులుక

గీ. జిన్ని చేతులతోడ ముం • దున్న గంప
   లోని బంగారునాణెము , ల్మానికిములు
   చెలఁగి ధాన్యంబువోలె దో • సిళ్ళ కొలఁది
   దాన మొనరించునట్టి నం • దనునిఁ గనియె.

అట్లు వితరణావేశముతోఁ బంచిపెట్టుచున్న పట్టింగాంచి యానృపతి యపరిమితయహంకారముఁ జెందుచు నందనునితోఁగూడ నందున్న వారినెల్ల బట్టుండని కింకరుల కాజ్ఞ యొసంగుటయు నవ్విధంబెఱింగి కురంగంబు తెఱంగున నృపకుమారుం డెరిగి యా గుంపునుండి తప్పించుకొని పాఱిపోయెను. కీర్తికేతుండును కింకరులచే బట్టుఁబడిన యర్థులయొద్దనున్న ధనంబంతయు లాగికొని రాసిగాఁ బోయించి గుండెలు బాదుకొనుచు అయ్యయ్యో ! ఇంతసొమ్ము ప్రతిదినము ప్రజలపాలు సేయుచున్న వీఁడు నాకు శత్రుఁడుగాక పుత్రుండా ? ఇంతకుమున్ను తండ్రిచే చెఱుపంబడిన కాపురము నిలుపుకొంటినని సంతసించుచుంటినిగాని వానీచునచేష్టల గ్రహింపనైతిని. వీనిచే నీపనిదల్లియే చేయించుచున్నది. కట్టా ! వీని నాప్తులని మన్నించినచో ముప్పు రాకుండునా ? తగినశిక్ష విధింపవలయునని తలంచి రోషావేశముతోముతో నాయర్థులనెల్ల బద్దులంగావించి తద్విత్తము పట్టించుకొని యాస్థానమున కరిగి మంత్రులతో నేదియో చెప్పఁబోవు ------------ నాతురతతో గొందఱు కింకరులువచ్చి స్వామీ ! నమస్కారము, మేము కల్పవృక్షమునకు కావలి వారము. ఇంతకుమున్ను యువ రాజుగారు వచ్చి కల్పవృక్షమునకు నమస్కరింపుచు నీక్రిందిపద్యమును జదివిరి.

ఆముకు తము) : :: .. ముర (ఓర్ప నకు స
స్వల. ఏ సన దాని దించిన యగ్గు లిప్పుడు
క్రమముగా శిక్ష వంపు : లిర్పఁ వారిఁబ్రోచి కా
మము " "PI స్వేచ్చం మా " కృపణాత్ములగొల్వ నేటికిన్.

అని చదువువఱకు నత్తరువరము ఱివ్వున నాకసంబునకెగసి యంతర్దానమైపోయినది. ప్రతిక్రియారహితమగు నక్కార్యంబునకు వగచుచు మేము దేవరకు విన్నవింపఁ జనుదెంచితిమి. ఆ పాదపస్థానంబున జిఱువేరైనలేదు. అగాధమైన గర్తముమాత్ర మున్నదని చెప్పుచుండగనె యాఱేఁడు నఱకఁబడిన మోడువలె నేలంబడి మూర్చిల్లి కొంతతడవునకు లేచి పెద్దయెలుంగున హా ! వంశనాశన ! హా ! పితృ శాత్రవ ! హా : క్రూరాత్మా ! యెంతపని చేసితివిరా ? అయ్యో ! కల్పవృక్షము వలన నెన్నియో ప్రయోజనములు దీర్చుకొనవలయునని యుర్రూట లూరుచుంటిని. తొందరయేల యని యుపేక్ష జేసితినిగదా ! యేదియు లేకపోయినది. ఏమి చేయుదును. సాధన మేమని యనేక ప్రకారముల విలపించుచు మంత్రులచే బోధింపఁ బడియు దెలివిగానక పెద్దతడవు శోకసముద్రములో మునిఁగియుండెను.

పిమ్మట నాసరేకుండు రౌద్రావేశముతోఁ గటంబు లదర బౌమలు ముడివడఁ గన్ను లెఱ్ఱఁజేయుచు బటురవంబున భటులతో మీరిప్పుడేపోయి నా కప్రతికారంబు సహకారంబును గావించిన భార్యాపుత్రుల నిరువుర మహారణ్యమునకుఁ దీసికొనిపోయి వధించిరండు పొండు. తదీయరక్తంబు గన్నులం జూచువఱకు నేను భుజింపను. దీని కించుక వ్యతిరేకము జరిగించితిరేని మిమ్ము సకుటుంబముగాఁ నాశనము జేయింతునని భయంకరముగాఁ బలికి శోకగృహంబునకుం బోయి తలుపులువైచికొని పండుకొనియెను. ఆ సభలో మంత్రులుగాని హితులుగాని పురోహితులుగాని యాతని మాటకడ్డు చెప్పలేకపోయిరి. భయంకరులగు రాజకింకరులప్పుడే యంతఃపురమున కరిగి పుత్రునితో నేదియో ముచ్చటింపుచున్న చారుమతింజూచి నమస్కరింపుచు అమ్మా ! మేమేమి జేయుదుము ? దారుణమగువార్త మీకిప్పుడు చెప్పవలసివచ్చినది. మీరు కుమారునిచేత రాజుగారికి వ్యతిరేకమగు పనులు చేయించిరఁట. అందులకుగాను మిమ్మడవినికిం తీసికొనిపోయి అని చెప్పి కన్నీరు విడచుచు మాటాడలేక యూరకుండిరి. ఆమాటలు విని యాబోటి నేలంబడి మూర్ఛఁబోయినది. కుమారుండు సేదఁదేర్చి అమ్మా ! వీరిమాటలువిని నీవిట్లు మోహమందెదవేల ? నేను నేఁటి యుదయమునఁ బాఠశాలలోఁ జదివిన శ్లోకమును వినిన నీకు వైరాగ్యము గలుగక మానదు. వినుము.

శ్లో॥ రోగశోకపరితాపబంధనవ్యసనానిచ
      ఆత్మాపరాథవృక్షాణాం ఫలాన్యేతాని దేహినాం॥

శోకము, మోహము బంధనములలో నగు వ్యసనములు తాను గావించిన యపరాధములను వృక్షముల ఫలములని తెలిసికొనుము వాని ననుభవింపకతీరదు.

తానుజేసిన కర్మయే తన్ను శిక్షించును. తన కర్మయే తన్ను రక్షించును. ఒరులెన్నడును గర్తలుగారు. లోకప్రవృత్తి యెఱింగియు నిట్లు చింతించుట యవివేకము కాదా ? మఱియు వినుము.

శ్లో॥ నిపపతు శిఖరా దద్రేర్మజ్జతు జిలధౌ హుతాశనం
      విశతుక్రీడతు భుజంగమై ర్వా నాకాలెకస్యచి న్నారళః॥

క. గిరి యెక్కి పడిన ధర సా
   గరమున మునిఁగినను బావ • కముఁ జొచ్చిన ధీ
   కరఫణులతోడ నాడిన
   మరణకాలమున రాదు . మహి నెవ్వనికిన్.

అని యుపదేశించిన కుమారుని వివేకవచనమునకు మిక్కిలి వెఱఁగు పడుచుఁ జారుమతి ధీరమతియై మాఱుమాట పలుకక శోకముపసంహరించుకొని పెండ్లికిఁ బోవునట్లు సంతోషింపుచుఁ గుమారునితోఁ గూడఁ గింకరనిర్దిష్టమగు స్యందన మెక్కినది. రాజభటు లర్దరాత్రంబున నొరులెఱుఁగకుండ వారిం గాంతారమునకుం దీసికొనిపోయి దుఃఖముతో రాజశాసనముఁ బూర్తిగా జదివి వినిపించిరి. అప్పుడు చారుమతి ధైర్యమాపఁజాలక మోహ మందుచు "అయ్యో ! నాముద్దులపట్టి మరణము నేను జూడజాలను. నన్ను ముందు వధింపుఁడు" అని కుమారు నక్కునం జేర్చుకొని కన్నీటిచేఁ శిరంబు దడుపుచు శిరము మూర్కొని ముద్దాడి తండ్రీ ! యిది కడపటి ముద్దుంగదా ? యిఁక నిన్నుఁజూచు భాగ్యములేదు.

అక్కటా ! నీ సుగుణంబులు మీతండ్రి కెంత విపరీతములుగాఁ దోచినవి? మనము పూర్వజన్మమునం దెట్టిపాతకము గావించితిమోకదా ! ఆహా ! మీతాతయే యుండిన నీ సుగుణంబుల కెంత మెచ్చుకొనునో ? యెంత గారాబముగాఁ జూచునో? యని యనేక ప్రకారముల విలపించుచుండ వారించుచుఁ గుమారుండు మందహాస శోభితవదనారవిందుఁడై అమ్మా : వినశ్వరంబగు నీ కళేబరంబున నాస్త విడువుము. "కానున్నది కాకమాన"దను నిశ్చయమే మనంబునఁ గలిగియున్న విచారమేల యుండెడిది. పోనిమ్మని పలికి కృతము నేఱవేర్చుకొనుఁడని కింకరుల కానతిచ్చెను . అప్పుడు చారుమతి ముందుఁ దన్నుఁజంపుఁడని మెడ యొగ్గినది. వీరభటులు విచ్చుకత్తుల నొఱలనుండి పైకిదీసి ఝళిపించుచు నేయరుకించు సమయమున సంవర్త సమయవలాహకంబుభంగి నా ప్రాంతమున బెబ్బులి యొకటి గాండ్రుమని యఱచినది. ఆ ధ్వని విని బెదరచు దూతలు నలుదెసలు చూచుచుండ నా శార్దూలం బాభీల గమనంబున నరుదెంచి భయంకరములగు సఖదంష్ట్రాగ్రంబుల నంత్రంబుల విదళించుచు రాజప్రణిధుల శమనలోకాతిధులం గావించినది.

ఇంతకన్న నద్భుత మేదియైనఁ గలదా ? రాజకుమారుఁడు వారిని రక్షించుటకొఱకు బడియతో నా పులిం జావమోదెను. కాని యది యా దెబ్బల లక్ష్యముసేయక యబ్బాలుని జోలికింబోవక వారిం గడతేర్చి పాఱిపోయినది. అప్పుడా రాజపుత్రుఁడు తల్లితో అమ్మా ! ఈచిత్రముఁ జూచితివా ? మనలఁ జంప గమకింపం గృతాంతుడు వీరినే పరిమార్చెను. ఇంతకుముందు నేను జెప్పిన విషయమం దిప్పుడైన నీకు విశ్వాసము గలిగినదా ! మన కాయుశ్శేష ముండఁగ వీరేమి సేయగలరు ? అని పలుకుటయు నా సతీతిలకము విస్మయ మభినయించుచుఁ బుత్రుని పరమార్థ జ్ఞానమునకు మిక్కిలి సంతసింపఁ జొచ్చినది. అంతలోఁ దెల్ల వారినది. అప్పుడా రాజకుమరుఁ డక్కింకరు కరవాల మొకటి కేల నమర్చుకొని క్షుద్రమృగబాధ నొరయకుండ నరయుచు నల్లన దల్లితోఁగూడ నయ్యడవిలో నొకమార్గమునంబడి నడువసాగెను. మిట్టమధ్యాహ్న మువఱకు నరిగినను గ్రామమేదియుఁ గనంబడినది కాదు. క్ష్పుతిపాసలచేఁ బీడింపంబడి యడుగులు తడబడి నడుచుచున్న?? తల్లికస్తి చూచి తల్లడిల్లుచు నా బాలుండొక నిర్ఝరపరిసరంబున నిలిచి మధురంబులగు ఫలంబుల గోసికొనివచ్చి తల్లి కిచ్చి తానును భుజియించి యందలిలి జలంబులం గ్రోలి యాఁకలి యడంచుకొనియెను. అప్పుడు చారుమతి కుమారునితో పట్టీ : నడచుట నాకు జాల కష్టముగా నున్నయది. పాదములు పొక్కెక్కినవి. నేనీ రాత్రివఱకు నిక్కడనే యుండెదను.

ఏదియో మృగము భక్షించును. దాన వెలతలన్నియుఁ బాయఁగలవు. నీవు వేగముగా నడిచి యీ యడవి దాటిఁపోయి యెందైన బ్రతుకుము. గుణము గలవానికి జీవనము దొరకక మానదు. కలయందైనను నొకరికి బాధఁగలుగఁ జేయకుము. భూతదయగలవాఁడే పరమోత్తముఁడు. మీతాత చరిత్రముఁ జదివికొని యోపినంత పరోపకారము గావింపుచుండుమని పలికిన విని విజయభాస్కరుం డిట్లనియె. అమ్మా : నీవిట్లు దై న్యోక్తుల నాడకుము. నా హృదయము భేదిల్లుచున్నది. నాచెంతనుండ నీకేమి కొఱంతయున్నది ! నేఁడు కాకున్న ఱేపు పోవుదము తొందర యేమున్నది. లేకున్నఁ గొన్నిదినము లీ యడవిలోనే వసింతము. మనకొక ----------- గలదా ? యని చల్లనిమాటలాడుచుఁ దల్లిపాదములొత్తఁదొడంగెను. తల్లి----------- నాకుపచారములఁ జేయుట : అయ్యో ? ఎండ కన్నెఱుగక యంతఃపురములలో నతిసుకుమారముగాఁ బెంపఁబడిన నీవీ యడవి ఱాతినేలం నడచు చుండినను మనసు ఱాయిచేసికొని చూచుచుంటినే : అక్కటా ! నీ యుపచారములు నాకెట్లు సుఖకరములుగా నుండును ? అని కన్నీరు గార్చుచుచున్న తల్లి నోదార్చుచు రాజనందనుం డెండ చల్ల బడిన తరువాతఁ దల్లిచేయి పట్టికొని మెల్లన నడపించుచు గొంతపయనము సాగించెను. ఇంతలో ఖరకిరణుం డసరిగిరి శిఖర మలంకరించెను. క్రమంబునఁ జీకటులు కాటుకపూసినట్లు దెసల నావరింపఁ జొచ్చినవి. అప్పుడు రాజుకుమారుఁ డొక పొదరిల్లు బాగుఁజేసి యందుఁ దల్లి తోగూడ వసించెను. చాల ప్రొద్దుపోవువఱకుఁ జారుమతి కుమారునకు విక్రమార్కుని కథలం జెప్పుచు నాటిఁ పగలెల్ల మిక్కిలి యలసటఁజెందినది కావున నిలువలేక నిద్రఁబోయినది. రాజ సుతుండు నిద్రఁబోవక వాలు కేలం గీలించుకొని నలుదెసలం బరికింపుచు మృగబాధఁ బొరయకుండఁ గాపాడుచుండెను.

పాతాళగృహముకథ

అట్టిసమయమునఁ గొందఱు మనుష్యులాదారిని వచ్చుచున్నట్లు ఱొద యైనది. విజయభాస్కరుఁడు కదలక యణఁగి వారిజాడ నరయుచుండెను. అంతలోఁ బదుగురు మనుష్యులు పదిరెండేఁడుల ప్రాయముగల యొక బాలిక నెత్తుకొని ధనము మూటలు శిరమున ధరియించి వారున్న పొదదాపుననే నిలిచి యిదియే యిదియే యని పలుకుచు నందు మూఁటలు దింపిరి. ఒకఁడు తలుపు తెరవ వచ్చునా ? యని యడిగిన మఱియొకఁడు తీయకేమి ? పెఱవారిం దెవ్వరున్నా ? రని యుత్తరముఁ జెప్పెను. అప్పుడొక చెట్టుమొదట నమరించియున్న తలుపులాఁగి తెఱచెను. పిమ్మట నా మూటలన్నియు నెత్తుకొని యా చిన్న దానితో వారెల్ల నాద్వారముగుండ లోపలకుఁ బోయిరి. ఆ వింత కన్నులారఁజూచి విజయభాస్కరుఁడు వీండ్రు దొంగలవలెఁ గనంబడుచున్నారు. ఎవ్వనియిల్లో దోఁచి ధనముఁ దీసికొనివచ్చిరి.

ఇది వీరి రహస్యగృహము గావచ్చును. పాపమా గృహస్తుఁడెంత చింతించుచుండునోకదా ? అదియునుంగాక వాఁడు తలుపు నెమకుచు నగ్గి -------- గొట్టినప్పుడా వెలుతురున నొక బాలికమొగము గనంబడినది. ఒకని భుజముపైఁ బండుకొని నిద్రపోవుచున్నది. ఆ చిన్నది యెవ్వతెయో ? కానిమ్ము. వీరి గుట్టు దెలిసికొని పైకార్య మాలోచించెదనని తలంచుచు మెల్లనలేచి యాపాదపము దాపునకుఁ బోయి యా ద్వారమునుండి లోనికిఁ దొంగిచూచెను. అందు సోపానములు గనంబడినవి. లోనికిఁబోవఁ ప్రయత్నముఁ జేయుచుండ నింతలో లోపలినుండి పైకి వచ్చుచున్నట్లు మాటలు వినంబడినవి. అప్పుడు రాజపుత్రుఁడు యధా ప్రకారము ఉపసంలో ఉదయం జై స్పు.. బాలుడు క్రము అదు. అలపు ముప్పు , మనశ క్తివంటి దేవత యెచ్చటను లేదుసుమీ ? ఆమెకు దండము పెట్టి పోయితిమేనిఁ గన్నముపాఱకమానదు. అన్నన్నా : ఎన్నిదినములనుండి ప్రయత్నము సేయుచున్నామురా ? యిప్పటికి సాగినదిగదా ? రాజాగారికోటలోదూరి దొంగిలించుట సామాన్యమా ? యా బాలిక నీకెట్లు దొరికినదిరా ? యనుటయు వాఁడు లోహజంఘా ! ఇది మనశక్తిగాదు. శక్తిమహిమరా ! రాజుగారి మంచముదాఁవున బంగారుడోలికలో నీ బాలిక నిద్రపోవుచున్నది. మొన్న దండము పెట్టుకున్న మాట జ్ఞాపకమువచ్చి దీనిం బలి యియ్యవచ్చునుగదా అని తలంచి మెల్లన భుజముపై వైచికొని తప్పించుకొని వచ్చితిని. తామ్రకేళునిమాట వింటివా ? యీపిల్లను దనకొడుకునకుఁ బెండ్లిజేసి కొనునఁట ? యిమ్మని యడుగుచున్నాడు. అమ్మవారికి గోపమురాదా !" యనుటయు నతం డిట్లనియె.

చాలుఁ జాలు యెంతమాట! కన్నులు పోవవా ? అమ్మవారి మహిమ వాని కేమి తెలియును ! అయ్యో : యున్న కొలది ఊహలు పుట్టుచుండును గదా ? ఇప్పుడే బలియిచ్చి వచ్చిన బాగుండునే. మన మక్క,డికిఁ బోయి ధనముఁ దీసికొని వచ్చువరకు మఱల నర్థరాత్రము కాగలదు. అనుటయు వాఁడు భయములేదు. మన దీర్ఘ కర్ణుఁడు విని యప్పుడే మందలించెను. ఈ రాత్రి వచ్చిన తక్షణమేతదీయు రక్తముచే నమ్మవారినిఁ దృప్తి పరచెదము గాక ! మనకే వెఱపును గలుగకుండ జేయు భార మామెదేకదా ? యని మాటలాడుకొనుచు వాండ్రందఱు నాతలుపు వైచి యుత్తరాభిముఖులై యరిగిరి. రాజకుమారుండు వారి మాటలన్నియు విని తదుదంతముకొంత కొంత బోధఁజేసికొని యయ్యో : వీండ్రు దొంగలైనట్లు తెల్లమైనది గదా ? ఏరాజు కోటలోనో ప్రవేశించి ధనము దోచికొని వచ్చిరి. అది యట్లుండె. రాజపుత్రికి నెత్తుకొని వచ్చి యమ్మవారికి బలియియ్య నిశ్చయించిరి. ఆ మాట వినినది మొదలు నా హృదయము కొట్టుకొనుచున్నది. ఆ దారింబోయి యా బాలికం గాపాడెదనని తలంచి తల్లిని లేపక యానిశావ సానంబున ఖడ్గపాణియై యా తలుపు తెఱచికొని యందుగల సోపానముల మార్గమున లోపలకుదిగెను. ఆ లోపల విశాలమగు భవనములు పెక్కు కలిగియున్నవి. అందందు బంగారము వెండి రత్నములు రాసులుగాఁ బోయఁబడి యున్నవి. రత్నప్రభలే యక్కడ వలసినంత వెలుతురు గలుగఁ జేయుచున్నవి. మొదటి భవనములు నిర్జనములై యున్నవి. లోపలి భవనములలోఁ జోకుల భార్యా పుత్రాదులున్నట్లెద్దియో ధ్వని వినంబడినది. అందు రాజపుత్రుఁడు నలుమూలలు దిరుగుచు నమ్మవారి యాలయము పసిఁడికుండలం బట్టి గుఱుతుపట్టి దానిలోని కరిగెను.

అందొక శక్తి విగ్రహము కరాళవదనము దీర్ఘబాహువులు -నము చూచువారికి వెఱపుఁగలుగఁ జేయుచున్నది. ఇక అసలు రత్న అన్ని పనులు చేసిన

0గాడు.

a - కుం... నలు. యూ బాలిక నేల లువలు సుపై ఆ చుంగ చట్టం.. యున్నది. ఆ చిన్నదాని చక్కఁదనముఁ జూచి యతండు మిక్కిలి యక్కజము జెందుచు నౌరా ! యీ యమ్మవారు చోరులు దయమాలి చక్కని బాలికందెచ్చి తనను బలి యిచ్చుట కుద్యోగింప వలదని వారింపక నోరు దెఱచుకొని పెద్దపులివలె మిట్టి గ్రుడ్లతోఁ జూచుచున్న దే : కృపావిహీనయగు నీమె గౌరవ మెవ్వరికిఁ గావలయును. ఈ శక్తిం బరిమార్చినచో వీండ్రి క్రూరకృత్యములు చేయకుందురుగదా ? మూఁడు లోకములుఁ బాలించు మహాశక్తి కీ తుచ్ఛగుణ మేమిటికిఁ బుట్టవలయును ? ఆకులలములు దిని పొట్ట నిండించుకొనరాదా ? యని కోపము జెందుచుఁ గరవాలము --- పించుచు నయ్యమ్మవారి కంఠ ముత్తరింప సత్వరముగాఁ బై కుఱికెను.

వత్సా ! వలదు వలదు. దేవతాద్రోహముఁజేయకుము. నీసాహసముమెప్పు గలుగ జేసినది. ఇంతటినుండి బఱు లంగీకరింపను. రక్షింపుమురక్షింపుము. కందమూల ఫలాదులే భక్షించుచుండెదను. అను మాట యొకటి వినఁబడినది రాజపుత్రుం డామాట విని కరవాలము నేలఁ బాఱవైచి చేతులు జోడింపుచు "దేవీ ! నీవు త్రిలోక పూజ్యురాలవు. నే నపరాధము గావించితిని. నిన్ను రక్షించుటకు నే నెంతవాఁడను ? ఇంతటి నుండి బలు లంగీకరింపనని నాకు వరమిమ్ము. దయమాలి మృగము భాతి మాంసము భక్షించుటకు నీ బోఁటికిఁ దగునా ? యని పలికి యట్టి వరమిచ్చితి ననుమాట విని సంతోషించుచు వెండియు ఖడ్గము ధరించి తనగ్రంబున గొలుసు ద్రెంచి యా బాలిక సంకెళ్ళు విప్పి చేయి పట్టుకొని మెల్లఁగా బాలా ! బైటికిఁ బోవుదము రమ్ము జాగు జేసితివేని జోరులు వచ్చి పట్టుకొనెద రని పలికిన విని యక్కలికి యంతకుమున్న మేల్కొని తన కథయంతయు స్వస్నోపగమం బని తలంచి నలుమూలలు చూచు చున్నది. కావున నా రాజపుత్త్రుని మాటలు విని తటాలున లేచి యతని వెంట నడువఁ జొచ్చినది ఆపద నొందిన వారెవ్వరించుక యూత యిచ్చినను వారి ననుసరించుట సహజము కదా : ఆ రాజనందనుఁ డయ్యిందువదన చే యొక చేతిలోఁ బట్టుకొని రెండవచేత వాలుదాల్చి యా భవనము గడచి మెట్లెక్కి వెనుకటి పుడమి కరుదెంచెను.

అప్పటికిఁ దెల్ల వారినది. ఈ లోపలఁ జారుమతి లేచి ప్రక్కలో గుమారుని గానక పరితపించుచు నలుదెసలం బరికింపుచు మృగములు భక్షించెనేమో : యట యడలుచు విజయ భాస్కరా ! యని పెద్ద యెలుగునఁ బిలువఁదొడంగినది. అంతనీ వెఱవకుము. ఇదిగో వచ్చచున్నవాడనని ప్రతివచన మిచ్చి యతం డచ్చిగురుబోడితోఁ గూడ మాతృపాదమూలమున కరిగి నమస్కరించెను. అప్పు డామె పుత్రుం గౌఁగిలించుకొని "తండ్రీ యెందు బోయితివి. యీ బాలిక యెవ్వతె ? అయ్యో ! నిన్నుఁగానక యమంగళము శంకించుకొంటిని గదా ? అబ్బా ! నా హృదయ మెట్లు కొట్టుకొనుచున్నదో చూడుము బాబూ ! యీ శోకము శత్రువులకైనరావలదుకాక ?" యని పలికిన కుమారుం డిట్లనియె. అమ్మా ! నీవు మొదటి మాట మఱచిపోయి యూరక పరితపించుచుండెదవు ? నీవు నిద్రబోయన తరువాత ఖడ్గపాణినై నేను నిదు రింపక మృగములు రాకుండఁ గాచికొని కూర్చుంటిని. అంతలోఁ గొందఱు దొంగలు సొమ్ము దోచుకొని యీ రహస్య మందిరమునఁ బ్రవేశించి యం దాధన మంతయు దాచికొని మిగిలిన ధనము దెచ్చుటకై వాండ్రు పోయిరి. అప్పుడు నేనీ చిన్న దాని మాట వారి మాటల వలనఁ దెలిసికొని నిన్ను లేపకయే లోపలకుం బోయితిని. ఆ లోపలి యిండ్లవై--- మేమి చెప్పుదును. పాతాళలోకము వలెనున్నది అందొక యమ్మవారి గుడి యెదుట మంటపములో నీచిన్నది యాపస్తంభమునకుఁ గట్టి పెట్టబడిన యజ్ఞ పశువుం బోలె యొక స్తంభమునకు గట్టఁబడి యున్నది. తరువాత దీనిఁదీసికొనివచ్చితినని యా వృత్తాంతమంతయు జెప్పెను.

చారుమతి కుమారుని సాహసవితరణయాశౌర్యౌదార్యాది గుణంబులకు మనంబున సంతసించుచు నా కోమలితో "బాలా ! నీ పేరేమి? తల్లిదండ్రులెవ్వరు? జన్మభూమి యేది ? యీ దొంగలచే నెట్లు పట్టుబడితివి ? నీ రూప లక్షణంబులుచూడ రాజపుత్రిక వలెఁ గనంబడుచున్నావు. నీ వృత్తాంతముఁ జెప్పుము. నీ తలిదండ్రుల యొద్దకుఁ దీసికొనిపోయి నిన్నప్పగింతుము. వెఱవకు మని పలికిన విని యక్కలికి యిట్ల నియె.

అమ్మా ! నా పేరు కలభాషిణియండ్రు. నేను మహారాష్ట్ర దేశాధిపతి యగు చంద్రగుప్త మహారాజు కూఁతురను. మా తల్లి పేరు సౌగంధిక. మా రాజధాని చంద్రప్రస్థము. నేను రాత్రి యంతఃపురములో రత్నడోలికలోఁ బరుండి నిద్ర బోయితిని. ఇచ్చటి కెట్టువచ్చితినో నాకుఁ దెలియదు. మీ మాటలచే దొంగలు దీసికొని వచ్చిరని తోచుచున్నది. మీ రెవ్వరు ? నన్నుఁ గాపాడిన యీ పుణ్యాత్ముఁడు నీకేమి కావలయునని యడిగిన వెఱఁగుపడుచుఁ జారుమతి 'మే మొక మార్గస్థులము. వీఁడు నా కుమారుఁ' డని యుత్తరము జెప్పినది. అప్పు డా చిన్నది ప్రాయమునఁ జిన్నది యైనను బుద్దిచే నధికురాలగుట వారియెడఁ గృతజ్ఞతఁ జూపుచు మధుర వాక్యములచే వారినిఁ బ్రీతి గలుగఁజేసినది. అందులకే దానికి గలభాషిణియని యభిఖ్య వచ్చినది. వారిరువుర వెంటఁబెట్టుకొని రాజపుత్రుఁడు దొంగలు బోయిన దారి విడచి దక్షిణాభి ముఖముగా నడుచుచు గమనాయాసము వాయ నడుమ వృక్షచ్చాయల విశ్రమించుచు నాకలియైన మధుర ఫలంబులఁ గోసి తెచ్చి భుజించుచు రాత్రులయందు దుర్గప్రవేశముల వసించి ఖడ్గపాణియై మృగబాధ రాకుండఁ గాపాడుచు ని రీతి గొన్ని పయనంబులు సాగించి కొన్ని దినంబుల కాయరణ్యము దాటెను. వారు మొదట గనంబడిన పల్లె లోని వారలఁ జంద్రప్రస్థమునకు మార్గ మడిగి తెలిసికొని కతిపయ ప్రయాణముల నాపట్టణము చేరిరి.

నాఁడు పెద్ద చూరము నడిచివచ్చుటచే వారు మిగుల నాయాసముఁజెంచుచు నప్పటికిఁ గొంచెము చీఁకటిపడుటచేఁ బైన నడువలేక యా ప్రాంతమునందున్న యొక్క బ్రాహ్మణ గృహంబునకుంజని యడిగి వారియరుగుపైఁ బరుండిరి. వెంటనే చారుమతియుఁ గలభాషిణియు నిదురించిరి. విజయ భాస్కరుఁడు ఖడ్గపాణియై నిద్రఁ బోవక యందొక దెసఁ గూర్చుండియుండెను. అప్పు డాయింటి బ్రాహ్మణుఁడును బ్రాహ్మణియు నిట్లు వాదించుకొనిరి.

నిగమశర్మకథ

బ్రాహ్మణి - నాధా ! మనకు డెబ్బదియేండ్లు నిండవచ్చినవి. ఇంటి నిండ సంతానము గని పాఱవై చితిమి. ఒక్కరికిని బెండ్లికాలేదు. ఇల్లుచూడఁ గడు నిప్పచ్చరముగా నున్నది దినదినము గండమగుచున్నది. మీరు వీధిలోనికింబోయి యేమియు సంపాదనఁ జేసికొని రాలేరు గదా ? ఆడుదాని వలె నా కెదురుగా నింటిలోఁగూర్చుండి కబురులు చెప్పుదురు. ఈ కాపుర మెట్లు జరుగును ?

బ్రాహ్మణుఁడు - నీవు కొడుకుల నేమియు ననక నన్నే సర్వదా కొఱికి కొని తినుచుందువు. ఒక్కనికైఁన జదువు సంధ్య లంటినవియా ? ఆఁబోతువలెఁ గుడిచి యూరువెంబడి దిరుగుచుందురు. నే నేమి చేయుదును ? ఒంటిఱెక్క మీఁద నీ కాపుర మెన్నాళ్ళీడ్చుకొని రాఁగలను. తినుటకు గడుపునిండ నన్న ముండినం గదా పెండ్లి మాట యాలోచించుకొనుట : నీ మూలముగనే కొడుకు లందఱు పఱమ నిర్భాగ్యులై పోయిరి.

బ్రాహ్మణి - మీరెప్పుడు వాండ్రనే తిట్టుచుందురు. ఇంతకన్న మఱేమియుం జేతఁగాదు. తెల్ల వారినంత దద్దినము. పిల్ల లకుఁ బురిటి దినములు. చేతఁ గా సైనను లేదు. అబ్బా ! యీ సంసార సాగరమెట్లు తరించుదాననో తెలియదు.

బ్రాహ్మణుఁడు - నన్నేమి చేయమనెదవు ? నాశక్తికొలఁదిఁ దిరిగి ముష్టి యెత్తుకొని వచ్చుచునే యుంటిని. పలువుర నొక్కఁడు పోషించఁగలఁడా ? ఎక్కడికిఁ బోయినను పెద్దమ్మ యెదురు వచ్చుచున్నది.

బ్రాహ్మణి - ఈ నడుమ వెంకటసోమయాజులు యజ్ఞము చేయుదునని చెప్పి దేశాటనముఁ జేసి యెంత ద్రవ్యము సంపాదించికొని వచ్చెను? మగవానికిఁజెప్ప వలయునా ?

బ్రాహ్మణుఁడు - అవును. అప్పటికి వితరణగుణ సాగరుండగు విక్రమార్క మహారాజున్నాఁడు కావున నతని డబ్బరలు సాగినవి. అప్పుణ్యాత్ముండు స్వర్గస్థుఁడయ్యెను. ఇప్పుడాలాగున నిచ్చువాఁ డెవ్వడునులేఁడు.

బ్రాహ్మణి – ఆయనకుఁ బుత్రులు లేరాయేమి ?

బ్రాహ్మ - ఒక పరమ నిర్భాగ్యుఁడున్నాఁడు. తెలియక కొందఱీనడుమ వాని యొద్ద కరిగి యెద్దియో యాచించిరఁట. అప్పుడు చోరులవలె వారిం పట్టుకొని చెఱసాలలోఁ బెట్టించెనఁట. నేనుఁ బోయిన నట్లేయగును. బ్రాహ్మణి - అంత మహానుబావుండా ?

బ్రాహ్మణుఁడు - అది యొకటియేనా ? మఱియొకటి వినుము వాని భార్యయుఁ బుత్రుండును మంచి గుణములు గలవారు. అర్ధుల పరితాపము వినలేక యా యిల్లాలు పుత్రునిచేత రహస్యముగా ధనము పంచి పెట్టించినది. ఆగుట్టు తెలిసికొని యా పాపాత్ముఁడు వారిరువురను జంపించెనఁట.

బ్రాహ్మణి - శివశివా ! యెంత కఠినాత్ముఁడో కదా ! తఱచు మంచి వాండ్రకుఁ జెడ్డబిడ్డలు పుట్టుచుందురు.

బ్రా - నా కెట్టివాండ్రు పుట్టితిరో చూచితివా? ఆలాగుననే-

బ్రాహ్మణి - (నవ్వుచు) అవును. మీ పాటి విద్యా గుణములు మీ పిల్ల లయందు లేవు. మీరే చెప్పుకొనవలయును.

అని యా దంపతులు మాటలాడుకొనుచు గొంతసేపటికి నిద్రఁబోయిరి. ఆ మాటలన్నియు విని విజయభాస్కరుఁడు వారి దారిద్రమును గుఱించి మిక్కిలి పరితపించుచు "అయ్యో ! ఆ చోరుల యిండ్ల లోనుంచి కొంత ధనమైనం దీసికొనివచ్చితిని గానేమి ? దాని వలన వీరుదృప్తిఁ బొందుదురుగదా ? ఇప్పుడు వీరికి నే నేమి చేయగలను ? వీరి దారిద్ర్య మెట్లుపోవు ? నని ధ్యానించుచు నెట్టకే నా రాత్రి గడపెను.

మఱునాఁడు ప్రాతఃకాలమునఁ దల్లి తో వారి సంవాదమంతయుం జెప్పి వీరి దారిద్ర మెట్లుపోవునని యలోచించున్న సమయంబున వీధిలో నెద్దియో చాటింపు వినంబడినది. అది యేమి యని రాజపుత్రుఁ డాయింటి బ్రాహ్మణు నడిగిన నాపాఱుం డిట్లనియె.

మా పట్టణపు రాజుగారి కోటలోఁ గొన్ని దినముల క్రిందట దొంగలు ప్రవేశించి యెక్కుడు రొక్కముఁ దస్కరించుటయే కాక పదిరెండేఁడుల ప్రాయము గల యమ్మహారాజు కూతురు కలభాషిణిని దీసికొని పోయిరి. ఆ చిన్న దానిం దీసికొనివచ్చిన వానికిఁ బుత్రికతోఁ గూడ రాజ్యము నర్పింతునని మా రాజు చంద్రగుప్తుఁడు చాటింపించుచున్నాఁడు. ఇదియే దీని వృత్తాంతమని పలికిన విని యా నృప కుమారుఁడు సంతోషించుచుఁ దల్లి యనుమతి వడసి యా బ్రాహ్మణుని చెవిలో నేదియోచెప్పెను.

అప్పు డాపాఱుం డపార ప్రమోదకూపారంబున మునుంగుచు "గుమారా ! నీ యౌదార్య మార్యజనస్తోత్రపాత్రంబై యున్న యది నీ పేరు స్మరించుకొని చిరకాలము మేము సుఖింతము. మదీయ దారి ద్రాంధకారమునకు నీవు లోకబాంధవుండ వైతి" వని పెక్కు తెరంగుల వినుతింపుచుఁ బెద్దకుమారునిం బిలిచి వానికిఁ జేయఁ దగిన కృత్య మంతయు బోధించెను. నిగమశర్మ యను పేరంబరఁగు నా విప్ర కుమారుండు తండ్రి మాటలన్నియు విని యుబ్బి గంతులు వై చుచు నప్పుడే మంచి దుస్తులు ధరించి రాజపుత్రిక నొక యందలముపైఁ గూర్చుండ బెట్టుకొని విజయభాస్కర దత్తంబగు ఖడ్గంబు చేతం బూని యా యందలము ప్రక్కనడచుచు గంభీర స్వరంబునఁ దస్కరులఁ బరమార్చి రాజపుత్రికం దెచ్చితినని పలుకుచు జూచువారి కచ్చెరువు గలుగఁ జేయుచుఁ సత్వరముగాఁ జంద్రగుప్తుని యాస్థానమున కరిగెను.

ఆ రాజు చారులవలన నెవ్వఁడో బ్రాహ్మణ కుమారుండు తనపుత్రికను దీసికొనివచ్చుచున్నాఁ డను వార్త విని యపరిమితానందము జెందుచుఁగొంతదూర మెదురు వచ్చి యందలములోనున్న కొమార్తెం జూచి కౌఁగిలించుకొని వియోగ దుఃఖ మభినయించుచుఁ బెద్ద తడవు మన్నించి ముద్దుపెట్టుకొని తరువాతఁ దల్లిం జూచుటకై యా యింతి నంతఃపురమున కనిపెను.

పిమ్మటఁ జంద్రగుప్తుడు నిగమశర్మను మిక్కిలి గౌరవింపుచు విప్రకుమారా నీ పేరేమి ? కాపురం బెచ్చట ? నీవీ బాలిక నెక్కడ గనుగొంటివి ? దొంగలేమైరి ? చౌర్యవస్తువు లేమైనవి ? వారినెట్లు పరిభవించితివి ? చేసిన పనులన్నియు సవిస్తరముగాఁ జెప్పి నా కానందము గలుగజేయుమని యడిగిన నవ్విప్రకుమారుం డిట్లనియె.

దేవా ! నేనుత్తర దేశము నుండి వచ్చుచుండ నొక యరణ్యములోఁ గొందఱు దొంగలు నాకెదురు పడిరి. వారిలో నొకఁడు భర్తృ దారిక నెత్తుకొనియుండె తక్కిన వాండ్ర నెత్తిమీఁద ధనము మూటలున్నవి. వారింజూచి నే నట్టహాసము జేయుచు మీరెవ్వ రెందుఁబోవుచున్నారు ? నిలువుండని యదలించితిని. నా పలుకులకు వాండ్రుబెదరి యమ్మదవతినటదించి తలయొక దారింబాఱిపోయిరి అప్పుడునే నీబాలిక నెత్తుకొని మనవీటికిఁ జనుదెంచితిని. నా పేరు నిగమశర్మ యండ్రు నా కాపుర మీ పురమే యని యెఱింగించెను.

వాని మాటలు విని యారాజు సంశయాకులిత హృదయుఁడై యొక్కనిం జూచి పదుగురు వెఱచి పారిపోవుదురా ? దీనిలో నేదియోవ్యత్యాసమున్న దని యాలోచించి ఆర్యా ! నీ కీ ఖడ్గమెక్కడిది? యింతకుమున్ను నీవు సాముఁ జేసియుంటివా ? నీవు కదురు త్రిప్పగలనా?" యని యడిగిన నతండు "నేను సాముఁ జేయలేదు గాని కదురు త్రిప్పగలను. తఱచు జన్నిదములు వడుకుటచే నలవాటు పడినది ఆ దొంగలలో నొకఁడు బెదఱి యీ కరవాలము నేలం బాఱవైచిపోయె. నేను స్వీకరించితి" నని చెప్పిన నవ్వుచు రాజు అయ్యో ! కదురనఁగా నదికాదు. బాకు అని చెప్పి యా ఖడ్గము పుచ్చుకొని చూడ నందు 'విక్రమాదిత్య ' అని విలాసమున్నది. ఇది చోరుల యొద్దనుండు ఖడ్గము కాదు. రక్షక పురుషులు ధరియించునది. విక్రమార్కుని విలాసము దీనిపై నున్నది. దీని గుఱించి విమర్శింప వలసి యున్నది. ముందు నీకుఁ దెలియ జేయుదుము.

ప్రస్తుత మింటికి దయసేయుఁడని పలికి కొంత పారితోషిక మిచ్చి యశ్వ శకటముపై సబహుమానముగా నంతనింటి కనిపెను. రాజ మార్గంబున నరుగునప్పు డతనిం జూచి పౌరులుగుంపులుగా మూగి -

సీ. పార్వణపిండము . ల్భక్షించునట్టి బా
              పనగలాసుస కెట్టి • భాగ్యమబ్బె
    ఘనతీర్ధముల నీకు • కాసులు గడియించు
              చెనఁటిపాఱున కెట్టి . సిరిలభించె
    తిరుగుచు నిల్లిల్లు . తిరిపె మెత్తెడు పేద
              వాని కెంతటి వైభ • వంబుగల్గె
    ధరణీ సుపర్వ సం • తర్పణంబుల నీళ్ళు
              మోయు వానికి నెట్టి - ముదము బొదవె

గీ. నాకు నిన్నను గాక మె • న్ననె యితండు
   సత్రమునఁ గానుపించె భో . జనపువేళ
   నట్టివానికి భూరాజ్య • మబ్బె నహవా
   యనుచుఁ బౌరులు వెఱగంది , రత్ననిఁ జూచి.

ప్రజలు పలుకులు విని, నిగమశర్మ సిగ్గుపడుచు దలవంచుకొని యా బండిలోఁ గూర్చుండి యింటికిఁ జనియెను. తల్లిదండ్రు లెదురు వచ్చి నాయనా ! మా కేమిదెచ్చితివి ? రాజపుత్రికను నీకుఁ బెండ్లి యెప్పుడు జేయుదురు ? పట్టాభిషిక్తుండ వెప్పుడయ్యెదవు ? నీవు భార్యతోఁ బీటలపైఁ గుప్పండఁ జూడవలయునని కోరికగా నున్నయది. ఎప్పుడు దీరునోకదా ! నగరిలో విశేషము లేమని యడిగిన నిగమశర్మ తల్లిదండ్రుల లోపలకుం దీసికొని పోయి రాజుగారిచ్చిన ధనముఁ జూపుచు నిట్ల నియె. నాతో రాజుగారు గౌరవముగానే మాటాడిరి. గానిపిల్ల నిచ్చుటకుఁగొంచెము సందేహము పడినట్లుతోచినది. నా మాటలు తబ్బిబ్బులైనవి. ................... రప్పించెదనని చెప్పి యీధన మిచ్చి పంపెను. పిల్ల నిచ్చువాఁడైనచోఁ నన్ను బోజనము సేయకుండ నింటికి రానిచ్చునా ? మనగుట్టు దెలిసినచో బ్రమాదము -----------. రాజు విమర్శింపక మానఁడు. వీండ్రను జూచెనేని యనుమానముఁ జెందగలడు. రాజ్యలోభంబున జేసి వీరికి నాశ జనింపక మానదు.

కావున మనము వీండ్రను గడతేర్చినచో మనం పరించును. దీని 'కిడ్డయేని యుపాయ మాలోచింపుఁడని పి. * * * * (ణు చెపులు మ: శివా : యెంతమా! పలి. సుజీసినవారి లవలన న క త్య మెట్లు చేయగలము •

  • సబ చట పునలో

.ఎపుడు సందుల నుంచి అప్ప బాహ్మడి సు.. చి సమయము -వ్వంబుంగును? 23 . L. డుండునా ? -లియును? + దగినయుపాయ మాలోచింపఁ దగినదే. వీనిమాట తీసివేయఁగూడదు. వీరుండిన నెప్పటికైనఁ దెలియక మానదు. మన పెరటిలోనున్న నూఁతిలోవీరిం బడద్రోసితిమేని బ్రహ్మకుఁ దెలియదు రాజ్యలోభంబున నెంతెంతవా రెంతెంత పనులుచేసిరో పురాణములలో మనము వినుచుండలేదా ? యని యుపాయముఁ జెప్పినది.

ఆమాట వినిపించుకొనక యాబ్రాహ్మణుఁ డెక్కడికోపోయెను. తరువాత నాఁటి సాయంకాలమున నాబ్రాహ్మణి విజయభాస్కరుం జూచి నాయనా ! మా పిల్ల లెవ్వరు నింటిలోలేరు. అవ్వలి దొడ్డిలోనున్న నూఁతిలోఁ జేఁదపడిపోయినది. తీసి పెట్టెదవా ? యని యడిగిన నా రాజపుత్రుండు అవ్వా ! దీనికి నన్నింత బ్రతిమాలవలయునా ? దారిచూపుము తీసి పెట్టెదనని చెప్పెను. అప్పు డా బ్రాహ్మణి విజయభాస్కరుని మిక్కిలి యగాధమగు పెరటిలోని నూఁతియొద్దకుఁ దీసికొని పోయినది. రాజకుమారుం డందు దొంగిచూచుచు అవ్వా ! చేద గనఁబడలేదు. నీళ్ళు లోఁతుగానున్నవి. గాలము గావలయునని పలుకుచుఁ జూచుచున్న సమయంబున నంతకు మున్న యందు వేచియున్న నిగమశర్మ వచ్చి యారాజపుత్త్రుని రెండు పాదములు పట్టుకొని యెత్తి నూఁతిలోఁ బడద్రోసెను.

అప్పుడా బ్రాహ్మణి చారుమతి యొద్దకఱిగి “అమ్మా! మీపిల్లవాఁడు చేఁద తీయబోయి కాలుజారి నూఁతిలోఁ బడియెను. నాకేమియుం దోచకున్నది. తీయుదువు గాని రమ్మని" పలికిన నాయిల్లాలు ఉల్లము ఝల్లుమన గుండెలు బాదుకొనుచు నెక్కడెక్కడనని యడలుచు నానూఁతియొద్ద కరిగి తొంగిచూచుచుండ నిగమశర్మ చాటున నుండి వచ్చి యీసాధ్వీరత్నమునుగూడ పాదములుపట్టుకొని నూఁతిలోఁ బడవేసెను. దుర్జనులకుఁ జేయరాని కృత్యములుండవు. రాజపుత్త్రుఁడు. మొదట నూఁతిలోఁబడి మునుంగక యందువ్రేలాడుచున్న మఱ్ఱిమొక్క పట్టుకొని నూఁతిగోడంజేరి నిలువఁ బడియుండెను. ఇంతలోఁ జారుమతి నూఁతిలోఁ బడినది. అతండా సంగతి గ్రహించి తల్లి యని నిశ్చయించి మునుఁగనీయక చేతులతోఁ దరిమి పట్టుకొని లేవనెత్తి అమ్మా ! నీవు వెఱవకుము. మనకుఁ భ్రాణభయములేదు. ఆ బ్రాహ్మణుల కపటము దెలిసికొన లేకపోయితిమి. మనము రాజుతో నిక్కముఁ జెప్పుదుమని మనల వీరిట్లు చేసిరి. కానిమ్ము భగవంతుఁడే మనల రక్షించును అని యోదార్చుచు మునుపు చదివిన శ్లోకమునే మఱలఁజదివెను.

క. గిరియెక్కి పడిన ధర సా
   గరమున మునిఁగినను బావ • కముఁ జొచ్చిన భీ
   కరపణులతోడ నాడిన
   మరణ మకాలమున రాదు . మహినెవ్వనికిన్.

తగినట్లు నూఁతిలోఁ బడద్రోసి నిగమశర్మయుఁ దల్లియు నాపెరటి తలుపుపైచి లోపలికిఁ బోయి యిఁక మన గుట్టు తెలియఁజేయువారు లేరు. కలభాషిణితోఁ గూడ రాజ్యలక్ష్మి మనయధీనము కాగలదని సంతోషింపుచు రాజ్య లాభాంతరమునఁ చేయఁదగిన కృత్యముల నాలోచించుకొనుచుండిరి.

అక్కడఁ జంద్రగుప్తుండు నిగమశర్మ పంపినపిమ్మట నంతఃపురమున కరిగి పుత్త్రికం జీరి “అమ్మా ! తస్కరులు నిన్నెక్కడికిఁ దీసికొనిపోయిరి ? ఎవ్వరు విడిపించిరి ? నీవెంట వచ్చిన బ్రాహ్మణకుమారుఁడు దొంగలంబాఱఁదోలి నిన్ను విడిపించితినని చెప్పుచున్నాఁడు యధార్దమేనా ? యని యడిగిన నాబాలిక యిట్లనియె. జనకా ! పదియాఱేఁడుల ప్రాయముగలిగిన యొక చిన్న వాఁడు తల్లితో నడవిమార్గంబునం బడివచ్చుచు దారిలో నన్ను విడిపించి యీనగరమునకుఁ దీసికొని వచ్చెను. రాత్రి యొక బ్రాహ్మణగృహంబునఁ బవ్వళించితిమి. ఉదయమున వారు నాకుఁ గనం పడలేదు. ఆయింటి బ్రాహ్మణుని కుమారుఁడు పారితోషికము దొరకునని నన్నిక్కడికిఁ దీసికొనివచ్చెను. ఇదియే యదార్థ"మని చెప్పినది. వారేకులమువారో యెఱుంగుదువా ? యని యడిగిన నా చిన్నది "వారు నాకు గులశీలనామంబులు చెప్పలేదు. మార్గస్థుల మని చెప్పిరి. పోలికలుచూడ గొప్పవారివలెఁ గనంబడుదురు. ఆచిన్నవాని సౌందర్యము జూచి తీఱవలయు"నని యామాట లన్నియు జెప్పినది. అప్పుడు మిగుల బుద్దిమంతుఁ డగు నారాజు సందేహము జెందుచు "పుత్రీ : నీవు చెప్పిన వారి నీబ్రాహ్మణులు ద్రోహముచేసిసయుందురని తోచుచున్నది. నిగమశర్మ మాటలన్నియు బూటకములని నే నప్పుడే కని పెట్టితిని. కానిమ్ము ఱేపు ప్రొద్దున్నపోయి వారియిల్లు పరీక్షించి వచ్చెద"నని పలికి యారేయి గడపి మఱునాఁ డుదయంబున మంత్రిసామంత పౌరపరిచార సహితముగాఁ నాబ్రాహ్మణుని యింటికరిగెను. రాజు సపరివారముగాఁ దమయింటికి వచ్చుచున్నాఁడను వార్త యిరుగుపొరుగువారు చెప్పిన విని యాబ్రాహ్మణి తన కుమారునకేఁ బుత్త్రికనిచ్చు తలంపుతో వచ్చుచున్నాఁడని నిశ్చయించి ముఱియుచు మాకు రాజ్యము వచ్చినతరువాత మీకెక్కుడుపకారముఁ గావింతునని చెప్పి కొందఱి నడిగి నూత్నభూషాంబరము లెరవు దెచ్చుకొని కుమారుండు తాను నలంకరించుకొనిరి. అట్టిసమయమున నిగమశర్మ “అమ్మా ! నేనిప్పుడు రాజుగారి కెదురుబోవలయునా?" యని యడిగిన నామె "సరి సరి మన మాయనకు బూజ్యులము. మన కెదురుపోవ నవసరములేదు. అదియునుంగాక కొంచెము బిగించుకొనియుండక పోయినచో నల్లునిఁ దేలికచేయుదురు. ఎవ్వరికోసరము వచ్చెడిని ? మనము లోపలకు వచ్చువఱకుఁ గదలవలదు. ఆయన భార్యవచ్చి నన్నుఁ బిలిచినందాక నీవు వారింటికిఁ బోవలదు. నిన్నుఁ బట్టియె నాకును గౌరవము రాఁగలదు " అని పెక్కుతెఱంగులఁ దలంచు కొనుచు వారు లోపలనే కూర్చుండిరి.

అంతలోఁ జంద్రగుప్తుఁ ను పు ఆయిల .. 13. రము ని ప . pot. "ను ఆ పలు వచ్చి లంగా, పరీక్షించి వచ్చేడ" .. రాజుగారితోఁ జెప్పుమని చెప్పినది. వాఁడుపోయి యామాటఁ జెప్పెను. రాజు నవ్వుచుఁ గానిమ్ము బెండ్లియైన తరువాత బెట్టు చేయవచ్చును. ఇప్పటికి రమ్మని చెప్పుము. రాకున్న శిక్షింతుననుటయు నామాటలు విని నిగమశర్మ వడివడి లేచి రాజుయొద్దకు వచ్చెను. అతని యలంకారము వేషముఁజూచి మున్నెఱెంగినవారెల్ల బకబకనవ్వసాగిరి. అప్పుడు రాజు విప్రకుమారా ! మీయింటికి నొక యాఁడుది చిన్నవాఁడు వచ్చిరఁట. వారెక్కడనున్నారని యడిగినఁదడఁబడుచు నాకుఁ దెలియదు. మాయమ్మ నడుగుఁడని యుత్తరముఁ జెప్పెను.

అప్పు డామెను బిలిపించి యడిగిన మాయింటి కెవ్వరును రాలేదనియు వారెవ్వరో మే మెఱుఁగమని చెప్పినది. ఆ మాటలలోఁ దొట్రుపాటుగ్రహించి యా భూభర్త మీ యిల్లేబాటిదో చూడవలయునని పరివారముతోఁ గూడ లోపలఁ బ్రవేశించి యిల్లు నలుమూలలు వెదకి పెరటిలోని కరిగి పరికించి యా నూతియొద్దకుఁ బోయి తొంగిచూచెను. అందులో నిరువురు మనుష్యుల మొగములు నీటిపైఁ దామరపద్మముల వలెఁ గనంబడినవి. వానింజూచి యతఁడు విస్మయసంభ్రమములతో రజ్జునిశ్రేణికలం దెప్పించి పరిచారకుల దింపి వారిఁ బైకిరప్పించెను. వారు స్మృతితో నుండుటకు రాజు సంతసించుచు, గట్ట గ్రొత్తబట్టల నిప్పించి శీతము వాయ నుపచారములు సేయించెను. అప్పు డా బ్రాహ్మణినిఁ బిలిచి రాజు "వీరెవ్వరు మీనూఁతిలో నెట్లుపడి "రని యడిగిన నామె విస్మయం బభినయించుచు “అయ్యో ! వీరెవ్వరో నేనెఱుంగను. మానూతిలోని కెట్లు వచ్చిరోకదా ?” యని యుత్తరము జెప్పినది. ఈలోపల నిగమశర్మ వారు తన గుట్టు బయలుబెట్టుదురని యొంటి ప్రాణముతోఁ దెల్లపోయి చూచుచుండెను.

పిమ్మట రాజు విజయభాస్కరునిఁ బిలిచి "కుమారా ! మీరెవ్వరు ? ఇచ్చటి కెప్పుడు వచ్చితిరి ? మిమ్మీనూఁతిలో నెవ్వరు పడఁద్రోసిరి. నిజముఁజెప్పు" డని యడిగిన దయగలహృదయుఁడగు నా రాజపుత్రుఁడు ఆ బ్రాహ్మణుల బెదరుఁజూచి జాలివొడమ "దేవా ! మేము మార్గస్థులము. మమ్మెవ్వెరు దీనిలోఁ బడద్రోయలేదు. కాలు జారి నేను బడితిని. నానిమిత్త మామె పడినది. ఇదియేనిజ" మని చెప్పెను. ఆ మాటవిని రాజు “మహారణ్యములోఁ గలభాషిణియను బాలికను దొంగలబారిదప్పించిన వాఁడవు నీపు కావా ? యని యడిగిన నావృత్తాంతమేమియు నేనెఱుంగను, కలభాషిణి యెవ్వతియో నాకుఁ దెలియదని యతడు ప్రత్యుత్తరముజెప్పెను. ఎన్నిసారులడిగినను నడిగించినను విజయిభాస్కరుఁ డామాటయే చెప్పెను. కాని యదార్దముఁ జెప్పఁడయ్యెను. అప్పుడా రాజేమి చేయుటకుందోచక కానిండు ఱేపు విమర్శింతము. ఇప్పుడు మిగిలిన దేమియున్నదని పలికి పరివారముతోఁగూడ యధాగతముగా నింటికింబోయెను. అప్పుడు విజయభాస్కరుఁడు తల్లితో "అమ్మా ! యీ కలభాషిణి మనవృత్తాంతముఁ దండ్రితోఁ జెప్పినది కాఁబోలును. నన్నతండు గ్రుచ్చియడుగఁ జొచ్చెను. నిజము చెప్పినచో నిగమశర్మకుఁ బిల్ల నియ్యపోవుటయే కాక వీరినెల్ల దండించును. మనము వీరి కుపకారము చేయఁదలచుకొంటిమిగదా ? అట్టివారి కపకార మెట్లుచేయుదును ? మనకు ద్రోహముచేసిన పాపమువారినంటకుండ దైవమును బ్రార్థింపుచున్నాఁడ నది వారి దోషముగాదు. దారిద్ర్యదోషము. మన మిక్కడుండరాదు. మరియొక యూరికిఁ బోవుదము రమ్ము. రాజుగారు వీరి కెద్దియేని యుపకారము చేయగల'రని పలికి యెవ్వరికిఁ దెలియకుండఁ దల్లితోఁగూడ నాఁటి వేకువజామున మఱియొక యూరికింబోయెను.

మఱియొకనాఁడు నిగమశర్మ రాజునొద్ద కరిగి దేవా ! దేవర ప్రకటించిన ప్రకారము జరిగింపవలయును. నేను మీపుత్రికం దీసికొనివచ్చి యర్పించితిని. ప్రభువులే దబ్బర లాడినచోఁ బ్రజ లేమిచేయుదు? రని యడిగిన నాఱేఁడు 'మాకలభాషిణి తన్ను విడిపించిన వాఁడవు నీవు కావని చెప్పుచున్నది. నీ మాటలు వినినను నసందర్భముగానేయున్నవి. నిన్నొక్కనిఁజూచి పదుగురు పారిపోయిరని చెప్పుచుంటివి. ఇది లోకవిరుద్ధము కాదా ? నిజము దేలువఱకు నేమి చెప్పుటకు వీలు లేదనుటయు నతండిట్లనియె. ఱేఁడా ! మీకొమార్తె నేను బ్రాహ్మణపుత్రుండననియు నననుకూలుండ ననియు నన్నుఁ బెండ్లియాడుట కిష్టములేక యిట్లు బొంకుచున్నది. పోనిండు. ఆమె చెప్పిన చిన్నవాడు మీరడిగిన సమ్మతించెనా ? మాయింట నున్నపుడాచిన్నవానిఁజూచి వరించి యట్లనుచున్నది నిజము దెలిసికొని న్యాయము చేయుఁ డని కోరికొనెయెను. అతని మాటలు విని రాజు పోపొమ్ము నా కొమరిత యసత్యము లాడునదికాదు. న్యాయమే విచారించి కావించెద'నని పలికి యతనినంపి తానంతఃపురమున కరిగి కలభాషిణి కిట్లనియె.

అమ్మా ! నీవు చెప్పిన చిన్నవాఁడును దల్లియు నా బ్రాహ్మణుని పెరటి నూఁతిలోఁ బడియున్నారు. నేనుబోయి దైవవశమున నానూతియొద్దకరిగి చూచి వారిం బయటికిఁ దీయించి మాటాడితిని. నీ ప్రశంస యేమియుఁ దనకుఁ దెలియదని చెప్పిరి. పోలికలు చూచిన నీ వన్నట్లేయున్నారు. ఆ పాఱులే వారి దానిలోఁ బడఁద్రోసిరని తలంచి యడిగితిని. అదియేమియుంజెప్పక తమంతటఁదామే కాలుజారి పడితిమని నుడివిరి. అప్పుడు నేనేమిచేయుదును ? ఈ బ్రాహ్మణబుత్రుఁడు నన్నూరక నిందింపు చున్నాఁడు. నిజముఁ జెప్పుమని యడిగిన నప్పఁడతి యిట్లనియె.

తండ్రీ ! నేను నీతో దబ్బఱ లాడుదునా ? ఆ చిన్నవాఁడు కడు మంచివాఁడు ? తల్లి యు నట్టిదే. వారితో నేను నాలుగు దినములు పయనము చేసితిని. వారికిఁ గల భూతదయ మఱియొకరికి లేదు. నన్నెంతయో దయతోఁ జూచి నన్ను యీ యూరు దీసికొని వచ్చిరి మేము పండుకొనిన యింటిపాఱునిదారిద్ర్యమునకు మిక్కలి వగచుచు వారి కెద్దియేని నుపకారముఁ జేయవలయునని మొన్న ప్రొద్దున్న దల్లి తోఁ జెప్పుచుండ నేను వింటిని. ఆ పిమ్మటనే వారు నాకు ప్రొద్దున్న గనంబడలేదని యా వృత్తాంతమంతయుం జెప్పినది. చంద్రగుప్తుండును సంశయడోలాయిత హృదయుండై వారి చర్యల నరసికొనిరండని గూడచారులను నియమించెను. నిగమశర్మయు నేను దగని వాఁడనని కొమార్తెచే బొంకింపుచు మన రాజు ధర్మముఁ దప్పి ప్రవర్తించుచున్నాఁ డని పట్టణమంతయు జాటింపుచుండఁ బౌరులు వాని మాటలు సత్యములని నమ్మి రాజును నిందింపఁ దొడంగిరి.

అది యట్లుండె నరణ్యములో నాఁటి రాత్రి మ్రుచ్చులట్లు గమ్యస్థానమున కరిగి తిరిగి వచ్చి శక్తి గుడిముంగిట నబ్బాలికం గానక నలుమూలలు వెదకి యొరులు వచ్చిన గుఱుతులు గనంబడినఁ దొట్రుపడుచు నోహో ? మోసము వచ్చినది ఎవ్వడో మన మర్మము దెలిసికొని వచ్చి యచ్చిగురుఁబోడిం దీసికొని పోయెను ధనమేమియు ముట్టలేదు. వాఁడబ్బాలికకు దగ్గర చుట్టము కావలయును వానిం బట్టికొని పరాభవింపనిచో మనగుట్టు బయలు పడకమానదు.చంద్రప్రస్థ నగరమున కరిగిన నంతయుఁ దెల్లమగునని యాలోచించుకొని ----------- భిక్షకులవేషము వైచుకొని యా రాజధానికిం జనివీధులం దిరుగుచుండ నొకచోటఁగొందఱు కూర్చుండి మనరాజుయాడి దప్పెంగదా? పాపము నిగమశర్మ రాజపుత్రికను జోరులబారినుండి తప్పించి తీసికొనివచ్చెను. తాను బ్రకటించిన ప్రకార యా బాలికను నిచ్చి బెండ్లి జేయవలసినదే ? అట్టివాఁడు మొదట నట్లు చాటింప నేల ? యని చంద్రగుప్తుని --------మాటాడుకొను చుండిరి. ఆ పాటచ్చరులా మాటలు విని బాటసారులవలె నిగమశర్మ యింటికిం జని యతనితోఁ బరిచయముఁ జేసి యార్యా ! నీవు తస్కరులచేఁ బట్టువడిన రాచపట్టిం బట్టితెచ్చి రాజు గారి కిచ్చితివఁటే ఆతండు నీ కామిత మేమిటికిఁ దీర్పలేదు. నీవుపేక్షించితివేల ? ఆ విషయము తగవు పెట్టవలసినదే యని యడిగిని నా భూసురకుమారుండు నేను విడిచితినా ? అతండే పిలిచి యిచ్చునని చూచుచున్నాను మఱి కొన్ని దినములు విమర్శించి పిమ్మటఁ దగవు పెట్టెదను. న్యాయమునకుఁ గాలము గాదుగదా ? నే నప్పుడు పేక్షించితినేని నప్పంక జాక్షి ఈ పాటికా పాటచ్చరులకుఁ బరిచారికగా నుండకపోవునా ? అని చెప్పిన విని వాండ్రు క్రమ్మఱ నిట్లనిరి.

అయ్యా ! ఆ దొంగల నివాస దేశమెచ్చట ? నీకెందు గనంబడిరి. ఆ బాలిక నెచ్చటినుండి తీసికొనివచ్చితివని యడిగిన నతండు 'అబ్బో ? దానికి బెద్దగాధ యున్నది. ఇప్పుడు చెప్పుటకు దీరుబడిలేదు. నాకుఁ బనియున్న 'దని పలికియక్కడి నుండి యెందేనిం బోయెను. వీఁడే మనగుట్టు దెలిసికొని వచ్చినవాఁడు. సకుటుంబముగా వీనిం బట్టికొని తీసికొనిపోయి మన యమ్మవారికి బలియిత్తమని నిశ్చయించుకొని వాండ్రొకనాఁటి రాత్రి నా బ్రాహ్మణ కుటుంబము వారి నందఱిని ఱెక్కలు విరిచికట్టి యొరు లెఱుంగకుండఁ దెల్లవారక పూర్వము తమ యునికి పట్టునకుఁ దీసికొనిపోయిరి.

పెక్కండ్రు రాజభటులచేఁ గాపాడఁబడుచున్న కోటలోఁ బ్రవేశించి దోఁచికొని పోయిన యా గజదొంగలకు నా బాపనయ్యలఁ దీసికొని పోవుట యేమి లెక్క ? అందమ్మవారి ముఖమండపమున వారినెల్లఁ బరుండబెట్టి నిగమశర్మతో నోరీ ? నీవు మా గుట్టుఁ దెలిసికొని మా యింటనున్న చిన్న దాని నెత్తుకొని పోయితివి. మా శక్తి యాహారము చెడఁగొట్టిన పాతక మూరకపోవునా ? మిమ్ము నందఱ నిప్పుడు మా తల్లి కి బలియిచ్చుచున్నారము. మీ యిష్టదైవమును బ్రార్థించుకొనుడని పలికిన విని గడ గడ వడఁకుచు నిగమశర్మ యిట్ల నియె.

బాబులారా ! నే నేమియు నెరుంగను. ఎవ్వఁడో యొక చిన్నవాఁడా చిన్నదానిని మా యింటికిఁ దీసికొని వచ్చి రాజుగారి కప్పగించుమని చెప్పెను. ధన మందలి యాసచే నేనే తీసికొని వచ్చితినని బొంకితిని. అందు వలన బ్రయోజనము లేకపోయినది. ఆ చిన్నది తండ్రితో యదార్థముఁ జెప్పుటచే నతం డనుమానముఁజెంది నా మాటలు నమ్మలేదు. ఇంతయు నిక్కువము ; నిరపరాధుల మమ్మేల చంపెదరు? రక్షింపుడు, రక్షింపుడని వేఁడుకొనిన సమ్మతింపక యాదస్యులు కత్తులు వారి కుత్తుకలపై వ్రేయఁ గమకించు సమయంబున వలదు, వలదు. వీరిఁ జంపకుఁడు. నే నింతటి నుండి మాంసోపహారముల నంగీకరింపను. కందమూల ఫలాదులే భుజింపుచుందు. నా యెదుట జీవహింస చేయరాదని యా శక్తి వారితోడఁ బలికినది

ఆ మాట విని చోరులు కత్తులు నేలఁ బాఱువై చి బాపనయ్యలారా! . బ్రతికి బోయితిరి. మా తల్లికి మీ యందు దయవచ్చినది. మిమ్మిచ్చటనుండి కదలనీయము. పశువులం బోలెఁ గట్టి మేపుచుందుమని చెప్పి యట్లు చేయుచుండిరి. సజ్జనులఁ బాధించిన పాతక మూరకపోపునా ? యని యెఱింగించి యప్పటికి వేళ యతిక్రమించుటయు నమ్మణిసిద్ధుండు తదనంతరోదంతంబు దరువాతి మజిలీయందిట్లు చెప్పఁ దొడంగెను.

నలువదియ మజిలీ

గోపా ! విను మట్లు విజయభాస్కరుండు దల్లి తోఁ గూడఁ జంద్రప్రస్థ నగరము విడిచి యడవి తెరువునంబడి నడిచి నడిచి కొన్ని పయనంబులకుఁ జిత్రకూటంబను నగ్రహారముఁ జేరెను. అయ్యగ్రహారంబు సకల విద్యావిలాసభాసురులగు భూసురులచే నలంకరింపఁబడి యున్నది. దూర మార్గగమన శ్రమచే డస్సినిట్టూర్పులు నిగుడింపుచు నా రాజనందనుఁ డందొక ధరణీ బృందారకుని మందిరము దాపున నిలువంబడి వాకిటికి వచ్చిన యాయింటి యజమానురాలిం జూచి అమ్మా ! మేము పరదేశులము. ఈమె మా తల్లి . దూరము నడుచుటచేఁ గడు డస్సినది. ఈ పూఁట మీ యింట మా కాతిధ్యమిత్తురే ? యనుటయు నా యిల్లాలు "రండు రండు. మీ వంటి వారూరక మా యింటికి వత్తురా ? మేము కృతార్థుల మయ్యెదము గదా ?" యని పొగడుచు నర్ఘ్యపాద్యాదులం దెచ్చి యిచ్చి యర్చించుచుఁ దమయరుఁగు పయిం గూర్చుండఁబెట్టి త్రుటిలో వంటఁజేసి భోజనమునకు లెండని నియమించి స్నానార్దమై యరుగుచున్న విజయభాస్కరునివెంటఁ దటాకముఁ జూపుటకై తన పుత్త్రుగుణ సాగరుఁ డనువాని నంపినది.