కాశీమజిలీకథలు/ఆరవ భాగము/67వ మజిలీ

శ్రీరస్తు.

శుభమస్తు - అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

ఆరవభాగము

అరువదియేడవ మజిలీ.

క. స్వామీ! తిరిగితి నే నీ
   గ్రామంబంతయు వింత గాన్పింపదు కా
   శ్రీమహిమ విశేషంబుల
   వేమేనిం గలిగినేని వెరిఁగింపు దయన్.

గురువరా ! మన మప్పుణ్యక్షేత్రంబునకు కొన్ని దినంబులకుఁ బోఁగలము ? సంతతము తన్మహిమాకర్ణంబున మత్కర్ణంబు లుత్సకములై యుండుంగదాఁ మహాత్మా ! కథారూపంబైన తత్ప్రభావంబొండు మీకు స్ఫురింపదేని నీ వీట నొకచోట నొకవిశేషంబు గంటి. అది నా స్వాంతమున కంతవింతగాఁ దోపకున్నను నుబుసుపోవుటకై యత్తెరం గెరుగఁ గోరుచున్నాను. వినుఁడు. ఇప్పురము తూరుపుదెస నొక యుద్యానవనము కలదు. అందు మనోహరములైన తరులతా విశేషములు పెక్కులు విరాజిల్లుచున్నవి అన్నియు రకమునకు నాలుగు నాలుగు చొప్పున శ్రేణిగా నాటఁబడి యున్నవి. అట్లు ప్రతి గుల్మము చతుసంఖ్యగా వరుసగా నాటుటకుఁ గారణమేదియో యుండకపోదు. అవ్విధ మరసి మన్మనోరధంబుఁ దీర్ప వేడుచున్న వాఁడనని కోరిన విని యమ్మణిసిద్ధుండు సిద్ధమణి మహిమంబున నయ్యుదంత మాకలించుకొని మొగంబున నబ్బురపాటు దోప నిట్లనియె.

వత్సా ! నీయందు దైవసానిధ్యంబుగలదు. నీ వడిగిన ప్రశ్నము లెప్పుడును నద్భుత కథాసందర్భ కలితములై యుండకపోదు. ఇప్పటి నీప్రశ్నములు రెంటికిని నొక్కకథయే యు త్తరముఁ జెప్పగలను. నీవెఱింగినట్లే యడిగితివి. అక్క థ మిక్కిలి చమత్కారభూయిష్టయైయున్నది. సావధాన మనసుండవై వినుమని యిట్లు చెప్పఁ దొడంగెను.

శీల కళా విద్యా రూపవతుల కథ

సకల సంపద్విశాలాభిరామంబై విశాలయను పురవం బొండు ధరామంనంబగుచు విరాజిల్లుచుండు. అప్పురంబు రాజధానిగాఁజేసికొని ధర్మపాలుండను నృపాలుండు ప్రధమ దిక్పాలుని వైభవముతో రాజ్యము సేయుచుండెను. ఆ పుడమిఱేఁడొక నాఁడు కొల్వుకూటం బలంకరించి విద్వద్గోష్టి నలరుచుండ యజ్ఞదత్తుండను విద్వాంసుం డరుదెంచి యా ఱేనిచేత నర్చితుండై యాశీర్వచనముల గావించెను.

దివ్యతేజస్సంపన్నుడగు నా భూసురుఁ జూచి ధరణిపతి వెఱగు పడుచు నార్యా ! మీ నివాసదేశ మెయ్యది? మీరేవిద్యలం జదివితిరి ? మీ యభిఖ్యావర్ణంబు లెట్టివి? ఏమి పనికై యరుదెంచితిరి? మీ వృత్తాంతం బెఱింగించి శ్రోత్రానందం బాపాదింపుఁడని యడిగిన నతం డిట్లనియె.

దేవా ! నాజన్మభూమి యిదియే. నా పేరు యజ్ఞదత్తుండందురు. నేనుఁ బాల్యముననే మాతాపితృ విహీనుండనగుటఁ గాశీపురంబున కరిగి యందు విద్యాభ్యాసముఁ గావించితిని, వేదంబులు సాంగముగాఁ జదివితిని, శాస్త్రములు సాంతముగా బరిశీలించితిని. పురాణంబు లరసితిని వేదాంత రహస్యముల గ్రహించితిని. పెక్కు లేల, నన్ని విద్యలయందును గొంచెము గొంచెము పాండిత్యము సంపాదించితిని. కాశీలో యుపాధ్యాయుఁడ ననిపించుకొని కొలది దినముల క్రిందటనే యివ్వీటి కరుదెంచితిని ధర్మస్వరూపులైన దేవర మా దేశము పాలించుచున్నారని విని మిగుల నానందించుచు దర్శనముచేసి పోవలయునని వచ్చితిని. వేఱొండపని యెద్దియులేదని విని తదీయ విద్యావినయ విశేషంబుల కానందించుచు నాభూపతి యిట్లనియె.

విద్వత్ప్రవరా ! నీ యభిప్రాయము కడు స్వల్పమైనను విద్యా గుణంబులు పెద్దవిగా నున్నయవి జన్మదేశాభిమానంబునం జేసి యిప్పురంబున కరుదెంచితివిగదా ? నీవెందేగినఁ బూజింపఁ బడకుందువు భవదాగమునం --మామక పురాకృతభాగదేయంపుఁ నింపు ప్రకటించుచున్నది నేఁడు మొదలు నీవు నాకు విద్వాంసుడవై మంత్రివై సకల కార్యంబులయందును తోడునీడవై మెలగుచుండుము అని పలుకుటయు నా విద్వ త్తిలకుండు తత్పర్దాణంబుల కనుమోదించి యట్లు గావింపుచుండెను.

పండిత ప్రియుఁడగు నా నరనాధుండు తిధ కోరం పు తిశయగు సురూప మహానయ గాలక్రమంబన యవర్తుంచు లక్ష్మీసరస్వతులనే జెండా నించెను. నుకూలమై వర్తింప పరింపుకి పరమ సంతోషముతోఁ గాలక్షేపము సెను. అంతఁగొంతకాలమునకుఁ దన్నాశ్రయించియున్న కమలా సరస్వతు లేకమై మూ ర్తీభవించిరో యనం యజ్ఞదత్తున కొక్కకన్యారత్నముద్భవించెను. అబ్బాలికా వతంస బవ్విద్వాంసుని హృదయమునకు మోహలతాపాశమై బంధించినది. అతండు మురియుచు నా శివునకు జాతకర్మానంతరమున శీలవతియని నామకరణము వ్రాసెను.

ఒకనాఁడు ధర్మపాలుని పట్టమహిషి యశోద పతియనుమతి వడసి యనేక మణిభూషావిశేష పారితోషకములతో యజ్ఞదత్తు పుత్రికనుంజూడ నరిగి రత్న కళికవలె మెరయుచున్న యప్పాపంజూచి వెరఁ గందుచు నెత్తుకొని ముద్దు పెట్టుకొని తనివిఁదీరని వేడుకతోఁజూచుచు సురూప కిట్లనియె.

సాధ్వీ ! నీయదృష్టము మిక్కిలి స్తుతిపాత్రమైయున్నది గదా? మేనకవలెఁ ద్రిలోకాభిరామయగు ముద్దులపట్టిం గంటివి ! మావంటి నికృష్టుల కిట్టియదృష్టము పట్టునా? యని యేమేమో యపత్యాభిలాషతో ముచ్చటించిన సురూప, దేవీ ! నీవీ యానందము శీఘ్రకాలంబులో ననుభవింపఁగలవు. ఈ పట్టిం దీసికొనిపోయి మీయింటం బెట్టుకొని పెంచుకొనము. మేము నీవారముకామా యని యామెమనసు నిండుపరుప నుడివి యనుతాపము వారించెను.

రాజపత్ని యామాట పాటించి అమ్మా ! నీవు పతివ్రతవు. నీమాట రిత్తవోవదు. నీవనినట్లీబిడ్డ నాబిడ్డయే. నీవీబాలికతోవచ్చి కొన్నిదినములు మాయింట నుండుము. అని పలికిన యప్పుడే పండితపత్నిని పుత్రికతోఁగూడ తన శుద్ధాంతమునకుం దీసికొనిపోయి యా బాలికను సంతతము తనయురమునం బెట్టుకొని ముద్దాడుచు మూత్ర పురీషాదుల నేవగించుకొనక కొన్ని దినములు తత్సంరక్షణ వ్యాసక్తితోఁ గడపి పెక్కుకానుకలతో వారి నింటి కనిపినది.

తత్సంపర్కవిశేషంబున ననపత్యతాదోషంబువాసి యా సీమంతినీ రత్నము వెంటనే యంతర్వత్నియగుటయు నవ్వార్త పట్టణమంతయు వ్యాపించి వారుల నానందసాగరమున ముంచినది. శీలవతీ లాలనావిశేషంబునంజేసి రాజపత్ని గర్భవతి యయ్యెనను వార్తవిని యప్పట్టణంబున ననపత్యుండగు ధర్మపాలుండను వర్తకుం డొకనాఁడు యజ్ఞదత్తునొద్ద కరుదెంచి వినయ వినమితో త్తమాంగుఁడై భార్యాపుత్రికలతో నతనిఁ దన యింటవచ్చి కొన్నిదినంబు లుండుమని మిక్కిలి ప్రార్ధించాను.

యజ్ఞదత్తుం దందులకియ్యకొనక వారినే తనయింటికివచ్చి యభీష్టసిద్ధిం బొందుడని నియమించుటయు ధనపాలుం డనుమోదించి శుభముహూర్తంబునఁ దనభార్యను వచ్చిన సూక్ష్మకై వారింటి కనిపెను, వైశ్యపత్నియు దాదియుంబోలె శీలవతి సుపకాలించునులు సేవఁగాదించి యింటికరిగింది. తచర్చనావిళే మట్టితో పుడే సందరినవార్త పట్టణంబంతయు వ్యాపిందినవి. అవక దాలికామణి. సిగర మట్టియు నప్పట్టణ వాస్తవ్యుండు వృషాంకంగా వాలి ప్రదకుంచనపత్యుఁ డగుట ధనపాలుండువోలె యజ్ఞదత్తునాశ్రయించి తనభార్యచే బాలికామణి కూడిగములు సేయించిన సఫలమనోరథుం డయెను.

అంతఁ గాలక్రమంబున రాజపత్నియు వర్తకుని భార్యయు వృషాంకుని యిల్లాలును దౌహృదలక్షణములఁ బ్రకాశించుచుండ మువ్వురకుఁ గాలక్రమంబున బుత్రికారత్నము లుద్భవించిరి. తదీయ రూపలేభావిలాసములు శీలవతిం బోలియుండుటంజూచి జను లాశిశువులఁ దదంశ సంజాతలఁగాఁ దలంచిరి.

ధర్మపాల ధనపాల వృషాంకులు మువ్వురును యజ్ఞదత్తునం దత్యంత వినయ భయభక్తి విశ్వాసములు గలిగి తదనుమతి నాబాలికలకు కాలకర్మాదివిధులు నిర్వర్తించి క్రమంబున యజ్ఞదత్తుండు రాజపుత్రికకుఁ గళావతియనియు వైశ్యపుత్రికకు విద్యావతి యనియు శూద్రపుత్రికకు రూపవతియనియు ననుగుణ్యముగా నామములు పెట్టించెను.

ఆబాలికలు చంద్రలేఖలవలె ననుదిన ప్రవర్ధమానలగుచుఁ దల్లి దండ్రుల మనఃకువలయంబుల వికసిల్లం జేయుచుండిరి. ధర్మపాలుండు పుత్రిక కై దేడులు ప్రాయము ప్రవేశించినతోడనే యజ్ఞదత్తునే యుపాధ్యాయునిగా నియమించి శీలవతితో జతపరచి చదివింపం దొడంగెను. ధర్మపాల వృషాంకు లిరువురు యజ్ఞదత్తునాశ్రయించి తత్కశాసంజాతలగు టఁదమపుత్రికల విద్యావతీ రూపవతుల శీలవతి కళావతులతోఁ గూడ జతపరచి చదివించునట్లు నిరూపించిరి.

నాటంగోలె యజ్ఞదత్తుండు సమవయోరూప విశేషములఁ జెల్వారు నాబాలికలకు నలువురకు నుపాధ్యాయుండై విద్యాభ్యాసముఁ గావింపుచుండెను. ఆ బాలికలు నలువురు కలసి చదువ నారంభించిన రెండు మూడుదినములలోనే యత్యంత ప్రేమానుబంధమైన మైత్రి గలిసినది.

తదీయ విద్యావయోసఖ్య విశేషంబు అనుదిన ప్రవర్ధమానంబులగుచు లోకులకు విస్మయముఁ గలుగఁజేయుచున్నవి. ఆ బాలికలుతమ వర్ణ విభేదముగలవారైనను దను వర్ణ విభేదములేమింజేసి తమ వర్ణవిభేదము లేనియట్ల మెలంగఁజొచ్చిరి. వారు వీణలవలె మనోహరస్వరము వెలయింపుచు నుపాధ్యాయునివలన శ్రమగనే పూర్వ మెన్నఁడో చదివి విడిచినట్లు విద్యలం గ్రహింపుచుండిరి. పదియేండ్లు ప్రాయమువచ్చు వరకు నా బాలికలు పెక్కు విద్యలయందు నెక్కుడు పాండిత్యము సంపాదించిరి.

వారు తల్లిదండ్రుల యనుమతి నశనపానశయనాదుల యందును విద్యాభ్యాసమునందును వేరు వహింపక యొకచోటనే కావింపుచుందురు. ఒండొరులను జూడక నరనిమిషమైనను సహింపరు వారి రూప విశేషములు చూచి రంభోర్వశీ మేనకా తిలోత్తములు భూమి నవతరించిరనియు విద్యాసామర్థ్వము చూచి సరస్వతియే నాలుగు మముల జనించినవనియు వైభవము చూచి నృపయే యిట్లు నంచిన సిన విద్వాంసులు కొనియాడుచుందురు.

ధర్మపాలుండు క్షేత్రపతీ నదితీరంబునఁ బొలుపొందు నుద్యానవనంబున గ్రీడాసౌధంబులుగట్టించి యందు వారిని విహరింప నియమించెను. కుసుమకిసలయఫలదళ మనోహరములగు తరులతా విశేషములచే నొప్పారు నప్పూఁదోటలో మణి సౌధంబుల దేవకన్యకలవలె సఖులతో నొక్కసారి గ్రీడింపుచుందురు. పాడుచుందురు. కేరుచుందురు.

ఒకనాఁడు సాయంకాలమున వనవిహారమున నలసి పుష్పాపచయమున డస్సి వేత్రవతీనదిలో జలక్రీడ లాడియాడి వేడుకతో మేడపై గూడుకొని చల్లగాలి సేవింపుచు వారొండొరులిట్లు సంభాషించుకొనిరి.

కళా - అక్కా ! శీలవతీ ! శకుంతసంతానంబులు కోటరంబుల శాఖాంతరంబులఁ గులాయంబులు నిర్మించుకొని యిల్లాండ్రతో బిల్లలతోఁ గాపురములు సేయుచున్నవి. చూచితివా? ఆహా ! ఏమి యీశ్వరమహిమ.

శీల - సఖీ ! పరమేశ్వరుని యద్భుతసృష్టి సామర్ద్య మివియే ప్రకటింపుచున్నవిసుమీ ! మనుష్యులకుంబోలె వీనికిఁ బెండ్లిండ్ల విషయమేమియు వధూవరుల వెదుక నవసరములేదుగదా? మిధునముగానే జనించు చుండును.

విద్యా — అవును. అదియే యుక్తము. తండ్రికొకఁడును తల్లి కొకఁడును గన్యక కొకఁడును ననుకూలుఁడుగా దోచుచుండును. బహుళమందు డెందము సందియ మందక మానదుగదా?

రూప - సత్యము. సత్యము. ఈతఁడే దీనికి బతిగా విధి విధించెనని తెలిసినచో మనసు వ్యభిచరించదు.

కళా — మనుష్యులుమాత్రము స్వతంత్రులాయేమి? నిరూపించినవారినే యిరువరకు నిశ్చయించుకొందురు.

శీల — అది వేదాంతుల యుక్తివచనము. ఆ మాటలు సత్యములని యెట్లు నిశ్చయింపఁగలము.

విద్యా — శాస్త్రములంబట్టి పీటలపైఁ గూర్చుండఁబెట్టిన తరువాత దిరిగి పోయిన పెండ్లిండ్లు కథలు మనమెన్ని వినియుంటిమి.

శీల — సఖులారా ! పెండ్లి యనిన జ్ఞాపకము వచ్చింది మొన్న మాయింట జరిగిన ప్రస్తావము మీకుఁ జెప్ప మరచితిని.

కళా — అది యెట్టిది?

శీల - ధనపాలుఁడు విద్యావతికి నీయేడు పెండ్లిచేయ నిశ్వియించినట మన శీలవతి దానికంటెనించుక పెద్దదిగదా ! ఇంకనుబెండ్లియేల నిశ్చయింపకున్నారు. దొందరపడిన మంచిసంబంధము దొరకునాఅని వివాహకరణాభిలాష సూచింపుచు మాతల్లి తండ్రితో ముచ్చటించినది.

కళా — (విస్మయ నభినయించుచు) ఆమాట కొజ్జలేమనియుత్తర మిచ్చిరి. శీల - (సిగ్గుతో) ఎవ్వరినో నిశ్చయించినట్లే చెప్పిరి. ఆమాటలు తెల్లముగా వినంబడలేదు.

కళా — బళాబళ ! మీ పెండ్లిండ్లు కడుచిత్రములుగా నున్నవి. వయసురాక, కన్యకలయిష్టము గొనక, వరునిఁజూపక వారే నిశ్చయించుచున్నా రేమి? వారికిష్టమైన యతఁడు. వీరి కిష్టము కానిచో నేమి సేయవలయును?

శీల — స్వయంవరము రాజులలోఁగాని, బ్రాహ్మణులలో వైశ్యులలోను లేవు. వయసు రాకమున్న తల్లిదండ్రులు నిశ్చయించినవానినే భర్తగా నంగీకరింపవలయునని ధర్మశాస్త్రములలో నున్నదట. మన మ భాగములు చదివితిమి గాని మరచితిమి.

కళా — ఇసిరో యిదియేమి యాచారము? పదియారేడుల వయసు వచ్చు దనుక స్త్రీ బాలయనియే చెప్పబడుచున్నదిగదా? బాలకు భర్తతోఁ బనియేమి? వయసు రాకముందే పెండ్లియాడినఁ బ్రయోజనమేమి? ధర్మశాస్త్రకారకులు బిడ్డలు లేనివారా ఏమి? ఈ లోపల నెవ్వరికైనఁ బ్రమాదము వచ్చిన నేమి సేయనగును.

శీల - నీ మాటలకు నే నేమి సమాధానము చెప్పుదును వినిన మాటలం జెప్పితిగదా ?

కళా — పోనీ ! యది యట్లుండనిండు. మనము నలువురము ఒక్క ప్రాణముగా నుంటిమిగదా? మా యిరువురకుఁ బెండ్లిండ్లుకాకమున్ను మీరు పెండ్లి యాడుట ధర్మమే.

శీల - మే మాడెదమని చెప్పితిమా ఏమి?

విద్యావతి — అక్కలారా! మీ మువ్వురకుఁ బెండ్లియైనపిమ్మట మీ యనుమతి పడిసి నేను బరిణయం బాడెద. ఇందులకుఁ దప్పితినియేని స్త్రీ హత్యా పాపమునకుఁ బాత్రము నగదును

శీల — (నవ్వుచు) కళావతీ ! నీ అభిలాష యెట్టిదో చెప్పుము. అట్లు నడుచుటకు మేమందరము శపధములు సేయగలము.

కళా - మనము నలువురము నేక కాలమందే వివాహమాడవలయునని నా యభిలాష.

రూపవతి — మనలో నెవ్వతెయైనను వరునివరించినఁచో దక్కిన మువ్వుర యనుమతియు వడయవలయును. ఇదియే నియమము. ఇందులకుఁ దప్పితిమేని గాశీలో బ్రహ్మహత్యఁజేసిన పాతకముఁ బొందగలవారము. ఇందులకు బంచబూతములే సాక్షులు అని ఆ మాటకందరు సమ్మతించి శపధములుజేసిరి. అంతటితో నా యుపన్యాసము ముగించి నిష్క్రమించిరి.

మరియొకనాఁడు యజ్ఞదత్తుఁడు పాఠశాలకరుదెంచి యాబాలలకుఁ బాఠములు సెప్పి యనంతరము రాజపుత్రికంజూచి కళావతీ ! నేడుఁ మీకొక శుభోదంత మెరి గించెద నాలింపుఁడు. నీ సఖురాలు శీలవతికి వివాహము నిశ్చయించితిమి. వరుం డను కూలుండే లభించెను. ప్రాయమునకు మించిన విద్యయున్నది. కొంచెము కోపశీలుండని మాత్రము వింటిమి. బ్రాహ్మణులకు సంపదవిషయమై యరయవలసినపనిలేదు. వివాహముహూర్తము నేటికిఁ బదిదినము లున్నది అని చెప్పెను.

కళా — (ఆమాటవిని రాజపుత్రిక నవ్వుచు) ఆర్యవర్యా ! ఇది ఏమి విపరీతము? శీలవతికిఁ బ్రాయమురానిదే వివాహము సేయబూనితిరేల?

యజ్ఞదత్తుఁడు — అమ్మా ! విప్రఁకన్యకకు సిగ్గుతెలియకమున్నే పెండ్లి చేయవలయునని ధర్మశాస్త్రజ్ఞులు వ్రాసియున్నారు. దానికి మనమేమి చేయుదుము?

కళావతి - తండ్రీ ! ధర్మశాస్త్రకారకులగు మునులు సన్యాసులగుట నట్లు వ్రాసిరి. కానిచో ఎన్నఁడో యౌనము వచ్చునని ముందే పెండ్లి చేయవలయునని ఏల నిరూపింతురు. అందలి ప్రమాదములు వారూహింపరైరి. వృద్ధులకు బుద్ధిజాడ్యము గలిగియుండును గదా. అందులకు వారేమికారణము వ్రాసిరో మీరూహించితిరా ?

యజ్ఞ :- పుత్రీ ! వినుము. కన్యలకుఁ బదియేండ్లు దాటినతోడనే శృంగార చేష్ట లుత్పన్నము లగుచుండును. ఆ లోపలఁ బతి నిరూపణము కానిచోఁ గనుల కింపైన యతనిం జూచినప్పు డీతండు పతియైన లెస్సయగుంగదాయని తలంచుచు మనసును వ్యభిచరింపంజేయును. దానంజేసి కన్యాత్వహాని కాగలదు. అప్పటికిఁ బెండ్లి యాడియుండినచో నట్టి యభిలాష వహించుట కవకాశముండదుగదా. అందులకే సర్వజ్ఞులైన మహర్షులట్లు వ్రాసియున్నారు. అట్టివారిని సన్యాసులని నిందించితివి. గదా?

రాజపుత్రి :- తండ్రీ ! యౌవనమందుఁ బరిణయంబగు తరుణులందరు మనసుచే వ్యభిచరించినవారేనా? దమయంతి, సీత మొదలగు మగువలు బాల్యమునందే వివాహమాడిరా ? వారి పాతివ్రత్యమున కేమి లోపమువచ్చినది.

యజ్ఞదత్తుఁడు :- బాగుబాగు లోతుప్రశ్న వేయుచున్నావుగదా ! అందులకేకాదా క్షత్రియకన్యకలు యౌవనవంతులగునంత నితరపురుషులం జూడకుండ నంతఃపురములఁ గాపాడుచుందురు. బ్రాహ్మణస్త్రీల కట్టి రక్షణము గలుగుట దుర్ఘటము కావునఁ దొలుతనే వివాహము సేయుచుందురు. అదియునుంగాక మంత్ర పూతంబైన హవిస్సు భరింప వైదిశాగ్నియుంబోలె. గర్మిష్టులగు బ్రాహ్మణుల తేజంబు భరింప విప్రకన్యక యతి నిర్మలంబై యుండవలయును. లేనిచో తత్సంతతి కా దోషంబు సంక్రమించెడిని పరిశుభ్ర వస్త్రంబున నణువు సోకినను బెల్ల మగుంగదా.

రాజపుత్రి :- గురువరా ! భూభరణ సమర్థుండగు నరపతి జనించుటకు మాత్రము క్షేత్రం బతిపవిత్రంబై యుండవలదా ?

యజ్ఞ :- ఉండవలదని యెవ్వరనిరి. అయినను దపంబుననకుఁగల నియమంబు పాలనంబున కవసరములేదు.

రాజుపుత్రి :- అట్లయిన వైశ్యులకు నియమమేల గలుగవలయు ? యజ్ఞ:- ఈ కుళంకలిక చాలించి పాఠములు జదువుము నిన్న సీలవతియు నీరీతినే తల్లితో వాదువెట్టికొని తనకిప్పుడు వివాహమక్కరలేదని చెప్పినదఁట. మీరు బబుద్దిమంతులై నందుల కిదియా ఫలము. పో పొండు అని మందలించుటయుఁ గళావతి యాచార్యునికి మారుపలుక నోరు యూరకొన్నది. పిమ్మట నతం డింటికిబోయె.

అని యెరింగించువరకు సమయ మతిక్రమించినది. మరి సిద్ధుం డంతటితో నా కథ నుడుపుట విరమించి యనంతర నివాసదేశంబనఁ దరువాతికథ నిట్లని చెప్పఁదొడంగెను.

అరువది ఎనిమిదవ మజిలీ కథ

నిగమశర్మా ! మరలఁ జెప్పుము. వివాహములు రెండు నొక లగ్నమందే జరుగునాఁ ఈరేయి నెంతప్రొద్దు పోవును. మాబోటి పెద్దవాండ్రకు గొప్పచిక్కే తటస్థించినదిగదా యజ్ఞదత్తుఁడు కన్యాదాన కాలమందు షోడశ మహాదానములు గావించుట నిజమేనా ?

నిగమశర్మ :- పెద్దిభట్టుతాతా ! పెండ్లిండ్లు రెండును గుంభలగ్నమందే సేయ నిశ్చయించినారు. రాత్రి జాముప్రొద్దుండును. మన సదుపాయములు చూచి వారు ముహూర్తము లుంచుదురా యేమి ? యజ్ఞదత్తుండేకాదు. ధనపాలుండను బ్రాహ్మణసత్కార మధికముగాఁ జేయునని చెప్పుకొనుచున్నారు. పండితులకు శాలువలు గుండలములు ధోవతులు మిక్కిలి వెలగలవి పెక్కు తెప్పించినాఁడట.

పెద్దిభట్టు :- నిగమశర్మా ! మనము దొలుత నెక్కడికిఁ బోవుదము? ఉభయత్ర సంభావన జరుగు నట్లాలోచింపుము.

నిగ :- ఏదియో యొకచోట నమ్మియుండవలయును గాని యత్యాసకుఁ బోయిన రెంటికిఁ జెడుదుము. ధనపాలు నింటికే పోవుదము.

పెద్ది - కాదు కాదు. ముందు యజ్ఞదత్తునింటి కరిగి వానికిఁ గనంబడి పిమ్మట ధనపాలునింటి కరుగుదము. అట్ల యిన రెండుచోట్ల బహుమతులు దొరకఁ గలవు.

నిగః- ఉండుముండుము. ఏదో కోలాహలము వినఁబడుచున్నది.

పెద్ది:- పెండ్లివారియింట్లో కోలాహలముగా నుండదా?

నిగః- కాదు కాదు. ఏడుపులాగు వినఁబడుచున్నది. (ఆలకించి) అవును. ఏడుపే. ఏడుపే. పెండ్లివారి యింట్లోనే !

పెద్ది:- ఏమి చెప్మా? పెండ్లిండ్లు ఆగిపోవవుగద. గంపెడాస పెట్టుకొని వచ్చినాము.

నిగ:- అబ్బో ! ఆయల్లరి పెద్దగా వినఁబడుచున్నది. తెలిసికొని వచ్చెద నిందేయుండుఁడు. (అనిపోయి తెలిసికొనివచ్చి')అయ్యో! అయ్యో! తాతా ! ఇఁక