కవిజనాశ్రయము/ప్రక్షిప్తపద్యములు
[1]ప్రక్షిప్తపద్యములు.
క. [2]శ్రీవల్లభు యతిగణసం
సే(వితపా)దారవిందుఁ జింతితఫలదున్
భావజగురు నలఘుచ్ఛం
దోవినుతు మురారి భక్తితో వినుతింతున్.
పఙ్త్కిచ్ఛందంబునందు :-
మనోరమావృత్తము.
నరజగంబులన్ మనోరమన్
బరఁగు షడ్యతిం బఠింప నౌ'. 1
మణిరంగవృత్తము.
సప్రసాదరసాగము లొందున్
దీప్రబాణయతిన్ మణిరంగన్. 2
పంచకమలావృత్తము.
పంచకమలాఖ్యన్ భయసల్గం
బంచితముగా షడ్యతిఁ జెందున్. 3
తిష్టుప్ఛందంబునందు :-
ఉపజాతివృత్తము.
ఈ రెండువజ్రంబులు నిందుఁ గూడన్
సరోజనేత్రా! యుపజాతి యయ్యెన్. 4
మందారదామవృత్తము.
ఆఱింట విశ్రాంతి యై తాతగాస్వా
ధారంబు మందారదామంబు రుద్రా! 5
సుముఖవృత్తము.
నజజవమున్ శరవిశ్రమమున్
సుజననుతా! సుముఖం బెసఁగున్. 6
జగతీఛందంబునందు :-
పుటవృత్తము.
నగయుతయతితో నాతయుతం బై
యగణము తగ ఫాలాక్ష ! వుటం బౌ. 7
చంద్రవర్త్మవృత్తము.
చంద్రవర్త్మ మగు సామజయతితోఁ
జంధ్రజూట ! రనభంబు నగణమున్. 8
కుసుమవిచిత్రవృత్తము.
కుసుమవిచిత్రం గొను నయయుగ్మం
బసదృశషడ్యత్యభిహిత మైనన్ . 9
ఉజ్జ్వలవృత్తము.
స్మయరుచి తలషడ్యతి నుజ్జ్వలా
హ్వయము ననభరావళిఁ జెందినన్ . 10
అతిజగతీఛందమునందు :--
ప్రీతివృత్తము.
నగణత్రయమున్ జగసంయుతంబుగా
నెగడు న్నిధివిశ్రమనీతిఁ బ్రీతికిన్. 11
సుమంగలీవృత్తము.
సజసంబుతో సగము సంగతితో సా
మజవిశ్రమంబున సుమంగలి యయ్యెన్. 12
క్షమావృత్తము.
ననతతగములన్ నవ్యభూభృద్యతిన్
వినుతమయి క్షమావృత్త మొప్పు న్మహిన్. 13
శక్వరీఛందమునందు :-
జలంధరవృత్తము.
వ్రాలిభకారమునున్ భభజవంబులతో
లాలితకీర్తి! దిశాయతి జలంధర యౌ. 14
లోలావృత్తము.
భూతేశా! మసమంబుల్ పొందంగా భగగంబుల్
స్వాతంత్ర్యక్షితిభృ ద్విశ్రామం బొందును లోలన్. 15
కమలవిలసితవృత్తము.
కమలవిలసితము కలయతితోడన్
గ్రమమున ననననగగములు గూడన్. 16
అతిశక్వరీఛందమునందు :-
మాలినీవృత్తము.
ననమయయయుతంబు న్నాగవిశ్రాంతమై యి
ట్లనుపమ మగుమాలిన్యాహ్వయం బయ్యె ధాత్రిన్ . 17
మణిగణనికరవృత్తము.
మనులఘుగురుకము మణిగణనికరం
బనఁ జను నెనిమిది యగునెడ యతిగాన్. 18
[3]శాంతివృత్తము.
ఒందుగా రజద్వయంబు లొప్పు రేఫతో జనా
నందకారి శాంతి యయ్యె నాగవిశ్రమంబుతో. 19
సుకేసరవృత్తము.
హరినిభమూర్తి! సత్కవిజనాశ్రయా ! సుకే
సర మగు దిగ్యతి న్నజభజంబు రేఫతో. 20
మనోజ్ఞవృత్తము.
నజజభరప్రకరంబున న్నిధివిశ్రమం
బజితమనోజ్ఞ మగున్ నయం బొనగూడఁగాన్. 21
మాలతీవృత్తము.
కరటివిరతి నారకాంత యాయుక్తి తోడన్
మరిగి తిరిగి చెప్ప మాలతీవృత్త మయ్యెన్. 22
ప్రభద్రకవృత్తము.
రజనిచరాన్వవాయహర ! రామ ! రాఘవా !
నజభజరల్ ప్రభద్రకము నవ్యదిగ్యతిన్. {{float right|23||
చంద్రరేఖావృత్తము.
సారంబై చంద్రరేఖన్ జంచన్మరేఫల్ మయాసం
చారంబుం జెంది పొందున్ సప్తోదయద్విశ్రమం బై. 24
హంసయానావృత్తము.
ఆనతారిరేచ ! హంసయానకొప్పుఁ గుంజర
స్థానవిశ్రమంబుగా రజద్వయుబు రేఫతో. 25
ఆకృతిచ్ఛందమందు :-
విచికిలప్తబకవృత్తము.
శబర నికృతిధర ! పురహర ! సవితృవిరతి విచికిల
స్తబకమున నిరువదిలఘువులు చన లగ మొగిఁబెనఁగున్.[4] 26
వికృతిచ్ఛందంబునందు :--
పద్మనాభవృత్తము.
ఎన్నంగ నీతం డనాద్యంతుఁ డంచుం బ
రీక్షింతు రెవ్వాని వాఁ డెల్లనాఁడున్
నన్నేలు నా నర్కవిశ్రామ మై పద్మ
నాభం బగున్ సప్తతంబుల్ గగంబున్. 27
మత్తాక్రీడితవృత్తము.
మత్తాక్రీడితం బన్ వృత్తం బౌఁ ద్రిదశయతి
మయమననననవముల్. [5] 28
- ↑ 25 వ పద్యము క-లో నున్నది. 14 వ పద్యము ద-లో నున్నది. తక్కినవన్నియు బ-లో నున్నవి.
- ↑ ఈపద్యము విష్ణుపరము గా నుండుట చేతను గొంచెము మార్పుతో ఛందోదర్పణములో నుండుటచేతను బ్రక్షిప్తము. 1 మొదలు 26 పద్యములలో యతిస్థానము చెప్పబడినది. ఈఛందస్సులక్రిందఁ బుస్తకములోని పద్యములలో యతిస్థానములు చెప్పఁబడలేదు. చెప్పకుండుటయే కవిమత మైనట్లు తోఁచుచున్నది. కావున నివి ప్రక్షిప్తములు. 27 వ పద్యములో శివసంబోధస ముండుటచేఁ బ్రక్షిప్తము. 28 వ పద్యము, అనంతునిఛందస్సులోని పద్యమునం దుత్తరార్థ మగుటచేఁ బ్రక్షిప్తము.
- ↑ అప్పకవీయములో దీనికే సుగంధి యని పే రున్నది.
- ↑ ద్వితీయపాదమందు యతి చెడినది.
- ↑ యతి చెడినది. మత్తాక్రీడాఖ్యం బెంపారు న్మమతననననవమహిత మగుచు ర,త్నాత్తబ్రహ్మశ్రాంతు
ల్గ్రందై (అప్పకవీయము).