కవిజనాశ్రయము/జాత్యధికారము
శ్రీరస్తు.
కవిజనాశ్రయము
జాత్యధి కారము.
- కందము. -
క. ఆది గురు విడిన గురువే
పాదాదుల నెల్ల నిలుపఁబడుఁ గందములం
దాది లఘు విడిన లఘువే
పాదాదుల [3]నిలుపవలయుఁ బరహితచరితా! 3
క. [4]వెలయఁగ గాభజసనలం
బులు నేనును గాని కందమున కొండు గణం
బులు చొరవు, వానిపాదం
బుల నిడు నది మూఁడు నేను మూఁడు న్నేనున్. 4
క. [5]హిమకర పుర శర నగముల
నమరుపఁగాఁ జనదు జగణ మందలిరెండ
ర్ధములన్ నల ముండె జకా
రమొండె నాఱవయెడం దిరము గావలయున్.[6] 5
క. [7]కందము - త్రిశరగణంబుల
[8]నందును, గాభజసనలము లైదునె గణముల్ ;
పొందును నాఱిట నలజము,
లొందుం దుదిగురువు, జగణ మొప్పదు [9]బేసిన్. 6
క. [10]నెల వెఱిఁగి నిడుదపాదం
బుల నాలవగణము మొదలఁ బొదలఁగ నిడఁ గా
వలయును వ ళ్లాపాదం
బులతుద గురు వమరఁ గందమున కిడవలయున్. 7
- ఆర్య. -
క. [11]క్రమమునఁ గందము రెండ
ర్ధములతుదన్ గురువు లుంచి, తప్పక కడయ
ర్ధము నాఱవయెడ లఘు విడ
నమితగుణైశ్వర్యధుర్య ! యది యార్య యగున్. 8
- తెనుఁగు జాతులు.[14] -
క. [15]వెలయంగఁ దెనుఁగు బాసకుఁ
దల మయ్యెడు సీసములును దర్వోజలు గీ
తులు నక్కరలును ద్విపదలు
పొను పొందఁగ రేచఁ డిష్టమున నొనరించున్[16] . 10
- సీసములు. -
క. [17]ధాత్రిన్ గవిత్వతత్త్వము
పాత్రతఁ గడునొప్ప వెలయుఁ (బ్రాజ్ఞులచేతన్)
మాత్రోక్తి నష్టగణముల
మాత్రలు సీసముల కెల్ల మల్లియరేచా ![18] 11
క. [19]నలనగసలభరతలలో
పలనాఱును మీఁద రెండు పద్మాప్తగణం
బులుగా నాలుగు పదములఁ
జెలు వగు నొకగీతితోడ సీసం బమరున్. 12
క. నలనగసలభరతగణం
బులు నొడఁబడి వాని పాదముల నొక్కటి యై
కలయ[20] నహంబులు నట్లన
కలయ నొడంబడి పెనంగుఁగాఁ దమలోనన్. 13
వ. సీసంబు లన్నవి విషమసీసంబులు, సమసీసంబులు నన రెండు దెఱంగు లయ్యె. అందు,
విషమసీసం బెట్టి దనిన.
[21]ఊహ నేడు గణములుగను నొనర నగణ మొండెఁ ద
త్సాహచర్యమొండె గురుకసహితముగ నొనర్ప ను
త్సాహ మయ్యె నిదియునుం బ్రశస్తముగ నొనర్ప ను
ర్వీహితోరుచరిత యదియ విషమసీస మై చనున్
బ్రాలు వళ్లు లీల నోలిని నిలిపి యా
గణమ కాని యొండుగణము లిడక
యభినుతార్థరచన యభినుతమై యుండఁ
జెప్ప విషమసీస మొప్పుఁ గృతుల. 14
- అవకలిసీసము. -
పాదంబు నాలుగుపాదముల్ గాఁ జేసి[23]
మొదలిమూఁటికి లోకవిదిత మైన
యలయాఱు[24]గణములు వెలయ (నిర్ )మూఁ డిడి
మానుగాఁ దక్కినవానియందు
నగణముల్ రెం డిడి తగఁ గూడఁ బాదముల్
నాలుగు నిప్పాట నోలి నిలిపి
సమసీసములు చెప్పుఁ డమరంగ రెంటికిఁ
బ్రాసముల్ వేఱుగాఁ జేసి యొనర
గీ. సలలితముగ నిట్లు విలసత్పదంబుల
రసికమైనరచన లెసఁగి యుండఁ
గవిజనాశ్రయాంకుఁ డవకలిసీస మి
ప్పాటఁ జెప్పఁ బనిచెఁ[25] దేటపడఁగ[26]. 15
- ప్రాససీసము ; అక్కిలిప్రాససీసము. -
ప్రాసంబు నాలుగుపాదంబులందును
బన్నుగా నిడి పెఱపాదములను
భ్రౌసంబు లిడక తత్పాదంబులం దెల్లఁ
బన్నుగా వ ళ్లట్లు [27]పరఁగ నిలిపి
దేసి తెనుంగులఁ[28] దియ్యనినొడువులఁ
దెల్లంబుగా నర్ధదృష్టి దెలుపు
ప్రాససీసము దీని పశ్చిమార్ధంబునఁ
బ్రాసంబు వేఱొక్క ప్రాసమైన
గీ. [29]శ్రీసమేతుఁ డైన జినపాద [30]పంకజా
వాసమధుకరుండు వాసవప్ర[31]
హాసభాసి[32] రేచఁ డనవద్యుఁ డక్కిలి[33]
ప్రాససీస మనుచుఁ[34] బరఁగఁ జెప్పె. 16
- వడిసీసము ; అక్కిలివడిసీసము. -
వివిధ చతుష్షష్టివిద్యల నజుఁ డని
వినుతనయోపాయవిమలబుద్ధి
నమరేంద్రగురుఁ డని యధిక తేజంబున
నాదిత్యుఁ డని సుందరాంగ యుక్తి
నంగజుఁ డని యీగి నంగాధిరా జని
యలవున నభిమన్యుఁ డని సమస్త
జనులు ముదంబున శ్రావకాభరణాంకు
సత్కవిఁ గవిజనాశ్రయు గుణాఢ్యుఁ
గీ. బొగడుచుండుదు రని యి ట్లపూర్వరచన
నలరఁ జెప్పిన వడిసీస మయ్యె దీని
పశ్చిమార్ధంబు వడి యొండు పాట నిలుప
నదియె యక్కిలి[35] వడిసీస మయ్యెఁ గృతుల.[36] 17
వృత్తంబునకు వలె వెలయు నాల్గడుగుల
వెసఁ బ్రాసములు నిల్పి విరతు లునుపఁ
బ్రాససీసం బగుఁ, బశ్చిమార్ధము నట్లు
భాసిల్ల నక్కిలి ప్రాససీస
మమరు; మున్ గైకొన్నయతి పాదమం డెల్ల
నడరిన వడిసీస మనఁగఁ బరఁగు,
నర్ధమర్ధమునకు యతులు వేఱైచనఁ
జెప్ప నక్కిలివడిసీస మయ్యె;
గీ. నవకలికి నిట్లు ప్రాసంబు లతిశయిల్లు,
యతులు ప్రాసంబు లిష్టసంగతుల నడవ
నదియె సమసీస మలరును ; దుదను గీతి[37]
పరఁగ విషమసీసం బగు భానుతేజ ![38] 18
- తరువోజ. -
[39]నలనామగణము లినగణంబుతోడ
నాలుగుగాఁ జేసి నాటించి యిట్లు
కలయంగ నెనిమిది గణములై రెండు
గణములతుద యతిగా నిల్పి యమర
వెలయంగఁ బాదముల్ విరచింప వళ్లు
వేర్వేఱ నిప్పాట విదితమైయుండ
సలలితగతిఁ గృతి చనఁ జెప్పుఁ డనియె
జానుగాఁ గవిజనాశ్రయుఁడు తర్వోజ. 19
- గీతులు. -
వ. మఱి గీతు లన్నవి విషమగీతులు, సమగీతులు నన రెండు తెఱంగు లయ్యె. [40]అందు విషమగీతులు ఎత్తుగీతి, ప్రగీతి, మేలన[41]గీతి యనం బరఁగె, అందు,
- ఎత్తుగీతి. -
[42]శ్రీదయితాధిపా న
యోదయ వల ననత్ర
వినుతమేలనమనుగీతి విస్తరంబుగాఁగ
జననుతుండు చెప్పె వరవిశాలకీర్తియుతుఁడు. 22
- [49]ఆటవెలఁది ; తేటగీతి. -
ఇనగణత్రయంబు నింద్రద్వయంబును
హంసపంచకంబు నాటవెలఁది;
సూర్యుఁ డొకనిమీఁద సురరాజు లిద్దఱు
దినకరద్వయంబు తేటగీతి. 23
- అక్కరలు. -
క. [50]వినుతద్విత్రిచతుర్గురు
జనితగణంబులు రవీంద్రచంద్రాఖ్యము లై
చను నక్కరజాతుల కె
ల్లను, నాదిమ(లఘువు) మొదల లఘు విడవలయున్. 24
వ. అవి మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర, అల్పాక్కర లనునేను తెఱంగు లయ్యె. అందు,
- [51]మహాక్కరము. -
<poem>
[52]అమరఁ బ్రావళ్లు రెండునాఁ జెలఁగి నా
ల్గగుచోట విరతి యాదిత్యుమీఁద
నమరపతి రెండు మూఁడు నాల్గైదు నా
ఱగుతావులను నిల్పి సొబగుమీఱ
నమరఁ జేయుచుఁ జంద్రు నే డగుచోట
నదికిన యేడుగణములలోనఁ
గ్రమము తప్పక యప్పాటఁ బెద్దయ
క్కర మొప్పఁ గవిజనాశ్రయుఁడు సెప్పె. 25
- మధ్యాక్కరము. -
[53]సురరాజు సురరాజుఁ గూడి
సూర్యుతో నొడఁబడి మఱియుఁ
గరమొప్ప నిప్పాట నాఱు
గణములు మధ్యాక్కరంబు
విరచింపఁ బంపెఁ బ్రావళ్లు
వెలయఁ గవిజనాశ్రయుండు
సురుచిరముగను సుశబ్ద
శోభితం బగునట్లు గాఁగ. 26
- మధురాక్కరము. -
[54]రవి దివిజరాజ [55]గీర్వాణరాజ దేవాధిదేవ
కువలయప్రియు లిప్పాటఁ గూడ నేనుగణములు
నవిరళముగఁ[56] బ్రావడి మధురాక్కరంబు ధరలోనఁ
గవిజనాశ్రయుం డెఱిఁగించెఁ గవుల కింపుజనియింప. 27
- అంతరాక్కరము. -
[57]ఇన సురేంద్ర చంద్రంబు లిప్పాట వచ్చి
పొనరి యుండంగఁ బ్రావళ్లు పూర్వభంగి
న నగణంబులు నాలుగింటం బెనంగ
ననుపమానాంతరాక్కర మయ్యె రేచ. float right
- అల్పాక్కరము. -
[58]ఇంద్రుండు మఱియొక్కయింద్రుఁ గూడి
చంద్రుతో నొడఁబడి చనిన సత్క[59]
వీంద్రు లల్పాక్కరం బిది యందురు[60]
చంద్రాస్య ! కవిజనాశ్రయకవీంద్రా ! [61] 29
- ద్విపద. -
[68]షట్పదము.
గద్యము. [71]ఇది వాదీంద్రచూడామణిచరణసరసీరుహమధుకరాయమాన శ్రావకాభరణాంకవిరచితం బైనకవిజనాశ్రయంబనుఛందంబునందు జాత్యధికారము.
- ___________
- ↑ క-డ-ల-లో, శ్రీకాంతాసఖుఁడా శాం, తాకాంతనితాంతకాంతుఁ డగురేచన వా, క్ఛ్రీకమనీయుఁడు (శేషము సమానము). ద-లో, శ్రీకాంతాసఖుఁడును గాం, తాకాంతనితాంతకాంతుఁ డగుచు- సదావా,
క్ఛ్రీకమనీయుఁడు (శేషము సమానము) - ↑ క-ప-డ-లలో, ఖ్యాతగణప్రతతిఁ జెప్పఁ గందము లార్యాగీతులు మెదలగఁ గలయని (శేషము సమానము)
- ↑ ద-నిడఁగ.
- ↑ ప-ద-లలో లేదు. గిరిశంధూర్జటి శర్వం, పురారి మఖరిపు వెనిప్పవింతెయ్దుగణం, బరె శశిపురవిషయాద్రియొ, ళిరదిర్కె, పురారి యెంబగణమబ్జముఖీ. (కర్ణాటకచ్ఛందోంబుధి)
- ↑ శశిపురబాణాద్రిగళొళ్ , బిసజముఖీ! మధ్యగురుగళాగల్ కందం, పుసియలై ? గండనిల్లద,
శశివదనెగె గర్భ మాద తెఱనొళ్ కెడుగుం, (క-చం.) - ↑ ఈ పద్యము తరువాత ప-ద-లలో- ద్వాదశ మాత్రలు మొదలిడఁ, బాదం బగు నాద్వితీయపాదంబునకున్, ద్వాదశమాత్రలు చన యతి, కాఁ దగు వసుమాత్ర లర్ధకందము రేచా! అను పద్య మున్నది.
- ↑ కందము త్రిశరగణంబుల, నందము గాభజసనలము లట వడి మూఁటన్ ,బొందును నలజల నాఱిట, నొందుం దుదగురువు జగణముండదు బేసిన్ (సులక్షణసారము) .
- ↑ ప -నందముగా భజసనలములటముని యతిపై. ద-నందము గగభజసనలములైదే గణముల్.
- ↑ ద- ముండదు.
- ↑ ప-లో లేదు.
- ↑ లక్ష్మైతత్సప్తగణా గో పేతా భవతి నేహ విషమేజః ! షష్ఠోయంచ నలఘువా ప్రథమేర్ధే నియత మార్యాయాః, షష్ఠేద్వితీయలాత్పర కేన్లేము ఫలాచ్చసయతి పదనియమః | చరమే౽ర్దేపంచనుకే తస్మా దిహ భవతి షష్ఠోలః. (వృత్త రత్నాకరము). మిగదేళ్, గణముంబ కాన్ ,ర్య గెముంతం తుదియె ళొందె గురుతాంబంది , న్న గలదె పదార్థదొళ్ శిశు, మృగాక్షి ! లఘు వొందె బందు నిల్కుంరసదొళ్. మొదలొళ్ పన్నెరడె రడనె, యదఱొల్ పది నెంటు మూఱఱొళ్ పన్నెరడం, త్యదపాదదల్లి పదినె,య్దదుమాత్రా నియమ మార్యె యొళ్ వనజముఖీ (కర్ణాటచ్ఛందోంబుధి). కందపద్యము ద్వితీయ చతుర్థ పాదాంతగణములకుబదులు గా నొక్కొక్కగురువును , చతుర్థపాదమం దాఱవగణమునకు బదులుగా నొక్క లఘువును బెట్టినచో నది యార్య యగును. ఆర్యప్రథమతృతీయపాదములకుఁ బన్నెండేసిమాత్రలును, ద్వితీయ పాదమునకుఁ బదు నెనిమిది మాత్రలును, చతుర్థపాదమునకుఁ బదియేను మాత్రలునుండును.
- ↑ ఆర్యాప్రథమార్ధమును బోలియే ద్వితీయార్ధముకూడ నుండిన నది గీతి యనియు , ఆర్యాద్వితీయార్ధమును బోలి ప్రథమార్ధము కూడనుండిన నది యుపగీతియనియు , ఆర్యా పథమార్ధమునుబోలి ద్వితీయార్ధమును, ద్వితీయార్ధమునుబోలి ప్రథమార్ధము నుండినచో నది యద్గీతి యనియు నర్థము. ఈలక్షణములు వృత్తరత్నాకరమునందలి లక్షణముల ననుసరించి యున్నవి.
నృత్తరత్నాకరమం దార్యాగీతి యను నింకొకగీతి చెప్పఁబడినది. దానిలక్షణము:- ఆర్యాపూర్వార్ధం యది గురు ణైకే నాధికేన నిధనే యుక్తం, ఇతర త్తద్వన్నిఖిలం దలం యదీయ ముదితే౽యమార్యాగీతిః. ఇది కందపద్య లక్షణమునకు సరిపోవును. ఛందో౽ంబుధిలో గీతిమాత్రము చెప్పఁబడియున్నది. - ↑ ద-తత్క్రియఁ బశ్చా,ర్ధమునందుఁ జెప్పఁగా నీ, వీనితో సాంస్కృతికజాతులు. సమాప్తము.
- ↑ ఈశీర్షిక మాతృకలో లేదు.
- ↑ చూ. అర్ణవ జాతాననె సం, పూర్ణతెయిం సకలవిషయ భాషాదిగళం, నిర్ణయమాగఱుపిదెనాం, కర్ణాటక భాషెయందమం కేళ్ పేళ్వెం. (కర్ణాటకచ్ఛందోంబుధి.)
- ↑ చ-లోద గ్వోజలు నం, దుల షట్పదములు నక్కరములు ద్విపదలు రేచఁ డిష్టముగ నొనరించున్. ప- 4- వపాదము. బలురగడలు మంజరియును బలుకుదుఁ గృతులన్.
- ↑ సీసమునం దష్టవిధము లగుమాత్రాగణము లుండు నని యీపద్యము నుత్త రార్ధము భావము.
- ↑ క -ప - లలో, మాత్ర వసు దశమ నవష, ణ్మాత్రలు సీసముల కెల్ల మల్లియరేచా. మఱియొకపాఠము. మాత్రోక్తి దశమ నవష, ణ్మాత్రలు మాత్రలకు నెల్ల మల్లియరేచా.
- ↑ చ - నలనగసల భరతగణం, బులు గూడఁగ వానిపాదములు నొక్కెడలన్ , గలయ నహంబులు రెండున్, గలయన్ సీసము బెడంగుగా నిడవలయున్.
- ↑ ద-గలుగు.
- ↑ ప-లో, ఊహనాఱు నినులగణము లొనరరగణ మొందఁ ద , త్సాహచర్య మాదిగురువుసహితముగ నొనర్పను , త్సాహమయ్యె నిది వినం బ్రశస్తముగ రచింపను. (నాలుగవపాదము సమానము.) గీతము లేదు.
- ↑ ద-లో అంకిలి సీస మొక్కటి యధికముగాఁ బేర్కొనఁబడినది.
- ↑ ద-పాదంబులుగఁ జను.
- ↑ చ-డ-ద-నల నామ.
- ↑ ద-దొడఁగె.
- ↑ చ-ప్పాటఁ జెప్పెఁ గృతులఁ దేటపడఁగ.
- ↑ చ-పదిలపఱచి.
- ↑ క-చ-దేసి తెనుంగున.
- ↑ ఈగీతము ప-లో లేదు.
- ↑ ద-శ్రీపాద.
- ↑ క-వాసవసర.
- ↑ చ-భాస.
- ↑ ద-రేచఁ డనుపండితుం డిట్లు.
- ↑ చ-సీసములను, ద-సీసమరసి.
- ↑ ద-యంకిలి.
- ↑ ద-లో నీపద్యము పిదప -- సీసము రెండుగణంబులఁ, బ్రాసంబై మఱియు నిధివిరామం బైనన్ , భాసిల్లు దీనిమీఁదను, జే సిననియమములచేత సీసము లయ్యెన్. అను పద్యమున్నది.
- ↑ ద-నదియె సమసీస ముత్సాహతుదను గీతి.
- ↑ స-యును విషమసీస మిఁక విను ముత్తమగుణ. ఈపద్యము పిదప, ప-లో "ఈక్రమానఁ బ్రాససీసము, అక్కిలి ప్రాససీసము , వడిసీసము, అక్కిలిపడిసీసము, అవకలిసీసము, సమసీసము అనఁగా నాఱు తెఱంగు లయ్యె" ననియుఁ, బిదప "ఊహ నా ఱునినుల గణము లొనర" ఇత్యాది పద్యమును గలవు.
- ↑ ద-లో "సీ. నలనామషట్క మినగణద్వయంబుతో నాలుగుగాఁ జేసి నాటి యిట్లు! కలయంగ నెనిమిదిగణము లయ్యెను రెండు గణములతుద యతిగాఁగ నమర | వెలయంగఁ బాదముల్ విరచించి వళ్లు వేర్వేఱ నిప్పాటను విదితముగను. సలలితగతిఁ గృతి చనఁ జెప్పుఁడనియెను జానుగాఁ గవిజనాశ్రయుఁడు దనర.” ఇది సీసపద్యలక్షణముగాని తర్వోజలక్షణముగాదు.
- ↑ "అందు విషమగీతులు వైతండికంబు లనం బరఁగె" నని కొన్ని ప్రతులలో నున్నది.
- ↑ ద- మెలకగీతి.
- ↑ లక్షణ మస్పష్టము. ఒక యింద్రగణము రెండు సూర్యగణములుచేరి యొకపాదమని లక్ష్యము తెలుపుచున్నది. ప్రాసమున్నది. యతిలేదు. సురనాథుమీఁద సూరు లిరువురు రెంట విరతి, ధరణిఁ బ్రాసంబు దనరు నెత్తుగీతియందు. —అప్పకవీయము (వావిళ్లవారి ప్రతి) ఇందు నాల్గవపాదమున గణభంగ మున్నది. రెండవపాదమందు యతి లేదు.
- ↑ క-గీతి యయ్యెఁ గృతులందు.
- ↑ ఈలక్షణ మాటవెలఁదికిని జల్లును, గాని యందుఁ బ్రాసము లేదు. 2, 4 పాదముల చివర నగణము నుండ పచ్చును. దీనినే యప్పకవి పవడగీతి యని వాడెను
- ↑ సేసి + ఇనగణములు.
- ↑ ప్రాసమువిచారణీయము . మూఁడు, పోఁడి శబ్దములు పూర్ణానుస్వారమధ్యములుగా
గ్రహించినచోఁ బ్రాసము సరిపోవును. - ↑ క-డ-లలో మాత్ర మున్నది. క-లో 2, 3 పొదములు- ఘనతరంబుగాఁగ నిట్లు గలసియుండ
నిలిపి, వినుత మేలగీత విస్తరంబుగాఁగ (రెండవపాదమం దొకగణము లోపించినది.) డ-1వ పాదము. ఒనర నయినగణము లొప్పఁ బెరసియుండ. (ఒక గణము లోపించినది). - ↑ ఏడు + అ = ఏడ. ఐనగణములు = ఇనసంబంధ గణములు. హగణ మైనఁ జాలు నగణమైనఁ జాలు హగణ 1 నగణములును రెండు గలసి నాటియంఘ్రికేడు 1 తగినవిరతి నాలుగింటఁ దనరఁ బ్రాస మొదవి! మిగుల మెఱయుచుండుఁ గృతులఁ గమలనాఖ్యగీతి. (అప్పకవీయము.) నాల్గవపాదమందు యతిభంగ మగుటచేఁ గవియభిప్రాయము "మేలనాఖ్యగీత" యని యైనఁ గావచ్చును.
- ↑ దీనికి ముందు ద-లో “అందు సమగీతులలక్షణంబు లెఱింగించెద" నని యున్నది.
- ↑ రెండు గురువులతోఁ బ్రస్తరించినచో నాలుగు గణములును, మూఁడు గురువులతోఁ బ్రస్తరించినయెడల నెనిమిదిగణములును, నాలుగు గురువులతోఁ బ్రస్తరించినఁ బదియాఱుగణములును బట్టును. వీనిలో మొదటి రెండేసి గణములు విడిచి, తక్కినగణములలో నాదిని లఘు వున్నగణముల యాదిని మఱియొకలఘు విడిన రెండుసూర్యగణములు, నాఱింద్రగణములుఁ, బదు నాలుగు చంద్రగణములు నైనవి. ఈగణములే యక్కరలయందు వచ్చును. విడిచిపెట్టిన యాఱుగణములు కలిపికొనినచోఁ గర్ణాటచ్ఛందోనుసారముగ నాలుగు బ్రహ్మగణములు, నెనిమిదివిష్ణుగణములుఁ, బదియాఱు రుద్రగణములు నగును. చూ:- ఎరడుం మూ ఱుం నాల్కుం, గురువిం ప్రస్తరిస లంబునిధి గబ ధరణీ,శ్వరగణ మొగగుమనర్కం, సరసిజభవ విష్ణు రుద్ర సంజ్ఞెగళక్కుం. కరపురవార్ధియాగె గురువాగిరె తద్గురువిందదోధసా, గిరె లఘుయుగ్మమాక్రమదె ముంతెసమం కడెవట్ట బిణ్పిదొళ్, బరెలమురొందె; పింతెలఘు; ముంతెసమం; మొదలిం తగుళ్దుపం, కరుహదళేక్షణే! గణ దునింతిడు సర్వలఘుత్వమప్పినం. (కర్ణాటచ్ఛందోంబుధి).
- ↑ దీనికి ముందు ద- లో జంద్ర సూర్యేంద్రగణవివరణ మున్నది. ప-ప్రతి యింతటితో సరి.
- ↑ ఈపద్యము ద-లో మాత్రమున్నది. ఈగణ నియమము కన్నడములోని పిరి ( పెద్ద) యక్కరగణనియమమునకుఁ జేరియున్నది చూ. మొదలొళజగణం కుందదె బక్కత్తమెయ్దుగణంగళె విష్ణువక్కుం! తుదియొ ళెంబ తాణదొళెల్లియుం కందర్పరిపుగణం నెలసినిలక్కె ! పదదొళెర డెంబసంఖ్యెయొళాఱఱొళజగణం సమవాయ మప్పాడక్కుం! సదమళేందునిభాననే! కర్తృవినిష్ట దినరిదు పిరియక్కరం (కర్ణాటచ్ఛ దోంబుధి),
- ↑ చ-డ-లలో నాల్గవపాదము లేదు.
- ↑ క-చ-డ-ద-లలో నున్నది.
- ↑ ద-రవియు దివిరాజు.
- ↑ ద-నవిరతముగ. గణనియమమున మధ్యాక్కర కన్నడములో దొరె (సమాన) యక్కరమునకును, మధురాక్కర నడువ(మధ్య)ణక్కరమునకును జేరియున్నవి. వానిలక్షణములు. సరసిజోదరగణ మెరడ జనుమల్లి నెరెదిక్కెమత్తం! సరసిజోదరగణమెరడ జనుమక్కెగణముమాఱక్కుం | సరసిజలోచనె! దొరెవెత్తగణదిందొరెవెత్త పెసరిం ! దొరియాగి పఁదుదు దొరెయక్కర మదనఱివుదీ తెఱదిం. జలజసంభవ గణమక్కె మొదలొళే నడువెమూఱుం | జలరుహోదరగణమక్కె కామాంతకగణమక్కుం | తిలకదంతిరె తలెయొ ళేబందిక్కె - కామబాణా! వళియపొంగె య్దె గణమక్కె నడువణక్కరకె సఖీ! (కర్ణాటకచ్ఛందోంబుధి.)
- ↑ ప్రథమపాదమందు యతి విచార్యము. ఇది కన్నడమం దెడె (ఆంతరము)యక్కరకుఁ జేరి యున్నది - వనజసంభవగణమక్కె మొదలొళత్తల్ ! వనరుహోదరగణయుగళమదక్కె రుద్రనదఱంత్యదొళ్ బందిక్కె నాల్కెగణ! వినితె, వని తె! కేళ్ ఎడెయక్కరక్కి నినుం. (క. ఛం)
- ↑ చ-ఇంద్రుఁడు మఱియొక్క యింద్రుతోడఁ I జంద్రుతోఁ గూడఁగాఁ జనుసత్క.
- ↑ ద-చనిననుం గ.
- ↑ ద - బిది యనిరి.
- ↑ ఈలక్షణము కన్నడములో కిఱి (చిన్న) యక్కర లక్షణముం బోలియున్నది. పొడెయలరిర్బరుం మొదలొళిక్కె! జడెయ శంకరనొర్బం తుదియొళిక్కె1 మడది! కేళ్ మూడుగణమె సెదిక్కెగడ, కిఱియక్కరక్కిదె లక్షణం. (క. ఛం.)
- ↑ ద-కృతుల.
- ↑ ఇది కన్నడలక్షణమును బోలియున్నది. బిసరుహోద్భవగణం రసదళస్థానదొళ్ | బిసరుహ నేత్రే! గణమె బర్కుళిదవు! బిసరుహనేత్రే! త్రిపదిగే. (క. ఛం)
- ↑ ద-నలగాభజసల నైదిటిలోనన్.
- ↑ త్రిగణము--అని పాఠాంతరము.
- ↑ చ-డ-లలో వలసిన త్రిగణము వడిహగణానన్, జలయ గుణధ్వనివిశ్రుత మైనన్.
- ↑ ద-చౌపద కాఖ్య యెసంగున్. చౌపదతరువాత ద-ప్రతిలో రగడలు, మంజరి, ఉదాహరణము, గీతము వీనికిలక్షణములు , లక్ష్యములు చెప్పబడినవి. ఇవి తఱచుగా విష్ణుపరముగా నుండుటచేఁ బ్రక్షిప్తములుగాఁ నెంచఁదగియున్నవి. ఈపద్యములు షట్పదలక్షణము తరువాత క-ప్రతిలోఁగూడఁ గన్పట్టుచున్నవి. కన్నడచౌపది లక్షణము, మదనన తందెయముం | దొదవిద శంకరనొళ్ | పుదిదిరెసందుదునో | డిదు, సతి ! చౌపదిగే. (క. ఛం).
- ↑ కొందఱు లాక్షణికులు పట్పదపాదమునకుఁ ద్రిప్రాసము విధించిరి. యతి యెందును లేదు.
- ↑ చ-డ-లలో మాత్ర మున్నది. కన్నడములో నాఱువిధముల షట్పదములున్నవి. వాని సామాన్యలక్షణము. తోఱునమాత్రెయషట్పది! గాఱాఱడియెరడఱల్లి మొందే నియమం ! మూఱక్కొందు తదర్థం | బేఱీళం కడెయొళెల్లమీతెఱనక్కుం.
- ↑ తుది యిట్లుగా మదిఁజెప్పుటయును షట్పద యగు మల్లియ రేచన వినవే. (అని మాతృక)
- ↑ డ - లో మాత్ర మున్నది.