కలుష దుర్దాంత పంక సంకలిత కుహర
కలుష దుర్దాంత పంక సంకలిత కుహర
ముల జనించు మదీ యాశ్రు మలినధార
స్వామి, భవదీయ పాదదేశమున బారి
పరమపావన జాహ్నవీ ప్రతిభ గాంచు.
గాట మగు లజ్జవలన దుఃఖమ్మువలన
నా కనుల జారు నుష్ణాశ్రు శీకరములు
హృదయము కలంచి విదలించి యేర్చి వెడలు
సాంద్రశోణిత బిందు వర్షమ్ము సుమ్ము!
తావకీన పదసరోజ దళములందు
నిలువని మ్మొక్క వేడి కన్నీటిచుక్క!
కడల ప్రసరించు నెత్తావి కమ్మదనము
త్రావని మ్మో ప్రభూ, దాని తనివి తీర!