కాంభోజి రాగం    త్రిపుట తాళం

ప: కట కట నీదు సంకల్ప మెట్టిదో గాని

నే నెంతవాడనురా రామ || కట కట ||

అ.ప: నిటలాక్షుడు తొల్లి నీ మాయగనలేక

తటుకున నీ వల తగిలెను గనుక || కట కట ||


చ 1: శరణన్న మునులను బిరబిర బ్రోచెడు

బిరుదు గలిగిన దొరవే ఓ రామ

పరి పరి విధముల మొరలిడ వినక న

న్నర మర చేసిన హరి నిన్నేమందు || కట కట ||


చ 2: భావజ జనక నా భావమెరుగ వే

వే వేగమున జూడవే ఓ రామ

దేవాది దేవ దేవ దీనశరణ్య

నేవే దిక్కని నిక్కము నమ్మితి || కట కట ||


చ 3: గీర్వాణనుత భద్రగిరివాస సర్వ యో

గీశ్వరేశ్వర రామ ఓ రామ

సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయ

సర్వాధార పరాకేల రామా || కట కట ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
"https://te.wikisource.org/w/index.php?title=కట_కట&oldid=25995" నుండి వెలికితీశారు