ఏల దయ రాదో రామయ్య
పున్నాగ వరాళి రాగం ఆది తాళం
ప: ఏల దయ రాదో రామయ్య
ఏల దయ రాదో రామయ్య నీకు || ఏల ||
అ.ప: శ్రీ మేలుకై పాటుపడితినని యే
ల యీ యభాండము చాలు చాలును || ఏల ||
చ 1: బ్రహ్మ గూర్చెగదా అహోపర
బ్రహ్మ కావగదే రామ
బ్రహ్మ జనక భవ బ్రహ్మేంద్రాదులు
బ్రహ్మానందము పాలై నారట || ఏల ||
చ 2: పాపములచేత రామయ నే
నోపలేనుగద రామ
శ్రీపతి ఏ ప్రాపులేకను నీ
ప్రాపె గోరితి భక్త పాపహరణ హరి || ఏల ||
చ 3: తలపగ చాల ఆనంద
బాష్పము లూరెగద రామ
నీల నీరదనిభ కోమలరూపభద్ర
శైల వాస రామదాసు నేలగ || ఏల ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.