ఎమ్ ఎస్ రామారావు సుందర కాండము2
సుందర కాండము
మార్చుతల్లీ నివిటు శోకించనేల
వగచి వగచి ఇటు వేసారనేల
కూర్చుండుమూ నా మూపురమ్మున
వాచిన త్రోవనే నిను కొనిపోయెద
శ్రీరామునితో నును చేర్చెదనూ
అలని పలికె మారుతి
అంజలి ఘటించి చెంతను నిలిచె
పోనివ్వక పోతివిగా హనుమా
సహజమైన చంచల భావము
రాముని కడకు నన్ను చేర్చెదవో
అడవిలోన నను జారవిడుతువో
అని పలికె సీత హనుమంతునితో
తనలో కలిగిన వాత్సల్యముతో
సీత పలికిన మాటల తీరును
హనుమంతుడు విని చిన్నబోయెను
సీత చెంత తన కామరూపమును
ప్రదర్శించగా సంకల్పించెను
కొండంతగ తన కాయము పెంచెను
కాంతివంతుడై చెంత నిలిచెను
జయహనుమంతుడు కామరూపమును
ఆశ్చర్యముతో జానకి చూచెను
అద్భుతముగు నీకామరూపమును
కాంచితినయ్యా శాంతిచవయ్యా
పవనకుమారా నీవుగాక మరి
ఎవరీ వారధి దాటెదరయ్యా
కౄరరాక్షసుల కంటపడకయే
లంకవెదికి నను కనగలరయ్యా
అని పలికె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసంతో
శ్రీహనుమాన్ గురుదేవులు నా ఎడ
పలికిన సీతారామకధా
నే పలికెద సీతా రామ కధా
తల్లీ నేను నీ ఎడల కల
భక్తిభావమున అటుల పలికితిని
వేగముగా నిను రాముని చేర్చగా
శుభగడియలకఇ పొరబడి పలికితిని
అని హనుమంతుడు
అంజలి
తల్లీ నీవు పలికినవన్నీ
శ్రీరామునికి విన్నవించెదను
సత్యకర్మ పవిత్రచరిత్రవు
శ్రీరామునికి తగిన భార్యవు
అమ్మా ఇమ్ము ఏదో గురుతుగా
శ్రీరాముడు కని ఆనందింపగా
అని హనుమంతుడు సీతతో పలికి
అంజలి ఘటించి చెంతన నిలిచెను
చిత్రకూటమున కాకాసుర కధ
కన్నీరొలుకక గురుతుగ తెలిపి
కొంగున ఉన్న చూడామణిని
మెల్లగాతీసి మారుతి కొసగి
పదిలముగా కొని పోయి రమ్మని
శ్రీరామునికి గురుతుగ ఇమ్మని
ప్రీతిగొలుప సీత మారుతి చూసెను
సంపూర్ణమైన విశ్వాసముతో
చేతులారగా చూడామణిని గొని
ఆనందముతో కనుకద్దుకొని
వైదేహికి ప్రదిక్షిణలు చేసి
పదములపడి వందనములిడి
మనమున రాముని ధ్యానించుకుని
మరలిపోవగా అనుమతి గైకొని
అంజనీ సుతుడు కాయము పెంచె
ఉత్తరదిశగా కుప్పించి ఎగసె
శ్రీహనుమాన్ గురుదేవుడు
నా ఎడ పలికిన సీతారామ కధ
నే పలికెద సీతారామ కధా
శ్రీహనుమాన్ గురుదేవుడు
నా ఎడ పలికిన సీతారామ కధ
నే పలికెద సీతారామ కధా
సీత జాడ గని మరలిన చాలదు
చేయవలసినది ఇంకను కలదు
కల్పించుకుని కహము పెంచెద
అసుర వీరుల పరిశీలించెద
రాక్షసబలముల శక్తి గ్రహించెద
సుగ్రీవాదులకు వెన్నవించెద
అనిహనుమంతుడు యోచన చేయుచు
శోధన స్థంభము పైన నిలిచెను
పద్మాకరముల పాడొనరించి
జలాశయముల గట్టులు తెంచి
ఫలపుష్పముల తరువులు గూల్చి
ఉద్యానముల రూపును మార్చి
ప్రాకారముల బద్దలు చేసి
ద్వారబందముల ద్వంశముచేసి
సుందరమైన అశోకవనుమును
చిందరవందరచేసె మారుతి
గుహ సమూహములు భీతిల్లినవై
తత్తరపాటుతో పరుగులు తీయగ
పక్షుల గుంపులు
చెల్లాచెదరై ఎగిరిపోవగా
సీత ఉన్న చుంచుపా తరువు వినా
వనమంతయు వినాశముకాగా
వనమున రేగిన విని
సుందరమైన అశోకవనుమును
చిందరవందరచేసె మారుతి
వనమున రేగిన పనులకు అదిరి
లంకా వాసులు నిద్రలేచిరి
కావలి ఉన్న రాక్షసవనితలు
రావణుచేరి విన్నవించిరి
రావణుండు మహోగ్రుడై పలికె
వానరుని పట్టి దండిపుడనె పలికె
ఎనుబదివేల కింకర వీరులు
హనుమంతునిపై దాడి వెడలిరి
ఎనుబదివేల కింకర వీరుల
హనుమంతునిపై దాడి సలిపిరి
ఎనుబదివేల రాక్షస వీరుల
ఒక్క వానరుడు హతమొనరిఉంచెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులుగ్రక్కుచు ఘర్జన చేసేను
జంబుమాలిని తగిన బలముగొని
ఆ వానరుని దడింప బొమ్మననెను
జంబుమాలి ప్రహస్థుని సుతుడు
హనుమంతునిపై దాడి వెడ్లెను
జంబుమాలిని సర్వసైన్యములు
10
ఒక్క వానరుడు ఉత్తడగించెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులుచెరగుచు ఆజ్ఞాపించెను
మంత్రికుమారుల తగిన బలముగొని
ఆ వానరుని దడింప బొమ్మననెను
మంత్రికుమారులు ఏడ్వురు చేరి
హనుమంతునిపై దాడి వెడలిరి
మంత్రుసుతులను సర్వసైన్యమును
మారుతి తృటిలో సంహరించెను
ఎటుచూసిననూ మృతదేహములు
ఎటుపోయినను రక్తపుటేరులు
ఈ వృత్తాంతము చూసి రావణుడు
కొంత తడవు యోచన చేసెను
సేనాపతులన్బు తగిన బలము గొని
సేనాపతులను సర్వసైన్యమును
పవనకుమారుడు నిర్మూలించెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిశ్చేష్టితుడై పరిశీలించెను
తండ్రి చూపులు తనపై సోకగ
అక్షకుమారుడు హితవుగ నిలువగ
రావణుండు కుమారునిగని
ఆ వానరుని దడింప బొమ్మననెను
అక్షకుమారుడు నవ్వయవ్వనుడు
వేగవంతుడు తేజోవంతుడు
దివ్యాస్త్రములను పొందిన వాడు
మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు
కాలాగ్ని వలె ప్రజ్వరిల్లెడు
రణధీరుడు మహావీరుడు
అక్షకుమారుడు దివ్యరధముపై
దాడి వెడెలెను హనుమంతునిపై
మూడుశరములతో మారుతి శిరమును
పది శరములతో మారుతి ఉరమును
అక్షకుమారుడు బలము నాటెను
రక్తముచిందగ గాయపరచెను
ఉదయభాస్కర సమాన తేజమున
మారుతి ఎగెసె ఆకాశమున
ఇరువురి నడుమ భీకరమైన
పోరు చెలరేగె ఆకాశమున
అతినేర్పుతో రణమును సలుపు
అక్షకుమారుని మారుతి దయగొని
బాలుని చంపుట చేతులు రావని
వేచిచూసెను నిగ్రహించుకొని
అక్షకుమారుడు అంతకంతకు
అగ్నిహోత్రుడై రణమున రేగెను
ఇరువురి నడుమ భీకరమైన
పోరు చెలరేగే ఆకాశమున
అగ్నికణమని జాలికూడదని
రగులక మునుపే ఆర్పుట మేలని
సింహనాదమును మారుతి చేసెను
అరచేత చరచి హయములజంపెను
రధమును బట్టి విరచి వేసెను
అక్షిని తుంపి విసిరి వేసెను
అక్షుని మొండెము అతిఘోరముగా
నేలపైబడె రకపుముద్దగా
అక్షకుమారుని మరణవార్త విని
లంకేశ్వరుడు కడు దుఃఖించెను
మెల్లగజేరి క్రోధము పూని
తనకుమారుని ఇంద్రజిత్తుగని
ఆవానరుడు సామాన్యుడు కాదని
వానిని వేగ బంధించి తమ్మని
రావణాసురుడు ఇంద్రజిత్తును
హనుమంతునిపై దాడి పంపెను
కపికుంజరుడు భయంకరముగా
కాయము పెంచి సమరము చేయగా
ఈ వానరుడు సామాన్యుడుగాదని
మహిమోపేతుడు కామరూపుడు
ఇంద్రజిత్తు యోచనచేసి
బ్రహ్మస్త్రమును ప్రయోగముచేసే
దేవగణంబులు సంగ్రామముగని
తహతహలాడిరి ఏమగునోనని
బ్రహ్మాస్త్రముచే బంధింపబడి
పవనకుమారుడు నేలపై బడె
వనజభవుడు తనకొసగిన వరము
స్మరియించుకుని ప్రార్ధనజేసే
వాయుబ్రహ్మ ఇంద్రాది దేవతల
కాపాడమని ధ్యానము చేసే
దేవగణంబులు సంగ్రామముగని
తహతహలాడిరి ఏమగునోనని
కట్టుపడిఉన్న వానరోత్తమునిగని
అసురులు తలచిరి తమకు లొంగెనని
త్వరత్వరగా దానవులు దరిచేరి
నారచీరలతో కట్టి బిగిబంధించిరి
బ్రహ్మ వరమున బ్రహ్మాస్త్ర బంధము
ఒక్కక్షణమున తొలగి పోయెను
మారుతి మాత్రము నారచీరలకే
కట్టుబడినటుల కదలక ఉండె
వానరోత్తముని దూషణలాడుతూ
రావణు కడకు ఈడ్చుకు పోవగా
ఈ వానరుడు వధించి వేయమని
మన ఎడ ద్రోహము చేసినాడని
రక్తవీక్షణముల నిప్పులు రాలగ
లంకేశ్వరుడు ఘర్జనచేయగ
రావణుతమ్ముడు విభీషణుడు
దూతను చంపుట తగదని పలికె
11
అన్నా రావణ తెలిసిన వాడవు
దూతనుజంపుట ధర్మము కానిది
లోకముచే గర్హింప బడినది
శూరుడివైన నీకు తగనిది
రాజధర్మ విరుద్ధమైనది
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తదని పలికెను
అన్నా వీనిని తగురీతిన దండించి పంపుమా
దూతఎడల విధించిన
వధగా తగిన దండనలున్నవి
తలగిరిగించుట చబుకు వేయుట
గురుతు వేయుట వికలాంగుచేయుట
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తదని పలికెను
కపులకు వాలము ప్రియభూషణము
కావున కాల్చుడు వీని వాలము
వీధివీధుల ఊరేగింపుడు
పరాభవించి వదిలి వేయుడు
కాలిన తోకతో వీడెగుగాక
పంపినవానికి అవమానము కద
అని రావణుడు విభీషణుని గని
ఆజ్ఞాపించెను కోపమణచుకుని
జీర్ణాంబరములు అసురులు తెచ్చిరి
వాయుకుమారుని తోకకు చుట్టిరి
నూనెతో తడిపి నిప్పంటించిరి
మంటలు చూసి సంతసించిరి
కపికుంజరుని ఈడ్చుకు పోయిరి
నడి వీధులలోఊరేగించిరి
మారుతి మాత్రము మిన్నకుండెను
సమయము కాదని సాగి పోయెను
కపిని బంధించి తోక కాల్చిరని
వీధివీధుల త్రిప్పుచుండిరని
రాక్షసవనితలు వేడుక మీరగా
పరుగున పోయి సీతతో పలికిరి
అంతటి ఆపద నా మూలముగా
వాయుసుతునకు వాటిల్లెనని
సీతామాతా కడుదుఃఖించెను
అగ్నిదేవుని ప్రార్ధన చేసెను
ఓర్వరానివై మండిన మంటలు
ఒక్కసరిగా చల్లగ తోచెను
అగ్నిదేవునకు నా జనకునకు
అన్యోన్యమైన మైత్రి చేతనో
రామదూతనై వచ్చిన చేతనో
సీతామాత మహిమచేతనో
మండే జ్వాలలు పిల్లగాలులై
వీవసగెనని మారుతి పొంగెను
ఆనందముతో కాయము పెంచెను
బంధములన్నీ తెగి పడిపోయెను
అడ్డగించిన అసురలందరిని
అరచేత చరచి అట్టడగించెను
గిరిశిఖరములా ఎత్తుగనున్న
నగరద్వరా గోపురమందున
స్థంభముపైకి మారుతి ఎగసెను
లంకాపురిని పరీక్షించెను
ఏ మంటల నా వాలము కాల్చిరో
ఆ మంటలతో లంకను కాల్తునని
భీమరూపమున ఘర్జన సేయుచు
రుద్రరూపుడై మంటలు జిమ్ముచు
మేడమిద్దెల వనాల భవనాల
వెలిగించెను జ్వాలాతోరణాల
చూసిరమ్మనిన కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గడించె మారుతి
ఒకచో కుంకుమ కుసుమ కాంతుల
ఒకచో బూరుగు పుష్పఛాయల
ఒకచో మూగుడుగిరుల తేజముల
ఓక ఎడ కరగిన లోహపు వెలుగుల
కోటి సూర్యుల సమానకాంతుల
లంకా పురము వెలిగి పోవగా
చూసిరమ్మనిన కాల్చివచ్చిన
ఘన విఖ్యాతి గడించె మారుతి
హనుమంతుడు సముద్రజలాల
చల్లార్చుకునే లాంగూల జ్వాల
తలచిన కార్యము నెరవేర్చితినని
తేరిపార చూసె వెనుకకు తిరిగి
కనుపించెను ఘోరాతిఘోరము
జ్వాలాఘీలము లంకాపురము
మారుతి తలచె తా చేసిన పని గని
తన కోపమే తన శతృవాయెనని
సీతమాత క్షేమము మరచితి
కోపతాపమున లంకను దహించితి
లంకాపురము సర్వముపోగా
ఇంకా జానకి బ్రతికి ఉండునా
సిగ్గుమాలిన స్వామి ద్రోహము
సీతను జంపిన మహా పాపిని
మారుతి తలచె తా చేసిన పని గని
తన కోపమే తన శతృవాయెనని
సీత లేనిదే రాముడుండడు
రాముడు లేనిదే లక్ష్మణుడుండడు
భరత శతృజ్ఞ సుగ్రీవాదులు
ఈ దుర్వారత వినిన బ్రతుకజాలరు
ఈ ఘోరమునకు కారణమైతిని
తనకు మరణమే శరణ్యమని
మారుతి వగచె తా చేసిన పని గని
తన కోపమే తన శతృవాయెనని
శ్రీ రఘురాముని ప్రియసతి సీత
అగ్నివంటి మహా పతివ్రత
ఆగ్నిని అగ్ని దహించజాలునా
అయోనిజనూ అగ్ని దహించునా
నను కరుణించిన అగ్నిదేవుడు
సీతను చల్లగా చూడకుండునా
అని హనుమంతుడు తలచుచుండగా
శుభశకునములు తోచె ప్రీతిగా
ఎల్లారాక్షసుల సిరి సంపదులు
మంటలపాలై దహనమాయెనని
అశోకవనము ధ్వంసమాయెనని
జానకి మాత్రము క్షేమమేనని
లంకా పురము రూపు మాసినను
విభీషణుని గృహము నిలిచి ఉండెనని
అంబర వీధిన సిద్ధచారిణులు
పలుకగావిని మారుతి