ఎమ్ ఎస్ రామారావు సుందర కాండము
సుందర కాండము
మార్చుశ్రీహనుమాన్ గురుదేవులు నా ఎడ
పలికిన సీతారామకథ
నే పలికెద సీతారామ కథ
శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు
అతి బలవంతుడు రామభక్తుడు
లంకకు పోయి రాగలధీరుడు
మహిమోపేతుడు శత్రుకర్షణుడు
జాంబవదాది వీరులందరును
ప్రేరేపించగా సమ్మతించెను
లంకేశ్వరుడు అపహరించిన
జానకీ మాత జాడ తెలుసుకొన
తన తండ్రి అయిన వాయుదేసునకు
సూర్యచంద్రబ్రహ్మాది దేవులకు
వానరేంద్రుడు మహేంద్రగిరిపై
వందనములిడె పూర్వాభిముఖుడై
రామనామమున పరవశుడయ్యె
రోమరోమమున పులకితుడయ్యె
కాయముపెంచె కుప్పించి ఎగెసె
దక్షిణ దిశగా లంక చేరగా
పవనతనయుని పదఘట్టనకు
పర్వతరాజము గడగడవణికె
ఫలపుష్పాదులు జలజల రాలె
పరిమళాలు గిరిశిఖరాలు నిండె
పగిలిన శిలల ధాతువులెగెసె
రత్నకాంతులు నలుదిశల మెరెసె
గుహలను దాగిన భూతములదిరె
దీనారవముల పరుగులిడ బెదిరి
రఘుకులోత్తముని రామచంద్రుని
పురుషోత్తముని పావనచరితుని
నమ్మినబంటుని అనిలాత్ముజుని
శ్రీహనుమంతుని స్వాగతమిమ్మని
నీ కడ కొంత విశ్రాంతి తీసుకుని
పూజలందుకుని పోవచ్చునని
సగరప్రవర్ధితుడు సాగరుడెంతో
ముదమున పలికె మైనాకుడితో
మైనాకుడు ఉన్నతుడై నిలిచె
హనుమండు ఆగ్రహమునగాంచె
ఇది ఒక విజ్ఞము కావచ్చునని
వారిధి పడదోసె పురముతో గిరిని
వానరోత్తమా ఒకసారి నిలుమా
నాశిఖరాన శ్రమ తీసుకొనుమా
కందమూలముల ఫలముల తినుమా
నాపూజలుగొని మన్ననలందుమా
పర్వతోత్తముని కరముల నిమిరి
రామకార్యమే ఏగుచుంటిని
సాధించు వరకు ఆఘనంటిని
కపివరుడెంతటి ఘనతరుడోనని
పంపిరి సురలు పరిశోధింపగా
సురసముఖము విశాలమగుటగని
జలనిధి సాగే రాక్షసి సింహిక అట్టె గ్రహించెసు
గుహను బోలు తన నోటిని తెరచి
కపివరుని తుంచి మ్రింగ చూసెను
అంతట మారుతి సూక్ష్మ రూపమున
సింహిక ముఖమున జొచ్చి చీల్చెను
సింహిక హృదయము చీలిక లాయెను
సాగరమున పడి అసురులు బాసెను
వారిధి దాటెను వాయుకుమారుడు
లంకను చేరెను కార్యశూరుడు
నలువంకలను కలయ జూచుచు
నిజ రూపముతో మెల్లగ సాగెను
త్రికూటాచల శిఖరు మీద
విశ్వకర్మ వినిర్మితమైన
స్వర్గపురముతో సమానమైన
లంకాపురమును మారుతి గాంచెను
2
అనిలకుమారుడా రాత్రివేళలో
సూక్ష్మరూపుడై ముందుకు సాగెను
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనుల పడకను
పిల్లివలె పొంచి మెల్లగ సాగెను
ఉత్తర ప్రాకార ద్వారము చేరెను
లంకా రాక్షసి కపివరు గాంచెను
ఘర్జన చేయుచు అడ్డగించెను
కొండ కోనల తిరుగాడు కోతివి
ఈ పురుకి ఏ పనికై వచ్చితివి
లంకేశ్వరుని ఆనతి మీద
లంకాపురికి కావలి యున్న
లంకను నేను లంకాధి దేవతను
నీప్రాణములు నిలువున దీతును
కదలక మెదలక నిజము పలుకుమని
లంకఎదుర్కొనె కపి
అతి సుందరము లంకాపురమని
ఈ మాత్రము కోపమెంకులె
లంకను చూసి వెడలి పోదులె
సింహనాదమును మారుతి చేసే
కొండంత తన కాయము చేసి
పిడికిలి బిగించె
కొండ బండల రక్కసి దొర్లె
కనులప్పగించి నోటిని తెరచె
అబలను చంపుట ధర్మముగాదని
మారుతి విడెచె లంకను దయగొని
ఓ బలభీమా వానరోత్తమా
నేటికి నీచే ఓటమందితిని
ఈ నా ఓటమి లంకకు చేటని
పూర్వము బ్రహ్మ వరమొసగెనని
రావణుడాది రాక్షసులందరు
సీతమూలమున అంతమొదెదరు
ఇది నిజమని నీదే జయమని
లంకా రాక్షసి పంపె హరీశుని
కోట గోడ అవలీలగ దాటెను
శత్రుపతనముగా వామపాదమును
ముందుగ మోపి ముందుకు సాగెను
ఆణిముత్యముల తోరణాలుగల రమ్యతరమైన
సువర్ణమయ సౌధరాజముల
ధగధగ మెరెసె సౌధరాజముల
వెన్నెలలో లంకాపురి శోభను
శోధనగా హరీశుడు గాంచెను
అప్సరసల మరపించు మదవతుల
త్రిష్టాదుల గానమాధిరిమల
వెన్నేలలో లంకా పురి శోభను
శోధనగా హరీశుడు గాంచెను
నృత్యమృదంగ గంభీర నాదికము
వీణాగాన వినోద సంకులము
లంకేశ్వరుని దివ్యభవనమది
అత్తరుపన్నీట జలకములు
కస్తూరి పునుకు దివ్యగంధములు
నిత్యపూజలు శివార్చనలు
మాసపర్వముల హోమములు
యమకుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వసంపదల మించినది
విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది
బ్రహ్మవరమున కుబేరుడందినది
నేలను తాకక నిలచి ఉండునది
రావణుభవన మధ్యమున ఉండినది
మనమున తలచిన
లంకాధీశుని ప్రేమ మందిరం
రత్నఖచితమౌ హేమ మందిరం
చందన పన్నీరు పరిమళ భరితము
మత్తున శయనించు సుదతుల మోములు
పుష్పములనుకుని మూగు తుమ్మెదలు
నిమీలిత విశాల నేత్రములు
ఉత్తమకాంతల కూడి రావణుడు
తారాపతి వలె వెలుగుందుచున్న
లంకేశ్వరుని దివ్యభవనమది
శోధనగా హరీశుడు గాంచెను
రావణుండు రణమున గెలిచి
ఓడించి లంకకు తెచ్చిన వారె
దివి నుండి భువికి దిగి వచ్చినది
సూర్యచంద్రులను ధిక్కరించునది
పుష్పకమను దివ్యవిమానము
పుష్పకమందు రావణభనమది
మారుతి గాంచి అచ్చెరువందె
సీతగాక వారందరు కన్నెలె
రావణు మెచ్చి వరించిన వారె
3
శ్రీహనుమాన్ గురుదేవుల నా ఎడ పలికిన
సీతారామకథ నే పలికెద సీతారామ కథ
ఐరావతపు దంతపు మొనలతో
పోరున పొడిచిన గంటులతో
వజ్రాయుధపు ప్రఘాతములతో
చక్రాయుధపు ప్రహరణములతో
జయపరంపర గురుతులతో
కీర్తిచిహ్నముల గుతులతో
లంకేశుడు శయనించ కాంతలతో
సీతకై వెదికె మారుతి ఆశతో
ఇనుపరాశి వలె నల్లని వాడు
తీక్షణ దృక్కుల లోహితాశుడు
రక్తచందన చర్చిత గాత్రుడు
సంధ్యారుణ ఘన తేజోవంతుడు
సతులగూడి మధు గ్రోలిన వాడు
రతికేళిసల్పి సోలిన వాడు
లంకేశుడు శయనించ కాంతలతో
సీతకై వెదికె మారుతి ఆశతో
అందొక వంక పర్యంకం చేరి
నిదురించుండె దివ్యమనోహరి
నవరత్నఖచిత భూషణధారిణి
నలువంకలను కాంతి ప్రసారిణి
స్వర్ణ దేహిని చారు రూపిణి
రాణులకు రాణి పట్టపు రాణి
మండోదరి లోకోత్తర సుందరి
మండోదరిని జానకి అనుకుని
ఆడు పాడుచు గంతులు పెట్టి
వాలము పట్టి ముద్దులు పెట్టెను
నేలను కొట్టి భుజములు తట్టి
స్థంభములెగసి కిందకు దుమికి
పల్లకీలు మోసి చెంగునదూకి
చంచలమగు కపీశ స్వభావమును
పవన తనయుడు ప్రదర్శన జేసెను
రాముని సీత ఇటులుండునా
రాముని బాసి నిదురించునా
రావణుజేరి శయనించునా
భుజియించునా భూషణములుదాల్చునా
పరమపురుషుని రాముని మరచునా
పరపురుషునితో కాపురముండునా
సీతకాదు కాదు కానేకాదని
మారుతి వగచుచు వెదకసాగెను
పోవగరాని చోటులబోతిని
చూడగరానివెన్నో జూసితి
నగ్నముగా పరుడిన పరకాంతల
పరిశీలనగా పరికించితిని
రతికేళి సలిపి సోలిన పడతుల
ఎందెందరినో పరికించితిని
ధర్మముగానక పాపినయితినని
మారుతి వగచుచు వెదకసాగెను
సుదతులతోడ సీత ఉండగా
వారిని చూడక వెదుకటెలాగా
మనసున ఏమీ వికారమునొందక
నిష్కామముగా వివేకము వీడక
సీతను వెదకుచు చూసితిగాని
మనసున ఏమీ పాపమెరుగనని
స్వామిసేవ పరమార్ధముగాగొని
మారుతి సాగెను సీతను గనుగొన
భూమిగృహములు నిషాగృహములు
క్రీడాగృహములు లతాగృహములు
ఆరామములు చిత్రశాలలు
బావులు తిన్నెలు రచ్చవీధులు
మేడలు మిద్దెలు గిరులు కోనేరులు
సందులు గొందులు కోటలు పాటలు
ఆగి ఆగి అడుగు అడుగు వెదకుచు
సీతనుగానక మారుతి వగిచె
సీతామాతా బ్రతికి ఉండునో
కౄర రాక్షసుల పాల్పడి ఉండునో
తాను పొందని సీత ఎందుకని
రావణుడే హతమార్చి ఉండునో
అని యోచించుచూ అంతట వెదకుచు
తిరిన తావున తిరిగి వెదకుచూ
ఆగి ఆగి అడుగు అడుగు వెదకుచు
సీతనుగానక మారుతి వగచెను
సీతజాడ కనలేదను వార్తను
తెలిసిన రాముడు బ్రతుకజాలడు
రాముడు లేక లక్ష్మణుడుండడు
ఆపై రఘుకుమంతరించును
ఇంతటి ఘోరము కనలేని
సుగ్రీవాదులు బ్రతుకజాలరు
ఇంత ఘోరము నా వల్లనేను
నే కిష్కిందకు పోనే పోను
వానప్రస్థాశ్రమ వాసుడనై
నియమ నిష్టలతో బ్రతుకువాడను
సీతామాతాను చూచితీరెదను
లేకున్న నేను అగ్నిదూకెదను
అని హనుమంతుడు కృతనిశ్చయుడై
నలుదెశలగనె సాహసవంతుడై
చూడమరచిన అశోకవనిలో
చూచువేళలో మారితి గాంచెను
సీతారామా లక్ష్మణాదులకు
ఎకాదశ రుద్రాదిదేవతలకు
ఇంద్రాది యమ వాయుదేవులకు
సూర్యచంద్ర మరుద్గణములకు
వాయునందనుడు వందనములిడి
అశోకవని చేరెను వడి వడి
శ్రీహనుమాన్ గురుదేవులు నా ఎడ
పలికిన సీతారామకథ
నే పలికెద సీతారామ కథ
4
విరితేనియలు గ్రోలు తుమ్మెదలు
విందారగ జేయు ఝంకారములు
లేజివురాకుల నెశవు కోయిలలు
పంచమాశ్వరమున పలికే పాటలు
పురులు విప్పి నాట్యమాడు నెమళులు
కిలకిలలాడే పక్షుల గుంపులు
సుందరమైన అశోకవనమున
మారుతి వెదెకె సీతను గనుగొన
అన్ని విధముల అనువైనదని
అశోకవనమున సీత ఉండునని
కపికిశోరుడు కొమ్మకొమ్మను
ఊపుచు ఊపుచు చూడసాగెను
పూవులు రాలెను తీగెలు తెగెను
ఆకులు కొమ్మలు నేలపై బడెను
పూవులు రాలగా పవన కుమారుడు
పుష్పరధమువలె వనమున దోచెడు
సుందరమైన అశోకవనమున
మారుతి వెదెకె సీతను గనుగొన
పూవులనిన పూదేనిలనిన
జానకికెంతో మనసౌనని
పద్మపత్రముల పద్మాక్షుణిగన
పద్మకరముల చెంతజేరునని
అన్ని విధముల అనువైనదని
అశోకవనమున సీత ఉండునని
ఉపవాసముల వాడిపోయిన
నివురుగప్పిన నిప్పుకణికను
మాసిన పీతవసము గట్టిన
మన్నున చిక్కిన పద్మమును
పతివియోగ శోకాగ్ని
నివురుగప్పున నిప్పుకణికను
మాటి మాటికి వేడి నిట్టూర్పుల
సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను
రతీదేవి వలె మెరయు కాంతను
పుణ్యము తరిగి దివి నుండి జారి
శోఖజలధిన మునిగిన తారను
రాక్షసవనితల క్రూర వలయమున
పతి చెంతలేని సతికేలనని
సీత సొమ్ముల తగించె శాఖల
మణిమయ కనక కర్ణవేష్టములు
మరకత మాణిక్య చంపసరాలు
నవరత్న ఖచిత హస్థ భూషలు
సర్వసులక్షిత లక్షిత జాత
ఆహాకంటి కనుగొంటి సీతనని
పొంగి పొంగి ఉప్పొంగె మారుతి
పూవుల నిండిన వనములందున
నాగేటిచాలున జననమందిన
జనకమహారాజు కూతురైన
దశరధ నరపతి కోడలైన
సీతాలక్ష్మికి కాదు సమానము
త్రైలోక రాజ్య లక్ష్మీ సహితము
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచెను సీతను గనుగొని
శతృతాపహరుడు మహాశూరుడు
సౌమిత్రికి పూజ్యురాలైన
ఆశ్రితజన సంరక్షకుడైన
శ్రీరఘురాముని ప్రియసతి అయిన
పతిసన్నిద్ధియే సుఖమని ఎంచి
పదునాలుగేళ్ళు వనముకు ఏగిన
బంగరు మేని కాంతులు మెరియ
మందస్మిత పద్మము విరియ
హంసతూలికా తల్పము పైన
రాముని కూడి సుఖింపగ తగిన
పురుషోత్తముని పావన చరితుని
రాముని కూడి సుఖింపగ తగిన
అంతటి మాతకా కాని కాలమని
మారుతి వగచెను సీతను గనుగొని
5
మూడు ఝాముల రేయిగడవగా
నాల్గవఝాము రేయి నడచుచుండగా
మంగళవాద్య మనోహర ధ్వనులు
లంకేశ్వరుని మేలుకొలుపులు
క్రతులొనర్చు తరంగ వేదవిధుల
తొరయుటచేత తరంగ ఘోషలు
శోభిల్లు శుంచుకశాఖలందున
మారితి కూర్చుని ఆలకించెను
రావణాసురుడు శాస్త్రోక్తముగా
వేకువనే విధులన్ని యొనర్చెను
మదోత్కటుడై మదన తాపమున
మరి మరి సీతను మదిలో నెంచెను
నూర్వురు భార్యలు సురకన్నెల వలె
పరిసేవింపగా దేవేంద్రుని వలె
దశకంఠుడు దేదీప్యమానముగా
వెడెలెను అశోక వనము చేరగా
లంకేశునితో వెడెలెను సతులు
మేఘము వెంట విద్యులతల వలె
మధువు గ్రోలిన పద్మముఖుల
ముంగురులెగిరె భ్రుగములవలె
క్రీడల తేలిన కామినీ మణుల
నిద్రలేమి కడు అడుగులు తూలె
దశకంఠుడు దేదీప్యమానుడై
చేరెను అశోకవనము వేగముగ
లంకేశుని మహాతేజమును గని
మారుతి కూడా విభ్రాంతి చెందెను
దశకంఠుడు సమీపించి నిలిచెను
సీత మీదనే ఉడుపులు నిలిపెను
వడలు చేర్చుకుని కడుపును దాచి
కరములు ముడిచి చనుగవ దాచి
సుడిగాలి పడిన కదళీ తరువు వలె
కఠిన నేలపై జానకి తూలె
ఓ సీతా ఓ పద్మనేత్ర
నా చెంత నీకు ఏలా చింత
ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య
ఎవరికోసమీ వనవాస వ్యధ
నవయవ్వన త్రిలోక సుందరీ
నీ కెందుకీ మునివేషధారణ
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె
రాముడు నీకు సరికాని వాడు
నిను సుఖపెట్టడు తను సుఖపడడు
మతిచెడి వనమున తిరుగు చుండెనో
తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో
మరచిపొమ్ము ఆ కొరగాని రాముని
వలచి రమ్ము నను యశోవిశాలుని
అని రావణుడు కామాంధుడై నిలిచె
నోటికి వచ్చినదెల్ల పలికె
రాముడు వచ్చుట నన్ను గెల్చుట
నిన్ను పొందుట కలలోని మాట
బలవిక్రమ ఘన తేజోవిరాజముల
అల్పుడు రాముడు నాముందెంత
యమకుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నాకిక నరభయమేల
అనిరావణుడు కామాంధుడై పలికె
నోటికి వచ్చినదెల్ల పలికె
శ్రీహనుమాన్ గురుదేవులు
నా ఎడ పలికిన సీతారామ కధ
నే పలికెద సీతారామ కధ
నిరతము పతినే మనమున దలచుచు
క్షణమొక యొగముగ కాలముగడుపుచు
రావణగర్వమదంబులదుంచు
రామునిశౌర్యమనంబునదలచుచు
శోకతప్తయై శిరమును వంచి
తృణమును తుంచి తనముందుంచి
మారుపలికె సీత హీనస్వరమున
తృణముకన్న రావణుడే హీనమన
రామలక్ష్మణులు లేని సమయమున
అపహరించితివె నను ఆశ్రమమున
పురుషసింహముల గాలికి బెదిరి
పారిపోతివే శునకము మాదిరి
యమకుబేర ఇంద్రాది దేవతల
గెలిచిన నీకీ వంచనలేల
అని పలికె సీత హీనస్వరమున
తృణముకన్న రావణుడే హీనమన
ఓయి రావణా వైరము వీడుము
శీఘ్రముగా నను రాముని జేర్చుము
నిను మన్నించి అనుగ్రహహించమని
వేడుకొందునా కరుణామూర్తిని
అని పలికె సీత హీనస్వరమున
తృణముకన్న రావణుడే హీనమన
6
ఓ సీతా నీవెంత గడసరివె
ఎవరితో ఏమి పలుకుచుంటివి
ఎంతటి కర్ణకఠోర వచనములు
ఎంతటి ఘోర అసాధ్య దూషణములు
నీపై మోహము నను బంధించెను
లేకున్న నిన్ను వధించి ఉందును
అని ఘర్జించెను ఘనతర గాత్రుడు
కోపోద్రిక్తుడై దశకంఠుడు
శ్రీహనుమాన్ గురుదేవులు
నా ఎడ పలికిన సీతారామ కధ
నే పలికెద సీతారామ కధ
నీ కొసగిన ఏడాది గడువు
రెండు నెలలో ఇక తీరిపోవును
అంతదనుక నిన్నంటగరాను
ఈ లోపున బాగోగులు చూడను
నను కోరని నిను బలాత్కరించను
నను కాదను నిను కనికరించను
అని ఘర్జించెను ఘనతర గాత్రుడు
కోపోద్రిక్తుడై దశకంఠుడు
శ్రీహనుమాన్ గురుదేవులు
నా ఎడ పలికిన సీతారామ కధ
నే పలికెద సీతారామ కధ
ఓ రవణా నీ కొవ్విన నాలుక
గిజగిజలాడుతూ తెగిపడదేమి
కౄరాత్ముడా నీ కౄరనేత్రములు
గిరగిర తిరిగి రాలిపడవేమి
పతి ఆగ్జ్ఞ లేక ఇటులుంటి కాని
తృటిలో నిన్ను దహింపనా ఏమి
అని పలికె సీత దివ్యస్వరమున
తృణముకన్న రావణుడే హీనమన
శ్రీహనుమాన్ గురుదేవులు
నా ఎడ పలికిన సీతారామ కధ
నే పలికెద సీతారామ కధ
క్రోధాగ్నిరగుల రుసరుసలాడుతూ
కొరకొర చూచుతూ నిప్పులుచెరగుతు
తనకాంతలెల్ల కలవరమొందగ
ఘర్జనచేయుచు దిక్కులదరగా
సీతనెటులైన ఒప్పించుడని
ఒప్పుకొనక ఉన్న భక్షించుడని
రావణాసురుడు అసురవనితలను
ఆజ్ఞాపించి మరలీ పోయెను
శ్రీహనుమాన్ గురుదేవులు
నా ఎడ పలికిన సీతారామ కధ
నే పలికెద సీతారామ కధ
అందున్న ఒక వృద్ధ రాక్షసి
తోటి రాక్షసులను ఆవలత్రోసి
కావలెనన్న నన్ను వధింపుడు
సీతను మాత్రము హింసింపకుడు
దారుణమైన కకంటి నేను
దానవులకది ప్రళయంబేను
అని తెలిపె త్రిఝట స్వప్నవృత్తాంతము
భయకంపితలరి రాక్షసి గణము
శుక్లాంబరములు దాల్చ్లిన వారు
రామలక్ష్మణులు అగుపించినారు
వైదేహికి ఇరువైపుల నిలిచి
దివ్యతేజమున వెలుగొందినారు
తెల్లని కరిపై మువ్వురు కలసి
లంకాపురిపై పైయనించినారు
అని తెలిపె త్రిఝట స్వప్నవృత్తాంతము
భయకంపితలరి రాక్షసి గణము
దేవతలందరు పరిసేవింప
ఋషి గణంబులు అభిషేకింప
గంధర్వాదులు సంకీర్తింప
బ్రహ్మాదులు మునుముందు నుతింప
సీతారాములు విష్ణుదేవులై
శోభిల్లెను కోటి సూర్యతేజులై
అని తెలిపె త్రిఝట స్వప్నవృత్తాంతము
భయకంపితలరి రాక్షసి జనము
తైలమలదుకొని రావణాసురుడు
నూనెత్రాగుతూ కనిపించినాడు
కాలాంబరములు ధరియించినాడు
కరవీర మాల ధరియించినాడు
పుష్పక వీడి నేలబడినాడు
కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు
అని తెలిపె త్రిఝట స్వప్నవృత్తాంతము
భయకంపితలరి రాక్షసి గణము
రావణుండు పరాగము
కుంభకర్ణుడు ఒంటే పైన
ఇంద్రజిత్తు మకరము పైన
దక్షిణ దిశగా పడిపోయినారు
రాక్షసులందరు గుంపుగుంపులుగ
మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ
అని తెలిపె త్రిఝట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసి గణము
తెల్లని మాలలు వలువలు దాల్చి
తెల్లని గంధము మేన బూసికొని
నృత్య మృదంగ మంగళాధ్వనులతో
చంద్రకాంతులు లెగజిమ్ము చక్రముతో
తెల్లనికరిపై మంత్రివర్యులతో
వెడెలె విభీషణుడు దివ్యకాంతులతో
అని తెలిపె త్రిఝట స్వప్నవృత్తాంతము
భయకంపితలైరి రాక్షసి గణము
విశ్వకర్మ నిర్మించిన లంకను
రావణుండు పాలించెడు లంకను
రామదూత ఒక వానరోత్తముడు
రుద్రరూపమున దహియించినాడు
ప్రళయ భయానక సదృస్యమాయెను
సాగరమున మునిగి పోయెను
అని తెలిపె త్రిఝట మాటలువిని
నిద్రకుంగిరి రాక్షస వనితులు
హృదయ తాపమున జానకి తూలుచూ
శోఖభారమున గడగడ వణకుచు
జరిగి జరిగి అశోకశాఖలను
ఊతగాగొని మెల్లగ నిలిచి
శ్రీరాముని కడసారి తలచుకొని
తనమెడ జడతో ఉరి పోసికొని
ప్రాణత్యాగము చేయబూనగా
శుభ శకునములు గోచరించగా
సీతకెంత దురవస్థ కలిగె
నా తల్లి నెటుల ఊరడించ వలె
నన్ను నేనెటుల తెలుపుకోవలె
తల్లి నెటుల కాపాడు కోవలె
ఏ మాత్రము నే ఆలసించినా
సీతమాత ప్రాణములుండునా
అని హనుమంతుడు శాఖల మాటున
తహతహలాడుతూ మెదల సాగెను
నను గని జానకి బెదరక ముందే
పలికెద సీతారామకథ
సత్యమైనది వ్యర్ధము కానిది
పావన మైనది శుభకరమైనది
సీతామాతకు కడు ప్రియమైనది
పలుకు పలుకున తేనెలొలుకునది
అని హనుమంతుడు మృదుమధురముగా
పలుకెను సీతాతారామకథా
దశరధ విభుడు రాజోత్తముడు
యశముగన్న ఇక్ష్వాకు వంశుడు
దశరధునకు కడు ప్రియమగు వాడు
జ్యేష్టకుమారుడు శ్రీరఘురాముడు
సత్యవంతుడు జ్ఞానశ్రేష్టుడు
పితృవాక్య పరిపాలన దక్షుడు
అని హనుమంతుడు మృదుమధురముగా
పలుకెను సూఈతారామకథా
శ్రీరాముని పట్టాభిషేకము
నిర్ణయమైన శుభసమయమున
చిన్న భార్యకైక దశరధుజేరి
తనకొసగిన రెండు వరములు కోరె
భరుతునకు పట్టాభిషేకము
పదునాలుగేళ్ళు రామ వనవాసము
తండ్రిమాట నిలుప రామచంద్రుడు
వల్కల ధారియై వనములకేగే
సీతా లక్ష్మణులు తన వెంటరాగా
పదునాలుగేళ్ళు వనములకేగే
ఖరదూషణాది పదునాలుగువేల
అసురలజంపె జనస్థానమున
అని హనుమంతుడు
మృదుమధురముగా
పలుకెను సీతాతారామకథా
రాముడు వెడెలె సీతకోర్కేపై
మాయలేడిని కొని తెచ్చుకొనుటకై
రామలక్ష్మణులు లేని సమయమున
అపహరించె లంకేశుడు సీతను
సీతనుగానక రామచంద్రుడు
అడవుల పాలై వెదుకుచుండెను
అని హనుమంతుడు
మృదుమధురముగా
పలుకెను సీతాతారామకథా
రామసుగ్రీవులు వనమున కలుసిరి
మిత్రులైరి ప్రతిజ్ఞలుపూనిరి
రామచంద్రుడు వాలిని గూల్చి
సుగ్రీవుని కపిరాజునుజేసెను
సుగ్రీవునాన లంకనుజేరితి
సీతామాతను కనుగొనగలిగితి
వానరోత్తముడు పలుకుట మానెను
జానకికెంతో విస్మయమాయెను
భయము భయముగా నలువంకలు గని
మెల్లగా మోమెత్తి పైకి చూసెను
శోభిల్లు చుంచుక శాఖలందున
ఫాలాక్షుణివలె మారుతి దోచెను
మారుతి మోము చిన్నదైనను
తేజోమయమై భీతిగొల్పెను
తల్లి తెలుపుము నీవు ఎవరివో
దేవగంధర్వ కిన్నెరాంగనవో
కాంతులు మెరిసె బంగరుమేన
మలినాంబరములేల దాల్చితివో
ఓ కమలాక్షీ నీ కనుదోయి
నీలాలేలా నిల్పితివో
అని హనుమంతుడు తరువు నుండి దిగి
అంజలి ఘటించి చెంతన నిలిచె
రావణాసురుడు అపహరించిన
రాముని సఖివో నీవు సీతవు
రామలక్ష్మణులు వనములందున
అవనీజాతవు నీవు సీతవో
సర్వ సుయ్లక్షణ లక్షిత జాతవు
తల్లీ తెలుపుము నీవు ఎవరివో
జనక మహీపతి ప్రియ పుత్రికను
దశరధ నరపాలు పెద్ద కోడలును
శ్రీరఘురాముని ప్రిసఖి నేను
సీత అను పేర వడలుదానను
పరీణయమైన పన్నెండేడులు
అనుభవించితిని భోగభాగ్యములు
అని పలికె సీత వానరేంద్రునితో
రామకథను కీర్తించెడి వానితో
రావణుడోసగిన ఏడాది గడువు
రెండు నెలలతో ఇక తీరి పోవును
రాముడు నన్ను కాపాడునని
ఎదురుచూసి వేసారి పోతిని
అసురులు నన్ను చంపక మునుపే
నాకై న్వేను పోనెంచితిని
అని పలికె సీత వానరేంద్రునితో
రామకథను కీర్తించెడి వానితో
అమ్మా సీతా నమ్ముము నన్ను
రాముని దూతగా వచ్చినాడను
రాముడు నిన్ను క్షేమమడిగెను
నీక్షేమమరసి రమ్మన్నారు
రాముడు నీకు దీవెనలొసగె
సౌమిత్రి నీకు వందనములిడె
మారుతి ఎంతగా ముందుకు జరిగెనో
జానకి అంతగా అనుమానించెను
రావణాసురుడె ఈ వానరుడని
కామరూపమున వచ్చినాడని
ఆశ్రమమున ఒంటిగ ఉన్న తనను
వంచిన సన్యాసి ఈతడని
తలవాల్చుకొని భయకంపితయై
కఠిన నేలపై జానకి దొర్లె
వానరరాజు సుగ్రీవుని మంత్రిని
నను పిలుతురు హనుమంతుడని
రామసుగ్రీవులు మిత్రులైనారు
నీజాడ తెలియ వేచి ఉన్నారు
రామలక్ష్మణులు వానర రాజుతో
లంకచేరెదరు వానరకోటితో
అని పలికి మారుతి
అంజలి ఘటించి చెంతన నిలిచె
ఓ హనుమణంతా హాయి నొందితిని
నీ పలికిన శ్రీరామ కథ విని
రామలక్షణుల ఎట్లెరిగితి
రూపురేఖలను ఎట్లుగాంచితివి
వారి మాటలను ఎట్లు వింటివి
వారి గుణములను ఎట్లు తెలిసితివి
సర్వజన సంప్రీతిపాత్రుడు
కమలనేత్రుడు దయాసాంగుడు
బుద్ధుయందు బృహస్పతి సముడు
కీర్తియందు దేవేంద్రుడి సముడు
క్షమాగుణమున పృధ్వీ సముడు
సూర్యతేజుడు శ్రీరఘురాముడు
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె
అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు
అన్నిట శ్రీరాముని సముడు
అన్నకు తోడు నీడయై నిలిచెడు
అజేయుడు శత్రుభయంకరుడు
సామాన్యులు కాదు సోదరులిరువురు
నిను వెదకుచు మమ్ము కలసినారు
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె
పవనకుమారుని పలుకులను విని
అతడు నిజముగ రామదూత అని
ఆనందాశ్రులు కన్నుల నిండగా
చిరునగువులతో జానకి చూడగా
ఇదిగో తల్లి ఇది తిలకింపుము
రాముడంపిన అంగుళీయకుము
అని హనుమంతుడు భక్తితో పలికె
అంగుళీయాకము సీతకొసగెను
రామచంద్రుని ముద్రిక చేగొని
అశ్రులు నిండిన కనుల కద్దుకొని
మధురాస్మృతులూ మదిలో మెదల
సిగ్గుచేత తన ముఖము వంచుకొని
ఇన్ని రోజులకు తనలో కలిగిన
శుభశకునములకు ఫలితమిదేనని
జానకి పలికెను హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో
ఎన్నడు రాముడు ఇటకేతెంచునో
ఎన్నడు రావణుని హతము చేయునో
లక్ష్మణుండు తన అగ్నిశరములతో
కృరూరరాక్షసుల రూపుమాన్పునో
సుగ్రీవుడు తన వానర సేనతో
చుట్టుముట్టి ఈ లంకను గూల్చునో
జానకి పలికెను హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో
రావణుడొసగిన ఏడాది గడువు
రెండు నెలలతో ఇక తీరి పోవును
రామలక్ష్మణులు వచ్చుదనుక నను
బ్రతుకనిత్తురా అసురులు నన్ను
ప్రాణములను అరచేత బట్టుకుని
ఎదురుచూతునీ రెండు నెలలని
జానకి పలికెను హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో
నీ వలెనే శ్రీరామచంద్రుడు
నిద్రాహారములు మరిచెనమ్మా
ఫలపుస్పాదులు ప్రియమైనవి
హా సీతా అని విలపించనమ్మా
నీ జాడ తెలిసి కోదండ పాణి
తడవు చేయక రాగలడమ్మా
ఓ హనుమంతా నినుగనినంతా
నాలో గలిగె ప్రశాంతత కొంత
వానరోత్తమ్మా నును వినినంతా
నే పోదితిని ఊరట కొంత
రాముని వేగమె రమ్మని పలికుము
రెండు నెలల గడువు మరువబోకుమా
ఎమ్ ఎస్ రామారావు సుందర కాండము2