ఈ నిశీథ మధ్యమ్మున నే నొకండ
ఈ నిశీథ మధ్యమ్మున నే నొకండ
ఘోర కాంతార కుటిల కఠోర వీథు
లందు తిరుగాడుదును భయమంద గాని
లోకమోహన తారావిలోకనముల
వలదు కనుసైగ చేయగా వలదు నాథ!
ఇంచు కేనియు వెరవ స్వామీ, త్వదీయ
పాణినిర్గత నిర్ఘాత పాతమునకు;
ప్రళయ జంఝా ప్రభంజన ప్రబలధాటి
వడకు శైశిరవల్లికా పత్ర మటుల
హృదయము చలించు భవదీయ వదనసీమ
ప్రణయ దరహాస కౌముది పరిమళింప!
ఇ మ్మహావిశ్వ మల్లలాడించు నీదు
బొమముడి కషాయ వీక్షణస్ఫూర్తి చిమ్ము!
బురదలో క్రుళ్ళి పొరలాడు పురుగు నెత్తి
కాంత, చేర్చకు మోయి నీ కౌగిలింత!