ఆరోగ్య భాస్కరము/31-40 పేజీలు
పకమౌ ధ్యానము చేయుచుండినను మత్పాదస్థమౌ వ్యాధి యిం
చికయుం దక్కువసేయ వేమనుదు? నశోకంబుఁ జల్లార్ప. వీ
వికృతవ్యాధి యిఁకెంతకాల మిటు న౯ వేఁచ౯వలె౯ భాస్కరా!
త్కవితను వ్యర్థపుచ్చుదునుగాక. సదా యిటు స్తూయమాను నీ
రవిత సహార్థమయ్యెడిని. రక్షణసేయక యుంటివేని నీ
వవుదువొ కావొ ధూతఋణుఁ డయ్యది యోజనసేయు భాస్కరా!
కవి గాంచంగలఁ డ౯ జనశ్రుతి భవత్కర్ణప్రవిష్టంబుగా
కవిలంబంబుగ నాదు పాదరుజ నీ వంతంబునొంచింపవే౯
వివరింతుంద్వదదఃప్రవృత్తియచట౯ వెర్వేఱుగా భాస్కరా! ౨౧౨
భవదీయంబదు ధ్యాన. మైనయవియుం బద్యంబు లిన్నూటిపై.
దవులంద్రోయపు నాదుపాదరుజ. నీదాక్షిణ్యమేమందు? ఇ
య్యవియేయౌనొకొ ధ్యాయమానకరణీయప్రక్రియల్ భాస్కరా!
హృదయంబందున ధ్యాయమానులగుచో నేదేవతల్ ధ్యాతృకా
మదుఘుల్గారు తలంప? కష్టములఁదా ర్మన్నించిపోకార్ప? రా
పదలం బాపెడివాఁడె దేవుఁడును సంప్రార్థ్యుండును౯ భాస్కరా!
రభసమున౯ సహస్రకరరాజి నిగుడ్చెదు. మాడ్చెదే? మహా
ప్రభువని యాచ్నచేసితిని భ్రాంతి. కటా! ఇటులౌటెఱుంగ. నీ
ప్రభ వెలిగింప కస్మదురుపద్రుజ మాంపు మిఁకేని భాస్కరా! ౨౧౫
భ్యర్థితుఁడౌ సదర్థి వెస నర్థుల కర్థము లొచ్చిపుచ్చు. సం
వర్థితుఁ డెందు దేహియనువానికి నాస్తియనండు. నీవె నా
ప్రార్థన వ్యర్థపుచ్చుటకుఁ బాల్పడినాఁడవు నేఁడు భాస్కరా! ౨౧౬ వ్వారలు నాదుపాదరుజఁ బాపఁగలారలు కానఁ బంపు మ
వ్వారల నీవు. ము౯ జ్యవను వార్ధకమూడిచి కన్నులిచ్చియు౯
మారశరీరు బుష్పసుకుమారు నొనర్పరె వారు భాస్కరా! ౨౧౭
కంటివి శిష్టదుష్టులను గాచఁగ నేఁచఁగ దక్షుఁడౌ యము౯.
కంటివి దుస్థ్ససుస్థుఁడయి కాల్చను దేల్చను శక్తుఁడౌ శని౯.
కంటి జగత్పవిత్రధుని. కంటి ననుం గడగంట భాస్కరా! ౨౧౮
కాంతకు సంతతంబు నిలుగట్టెడి పద్మిని యింతి. ఇంత శ్రీ
మంతము నీకుటుంబ మణుమాత్రము భక్తజనాళిపైఁ గృపా
వంతముగాకపోవుటకె వంతపడ౯ వలెఁగాదె భాస్కరా! ౨౧౯
త్తీర్ణుఁడనౌచునుంటిని నదీనిభ పద్రుజనుండి. మానుషా
కీర్ణముగాని త్యాగమన ఖేచరులెల్లను దద్వితీర్ణము౯
పూర్ణముగా భుజించుటకెపో. ఇఁక దేనికిఁగారు భాస్కరా! ౨౨౦
స్వకవచకుండలంబులను శక్రున కీయఁడె కర్ణుఁ? డింక జం
కక శిబి కోసియీఁడె మెయికండలు బోయకు? ఎంచిచూడ నిం
చుకది యనామయం. బొసఁ గఁ జూడవు దానినె నీవు భాస్కరా!
ఆత్మజుఁడైన కర్ణునకు నాయువుపట్తగు వర్మముం గఠో
రాత్మకుఁడై హరించె. బలి నట్టులె చక్రియు మోసగించె. శు
ద్ధాత్ములు దేవతల్. మఱి తదర్థ మదేమొ యెఱుంగ భాస్కరా!
అనుకొనెఁగాని యింద్రుఁడు మహర్షి బలాత్కృతిఁ జచ్చిపోకకు౯
మనమునఁ గుందఁడయ్యె నణుమాత్ర. మెవం డెటులైన స్వీయపు౯
బను లగుటే ప్రధానము సుపర్వుల. కేమననౌను భాస్కరా! ౨౨౩ (5)
న్నాళ్ళో యైనది యివ్వియేరుపడియు౯ ధర్మప్రచారార్థమై
ఊళ్ళున్ వీళ్లు చరించుచుండెడిది నాయుద్యోగ. మట్లౌటచే
క్రుళ్ళంజేయ కనామయంబు సరవిం గూర్పంగదే భాస్కరా! ౨౨౪
కర్మం బాఁగి స్వధర్మను౯ నిలుపనౌ కాలఁబుచూ యిద్ది. శ్రీ
ధర్మాచార్యుల యాజ్ఞ బైల్వెడలె విద్వచ్ఛ్రేణి యద్దానికై.
కూర్మంబై గృహకూపమందు మను నా కుందార్చవే భాస్కరా!
తరకృషి సేసియుంటిఁగద ధర్మముఁగూర్చియె. అట్టిధర్మమే
దురితులొ సంస్కరింతుమని దూఁకులుపెట్టెడిచోఁ బ్రతిక్రియ౯
జరుపఁగఁజాలునంత బలసంపద యీయకపోతి భాస్కరా! ౨౨౬
స్మద్వైదుష్య మొకింతఁజేర్చి యచట౯ మాసంబుమాసంబుఁ ద
ద్విద్వద్వ్యాసము లెల్లదేశములలో విఖ్యాతముల్సేయున౯
పద్వైకల్యముతోడ నుండుమనుచు౯ బంధించెదే భాస్కరా!
హరుఁడౌ వేంకటరామశాస్త్రి మొదలౌ వాయాయి విద్వాంసులం
దఱితో నేనును దేశదేశములలో ధర్మప్రచారంబుల౯
జరుప౯ రానటు కాలితీఁపొక డిటుల్ సంధించెదే భాస్కరా!
రోగ్యశ్రీదముకాని తావక బృహద్రూపంబు భాగ్యంబు కిం
భోగ్యం బుర్విని గంటకావృతఫలాపూర్ణాంరముంబోలె. ఆ
రోగ్యం భాస్కరయన్న వాక్యము వ్ర్థారూఢంబుగా భాస్కరా!
గోళ్ళం జిమ్మెడిదాని నెందులకుఁగా గొడ్డండ్రచేఁ జిమ్మె? దే
రోళ్ళ౯ రోకళులం ద్వదీయమగుపే ళ్ళూళ్ళూళ్ళఁ బాడింతు. నా
కాళ్ళుం గీళ్ళుఁ గుదుర్పు మేటి కిటులం గైలాటముల్ భాస్కరా! సచ్చిత్తుండు ప్రసాదరావు. లవము౯ జంఘామయం బాఁగ. దే
నెచ్చో నేగుదు? ఏమిసేయుదు? కటా! ఎవ్వా రిఁక౯ దిక్కు? నీ
హెచ్చెల్లం దెలియంగ వచ్చినదిలే యీనాఁటికి౯ భాస్కరా!
ప్రతుఁడు ప్రసాదరావు. తన వైద్యత కించుక త్వత్ర్ససాదము౯
జతయయియుండ భాస్కరుని సన్నుతిసేయుచు నొక్క పద్యపు౯
శతకము వ్రాయుమంచుఁ బెలుచం బురికొల్పెను నన్ను భాస్కరా!
హమ్మెటువంటిదైనది యథార్థ మెఱింగియుఁ దత్ప్రణీత
క్యమ్మున భ్రాంతమై మరల నందుఁ బ్రవిష్ట. మిఁకద్ది యెన్నిప
ద్యమ్ములనల్లునో. శతకమయ్యె మఱొక్కటియయ్యె భాస్కరా!
ద్రుగతిశయమ్ము. నీరుదిగి తొల్లిటికంటె నొకింత భారమై
అగుపడుచుంటఁ జెప్పుటయు నయ్యది హేతువుకాదు కాలిదౌ
తెగులునకంచుఁ బల్కె మును. తెల్పెనిటిప్పు డతండు భాస్కరా!
ర్పడ్డది యాసుపత్రి. అటఁ బాలునురొట్టెయు వారెయిచ్చి యీ
బుడ్డనుగోసి నీర్దిగిచిపుత్తురనె౯ మఱి. అద్ది గుండెపై
పెడ్డను గొట్తినట్టులయి భీతిలితిం జన నందు భాస్కరా! ౨౩౫
వ్రాఁతకుఁ గుంది యందుఁ బదివాసరముల్ వసియించి వెండియు౯
భూతముచాడ్పునం బయికిఁబొంగిన వేఁడిమి నాఁపివేయ నే
చేఁతయుఁ జేయలేక కడు క్షీణబలుండనునైతి భాస్కరా! ౨౩౬
నేగతి నర్సరాట్పురికి ఇంతటిక్షీణబలుండ వండ మే
లాగునఁ జీలిపించెదని లావుభయంపడు బంధుసంచయం
బాఁగి ప్రవిష్టుఁడైతిఁ దుద కాంగ్లభిషగ్వరశాల భాస్కరా! కఱకుంగత్తుల యాపరేషనుగదిం గాల్వెట్టుడు౯ వచ్చిర
ప్డిరువు ర్డాక్టరు. లిచ్చిరంత స్మృతివో నేమందొ తత్సత్తచే
ఎఱుఁగ౯ రాకెది నిద్రపట్టినటు లయ్యె౯ నా కహో భాస్కరా!
తీయఁగనైన నీరమును దీసి స్వకీయపు నేర్పుకల్మిమై
చేయఁగనున్నదంతయును జేసి క్రమంబుగ వార లాపల౯
పోయిరి తెల్విలేనినను భూశయనంబునఁ జేర్చి భాస్కరా! ౨౩౯
ఆశదొలంగెఁ జుట్టలకు. హాయనుచుండిరి. కాని యింతలో
క్లేశములొందువార లిల లేరని కన్నులు విప్పి చూచితి౯.
దేశము గొడ్డువోవదొకొ నే ధుతజీవుఁడనైన భాస్కరా! ౨౪౦
మోయంగాఁగలవారలెవ్వ? రిడియెంబోనాకుఁ దద్బ్రహ్మ దీ
ర్ఘాయుష్యంబు. ననర్థితుండతఁడు తా. ఆరోగ్యముంగూర్చి యెం
తో యభ్యర్థితుఁడీ. వటయ్యు నిడ వోహో దాని నోభాస్కరా!
చేవదొలంగియుండియును జీవముఁ బాయను నేను. వెండి ఛి
న్నావయవంపుఁజర్మమది యల్లుకొనె౯ దివసాష్టకంబులో.
పోవఁగనయ్యెఁ దద్వికృతి. పూర్వపుటాకృతివచ్చె భాస్కరా!
సిన యాడాక్టరునింటి. కాయన కడు౯ శిష్టుం. డసిష్టాంటుస
ర్జను. మధ్వావనిదేవవంశజుఁడు. పేర౯ మాధవాచార్యుఁ. డా
ఘను కారుణ్యముకల్మి నింతతొరగా గట్టెక్కితి౯ భాస్కరా!
పావిధిగానె యున్నయది. అండగనీరమె మూలమైనచో
పోవుచునుండె నప్డెయది. పోవదుకావున నుష్ణమూలమం
చేవియొ మందు లీఁగడఁగె నింకను డాక్టరు నాకు భాస్కరా! ఎన్నం బుట్టదరిద్రుఁడ౯. శిరముపై నెంతేనిభారం బొకం
డున్నట్టిండను. పత్రిక౯నడపు టాయున్నట్టిభారంబు. దా
నిన్నే నాఁపను శక్యమైనవఱకు౯ నేమంబుగా భాస్కరా! ౨౪౫
ట్టెందుద. కెన్నిమందులొ యిడె౯ భిషగౌఘ. మనామయంబు పే
ర్మిందయసేయు దీవనుచు మిక్కిలియాశను నిన్నుఁగూర్చి నే
వందలపద్యముల్ రమణ వ్రాసితి. రోసితి లోన భాస్కరా! ౨౪౬
మ్యక్కృతమైన యౌషధములందునులేదు తలంప. మాయచే
ధిక్కృతులౌచు భూజనులు దీనినొ దానినొ మెక్కి రాళ్ళకు౯
మ్రొక్కి వ్రయప్రయాసలను బొందుచునుంద్రు వృథాగ భాస్కరా!
ప్రశమితబాధుఁ జెయఁగదె భాస్కర! నన్నని దీనతన్ భవ
ద్యశము ననేకధా పొగడి యైతిని వ్యర్థుఁడ. కాని కర్మమే
కుశలము దేనికి౯. పరులకు౯ ముడివెట్టుట భ్రాంతి భాస్కరా!
అనుభవితవ్య. మయ్యది యథార్థము. దీని నెఱింగియుండియు౯
మన మతిచంచలంబగుట మార్గముదప్పితి. నీదుసంస్తుతుల్
పొనరిచియుం బొనర్చి విఫలుండనె యైతిని నేను భాస్కరా! ౨౪౯
ఆగం బెవ్వరికేనుజేసితినొము న్నద్దానికి౯ మాఱు ప
ద్రోగం బిల్లు కలంచుచున్నయది. ఆరోగ్యంబు తద్దుష్క్రియా
యోగంబుండినదాఁకా గల్గ, దది యెప్డో నాకిఁక౯ భాస్కరా!
న్యక్కృతి. ఆమాయార్దితుఁడనై యిటులంటి. క్షమింపుమంటి. పై
మ్రొక్కుచునుంటి. అన్యులకు మ్రొక్కిన మ్రొక్కకయున్న నీకునే
మ్రొక్కకతప్ప. దంవహము మ్రొక్కనె సంధ్యలయందు భాస్కరా! సంధ్యాదేవత త్వత్స్వరూపిణియె. చిచ్ఛక్తిం ద్వదాకారఁ ద
త్సంధ్య౯ వార్వమి శూద్రుఁడై శతజనుశ్చంచాలుఁడౌ బ్రాహ్మణుం.
డాంధ్యంబూని త్యజించుచుండెనతఁడి ప్డాకర్మము౯ భాస్కరా!
తావకసేవ సేయుటది తప్పదు. నేను ద్విజుండ. శాస్త్రపు౯
త్రోవఁ ద్యజింప నక్షముఁడ. తొట్రిలకుండఁ దదధ్వమందున౯
పోవఁగలేమికి౯ మదిని బొక్కుచునుండెడివాఁడ భాస్కరా! ౨౫౩
భూప్రజకున్నె సిద్ధి? మఱి పొందునె సద్గతుల౯? సుఖించునే?
విప్రుఁడుగూడ నేలొ కలివి స్సృతి నియ్యెడఁ గామకారత౯
సుప్రధితత్వముం బొరయఁజూచుచునుండినవాఁడు భాస్కరా! ౨౫౪
మూలచ్ఛేదముగామిఁ జేయవలసెంబో కర్మవాదంబు లి.
ట్లోలిం జాల శమించె నయ్యదియు. ఆ యుద్యంతమ స్తంయమ౯
మేలౌ వేదపుముక్కచిక్కినది. మేల్! మేలింకనౌ భాస్కరా! ౨౫౫
విదుఁడౌ బ్రాహ్మణుఁ డొందుసర్వశుభముల్ వేడ్కల్ పిసాళింపనం
చదిరా యాశ్రుతి చెప్పుచున్నయది. ఇం కాతీరె ధ్యానింతు. నా
పద మౌనెప్పటియట్లు. తక్కు తెగుళుల్ బాధింపవో భాస్కరా! ౨౫౬
సకలం భద్రమటంచు నీశ్రుతియనుంగా! నీయుపస్థానమం
దిఁక మేలైన నహన్యతేప్రభృతు లెన్నేని౯ భవద్దీయమా
న కళారోగ్యచిరాయురాదికముల న్గాన్పించెడి౯ భాస్కరా! ౨౫౭
ఖాక్రాంతుంబొనరించినా2ండు. చనినాఁ. డంతర్దశానాథుఁ డీ
వై క్రాల్కాలముగూడనైనయదియి. ప్డారోగ్యము౯ భాగ్యము౯
నీ క్రీగంటనుజూచుమాత్రఁ గలుగు౯ లే నాకిఁక౯ భాస్కరా! ప్రారంభించి యొకబ్దము౯ గడపఁగానయ్యె౯. కృతాచారసం
స్కారుండైన పరాశరుం డనె "కలౌ సంవత్సరే" యంచు. నీ
కారుణ్యంబున రోగవర్జితుఁడనేఁగానే యిఁక౯ భాస్కరా! ౨౫౯
న్యాయంబౌటటులుండ నాదు హితులున్ న౯ గూర్చి నీస్తోత్రము౯
చేయంబూనిరి. వారికోసమయినన్ శీఘ్రంబుగా నాయెడ౯
నీయౌదార్యముఁజూపు దౌదు నిఁకనే౯ నీరోగుఁడ౯ భాస్కరా!
బ్రాయుఁడు సన్మదర్థమయి రాఘవుమీఁద ననేకపద్యముల్
వ్రాయఁగడింగినాఁ. డతని వ్రాఁత లతండు ననేకధా వృథా
చేయఁడనామయంబునిడు. శ్రీయునుగూర్చెడి నాకు భాస్కరా!
పతిశతకంబునుం దనదు పట్టికి భార్యకు నాయు విచ్చి ప్రో
చుతమని వేంకటేశ్వరుని స్తోత్రముసేయుచు నింకనొక్కడౌ
శతకము వ్రాసినట్టి బుధసన్నుతుఁడున్నతుఁ డెన్న భాస్కరా!
చ్ఛ్రీరాముండు. సమ స్తసంపదలునుం జేకూర్చు. లోకత్రయా
ధారుం దద్భవదూరుఁగూర్చి యసకృద్దండంబు లర్పించి పూ
ర్ణారోగ్యంబునుబొందుకాలమది యత్యాసన్నమో భాస్కరా! ౨౬౩
స్థుని దిక్ష్వాకునృతాలు నన్వయము. తత్షోణీధవాగ్ర్యుండు నీ
మనుమండౌ మను నాత్మజాతుఁ డిటుల౯ క్ష్మాపుత్రికాజాని త్వ
జ్జననంబందె జనించె. కాఁడు పరుఁ డెంచ౯ నీకుఁదా భాస్కరా!
క్షాన్నారాయణుఁ డంబుజాసనమునం గ్రాలు౯. భవన్మండలం
బు న్నిత్యంబు నలంకరించు. అతఁడేపో ధ్యేయుఁ డార్యాళి. కా
వెన్ను౯ సన్నుతి సేయుచుంటి. నిడులే వే సౌఖ్యము౯ భాస్కరా! వేని శిరశ్శ్రవోంసముల వెల్గుఁ గిరీటసుకుండలాంగదాల్
వేని కరంబుల౯ సతము వీడకయుండెడు శంఖచక్రముల్
వాని కనామయంబునిడ వందనము ల్పొనరింతు భాస్కరా! ౨౬౬
డేడీ వాఁడు పరుండెయైన? అగు దీవే వాఁడు నవ్వాఁడె నీ
వీ డెవ్వాఁడును గాఁడు నీకు రుజ మాయింప౯. కటాక్షించి నా
వాఁడే వీఁడని రోగశేషము శమింపంజేయవే భాస్కరా! ౨౬౭
ద్విజులకుఁ జేయు దానములు వేల్మి జపంబు సురార్చనంబు భే
షజములు దాని శాంతికగు సాధనముల్. భుజియించుచుంటి భే
షజము సురార్చనంబు తగ సల్పుచునుంటి స్తుతించి భాస్కరా!
ద్ధురమై వేఁడియె వీడ దించుకయు. ఆదుర్వ్యాధియే మూల మీ
చరణవ్యాధికి. కాన నెట్లయినఁ దత్సంహారముం జేసితే౯
సురుగుం బూర్తిగఁ గాలితీఁపు. బలముం దో నబ్బెడి౯ భాస్కరా!
ష్ణేన ప్రశామ్య తేయనుట నిక్కముగాఁగల. దట్లుగాన నె
ట్లేనియు వేఁడివేల్పవగు నీవె సమస్తము చక్కగాఁగ నా
మేనఁగలట్టివేఁడిని శమింపఁగఁజేయఁగనౌను భాస్కరా! ౨౭౦
గులగుల. గోకలేక నునుగోళ్ళును దోళ్ళగుచుండె. రేఁబవ
ళ్ళొలికెడి రస్త మంగములనుండి. శరీరము పుండ్లతోడ సం
కులమును నీరసంబు. కనుగొమ్మిటు నాదురవస్థ భాస్కరా! ౨౭౧
గాదిలిబిడ్డ లందఱికిఁ గల్గెను. కాని యొకండు చెప్పె మీ
బాద దొలంగుకాలమది ప్రాప్తముకావున నీవిధంబుగ౯
మీఁదికిఁబొంగె రోగమని. మిక్కిలి సంతసమయ్యె భాస్కరా! కూడ౯ నేఁడు సమాక్రమించినది. ఆకువ్యాధియే వేఁడి. తా
పాడైపోవనె యద్ది పొంగినదిపో పామాకృతిం బైకి. నీ
వేఁడి౯ సైఁపఁగలేక యీవల కిటుల్ వెళ్ళంగనౌ భాస్కరా!
వలఁగూర్చుండిన నేమితక్కువ? జగద్బంధుండవైనట్టి నీ
అలఘుప్రేమము మాపయిం గలుగ మాయారోగ్యభాగ్యంబు ల
గ్గలమే యయ్యెడిఁగాని యున్నె కొద నిక్కంబారయ౯ భాస్కరా!
ఉపచారంబులు చేయఁగావలయు. నిం కుత్పన్నసౌహార్దులై
నపయిం గైతవ మౌపచారికము. కాన౯ సుప్రసన్నాత్ము నీ
ఉపచారంబులు కట్తిపెట్టుదును నేనుచ్చైఃకరా! భాస్కరా! ౨౭౫
ర్వత్ర స్వమిత్రభావమును వారక చూపనె చూపుచుందు. వే
స్తోత్రముతోడి యక్కఱయు సుంత కనంబడ. దందు రోగము
గ్గాత్రునిపట్ల మిత్రుఁడధికంబుగఁజూపఁడె మైత్రి భాస్కరా! ౨౭౬
స్తుతి సంపూర్ణముసేయుచుంటి. ఇఁక నా సూనుత్రయం బేను నా
సతి నీయగ్గము. మత్కుటుంబమునకు౯ సంరక్షకుం డీవె. క
ల్గుత మారోగ్యము తీఱుత౯వ్యధులు. శ్రీలుం గూడుత౯ భాస్కరా! ౨౭౭