ఆధునిక రాజ్యాంగ సంస్థలు/నాల్గవ ప్రకరణము

నాల్గవ ప్రకరణము.

ఐక్య రాజ్యాంగము, సమ్మేళన రాజ్యాంగము

ఒక్కజాతికి జెందిన, ఒక్కదేశమునకు సంబంధించిన, ప్రజలతో మరియేయితర ప్రభుత్వముల సహకారము నపేక్షించకయే రాజ్యాధికారము పొందినదే ఐక్యరాజ్యాంగము. ఈ రాజ్యాంగమునకు లోబడియే, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, ప్రజల ప్రత్యేకసంస్థలు తమతమ కార్యముల నెరపుకొనుచుండును. అద్దాని యధికారము, దానికి సంబంధించిన దేశమందు, సంపూర్ణత బొందియుండును. సమ్మేళన రాజ్యాంగమందట్లు లేక, సమ్మేళన ప్రభుత్వమునకు కొంత రాజ్యాధికారము, సభ్యరాష్ట్రములకు మరికొంత రాజ్యాధికారము పంచి యివ్వబడును. ఈ రెండువిధములగు ప్రభుత్వములు పరస్పరముగా సహకార మొనర్చుకొనుచున్నప్పుడే, రాజ్యాంగమంతటి యధికారము, ఐక్యరాజ్యాంగాధికారముతో సమానత్వము బొందకలదు. ఐక్యరాజ్యాంగములను బొందిన రాష్ట్రములు కొన్ని సమ్మేళనమందు జేరిననె, సమ్మేళన రాజ్యాంగ మేర్పడుచున్నది. అట్టియెడ సభ్యతపొందు ప్రతి ఐక్యరాజ్యాంగమును, తన యైక్యత స్వయంనిర్ణయ సూత్రముల వీడి సమ్మేళనమందుజేరి, సమ్మేళన రాజ్యాంగమందు, తన సంపూర్ణస్వరూప ప్రకటనను బొంద గోరుచుండును. సమ్మేళన రాజ్యాంగమేర్పడుటతోడనే, సభ్యరాజ్యాంగములకు మించి, మరొక రాజ్యాంగ సంస్థ యేర్పడుచున్నది. అంతటితో సభ్యరాజ్యాంగములకు తమపూర్వపు ఐక్యతబోవుచున్నది. సమ్మేళనరాజ్యాంగమున, ఐక్యరాజ్యాంగములకుండు సంపూర్ణత సంపాదితము కాజాలదు.

ఆదిమకాలమందు అన్నిదేశములందునను కుటుంబపరిపాలనమునుండి, 'కుదురు'ల పెత్తనమువరకు, అనేక 'కుదురుల'

ఆదిమకాలము.

సమూహమునుండి జాతుల సమ్మేళనమువరకు, క్రమముగా అనేకరీతుల అనేక పరిస్థితులందు, సమ్మేళనములు జరుగుచునేయుండెను. కాలావసరములబట్టి కుటుంబములు కుదురులందు, కుదురులు జాతులందు, జాతులు దేశస్థులందు దాదాపుగా ఐక్యత జెందిపోవుట తటస్థించుచుండెను. కొన్నిదేశములం దిట్టి వివిధసంఘములు, జాతులు సంపూర్ణైక్యత బొందుటచే, నిరంకుశ రాజ్యపాలనమేర్పడుటయు సాధ్యమగుచుండెను. ఆయానిరంకుశ పాలకుల యిష్టముననుసరించి, వివిధకుటుంబముల, జాతుల యొక్క సాంఘిక, ఆర్థికప్రత్యేకత నిల్పబడుచుండెను. చైనా, భారతదేశములందుమాత్రము రాచకీయమునందుకూడ, సంపూర్ణఐక్యత సంభవించక, సమ్మేళన రాజ్యాంగమే యేర్పడెను. వివిధపంవాయతులు, రాజులమధ్య రాజ్యాధికారము ఆచారమాత్రముగ ధర్మశాస్త్రబద్ధముగా విభజింపబడియుం డెను. పంచాయతీల హక్కుల వమ్ముజేయుట కేరాజునకు ధర్మశాస్త్రమునకు బద్ధుడై యుండినచో, అధికారములేకుండెను. రాజు తనకు నిర్ణీతమైన రాజ్యాంగాధికారమును ప్రజానాయకులసలహాలపై సహకారముతో నడుపవలసియుండెను. ఇటులనే పాశ్చాత్యదేశములందును, ఆశియాఖండమునుండి దండయాత్రలపై వెళ్ళి రాజ్యాధికారము సంపాదించుకొనిన జాతులందు (ఫ్రాంకులు, ఆస్ట్రోగాత్‌లు, మంగోలులు వగైరాలు) 'కుదురుల' నాయకులు, జాతులనాయకుల సలహాలపైననే, సహకారముతోడనే, రాజులు రాజ్యపాలన మొనర్చుచుండిరి. క్రమముగ పట్టణములు గ్రామముల నిర్మించుకొని, దేశజీవితమును స్థిరపరచుకొన్న పిదపకూడ, వివిధ 'కుదురు'ల, జాతుల సమ్మేళనముల ద్వారానే గ్రీసుదేశపు నగర ప్రజాస్వామిక రాజ్యాంగములు, రోమన్‌నగర ప్రజాస్వామిక రాజ్యాంగము యేర్పరచబడెను. కాని క్రమముగా ఈ సమ్మేళనము లందు జేరినజాతులు తమ ప్రత్యేక రాజ్యాధికారముల బోగొట్టుకొని ప్రధాన రాజ్యాంగమందు తమవ్యక్తిత్వమును అంతర్గర్భిత మొనర్చి, 'ఐక్యరాజ్యాంగము'ను కలుగజేయుచుండిరి. కనుకనే గ్రీసుదేశమందలి వివిధనగర రాజ్యాంగములను సమ్మేళన రాజ్యాంగమందు జేర్చుటకు ఆకాలపు రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞులు అంగీకరింపరైరి. వివిధజాతుల ఒక్కరాజ్యమందు, వివిధరాజ్యములు ఒక్కసామ్రాజ్యమందు సంపూ ర్ణముగా కలిసిపోవుట ఆకాలపు గ్రీకులకు సహజముగా కన్పడెనుకాని, సమ్మేళన మేర్పరచుట వారికిష్టములేక పోయెను. కావుననె అనేకమారులు వివిధ రాజ్యాంగములు తాత్కాలికావసరములబట్టి సమ్మేళనముల నేర్పరచుకొనుచుండినను, ఆసమ్మేళనములు శాశ్వతము కాజాలవాయెను. అటులనె రోమన్ ప్రజలు తమరాజ్యాధికారము హెచ్చగుకొలది తమ రాజ్యములో జేరుచుండిన వివిధదేశములయొక్క రాచకీయ వ్యక్తిత్వముల తగ్గించి వైచుచుండిరేకాని, సమ్మేళన రాజ్యాంగము నేర్పరుప బ్రయత్నించరైరి.

ఆధునిక కాలమందు ఇట్టి సమ్మేళన రాజ్యాంగములు, హాలాండునందును, స్విట్జర్లాండునందును (1648)

శ్రీఆస్టిను ప్ర
భృతుల వాదము.

యేర్పరుపబడెను. కాని, స్వాతంత్ర్యయుద్ధానంతరము, అమెరికాయందు సంయుక్తరాష్ట్రసమ్మేళన రాజ్యాంగము 1789 లో అమలునకు వచ్చినప్పుడు రాజనీతిజ్ఞులు ఆశ్చర్యమందిరి. ఆదేశమందు విశాలమగు భూభాగములకు సంబంధించిన, పదమూడు స్వతంత్రరాజ్యములు (ఐక్యరాజ్యములు) తమతమ ఐక్యతను పోనాడి, సమ్మేళనరాజ్యము నొక దానిని, తమపైనిర్మించుకొనుట అపూర్వమగు కార్యముగానుండెను. అప్పటివరకును రాజ్యముల ఐక్యతగురించి సంపూర్ణ స్వయం నిర్ణయతాధికారముగురించి, అవిభక్తత వినాశనము అన్యాక్రాంతముచేయ వీలులేకుండుటను గురించి, పట్టుదలవహించి వాదించుచుండిన రాచకీయవేత్తలు, తమవాదము వృధాయైనదాయని నివ్వెరపడజొచ్చిరి. అంత, కొందరు రాచకీయశాస్త్రజ్ఞులు అమెరికా సంయుక్తరాష్ట్రసమ్మేళనము, రాజ్యాంగము కాదనియు, అందు రాజ్యాంగాధికారమెచ్చటను స్థిరతజెంది, ఐక్యతబొంది యుండలేదనియు వాదించమొదలిడిరి. వీరినాయకుడు శ్రీ జాను ఆస్టినుగారు రాజ్యాధికారము, అవిచ్ఛన్నమైనదనియు, అవిభక్తమైనదనియు, ఆమోదనీయమనియు నిరూపించి, అట్టిలక్షణములు అమెరికా రాజ్యాంగవిధానము నందెచ్చట కన్పించుట లేదని వాదించిరి. రాజ్యాంగాధికారము, ఆస్టినుగారు చెప్పినట్లు, ఐక్యతను, స్వయంనిర్ణ యతను బొందియుండుట, సాధారణపరిస్థితులందు అసాధ్యమనియు, అట్టి సంపూర్ణైక్యతబొంది, స్వయంనిర్ణయత్వము కల్గియుండు రాజ్యాంగాధికారము, ప్రపంచమునందలి ప్రజలందరియందును కూడ అంతర్గర్భితమైయున్నదని యీకాలపు రాచకీయజ్ఞులు వాదించుచున్నారు. శ్రీ సర్ హెన్రీమెయినుగారు, మనదేశపు పంచాయితీల వృత్తాంతము దృష్టాంతముగాగైకొని, శ్రీ ఆస్టినుగారివలె సంపూర్ణరాజ్యాధికారమును, వివిధరాచకీయ సంస్థలయందు గుర్తించ బ్రయత్నించుట పొరబాటనియు, సమ్మేళనరాజ్యాంగవిధానము, సహజమైన వృద్ధిలక్షణమనియు వాదించిరి. ఇప్పటికి సమ్మేళనరాజ్యాంగమునకు, రాజ్యాధికారములేదని వాదించువారెవ్వరునులేరు. మానవజీవితము రాచకీయమందుకూడ వృద్ధిజెందవలయునన్న, సమ్మేళనసూత్రానుసారముగనే సాధ్యమగునని రాచకీయజ్ఞులు వాదించుచున్నారు. ప్రపంచమందలి వివిధరాజ్యాంగములు కూడికజెంది మానవకోటికి కళ్యాణము కలుగజేయవలెనన్న, సమ్మేళన రాజ్యాంగమువలననే సాధ్యమగునని అభిప్రాయపడుచున్నారు. కనుకనే అమెరికా వారిననుసరించి, దక్షిణాఫ్రికా ఖండమందలి కొన్ని రాజ్యాంగములు సమ్మేళనము చేర్చు కొనెను. కెనడా (1867) ఆస్ట్రేలియా (1900) దక్షిణాఫ్రికా (1909) దేశములందును సమ్మేళనరాజ్యాంగములు లేర్పరచబడెను. జర్మనీ, ఆస్ట్రియాదేశములందు యుద్ధానంతరము సమ్మేళన రాజ్యాంగములు స్థాపించబడెను. తుదకు నానాజాతి సమితి సమ్మేళనరాజ్యాంగసూత్రముల ననుసరించియే గుర్తించ బడినది.

ఇటులనే మనదేశమందును, బ్రిటిషుయిండియాలో నున్న రాష్ట్రములను, సమ్మేళనమందుజేర్చి, సమ్మేళనరాజ్యాంగమున

భారతీయస
మ్మేళనము.

కివ్వబడిన అధికారములుపోగా మిగిలిన రాజ్యాంగాధికారమును, రాష్ట్రముల కొసంగవలయునని, ముస్లిమునాయకులు వాధించుచున్నారు. అనగా మనరాష్ట్రీయప్రభుత్వములు, తమయధికార ముల నిప్పటివలె కేంద్రప్రభుత్వమునుండి పొందుటకుమారు, తామే, కేంద్రప్రభుత్వమున కెట్టియధికారముల నొసంగవలయునో విచారించుస్థితికి రావలయునని, ముస్లిమునాయకులు వాదించుచున్నారు. ఇప్పటివరకు స్వతంత్రత బొందియున్న స్వదేశ సంస్థానములు, తమయైక్యతను కొంతవరకు తగ్గించుకొని, సమ్మేళనరాజ్యాంగమునందు జేరుటయుక్తమని కొందరు వాదించుచున్నారు. క్రమముగా సమ్మేళనరాజ్యాంగము నేర్పరచుటయే మనదేశమునకు లాభకరమనియు, శరణ్యమనియు రాజకీయజ్ఞు లనేకులు వాదించుచున్నారు.

కొందరు రాజకీయనాయకులు (వారిలో ముఖ్యులు శ్రీనివాసశాస్త్రి, జిన్నాగారలు) ఇప్పటికిప్పుడే అఖిలభారత దేశమునకు సమ్మేళనరాజ్యాంగము లేకున్నను ఫరవాలేదనియు, ఒక వేళ సమ్మేళనమేర్పచినను, కేంద్రప్రభుత్వమునకే, సభ్యప్రభుత్వముల కొసంగబడిన యధికారములు పోగా, మిగిలిన రాజ్యాంగాధికార మొసంగుట మేలనియు వాదించుచున్నారు. ఈవాదము, చరిత్రాధారమగు దృష్టాంతములతో బలపడుచున్నది. ఇప్పటి బ్రిటిషుదేశపు ప్రభుత్వము, మనలోని ముస్లిముల ప్రీత్యర్థమై, కేంద్రప్రభుత్వమునకు లోబడియున్న రాష్ట్రీయప్రభుత్వములకు, సభ్యరాష్ట్రస్తానమొసంగ నిచ్చగించుచున్నది. కాని ఇదివరకే సర్వస్వతంత్రతబొందియుండిన రాజ్యములు తమ సాముదాయక లాభములకై సమ్మే ళనమందు జేరుటకద్దు గాని, అస్వతంత్రతజెంది, కేంద్రప్రభుత్వాధికారమునకు లోనై, స్థానిక స్వపరిపాలనాధికారము బొందిన రాష్ట్రములకు, సభ్యరాష్ట్రముల రాజ్యాంగాధికారముల నొసంగుటవలన, సమ్మేళనరాజ్యాంగమున బలహీన పరచుటయు, దేశపు రాజ్యాంగసౌష్టతను దూరమొనర్చుటయు తప్ప, మరేయే యితరలాభమును చేకూరజాలదు. సర్వస్వతంత్రత బొందియున్న రాజ్యములు, తమ వ్యక్తిత్వమును, స్వయం నిర్ణయతాధికారమును పూర్తిగా బోగొట్టుకొనుట కిష్టమొందక, సాముదాయక సహకారపరంపరవలన కలుగు లాభముల బొందగోరుచో, సమ్మేళనరాజ్యాంగము, ఏర్పరుపబడును. మన స్వదేశసంస్థానములు, పూర్తిగా కేంద్రప్రభుత్వమునకు లొంగిపోవుటకు యిచ్చగించుట లేదు. కాని మన కేంద్రప్రభుత్వమునందు చేరి, మన రాష్ట్రములన్నిటితో సహకార మొనర్చి, భారతదేశపు రాజ్యాంగాధికారమందు కొంతభాగము తాము బొంది, తన్మూలమున కల్గులాభముల బొందవలయునని కుతూహలపడుచున్నవి. మన రాష్ట్రము లిప్పుడు, కేంద్రప్రభుత్వమునకు పూర్తిగా లొంగియుండి, ఆప్రభుత్వపు టాజ్ఞలకు బద్ధములై, తమ రాజ్యాధికారముల నడుపుకొనుచున్నవి. అనగా, మన బ్రిటిషు ఇండియాయందు, ఐక్యరాజ్యాంగముకలదు. ఆయైక్యరాజ్యాంగాభివృద్ధి స్వదేశ సంస్థానములకు యిష్టములేదు. తమ కిప్పుడు, తమదేశము లందు, తమ ప్రజలపైయున్న సంపూర్ణ రాజ్యాధికారము చెక్కుచెదరకుండ నుండవలెను. కాని, తమ కిష్టమగునంతవరకు, కొన్ని యధికారములను, సమ్మేళనరాజ్యాంగమున కిచ్చుటకు తయారైయున్నవి. ఇచ్చువారు తామై పుచ్చుకొనునది సమ్మేళనరాజ్యాంగమైయుండుట వారి కిష్టము. సమ్మేళన రాజ్యాంగము లెప్పుడైనను, రాజ్యాధికారమును కొంతవరకుగాని, పూర్తిగా గాని యివ్వకల్గు రాజ్యములచేత యేర్పరుపబడును కాని, పుచ్చుకొను స్థానమందున్న రాష్ట్రములద్వారా యింతవర కెచ్చటను యేర్పడలేదు. కనుకనే, మనవారు కొందరు, సమ్మేళనరాజ్యాంగ మేర్పడినను, మనరాష్ట్రములు, పుచ్చుకొనే స్థితియందుండుట మంచిదనియు, వాని కివ్వబడిన యధికారములు పోగా, మిగిలిన రాజ్యాధికారమంతయు సమ్మేళనరాజ్యాంగమునకు చెందవలెనని వాదించుచున్నారు.

మనరాష్ట్రము లిప్పు డెట్టి స్థితియందున్నవో, అట్టి 'పుచ్చుకొను' స్థితియందు, సామంతస్వామికమందే, కెనడా దేశమందును,

దక్షిణాఫ్రికా కెనడా
రాజ్యాంగములు.

దక్షిణాఫ్రికాదేశమందును, రాష్ట్రీయప్రభుత్వములు కలవు. ఆదేశములకు సమ్మేళన రాజ్యాంగము లేర్పరచబడెను. కాని ఆరాజ్యాంగములు, అమెరికా, ఆస్ట్రేలియా రాజ్యాంగములనుండి, ముఖ్యవిషయములందె, తీవ్రముగా భేదించుచున్నవి. అమెరికా, ఆస్ట్రేలియా దేశములందు, ఇచ్చుస్థానమందు రాష్ట్రీ యరాజ్యంగములుండ, కెనడా, దక్షిణాఫ్రికాలందు, ఆవి "పుచ్చుకొను" స్థితియందున్నవి. ఇందులకు కారణము, అమెరికా. ఆస్ట్రేలియాదేశములందలి రాష్ట్రములు సమ్మేళనమందు చేరుట కంతగా యిష్టపడకుండుటయు, కేంద్రప్రభుత్వమందైక్య మొందుట కభ్యంతరపెట్టుటయు ---- యుండెను. దక్షిణాఫ్రికా, కెనడాలయందు, రాష్ట్రములకు కేంద్రప్రభుత్వమందైక్యత బొందక తప్పినది కాదు.

కనుకనే మనదేశమందిప్పు డెట్లో, అటులనే, కెనడా, దక్షిణాఫ్రికాల యందలి రాష్ట్రీయశాసనసభలు, తమ బిల్లులన్నియు, కేంద్రప్రభుత్వచే నంగీకరింపబడిన పిమ్మటనే, చర్చింపబూనుకొనుటయు, తిరిగి ఆబిల్లులశాసనములుగా ప్రకటించక పూర్వము , దానిని, గవర్నరుజనరలు అంగీకరించవలసి యుండుటయు ఆచారమైయున్నది. తన్మూలమున కేంద్రశాసన సభవారి శాసనములకు విరుద్ధమగు నేశాసనమును, రాష్ట్రీయశాసనసభవారు నిర్మించుటకు వీలులేకున్నది. అమెరికాయందు, ఆస్ట్రేలియాయం దట్లుకాక, ప్రతిరాష్ట్రమును, సమ్మేళనరాజ్యాంగమున కొసంగబడిన యధికారముల మినహాయించి మిగిలిన రాజ్యాధికార పరిమితియందు తనకు తోచిన శాసనమును నిర్మించు యధికారము పొందియున్నది. ఆరాష్ట్రముయొక్క రాజ్యాధికారము సమ్మేళనరాజ్యాంగముపై ఆధారపడిలేదు. రాష్ట్రీయశాసనసభల శాసనములు, కేంద్రశాసనసభల శాసనములకు విరుద్ధమైనచో, రాష్ట్రీయశాసనములు వీగిపోవుటకు మారు, సమ్మేళనశాసనముల ధిక్కరించి, సుప్రీముకోర్టువారి ముందు, తమరిద్దరిలో ఎవ్వరి రాజ్యాంగవిధానము చట్టసమ్మతముగ నుండెనో తీర్పుకై వేచియుండును. అనేక మారులు, కేంద్రశాసనసభవారి శాసనములే వీగిపోవుట తటస్థించుచుండును.

కెనడాయందుమాత్రము రాష్ట్రీయప్రభుత్వములకు రాజ్యాంగవిధానపు చట్టముద్వారా యొసంగబడిన యధికారములకు వ్యతిరేకమగు శాసనములను, కేంద్రప్రభుత్వము నిర్మించరాదు. అటులనిర్మింపబడిన శాసనములు, ప్రీవీకౌన్సిలువారిచే చట్టవిరుద్ధములని తీర్మానింపబడును. జర్మనీసమ్మేళన రాజ్యాంగమందు కెనడా సమ్మేళనరాజ్యాంగముకంటె హెచ్చు అధికారము సమ్మేళన రాజ్యాంగమున కివ్వబడుచున్నది. అచ్చట, సమ్మేళనరాజ్యాంగపు శాసనమునకు విరుద్ధమగు ప్రతిరాష్ట్రీయరాజ్యాంగశాసనము రద్దు అగునని, చట్టమే నిరూపించుచున్నది. కనుక సమ్మేలనరాజ్యాంగపు శాసనమునకు, రాష్ట్రీయరాజ్యాంగపు శాసనమునకు పోటీకల్గుచో, జర్మనీయందెల్లప్పుడు సమ్మేళనరాజ్యాంగపు శాసనమే నెగ్గుచుండును.

ఆస్ట్రేలియాయందును, జర్మనీయందును, ఇప్పటికంటెను హెచ్చుగా, సమ్మేళనరాజ్యాంగములు బలిష్టతజెంద వలెనని ఆయాదేశముల రాజకీయనాయకు లనేకు లభిప్రాయపడుచున్నారు. కాని కార్మికనాయకులు, రాష్ట్రీయరాజ్యాంగముల స్వాతంత్ర్యమునే చాలవరకు బలపరచుచున్నారు. ఆస్ట్రేలియాయందు, న్యూఫౌండులాండు రాష్ట్రము, సమ్మేళన రాజ్యాంగము నెదిరించి, అపజయమందుటవలన, సమ్మేళనరాజ్యాంగమునకు బలముకల్గినది. అటులనే 1930 నుండి 1932 వరకు ఆర్థిక, రాజకీయసంక్షోభము జర్మీనీయందు కల్గుటయు, సమ్మేళనరాజ్యాంగమునకు బలముకల్గుటయు సభ్యరాష్ట్రములు బలహీనత బొందుటయు తటస్థించెను.

నిర్భంధమువలన, దండయాత్రవలన, ఒకరాజ్యము మరొకరాజ్యమందు లీనమై పోవుటచేకాక, రాజులబాంధవ్యములవలన,

ఐక్యరాజ్యాంగ స్థాపనము -
ఇంగ్లాండు, ఇటలీ, జుగోస్లావియా.

వివిధరాజ్యము, లైక్యత బొందుట వల్లను కాక, దేశశాంతికై, రాజ్యవిస్తీర్ణతకై, సాముదాయక శ్రేయోభివృద్ధికై, వివిధరాజ్యములు, కెనడా, దక్షిణాఫ్రికాలవలెనే, తమ "ఐక్యత"ను "స్వయంనిర్ణయాధికారము"ను వీడి 'పుచ్చుకొను' స్థితికి వచ్చి, ఏక రాజ్యనిర్మాణమందు జేరిపోవుట అపురూపమైన అనుభవముకాదు. అప్పటివరకు స్వతంత్రరాజ్యమైన, స్కాట్లాండు, తనరాజు శ్రీ ప్రధమజేమ్సుగారు, ఇంగ్లాండురాజ్యమునకు వారసులై నప్పుడు, తనశాసన సభయొక్క శాసనముద్వారానే క్రీ. శ. 1603 లో ఇంగ్లాం డు, స్కాట్లాండు సాముదాయకరాజ్యాంగమందు సంపూర్తిగా చేరిపోయెను. అటులనే క్రీ. శ. 1800 సంవత్సరమందు పార్లమెంటుల శాసనములద్వారా ఐర్లాండు, ఇంగ్లాండు, స్కాట్లాండు సాముదాయక రాజ్యమందు ఐక్యతబొందెను. ఇదేవిధముగ, న్యూజిలాండునందలి వివిధరాజ్యములు, దేశముయొక్క ప్రధానరాజ్యమందు, తమశాసనములద్వారా, ఐక్యతబొంది, దేశమునకంత కొకే రాజ్యాంగమునేర్పరచుకొనెను. క్రొత్తగాయేర్పడిన ఐరిషుఫ్రీస్టేటుకూడ ఐర్లాండునందున్న 'అల్ట్సరు'రాజ్యమును జేర్చుకొనకయే తనంతతానే, ఒకరాజ్యాంగము నేర్పరచుకొన్నది. ఇటలీదేశ మందును, క్రీ. శ. 1848 సంవత్సరమునకు పూర్వము, ఎనిమిదిరాజ్యములుండెను. అవన్నియు క్రమముగా క్రీ. శ. 1870 సంవత్సరమునకు, సార్డీనియారాజ్యాంగమందు జేరిపోయి, ఆరాజ్యాంగమును ఇటలీదేశమునకంతకు వర్తించునట్లుచేసి, రోమునగరమును ముఖ్యపట్టణముగా నేర్పరచుకొనెను.

యుద్ధానంతరమేర్పడిన, జూగోస్లోవియా రాజ్యమునందు, సర్బులు, మ్రోటులు, స్లోవెనులు, అనుమూడు భాషలకు జెందిన, మూడుజాతులు కలరు. వారెల్లరు, తమ తమ భాషాప్రయుక్త రాజ్యాంగముల స్థాపించుకొనుటకుమారు, తమయిరుగుపొరుగు రాజ్యముల నిరంకుశతనుండి స్వతంత్రముబొందుటకు, వారందరు ఐక్యమొందిననే కాని లాభములేదని తలంచి, తమతమ ప్రత్యేక వ్యక్తిత్వముల నాపుదలచేసి, అందరి కొకేరాజ్యాంగము నేర్పరచుకొనిరి. కావున, సమ్మేళనరాజ్యాంగమే వివిధజాతులకు చెందిన ప్రజలకు శరణ్యమనుటకు వీలులేదు.

ఆయారాజ్యముల చరిత్రలననుసరించి వానినన్నిటి సమ్మేళనమందు జేర్చిన, సాముదాయకలాభములు హెచ్చగునో, లేక ఐక్యరాజ్యమందు జేర్చిన ప్రజలందరిశ్రేయము అభివృద్ధిబొందునో, విచారించు టగత్యము. సమ్మేళనమందు జేరుటకు వివిధజాతులకు, వివిధభాషాయుక్తప్రజలకు, వివిధనాగరికతాస్థితిగతులందున్నవారికి లాభకరము. ఒకేజాతికి జెందియుండి, --------- భాషనే కల్గియుండి, ఒకేసాంప్రదాయముల బొందియుండు ప్రజలు, ఒకేచారిత్రకానుభవ సంపదను కల్గియుండుచో, ఐక్యరాజ్యాంగమందు చేరుటలాభకరము.

ఐక్యరాజ్యాంగమందు స్థానికవ్యవహారములను సక్రమముగా, సంతృప్తికరముగా నెరపుటకు ప్రధానప్రభుత్వపు సంస్థలకు సులభసాధ్యముకాదు. కాని, ఐర్లాండునందును మనదేశమునందువలెనే స్థానికస్వపరిపాలనాసంస్థల స్థాపించుట లాభకరము. కాని వీనికి ఫ్రాన్సు, జర్మనీలందువలె, అమితముగా సంకుచితపరుపబడిన యధికారములిచ్చుటవలన లాభ మేమియునుండజాలదు. వీలున్నచో కెనడా, దక్షిణాఫ్రికాలందువలె విశాలమగు రాజ్యాధికారము, స్థానికసంస్థలకిచ్చిన శ్రేయమొనగూడును. రాజ్యాంగజీవితమందు కేంద్రప్రభుత్వము, రాష్ట్రీయప్రభుత్వములు, స్థానికస్వపరిపాలనాసంస్థల మధ్య ప్రభుత్వాధికారవిభజన మెట్లుచేయవలెనో, కాలావసరములబట్టియు, ప్రజలయిష్టాయిష్టములబట్టియు నిర్ణయింపనగును. కాని సాధ్యమైనంతవరకు రాష్ట్రీయ, స్థానికప్రభుత్వసంస్థలకే హెచ్చురాజ్యాధికార మొసంగి, తాను వానిపై పెత్తనముజేయుచు, రాజ్యాంగము సక్రమముగా, సంతృప్తికరముగా సాగునట్లు జూచుచుండుటయే కేంద్రప్రభుత్వమునకు యుక్తము.

సమ్మేళనరాజ్యాంగములందు న్యాయస్థానములు ప్రత్యేకప్రాముఖ్యత బొందుచున్నవి. ఐక్యరాజ్యాంగములందు

న్యాయస్థానముల
యొక్క బాధ్యత.

శాసనసభవారికే సంపూర్ణరాజ్యాధికారము చెందియుండుట వలన వానిపై నాధారపడియున్న మంత్రాంగవర్గముల చర్యలను ఆసభలే సమర్థించుకొనుచుండుటచే, ఆసభలయొక్క శాసనముల ధిక్కరించుటకుగాని, వానిచే బలపరుపబడుచుండు ప్రభుత్వములు శాసనసమ్మతముగా చేయుకార్యముల సక్రమములని శాసించుటకుగాని, న్యాయస్థానముల కధికారము లేదు. ఐక్యరాజ్యాంగముయొక్క శాసనసభవారిశాసనములు పరమ ప్రామాణ్యములు. అయ్యవి "క్రమమైన వా, అక్రమమైనవా" అని విచారించుటకే న్యాయస్థానముల కర్హతలేదు. ఇట్టిపరిస్థితులు ఇంగ్లాండునందును, దక్షిణాఫ్రికాయందునుకలవు. కాని సమ్మేళనరాజ్యాంగములుకల్గిన అమెరికాయందును, ఆస్ట్రేలియాయందును, స్విట్జర్లాండునందును రాజ్యాంగవిధానపు చట్టము ననుసరించియే ఆయాసమ్మేళన రాజ్యాంగపు శాసనసభలు సభ్యరాష్ట్రీయశాసనసభలు, శాసనముల నిర్మించుచున్నవా? లేక వీనిశాసనములు ఆచట్టము నతిక్రమించుచున్నవా? యని విచారించి తీర్పులు చెప్పుయధికారము సుప్రీముకోర్టులకు కలదు. రాజ్యాంగవిధానపు చట్టమునకు అమెరికా సమ్మేళన రాజ్యాంగపు శాసనము విరుద్ధమైనదని తొమ్మిదిమంది సుప్రీముకోర్టుజడ్జీలలో ఐదుగు రభిప్రాయబడినచో, ఆశాసనము రద్దు కావలసినదే ! ఇట్లే తదితర దేశములందును సుప్రీముకోర్టులకు శాసనసభలపై యాధిపత్య మొసంగబడుచున్నది. కాని సమ్మేళనరాజ్యాంగమున సభ్యరాష్ట్రముల శాసనసభలు నిర్మించుశాసనములనెల్ల నీన్యాయస్థానములవారు ఎప్పటికప్పుడు చట్టసమ్మతములా కావా యని విచారించుచుండుట లేదు. సుప్రీముకోర్టువారి సమక్షమునకు ఏవివాదమైన తీర్పునకై వచ్చినచో, అందొక్కపార్టీవారు తమవివాదమునకు సం బంధించిన శాసనము చట్టవిరుద్ధమని వాదించినచో, ఆ శాసనము అక్రమమైనదగుచో చట్టవిరుద్ధమని తీర్మానించి, ఆశాసనముపై ఆధారపడియున్న వ్యాజ్యమును తిరస్కరించుటయే కోర్టువారిధర్మము.

కెనడాయందు సమ్మేళనరాజ్యాంగ మేర్పడినను, సమ్మేళనరాజ్యాంగపు శాసనములన్నిటిని విమర్శించి, అవకాశము కల్గినప్పుడెల్ల తమకుతోచిన శాసనముల చట్టవిరుద్ధములని ప్రకటించుటకు ప్రీవీకౌన్సిలువారికధికారము లేదు. ఏయధికారమువలన సభ్యరాష్ట్రములకొరకు రాజ్యాంగవిధానపుచట్టముచే ప్రత్యేకింపబడినవో వానికి భంగకరముగానుండు కేంద్రశాసనసభవారి శాసనములనే చట్టవిరుద్ధములని తీర్మానింప వీలగును. అటులనే దక్షిణాఫ్రికా రాజ్యాంగమందును, నీగ్రో ప్రజలకు ప్రసాదించిన హక్కులకు, రాష్ట్రీయశాసనసభల కొసంగినహక్కులకు భంగకరముగానుండు శాసనములను సమ్మేళనరాజ్యాంగపుపార్లమెం టంగీకరించుచో వానిని అంగీకరింపకుండానుండుటకు గవర్నరుజనరలున కధికారముకలదు. ఆతని యనుమతిపొందినపిమ్మటకూడ రాజు దాని కనుమతించక పోవచ్చును. రాజుగారు దాని కనుమతించినపిమ్మటనే ఆశాసనము అమలునకు వచ్చును. కాన అమలునకువచ్చిన శాసనములను చట్టవిరుద్ధమని ప్రకటించు అధికారము ఆదేశపు న్యాయస్థానములకు కొరవడియున్నది. జర్మనీయందు సమ్మేళనరాజ్యాంగ మేర్పరచబడినను సుప్రీముకోర్టువారికి సమ్మేళనరాజ్యాంగపు చట్టమునకు విరుద్ధముగానుండు సమ్మేళనరాజ్యాంగపు శాసనములు అక్రమములని తీర్మానించు యధికారము లేదు. రాష్ట్రీయశాసనములకును, సమ్మేళన శాసనములకును పరస్పరవైరుధ్య మేర్పడినచో సమ్మేళనశాసనములే ఆచరణ యోగ్యములు. కనుక, సమ్మేళనశాసనములకు వ్యతిరేకముగానుండు రాష్ట్రీయశాసనముల నన్నిటి చట్టవిరుద్ధములని తీర్మానించుయధికారముమాత్రము న్యాయస్థానములకు కలదు. ఆస్ట్రియాయందును, సమ్మేళన రాజ్యాంగపు శాసనముల ధిక్కరించుటకు న్యాయస్థానములకు హక్కు లేదు. ఆశాసనములు చట్టసమ్మతములా కావా యని విచారించుటకే వానికి అధికారము లేదు. కనుక, ఈమూడు రాజ్యాంగములందును (దక్షిణాఫ్రికా, జర్మనీ, ఆస్ట్రియా ) సమ్మేళనరాజ్యాంగపు శాసనసభకు, శాసననిర్మాణమందు ఇంగ్లాండుయొక్క పార్లమెంటునకువలెనే సంపూర్ణ స్వాతంత్ర్యముకలదు. ఆయాసమయముల ననుసరించి అవసరముల గమనించి, కేంద్రశాసనసభ లీదేశములందు, అగత్యమగు శాసనము నిర్మించనగును. శాసనముల నిర్మించువిధానములందే, తగురక్షణమార్గములు (రెఫరెండము, ప్రత్యేకపు మెజారిటీలు వగైరాలు) నిరూపింపపడుచున్నవి. పౌరసత్వపుహక్కులరక్షించుభారము, సమ్మేళనరాజ్యాంగములందు, సుప్రీముకోర్టుపై పెట్టబడుచున్నది. అమెరికా,

పౌరసత్వపు హక్కు
లాక్షేపించువారెవరు?

ఆస్ట్రేలియా, సమ్మేళనములందు, సుప్రీముకోర్టువారు, పౌరసత్వపుహక్కులు, రాజ్యాంగవిధానపుచట్టమందు వివరింపబడువరకు, రక్షించుటకై జాగ్రత్త పడుచుండవలయును. జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడాదేశములం దీబాధ్యత, రాజ్యాంగప్రధానాధికారియగు ప్రెసిడెంటు, లేక, గవర్నరుజనరలుపై పెట్టబడుచున్నది. పౌరసత్వపుహక్కుల రక్షించుభారము రాజ్యాంగ ప్రధానాధికారిపై నుంచబడినంత మాత్రమున, అట్టి హక్కులరక్షణ, సుప్రీముకోర్టువారి భద్రతక్రిందనుండు నప్పటికంటె, తక్కువజాగ్రత్తగా జూడబడుననితలంపరాదు. ఇంగ్లాండునందు, 'హబీసుకార్పొసు' ఆక్టును, తాత్కాలికముగా అరికట్టవచ్చునేకాని, రూపుమాపుట కేపార్లమెంటునుసాహసించదు. అటులనే జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా, కెనడా దేశములందును, ప్రజలందరిచే ప్రేమింపబడు పౌరసత్వపు హక్కుల నపహరింప నేప్రభుత్వమును పూనుకొన సాహసింపదు. అధవా, ప్రభుత్వములట్టి యక్రమకార్యమునకు దొరకున్నను, శాసనసభలు, వానిని ధిక్కరించును. తుదకు ప్రభుత్వము, శాసనసభలు, పౌరసత్వపుహక్కుల దిగమ్రింగగోరుచో, ప్రజలు వారిని పదభ్రష్టతజేయుటతప్పదు. ఇట్టి అసా ధారణము విషయమునగు పరిస్థితులుకలుగ కుండుటకే, జర్మనీ, ఆస్ట్రియాదేశములందు సాధారణ శాసనములనుండి రాజ్యాంగ విధానపుచట్టసవరణ శాసనములవరకు, నియమబద్ధమై ప్రజలముందు 'రిఫరెండము'నకు పెట్టబడవలయునను యేర్పాటుకలదు. కనుక ప్రజలు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధి సభవారు అంగీకరించిననే పౌరసత్వహక్కులలో మార్పులుకలుగ జేయబడును. మానవమాతృలగు నల్గురో, పదిమందో జడ్జీలకు ఎట్టికాలానుసారమగుమార్పులు రాజ్యాంగవిధానమందు, పౌరసత్వపుహక్కులందు కలుగజేయవలెనో నిర్ణయించు అధికారమిచ్చుటవలన, ప్రజాక్షేమము సురక్షితమగునని చెప్పజాలము. సాధారణముగానట్టి న్యాయమూర్తులు పూర్వాచార పరాయణులు, సంకుచితాభిప్రాయములు, ఆచారబద్ధులు, వృద్ధులునైయుందురు. కాలగతిననుసరించి, ప్రజాభిప్రాయము, ప్రజల యాచారములగణించి, తగునట్టి అభివృద్ధికారమగు మార్పుల జేయుటకు వారుత్సాహులైయుండరు. అట్లిట్లనరాని విధమున, కనుమూసి, కనుతెరచునంతలో అపారమగు సంచలనము బొందుచున్న ఆధునికసాంఘిక సౌధమునకు తగినట్లు పునాదుల బలపరచి, లావణ్యముచేకూర్చుటకు, అల్పసంఖ్యాకులగు న్యాయమూర్తులైన వృద్ధులు తగరు. అట్టిసౌధమునకు తగురీతి, ఎప్పటికప్పుడు, జీవనాభివృద్ధి కల్గించుమార్పుల కల్గించుటకై ప్రజలు, వారిప్రతినిధిసభవా రు, వారిమంత్రివర్గము, వారిప్రధానరాజ్యాధికారియుమాత్రమే తగినవారు. అమెరికాయందు సుప్రీముకోర్టువారి కీహక్కు నొసంగుటవలన, అమెరికా ప్రజలనేక యిబ్బందులకు లోనగుచున్నారు. స్విట్జర్లాండు, జర్మనీ, ఆస్ట్రియాల పద్ధతియే హెచ్చుసంతృప్తి కల్గించునని తోచుచున్నది.

ఐక్యరాజ్యాంగమందు ప్రభుత్వపు మూడు అంగములు తమతమ విధికృత్య నిర్వహణమందు స్వతంత్రత వహించుచు, పరస్పరముగా సహకారమొనర్చు కొనవచ్చునని మూడవప్రకరణమున జూచితిమి. ఆసూత్రముననుసరించియే, సమ్మేళన రాజ్యాంగమందును, ప్రభుత్వపు వివిధాంగములు తమ కార్యక్రమమును సాగింపవచ్చును. కాని కొందరు, ఆధునిక యుగమందలి ప్రధానమును, ప్రధమసమ్మేళన రాజ్యాంగమునకు అమెరికాసంయుక్తరాష్ట్ర రాజ్యాంగమునం దీమూడు భాగములు పరస్పరముగా వేరుబడి, స్వతంత్రమునొందియున్నవే! అటులనే తదితర సమ్మేళనరాజ్యాంగములందును యేర్పరచుట శుభప్రదము కాదా? యని యోచింపవచ్చును. కాని, అమెరికాయం దీఅనర్ధకమగు యేర్పాటును, రాజ్యాంగనిర్మాతలు బ్రిటిషురాజ్యాంగమునుగురించి భ్రమజెంది యుండినవారై స్థాపించిరి కనుకను, ఈయేర్పాటువలన అమెరికారాజ్యాంగము అసంతృప్తికరమగు పర్యవసానముల కల్గించుచున్నది గనుకను, దీనికి వ్యతిరేకమగు రాచకీయానుభవమున సక్రమమైనదని తేల్చబడిన ఇంగ్లీషుయేర్పాటు లాభదాయకము గనుకను, అమెరికాయందువలె, ప్రభుత్వపు వివిధాంగములు పరస్పరముగా వేరు వేరు చేయుట తగదు.

ఐక్యరాజ్యాంగములందు, శాసనసభయే ప్రధానమైన ప్రభుత్వాంగమై యున్నది. కొన్ని రాజ్యాంగములందు, "రెఫరెండము"

న్యాయస్థానములు ప్రధాన
స్థానము పొందునా ?

ద్వారా, ముఖ్యమగు ప్రతిబిల్లును ప్రజల యామోదమునకు తేవలసియున్నను, ప్రజలే రాజ్యాంగవిధానపు చట్టములకు సవరణలను, సాధారణ శాసనముల ప్రతిపాదించు యధికారము కల్గియుండినను, సాధారణముగా శాసనసభలే అవసరమగు శాసననిర్మాణ కార్యక్రమమును నడపుచుండును. ఐక్యరాజ్యాంగముల శాసనసభలయొక్క శాసనములను చట్టవిరుద్ధమని తీర్మానించుయధికార మెవరికిని లేకున్నది.

అమెరికాయందుతప్ప ప్రజాప్రతినిధి సభలకు బాధ్యతవహించు మంత్రివర్గములు మిగతా ప్రజాస్వామిక దేశములందు, ముఖ్యముగా, ఐక్యరాజ్యాంగములందున ఏర్పడియుండుట వలన, ప్రజాప్రతినిధిసభలే, రాజ్యాంగ సంస్థలన్నిటియందును ప్రాధాన్యమగు స్థానమలంకరించుచున్నవి.

కాని, సమ్మేళనరాజ్యాంగములం దీపరిస్థితులు మారినవి. అచ్చట, శాసనసభయొక్క ప్రాముఖ్యత తగ్గుచున్నది. న్యాయస్థానములు, అందును సుప్రీముకోర్టు ప్రధానస్థాన మాక్రమించుచున్నది. అమెరికా, ఆస్ట్రేలియా రాజ్యాంగములందు, శాసనసభవారి శాసనము లేవిచట్టసమ్మతములో, ఏవిచట్టవిరుద్ధములో నిర్ణయించుయధికారము సుప్రీముకోర్టువారికి కల్గుటవలన, రాజ్యాంగమందు ఈసంస్థయే పరమాధిక్యత సంపాదించుకొనుచున్నది. సుప్రీముకోర్టువారి తీర్పుపై అప్పీలు లేదు. ఆతీర్పు రాజ్యాంగవిధానపు చట్టమునకు టిప్పణముగను, అనుబంధముగను పరిగణింపబడును. ఆతీర్పునకు విరుద్ధమగు శాసనములన్నియు రద్దుకాబడును.

ఐనను జర్మనీయందును, ఆస్ట్రియాయందును సమ్మేళనశాసనసభవారి శాసనములు, చట్టవిరుద్ధములా ? కావా ? యను విచారణచేయుటకు సుప్రీముకోర్టువారి కధికారము లేదు. కనుక, శాసనసభవారే ప్రధానస్థానమా క్రమించ కల్గుచున్నారు. కెనడాయందుకూడా, ప్రీవికౌన్సిలువారికి కొలదిగా మధ్యవర్తిత్వము, సమ్మేళనరాజ్యాంగము, సభ్యరాష్ట్రములమధ్య చేకూరినను, మొత్తముమీద, సమ్మేళనరాజ్యాంగపు శాసనసభయే ప్రధానస్థాన మాక్రమించుచున్నది.



________________