ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/కోడూరి వేంకటాచలకవి
కోడూరి వేంకటాచలకవి.
ఈ కవి స్కాందపురాణములోని శివరహస్యఖండమును తెనిగించెను. ఈతనికి బాలసరస్వతి యను బిరుదాంకము గలదు. ఈత డారువెల నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కాశ్యపసగోత్రుడు; ఎలకామాత్యపౌత్రుడు; శంకరామాత్యపుత్రుడు. ఈ శివరహస్యఖండము శ్రీ ముసుగు ముళునాగళుప్రభుని కంకితము చేయబడినది. ఇతడు బళ్ళారి ప్రాంతములయందుండిన లింగబలిజ ప్రభువని తోచుచున్నది. కృతిపతియొక్క పూర్వులలో నొకనిని వర్ణించుచు: పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/59
ఏనుగు లక్ష్మణకవి.
ఈకవి బహుగ్రంథములు చేసి ప్రసిద్ధి కెక్కినవాడు. ఈతడు చేసిన గ్రంథములలో రామవిలాసప్రబంధము కడపటిదిగా గనబడుచున్నది. ఈప్రబంధము పెద్దాపుర సంస్థానమం దుండిన శ్రీ వత్సవాయ గోపరాజున కంకితము చేయబడినది. ఈ గోపరాజు తన్నుగూర్చి పలికినట్లు కవి తన రామవిలాసములో నీపద్యముల జెప్పుకొన్నాడు