ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మడికి అనంతయ్య
మడికి అనంతయ్య
తనకు "అనంతయ్య" అను తమ్ముఁడున్నట్లు మడికి సింగన తనవాసిష్ఠ రామాయణమునఁ జెప్పి యున్నాడు. ఇతఁడు సుప్రసిద్ధమై చింతలపూడి యెల్లనకవి కృతముగాఁ జెల్లబడి యగుచున్న విష్ణుమాయా నాటకమను ప్రబంధమునకు గర్తయని "ఆంధ్ర కవి తరంగిణి" లో విపులముగా వివరింపఁబడినది (నాలుగవ సంపుటము - మడికి - అనంతయ్య చరిత్రము) విష్ణమాయా నాటకములోని కృత్యాది లభింపక పోవుటయు వివిధ తాళ ప్రతులలోని గద్యలు విభిన్నముగ నుండుటయు, ఏతత్కర్తృత్వము విషయమున సందేహమును గల్గించుచున్నవి. ఆంధ్రకవితరంగిణి కర్త శ్రీ శేషయ్యగారు - లేఖకుల ప్రమాదము వలన నియ్యది రాధామాధవ (ఎల్లనార్య) కృతిగాఁ దెలియవచ్చుచున్నది గాని, కారణాంతరములను పరిశీలించిన దీనిని మడికి - అనంతయ్య యే రచించియుండునని అభిప్రాయపడుచున్నారు,