ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ప్రకటనలు

ఆనంద ముద్రాయన్త్రాలయమున ముద్రితమై ప్రకటింపబడు
శ్రీమదాంధ్రవాల్మీకి రామాయణము వచనము.

ఆర్యులారా!

ఈ భరతఖండమున మనపూర్వులైనయార్యులు బహుపురాణములను, ఇతిహాసములను, శాస్త్రములను, కావ్యములను రచించి తమబుద్ధికౌశలమును వేయివిధముల మనకు ప్రకటించి యున్నారు. రామకృష్ణాద్యవతారముల విచిత్రలీలలేమి! మహార్షులతత్వజ్ఞానవిశేషములేమి! వీరపురుషుల యద్భుతపరాక్రమములేమి! మహాత్ముల పావనచరిత్రములేమి! పుణ్యస్త్రీలపాతివ్రత్యమహిమలేమి! రసవంతము లైన కావ్యములేమి! నీతిభోధకములైన కథలేమి! అన్నియును జదువుటకు ఆశ్చర్యమును ఆనందమును గలిగించుచున్నవి. అయినను ఇవియన్నియు మిక్కిలి ప్రౌఢమగు సంస్కృతభాషయందున్నవి. ఆ భాష యిప్పుడు జనులు వ్యవహరించుటలేదు గనుక అది యెవరో యొక కొందఱిపండితులకే తెలిసియుండును. కాబట్టి ఆ పురాణాది గ్రంథములలో గల గొప్పవిషయములు సామాన్యముగా ఎల్లవారికి, అందును మనతెనుగు దేశపువారికి అందని మ్రానిపండువలెఉండియు లభింపరానివిగా నున్నవి. ఆంధ్రభాషయందు నన్నయ, తిక్కన, పోతన మొదలగుకవులాగ్రంథములనువ్రాసిరికాని అందలివిషయము లన్నిటిని పూర్ణముగా తెనిగించినవారుగారు! తెనిగించినంతవఱకు గొప్పకవిత్వశైలియందుండుటచే అదియు అందఱికిని తేటగా తెలియునదికాదు. కాబట్టి, సంస్కృతమునందు సుప్రసిద్ధములుగా నున్న శ్రీవాల్మీకి రామాయణము, భాగవతము, భారతము, శ్రీవిష్ణుపురాణము, దశోపనిషత్తులు మఱియు ననేక గ్రంథములు ఆంధ్రదేశీయుల ఉపయోగముకై తేటతెనుగున మృదుమధురమైన వచనశైలిని పండితులకు రంజకముగాను పామరులకును, స్త్రీలకును సులభముగాను ఉండునట్లు తెనిగించి ప్రకటింప నుద్యోగించియున్నారము. ఇపుడు ప్రథమమున వాల్మీకి ప్రణీతమైనయాదికావ్యంబై ఐహికాముష్మికఫలప్రదమై యున్న శ్రీమద్రామాయణము తెనిగింపబడియున్నది. ఇందు గోవిందరాజులు మహేశ్వరతీర్థులు మొదలైన వ్యాఖ్యాతలు ఆయాముఖ్యశ్లోకములకు వ్రాసియున్న అర్థవిశేషములును,వేదాదులనుండి చూపియున్న ప్రమాణములును, పురాణాదులనుండి సంగ్రహించినకథలును, వెరియవాచ్ఛాంబిళ్ల యనువారు కొన్ని శ్లోకములకు మిక్కిలి యద్భుతముగా బ్రతిపాదించియున్న యర్థవైభవములును రహస్యవివరణములును అన్నియు తేటగాను ముచ్చటగాను అచ్చటచ్చట ఆయాపుటలక్రింద కూర్పబడియున్నవి. వేయేల! సంస్కృతమునంగల వ్యాఖ్యానములను కొని రామాయణము చదువుపండితులకు ఎన్నివిశేషవిషయములు తెలియునోఅన్నియు ఈ తెనుగు రామాయణము చదువువారికిని దెలియుననవచ్చును. ఈగ్రంథము మాయానందముద్రాయంత్రాలయములోని మేలైనయచ్చునరాయల్ ఎనిమిదిపేజీలసైజులో మూడుమాసముల కొకసారి సుమారు 200 పుటలుగల ఒక సంచికగా మిక్కిలి సుందరములైన పెక్కు ప్రతిమలను కూర్చి ప్రకటింపబడును. నూఱుపుటలుగల పుస్తకము శాశ్వతముగా చందాదారులు అగువారికి ఎనిమిది అణాలవెలచొప్పున ఏర్పఱపబడును. శాశ్వతపోషకులకు అంచెకూలి తపాలా వీసి ఖర్చులు మేమే భరింపగలవారము. పుస్తకమంతయు ముద్రింపబడిన వెనుక కొనువారలకు నూఱుపేజీలకు పండ్రెండు అణాలచొప్పున వెలయేర్పఱపబడును. కాబట్టి శ్రతిస్మృతీతిహాసపురాణాదులందలి విశేషవిషయములనెల్ల దెలియగోరు ఆంధ్రభాషాభిమానమానవీయులందఱును ఈ మాయుద్యమమునకుతోడ్పడి త్వరలో చందాదారులగుటకిదియె మంచి సమయమని తెలియునది. ప్రస్తుతము బాలకాండము విక్రయమునకు సిద్ధముగానున్నది. ఇందు సుమారు పదునాఱు (Halftone) ప్రతిమలు గలవు.

శాశ్వతపుచందాదారులకు అంచెకూలితో వెల ర్పు. 1 0 0
తదితరులకు ర్పు. 1 8 0

ఈ ఏప్రిల్ మాసము 30వతేదీలోపల తమపేరును రిజిష్టరు చేసినవారికి సాధారణనామసంవత్సరపంచాంగము పారితోషికముగానియ్యబడును.

ముందుగానే చందాధనము పంపనక్కఱలేదు. ఆయాసంపుటము వెలువడగానే దాని వెలమాత్రము వసూలు చేయబడును.

వేదాస్తగ్రన్థరత్న మాల నాగరిలిపి:- ఇది 1097వ సంవత్సరము జూలై మాసమునుండి మాసపత్రికగా ప్రకటింపబడుచున్నది. మాసమున కొకసారి 40 పుటలుగల సంచిక పంపబడును. సంవత్సరమునకు పోస్టేజిసహా చందా. 3 0 0
శ్రీ యాళవందార్లుసాదించిన చతుశ్లోకీస్తోత్రరత్నమ్. దేవనాగరిలిపి:- శ్రీవేదా న్తదేశికులవారు రచించిన వ్యాఖ్యానముతో గూడినది. ప్రశస్తమైన కిత్తానుబైండు చేయబడినది. 1 0 0
శ్రీ భగవద్రామానుజుల వారు సాదించిన శ్రీభాష్యమ్. నాగరిలిపి;- డెమ్మి ఎనిమిదిపేజీలసైజున అతిప్రశస్తమైన కాగితములమీద అచ్చుపడుచున్నది. ఇందు అచ్చటచ్చట నుండు ప్రమాణాకరములును అధికరణాంతమున వేదా న్తసారమును వేదాన్తదీపమును గ్రంథాంతమున అధికరణపారావళియు, చేర్పబడియున్నవి. దీని వెల ప్రథమభాగము. 3 0 0
రెండవభాగము. డిటో డిటో 2 0 0
నృసింహశతకము- మూలము మాత్రము 0 1 0
సుమతి శతకము:-టీకాతాత్పర్యసహితము, చక్కగా పరిశోధితమై చిన్నసైజున గ్లేజు కాగితములమీద అచ్చువేయబడియున్నది. 0 2 0
దాశరథి శతకము:-పై సుమతిశతకమువలెనె టీకాతాత్పర్యసహితము 0 2 0
శ్రీవేంకటేశ్వర శతకము:- పై సుమతిశతకమువలెనె టీకాతాత్పర్యసహితము 0 2 0
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రము నామావళిమాత్రము 0 2 0
శ్రీభగవద్గీత:- మూలము మాత్రము పారాయణయోగ్యమై చిన్నసైజున కిత్తానుబైండు చేయబడియున్నది 0 4 0
శ్రీయఃప్పతిపడి:- తెనుగు వచనము. 0 2 0
తత్త్వనిరూపణమ్-ఆంధ్రలిపి:-ఇది వాదికేసరి-శ్రీ అగియ మణావాళజీయర్ సాదించినది. 0 8 0
ముదాలయిరం: ఆంధ్రలిపి:- ఇందు ఒక్కొక్క పదియందు ప్రతిపాదింపబడినవిషయము లాయపదియొద్దనే సంక్షేపముగా చేర్చబడియున్నవి. మిగుల మేలిమిగల దళసరికాగితములయందచ్చొత్తింపబడి చిత్రమైన అంచులతో మేలైన కిత్తానుబైండుచేయబడియున్నది. 0 12 0
తిరువాయ్ మొ - ఆంధ్రలిపి:- ఇందు ముదలాయిరమువలెనె విషయసంక్షేపమును, ద్రమిడోపనిషత్సంగతియు, ద్రమిడోపనిషత్తాత్పర్యరత్నావళియు, తిరువాయ్ మొ నూ న్దాదియు గలదై మేలైన కిత్తానుబైండుచేయబడియున్నది 0 12 0
భగవద్రామానుజ దివ్యచరిత్రము -ఇంగ్లీషులిపి:- మిగుల తేలికగానుండు చాలమేలైన కాగితములయందు ముద్రింపబడి కాలికోబైండు చేయబడియున్నది 2 0 0
డిటో కాగితపుకవర్ 1 0 0

వలయువారలు క్రిందివిలాసమునకు వ్రాసి తెప్పించుకొనవలయును.

అర్. వేంకటేశ్వర అండు కంపెని వారు,

ఆనందముద్రాయంత్రాలయాధిపతులు.

R VENKATESHWAR & CO,

Ananda Press, Madras

విజ్ఞానచంద్రికా గ్రంథమాల.

1.దేశాభివృద్ధికి ఆవశ్యకములైన గ్రంథములు ప్రచురించి భాషాభివృద్ధిచేయుటయే యీ గ్రంథమాలయొక్క యుద్దేశము. ఇందు సంవత్సరమునకు రమారమి 1200 పుటలుగల స్వతంత్రమైన గ్రంథములు నాలుగు ప్రచురింపబడును.

2.కొందరు తలచునట్టు ఇది మాసపత్రికకాదు. ఇందు 1. దేశదేశముల చరిత్రములను, 2 పదార్థవిజ్ఞానశాస్త్రము(Physics), రసాయనశాస్త్రము మొదలైన ప్రకృతిశాస్త్రములును, 3. దేశోపకారులగు కొందరు మహనీయుల చరిత్రములును. 4. ఇంగ్లీషునందలి ఉద్గ్రంథముల భాషాంతరీకరణములును మాత్రము ప్రచురింపబడును. కావ్యనాటకాదులిందుండవు. చరిత్రానుసారములగు కల్పితకథలుగాడ ప్రచురింపబడును.

3.ఈ గ్రంథమాలలో నిదివరకు అచ్చువేయబడిన గ్రంథములనన్నిటినికొనుచు, ఇకముందు ప్రచురింపబడు గ్రంథములనన్నిటిని గొనుటకు వొప్పుకొనువారు శాశ్వతపుచందాదారులు.

4.శాశ్వతపు చందాదారులకు ఈగ్రంథమాలలోని గ్రంథములన్నియునంచెకూలి మేమే భరించి నూరుపుటలకు రు 0-4-0 చొప్పున నిచ్చెదము. ఇతరులకు ఈ పుస్తకములు అంచెకూలిగాక నూరుపుటలకు రు 0-6-0 చొ|| నీయబడును. సం|| చందాదారులకు సం||రమునకు ర్పు 3-0-0 కంటె నెక్కుడు ఖర్చు కానేరదు.

ఒక్కొక్క పుస్తుకమచ్చుపడగానే అది వ్యాల్యూపేయబిల్ ద్వారా పంపబడును.

6.శాశ్వతపు చందాదారులు 0-4-0 ప్రవేశరుసుము క్రింద చెల్లించవలెను. ముందు ప్రచురింపబోవు గ్రంథములు మాత్రము కావలెనని కోరుశాశ్వతపుచందాదారులు 1-0-0ప్రవేశపురుసుము ఇ‌వ్వవలెను.

7.దరఖాస్తులు ఆచంట లక్ష్మీపతి గారికి బి.ఏ ఎంబి., సి.ఎం, మేనేజరు , విజ్ఞానచంద్రిక, చింతాద్రిపేట మదరాసు అని వ్రాసిపంపవలెను.
ఇదివరకు ప్రకటింపబడిన గ్రంథములు.
1 వ గ్రంథము - అబ్రహములింకను చరిత్ర.
మొదటికూర్పు ప్రతులు అయిపోయినవి.
2 వ గ్రంథము.
హిందూదేశ కధాసంగ్రహము.
1 వ భాగము హిందూమహాయుగము మూడవకూర్పు.
250 పుటలు; 15 పటములు.

ఇందు మిక్కిలి పురాతనకాలమునుండి మహమ్మదీయ ప్రభుత్వమువరకు జరిగిన హిందూదేశ చరిత్రమంతయు వ్రాయబడినది. ఆర్యభూపతుత్రుల నేకులు వావాకాలమందు హూలు (Huas) శక. యవనాది శత్రురాజుల నోడించి శాశ్వతకీర్తి చెందిన సంగుతులీగ్రంథములో నెంతయు వీరరసపూరితముగ వర్ణింపబడినవి.

ఈగ్రంథము యొక్క మొదటి రెండు కూర్పులు అచ్చుఅయిన అయుదునెలలులోనే 2000 ప్రతులు అమ్ముడు పోయినవి. మూడవకూర్పు పుస్తకములుకూడ అయిపోవచ్చినవి. గ్రంథములోని కొన్నిభాగములు 1909వ సంవత్సరము మెట్రుక్యులేటు ???పరీక్ష చేర్చబడినవి. చక్కని కేలికోతో బైండు చేయబడినది.

ఇదీ ... గ్రంథావలోకనము ... కేవిలక్ష్మణరావు ఎంఏ గారిచే రచింపబడినది.

మా శాశ్వతపు చందాదారులకు అంచెకూలితో ర్పు 0 11 0

ఇతరులకు అంచెకూలికాక ర్పు 1 0 0

3 వ గ్రంథము -జీవశాస్త్రము..

ఎ. లక్ష్మీపతి బి.ఎ., ఎంఎ సి.ఎం గారి విరచితము.

మూడవకూర్పు 1 భాగము వృక్షశాస్త్రము ప్రత్యేకముగ ప్రచురింపబడుచున్నది. ఎలిమెంటరీస్కూలు టీచర్లకు మిక్కిలి ఉపయోగము. వెల ఇతరులకు చందాదారులకు, 0.6-0, ఇతరులకు 0-9-0


4 వ గ్రంథము.
కాలికోబైండు రాణీ సంయుక్త రెండవకూర్పు.

ఇదియొక చారిత్రవిషయిక నవల పృథ్వీరాజుయొక్కయు, సంయుక్తయొక్కయు, దేశాభిమానమును, పరాక్రమమును ఎంతయు రసవంతముగా వర్ణింపబడినది. హిందూసామ్రాజ్య నాశనమునకు కారణములును తురుష్కులీ దేశము మొదటవచ్చినప్పుడీ దేశపుస్థితియు నిందు చక్కగా వివరింపబడినది. దీనిని చూచినలుగురు గ్రంథకర్తలు నాలుగునాటకములను వ్రాసిరనునదియే దీనియోగ్యతను జాటుచున్నది. విద్వాంసులు, పత్రికాధిపతులు ఇది అద్వితీయనవలయని పొగడియున్నారు. మొదటికూర్పు ప్రతులు అయిపోయినందున రెండవకూర్పు అచ్చువేయించినాము.

వేలాల సుబ్బారావుగారిచే రచింపబడినది.

మాచందాదారులకు పోస్తేజితో 0 9

ఇతరులకుపోస్టేజీకాక 0 12 0


మాకు 5 మంది క్రొత్తచందాదారులను సంపాదించి పెట్టువారికి ఈగ్రంథము ఒకటి ఉచితముగా నీయబడును.

5 వ గ్రంథము,

హిందూదేశ కధాసంగ్రహము.
2 వ భాగము మహమ్మదీయమహాయుగము, 2 వ కూర్పు.

ఇందు మహమ్మదీయుల ప్రభుత్వము, రాజపుత్రుల శౌర్యాగ్ని, విజయనగర సామ్రాజ్యము వర్ణింపబడినది. క్యాలికోబైండు, 500 పుటలు. కె.వి.లక్ష్మణ రావు ఎంఏ గారి విరచితము.

మాచందాదారులకు పోస్తేజితో 1-2-0

ఇతరులకుపోస్టేజీకాక 1-8-0

6- వ గ్రంథము
200పటములు. పదార్ధ విజ్ఞాన శాస్త్రము. 400పుటలు

దీనిని ఇంగ్లీషులో (physics) అనియెదరు. ఇందు (1) రైలు బండ్లు నడుపువిధము. (2) టిల్లిగ్రాం పోవువిధము, (3) ఆకాశములో మెరుపునుపట్టి తెచ్చి ఇంట్లోవానిచే దీపము ... విధము, (4) గిల్టుచేయట మొదలయిన శాస్త్రీయ‌విషయములు ... తెలుగుమాటలలో వర్ణింపబడినవి. ఇప్పుడు స్కూళ్లలో చెప్పవలసిన విషయములు ,,,,, వర్ణింపబడినవి. కావున గ్రాంటుకావలసిన స్కూలు దీనిని తప్పక తెప్పించుకొనవలయును. క్యాలికో బైండు, గ్రంథకర్త ఎం....

మా చందదారులుకు పోస్టేజీసహా ..0 14 0

ఇతరులకు అంచెకూలిగాక 1 5 0

7- వ గ్రంథము.
230పుటలు రసాయన శాస్త్రము. 75పటములు.

మనపూర్వులు ... ఈ శాస్త్రమును అభ్యసించిరి. ... తెలియుటకై ఈ గ్రంథము వ్రాయబడినది. .. దేశము ధనసంపన్నతతో తులతూగుటకు ఇట్టిపుస్తకము.. ఈ గ్రంథము చదువుటకు ఒక వల (అద్భుతకథ) .. . 75పటములును క్యాలికోతో మిక్కిలి మనోహరముగా బైండు చేయబడినది.

ఈ గ్రంథమునందు హిందూరసాయన శాస్త్రముయొక్క చరిత్ర కూడ రసవంతముగ వ్రాయబడినది.

ఈ శాస్త్రమునం ... వేమూరి విశ్వనాధశర్మ బి.ఎ గారిచే ఈ గ్రంథము వ్రాయబడినది.

మా చందదారులుకు పోస్టేజీసహా ..0 13 0

ఇతరులకు పోస్టేజి గాక 1 4 0
ఆంధ్రులపౌరుషము! ఆంధ్రులయౌన్నత్యము!! ఆంధ్రులబుద్ధివైభవము!!!
400పుటలు. ఆంధ్రుల చరిత్రము. క్యాలికోబైండు

- - -

ఐతరేయ బ్రాహ్మణ కాలమునుండి నేటివఱకు అయిపోయినయాంధ్రులను గుఱించిన చరిత్ర ఈ గ్రంథమందు సవిస్తరముగ నుండును. ఇది స్వతంత్రచరిత్రగ్రంథము (Original History) ‌విఖ్యాతాంధ్రలేఖకులయిన మ.రా.రా. చిలుకూరి వీరభధ్రారావుగారిచే రచింపబడినది.

వెల మా చందాదారులకు పోస్టేజి సహా .. 1 0 0

ఇతరులకు పోస్టేజీ గాక ....1 4 0



కం.వీరేశలింగము గారి

స్వీయచరిత్ర

- - -

ఇంగ్లీషు భాషలో మహనీయుల స్వీయచరిత్రలు పెక్కులున్నను తెలుగులో నేటివరకు నొక్కటియు లేకపోవుట గొప్ప లోపమనియు, దానినెట్లు తొలగింపనగుననియి మేము చింతించుచుండగా రావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమ స్వీయచరిత్రమును ప్రకటించు గౌరవము మాకు గలుగుజేసిరి. గద్యతిక్కనయైన ఈ మహనీయుని గురించి గాని వారిగ్రంథమలను గురించిగాని మేమధికముగా యుట కాగడాతో సూర్యుని జూపించుటయే!

గర్వముగాని, స్వాతిశయభావముగాని యెంతమాత్రమును లేక, యున్నది యున్నట్లుయథార్థచరితము ఇందుజక్కనిభాషతో వ్రాయబడినది. ఈ చరిత్రముజూచి పంతులవారి విరోధులుగూడ తలయూపెదరని మానమ్మిక. త్వరలోనే వెలువడును
క్రొత్త నవల! అత్యద్భుతమైననవల!! రంగుపటములుకలది!!
విమలాదేవి.
---

ఇది రాజపుత్రస్థాన చరిత్రవిషయక నవల. అవరంగజేబునకు బ్రతిస్పర్ధియైన రాజసింహుని యొక్కయు, అతని భార్యయగు విమలాదేవి యొక్కయు శౌర్యము, ధైర్యము, మతాభిమానము మొదలయిన విందు జక్కగ బ్రదర్శింపబడినవి. అవరంగజేబు యొక్క యంతఃపురములోని చిత్ర విచిత్రములయిన వ్యవహారములును, అతని పట్టమహిషియగు ఉదయపురికిని, చెల్లెలగు రోష్నారు కునుగల మచ్చరమును, కాబూలు దేశమునకు భర్త వెంటపోయిన చంద్రావతి దేవియొక్క పవిత్ర చరిత్రమును ఇందిరాదుర్గాదాసుల రాజభక్తియు, దేశరక్తియు, ధర్మాసక్తియు గోలకొండ లోని యక్కన్న మాదన్న గారి వైభవమును, అబూపర్వతముమీది యచలేశ్వర మందిరములోనున్న వైకుంఠయోగి చేసిన యద్భుతకృత్యములనున మిక్కిలి రమ్యముగ వర్ణింపబడినవి. కథాసందర్భము (Plot)అత్యద్భుతము, ఖయిబర్ కనుమ, ఆరావలీ పర్వతారణ్యశోభ మొదలయిన వర్ణనలు అశ్రుతపూర్వములు. పుటలు 300 కంటె నెక్కుడు. వర్ణనలను అనుసరించిన హాఫ్ టోన్ పటములు. ఇందుగొన్ని పెక్కురంగులతో నిజమైన మనుష్యులవలెనే యుండునట్టి పటములుండును. ఇట్టి సర్వాంగసుందరమైన నవల యిదివరకు తెలుగులో బ్రకటింపబడలేదని చెప్పవచ్చును. అచ్చులోనున్నది.

ఇది బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారిచే రచింపబడినది.
తయారగుచున్న గ్రంథములు.


గ్రంథము కర్త
1.చంద్రగుప్త చక్రవర్తి, శ్రీవిద్యానందస్వామి బి.ఏ
2. రాజకీయార్థ శాస్త్రము, సి రామలింగారెడ్డి ఎం,ఏ
3. సద్వర్తనము, కే.వి.లక్ష్మణరావు. ఎం.ఏ
4.మహారాష్ట్ర విజృంభణము, కే.వి.లక్ష్మణరావు. ఎం.ఏ
5. జంతుశాస్త్రము, ఆ. లక్ష్మీపతి, బి.ఏ ఎం.బి.సి.ఎ
6. కళింగదేశచరిత్రము, గురజాడ అప్పారావు బి.ఏ
7. భౌతిక శాస్త్రము ఎం, నరసింహం బి.ఏ
- - - - -
కొత్త చందాదారులను సంపాదించిన వారికి బహుమతులు.

20మంది క్రొత్తచందాదారులను సంపాదించువారిని, మాశాశ్వత చందాదారుగా చేర్చుకొని వారికి మాగ్రంథములు ఉచితముగా ...బడును. ఈ 20 మంది చందాదారులు మేము పంపు ఫుస్తకములను తీసికొనువారుగా నుండవలెను. మేము పంపు వి.పి. త్రిప్పివేయువారుగ నుండగూడదు.

2 క్రొత్తచందాదారుల చేర్చు ప్రతిపాత చందాదారునకు ..గ్రంథము ఒకటి గిల్టు అక్షరముల బైండుతో నీయబడును. లేక నాలుగు అణాలుగాగల పుస్తకముయొక్క నెలలో మినహాయించబడును. మా చందాదారులలో నెవ్వరైన పదిమంది చందాదారులను చేర్చిన యెడల అట్లు చేర్చువారికి పంపబడు గ్రంథములన్నియు గిల్ టు అక్షరముల బైండుతో నియ్యబడును.

మేనేజరు ,విజ్ఞానచంద్రిక

చింతాద్రపేట, మదరాసు.

విజ్ఞానచంద్రిక మేనేజరు గారికి

చింతాద్రిపేట, మదరాసు

అయ్యా!


నన్ను శాశ్వత చందాదారుగా చేర్చుకొని పుస్తకములన్నియు పంపగోరుచున్నాను,ప్రవేశరుసుము నాలుగణాలు ఇందుతో పంపుతున్నాను. లేక ఈ నాల్గణాలు వి,పిద్వారా బట్టుకొనవచ్చును. పేరు..........................................................................................

హోదా.....................................................................................

గ్రామము.................................................................................

పోస్టు:......................................జిల్లా......................................
‌వెనుకటి గ్రంథముల గొననియెడల ర్పు1-0-0ప్రవేశపురుసుము చెల్లించవలెను.

-------

విజ్ఞానచంద్రిక మేనేజరు గారికి

చింతాద్రిపేట, మదరాసు

అయ్యా!


నన్ను శాశ్వత చందాదారుగా చేర్చుకొని పుస్తకములన్నియు పంపగోరుచున్నాను,ప్రవేశరుసుము నాలుగణాలు ఇందుతో పంపుతున్నాను. లేక ఈ నాల్గణాలు వి,పిద్వారా రాబట్టుకొనవచ్చును. పేరు..........................................................................................

హోదా.....................................................................................

గ్రామము.................................................................................

పోస్టు:......................................జిల్లా......................................
‌వెనుకటి గ్రంథముల గొననియెడల ర్పు1-0-0ప్రవేశపురుసుము చెల్లించవలెను.

---
ఏజంట్లుకావలెను.
మంచికమీషను యివ్వబడును.
-----

బనియనులు, మేజోళ్లు, టోపీలు, మొదలుగాగలవివూలుతోను, నూలుతోను తయారుచేయబడుచున్నవి . మిక్కిలినాణ్యము, ఇతరదేవపుసరకులకంటె నాణ్యమయిన వనియు.. కధరలుగలవనియును పలువురుగొప్పవర్తకులభిప్రాయములనిచ్చియున్నారు. ఇంకనుకొన్ని భాగములు విక్రయమునకు సిద్ధముగా నున్నవి. సరకులను విక్రయించుటకును, భాగస్థులను చేర్చుకొనుటకును ఏజంట్లు కావలసియున్నారు. మంచికమీషన్ యివ్వబడును. ఇష్టమున్నవారు యీ క్రింది అడ్రస్సునకు వ్రాసికొదువసంగతులును తెలిసికొనవలయును.

వి.యన్ నారాయణమూర్తి

...

ది స్వదేశనిట్టింగు ఫ్యాక్టరీ (లిమిటెడ్)

నిడదవోలు, కృష్ణా జిల్లా
సుందరుల మందారము. హిందూసుందరి. రమణుల యాభరణము.

---

ఇది ప్రత్యేకము స్త్రీలకొఱకు ప్రచురింపబడుమాసపత్రిక. విదుషీమణియగు శ్రీమతి మొసలిగంటి రామాబాయమ్మ గారు దీనికి సంపాదకురాలు. ఇందు పాతివ్రత్యము, దైవభక్తి, గృహిణీధర్మములు, శిశుపోషణము, గృహనిర్వాహకవిధులు మొదలయిన స్త్రీలకత్యంతోపయుక్తములగు విషయములు పండితులగు నారీమణులచో వ్రాయబడుచుండును. పురాణకధలు, నవీనచరిత్రలు, ప్రహసనములు, పద్యములు, ఉపన్యాసములు, సాధ్వీమణుల జీవితములు ఇందువిశేషముగ నుండును. కుట్టుపనులు నేర్చుకొను విధము, పూలచెట్లబెంచురీతి, ఉపాధ్యాయుడక్కరలేకుండ ‌విషయము బోధపడునంతసరసముగా బొమ్మలతో వ్రాయబడును. మంగళహారతులు, కీర్తనలు, పాటలు, మొదలగునవి యుండును. ఈ ‌విషయమావిషయమననేల అతివలకత్యంతావశ్యకములగు పలువిషయములిందుండును. చదువనేర్చిన ప్రతి స్త్రీయొక్క చేతనుండదగినది.

ఈ కార్యాలయమునందు స్త్రీలవశ్యముగా పఠించవలసిన వనేక గ్రంథములు సరసమైన వెలకు దొఱకును.

వలయువారు. సత్తిరాజు శీతారామయ్యగారు,

మేనేజరు, హిందూసుందరి.
కంతేరు పోస్టు, కృష్ణా జిల్లా
అనివ్రాయవలెను.
మొక్కలు, విత్తనాలు.


- - -

అనేక దేశములనుంచి యేరి తెప్పించిన నూటికెక్కువ సుప్రసిద్ధజాతుల అంటుమామిళ్లు, సపోటా, లిచ్చి, నాగపూరు, సంతరా, కమలా, కొడగు నారంగి, మోసంబి, బతాయి, పంపరపనసల అంట్లు, కాబూలిదాళిమ, ద్రాక్ష, స్ట్రాబరి, రాసుబరి, ఆపుల్, పీచి, మంగోస్టి్ మొదలయిన వివిధ ఫల వృక్షముల పిల్లలు, చిత్రవిచిత్రమయిన రంగులుగల క్రోటన్ మొదలయిన ఆకు పసందు చెట్లు లెక్కలేని జాతులపూలచెట్లు ఈ దేశమునకు తగిన నూరుజాతుల గులాబిచెట్లు, వర్నశాలలవంటి చలవ ప్రదేశములలోవుంచే అనేక జాతులచెట్లు, సమస్తజాతుల యింగ్లీషు పూలవిత్తనాలు, కాబెజి, కాలిప్లవరు నూలుకాలు మొదలయినవిదేశపుకూరకాయవిత్తనాలు, చౌకధరలకు వీలయినంతవరకు తోటలకృషి వ్యాపింపచేయునభిప్రాయముతో విక్రయింపబడును.

వలయువారు కేటలాగులు తెప్పించుకోవచ్చును. ఉరుదు ఇంగ్లీషు తెలుగు మహారాష్ట్ర భాషలలో కేటలాగులు దొరకును.

వలయువారు ఈక్రింది అడ్రసుకు వ్రాయవలెను.

డి.ఎల్ నారాయణరావు.
ప్రొప్రయిటర్ నర్సరీగార్డెన్స్
హైద్రాబాదు (దక్కను.)
D.L.NARAYANA ROW,

PROPRIETOR

Nursery Gardens,

HYDERABAD,(Deccan,)

శ్రీ వాల్మీకి రామాయణ ప్రకటనము.

శ్రీ వాల్మీకి రామాయణములోని ఆరుకాండలను ఆంధ్రతాత్పర్యవిశేషార్థములతోడ తేట తెనుగులో వ్రాసి ముద్రించియున్నాము. ఎడమవయిపు పుటలలో శ్లోకములు కుడివయిపు పుటలలో శ్లోకముల నంబరు ప్రకారము తెనుగు అర్థము వ్రాయబడియున్నది. కనుక పారాయణము చేసికొనుటకు, లేదా కథనుమాత్రము చదువుకొనుటకు మిగుల అనుకూలముగ నుండును.

బాలకాండ. రు అ పై 1 3 0
అయోధ్యకాండ --- 2 5 0
అరణ్య కాండ --- 1 3 0
కిష్కింధ కాండ --- 1 3 0
సుందరకాండ --- 1 3 0
యుద్ధకాండ --- 2 5 0
వాల్మీకి రత్నములు --- 1 7 0.
ఆంధ్రమహాభారతరత్నములు --- 1 7 0
సంస్కృత మహాభారతము
విరాటపర్వము:- ఆంధ్రతాత్పర్యసహితము 2 4 0
సభా పర్వము:- ఆంధ్రతాత్పర్యసహితము 2 8 0

శశిలేఖ. ఇది 16 సంవత్సరములనుంచి అవిచ్ఛిన్నముగా వారమునకు రెండుసారులు ప్రచురింపబడుచున్న వార్తాపత్రిక. ఇందుదేశదేశముల సమాచారములు ఇంగ్లీషులోని మహోపన్యాసముల భాషంతరీ కరణములు సాంఘీక, పరిశ్రామిక, రాజకీయ, భాషావిషయక అంశములనుగురించి నస్వతంత్ర వ్యాసములు కలిగియుండును. చందా సం|| ముకు 6-0-0 మాత్రమే. తగిన ప్రోత్సాహము దొరకెనేని దినపత్రిక చేయదలచుచున్నాము.

పై ధరలలో వి.పి.పోస్టుకర్చులు చేరియున్నవి.

విక్రయ ప్రదేశము.

గటుపల్లి శేషాచార్యులు, శశిలేఖా ఆఫీసు, జార్జి టవున్, చెన్నపురి.

శ్రీపతి అనబడు జ్యోతిషశాస్త్రరత్నము.
అహోబిలనాధీ యమును సిద్ధాంతశాస్త్ర రత్నము.
---

ఈ గ్రంథములు సంస్కృతభాష తెలియని వారికుపయుక్తముగ కనిగిరి కోర్టుప్లీడరు కొమాండూరు నృసింహచార్యులవారిచే రచింపబడినది. గురువులేక విద్యనేర్చు కొనతగినంత సులభ శైలినినున్నవి. ఇప్పటికి సుమారు 25సంవత్సరములనుంచి అతి ప్రఖ్యాతిగాంచిన గ్రంథములు. శ్రీపతియందు ఒక జాతకము, ఉదాహరణముగా వ్రాసిచూపబడియున్నది.

అహోబిలనాధీయమందు ఒక సంవత్సరమునుంచి సరియైన గణితము చూపబడియున్నది. భూఖగోళ విషయములు సంగ్రహముగా వ్రాసి అంతమున చేర్పబడియున్నవి. ఏ గ్రంథమైనను క్రయం రు. 1-8-0 పోస్టు కర్చులు కొనువారె భరింపవలెను. ఒకతూరి 8 గ్రంథములు కొనువారికొకగ్రంథము ఉచితముగా నీయబడును.

అన్నియు అయిపోయి కొన్నియేయున్నవి. త్వరపడుడు!

బుధజనవిధేయులు.

కొ. పార్థసారధి అయ్యంగార్.

స్టోన్ హవుసుపేట నెల్లూరు.
ఈ గ్రంథములవిషయసూచిక కోరువారు 0-0-6 బిళ్లపంపిన తెలియపరచెదము.
అమృంతాజనము

- - - -

పవిత్రమైన స్వదేశియోగము. వెలసీసా ఎనిమిది అణాలు.

తలనొప్పికి, పార్శ్వపునొప్పులకు, వాయువుపోట్లకు, అన్ని నొప్పులకు అమృతతుల్యము.

తామరమందు,

గజ్జిమందు,

దంతచూర్ణము,

కేశవర్థని

మొదలగు మా మందులు సుప్రసిద్ధములు.

చిరునామా :- అమృతాంజనము డిపో,

ఫోర్టు బొంబాయి.

కోరినవారికి పెద్దప్రకటనలు ఉచితముగ పంపబడును.

ఆంధ్రప్రత్రిక.
---
మంచి కాగితము!
పెద్దయాకృతి!!
చక్కని అచ్చు!!!
బహుచవుక!!!!

ఈ పత్రిక బొంబాయి నుండి వెలువడుచున్నది. సకలదేశ సమాచారములతోను, చిత్రపటములతో గూడిన దేశభక్తుల చరిత్రలతోను నిండి చదువుటకు మహాయోగ్యముగా నుండును. ఈ పత్రిక నన్ని యాంధ్రపత్రికలకంటె చవుకయయి, నన్నిటికంటెను పత్రబాహుళ్యమునందేగాక విషయ బాహుళ్యము నందును సాటిలేనిదై, ఒకసారి చదివిన వారి నెల్లప్పుడు నాకర్షించుచు ప్రతివారము తప్పక వెలువడుచు పెక్కండ్రు మహాపురుషుల మన్ననలను బొందుచున్నది. ప్రతి యాంధ్రుడునాంధ్రపత్రికను తప్పక చదివి తీరవలయును.

చందాసం:1-కి రూ|2-2-0లు మాత్రమే.
చిరునామ:____ మేనేజరు, ఆంధ్రపత్రిక,

ఫోర్టు, బొంబాయి
సంస్కృతాంధ్ర గ్రంథములు.

వసుచరిత్రము. ఇది యనేకములగు వ్రాతప్రతులజూచి బ్రహ్మశ్రీ శొంఠి భద్రాద్రి రామశాస్త్రులవారు సవరించియిచ్చిన ప్రతిననుసరించి ముద్రించుచున్నారము. ప్రతి.1-కి రు.2-8,

అప్పకవీయము.

యనేకములగు వ్రాతప్రతులజూచి తప్పులులేకుండ సవరించిసూత్రములు మొదలగునవి పెద్దఅక్షరములుగాను, ఉదాహరణములు మొదలగునవి చిన్నఅక్షరములుగాను గ్లేజు కాకితములపై ముద్దులు మూటగట్టునట్టుముద్రించుచున్నారము. చక్కని కాలికోబైండుది రు. 1.10.0 అట్ట బైండునది.1.6.0

తాత్పర్యబోధినీ సహిత భగవద్గీత. రు. 1-0-0.
బ్రహ్మశ్రీ, పురాణం సూర్యనారాయణ తీర్థులవారిది.

సులభశైలితో దెనుగు చదువగలవారి యుపయోగార్థము తయారుచేయబడినది. చక్కనిబైండుమీద అందమగు విగ్రహము.

రూ అ పై
1. శృంగార నైషధము రు 1 రఫ్ 0 10
2. నరసభూపాలీయము 12 అ. --- 0 8
3. విజయవిలాసము 8 అ. --- 0 5
4. వైజయంతి విలాసము --- 0 6
5. గంగారాయ చరిత్ర బొబ్బిలి --- 0 8
6. సులక్షణసారము, 12 అ... --- 0 8
7. తారాశశాంకవిజయము, 10 అ .. --- 0 6
8. హంసవింశతి పద్యము 14 అ ... --- 0 10
9. పారిజాతాపహరణము, 8 అ --- 0 6
10. ఆంధ్రనామసంగ్రహము, ఆంధ్రనామశేషము సటీక,.. --- 0 5
11. అనిబీసెంటు జీవితము .. --- 0 1
12. శ్రీనాథునివీధినాటకము... --- 0 1
13.నీతిశాస్త్రము చిన్నసైజు... --- 0 2

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ న్సు.

323,తండియార్పేట, చెన్నపురి </poem>
భాషాభిమానులారా!
---

ఇప్పుడు సంపుటములుగా ముద్రింపబడియున్న రావుబహదూరు కందుకూరివీరేశలింగము పంతులుగారి పుస్తకములు పదిసంపుటములును విక్రయమునకు సిద్ధముగానున్నవి. 16 పౌనుల గ్లేజు కాగితములమీద ముద్రింపబడి కాలికోగుడ్డతో నిండుగా బైండు చేయబడిన సంపుటములు ప్రత్యేకముగా నీక్రిందివెలలకు దొరకును.

రు. అ.
1. సంపుటము, ప్రహసనములు. 2 8
2. ' ' నాటకములు 2 8
3. ' ' భాషాంతరీకృత నాటకములు 3 0
4. ' ' వచనప్రబంధములు, పద్యకావ్యములు. 3 0
5. ' ' స్త్రీలకుపయోగించు కథలు, 3 0
6. ' ' స్త్రీలకుపయోగించు పుస్తకములు. 3 0
7. ' ' ఉపన్యాసములు. 2 0
8. ' ' ఉపన్యాసములు, జీవచరిత్రములు. 3 0
9. ' ' సాహిత్య ప్రకృతి శాస్త్రగ్రంథములు. 3 8
10. ' ' కవిచరిత్రములు. 3 0


అంచెకూలికొనువారే పెట్టుకొనవలయును. ఈ సంపుటములపై గిల్టక్షరములు వేయబడియున్నవి. సంపుటములన్నియు మొత్తముగా గొనువారికి సంపుటములు పదియు నిరువది (రు. 20-0-0) రూపాయలకే యియ్యబడును. విడిపుస్తకములుకూడ దొరకును. వలయువారు .

,రావుబహుదూరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు రాజమహేంద్రవరము అని వ్రాసికొనవలయును.
ఆయుర్వేద మార్తాండభిషజ్మణి పండిత డి.గోపాలాచార్యులవారిచే ఆంధ్రీకరింపబడిన ఆయుర్వేదగ్రంథము.
మాధవనినాదము

అనేక వ్యాఖ్యాతల యభిప్రాయములతోడను, చరకశుశృత వాగ్భటాదుల మతములతోడను వ్రాయబడినది.

1- వైద్యుల సహాయములేకనే సులభముగ వ్యాధులను గుర్తించునటుల జేయుటయందు దీనినిమించిన గ్రంథమింకొకటి లేదు.

2. జ్వరము, అతిసారము, పాండు, నంజు,మొదలగు 100 ప్రధానవ్యాధులయొక్కయు, వాని అంతర్భాగములగు 1000 రోగములయొక్కయు పుట్టుటకు కారణములను, అ‌విరాబోవులక్షణములను, వాని నిజస్వరూపములను, విశేషముగ వ్యాపించురీతులను, వాని సంఖ్యాభేదములను, సాధ్యాసాధ్యాలక్షణములను, వ్యాధులు కుదరవనుటకు సూచించెడు ఉపద్రవములను, ఇట్టియనేక విషయముల నన్నింటిని ఈ గ్రంథము విపులముగ సూచించుచున్నది. ఈ గ్రంథము సంస్కృతమున గల పంజిక, మధుకోశ, అతంకదర్పణము, మొదలగు వ్యాఖ్యానములననుసరించియు భాషాంతరీకరింపబడినది. సామాన్యముగ వ్రాయబడిన ఆంధ్రటీకలవలెగాక అనేక విషయములతో నిమిడియున్నది. ఆంధ్రటీకలవలెగాక అనేకవిషయములతో నిమిడియున్నది. సంస్కృతమురానివారికిని, ఆంధ్రభాష సామాన్యముగ వచ్చినవారికిని, వైద్యసామాన్యులకునుమిక్కిలియుపయోగము.

3. ఉపోద్ఘాతమును బట్టి అయుర్వేదముయొక్క ప్రాముఖ్యత, సత్సంప్రదాయము చక్కగ విశదమగును. రాయల్ అక్టివో 50పౌనుల గ్లేసు కాగితములమీద సుందరముగ ముద్రింపబడి రమారమి 600పుటలు కలిగియున్నది.

వెల, పోష్టుఖర్చులుగాక, రు 3-0-0

వలయువారు గ్రంథకర్త చిరునామాకు వ్రాయవలయును.

ఆయుర్వేద మార్తాండ భీషజ్మణి
పండిత. డి. గోపాలాచార్యులువారిచే
సిద్ధముచేయబడిన సుప్రసిద్ధ ఆయుర్వేదౌషధములు.

1.చ్యవనప్రాశన:- (ఉబ్బసమును రాకుండజేయునది, కలిగిన మాన్పతగినది. మిగుల బలమునిచ్చునది.) ఇది దీనికగాను ఎంచబడి రోగములను కుదుర్చుటయేగాక అట్టిరోగములు వచ్చునను భీతియుండిసేవించినయడల వాటిని రానివ్వకుండజేయును. ఒక టిన్నువెల 2-8-0.

2.వ్యష్యయోగము:-(విద్యార్థులు, మరిఅందరు బలహీనులకు మిక్కిలి బలమును జేయును. ధాతువులను వృద్ధిజేయుటయుందు అమోఘమైనది) తత్కాలిక సుఖమును గలుగంజేయుగంజాయి, నల్లమందు ముషివిత్తులు మొదలగుమత్తును బ్రాణహరకమును గలుగంజేయి విషపదౌర్థములు ఏమాత్రము జేర్పంబడలేదు. ఒక టిన్ను వెల.1-4-0

3.ప్రమేహభంజని;- (అనబడు మధుమేహబహుమూత్రసంహారిణి) ఈవ్యాధి యట్టిదశయందున్ననుదీనినినుపయోగించిన యెడల వెంటనే గుణకముకనుపడును. బహుమాత్రము, అందలి చక్కెర, అధికఆకలి కాళ్లచేతులయందలి మంటలు, మొదలగు వాటిని బోగొట్టి శరీరమునకు బుద్ధికి ఉత్సాహమును కలిగించును. ఒక బుడ్డివెల రు.2.8.0,

పోస్టుఖర్చులు వగయిరాలు వేరుగనివ్వవలెను. ఇట్టి అనేక అవుషధములు ఎల్లప్పుడుసిద్ధముగ దొరుకును. కోరినవారికి క్యాటలాగులు ఉచితముగ పంపబడును.

ఆయుర్వేద మార్తాండ భీషజ్మణి
పండిత డి.గోపాలాచార్యులు, ఎ,వి.యస్,
ప్రిన్సిపాలు యస్ కెపిడి హాస్పిటల్ మద్రాసు ఎగ్జామినర్, మైసూరు ఆయుర్వేద విద్వత్ ఎగ్జామినేషన్సు,

ఆయుర్వేదాశ్రమం, 55ఆచారప్ప వీధి, జార్జిటవున్ చెన్నపట్టణము.

టెల్లిగ్రాఫ్ అడ్రస్సు "pandit" Madras.

శ్రీ మదాంద్ర వాల్మీకి రామాయణము.

శ్రీకుమారాభ్యుదయ, శ్రీకౌసల్యాపరిణయాది గ్రంథకర్తలగు బ్రహ్మశ్రీ వావిలికొలను సుబ్బారావుగారిచే రచితము. సంస్కృత వాల్మీకి రామాయణమునందలి రసముగాని భావముగాని తత్వార్థముగాని మంచి..ములగాని మంత్రార్థములగాని విడువక గాయత్రీ బీజాక్షరసంయుతంబై మూలముననున్న యన్ని విశేషంబులతోడ వాల్మీకిమహర్షి మార్గమనవలంబించి యుత్తరకాండంబుతోడ నేడుకాండంబులు నిర్వచనంబుగ స్త్రీలు పిల్లలుకుగూడ సులభముగ నర్థమగునట్లు తెలిగింపబడినది. గ్రంథమునందు పై విశేషములన్నియు దెలియునట్లుకవిగారే చక్కని పీఠికయువ్రాసియున్నారు. ఇదివరకుండు తెనుగు రామాయాణములన్నిటికంటె నిది మూలమునకు సరిగాను, లలితముగను, రసవంతముగను సరళముగను సుఖబోధకముగా నున్నదని యనేక పండితులభినందించియున్నారు.

ఏడుకాండములు;- రెండు సంపుటములుగ నిండుకాలికోవస్త్రముతో నట్టకట్టింపబడినవి. మంచికాగిదములపై బెద్దయక్షరములతో ముద్రింపబడి సర్వజనులకు సులభముగలభ్యపడ దగులుబడి మొత్తమునకే విక్రయింపబడును. రెండుసంపుటములవెల. రు.4.8.0 (తపాలకూలిగాక)

క్రొత్తపల్లి వేంకటపద్మనాభశాస్త్రి,

96. వీరరాఘవమొదలివీధి తిరువళిక్కేణి, చెన్నపురి.

మనోరమ.

ఇది ప్రత్యాంగ్లేయమాసమున చిలకమర్తి లక్ష్మీనరసింహముగారిచే ప్రకటింపబడును. ఇందురసవంతములగు నాటకములు, మహాపురుషుల జీవితములు, మనోహరములగు నవలలు సంఘసంస్కరణ విషయవ్యాసములు దేశచరిత్రలు, వినోదములు, మొదలగునవి చక్కని వచనశైలిలో వ్రాయబడును. చందా. సం|| రమునకు రు 3-0-0 లు మాత్రమే.

"మేనేజరు, మనోరమ, రాజమండ్రి" అని చిరునామా వ్రాయవలెను.

ఆంధ్రకేసరి.

ఇది ప్రగమన శీలయగు యొక వారపత్రిక.

ఇందలివ్యాసములలోకోపయోగశీలతయు, భాషారమ్యతమయు ప్రశంసనీయములు. చందా. సం|| రమునకు రు.3-0,0

మేనేజరు, ఆంధ్రకేసరి, రాజమండ్రి.

- - - -

EDWARD PRESS, MADRAS

ఆంధ్రలపౌరుషము!ఆంధ్రులయౌన్నత్యము!!ఆంధ్రుల బుద్ధివైభవము!!!

ఆంధ్రుల చరిత్రము.

---<>---

పౌరుషమునందును, పాండిత్యాతి శయంబునందును, రాజ్యవిస్తారంబునందును, పూర్వపు ఆంధ్రులు హిందూదేశములోని యితర దేశములవారికి దీసిపోవువారు కారని యీగ్రంధము సప్రమాణముగా సిద్ధాంతీకరించుచున్నది!. ఇప్పటి యాంధ్రులవలెనే మనపూర్వపు టాంధ్రులు గూడ కూపమండూకములు అని యనుకొంటిరా? ఆంధ్రులొకప్పుడు మగధ సామ్రాజ్యమును, ఇంకొకప్పడు మహారాష్ట్రమును, మరియొకప్పుడు యవద్వీపమును, వేరొకప్పుడు పాండ్యచోళ దేశంబులునుజయించిరని మీరు కలనయిన నెరుగుదురా? ఎరుంగనియెడల ఈ గ్రంథము జదువుడు.

400 పుటలు కలిగియుండును. క్యాలికోబైండు చేయబడినది. కొద్దిరోజులలో చందాదారులకీయబడును.

ఇది స్వతంత్ర చరిత్రగ్రంధము (Original History) విఖ్యాతాంధ్రలేఖకులయిన మ-రా-రా-శ్రీ, చిలుకూరి వీరభద్రరావుగారిచే వ్రాయబడినది.

వెల మా చందాదారులకు పోస్టేజి సహా ... 1-0-0

ఇతరులకు పోస్టేజీగాక ........... 1-4-0

కం.వీరేశలింగము గారి

స్వీయచరిత్ర

- - - - - -

ఇంగ్లీషు భాషలో మహనీయుల స్వీయచరిత్రలు పెక్కులున్నను తెలుగులో నేటివరకు నొక్కటియు లేకపోవుట గొప్ప లోపమనియు, దానినెట్లు తొలగింపనగుననియి మేము చింతించుచుండగా రావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమ స్వీయచరిత్రమును ప్రకటించు గౌరవము మాకు గలుగుజేసిరి. గద్యతిక్కనయైన ఈ మహనీయుని గురించి గాని వారిగ్రంథమలను గురించిగాని మేమధికముగా యుట కాగడాతో సూర్యుని జూపించుటయే!

గర్వముగాని, స్వాతిశయభావముగాని యెంతమాత్రమును లేక, యున్నది యున్నట్లుయథార్థచరితము ఇందుజక్కనిభాషతో వ్రాయబడినది. ఈ చరిత్రముజూచి పంతులవారి విరోధులుగూడ తలయూపెదరని మానమ్మిక. త్వరలోనే వెలువడును