ఆంధ్రుల చరిత్రము - ద్వితీయ భాగము/మూడవ ప్రకరణము

లును నెలకొల్పబడుచువచ్చినవి. సెలయేళ్ళ కానకట్టలు కట్టి తటాకముల నిర్మించి వానింబట్టి పంటకాల్వలు త్రవ్వించి వ్యవసాయదారులకు జలాధారములను గల్పించుచువచ్చిరి. వీరి కాలమునందు కృష్ణాపట్టణము గొప్ప రేవుపట్టణముగ నుండెను. ఈ రేవుగుండ విదేశములతోడ విస్తారముగా వర్తకవ్యాపారము జరుగుచుండెను. విదేశర్తకులెందరో ఈ దేశమునకు వచ్చి ఇచ్చట నివసించుచుండిరి. విదేశవర్తకులు సహితమిచ్చటి వర్తకులతో మ్రైతిబాటించి వీరు చేయు ధర్మకార్యములకు దామును తోడ్పడుచుండిరి. తక్కువజాతుల వారు నాగరికులై శైవులు, వైష్ణవులనగుచు నగ్రవర్ణముల వారితో సాటిరాగలవారమని చెప్పుకొనుట ప్రారంభమయ్యెను. ఈ విషయము మరియొక తావున విస్తరించి వ్రాయబడును.

మూడవ ప్రకరణము మార్చు

నాగవంశోద్భవులైన మహారాజులు మార్చు

క్రీ.శ.1030 మొదలుకొని క్రీ.శ.1325 వరకు మార్చు

ఆంధ్రులచరిత్రములోని ప్రధమభాగమున నాగులగూర్చియు, నాగకులస్థులనుగూర్చియు గొంతవఱకుజర్చించి వారల యుదంతంబు బావుకులకు దెలిపి యున్నాడను. వీరలచరిత్రం దామూలాగ్రముగా దెలిసికొనగోరినయెడల సంస్కృతభాషలో వ్రాయబడిన పురాణేతిహాసకావ్యగ్రంధములు మొదలగువాటిని బెక్కింటిని బరిశోధించి యొక ప్రత్యేకగ్రంధమును వ్రాయవలయునెగాని యీయాంధ్రులచరిత్రమున సవిస్తరముగా దెలుప సాధ్యముకాదు. ఆర్యు లీజంబూద్వీపమునం బ్రవేశించినకాలమున నీదేశమునందును దీన్తిసమీపదేశములయందును సురాసురయక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధసాధ్యవిద్యాధరగరుడోరగాది జాతులవారు ఇవసించుచుండిరి. ఈ జాతులలోని వీరనాయకులనేకసహస్రవత్సరములు గడిచిపోవగా దివ్యపురుషు లై దేవతలై పురాణగాధలమూలమున బ్రశంసింపబడుచుండిరి. వీరిలో గరుడోరగాదు లేకప్రదేశమున నన్యూన్యకలహంబులం బెంచుకొని తమలో దాము యుద్ధమ్లుచేయుచు దాయాదులవలె నుండిరి. ఈగరుడొరగాదులు కశ్వాప్రజాపతి యొక్కయు అతనిభార్య లగుక ద్రూవినతలయొక్క యుపంతాన మైనట్లు మహాభారతమున వర్ణింపబడినచందమ్ను ప్రధమభాగచరిత్రమున దెలిపియున్నాన్. కద్రూసంతాన మైననాగుల్ నాగధ్వజముగలవారు. వినత సంతాన మైనగరుడులు గరుడధ్వజం గలవారు. అనేక నాగరాజులు కద్రూసంతానముగ మహాభారతమునం బేర్కొనంబడిరి.1 అసలతేజులుగను, దీర్ఘ దేహములుగను, భుజవీర్య్హవంతులుగను, మహాభారతమున కద్రూతనయులగు నాగరాజు లణ్భివర్ణింపబడిరి. ఈనాగులను సంతోషపెట్టి స్వమతా వలంబకులనుగా జేసికొనుటకై ప్రాచీనకాలమున శైవులు శివుని నాగభూషణుని గా జేసి యుందురు. ఆకతమున నాగుల నేకులు శైవులు కార్తెములునై యుందురు. శైవులకన్న నాధిక్యము గనపడవలయు నన్నభావముతో మఱికొంతకాలమునకు విఅష్ణవును శేషశయనుగను, గరుడవాహనారూఢునిగను జేసియుందురు. ఈనాగజాతివారును, గరుడజాతివారును


   1. కద్రూసంతానములొ శేష వాసు క్త్యైలాపుత్ర వామన నీలానిల కల్మాష శబలార్యకోగ్రక కలశ పోతక సురాముఖ దధిముఖ విమల పిండకాస్త కరోటక శంఖ వాలి శిఖ నిష్ఠావక హేమగుహ నహుష పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గర పిండక కంబులాశ్వతర కాళీయక వృత్త సంవర్తక పద్మ శంఖముఖ కూర్మాండక క్షేమక పిండారిక కరవీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వ పాండర మూషకాద శంఖశిర: పూర్ణభద్ర హరిద్ర కాపరాజిత జ్యోతిక శ్రీనహ కారవ్య ధృతరాష్ట్ర శంఖపిండ పిఠరక సుముఖ కాణపాశన కుఠిర కుంజర ప్రభాకర కుముద్ కుముదాక్ష తిత్తిరి హలిక కర్ధమ బహుమూలక కర్కరాకర్కర కుండోదర మహోదర్4ఉ లాదిగా ప్రాచీన నాగరాజు ల నేకులు పేర్కొనంబడిరి. ధనుర్విద్యయందు గశలు లగుటంజేసి ప్రాచీనకాలంబునవి, గొన్ని బులకు వారిపేరిట నాగాస్త్రం బనియు, గరుడాస్త్రం బనియు పెట్టబడి నవి.  ఇవ్విషయంబు లటులుండనిండు. అయోధ్యానగస్రమునుండి శ్రీరామచంద్రుండు దండకరణ్యమార్గమున బంచవటికి వచ్చి సీతను గోల్పోయి లక్షణసమేతుండై కిష్కిందారాజ్యమునకు బోయి సుగ్రీవునితో సఖ్యముచేసికొన్నప్పుడు సీతను వెదకుటకై సుగ్రీవుడు హనుమదాదులరగులపట్టణ మగుబోగవతీపురంబునకు బంపె నని రామాయణమునందు జెప్పబడినది. హనుమంతునికి సీతయున్న ప్రదేశమును జెప్పిన పంపాతియు, సీతనుగొనిపోవునపుడు రావణున కడ్డుపడి యుద్ధముచేసి చనిపోయిన పంపావతితమ్ముడు జటాయువును, గరుడజాతిలోనివారే యైనున్నారు. ఆకాలమునందు వాసుకి యనునాగరాజుచే బరిపాలింపబడుచున్న భోగవతీపురమిప్పటి బస్తర(బస్తరు)రాజ్యములోని ప్రాగ్భాగమున నున్నట్లుగ గాన్పించుచున్నది.  అట్టి వస్తరరాజ్యముయొక్క పదునెకడవ, పండ్రెండవ, పదమూడవ శతాబ్దముల చరిత్రమునే సంగ్రహముగా నీప్రకరణమున దెలుపబోవుచున్నాడను.  ఆకాలమునం దీప్రదేశము చక్రకొట్య మండల మను పేర బరగుచుండేను.  ఆంధ్రభారతకృతిపతి యైన రాజరాజ నరేంద్రునకును, అతనికుమారుండైన రాజేంద్రచోడుడను నామాంతరముగల మొదటి కులోత్తుంగచోడచక్రవర్తికిని సమకాలికు డై ధారావర్షు డనునాగరాజాకాలమ్న నీచక్రకొట్యమండలమ్ను స్వతంత్రుడై పరిపాలనము చేయుచుండెను.
                     చక్రకొట్యమండలము
     ఈచక్రకొట్యమడలమునకు రాజధాని చక్రకోట్య్హమే.  ఈపట్టణమునుబట్టి దేశమునకు నీనామమే గలిగినది. చక్రకొట్యమే చక్రకూటమని శాసనముల యందు వాడబడుచు వచ్చినది.  చక్రకూట మనునది చిత్రకూటముయెక్క తప్పునేరని తోచెడిది. చిత్రకూట మనుగ్రామ మొకటి యిప్పటి వస్తర (Bastar)  రాజూములోని యింద్రావతి నదియొడ్దున నున్నది.  ఇంద్రావతి యనునది వస్తర రాజ్యముగుండ ప్రవహించి గోదావరిలో కలియుచున్నది.  ఇంద్రనది యనిగూడ దీనికి బేరుగలదు.  చిత్రకూటము రామాయణములో జెప్పబడిన చిత్రకూటాద్రికాదు.  ఈచిత్రకూటము పురాణప్రసిద్ధమయినదిగనదిగద గూడ గనట్టుచున్నది.  శిశునాగవంశములో జనించిన నందరాజులలో గడపటి వాడగు మహాపద్మనందుడు మగధదేశమున్ పరిపాలించుకాలమున నీ చిత్రకూట రాజ్యమును మందనాధు డనువాడును, ఆంధ్రరాజ్యమును కాకులు డను వాడును పాలనము సేయుచుండిరనియు వీరలును మఱికొందఱు రాజులును గలిసి మహాపద్మనందునితో యుద్ధము చేసి యోడిపోయి చెఱబెట్టబడితరాదిగ నారాజులెల్లరును క్షత్రియోచితసంస్కారముమలకునెల్ల వెలియై శూద్రప్రాయులై పోయిరనియు మార్కండేయాదిపురాణములయందు జెప్పబడియెను.  ఆఱవ శాసనములందు చక్రకోట్యము సక్కరకొట్ట మని వ్రాయబడినది.  ఇప్పటి బస్తర రాజ్యము మధ్యమాగాణములలోనిది.  గోదావరి జిల్లాకు బశ్చిమోత్తరమునను విశాఖపట్టణములోని జయపురసంస్థానముననకు బశ్చిమమునను నున్న గోండ్వానాదేశములో నున్నది.  అనగా చిత్రకూటరాజ్యము దక్షిణకోసల చేదిరాష్త్రములకుని కళింగాంధ్రదేశములకును నడుమనున్నది.  దీని కిప్పటి రాజధాని జగదళపురము.  కాకతీయప్రతాపరుద్రుని తమ్ముడగు అన్నమదేవుని సంతతివ రిప్పు డీదేసశమును పరిపాలించుచున్నారు.
                          జగదేకభూషణధారావర్షమహారాజు
    ఆంధ్రభారత కృతిపతియైన రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రపురము రాజధానిగా వేంగీరాష్ట్రమును బరిపాలించుచుందినకాలమున బదునొకండవశతాబ్దమధ్యమున జగదేకభూషణధారావర్షమహారాజు చక్రకొట్యు మండలమును బాలించుచుండెను.  రాజరాజనరేంద్రుని పుత్రుడును యువరాజును నగు రాజేంద్రచోడుడు చక్రకొట్యముపై దండెత్తివచ్చి యాపట్టణ మును ముట్టడించి యీధారావర్షునితో యుద్ధముచేసి జయించి యితనివలన గప్పము గైకొని దక్షిణకోసలములోని వాయిరానగరమును (వజ్రాకరము) ముట్టడించి యా దేశములోని యనేకగజయూధములను పట్టికొనిపోయెనని రాజేంద్రచోడుని శాసనములయందు జెప్పబడినది.1  వజ్రపురము మిక్కిలి పురాతన మైనపట్టణముగ గానిపించుచున్నది.  క్రీస్తుశకారంభమున  గావేరీ తీరమున మొరయూరురాజధానిగ ద్రావిడదేశమును బరిపాలించుచు సుప్రసిద్ధి గాంచియుండిన కరికాలచోడచక్రవర్తిపైని జెప్పబదిన వజ్రపురాధిపతితో సఖ్యము గలిగియుండె నని శిలప్పదికార మను ద్రావిడకావ్యమునందు జెప్పబడి యున్నది.2 జగదేకభూషణబిరుదాంచితు డగు ధారావర్షుని యొక్క పూల్ర్వుల చరిత్రము దెలియరాదు. ఇతనికుమారు డగుసోమేశ్వరుని కృష్ణపుర (Kruruspal) శాసనమున వంశావళి చెప్పబదియున్నదిగాని యాభాగము నందలి యక్షరములు శిధిలము లయిపోయినందున వంశావళి చక్కగా వనగాహముకాకున్నది.  ఈధారావర్షునకు బూర్వమున నొక ధారావర్షుదు పేర్కొనబడి వానివంశమునం దీధారావర్షుడు జనించినటుల జెప్పబడియెను. కన్నడమండలములలోని రాజవంశములనుగూర్చిన చరిత్రమును వ్రాసిన డాక్టరు ఫీటుదొరగారు సింధుకులులను (సైందవులను) మూడు శాంఅలవారిని బేర్కొనియున్నారు.  అందు మొదటిరెండుశాఖలవారును పశ్చిమచాళుక్య చక్రవర్తులకు సామంతులై యుండిరి. మొదటిశాఖ యెలుబర గిశాఖయందురు.  బొంబాయిరాజధానిలో బీజపురమండలములోని గాగల కోటపట్టణమునకు బదిమైళ్లదూరమున నున్న ధైరాన్ మట్టి యనుగ్రామమున మహాసామంత మండలేశ్వరు డైన నాగాదిత్యుచే వ్రాయింపబడిన యొక శాసనమున నీసింధువంశోత్పత్తినిగూర్చిన యొక చిన్నగాధ పేర్కొనబడినది. ఈసైంధవులు నాగజాతివారనియు, అనంతుడు వాసుకి తక్షకుడు మొదలగు నాగరాజుల యొక్క ప్రతిబింబములను ధ్వజమునందుగల నాగధ్వ

1. South, Ind Inscriptions Vol.III. PP.132 and 140 and Vol. II. P.235

   2.The Tamils 1800 Years ago P.67; Silappathigaram. V.II, P.104 జాలనియు, వ్యాఘ్రలాంచనులనియు, భోగవతీపురధీశ్వరులనియు స్పష్టముగ వక్కాణింపబడియున్నారు.  ఈసింధువంశముయొక్క మూలపురుషుడు సింధు నదీగర్భదేశముదలి అహిక్షేత్రపురమునందు ధారణేంద్రుడనునాగరాజునకు మానవరూపమున జనించిన పుత్రుడైయుండెనట
    అతడు జనించినపిమ్మట మొకవ్యాఘ్రముచే బెంపబడియెనట! అతడు కదంబరాజపుత్రికను బెండ్లాడుగా వారలకు మూవురుపుత్రులు కలిగి సింధురాజ వంశస్థాపనకు లైరి.  తరువాత ముప్పయొక్కరు రాజులు జనించి ప్రభుత్వము చేసిరి.  తరువాత సైంధవుడు; అటుపిమ్మట కష్రురాజు (కమ్మయరాజు) జనించెను. అతనికి సాగరాంబయందు పులికాలుడు జనించెను. పులికాలునకు రేవకాంబయందు నాగాదిత్యుడు జనించెను. నాఅగాదిత్యునకు పోలాంబయందు పోలయూసింధువు పుట్టెను.  వానికి ఖాండవమండలేశ్వరుని తనయ యగు బిజ్జల దేవియందు సేవ్యరారు పుట్టెను.1 ఈపైని పేర్కొనంబడిన పోలయ సింధురాజును వానికొడుకు సేవ్యరాజును చక్రకొట్యమండలేశ్వరుడైన జగదేక భూషణధారావర్షునసమసొమేశ్వరునకును సమాలికులైయున్నారు.  కాబట్టి ధారావర్షుడు పైనిజెప్పిన రాజవంశమునకు సంబంధించినవడై యుండవచ్చునని తోచుచున్నది.  మఱియును పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, మొదలగువారివలెనే యీనాగవంశరాజులును ఉత్తరహిందూ స్థానమునుంది దక్షిణహిందూస్థానమునకు వచ్చినవార మని చెప్పుకొను చున్నటుల బైనుదాహరింపబదిన భైరాన్ నుట్టి శాపమువలన బోధపడు చున్నది గాని, యితరాధారము లేవియును బరిశోధింపకుండ నీశాసనము లోని  గాధలను విశ్వసింపరాదు.
  ఈగజగదేక భూషణధారావర్షమహారాజునకు చంద్రాదిత్యు డను నాతడు సామంతుడుగ నుండెను.  ఇతడు తాను కరికాలచోడవంశమువడ ననియు, కాశ్వపగోత్రుడ ననియు జెప్పుకొనియుండుటచేత దెనుగుచోడుల తెగలోనివడుగ గనుబట్టుచున్నాడు.  ఇతనిశాసనముపైని  సింహలాంచనము

1.Ep, Ind. Vol.III. P.231 గలరు. శాసనపరిశోధకు లితనిశాసనములు బరిశీలించి యితడు రేనాటిచోడు లలోనివా డని సిద్దాంతీకతించిరి.1 ఇతడు మొదటికులోత్తుంగచోడచక్రవర్తితో నీదేశమునకు దండెత్తివచ్చి ధారావర్షుడు కులోత్తుంగఛోడ చక్రవర్తికి గప్పము చెల్లించి యెడంబడికచేసికొన్నతరువాత నిచ్జటనే నిలిచిపోయి ధారావర్షునికి సైన్యాధిపతిగను, సామంతుడుగ నుండె నని తోచుచున్నది. చంద్రాదిత్యుడు తన రాజదాని యగు వరశూరపట్టణమునందు (Modern Barsur) చంద్రాదిత్య సముద్ర మనుపేరిటా నొక ఘనతటాకమును నిర్మించెను. ధారావర్షనియొక్క యంగీకారమునుబొంది వడ్డనాడులోని యొకగ్రామమునుసయుతము నాశివాలయమునుకు దానముచేసెను. వడ్డనా డను నది విశాఖపట్టణ మండలములోని వడ్డారిప్రాంతప్రదేశమై యున్నది. జగదేక భూషణధారావర్ష మహారాజునకు గుండమహాదేవియందు సోమేశ్వరు డను కుమారుడు జనించెను.

          రాజభూషణ సోమేశ్వర మహారాజు.
   ధారావర్షునకు వెనుక చక్రకూటరాజ్యాధిపత్యమునకై వానికుమారుడగు సొమే

శ్వరునకును వాని దాయాది యగు మధురాంతక దేవునకును వివాదము పొసగి యుద్ధము జరిగినటుల శాసనములందు గానబడుచున్నది. ధారావర్షుడు చక్రకో ట్యమండలమును బరిపాలించుకాలముననే వానికి లోబడిన సామంతుడుగనో లేక స్వతంత్రుడుగనో మధురాంతకదేవు డనునాగరాజు భ్రమరికోట్యమండ లమును ను బరిపాలనము సేయుచున్నటుల మధురాంతకదేవుని రాజపుర శాసనము వలన దెలియుచున్నది.2 తదితర నాగవంశోద్బవులయిన చక్రకూట రాజులవలెనే మధురాంతక దేవుడను తాను నాగవంశొద్భవుడ ననియు, భోగవతీపురాధీశ్వరుడి ననియు, వ్యాఘ్రలాంచనము గల వాడ ననియు, వ్యాఘ్రలాంచనముగల వాడననియు, నాదధ్వజము గలవాడ ననియు, మహేశ్వరపాదారాదకుడు


1.ఆంధ్రులచరిత్రములోని ప్రధమభాగము పేజి 351.Annual Report on Epigraphy, 1909, para 65. 2.Ep. Ind. Vol. IX, PP. 174-181 ననియు దనశాసనమునందు జెప్పుకొనియున్నాడు. భ్రమరకోట్యమండల మనునది చక్రకొట్యమండలములో నొకభాగముయొక్క నామమో, లేక చక్రకొట్య మండలమునకు నామాంతరమో భోధపడలేదు. ధారావర్షుడు చక్రకొట్యమండల మును బరిపాలించుచుందగా నామండలనే మధురాంతకదేవుడు స్వతంత్రుడై పరి పాలనము సేయుచుండెననుట విశ్వాసాఅత్రము గాదు. ధారావర్షునకు మధురాంతక దేవుడు సామంతు డనియే యూహింపవలసి యున్నది. అయినను భావిపరిశోధనమువలననే యీవిషయ మిదత్ద మని నిర్ణయింప వలయును.

      మధురాంతక దేవుడు శా. శ 987 సరియగు ప్రభవసంవత్సర కార్తికిశుద్ధ బుధవాసరానూరాధాంక్షత్రయుక్త శుభలగ్నమునందు కన్నరదేవ రాజకుమారుని యొక్కయు, పట్టమహిషి నాగలమహాదేవియొక్కయు, నాయక కుమారుని యొక్కయు,శూద్రకనాయకునియొక్కయు, తుంగరాజకుమారునియొక్కయు, పుల్లమసెట్టియొక్కయు సమ్మతినిగైకొని మేడిపాత్రు డను బ్రాహ్మణునకు భ్రమర కాట్యమండలములోని రాజపురగ్రామమును ధారాపూర్ఫకముగ దానముచేసెను. ఈరాజశాసనము నతిక్రమించి యీదానమునకు భంగముకలిగించువారు కాశికా నగరములో వేయిలింగములను బ్రద్దలు కొట్టినప్పుడగు, వేయిమందిబ్రాహ్మణు లను నాలుగువేలగోవులను జంపినప్పుడు నెట్టిపాపమును బొందుదురో అట్టి పాపమునే పొందుదురనిగూడ శ్లోకములు రచింపబడినవి.  శ్రీధరేశ్వరనాయకుడు, నాగహస్తి, కరణదరియా యనువారలు సాక్షులుగను, ధేనుకాకాయస్థుడు లేఖకు డుగను బేర్కొనబడిరి.  కుమారతుంగరాజు, ధమదేవుడు, గోవర్ధనుడు, దనార్ధనుడు, గాగిరపాత్రుడు, సాధుసారంగుడు, వీరలచేత గలముముట్టబడియె ననియు, ఇద్ మానవృద్ధియొక్క స్వహస్తలిఖికి మనియు, ఇయ్యది జన సామాన్యాభిప్రాయమును వెల్లడించుచున్నదనియు నాశాసనమునందు వ్రాయ బడి యున్నది.
  ఇట్టి మధురాంతకదేవు డేకారణముచేతనో చక్రకొట్యమండలము నాక్రమించు కొని  పరిపాలనము సేయుచుండగా ధారావర్షునిపుత్రు డగు సోమేశ్వరదేవుడు వాలిని  జయించి యుద్ధరంగమున జంపి సింహాసనమెక్కి నటుల సోమేశ్వరుని కృష్ణపుర (Kuruspal) శాసనమునుబట్టి దెలియుచున్నది. ఇతడు వింధ్యవాసినీ దేవతయొక్క యనుగ్రహముచేత జన కీచక్రకూట సామ్రాజ్యము లభించెనని తనశాసనమునందు జెప్పికొనియుండుటకూడ నీతనికి బూర్వ మీ రాజ్యము మధురాంతకదెఏవునిదే నాక్తమింపబడి పరిపాలింపబదు చుండె నని చూచనగ దెలుపుచున్నది.  ఇతని కృష్ణపురశాసనములలో నొక దానియందు సంకాలికులగు రాజుల పేరు లెన్నియో పేర్కొనబడినవి గాని, యాభాగ మంతయు శిధిలమైయుండుటచేత నంతగాప్రయోజనకారి గాక యున్నది. నారాయణపురము (Naraanapal) శాసనమునందుంబోలె నీకృష్ణ పురశాసనమునందును నాగరాజుల బిరుదావళి పేర్కొనబడియున్నది గాని యంతకన్న విశేషాంశం లేవియు గానరావు.  తక్కిన శాసనములందుంబోలె నీశాసనమునందును సోమేశ్వరుడు నాగవంశరాజు డనియు, కశ్వపగోత్రు డనియు బేర్కొనబడియెను. మఱీయును మహారాధిరాజ పరమభట్టారక పరమ మఃహేశ్వర సోమేశ్వరదేవుడని వక్కాణింపబడియుండుటచేత నాగరాజులలో నితడు మిక్కిలి పరాక్రమవంతుడయిన స్వతంత్రరాజని వేద్య మగుచున్నది.
                      మొదటిసోమేశ్వరుని విజయయాత్రలు.
    రెండవధారావర్షునికొడు కగు నితడే చక్రకొట్యమండలమును బాలించిన సోమేశ్వరనాము లయిన నాగరాజులలో మొదటివాడుగ నున్నవాడ్. ఇతడు విజృంభించిన శత్రురారాజమండలిపై గవిసి వారల రాదధాను లగు కళింగనగరము, లంజిపురము, రత్నపురము, లవణపురి, వేంగీనగరము, భద్రపట్టణం, వజ్రపురము, మొదలగువానిని ముట్టడించి జయించినట్లుగ దెలియు చున్నది.  నారాయణుడు మధురాక్షసుని నిర్జించినవిధముగా మొదట సోమేశ్వరుడు మధురాంతీదేవుని సంహరించి పిన్ననరాయణు డన్న బిరుదనామ మునువహించి యటుపిమ్మట శత్రువర్గమువైపునకు దరిగెను. ఆకాలమునందు భూపరిపాలనముచేయురాజులు మొదలగువారు మత్సగ్రస్తులై యెండొరుల రాజధానీనగరంబులను దహించుటయె యొక ఘనకార్యముగా దలపోయు చుండిరి. అప్పటి యచారమునుబట్టి చక్రకోట్యమండలాధిపతి యైనసోమేశ్వరుడు వేంగీదేశముపై దండెత్తివచ్చి వేంగీపురమును దహించినట్లు మిక్కిలి డంబముగా దిన కృష్ణపురశాసనమున్ందు జెప్పుకొనియున్నాడు.1 అయినను వేంగీరాజ్య మును బరిపాలించిన మహారాజులు సయితము చక్రకూట రాజధానిని దహించి నట్లుగా దమశాసనములందు జెప్పుకొనియే యున్నారు. ఇట్లాండొరుల రాజధానులను దగులంబెట్టుట సత్యమే కావచ్చును.  ఈ సోమేశ్వరునికాలమున మొదటికులోత్తుంగ ఛోడచక్రవర్తికుమారుడైన్ వీర చోడమహారాజు తండ్రికి బ్రతినిధి గానుండి వేంగీరాష్ట్రమును బరిపాలనము సేయుచుండెను.ఇతనినామముకూడ సోమేశ్వర్ని శాసనమునం దుదాహరింపబడినది.  వేంగీపుర మనునది ప్రాచీన వేంగీపురముకాదు. ఆకాలమునందు వేంగీపురమునకు రాజధానిగనుండిన రాజమహేంద్రపురమే వేంగీపురముగాక బరరాష్ట్రాధిపతులచే బేర్కొనంబడుచుండె నని తోచుచున్నది.  కాబట్టి వేంగీరాష్ట్రాధిపరు లైన చాళుక్యచోడులకును, చక్రకొట్య మండలాధిపతులయిన నాగరాజులకును బలుమాఱు యుద్ధములు జరుగుచుండె ననుట వాస్తవము.  ఇతడు వేంగీపురమును మాత్రమేగాక వజ్రపురప్తాంతదేశ్వమునందలి యరణ్యముల నన్నిటిని దహింపించె నని చెప్పుబడియెను. మఱియ్యును దక్షిణకోసలముపై దండేత్తిపోయి ఆఱులక్షల తోంబదియాఱు గ్రామమ్లను గైకొనియె నని సోమేశ్వరునిశాసనమున వ్రాయ బడినది. ఇది వట్టి యతిశయోక్తిగాన వేఱొండుగాదు.  దక్షిణకోసలమునం దన్ని గ్రామములు కలవా యని సందేహింపవలసి యున్నది.  ఒకవేళ నిజ మనుకొన్నను సోమేశ్వరుడు నిజముగా దక్షిణకోసలమును బరిపాలించె నను మాటను సమర్ధించుటకు సప్రమాణ మైన యాధార మేమియును గానరాదు. ఇతడు దక్షిణకోసలదేశముపై దండెత్తిపోయి తిరిగి వెడలగొట్టబడువఱకు గొంతభాగ మాక్రమించుకొని యుండవచ్చును.  ఇయ్యది జజళ్లదేవునిశాసనమునుబట్టి యూహింపబడుచున్నది.  జజళ్ల

1. Eqigraphia Indica Vo X. No.4 దేవుడు రత్నపురము రాజధానిగ దక్షిణకోసలమును బరిపాలనము సేయుచు క్రీ.శ.1114 వ సంవత్సరమున నొకశాసనము వ్రాయించెను. అందతడు సోమేశ్వరునిం బట్టుకొని యసంఖ్యాశమైన శత్రుసైన్యము నురుమాడెనని గొప్పగా వ్రాయించుకొనియెను. సోమేశ్వరు డెవ్ఫడో వివరమును దెలుపలేదుగాని సంగతి సందర్భములను విచారింపగా నాసోమేశ్వరుడీచక్రకొట్యమండలాధిపు డయున యీసోమేశ్వరుడే యని తేటపడుచున్నది. మఱియును క్రీ.శ.1111 వ సంవత్సర మున వ్రాయబడిన నారాయణపుర శాసనములో సోమేశ్వరుని మరణానంతరమున కన్హారదేవుడు సింహాసన మెక్కెనని స్పష్టముగ దెలియుచున్నది.1 వరశూరపుర (Bursur) శాసనముంబట్టి క్రీ.శ.1102 దవ సంవత్సరమున సోమేశ్వరుడు జీచ్వించియుండెనని తెలిసికొనుచున్నారము 2. రత్నపురశాసనము క్రీ.శ.1114 వ సంవత్సరమున వ్రాయబడినది. ఈ సంవత్సములయొక్క సామీప్యసంబంధమును బట్టి మన మీవిషయమున నంతగా సందేహింపవలసిన పనిలేదు. సోమేశ్వరునిశాసనమునందు బేర్కొనం బడిన లంజికప్తాంతదేశము బాలఘట్టం మండలములోనిది. లవణపురప్రాంత దేశము రాయపురమండలములోని ప్రాగ్భాగమే కాని యన్యముకాదు. వజ్రపురము మిక్కిలి పురాతన మైనపట్టణ మనియు, ప్రాచీన ద్రావిడభాషా సారస్వతమునం బేర్కొనబడుచు వచ్చినదనియు, వాయిరాగద మనుపేరిట ద్రావిడశాసనముల వాడబడుచు నేనుగులకు బ్రసిద్ధి జెందినటుల జెప్పబడిన దనియు నిదివఱకే చెప్పియున్నాను. వజ్రపురము ప్రాచీనకాలమున నెట్టిప్రసిద్ధిని గాంచియుండినను 10.11 వ శతాబ్దములయందంత పేరువహించియుండలేదు. వజ్రపురము నజ్రపురములకు బ్రసిద్దికెక్కియున్నటుల జెప్పబడింది. వజ్రపుర మనునది చాందామండలములోని విఅరఘ్శర్ (Wairagarb) లేక భైర్వఘడా యనునదియేగాని యన్యముగాదని తొచుచున్నది. ఇయ్యది పురాతనకాలము నుండి వజ్రపుగనులకు బ్రసిద్దికెక్కినది. ఒకప్పుడు దంతావళములసను, బొమ్మ లద్దినబట్టలకును, దున్నలకును గూడ


1. Ind. Ant Vol.IX, P. 161 2 Ibid P. 162 బ్రసిద్ధి కెక్కినది. అక్బరుచక్రవర్తికాలమునందును, బహమీరాజులకాలము నందును బ్రఖ్యాతివహించియుందిన దని మహమ్మదీయ చరిత్రములవలన స్పష్టమగుచున్నది.1 అక్బరుకాలమునణ్ దీపట్టణమును చండు డనుగొండురాజు ప్రిపాలనము సేయుచుండెను. అచ్చటి ఉరాతనములై శిధిలము లయిన శిలా ప్రదేశములు మొదలగివానింజూచినన్ స్థానిక చరిత్రములను విన్నను మాన వంశజాలయిన రాజు లచ్చట పరిపాలనము చేసియుండిరని తేటాడగలదు. ఈమానజాతిశాఖవారని తొచుచున్నది. వారలు మాణీక్యదేవిపేరిట దుర్గను బూ జించుచుండిరి. భద్రపట్టణము బద్రావతి యని చెప్పంబడుచుండెను. ఈ భద్రావతి యొకప్పుడు దక్షిణకోసలమునకు రాజధానిగ నుండెను. ఇయ్య్దది వజ్రపురము నకు (Wairagrah) 30 మైళ్లదూరౌమున నున్నది. దీనినే యిప్పుడు భాండక్ అని చెప్పుచున్నారు.

       ఈ చక్రకూటరాజూలశాసనములు కొన్ని నాగలిపిలొ సంస్కృతమునను, మఱికొన్ని తెలుగునను వ్రాయబడినవి. చక్రకొట్యమండలమునడుమ నింగ్రావతీ మదొ ప్రవహించుచున్నది.  దీనికుత్తరభాగమున బుట్టిన శాసనములన్నియు సంస్కృతమున నాగరలిపిలో నుండుటచేతన్, ఇంద్రావతీనదికి దక్షిణభాగమున బుట్టీనశాసనములు తెలుగునం దుండుటచేతన్, ఉత్తరభాగమ్న గోండుభాష యును, దక్షిణభాగమున తెలుగుభాషయును వ్యవహరింపబడుచుండినట్లుగా నూహింపబడుచున్నవి. ఈ నాగరాజుల  తెలుగుశాసనము లింకను బెక్కులు ప్రకట్ంపబడియుండలేదు. ఈ మొదటిసోమేశ్వరుని కృష్ణపుర సంస్కృతశాసన ములు మాత్రము ప్రకటింపబడినవి.  ఈసోమేశ్వరునకు శాసన మహాదేవి, ధారణ మహదేవి యను నిరువురు రాణులు గలరు. ధారణమహీదేవి దానధర్మములను గూర్చిన శాసనములు రెండు కృష్ణజ్పురమునందు(Kuruspal) గానబడుచున్నవి. ఈగ్రామము ఇంద్రావతీనదికి బైకొక మైలుదూరములో

1.Aini Akbari; Garret's Edition Vol.III, PP.229 Ind. Ant Vol.XXVIII P.21896 నున్నది. ఇప్పటి రాజధాని యగు జగదళపురమునకు 22 మైళ్లదూరమున నున్నది. నారాయణపురమును తమిరపట్టణమును కృష్ణపురమునక్ సామీప్య ముననే యున్నది. సోమేశ్వరుని రెండవరాణి యగు ధారణమహాదేవి కృష్ణపురములోని శ్రీకామేశ్వరస్వామికి బెక్కుభూదానములను జెసి శాసనము లను వ్రాయించెను. అందు విశేషచరిత్రాంశము లేమియున్ లేవుగాని, రైతులు మొదలగువారి నామములును సొమేశ్వరుని బిరుదావళులుపెక్కులును పేర్కొన బడినవి. ఇతడు మహేశ్వరపాదారాధనుడనియు, మాణిక్యదేవి పాదారాధకు డనియు జెప్పబడియుండుటచేత నీతడు శైవుడు శాక్తేయుడుననుటకు లేశ మాత్రమును సందియము లేదు. ఇతనికినుపకిదేవి యను తోబుట్టువు కలదు.

                 క న్న ర దే వ మ హా రా జు.
      మొదటిసోమేశ్వరునకు బిమ్మట వాని పుత్రుడు కన్హారదేవుడు రాజ్యూ భారమును వహించెను. శా.శ. 1043 ఖరసంవత్సర మనంగా క్రీ.శ. 1111-12 వ సంవత్సమున వ్రాయబడిన నారాయణపుర (Narayanapal) శాసనములోహి వాక్యసముదాయమునుబట్టి యాసంవత్సరముననే మహారజాధిరా జయిన సొమేశ్వరుడు మరణము నొందగా నాతని కొడుకు కన్హారదేవమహారాజు సింహాసన మెక్కెనని తేటపడుచున్నది.  మఱి రెందు శిధిలములయిన శాసనములను కన్నరదేవునినామముగానంబడుచున్నది గాని యాశాసనములకాలము చెప్ప బడనందున నాతనికి నెకన్నరదేవునకు గల సంబంధము దెలియరాకున్నది. భావి పరిశోధనముల వలనగాని వారిరువు రొక్కరగుదురో కారో చెప్ప వలనుగాదు. ఈకన్నరదేవమహారాజునుగూర్చిన చరిత్రాంశము లెవియును దెలియరాకున్నవి.
                 జగదేకభూషణవీరసోమేశ్వరమహారాజు
    కన్నరదేవమహారాజునకు బిమ్మట నెవ్వరు సింహాసన మధిష్ఠించిరో చరిత్రమున గోచరము గాకయున్నది. అయినను జాలకాలమ్నకు జగదేక భూషణవీరసోమేశ్వరమహారాజు శాసనములు గానిపించుచున్నందున భావిపరి శోధనమున సత్యము దెలియువఱకు కన్నడదేశమహారాజునకుదరువాత జగ దేక భూషణవీరసోమేశ్వరమహారాజే రాజ్యభారమున్ వహించె నని యూహింప వచ్చును. సోమేశ్వరనామమును వహించిన వారిలో నీతడు రెండవవాడుగ నున్నాడు.  కొందఱు మొదటిసోమేశ్వరుడు నీతడు నొక్కండే యని సమర్ధించు టకు బ్రయత్నించిరిగాని వారివాదము సరియైనది కాదు. ఈవిషయము రెండవసోమేశ్వరుని నాగపుపురశాసనమువలన స్పష్టమగుచున్నది. మొదటి సోమేశ్వరునకు రాజభూషణబిరుద ముండగా నీ రెండవసోమేశ్వరునకు జగదేక ణ్భూషణ బిరుదము శాసనములందు జెప్పబడినది. మొదటిసోమేశ్వరుని రాణులు  శాసనమహాదేవియును, ధారణమహాదేవియు నైయుండగా నీ రెండవసోమేశ్వరునని రాణి గంగామహాదేవి యని పేర్కొనబడినది. అతడు పదునొకండవశతాబ్ధాంతమునందుడును. పండ్రెండవశతాబ్ధాదియందును నున్న వాడు.ఇతడోల్ పండ్రెండవ శతాబ్ధాంతమునందలి, పదుమూడవ శాతాబ్దాది యందు నున్నవాడుగనుక వీరిరువురును భిన్ను లని తలంపక తప్పదు. ఈ రెండావ సోమేశ్వరుని తెలుగుశాసన మొకటి నాగపూము మ్యూజియములో నున్నది1 ఈ శాసనము మొదట దిరువంచనుండి నగపురమునకు బంప బడినది. ఇతరశాసనముల నగరాజులకుర జెప్పబడినంబిరుదులె యీత్సని8కిమి జెప్పబడినవి. ఈ వీరసోమేశ్వరునకు రాని యైన గంగామహాదేవి తన భర్తపేరిట వీరసోమేశ్వరాలయమునున్ము, తనపేరిట గంగాధరేశ్వ రాలయమును, అను రెండుశివాలయములను ప్రతిష్ఠించి భర్త యంగీకారమునౌ గైకొని మహప్రధాని యైన మాండలిక సోమరాజుయొక్కయు, కార్యకర్త లయిన దామొదరనాయకుని యొక్కయు, మెంతనునాయకునియొక్కయు, చెంచస ప్రెగడయొక్కయు, దౌవారికులయిన సోమనాయకునియొక్కయు, గడ్డపు ఈరసరెడ్డియొక్కయు,

1. Epigrahia Indica Vol.III. P.314 9 విరుచుడ్గప్రభుయొక్కయు, సరకోట కొమ్మనాయకునియొక్కయు సమక్షమున కేరమరశ యనుగ్రామముపై వచ్చునట్టి రాబడిని పైశివాలయములకు శా.శ.1131 సంవత్సరఫాల్గున శుద్ధ 12 భానువారమునాడు (అనగా క్రీ.శ. 1210 దవ సంవత్సరము ఫిబ్రవరినెల 7 తేది) దానము చేసెను. కన్నరదేవ మహారాజు యొక్క నారాయణపురశాసనమునకును గంగామహాదేవునియొక్క యీ శాసన మునకు నడుమ నూఱేండ్ల వ్యవధి గానవచ్చుదున్నది. ఇద్దఱు మహారాజు లిందీర్ఘ కాలము పరిపాలించి నారనుట కొంచెము సందేహాస్పదము నుండక మానదు. ప్రస్తుత మీశాసనములవలన నింతకన్నా నధికము తెలియరాదు.

                 జగదేక భూషణనరసింహదేవమహారాజు.
     జగదేకభూషణవీరసోమేశ్వరమహారాజునకు బిమ్మట నాతని కుమారుడయిన జగదేకభూషణనరసింహదేవమహారాజు రాజ్యాధిపత్యము వహించి నటుల నాతనికాలమునాటి రెండు తెలుగుశాసనములవలన దెలియు చున్నది.  ఇతనితల్లి గంగాదేవి అని చెప్పబడుటచేతను, గంగాదేవి జగదేకభూషణ వీరసోమేశ్వరమహారాజునకు పట్టమహిషియై యనేకదానధర్మములు చేసి యుండుటచేతను, ఈనరసింహదేవమహారజు వీరసోమేశ్వరమహారాజుయొక్క తనయుడే యనియు, అతని మరణమున కనంతరము రాజ్యమును వహించి నాడనియు నూహింపబడుచున్నాడు.  ఇతరనాగరాజులకుం గల బిరుదావళులే యితనిగూర్చి ప్రశంసించిన శాసనములయందు బేర్కొనబడినవి. ఒక శాసనము దంతివాడ (Dantewara) యందును, మఱియొకశాసనము యశ:పురము (Jasanpal) నందును వ్రాయబడినవి 1. దంతివార లేక దంతివాడ (దంతీశ్వరము) ఇంద్రానదికి దక్షిణమున నున్నది.  యశ:పురము దంతివాడకు 4 మైళ్లదూరముననున్నది.  ఈరెండిటియందును నరసింహదేవునినామము గానబడుచున్నది.  యశ:పురశాసనము శా.శ. 1147 వ సంవత్సరమునను

1.Epigraphia Indica Vol.X. Ins. No.9. దంతీశ్వరశాసనము శా.శ. 1140 దివ సంవత్సరమునను వ్రాయబడినది. అనగా క్రీ.శ. 1212 దివసంవత్సరముంకు క్రీ.శ. 1224 వ సంవత్సరమునను జగదేక భూషణనరసింహదేవమహారాజు చక్రకూటరాష్ట్రమును బరిపాలించ్చున్నవాడని పైశాసనములనుబట్టి మనకు బోధపడుచున్నది. వీరసోమేశ్వరునకు మహాప్రధానిగ నుండిన మాండలికసోమరాజునరసింహదేవునకుగూడ మహాప్రధానిగ నుండేనని యాశాసనములలో నొకదానివలన దెలియుచున్నది. ఇత డెంతకాలం పరిపాలనము చేసెనో యది బోధ పడకున్నది.

                      రాజాధిరాజ జయసింహదేవమహారాజు.
   నరసింహదేవమహారాజునకి బిమ్మట రాజాధిరాజ జయసింహదేవమహారాజు రాజ్యాధిపత్యము వహించెనని స్వర్ణపురశాసనమునుబట్టి తెలియుచున్నది. ఇయ్యది జయసింహునిభార్యలగు లోకమహాదేవియొక్కయు, శాసనమహాదేవి యొక్కయు, దానశాసనమైయున్నది. పంచప్రధానుల సమక్షమున అధికాడ యను గ్రామమును లోకమహాదేవి దానము చేసియుండెను. శాసనములందు కాలము చెప్పబడియుండలేదు.  స్వర్ణపురము (Sunarpal)  నారాయణపురము నకు (Narayanpal)  పదిమైళ్లదూరమున నున్నది. జయసింహదేవుని చరిత్ర మెంతమాత్రేమున్ దెలిసికొనుట కాధారములు గానరాకున్నవి.
               రాజాధిరాజ హరిశ్చంద్రదేవరమహారాజు
   ఇతడు క్రీ.శ. 1324 గవ సంవత్సరమునకు బూర్వము దిక్రకూటతాష్ట్రమును బాలనము సేయుచుండినటుల దమిరె శాసనముంబట్టి దెలియుచున్నది. ఆ సంవత్సర మీహరిశ్చంద్రదేవుడు మృతింనొందగా నతనిభార్య మాణిక్యదేవి భర్తతో సహగమనము గావించె నని యాశాసనమున జెప్పబడినది.   ఈనాగరాజులు క్రీ.శ. 1324 దవ సంవత్సరమువఱకును చక్రకూటరాష్ట్రమును బరిపాలనము సేయుచునే యుండిరి.
                               ----                 అనుమకొండ రాజ్య ప్రాచీనగాధలు
                     క్రీ.శ. 230 మొదలి క్రీ.శ. 1076 వఱకు
   ఇప్పుడు నైజామురాష్ట్రములో ఓరంగ లనుపేరిటం జరుగుచుండు ఓరుగంటికి సామీప్యమున నున్న హనుమకొండయే అనుమకొండె యని పూర్వకాలంబున్ బేర్కొనంబడి ప్రసిద్ధచారిత్రము గలిగియున్నది. త్రిలింగదేశ మనునామాంతరము గల యాంధ్రదేశమునకు నేకశిలానగరం బనియెడు నోరుగల్లు రాజధానిగ నుండుటకు బూర్వ మొకప్పు డీయనుమకొండ రాజధానిగ నుండెను.  క్రీస్తు శకారంభమున నీభాగ మాంధ్రసామ్రాజ్యమున జేరియుండి శాతవాహనవంశజు లయిన యాంధ్రచక్రవర్తులచే మూడవశతాబ్దమధ్యమువఱకును బరిపాలింపబడి యెను  అశాతవాహనచక్రవర్తులయొక్క చరిత్ర మాంధ్రులచరిత్రములోని ప్రధమ భాగమున సవిస్తరముగ దెలుపంబడియున్నది.  క్రీస్తుశకము 230 దవ సంవత్సరము మొదలుకొని పదునొకండవ శతాబ్దాంతమువఱకు నీయనుమకొండ రాజ్యముయొక్క చరిత్రము విశ్వసింపదగని గాధలతో, గూడుకొని యున్నది.  ఆంధ్రచక్రవర్తులలో గడపటివాడగు మూడవపులమాని క్రీస్తుశకము మూడవశతాబ్దప్రారంభమున నీదేశమును బరిపాలించుచుండెను. అతనికాలముననే యనేకశతాబ్దములనుండి వర్దిల్లుచుండిన యాంధ్ర సామ్రాజ్యము విచ్చిన్నమై అనేకభాగములుగ నేర్పడినప్పుడు పశ్చిమ భాగములు రాష్ట్రకూటులకును కదంబులకును, ఉత్తరభాగము లీభీరులకును కాలచుర్యులకును, ప్రాగ్దక్షిణభగములు పల్లవులకును వశంబులై వేర్వేఱు రాజ్యములుగ బరిపాలింపబడుచు వచ్చినది. కృష్ణామండలములోని బేతవోలు (జగ్గయ్యపేట) స్తూపమునందలి యొకశాసనములొ ప్రసిద్ధికెక్కిన యిక్ష్వాకు వీరుడను మాధారయొక్క పుత్రుడు నగు శ్రీ వీరపురుషదతునియొక్క 21 టర పరిపాలన సంవత్సరమున వర్షఋతువులోని యెనిమిదవపక్షమున దశమి నాడు మహాకాండూరుగ్రామనివాసియును కమ్మక రాకవిషయమున వడరూరు గ్రామవాసి యగు నాగచంద్రునియొక్క కుమారుడును, ఆవేశనియు నగు సిద్ధారెధుడు తనతల్లి నాగలానితోడను, తనభార్య సముద్రాణితోడను, కుమారుడు మూలశ్రీతోడను, కుమారిక నాగబంధునిక తోడను, సోదరుడు బుద్దనికునితోడను, వానిభార్యతోడను, సిద్దార్ధినియొక్క కొమారితతోడను, వేటగిరి గ్రామమునం దుండిన రక్తబంధువులతోడను, మిత్త్రులతొడను, గలిసి బుద్ధుని చైత్యముయొక్క ప్రాగ్ద్వారము సామీప్యమున ప్రాణికోటియొక్క క్షేమము నిమిత్తము ఆయక్తస్తంభముల నైదింటిని నియమించి దానముచేసెనని చెప్పబడి యున్నది.1 ఈ శాసనమునందు బేర్కొనంబడిన యిక్ష్వాకువీరుడైన శ్రీపురుషదత్తుడు ఆంధ్రచక్రవర్తి యైనమూడవపులమావి యనంతర మీదేశ మాక్రమించుకొని పరిపాలించిన పల్లవరాజని యూహింపవచ్చును.
                  అనుమకొండ నామోత్పత్తి వివరణము
     ప్రాచీనకాలంబున శ్రీశైలప్రాంతారణ్యప్రదేశంబుల మహాశూరుడై స్వేచ్చావిహారేము సలుపుచుండిన కిరాతకు డొకండు తన యనుచరులతో గూడి యచటికి నిరువది యోజనములదూరమౌన గృష్టాగోదావరీమధ్యప్రదేశమున హిడింబాశ్రమం బని ప్రఖ్యాతిగాంచిన ముదిగొండను నీశానభాగమున గ్రోశత్రయ దూరంబున నుండెని హనుమాద్రికడకు నేతెంచి యచట నొకగ్రామమును విస్తరించి నివసించుచుండెను.  అటుపిమ్మట హనుమాద్రిపైనొకదుర్గమును నిర్మాణముచేసి గ్రామమును విస్తరింపజేసి 'ఎఱుకుదేవరాజు ' అనుపేరితో బ్రజాపాలనము సేయుచుండెను. అతనికి 'అనుమడు, కొండడు,'అను నిరువురు కొడుకులు జనించిరి. ఆయిరువుర పేరిట నారాజధానీనగరమునకు 'అనుమకొండ ' అను నభిదానం గలిగినది. అనుమకొండకు దక్షిణమున నాలుగుసర్వుల దూరమున కొండడు తనపేరిట గొండపర్తి యనుగ్రామమును గట్టించెనట! ఎఱుక దేవరాజు పిమ్మట వానికొడుకు లిరువురును, తరువాత

1.Burgess Amaravaty & Jaggayyapeta Stupas P.11 'నాగడు గార్గెయుడు ' ననువార లిరువురు నాదేశమును 126 సంవత్సరములు పరిపాలనము చేసిరని స్థానిక చరిత్రమ్న జెప్పబడినది. ఈ కిరాతకుల పరిపాలన ముననే జైన్ల నేలు లిచ్చటికివచ్చి నివాసములు కుదుర్చుకొనిరి. పద్మాక్షీ దేవాలయమున్న కొండపై జైనశిలావిగ్రహముల నెలకొల్పిరి సిద్ధులకు పార్వతీపర మేశ్వరులు ప్రత్యక్ష మైనస్థలము గనుక సిద్దాశ్రమంబని ప్రసిద్ధిగాంచిన యాశైవక్షేత్రమును జైనక్షెత్రమున మార్చిరని చెప్పబడినదిగాని, దీనిని విశ్వసింప రాదు. మొట్టమొదట నీప్రదేశము జైనక్షెత్రముగనే యుండి తరువాత శైవక్షెత్రముగ మార్చబడినటుల గాకతిప్రోలరాజుశాసనముంబట్టి దెలియుచున్నది.1

                           సోమదేవరాజు.
     ఈకిరాతకులకు బిమ్మట జంద్రవంశపు రాజు లీయనుమకొండ రాజ్యమును బరిపాలించినటుల జెప్పబడినది. చంద్రవంశమున బాండవులు జనించిరి. వారి వంశమున జనమేజయుడు జనించెను.  అతనివంశమున విజయార్కుడు, సోమేంద్రుడునను నిరువురు భూపాలురు పుట్టిరి.  వారిలో విదయార్కునకు విష్ణువర్ధనుడును, సోమేశ్వరుడునకు ఉత్తుంగభుజుడున్ జనియించిరి.  వీర లుభయులును దేశమును విభాగించుకొని పరిపాలించిరి  విష్ణువర్ధనుడు గోదావరికి దక్షిణమున నున్న ధర్మపురిని రాజధానిగ జేసికొని యనేకరాజులను జయించి రాజరాజబిరుదుండని కీర్తిప్రతిష్టలను గాంచెను.  విష్ణువర్ధనునకు నందు డనుకుమారుడు పుట్టి నందగిరి అను దుర్గము నొకదాని నిర్మించి దానిని రాజధానిగ జేసికొని భూపరిపాలనము చేసెను.  దీనికి సూరయాదిత్యుడు ప్రధాని గానుండి రాజనీతులన్ దెలుపుచుండెను.  నందుని భార్య భానుమతీదేవి.  ఇతడు రాజ్యభారమ మంతయును మంత్రివరునకు నొప్పగించి శ్రీశైలక్షేత్రమునకు బోయి శ్రీమల్లికార్జుమ్నదేవున్మి సేవించి సిద్దోపదేశమును బొంది యొకబిలములో ప్రవేశించెను.  అచ్చట తపస్సుచేయుచుండిన యొక యోగిని వాని ధైర్యసాహసమ్లకు మెచ్చి వానికి ఖడ్గఖేటుక

 1. Epigraphia Indica. Vol.IX Page 256 ములను యోగవాగములను బ్రసాదించెనట ! అంతట నందుడు యోగవాగముల చే జనార్ధనస్వామిని సందర్శింప గలిగెనట ! ఆస్వామి నందునిబోనీక నిలిపి నృసింహస్వరూపంబుదాల్చి ప్రత్యక్షంబైనంత నందుడును జెక్కు చెదరక నిలిచి యుండ స్వామి సంతోషించి శస్త్రములొసంగి పొమ్మనగ సెలవుగైకొని యతడు కాంచీపురమున కేగి చోళేంద్రునికొమార్తెను వివాహముచేసికొని యటనుండి రామేశ్వరమున కేగి ధనుష్కోటిలో స్నానముచెసి నందపురమునకు విచ్చేసి యధావిధిగా జనమనోరంజకం బగునటుల రాజ్యపరిపాలనము సేయుచుండెనట! ఈ నందమహారాజూకు విజయపాలు డన్ రాజు జనియించెనట! విజయపాలునకు యశస్కాముం డయిన సోమదేవుడు పుట్టేను. ఇతడు శత్రుజనభయంకరుడై పరాక్రమవంతుడై దేవబ్రాహ్మణ భక్తిపరుడై కంధారమను పట్టణమును రాజధానిగ జేసికొని బ్రాహ్మణుల కనేకాగ్రహారములొసంగి ప్రఖ్యాతు డయ్యెను.  ఇంతియగాక మంత్రికూటం, చిద్రాచలము, మొదలగు ప్రదేశములలో అసంఖ్యాకములయిన యావులమందలన్ జేర్చి వానిపోషకత్వమునకై అధికారులన్ గొంగఱను నియమించి విశేష భక్తిశ్రద్ధలతో బోషించుచుండెను.
                   కటకరాజు దండెత్తివచ్చుట.
     ఈసోమేశ్వరభూపాలుని విఅభవము నంతయు జరులవలన విని కటకపురాధీశ్వరుండయిన బల్లహుడువాని యైశ్వర్యమున్ జూఱ గొనవలయు నని బహుళసైన్యసమేతుడైకందారముపై దండేత్తివచ్చి గోదావరీప్రాంత ప్రదేశమున సోమదేవుని పశుగణంబులబొదివి గోపాలుల నదలించి మందలను దోలుకొనిపోవు సమయంబున గోసంరక్షణార్ధము నిలుపబడిన వీరభట వర్గమునకును బల్లహుని సైన్యములకును ఘోరయుద్ధము జరిగెను. ఆయుద్ధమున సోమదేవుని సైన్యంబున హతశెషులు కందారంబునకుం జని "ఓ రాజదేంద్రా! కటకపురాఢీశ్వరుండయిన బల్లహుని సైన్యమ్లు ధరణీ చక్రము సంచరించునట్లుగా సముద్దాంతంబులై గ్రక్కున నేతెంచి మన పశుగణంబుల ముట్టికొని రక్షకభటవర్గమును నుగ్గాడి పోవుచున్నవి." అని బల్లహుని దుర్నియమును గూర్చి మొఱ్ఱపెట్టుకోగా నతడు కొపోద్దీనితుడై సైన్యంబులు గూర్చికొని సమరోన్ముఖుడై కటక పురీమార్గముంబట్టి కొనిపోయి శత్రూరదుర్గమును ముట్టడించి బల్లహునితో నాఱునెలల వఱకు బోరాడుచునే యుండెను. తుదకు సోమదేవుని సైన్యములు శత్రుశరపరంపరల ముంగట నిలువజాలక పలాయనము లగుడు బల్లహుని సైన్యంబులు దుర్గమును విడిచి వానిని దఱము కొట్టెను. ఇట్లెడగక కొంతకాలమువఱకు సోమదేవుడును బల్లహుడును బొరాడుచుండ రొకప్పుడు బల్లహుడును, మఱి యొకప్పుడు సోమదేవుడును విజయము గాంచుచుండిరి. కడపట బల్లహునితో బోరాడుటను విడేచిపెట్టి సోమదేవరాజు కందారంబునుండి వెడలక యుండెను. ఒకనాడు సోమదేవరాజు తనశత్రువయిన బల్లహుడు ప్రబలుడై యుండుటయు, తనకు బురుషసంతానము లేకుండుటయు దలపోసి అమాత్యపురోహితబందువర్గమును రావించి తనదు:ంఅమునకు కారణమును దెలిపి సంతానము గలుగుమార్గ మెట్లని వారల నడిగెను. అంతట బురోహితులు పుత్రకామేష్టియాగ్ఫము  నాచరింపవలయునని బోదించిరి. పిమ్నట సోమదేవరాజు తనభార్య యయిన సిరియాలదేవి సమ్మతిని గైకొని ద్విజవర్యుల తోడ్పాటుతో యధావిధిగ బుత్రకామేష్టి యాగమునను జేసి భూరి దక్షిణతోని సంతరెపణముతోను బ్రాహ్మణోత్తంఊళాణ్ బూజించెన్. మఱికొంతకాలమునకు సిరియాదేవి గర్బము దాల్చెను. శత్రుసంహారము కొఱకు  బుత్రకామేష్టిని యొనరించి సోమదేవుడు  పుత్రుని బడయనున్నాడని బల్లహుడువిని భయకంపితుడై రాణితోగూడిన రాజును బట్టుకొనవలయునని  బహుసైన్యలం గూర్చుకొని ప్రస్థానరభేరి ,మ్రోగించి గజ ఘటయపదాతి వర్గమ్లతో వెడలివచ్చి కందారంబును ముట్టడించెను. మమావీరుడైం సోమదేవరాజును వెనుదీయక శత్రువులను మార్కొని యురువది దినములు ఘోరమైన యుద్ధమును జేసెను. ఆ యుద్ధమున సోమదేవరాకి వీరస్వర్గము గాంఛెను. ఈదు:ఖకరమైన వృత్తాంతమును సిరియాదేవి విని శోకసంతప్త చిత్తయై ధన కనక వస్తు వాహనాదుల నన్నిటిని విప్రవరులకు దానము చేసి శాత్రవు లంత:పురము నాక్రమించుకొనకముందే కోటవిడిచి యనుమకొండకు బోయి యెఱుకుదేవరాజు వంశమున జనించిన మఱియొక యెఱుకదేవరాజ్ను శరణు చొచ్చెను. ఇచ్చట కందారంబున సోమదేవుని సైన్యము నెల రోజులు బల్లహునితో భోరాడి హతమై పోవ నాతడు కందారము నాక్రమించు కొనెను. బల్లహుడు బలవంతుడు గనుక బలవంతునితో విరోధమువలన దనకు హాని సంభవించు నని సిరియాలదేవిని తన పట్టణమును విడిచి పొమ్మని యెఱుకదేవరాజు చెప్పినందున నక్కడ సిరియాలదేవి మిగుల దు:ఖించుచు నేమి గతియని విచారించుచు బ్రాహ్మణోత్తముడును, షట్కర్మ నిరతుడును, దయా దాక్షిణ్యశీలుడు నైన మాధవశర్మ కడకుంబోయిరక్షింపు మని యతని పాదములపై బడియెను. ఆబ్రాహ్మణోత్తముడామెను లేవనెత్తి యామెవలన వృత్తాంతమును విని జాలిపనొంది 'ఓసాధ్వీ! నీకు భయం రానంతయును లేదు. సిద్ధేశ్వరుండు నిన్ను రక్షించునుగాక! మద్గృహంబున నివసించి యుండుము.' అని అభయహస్త మొసంగెను. అంతట సిరియాలదేవి ప్రచ్చన్న వేషముతో మాధవశర్మ యింట సురక్షితముగా నుండెను. మాధవశర్మచేసిన కార్యమునకు బ్రాహ్మణు లందఱును సంతోషించి యాతని కనుకూలురై యీవృత్తాంతము నంతయు నితరు లెఱుగరాకుండ బరమగోప్యముగా నుంచిరి. అట కందారంబున నున్న సామంతులందఱున్ బల్లహునితో బోరాడజాలక పట్టణమును విడిచి విదేశంతులైరి. కటకవల్లభుడు తన పంతంబుసాగెనని విజృంభించి దయాధర్మ శూర్యుడై కోటలుద్రవ్వి కవాటములు విఱిచి మేడలుగూల్చి యంత:పురమును నేలమట్టముగావించి సిరియాలదేవికై యిల్లిల్లు వెదకి సందుగొందుల బరికించి యెందునుంగానక పరితపించుచు జాడలు తీయగా నామె యనుమకొండకు బాఱి పొవుట దెలియవచ్చెను.  అంతట నతడు మంత్రిసేనాసమేతుడై పోయి అనుమకొండను ముట్టడించెను. ఎఱుకదేవరాజు తనపట్టణమును సంరక్షింపదనే సేనధిపతుల నియోగించి మంత్రివర్గముతోడ నాలోచించుచుండెను. బల్లహుని రాయబారులు వచ్చి "నీకుబలవర్విరోదుంంబు క్షేమకరంబు గాదు; సిరియాడేవిని నొసంగి నీపట్టణమును గాపాడుకొమ్ము." అని తెలియ జెప్పినా అందునకు నెఱకుదేశరాజా వారలతో నిట్లనియె. "అయ్యా ! మాకు బలద్విరోధముతోబనిలేదు. సిరియాలదేవి యీపట్ట్టణమున  నున్నదని మీకు నమ్మిక యున్నయెడల మీరు స్వేచ్చగా వచ్చి యిల్లిల్లు వెదకి తెలిసికొనవచ్చును; మా యభ్యంతర మెంతిమాత్రమును లేదు గాని, మీరు మాత్రము నిరాయుధులై పట్టణమును బ్రవెశింపవలయునే గాని యాయుధపాణులై రారాదు; మీ రాకపోకల కెవ్వరు నడ్డమురారు; మఱియు సిరియాలదేవి గాన్పించినయెడల మెరు గొనిపోవుటకు మే మడ్డుపడువారము గాము" అని విస్పష్టంగా దెలుప, వారలు పోయి యీవృత్తాంతమును బల్లహునికి  నివేదింపగా నతడు విస్మితుడై వర్ణాశ్వమవిధంబునకు భంగము కలుగకుండ జాతుర్వర్గ్యము వారిని వెదుక బంపెను. సిరియాలదేని గనుకొని దెచ్చినవారికి గొప్ప బహుమానము లిచ్చెద న్ని వాగ్ధానము చేసెను. వారి లెల్లరున్ బోయి వేయి కన్నులతోడ బట్టణమంతయు బరిశోధించి చూచిరి గాని యెక్కడను వారలకు సిరియాదేవి గానిపించదయ్యెను.  అప్పు డొకధూర్తి బ్రాహ్మణుడు రాజువలన  దనకు విశేష బహుమానములు లభించు నని మిక్కిలి శ్రద్దవహించి యేడవనాడు మాదవవర్మగృహంబు బ్రవేశీంచి ప్రచ్చన్న వేషముతో నున్న సిరియాలదేవిని గాంచి యామె సుందరాకారమును బట్టి రాజపత్ని యని భావించి యీమెయే సిరియాలదేవి యని మాధవశర్మతో జెప్పగానతడు "సరి సరి, యీమె  నాపుత్రిక, నా యల్లుడు కాశికింబోవుచు నీమె నిచ్చట నుంచిపోయె" నని యెంత చెప్పినను నాతడు వినక తనవారినిం గూర్చుకొని యామెను బట్టుకొని యెఱుకు దేవరాజు కడకు గొనిపోయెను. అంతట బట్టణములోని బ్రాహ్మణు లందఱేకమై "అయ్యా ? ఇద్ ఏమి యాగడము? రాజపత్ని యని చెప్పి బ్రాహ్మణకాంత నెత్తికొనిపోవుటకంటె పాపకృత్యంబు వేఱొండు గలదే? లోకములో సౌందర్యంబు క్షత్రియకాంతలకేగాని నెఱవారికి లేదా? ఈసుందరి మాపుత్రిక యాటచే నీవెంట కొనిపోవువారికి దుర్గతులు గల్గుట సత్యము" అని గొల్లున గోలపెట్టిరి. అంతట నెఱుకుదేవరాజు బ్రాహ్మణులంగని యిట్లనియెను. "బ్రాహ్మణులారా"! ఈమ క్షత్రియకాంత యని వారు చెప్పుచున్నారు; ఈమె యంగ సౌష్టవమును గాంచినప్పుడు నాకుగూడ నట్లే తోచుచున్నది" అని చెప్పగా వారలు దోషమును జెంది యీమెను గొనిపోయిన యెడల మేమందఱమును పుత్రమత్త్రకళత్ర బంధు వర్గంతోడ ననలప్రవేశమున్ గాంచి ముక్తి జెందెదము. మాకీర్తి త్రైలోక్యంబునందును వ్యాపించును. ఈబ్రహ్మహత్యల పాపమును మూటకట్టుకొనుటకై బల్లహుడు వచ్చినవాడు గనుక నతని వంశంబును సాంరాజ్యంబును గూలిపోవు నని శపింప నుద్యుక్తులు కాగా బల్లహుని మంత్రి విని గడగడ వడంకుచు వచ్చి వారలతో నిట్లనియె. "అయ్యా! బ్రాహ్మణశ్రేష్టులారా! ఇది యేమి సాహసము? మీయిష్ట మైనరీతిని వర్తింతముగాక; ఈమాధవశర్మ మహిమాఢ్యుడు: ఇతని వంటివా రీధాత్రిలో గానరారు; మెము వ్యర్ధముగా నీమె రాజపత్ని యని రవ్వచేసినమాట వాస్తవము; ఇప్పుడు మీపంతము చెల్లెను  మీరు సంతోషముతో నుండవ్లసినది: అయిన నొక్కపరీక్ష చేయవలసియున్నది; మీరు సిద్దేశ్వరుని సమ్ముఖమునకు బోయి యచట నామె చేతియన్నమును భుజింపవలయును: ఆమె యెవ్వరైనను జంపు నుద్దేశ్యము మాకులేదు; ఆమె మాధవశర్మ కొమర్తెయైన మాకు చింతయే లేదు. ఒకవేళ నామె రాజపత్నియే యైన యెడల కామె గర్భమున నున్న శిశువును రక్షించి కందారంబునను బట్టాభిషేకము గావింతుము.  మీకెల్లరకు నగ్రహారములిప్పింతుము" అని చెప్పనంతట విప్రవరులు తమకు ధన కనక వస్తు వాహనాదులతో నిమిత్తము లేదనియును, బల్లహునిమంత్రి కోరినప్రకారము సిద్దేశ్వరుని సమ్ముఖంబున తమకొమార్తె వడ్డించిన యన్న మును భుజించుటకు దమ కేయభ్యంతరమును లెదనియున్, గర్భవతి యన్నమును భుజింపరాదని శాస్త్రము చెప్పుచున్నది గనుక నట్లు బ్రాహ్మణులు లాచరింపరాదనియును జెప్పి యితని నొప్పించి తుదకు వారు సిద్దేశ్వరుని ముంగట గటక వల్లభుడు చూచుచుండగా సిరియాలదేవిచే నృతమున్ లవణమును గ్రహించి భుజియించిరి. అందుకునకు కటకరాజు సంతసించి సిరియాలదేవిని బ్రాహ్మణులకు విడిచిపట్టి నిజసైన్యములతో గందారంబునుండి వెలువది స్వదేశమునకు పోయెను.
                             మాధవ వర్మ
   ఇక్కడ అనుమకొండలో నొక్కనాడు సిరియాలదేవి యెడ శుభ ముహూర్తమున నొక పురుషశిశువున్ బ్రసవించెన్. అప్పుడు దైవజ్ఞశిఖామణు లయిన బ్రాహ్మణోత్తములు పెక్కండ్రు మాధవశర్మగృహంబుమ్న కేతెంచి ముహూర్తమును బరీక్షించి గ్రహస్థితులు బరికించి జాతకమునువ్రాసి యీ పురుషశిశువు సర్వంసహాచక్రంబునిర్వక్రలెల బరిపాలించు రాజుశ్రేష్టుండగునని మాధవశర్మతో బ్ అలుక నతండు నట్లాశీర్వదించెను. పిమ్మట మాధవశర్మ యాశిశువునకు జాతక ర్మసంస్కారంబు నాచరించెన్.  ఆచిన్నవానికి దండ్రియు, గురువును, దైవమును మాధవశర్మయేగనుక నతనినామమే తన తనయునకును బెట్టవలసిన దని సిరియాలదేవి కోరినందున నట్లే మాధవశర్మ యని నామకరణము చేయబడియెను. ఇట్లాచిన్నవాడు మాధవశర్మగృహమున దినక్రమప్రవర్ధమానుడై పెరుగుచుండగా నైదవయేట నక్షరాభ్యాసమున్ విధ్యుక్తముగా గావించిరి. తరువాత నుపనయయాది సంస్కారములు జరిగినవట1 మఱియు బెరిగి పెద్దవాడై సద్గురుముఖంబున బెక్కువిద్యలను గ్రహించి విఖ్యాతు డగుచువచ్చెను. అతడు ప్రతిదినమును అనుమకొంద పద్మాక్షి దేవియాలయానికుం జని మిక్కిలి శ్రద్ధాశక్తులతో నామెను సేవించుచు వరప్రసాదమునుబొంది నిర్ఫక్రపరాక్రముండు నజయుండునై వన్నె కెక్కుచుండెను. అతడొక్కనాడు తనతండ్రి కటకరాజుతో జరిగిన యుద్ధమున జంపంబడియె నని విని క్రుద్ధుడై పగసాధింప దీక్షవహించెను. అంతట గ్రమక్రమముగా నీరాజపుత్రుని నవమన్మధాకరమునుగూర్చియు, వివిధ విద్యాప్రౌఢిని గూర్చియు, పరాక్రమమునుగూర్చియు, విచిత్రములయిన కధ లును పొగడ్తలును దేశమున్ందంతట వ్యాపుంపగా దేశములోని శూరులందరు నస్తనికడకేగి కటకరాజుతోడి యుద్చమినకు బురికొల్పి సమరోన్ముఖుని గావించిరి. అప్పుడు మాధవవర్మ తల్లియొక్కయు, మాధవశర్మయొక్కయు ఇతర బ్రాహ్మణులయొక్కయు ననుజ్ఞంగైకొని బహుసైన్యములను గూర్చుకొని మొట్టమొదట నాపట్టణమేలుచున్నట్టి యెఱుకరాజును మరియొక ప్రదేశమునకుపంపి యనుమకొండను స్వాధీనపఱుచుకొని దోర్ధన్నమున నుద్దవిడి మత్కలముపై దండెత్తిపోయి కటకపురిని ముట్టడించెను. కటకపురాధీశ్వరుండును మేటిపరాక్రమ వంతుడేగావున జంకులేక ధైర్యసాహసములతో యుద్ధసన్నద్దుడై మాధవవర్మ నెదుర్కొనియును, మాధవవర్మ కటకదుర్గమును ముప్పది దినములు ముట్టడించి కోటలనుద్రవ్వి, కవాటంబులనువిఱిచి, కుడ్యంబులిడియగొట్టి, పట్టణంబుజొచ్చి సౌధంబులను గూల్చి, సకలసైన్యంబులును సమయించి, వీరరసంబు పొంచిరివోయి పొరలిపాఱు, సంకులసమరంబున జంద్రాయుధముచే గటకవల్లభుని తలద్రుంచి, పట్టణంబంతయు వశముచేసికొని, కటకపురాధీశ్వరుని కుమారునకు బట్టముగట్టి, హతశెషమయిన సైన్యముతో ననుమకోండకు మహావైభవముతో విచ్చేసి, తల్లికిని మస్ధవశర్మకును నమస్కరించి, యాశీర్వాదములను గాంచెను. పిమ్మట మాధవశర్మ దుర్మార్గులను శిక్షించుచు బ్రాహ్మణుల కనేకాగ్రహారంబులొసంగి ప్రజారంజకముగా బరిపాలనముసేయుచుండెను. అతనికి బట్టమహిషియందు బర్మాక్షీదేవి వరప్రసాదంబున గొంతకాలంబునకు సుతుండుకలుగగా నాబాలునకు బద్మసేనుండని నామముంచెను. ఈమాధవశర్మ శాలివాహనశకము230 దవ సంవత్సరము మొదలుకొని320 వది సంవత్సరము వరకు బరిపాలనముచేసెనని స్థానిక చరిత్రమునం జెప్పబడినది. పండ్రెడవ శతాబ్దమునందు వేగీదేశాధీశ్వరునకు సామంతుడుగనుండి పల్లకేతభూపాలుడు బెజవాడ మల్లేశ్వరస్వామివారి యాలయములో నొకఱాతిపలకమీద వ్రాయించిన శాసనములో నుదాహరింపబడిన గాధలలో శాలివాహనశకము112 న సంవవత్సరప్రాంతమున నొకమాధవవర్మ యనురాజు కలడనియు, అతని కుమారుడు చింతగింజల నమ్ముకొని పొట్టపోసికొనెడి యుఒక స్త్రీయొక్క బిడ్దను సంహరించినందున రాజు విచారించి తనకొడుకుమీద నేరము ఋజువైనందున న్యాయపక్షమునెపూని కొడుకునకు నురిశిక్ష విధించె ననియు, అందుపైని మల్లేశ్వరస్వామి యాతని న్యాయబుద్ధికి సంతోషించి యాతనిపై సువర్ణవర్షమును గురిపించి యాతనిపుత్రుని బీదరాలగు నాస్త్రీయొక్క పుత్రుని మరల సజీవులను గావించెననియు, మల్లేశ్వరుడు మాధవవర్మయొక్క కీర్తిని భూమిపై స్థాపితము చేసెననియు, నీమొదలు గాగలవిషయములు పేర్కొనభడినవి.1 కాబట్టి మాధవవర్మ ఖ్యాతి యప్పటికే ప్రఖ్యాతమై యున్నది. ఈమాధవవర్మ చరిత్రమునం గొంతకల్పన ముండినను మాధవవర్మ కల్పితపురుషు డని మాత్రము చెప్ప వలనుగాదు.  ఇయ్యవి భావిపరిశోధనమునుగాని తేటపడునట్టి విషయములు కావు. 
                       మఱికొందఱు చంద్రవంశపురాజులు
   మాధవవర్మకు పిమ్మట బద్మసేనుడు రాజ్యభారమును వహించి శా.క.464 సంవత్సరమువఱకు ననగా 74 సంవాత్సరములును, అటుపిమ్మట వానికొడుకు వెన్నమరాజు శా.శ.437 వఱకు ననగా 74  సంవత్సరములును, అనంతరము వానికుమారుడు పోరంకివ్వెన్నమరాజు శా.శ. 610 వఱకు ననగా 74  సంవత్సరములును, తదనంతరము వానిపుత్రుడు వెండిగుండమ రాజు శా.శ. 622 వఱకు ననగా 70 సంవత్సరములును, ఆమెతరువాత నెఱుసుదేవరాజు శా.శ. 767  వఱకుననగా 70 సంవత్సరములును, ఎఱుకదేవరాజునకు తరువాత భువనైకమల్లుడు శా.శ. 234 వఱకు ననగా

1. Report on Epigraphy No.665, Public, 28th July, 1810, Part II, Pages 81-82, Paras 8 and 9. 62 సంవత్సరములును బరిపాలనము చేసిరని చెప్పబడియున్నది. ఈరాజులను గూర్చి విశేషచరిత్రాంశము లేవియు స్థానిక చరిత్రమునం జెప్పబడి యుండలేదు. ఈరాజులపరిపాలన సంవత్సరము లంతగా విశ్వసింపదగినవి కావ్. ఈరాజులు కటక పురాధీశ్వరునితో బోరాడుచుందినటుల స్థానిక చరిత్రమునందు వ్రాయబడి యున్నది. ఈమహారాజులలో భువనైకమల్లుడు ప్రఖ్యాతుడుగ గన్పట్టుచున్నాడు. ఇతడ్ విజయనతరెపురాజయిన నరసింహదేవరాయలతో యుద్ధము చేసినటుల జెప్పబాదియెనుగాని యాకాలమునకు విజూయనగరము నిర్మింపబడకుండుటయు, నరసింహదేవరాయ లాకాలమువాదు గాకుండుటయు వాస్తములయిన చరిత్రాంశములు గావున బైగాధల లోని విషయముల నెంతమాత్రమును విశ్వసింపరాదు.

                              నిజమైన చరిత్రము
     క్రీస్తుశకము 230 మొదలుకొని కీ.శ. 106 వఱకు నిజమైన చరిత్రము వివరముగా దెలియుసాధనములు లేవుగాని కొన్నిశాసనములనుబట్టి యీ దేశము 5 వ శతాబ్ధమున బశ్చిమచాళుక్యులకును, తరువాత రాష్ట్రకూటులకును, ఆతుపిమ్మట మరల బశ్చిమచాళుక్యులకును వశమై పరి పాలింపబడియెనని తేటపడుచున్నది. పశ్చిమచాళుక్యచక్రవర్తియైన పృధ్వీవల్లభ మహాఆజు 7 వ శతాబ్దప్రారంభమున నీదేశమును జయించెను. శృపృద్జ్వీవల్లభ మహారాజూధిరాజ పరమెశ్వరపరమభట్టారకపాదపద్మోపజీవి నని చెప్పుకొన్న భీమరాజును నొక రాజుయొక్క యసంపూర్ణశాసన మొకటి యోరుగంటియందు గానబడుచున్నది గావున మఱికొన్ని శాసనమ్లనుబట్టియును నీదేశమున్ 5 వ శతాబ్ధమునుండి 2 వ శతాబ్దమౌవఱకు పశ్ఫిమచాళుక్యులును, 10 దవ దశాబ్దాంతమువఱకు రాష్ట్రకూటులును, తరువాత బదునొకొండవశతాబ్దమధ్యము వఱకు మరల బశ్చిమచాళుక్యులును, అటుపిమ్మట గాకతీయులు నీదేశామును ంబరిపాలించినటుల జరిత్రమునుబట్టి తెలియుచున్నది.
                                  ------             అ యి ద వ ప్ర క ర ణ ము
                             ----
                కా క తీ యాం ధ్రు లు.
                 త్రైలింగ్య సామ్రాజ్యనిర్మాణము

పశ్చిమచాళుక్యచక్రవర్తులు త్రిలింగదేశముయొక్క పశ్చిమ భాగ్ఫమును జయించి పరిపాలించుచుండిరి. మొదలుకొని మాధవవర్మవంశస్థులయిన వా రాచాళుక్యచక్రవర్తులకు సామంతమండలేశ్వరులుగ నుండి పరిపాలనము సేయుచుండి రని యూహింపవలయును నేగాని వారలు స్వతంత్ర పరిపాలనము సేయుచుండి రని యెంతమాత్రమును దలంప నాధారము గానిపించదు. ఏది యెట్టు లున్నను పదునొకండవశతాబ్దమునందు త్రిలింగదేశములోని పశ్చిమచ్ భాగము పశ్చిమచాళక్యచక్రవర్తులు స్వాధీనమున నుండె ననుటకు లేశ మాత్రమును సందియము లేదు. పశ్చిమచాళుక్యచక్రవర్తియగు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు శాలివాహనశకము 992 నళ సంవత్సరమం దనగా క్రీ.శ. 1042 పరాభవసంవత్సరంకు వఱకు ననగా క్రీ.శ. 1124 వఱకు అవపక్రరాక్రముడై ప్రజాపరిపాలనము చేసెను. ఈ త్రిభువనమల్లవిక్రమాదిత్యుని కర్ణాటభాషా శాసనములు త్రిలింగ్తదేశముయొక్క పశ్చిమభాగమ్నం దనేకములు గానం బడుచున్నవి. అప్పుడీభాగమంతయు వివిధభాగములుగ నేర్పడి వేర్వేఱు మండ లాధిపతులచే బరిపాలనము సేయంబడుచుండెను. ఆమండలాధిపతులలో కాకతీయు లొకరుగా నుండిరి. వీరు మొట్టమొదట వీరులుగానుండి మహారాజులకడ నధికార పదవులు సంపాదించి మండలాధిపతులై ఛాళుక్యచక్ర వర్తులకు సేనాధిపతులు మంత్రులై వారలకు గప్పము చెల్లించుచు గొంతకాలము గడిప్ క్రమక్రమముగా బలవంతులై వారల యధికారమును బోద్రోచి త్రైలింగ్యసాంరాజ్యసంస్థాపకులై వన్నెయు వాసియు గాంచి యించుమించుగా మూడుశతాబ్దములు పరిపాలనము చేసి శాశ్వతయశంబు గాంచిరి. ఈప్రభువులు కాకతి యను దేవతను గొల్చుచుండువారౌ గావున వీరికి గాకతీయు లను పేరు గలిగినట్లు గాన బడుచున్నది. కాకతి యను నామము దుర్గయొక్క నామాంతర మని మహా మహోపధ్యాయ కోలచల మల్లినాధసూరి గారి పుత్రుండగు కుమార స్రామిసోమ యాజిగారిచే బేర్కొనంబడియెనుగాని కాకతీయులపూర్వులు జైనమతావలంబకు లగుటచేత గాకతి యనునది జైనదేవతలలో నొకదాని నామమముగా నూహింప వలయును.

                       కాకతీయులు సూర్వవంశజులు.
      కాకతీయులు చంద్రవంశరాజులనియు మాధవవర్మ సంతతివారనియు స్థానిక చరిత్రమునందును, కాసె సర్వస్వప్రణీత మగు సిద్ధేశ్వరచరిత్ర మను నామాంతరముగల ప్రతాపచరిత్రేమునందును, దీనిని బట్టి కూచిమంచి జగ్గకవిచే వ్రాయబడిన సోమదేవరాజీయమునందును వ్రాయబడియెను గాని కాకతీయులు సూర్యవంశజులయినటులు గాకతీయుల శాసనములందుగాని, మొదటి ప్రతాప రుద్రుని శాసనములందుగాని  సూర్యచంద్ర వంశముల ప్రశంస లేకపోయినను గణపతి దేవుని కాలమునాటి శాసనములయందు గాకతీయులు సూర్యవంశజు లని చెప్పబడిరి.  వారి పూర్వులలో ఇక్ష్వాకువు, రఘువు, రాముడు మొదలగు వారి నామములు పేర్కొనబడినవి.  ప్రతాపరుద్రీయ మనునలంకార శాస్త్రమును రచించిన విద్యానాధ మహాకవి సూర్యవంశమనికాని చంద్రవంశమనికాని చెప్పక  "అక్యర్కేడుకులప్రశస్తిమస్పజద్యం కాకతీయాంవయమ్" అని రెంది నతిశయించిన కాకతీయాన్యమ మని చెప్పియున్నాడు.  శ్రీదౌర్వాసదేవీ పురాణ మనియెడు కమ్రనాయకుల చరిత్రమున జంద్రవంశమున గత్రురాజు జనించెననియు, అతని సంతతియే కమ్మవారయిరనియు, ఆకమ్రరాజ వంశముననే కాకతీయప్రతాపరుద్రుడు జనించెననియు సత్యద్భతముగా వ్రాయబడినిది గాని, యది కల్పితగ్రంధమగుటచేత విశ్వసింపదగినది కాదు. గణపతిదేవ చక్రవర్తి శాసనములలో సూర్వవంశపురాజులను బేర్కొనుచు వారల వంశమునందు కరికాలచోడుడును, వారివంశమునందు గాకతీయులును జనించిరని స్పష్టముగా దెలుపబడియుండగా కమ్రనాయకుల చరిత్రములోని గాధ లెట్లు విశ్వసింప దగినవో యెంతమాత్రమును బోధపడకున్నది.
                   దుర్జయ కులము.
   ఆగణపతిదేవరాయని శాసనములయందే సూర్యవంశమున మునుపు, అతని వంశమున నిక్ష్వాకువు, అతని వంశమున రఘువు, అతని వంశమున దాశరధి, అతని వంసమున గరికాలచోడుడు అతని వంశమున దుర్జయుడు, అతంబి వంశమున త్రిభువమల్లు కాకతి బేతరాజును జనించె ననియును; దుర్జయుడు కాకతీయులకు బూర్వుదనియును జెప్పబడియున్నది.  కొంతకాల చాళుక్యచోడ చక్రవర్తులకున్, మఱికొంతకాలము కాకతీయాంధ్రచక్రవర్తులకును సామంతమండ లెశ్వరులుగ నుండి గుంటూరు, కృష్ణా మండలములలో బరిపాలనము సేయుచుండిన రాజులు కొందఱు తాముదుర్జయవంశస్థుల మని వ్యవహరించిరి. బుద్ధవర్మ సంతతివాడై శూద్రులయిన వెలనాటి చోడులతో సంబంధ బాంధవ్యములు కలిగియుండిన కొండపడమటి బుద్ధరాజు దుర్జయ కులస్తుడు. కులోత్తుంగచోడచక్రచ్వర్త్రికిని విక్రమచోడునకును సామంతుడుగ వుండిన మహామండలేశ్వరి నంబయరాజు దుర్జయకులస్థుడు.  కాకతీయ చక్రవర్తులకు సామంటులుగనుండి గుడిమెట్ట రాజధానిగా నతనాటిసీమను బరిపాలించిన చాగి పోతరాజు దుర్జయకులస్థుడు. మఱియు దుర్జయకులస్థుల మని చెప్పుకొన్నవా ర నేకులు గలరు.
     కాకతీయులు మొదట రెడ్లు, తరువాత కమ్మవారు.
    కాకతీయులు  కేవలము బాహుబలమువలన రాజ్యాధిపత్యము వహించి జనరంజకముగా బరిపాలనంచేసి మహారాజు లనిపించుకొన్న రెడ్డి కమ్మ తెగలోని నామమాత్రక్షత్రియులుగాని క్షత్రియజాత్యుచిత యజ్ఞాపనీతాదిచిహ్నములు ధరియించి వేదాధ్యయన వైదికకర్మాచరణాదు లొనరించు నార్యక్షత్రియులుగా గనుపట్టరు. దుర్జయకులస్థులు తాము విష్ణుపారోద్భవులనియు జతుర్ధాన్వయులమనియు దమ తమ శాసనములయందు స్పష్టముగ జెప్పుకొనియున్నారు. కాకతీయులును దుర్జయవంశజులని గణపతి దేవచక్రవర్తికాలమునాటి శాసనములందు జెప్ప బడి యుండుటంజేసి వీరును విష్ణుపాదోద్భవులనియూ జరుర్ధాన్వయులనియు నూహింపవలసివచుచున్నది. ఈ యూహనుఇ బలపఱచునట్టి సహేతుకములైన ప్రబలుప్రమాణము లనేకములు చూపట్టుచున్నవి. విష్ణూఅదసంభవుల మనియు జతుర్ధాన్వయులమనియును జెప్పుకొన్న కమ్మనాటిరాజుల (కమ్మవారి)తో సంబంధబాంధవ్యములు నెఱపి యుండిరి. కాకతీయమ హాదేవరాజు పుత్త్రికయు, గణఫతిదేవచక్రవర్తి తోబుట్టువు నగు మేళాంబిక యను మైలమ్మను, చతుర్ధచంశసంజాతుడును నతవాటివిషయాధీశ్వరుండు నగు బుద్ధ రాజుకొడుకు శ్రీమన్మహామండలేశ్వరరుద్రదేవరాజున కిచ్చి వివాహము చేయబడియెను.1 ఈమహామండలేశ్వర రుద్రదేవరాజుకొమర్తయగు బయ్యమాంబ యను బయ్యలమహాదేవిని చరుర్ధ వంశసంభూతుడును, ధనంజయగోత్రుడును, శ్రీధాన్యవతీపురీధీశ్వరుండును, రెండవ భీమరాజూత్రుడును మహామండ లేశ్వరుడు నగు కేతరాజునకిచ్చి వివాహము చేయబడియెను.2 మఱియు నీ కేతరాజుతల్లి యైన సబ్బమదేవి చతుర్ధాన్వయసంభవు డయిన వెలనాటి వీర రాజేంద్రచోడరాజ పుత్రికయు, మూడవగొంకరాజునకు దోబుట్టువు నై యుండెను.3 ఈ సబ్బమదేవితండ్రి యైన వెలనాటి రాజేంద్రచోడమహారాజు బుద్ధ వర్మవంశోద్ధారకుండును, దుర్జయకులాభరణుడును, చతుర్ధాన్వయసంజాతుడు నగు కొండ

1. The Annual Report on Epigrahy for 1905, No.204: Epigraphica Indica Vol.Vi. p. 159, line 8. 2.Ibid. Inscription of Bayyamamba. 3. Ibid. Vol. VIII, page 148. పడమటిబుద్ధరాజు తోబుట్టువయిన యక్కాంబికకు వివాహ మయ్యెను. ఈ యక్కాంబిక పుత్రుడగు వెలనాటికులోత్తుంగఛోడగాంగేయగొంకరాజు పైజెప్పిన బుద్దరాజువశంశమున జనించిన జయాంబికను వివాహ మయ్యెను.1 శ్రీ మన్మహా మండలేశ్వరకాకతీయగణపతిదేవచక్రవర్తి తన ద్వితీయపుత్రికయైన గణపాంబను శ్రీధాన్యవతీఉరాధీశ్వరుండును ధనంజయగోత్రుండును చరుర్దకులజుండును మహా మండలేశ్వర కోటకేతరాజు మనుమడును మహామండలేశ్వర రుద్రరాజుకుమారుడున్ నైన మహామండలేశ్వర కోటనేతరాజున కిచ్చి మహావైభవముతో వివాహమున్ జేసెను.2 కాకతీయు లిట్లు చతుర్ధాన్వయ సంబవు లయిన కమ్మవారితో సంబంధబాంధవ్యములు నెఱపి యుండుటచేత వీరును చరుర్ధాన్వయసంభవులే యని నిశ్చయింపక తప్పదు. మఱియును బ్రతాపరుద్రచక్రవర్తికొదుకులలో నొక్కదు క్రీ.శ.1313 వ సంవత్సరమున గడపమండలములోని చెన్నూరిగ్రామమునకు దక్షిణపాడు నాగనాధుని దేవాలయముకడ వ్రాయించిన యొక దానశాసనములొ నతని నామమునకు "ర్తెడ్డి" యనుపదము చేర్చబడియుండుటచేత వీరు మొట్టమొదట రెడ్డి తెగలోనివారుగానే యుంది కమ్మవారితో సంబంధములుచేసి కమ్మవారయి రని యూహింపవలసివచ్చుచున్నది. ఇప్పటివలగాక యాకాలమునందు శూద్రులలో భేదము లంతగా బాటింబబడకుండెను గాని కాకతీయులపరిపాలన మునందును తరువాతను నీభేదము లభివృద్ధి నొందుటయే గాక కాకతీయ సామ్రాజ్యమస్తమించుటకు గారణములుగూడ నయ్యెను. ఈ విషయము లన్నియు సవిస్తరముగ రాబోవు ప్రకరణములలో వివరింపబడును.

                         త్రిభువనవల్ల్ కాకతి బెతరాజు.
     కాకతీయులు సూర్యవంశపురాజు లని యొక్కగణపతిదేవచక్రవర్తి శాసనము లయందుమాత్రము పేర్కొనబడియెను గాని యంతకు బూర్వము

1. No. 26 T.Sandavolu Inscription of Buddha.raja. 2. Epigrapia Indica Vol.III, page 94 నేశాసనమునందును గాకతీయులు తాము సూర్యచ్వంశజులమనికాని చంద్రవంశ జులమనికాని వ్రాసికొని యుండలేదు. ఇంతియగాక గణపతిదేవునికి బూర్వపు శాసనములలో దుర్జయుడు వారి పూర్వులలోనివాడుగ జెప్పబడియుండలెదు. మఱియును గణపతిదేవరాయనికాలమునాటి సౌఖాలశాసనములో గలికాలచోడు డీకాకతీయులకు బూర్వుదని చెప్పబదినదిగాని యీశాసనము కేవలము గణపతిదేవునిశాసనముగాక యతనిసేనాధిపతి యగు బయ్యన నాయకుని పుత్రుడగు జగదాళముమ్మడినాయకునిశాసన మగుటవలన నందలి సంబంధము లంతగా బాటింపబడదగినవి కావు. కాకతీయగణపతిరాజు చక్ర వర్తి పదమును వహించినతరువాత నాతని ఘనత నిరూపించుటకై యతడు సూర్వ వంశజుం డని కల్పింపబది శ్లాఘింపబడినది. విద్యానాధమహాకవి తన ప్రతాప రుద్రీయమున గాకతీయులను సూర్యవంస్పురాజులనికాని చంద్రవంశపురాజులని కాని వర్ణింపక రెంటి నతిశయించినవారని వర్ణించుటయు, తనది సూర్యవంశ మని చెప్పుకొనిన గణపతిచక్రవర్తి చతుర్ధాన్వయులతోడ సంబంధము చేసి యుండుటయు, పైవర్ణనలన్నియు నతిశయోక్తులని వేనోళ్ల జాటుచున్నవి. కాకతీయులచరిత్రమునందు మొట్టమొదట బేర్కొనబడదగినగాడు త్రిభువనమల్ల కాకతీబేతరాజు గుంటూరుమండలములోని చేబ్రోలు శాసనమునం దొకదానిలో బేతరాజు దుర్జయుని తరువాత బేర్కొనబడియెను. నైజామురాష్ట్రములోని పాఖాలశాసనములో దుర్హయుడు ప్రోలరాజుతండ్రియని వ్రాయబడినది. కాకతీయ వంశవృక్షమందలి చిక్కును విడదీయుట కొక సాధనము గలదు. కాకతీయ గణపతిదేవునియొక్క గుంటూరు మండలములోని మోటుపల్లి శాసనములో గాకతీయవంశవృక్ష మీయబడినది. అందు సూర్యుడు మొదలుకొని గణపతిదేవునివఱకు గల రాజులు పేర్కొనది దూర్జయునకును త్రిభువనమల్ల బేతరాజునకును నడుమ మొదటి ప్రోలరాజని యొక క్తొత్తనామముగూడ నీయ బడినది. పాఖాలశాసన మునందీప్రోలరాజు దుర్జయునికొడుకని చప్పి యతని వంశమున రుద్రదేవుడు జనించెనని వక్కణించుచున్నది గాని రుద్రదేవుడు ప్రోలరాజుకొడు కని నుడివి యుండలేదు చేబ్రోలుశాసనములొ దుర్జయుని తరువాత బెతరాజు పేర్కొనబది యుండెను. నీనినన్నిటిని పరిశీలించిచూడగా నీక్రిందివిధమున గాకతీయ వంశావళిని బేర్కొనవచ్చును. దుర్జయుని తరువాత కాకతీయవంశమునందు మొదటిప్రోలరాజ్ జనించెను. ఇతడు కేసరి యనునొకగొప్ప చెఱువును ద్రవ్వించెను. ఇతనికి త్రిభువనమల్లబెతరాజు జనించెను. త్రిభువనమల్లడనునది బెతరాజునకు బిరుదనామము. ఈబేతరాజు మొదట నాంధ్రదేశమునందొక చిన్న భాగమున కధిపతియై యుండి చాళుక్యాభరణుండును, సతాశ్రయకులతిల కుండును నైన యాజనవిక్రమాదిత్యచక్రవర్తికి సామంతుడై త్రిభువనమల్లదేవుడను విక్రమాదిత్యుని బిరుద నామమునె తానును వహించెను. ఈబేతరాజునకు వ్యోజరండాధినాధుడు మంత్రిగనుండెను. ఈదండనాధుని కీమంత్రిపదవి వంశ క్రమానుగతముగా లభిచినది. ఈమహాప్రధాని తన ప్రభు వయిన మాండలికకాకతి బేతరాజున్ గొనిపోయి శ్రీతిభువనమల్లదేవవిక్రమాదిత్యచక్రవర్తికి మ్రొక్కించి యాచక్రవర్తికి సామంతమండలేశ్వరుడుగ నుండి సబ్బిసాయిరమండలమును బరిపాలించునట్లుగ నియోగింపజేసెను.1 అనుమకొండ రాజధానిగంజేసికొని మహా మండలేశ్వరకకతిబెతరాజు వ్యోజదండాధినాధుడు మహాప్రధానిగ సబ్బిసాయిత మండలమును బ్రిరిపాలనముచేసి ప్రసిద్ధిగాంచెను.

పశ్చిమచాళుక్యచక్రవర్తి యైన యాఱవవిక్రమాదిత్యుడు క్రీస్తుశకము 1076 మొదలుకొని 1126 వఱకు రాజ్యభారమును నిర్వహించినవాడు గావున నతని సామంతమాండలికు డయిన బెతరాజ్ అదునొకండవశతాబ్ధఆంతమునందు నాంధ్రదేశములోని సబ్బిసాయిరమందలమ్ను బరిపాలించెను. ఇతడు జైనమతా భిమానియై జైనులను బోషించెను. మఱియు నితడు కాకతి


1.క్రీ.శ. 971 వ సంవత్స్దరమునబశ్చిమగాంగుడయిన పాంచాలదేవునిచే బాలింపబడిన సెబ్బిమండలమదిగాదని తోచుచున్నది. అది ధార్వాడమండల ములోని హుబ్లీతాలూకాలోని ఎతబ్బి యను గ్రామమునుబట్టి యేర్పడి యుండవచ్చును. యను జైనుదేవతను బూజించుటచే నీశని సంతతివారికెల్లరకును కాకతీయులని పేరు కలిగినది. ఇంతకంటె నీతనిగూర్చి చెప్పగలిగినది మఱియేమియున్ గానరాదు.

                   మహామండలేశ్వర కాకటి ప్రోలరాజు
    మహామండలేశ్వర కాకతి బేతరాజునకు బిమ్మట రాజ్యభారమును వహించిన వాడతనికుమారు డైనప్రోలరాజు. ఇతడు రాజ్యతంత్రజ్ఞడయిన మహాయోధుడు. ఈ మహాయోధుడు తండ్రిమరణానంతరం రాజ్య భారమ్న్ బూని పశ్చిమచాళుక్యచక్ర వర్తి యగు నాఱవవిక్రమాదిత్యునికి సామంతమాందలికుడై యాతనిమహాప్రధాను లలో నొకడు గానుండి యాచక్రవర్తి లోకాంతగతుడైన పిమ్మట స్వతంత్ర్డై త్రైలింగ్య సామ్రాజ్యము నిర్మించుటకై పునాదు లేర్పఱుప బ్రయత్నించుచుండెను. ఇతని శాసనమొకటి యనుమకొండ్లోని పద్మక్షీదేవాలయుమున గానబడుచున్నది. ఈ శాసనమునుబట్టి  శ్రీమన్మహామండలేశ్వర్ కాకత్ ప్రోలరాజుచరొత్రము కొంతవఱకు దెలియుచున్నది.  ఈకాకతిప్రోలరాజుశాసనమునందు మొదట త్రిమూర్తులయిన బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో నెవ్వరినిస్తుతింపక శ్రీమజ్జినేంద్రుని మాత్రమే స్తుతించి యుండుటచేత నితడు జైనమతావలంబి యని స్పష్టముగ బోధపడుచున్నది. ఇతడుమాత్రమే గాక యీప్రోలరాజు మంత్రియైన బేతరానప్రగ్గడయు నతని భార్యయు జైనమతావలబకులనికూడ తేటపడుచున్నది. ఈబేతంప్రెగ్గడ కాకతి బెతరాజుమంత్రి యైన వ్యోబదండాధి నాధునకు యాకమాంబికయందు జనించినవాడు.
                           పద్మాక్షీదేవి యాలయము
     నైజామురాష్ట్రములోని హనుమకొండకు దక్షిణభాగమునందున్న యొక చిన్నకొండపైని పద్మాక్షీదేవాలయము నిర్మింపబడినది.  ఈ కొండప్రక్కను ఈ దేవతాలయమున కెదుట్న్ జైనవిగ్రహములు గలవు. ఈ యాలయ

1. Epigraphia Indica, Vol. ix, Page 256 No.35 స్తంభముమీదనె పైనజెప్పబడిన ప్రోలరాజుశాసనము గలదు. వీనినన్నిటిని బట్టి చూడ నిది మొదట జైనులచేతనె ప్రతిష్థింపబడినదిగా దోచుచున్నది. ఈయాలయములో బ్రతిష్ఠింపబడిన పద్మాక్షీదేవి జైనౌరాణగాధలలో వక్కాణింపబడిన యురువదినల్వురు శాసనమహాదేవుల్లో నొక్కెతెయై యుండవలయును. ఇరువదిరెండవతీర్ధంకరుని శాసనఉదేవియైన బంబిక దుర్గ యొక్క ప్రతిరూపమని భావింపబడుచున్నది. అట్లే పద్మాక్షి పార్స్వనాధునియొక్క శాసనదేవిగ నున్నది 1. కాబట్టి ప్రోలరాజుమంత్రి యైన బేతనప్రెగ్గడభార్యయగు మైలమ్మ యాకొండపైన యాలమున గన్నడములో "కడజాలయ" మనియెడి యంబిక నో పద్మావతినో ప్రతిష్టించియుండవచ్చునని యూహింపవచ్చును. తనకు జైనమతమునం దుండెడి ప్రేమచేతను భక్తిచేతను బుణ్యముకొఱకు కొండపైని కడలాలయబస్తిరి (వసతిని) బేతనప్రగ్గడభార్య యగు మైలమ్మనిర్మించె నని పైశాసనమునందే చెప్పబడినది. మైలమ్మ తండ్రై యగు బెతనప్రెగ్గడే తనస్వగ్రామమునంఉద్ బరిదేవాలయములను నిర్మించెననికూడ వ్రాయబడినది. ఈ మైలమ్మచే నిర్మింపబడిన కడలాలాయమునకు జాళుక్యవిక్రమాసంత్సరము 41 హేవలంబిసంవత్సర పుష్యబహుళ 30 సోమవారమున అనగా క్రీ.శ. 1117 వ సంవత్సరము డెసెంబరు 24 వ తేదీని శ్రీమన్మహామండలేశ్వర కాకతిప్రోలరాజు మైలమ్మ పేరిట నామెభర్తయైన బెతప్రెగ్గడ త్రవ్వించిన చెఱువ్క్రిందను బాడువపొలము రెండునుత్తరులను ఆ చెఱువునకు పడమటిప్రక్కను నల్లరేగడి పొలము నాలుగుమత్తరులను బీటిపాల మాఱుమత్తరులను ధారాపూర్వకముగా దానముఛేసి పైశాసనమును వ్రాయించెను. మఱియు నీశాసనమునందే శ్రీమన్మహామండలేశ్వర మేకరాజు కూచికెఱెచెఱవుకట్టక్రింద మొక నిత్తరు బాడుపొలమును దానికి సామీప్యమున బదిమత్తిరుల సామాన్యభూమిని దానము చేసినటుల వ్ర్రాయబడినది. ఈమండలేశ్వరు డయిన మేళరాజు మాధవవర్మవంశమున


1. 13 Burgess Page 46, note 2 జనించినవడనివ్రాయబడినది. మాధవశర్మ గాధ పండ్రెండవశతాబ్దప్రారంభ మునకే ప్రచారమునం దుండెనని యీశాసనమునుబట్టి దెలియుచున్నది. ఇట్లు భూదానములబొందిన యీజైనాలయమును అనుమకొందబ్రాహ్మణులు స్వాధీనము చేసికొని దుర్గయొక్క నామాంతరం మని నమ్మి పద్మాక్షీదేవి యను పేరుతో నర్చనాదికమును జరుపుచున్నారు. ఈయాలయము జైన్లనుండి బ్రాహ్మణులస్వాధీన మెప్పుడయ్యెనో దెలియరాదు. ఇయ్యది మొదటి ప్రతాప రుద్రునికాలమ్ననొ గణపతిదేవచక్రవర్తి కాలముననో బ్రాహ్మణుల యధీనమై యుండును. ఈశాసనమునుబట్టి యీపద్మాక్షి యాలయము మాధవవర్మ కాలమునుండియు శైవబబ్రాహ్మణుల యధీనమునం దుండెనని గాని, ఈపద్మాక్షీదేవ వరప్రసాదముననే సోమదేవరాజు మాధవవర్మ మొదలు గాలగల చాంద్రవంశపు రాజులను జయించి రాజ్యమేలినారని విశ్వసింపరాదు.

               ప్రోలరాజు తైలపదేవుని బంధించి విడుచుట.
     కాకతిప్రోలరాజు పుత్రు డైన మొదటి ప్రతాపరుద్రుని యనుమకొండ శాసనములో చాళుక్యచూడామణి యైన తైలపదేవునితో యుద్ధముచేసి క్షణములోబంధించిభక్తునియందుండెడి యనురాగముచేత విడిచిపుచ్ద్ఫె నని యీక్రింది శ్లోకములోజెప్పబడినది.

       "హస్త్యారోహణకర్మకగతిం చాళుక్యచూడామణిం
        శశ్వద్యుద్భనిబద్ధగహ్వరమతిం యుద్దే బటంధక్షణాత్
        శ్రీమతైలపదేవ మంబుదనిభ స్తంంబేరమస్థం క్షణాత్
        ప్రఖ్యాతోరిపురకంకఖండనవిధౌ భక్తానురాగాజ్జహౌ."

ఈశ్లోకమునం బేర్కొనంబడిన తైలదేవుడురాజ్యాధిపత్యమును వహించి కుంతల దేశమునుబరిపాలించిన్ తైలదేవచక్రవర్తిగాక యాపచ్చిమఛాళుక్య కుటుంబమున జనించిన మఱియొక తైలదేవుడై యుండవలయును. ఎందుచేత నన దైలపదేవచక్రవర్తి క్రీ.శ. 1127 వఱస బరిపాలనముచేసినట్లుగా శాసనాదొదృష్టాంతములు గనంబడుచున్నవి. క్రీ.శ.1162 వ సంవత్సరములో వ్రాయంబడిన యీ యనుమకొండశాసనములోనే రుద్రదేవునియెడ గల భీతిచేత మరణము నొందె నని చెప్పబడియెను. కాబట్టి ప్రోలరాజునే జయింపబడినట్టియు రుద్రదేవునిచే జంపబడినట్టియు దైలపదేవుడు పశ్చిమచాళుక్యచక్రవర్తియైన మూడవతైలపదేవుడు కాడనుట స్పష్టము. ఈ తైలపదేవుడు ఛాళుక్యచక్రవర్తు లకు సేనాధిపతియై బనవాసిమండలమున కధిపతి యైన తైలపదేవుడై యుండు నని కొందఱు తలంచుచున్నారు గాని పై శ్లోకమునందు తైలపదేవుడు చాళుక్య చూడామణి యని పేర్కొనంబడి యుండుటచేతను సేనాపతియైన తైలపదేవుడు కదంబరాయడగుటచేతను వారిజాడ మంతగా విశ్వసింపదగినదిగా గనుపట్టదు. ఇతడు తప్పక చాళుక్యచక్రవర్తులకు సమీపబంధువై సామంతమాండలికు డైనవాడుగ నుండవలయును. ఇయ్యది భావిపరిశోధనమునం దేటపడవచ్చును.1

                          ప్రోలరాజ్ గోవిందరాజును జయించుట
      ప్రోలరాజు శ్చిమచాళుక్యచక్రవర్తుల సేనాధిపతి యైన గోవిందరాజును జయించెనని  యనుమకొండలోని రుద్రదేవునిశాసనములోనే యీ క్రింది శ్లోకమున జెప్పబడినది.

    "యోకుకోరిపతేరకుంకారశు శ్లక్ష్ణాగ్ర్ర ధారోల్లన
     ద్ధారాపాత నిపాతనైశ చతురం గోవిందరాజాహ్వయం
     బర్ద్వోమ్మచ్య తదోదయక్షితిభృతే రాజ్యం దదౌ లీలయా
     లుంధాకో విద్షయస్య తస్య సమరే సద్వీందీక్షాగురు:."

    ఇందు బేర్కొనబడిన గోవిందరాజు గణపతిదేవచక్రవర్తి గణపేశ్వరశాసనమునందు  గోవిందదంజీళు డని వక్కాణింపబడియెను. ఇతడు  పశ్చిమచాళుక్యచక్రవర్తి యగు యాఱవవిక్రమాదిత్యుని సేనాధిపతి యైన

1. ఈ శైలదేవుడు త్రిభ్వనమల్లునికుమారుడనియు, అతనిశాసనమునం దొకదానిలో ప్రోలరాజు జయించెనని చెప్పబడి యున్నదనియు, అతడు రాజ్యాధిపత్యమును వహింప లేదనియు గొందఱు చెప్పుచున్నారు. యనంతపాలుని సోదరపుత్రుడని అబ్బలూరుశాసనముములవలన దెలియు చున్నది. ఈదొవిందదందనాయకుదు క్రీ.శ. 11323 -27 సంవత్సరప్రాంతమున నాంధదేశములోని కొండపల్లిసీమనకు బరిపాలకుడుగ నున్ంటుల గందమోలి(కర్నూలు) మండలములోని త్రిపురాంతకశాసనములలో నొకదాని వలన జక్కగా దేటపడుచున్నది. అం దితడు వేంగీపురమును దగ్దముగావించి గోఖ్కరాజును జయించినటుల జెప్పబదినది. ఈగొంకరాజు వేంగీదేశమునకు రాజ ప్రతినిధియై ధనదుపురము (గుంటూరుమందలములోనిచందవోలు) రాజధానిగ బరిపాలనముచేసిన వెలనాటికులోత్తుంగరాజేంద్రచోదునకు బుత్రుడు. వెలనాడునకు రాజధానిగనున్న ధనదుపురమును నాకాలమున వేంగీపుర మని గూద జెప్పుచుండిరికాబోలు. వెలనాటిరాజులు వేంగీరాజప్రతినిధులై పరిపాలనము జేసినవారగుటవలన వారు నివసించ్ ముఖ్యపట్టణ మయిన ధనుదుపురము వేంగీపుర మని పరరాజులచే బేర్కొనబడుటయొక విశేషయము గాదు. ఈ గోవిందరాజును జయించి యితనిరాజ్యమును ఉదయరాజున కిప్పెంచె నని చెప్పబడి యున్నది. ఇందు బేర్కొనబదిన యుదయరా జెవ్వడైనదియు నిర్ధారించుటకష్టసాధ్యముగ నుండును. కందూరోదయచోడుడే యుదయరాజని కొందఱును, వెలనాటిగొంకరాజే చోడోడయుండని మఱికొందఱును తలుచు చున్నారు. పైనజెప్పబడిన యనుమకొండ రుద్రదేవునిశాసనములోని శ్లోకమునకు మఱియొకపాతముగలదని గురుజాడ శ్రీరామమూర్తిపంతులు గారి గ్రంధమున్ నాశ్లోక మీక్రిందివిధమునను బేర్కొనబడినది.1 <poem>

   "యోలుంఠాకపతేరకుంఠపరశు స్తీక్ష్ణాగ్రధారోల్లస
     ద్దారాఅతినిపాతనైకపతురం గోవించరాజాన్వయం
     బర్ధోన్మున్యత మైడయక్షితిపతేరాజ్యందదౌ లీలయా
     లుంఠాకోవిషయస్య తస్య సమరె తద్వీరదీక్షాగురు,"

</poem


1. Notes by G. Sareeramamurtyu on the Ganapaties of Oranagal, page. 31. అనగా *గోవిందరాజ వంశమునందు జనించినట్టియు, లుంకాకవిషయాధీశ్వరు డైనట్టియు, పరశువుతో యుద్ధముజేయునైపుణ్యం గలట్టియు, ఈడప్ప యనువా డొకడు బధింపబడి ప్రోలరాజువెదుటకు తేబడెననియు, వీరదీక్షాగురుం డైన ప్రోలరాజు పశ్చాత్తప్తుడై యున్న యాతని బంధవిముక్తిని గావించి యతని రాజ్యము మరల నాతనికి నొప్పగించెననియు, తాత్పర్యం.

                       ప్రోలరాజు గుండరాజును జంపుట
    కాకతిప్రోలరాజు మంత్రికూటపట్టణాధిపతి యైనకుండరాజుపై దండెత్తిపోయి యతనితో యుద్ధముజేసి జయుంచి యంతటితో బోనక యాగ్రహమహోగ్రుడై యతనిని బట్టికొని శిరమును గొఱిగింపించి వక్షస్థలంబున వరాహముద్రనుబొడిచి చంపె నని రుద్రదేవుని యనుమకొండశాసనమునందే యీ క్రిందిశ్లోకమున జెప్పబడినది.

    "క్రుద్దేనోద్ధుగ మంత్రకూటనగరీనధోదయో నిస్త్రపో
      గుండ:ఖండిత ఏర ముండితశిరా: క్రోడాంకవక్షస్థల:
     ఏడోడింభకవత్పలాయనపరో జ్ఞాతో గర:స్వాం పురీ
     ఆహుతోని సరేశ్వరస్యపరత: ప్రోలేన యుద్ధాయయత్,"

మంణ్త్రకూట మనునది నైజామురాష్ట్రములో గోదావరీతీరమున నున్న మంధని యను గ్రామ మని కొందఱున్, కృష్ణామండలములో నూజివీడుతాలూకా


  • ఇందు బేర్కొనబడిన గోవిందరాజు కుంతలదేశమును పరిపాలించిన రాష్ట్రకూట రాజులలీనివాడని శ్రీరామమూర్తిపంతులుగారు వ్రాసియున్నారుగాని యాకాలము నాటికి రాష్త్రకూట సామ్రాజ్య మంతరించి యుండుటచేత్య నది యంతగా విశ్వసపాత్రము గాదు. పైశ్ళొకముయొక్క పాఠాంతరముగూడ సరియైనదిగా గను పట్టదు. నేను వ్రాయించి తెప్పించిన యనుమకొండ శాసనముయొక్క ప్రతిగూడ డాక్టరు ప్లీటుదొరగారు ప్రకటించిన పాఠముతో సరిపోవుచున్నదిగాని పంతులువారిపాఠాంతరముతో సరిపోవుచుండలేదు. లోని మంతేనగ్రామ మని మఱికొందఱును తలంచుచున్నారు. కొత్తపల్లిసీమకు బరిపాలకుడయిన గొవిందరాజు మొదలగుగారితో యుద్ధము జేసి జయించిన వాడగుటచేత బ్రోలరాజుకృష్ణామండలములోని మాండలిక ప్రభువులను జయించుటకై ప్రయత్నించియుండును గావున, మంత్రకూట మనునది మంతెన గ్రామమే యైయుండు నని నిర్ధారింపవచ్చును.
                 ప్రోలరాజు జగద్దేవుని బాఱద్రోలుట.
   అనుమకొండశాసనమునందే బుద్దేవు డనురాజు ప్రోలరాజుపై దండెత్తివచ్చి యనుమకొందను ముట్టడింపగా నాతనిజయించి తఱిమెనని యీ క్రిందిశ్లోకమున జెప్పబదినది.

    "అన్యచ్చానౌమకొండనామనగగీం సంవేస్ట్యయోయం స్థితో
     నానామండలికాంవితో భువి జగద్దేస్యదేవప్రభు:
     స్తబ్ధస్తంభిత ఏన కార్యకరణే శక్తంక్షణా న్నిర్గత:
     శ్రీమత్ప్రోలనృపస్యతిస్య జయిన: కింబ్రూమహేగౌరవమ్,"

ఈపైశ్లోకమునం బేర్కొనంబడిన జగద్దేవుడు పట్టిపాంబుచ్చపురాధీశులయున సంతారరాజులలో నొక్కడగు మహామండలేశ్వర త్రిభువవల్లజగద్దేవుడనికాని యన్యుడుగాడు. పట్టిపాంబుచ్చపురము నెడు మైసూరు రాష్త్రములో నగరమందలములోని హంచ యనుపేరం బరగు చున్నది. ఈ జగద్దేవునితల్లి బిజ్జలదేవి ; బిజ్జలదేవి చెల్ల లగు చట్టలదేవి గొవాకదంబులలో మొదటి విజయాదిత్యున కిచ్చి వివాహము చేయబడియెను. (శా.శ.1020) ఇతడు వయస్సుమీఱక యున్నకాలమున బల్లాలరాజులచే నదిమపెట్టబడి యుండెను. మదటిబల్లాలరాజు జగద్దేవునిరాష్ట్రమును బాడుచేసె నని గడుగుశాసనముల వలన దెలియుచున్నది.1 శా.శ. 1032 దవ సంవత్సరములో నేర్పడిన బేలూరుశాసనములలో నొకదానిలో జగద్దేవుని బలమును హరించుటయందు భైరవునివంటివా డని హోసంబల్లాం


1. Indian Antiquary, Vol.II. Page 301 రాజయిన విష్ణువర్ధను డభినందింప బడియెను. అయినను జగద్దేవుడు శా.శ. 1071 (క్రీ.శ.1142) వ సంవత్సరమున "సేతు" అనెడి ప్రదేశమున బరిపాలనము సేయుచు బుల్లిగ్రామమునకు విచ్చేసి కొందనాటిలోని కుందూరుగ్రామమును దానముచేసియున్నాడు. అశ్చిమచాళుక్యచక్రవర్తి యైన రెండవజగదేక మల్లుని పరిపాలనసంవత్సములలో 13 సగియగు శుక్లసంవత్సరమున బైశాసనము పుట్టి యుండుటచేతను, చాళుక్యచక్రవర్తుచే వహింప బడుచుండిన త్రిభువనమల్ల యనుఇరుదనామమును వహించియుండుటచేతను, ఇతడు మొదట త్రిభువనమల్ల విక్రమాదిత్య చక్రవర్తికిని, అటుపిమ్మట రెండవ జగదేకమల్లునకును, సామంతుడుగ నుండె నని వేద్య్హమగుచున్నది. అందుచేతనే యితటు తైలపదేవుడు కాకతిప్రోలరాజుచే బట్టువడి పరిభవింప బడి విడిచిపట్టబడిన తరువాత ప్రభుపక్షమునుబూని ప్రోలరాజును రక్షించుటకై అనుమకొండపై దాడి వెడలివచ్చి యుద్ధముచేసి యోడిపోగా బ్రోలరాజుచే దఱుమగొట్టబడియుందు నని సులభముగా బోధపడుచున్నది.

                    కాకతిప్రోలరాజు మతము.
   శ్రీరుద్రదేవుని యనుమకొందశాసనమునందు ప్రోలరాజు "శివపాదచ్ పద్మయుగళ ధ్యానామృతానందు డ"ని యీక్రిందిశ్లోకమున జెప్పబడినది.

     "తత్పుత్త్ర:శివసాదపద్మయుగళద్యానామృతానంద భూ
       డ్లుంరాకోరిపుసుందరీజనమహా సౌభాగ్యసంపచ్చ్రియ:
       ప్రోలీరాజ ఇతి ప్రసిద్ధముగ మద్వైరీంద్రడర్పాపహా
      నిశ్శంకప్రణ్భవప్రబంధనమహాహంకారలంకేశ్వర:"

ఈ పైశ్లోకమున ప్రోలరాజు శివభక్తు డని తెలుపబడియున్నను, పద్మాక్షీ దేవాలయమున ప్రోలరాజుచే నెలకొలుపబడిన శాసనములొ మొట్టమొదట నీక్రింది శ్లోకముచే జినేందుడు గీర్తింపబదియను.

     శ్రీ మజ్జినేంద్రపదపద్మమశేష భవ్యం
     నన్యత్రిలోక నృపతీంద్రము వీంద్రనలద్యంఅ

      నిశ్శేషదోషారిఖండల్నచండకాణ్ణం
      రత్నత్రయప్రభవమద్యగుణైకతానం."

ఈపైశ్లోకమున నీతడు జనేంద్రుని బ్రస్తుతించియుండుటచేత నీతడు జైనమతావలంబకు డని స్పష్టముగా బోధపడుచున్నది. ప్రోలరాజుకొడుకయిన రుద్రదేవుడు వీరశైవమతానలంబకు డయినందున దనతండ్రినిగూడ శివపాదపద్మ యుగళధ్యానమృతానందుడని వక్కాణించియుండును గాని వేఱొండు గాదు. ఒకవేళ ప్రోలరాజు వార్ధకదశయందు శైవుడైన నైయుండవచ్చును.

                     ప్రోలరాజు సంతానము

ప్రోలరాజునకు ముప్పమ యనుభార్యగలదు. ఆమె యనుమకొండశాసనము నందీక్రిందివిధమున నభివర్ణింపబదినది.

           "దేవీముప్పమనామధేయసహితా యస్వా గుణాస్తారకా:
            కీర్తిశ్శారదచంద్రైకేన విటన త్కాంతేస్తు నైవోపమా
            కౌసల్యేన చ జానకీవ చ సతీ కుంతీవ పద్మా చ సా
           పౌలొమీవ వ వండేఇకేన చ తధా తస్యాభవర్భామినీ."

ఈపైశ్లోకమునందు ముప్పమదేవి సుగుణంబులు నక్షత్రంబులవలెను, కీర్తి శరత్కాలచంద్రికవలెను బ్రకాశించుదున్నదనియు, మఱియు నామె కౌసల్య, జానకి, కుంతి, పద్మ, పౌలోమి, చండికా మొదలగువారం బోలియున్నదని మాత్రము వర్ణీంపబడియెనేగాని యామె యేవంశమునం దేవరాజునకు జనియించెనో తెలుపబడియుండనందున ముప్పమ దేవియొక్క తలిదండ్రులను గూర్రి మనకేమియు దెలియరాకున్నది. ఈమెకు ప్రొలరాజువలన రుద్రదేవుడు, మహాదేవుడు మొదలగు నైదుగురుపుత్రులు జనించి యశస్వంతులైరి. ఈప్రకారము కాకతిప్రోలరాజు సంతానమును ప్రాభవమును బడసి అరక్రపరాక్రముడై చాళుక్యచక్రవర్తుల సైన్యాధిపతులను పెక్కుండ్రు మాండలికరాజులను జయించి రాజ్యమును విస్తరింపజెసి మొట్టమొదట శ్తైలింగ్య సామ్రాజ్యనిర్మాణభవనమునకుం బునాడు లెర్పరించెను. ప్రోలరాజు కొడుకుచే జంపబడుట

         ఇట్లుచక్రపరాక్రమలీల శత్రురాజులను నిర్జించి త్రైలింగ్యసామ్రాజ్య నిర్మాణభవనమునకు బునాడు లేర్పఱించి జగతికేసరి యను బిరుదనామమును వహించి బహుకాలము పరిపాలనముచేస్న కాకతిప్రోలరాజుతుద కవసాన కాలము సమీపింప దురదృష్టవసమున నాకస్మికముగాదన ప్రియకుమారుండగు శ్రీరుద్రదేగ్ఫనృపునిచే బొడువంబడి చంపబడియను. ఇట్టి విషాదకరమైన హర్య కేవలము భ్రమప్రమాదవశమున దటస్థ మైనదిగాని తండ్రియెడ బ్రతాపరుద్రునకుం గల ద్వేషముచేట సంబవించింది కాదు. ఒకనాడు దేవాలయంబున బ్రతాపరుద్రదేవుడు గాధనిద్ర నున్నకాలమ్న దండ్రి యైన ప్రొలరాజు అతనిప్రక్కనుండిపోవుచు నతనిని స్పృశించెను. అంతటనతడు మేల్కొని శ్డత్రువెవ్వరో తన్ను ముట్టుకొనవచ్చెనని యాగ్రహమహోగ్రుడై లేచి మొలలోనున్నకైజాఱువెఱికి యొక్క పోటుపొడిచెను. అంతట్ తండ్రి నేలంబడ జూచి తెలివిగాంచి చేసినహత్యకు బశ్చత్తప్తుడై దు:ఖింపసాగెను. ఇది భ్రమప్రమాదవశమున దటస్థమైనదని యెఱింగినవాదు గావున బ్రోలరాజు కుమారుని శిక్షింపక యోదర్చి రాజముద్రిక నొసంగి రాజ్యము మొప్పగించి పరిపాలనముచేయ నాజ్ఞచేసి ప్రాణంబులను విడిచెను.
                                      ----=--                        ఆఱవ ప్రకరణము
                             ----
                 కా క తీ యాం ధ్రు లు.
                                   ---- ---
                     శ్రీ రు ద్ర దే వ మ హా రాజు.
               (క్రీ.శ. 1140 మొదలుకొని 1196 వఱకు)
         కాకతిప్రొలరాజునకు బిమ్మట నతని పెద్దకుమారుడైన రుద్రదేవుడు పట్టాభిషిక్తు డయ్యెను గాని యెప్పటినుండి యాతని పరిపాలనము పారంభమయ్యెనో స్పష్టముగా దెలిసికౌనుట కాధారము గానిపించలేదు. భావి పరిశోధనమున సత్యం తేటపడునంతదనుక క్రీ.శ. 1140 దవ సంవత్సరమునకు గొంచె మీవలగాని యూవలగాని రుద్రదేవుని పరిపాలనము ప్రారంభమై యుండునని చెప్పవచ్చును. ఈరుద్రదేవులదే చరిత్రమున మొదటిప్రతాపరుద్రుడు డని పేర్కొనబడుచున్నాడు. ఇతడు పరాక్రమమునందు తండ్రినిసయితము మించినవాడై అధికసాధ్యముతో నత డేర్పరించిన పునాదులపై ద్రైలింగ్యసామ్రాజ్యభవననిర్మాణమును గావించి సుస్థిర మైన యశమును సంపాదించెను. ఇతని చరిత్రమును సంపూర్ణముగా, దెలిసికొనుటకు జాలినన్ని సాధనములు గానరావు గాని కొంత చరిత్రమును దెలిసికొనుటకు నతని శాసనములు రెండుమూడుమాత్రము తోడ్పడుచున్నవి.  అందనుమకొండ శాసనము ప్రధాన మైనది. ఇయ్యది శా. శ. 1024 వ సంవత్సరమునందనగా క్రీ.శ. 1162 వ సంవత్సరమున రుద్రదేవునిచేతనే వ్రాయింపబదిన ప్రధానశాసనముగా నున్నది.  ఈశాసనమునందు రుద్రదేవుడు తన తాతయైన త్రిభువనమల్లునకు బూర్వమునందుండినతన వంశపురుషుల నెవ్వరిని బేర్కొని యుండలేదు.  తనతండ్రియు దానును జయించిన రాజులన్ గొంద ఱను బేర్కొనియుండుటచేత గొంతవఱకు చరిత్రము బోధపడుచున్నది.

ఈశాసనములో:-

        "శృజ్గత్తుల్గపుజ్గననయారోహక్రమే కర్మకం
         దోమ్మంచరుపరాక్రమక్రమణ్భరం భక్త్క్యాసకృల్లీలయా
         కర్ణ్ంపార్ధఇవామలై; శరశతైర్విద్రాన్యవిద్రాన్యయో
         లేభేసర్వవిశేషయుక్తనగరగ్రామం స్దరుద్రోనృప:"

అనియున్న తములైనట్టియు, ప్రఖ్యాతము లైనట్టియు, నశ్వరబుల నారోహించుట యందు నేర్పరియు, చారుపరాక్రముండు నగు దొమ్మ (దామనాయుడు, లేక దామరాజు) అనువానిని పార్ధుడు కర్ణుని వందలకొలది తీక్ష్ణణములైన బాణములచేత బలుమాఱు తఱుమగొట్టినట్లుగా రుద్రదేవుడు తఱిమి విశేషవస్తు సంపన్నంబు లయిన పట్టణంబూను గైకొనియె నని చెప్పబడి యున్నది. ఇందు బేర్కొనబదిన రుద్రదేవుని శత్రు వెవ్వడో నిర్ధారించుటకు నాధారము గానిపింపకున్నది.

       "ఈడ మెడవిడమ్బరభరక్షోదక్షము క్ష్మాభృతాం
        దుర్వారోద్ధుర వీరమన్త్రసమయాదానైక దీక్షాగురుం
        శ్రీమన్మేళగిదేవసజ్గ సమయప్రోద్భూతర్సాపహాం
       ప్రాప్తశ్రీ పోలనాసదేశవిభవం శ్రీరుద్రదేవంసదా. "
      

ఈశ్లోఫ్కమునదు బేర్కొనబడిన రుద్రదేవుని ప్రతివీరులనుగూర్చిన చరిత్రవినర మెంతమాత్రము దెలియ్ గాకున్నది. కులోత్తుంగరాజెంద్రచక్రవర్తి కుమారుడును, క్రీ.శ. 1078 మొదలుకొని 1084 వఱకు, 1088-89 మొదలుకొని 1092-93 వఱకును, రాజప్రతినిధినుండి వేంగీదేశమును పరిపాలించిన వీరచోడభూపాలుని ముఖ్యసేనాధిపతిగ నున్న మేడమార్యుణీ పైశ్లోకముమునందు బేర్కొనబడిన మేడప్రభు వని నమ్మి యాంధ్రులరిత్రము లోని ప్రధమభాగమున "ఈమేడమార్యుడు కాకతీయాంధ్రప్రభు వైన మొదతి ప్రతాపరుద్రునితో యుద్ధముచేసి యోదిపోయినట్టు గన్పట్టుచున్న" దనివ్రాసియున్నాడనుగాని యీ మొదటిప్రతాపరుద్రుడూ క్రీ.శ. 1196