శ్రీ

ఆంధ్రభాషార్ణవము

పీఠిక.

శా. శ్రీమాతృప్రకటీకృతాంగరుచి సారెన్ జూచి భావింపుచో
నామే యైన త్రిలోకమాత యగుటన్ వైశ్యాంగనం దల్లి యై
ప్రేమన్ బ్రోచుట చూడ వింతయె యనన్ శ్రీమాతృభూతేశ్వరుఁ
డామోదంబునఁ బ్రోచుఁగాత రఘునాథాధీశచూడామణిన్. 1

చ. తనధనురాలయమ్ములను దాఁచితివే యని యాటలట్ల ఱై
కను సడలించి చన్నుఁగవ గ్రక్కునఁ బట్టఁగ నెంచునాయకున్
గనినసుగంధికుంతలమొగంబునఁ దోఁచిన చిన్ననవ్వు కో
రినవర మిచ్చి ప్రోవుతను శ్రీరఘునాథనృపాలచంద్రునిన్. 2

ఉ. అంబరకేశముఖ్యవిబుధాసలిగర్భములం దడంగ వ
య్యంబుజసంభవాండనివహమ్ము లటంచని వాని నుంచఁదో
రంబుగఁ జేయురీతి నుదరంబును బెంచినగుజ్జువేల్పు ని
త్యంబుగ మామకీసకృతి ధారుణిలోనఁ జెలంగఁజేయుతన్. 3

తే. జడమతులచేత నిందింపఁబడినకృతుల, నుత్తమము లంచు సత్కవు లొప్పుకొండ్రు
శునకదంష్ట్రల రాచినవెనుకఁగాదె, పసిఁడిసొమ్ములు దాల్తురు ప్రభువు లెల్ల. 4

వ. అని యిష్టదేవతా నమస్కారంబును సుకవికుకవిపురస్కారతిరస్కారంబులునుం జేయు నవసరంబున. 5

సీ. శ్రీమదింద్రాంవ్యయక్షీరవారిధిచంద్రుఁడాశ్రితచేలాంచలామరమణి
కవిజనమందిరాంగణపారిజాతంబు బాంధవకరగతస్వర్ణశిఖరి
యాచకజనగోష్టఖేచరనైచికి వైదికచిరజప్త కాదివిద్య
వదనతసామంతబహుజన్మ సుకృతంబు దృప్యద్విరోధితృతీయగురుఁడు
పాండ్యమహిమండలాధ్యక్షబాహుదండకలిత తేజితచకచకత్కరకృపాణి
దానవిద్యాసశిష్యసంతానపాణి రంజితజనాళి రఘునాధరాయమౌళి. 6

వ. ఒక్క శుభదినంబున వివిధకవిబుధసముదయనిరంతరసమాగమంబున న్నెఱయనుఱుము
చినుకుమెంగిలుతెగ లన సబృంహితమదమదావళరాజి రాజిల్ల ఖచరపురవరస్ఠిత

తురంగంబే నేన యని యభినయించురీతిని గైజా మోరలు చేయునిరాఘాటధాటిసమా టీకఘోటీవటలంబు జటిలం బగుచునుండ వేల్పుల కిక్కయు నమృతంబు చుక్కయునిడుటకు నమందానందంబుఁ జెందు మేరుమందరంబులకు నమదభద్రగజంబుల నొసంగ నధివసించి యదవీయదానంబునం బొగడువడువున భూరిభేరుల గంభీరభాంకారంబులు చెలంగఁ గవిజన దారిద్ర్యంబులు నిరాకరించుచందంబున నిందువదనా కరారవిందసముత్సారితంబు లగుచామరంబులోలయ నిరంతరశ్రీమంతులగుసామంతులును రూపజితమారు లగు రాజకుమారులును గుణసింధువు లగుబంధువులును సలలిత తంత్రు లగుమంత్రులును సకలవిద్యాసరోజనీరవు లగుకవులును వాదైకధుర్యు లగు శాస్త్రివర్యులును నాదసుఖసంధాయకు లగు గాయకులును భరతకళారహస్యోత్కటు లగునటులును శృంగారకణిక లగుగణికలును గొలువ సభాంతరాళంబున గోలువుండి నన్ను రప్పించి సన్మానంబు సేయుచు వినయంబున. 7

క. ఖచరీకచకుచనిచల, ద్విచికిలహారస్రవన్న వీనమరంద
ప్రచురరుచిఁ బెనఁగొనుఁ గచా, కచిగా నీకవిత లెన్నఁ గని వెంకన్నా. 8

తే. ఆంధ్రగీర్వాణకవనంబులందు నీకుఁ, గలుగుజ్ఞానం బ దేరికిఁ గలుగ నేర్చు
నాశ్రితుఁడ నంచు నుతియించు నట్లు గాడు, గాని యవి యిపు డేల వెంకన కవీంద్ర. 9

తే. దేవతలభాష గావునఁ దెలుఁగుకన్న, సంస్కృతము మిన్న యాయుక్తి సరియె తెలిసి
రాసికుఁడగువాఁడు తనదు జాఱుసికలోనఁ, దులసినే యిడుకొనునొజాదులనె యిడునో. 10

తే. కాన యీయాంధ్రకృతులందుఁ గలుగునట్టి, పదములకు నెల్ల నర్దమేర్పడెడు రీతి
నద్భుతంబుగఁ గృతిని జేయంగవలయు, నర్ధమైన రసస్ఫూర్తి యగుట యరుదె. 11

తే. కృతికి నాయకు మాతృభూతేశు జేయ,వలయు నన నేను నట్టకాఁ దలఁచితి ననఁ
బసిఁడిసొమ్ములు సేయించి వంట రాళ్ళ, జెక్కినను మేలె రత్నముల్ చెక్కకున్న. 12

వ. అనిన నెనుం దదీయపరమేశ్వరచరణారవిందభక్తికి మెచ్చుచు సత్కులప్రసూతుండ వగునీకు నేతాదృశమనీషావిశేషం బరుదే యని తత్కులప్రశంస సేయం దలంచి. 13

సీ. రంభాదినైలింపకుంభస్తనీమనణుల్ బానిస లగుచును బనులు నేయఁ
గకుబంతముల నేలఁ గలవేల్పుగమి కాంచు సమయములేక మోసలను గాయఁ
గులధరాధరములు చలనంబులను మాని యెచటఁ దార్ని ల్చెనో యచట నుండ
గర్వథూర్వహు లైనశర్వరీచరవరుల్ నిలువఁ గూడక రసాతలము సొరగఁ
గల్పకమునీడ వినువాఁకగట్టుతలఁపుమానికపుఁ దిన్నెఁ గిన్నరీగానఫణితి
నాలకించుచు నానంద మనుభవించు నల్లదేవేంద్రుఁ డలవియె యతనిఁ బొగడ.

క. అతఁడొకనాఁ డొకమానవ, సతిని వరించెను దదీయసౌందర్యం బ
ద్భుత మగుఁ గద యాయింతికి, సుతు లంతటఁ గలిగి రతులసుగుణాన్వితు లై. 15

క.ఆయన్వవాయమందలి, రాయక్షితిపాలమౌళి రాజిల్లె యశ
శ్శీృయుక్తిని బ్రహ్మాండం, బాయెడ నాపాలకడవయట్లు చెలంగెన్ . 16

క.ఆరాయనృపతి గాంచెఁ గు, మారుల రఘునాధరాయమహిపతి నమన
క్ష్మారమణుఁడు నచ్చన హం , వీరుఁడు బెేరమవిభుఁడన వీరలలోనన్ . 17

క.ఆరఘునాధనృపాలుఁడు, ధారణి నేలంగఁ దొడఁగె దైవతయువతీ
హారపటీరతుషారశ, తారసుధార విధాముదాకృత్కిర్తిన్. 18

ఉ. ఆరఘునాధభూపతి మహాద్భుత చర్యుఁ డటంచు నిచ్చలున్
ధీరజనంబు లెల్ల వినుతింపఁగ ధారణి నేలెఁ గాని యా
పేరుకు దగ్గకార్యములు పెక్కువిధంబులు దెల్ప శక్య మె
వ్వారికి శైవధర్మపరిపాలన మొక్కటి యెక్కుడై తగున్. 19

తే.అతఁడు గాంచెను బెద్దరాయక్షితీంద్రు, భుజబలవిహారు శ్రిముద్దువిజయథీరు
ధర్మ గుణశీలుఁ దిరుమలధరణిపాలు, రవితులితదేహవిభునిఁ జిన్రాయవిభుని. 20

క.వారలలోపలఁ దిరుమల, భూరమణుఁడు ఖ్యాతిఁ గాంచె భుజబలదృప్య
ద్ఘోరాహితవారాహిత, సారాహితతీవ్రదీప్తశరజాలుం డై . 21

చ.తిరుమలరాయసశేఖరవితీర్ణియుఁ బెక్కువిధంబు లౌటఁద
త్స్ఫురణముచేతఁ జుమ్ము హరిపొక్కిలిఁ జేరె హిరణ్యగర్భుఁ డా
హరియు నభోమణీం గదిసె నల్లనభోమణి యుండసాగె నం
బరమున సంబరంబు గను పట్టనదయ్యె విచిత్రరీతిగన్.22

తే.అతడు గాంచెను శ్రివిజయరఘునాధ, నరపతిశిరోమణిని ముద్దుసరసవిభుని
రాజగోపాలధీరుఁ దిర్మల వజీరు, మఱియు రణభాషికాఖ్యుఁ గ్రమంబు తోడ.23

తే. ఆ కుమారులందు.24

తే.హరినిఁ దలఁపనియట్టి దిక్కరుల రోసి, గండములు గల్గుగిరులను గడకు ద్రోచి
ధారుణీకాంత వరియించెఁ దనకుఁదాన, విజయరఘునాదు జయభార్గవీసనాధు.25

సి.త్రిశిరఃపురీపరివృఢమనోనలినికి బాలవిభాకారులీలఁ దోఁచి
చోళరాజాస్థానకేళీగృహంబున మణిదీపికావళిమాడ్కిఁ దనరి
మహిసూరినరపాలమానసాంభోధికి బాడబంబో యనుపగిది వెలసి
తత్ప్రియాన్యక్షమాధవశుష్కపనులకు దావపావకమనుదారి నెగడి
త్రిపురదైతేయహరణసంకుపితనిటలనయన నయన నటద్థనంజయజయావ
హంబు శ్రివిజయరఘునాధావనీంద్రు సత్ప్రతాపంబు గనుపట్టు సంతతంబు.26

తే.దక్షిణామూర్తిసేవవిచక్షణుండు, సంతతా ద్విైతవేదాంతసక్తచిత్తుఁ
డతఁడు తద్గర్భజలథిహి మాంశుఁ డీవు, రాయరఘునాధనృపచంద్ర రణమృ.

ఉ.శ్రిరఘునాధరాయనృపశేఖర నీదుకరాసి భీమకా
ళోరగతుల్య మాటను రణోర్విని దుర్మదమత్తచిత్తులౌ
వీరులప్రాణవాయువులు పీల్చుట యుక్త మిదెంతవింత య
య్యారే సముద్రమయ్యును రవంతయు భంగముఁ గాంచ దెప్పుడున్.

చ.కడెములు బహుపుర్లు పతకంబులు పోఁగులజోడు లుంగరా
లడుగఁగ వచ్చు భూషణము లౌటఁ దదంగము లిమ్మటంచుఁ గొ
రెడిభవదీయసాయక మరిప్రతతిన్ ఘనమర్గ ణానలి కిీ
నడతలు యుక్త మౌనె రఘునాధమహీపదిలీప విక్రమా.

ఉ.శ్రిరమణీమణీచరణశింజసమంజసరత్నపుంజమం
జీరనినాధవద్గృవిశేషుడ వౌచు సపుత్రపౌత్రతన్
ధారుణి నేలు సౌభరివిధమ్మున సర్వమహీపతు ల్నినున్
సారెకుఁ గొల్చు లీల రఘునాధనృపాల విశాలవైభవా.

మ.హృదయావాలముచక్కి భక్తిరసవారిన్ జ్ఞానబీజంబులో
నుదయంబంది ప్రరూఢపాద మగుచున్ గోకర్ణనాథాభిధ
త్రిదశానోకహసంగతిన్ దనరుచున్ శ్రిమద్బృహ న్నాయికా
ఖ్యఁ దగున్ గల్పకవల్లి రాయరఘునాథాదీశునిం బ్రోవుతన్.

ప.అని తలంచి నాకర్యంబు నాశీర్వాద పూర్వకంబుగా నెరవేర్చి మహారాజాజ్న ప్రకారంబున.

షష్ట్యంతములు

క.శ్రీపతిముఖనిఖిలశుభ, ప్రాపకసంభాషునకు వరాంతర్లోక
క్ష్మాపమదాటోపకధా, లాపభిదారో షునకుఁ గళాభూషునకున్.

క.శరణాగతహృదయతమ, స్తరణికి సంసారజలధితరణికి దైత్యో
త్కరశిక్షణసురరక్షణ, కరవీక్షణ ఘృణికిఁ జంద్రి కాన మఘృణికిన్.

క. శ్రిమత్సుగంధికబరీ, కామికిని మునీంద్రహృదయ గామికిని క్షమా
భూమికిని మాతృభూత, స్వామికిని నమస్కరించి సద్భక్తిమెయిన్.

వ. అంకితంబుగా నయొనర్పంబూనిన యాంధ్రభాషార్నవం బనుమహాకృతికి బనినంత సకలాంతర్యామి గావునఁ బ్రత్యక్షం బయి యెట్టులని యడిగినట్టి వినుము వివరించెద.