ఆంధ్రనాటక పద్యపఠనం/వాద ప్రతివాదన
9. వాద ప్రతివాదన
కొందరు : కవిత్వంలో గానం నక్కి ఉంటుంది, అందుకని
పద్యాలు పాడుకోడంనిమిత్తం తయారుచేస్తారుగాని మరో పనికి కాదు-
అంటారు. గానం భావరాగతాళయుక్తం అనో నృత్తగీతవాద్యం
అనో అనుకుంటే పద్యంలో గానం ఎక్కడ నక్కిఉంటుందీ ! పద్యం
కవిత్వరూపాలలో ఒకటి. పద్యం నియతమైన నడకగల పదసమూహం.
పదాలకి అర్ధమే కాకుండా నాదంకుడా అంతకిపూర్వమే ఉండిన కారణం
చేత పద్యంలో నాదసౌఖ్యం ఉండదని ఎవరూ అనరు. కాని, గద్య
కుడా కవిత్వరూపాలలో ఒకటి. గద్యకుడా ఏదో నడకగల పదసమూ
హమే. గద్యలోకుడా నాదసౌఖ్యం ఉంది. కాబట్టి, పద్యం పాడుకో
డానికి ఎంతహక్కు మనకుందో, గద్య పాడుకోడానికికుడా అంతే
హక్కుంది. ఇల్లాంటి హక్కు మనకి పురాణకాలక్షేపాలలోనూ హరి
కధలలోనూ దొరుకుతూంటుంది. ఆ రెండు చోట్లా వచనాన్ని రాగం
తోటే మోసేస్తారు. అయినాసరే, నాటకరంగంమీది నటుడు వచనం
పాడడు. ఒకవేళ ప్రతీనటుడూ ప్రతీవచనమూ పాడడం లంకించు
గున్నాడా, వృత్తాంతం బోధపడక, పరమానందయ్యగారి శిష్యుడి
అవస్థ తటస్థిస్తుంది. పురాణ హరికధా కాలక్షేపాలలో దారి వేరు.
వాళ్ళు గద్యపద్యాలు పాడినా, ఆ ముక్కలు మళ్ళీ విడదీసి
అంటూండి, ఇంకా ఆగి వాటికి అర్ధమూ విశేషాలూ చెప్పి, ఇంకా
సరంఅయితే వ్యాఖ్యానాలూ, ఉదాహరణలూ, దృష్టాంతాలూ, పిట్ట
కథలూ జోడించి, బహునాయకత్వం లేదుగనక, స్వంతపూచీమీద
కాలక్షేపాలకి రక్తి తెచ్చుకుంటారు. కాని, నటుడు పౌరాణికుడు
కాడు, హరిదాసుకాడు - తనుతనుకాడు. అతనిది ఏకోచ్చారణ. అతడు
ఏదేనా అని, ' బొడ్డు తుమ్మాలు' పెట్టుకుని మళ్ళీ అదే అనడానికి వీల్లేదు, మరోటి అనకూడదు. అదీకాక, అతడు గద్యకుడా పాడడం
ప్రారంభిస్తే దానికి 'ఫుల్‌స్టాపు' ఉండకపోవచ్చును. పైగా నాటక
రంగం ఒకడిది కాదు, అనేకులది. వాళ్ళంతా కలిసిగాని ప్రదర్శనానికి
రక్తి తీసుగురాలేరు. వచనవిషయంలో ఉచ్చారణ నటుడు గ్రహిం
చాడు. తనకంఠధ్వనీ తను అంటూన్న పదాలూకుడా మొదటిసారి
వినేవాళ్ళకికుడా సంగతి అవగాహన అయేలాగు అతడు వాచికంచేస్తాడు.
అటువంటప్పుడు పద్యంమాత్రం ? పద్యంలోని మాటలకి అర్ధం ఉండదా ?
ఆ మాటలకి స్పష్టోచ్చారణ అవసరంలేదా ? గద్యలో చెప్పిపారెయ్య
డానికి వీల్లేని మహత్తరభావం ఏదో ఉన్నప్పుడేకదా పద్యం రచిం
చడం! గద్యే స్పష్టంగా ఉచ్చరించవలిసొచ్చినప్పుడు పద్యం మరెంత
స్పష్టంగా ఉచ్చరించాలీ ! స్పష్టోచ్చారణకి రాగమా అనుకూలించేది !
ఈ గద్యంచిక్కు వదుల్చుకోడానికి కొందరు : పద్యం పాడ డానికి బాగుంటుంది, వచనం బాగుండదు - అంటారు. ఏ అర్ధమైనాసరే ఆరోపించడానికి వీలైన మాటల్లో 'బాగుండడం' ఒకటి. అనగా, ఒకరికి బాగున్నది మరొకరికి బాగుండదు. అదీకాక గాయకుల అభి ప్రాయంవేరు. పద్యం కాదు సరిగదా, వచనమైనాసరే, ఆఖరికి ఏ రెండు ముక్కలైనాసరే, ఇస్తే, మన చిత్తం వచ్చిన రాగంవిూద మన చిత్తం వచ్చిన తాళంమీద, మనకి ఓపిక ఉన్నంతసేపు పాడి, మనకి తన్మయత్వం తెప్పించగలడు, అధమం మనచేత 'చాలు' అనిపించగలడు, గాయకుడు. దానిపేరే గానంలో 'పల్లవి పాడడం'. కాబట్టి గానముంటే సరి, దాన్తో ఏ ముక్కల్ని ఎంజేసినా చెయ్యచ్చు. శాస్త్రం చెప్పినట్టు, జుట్టుంటేసరి, కొప్పెట్టుగున్నా, జడేసుగున్నా, ముడేసుగున్నా, ముచ్చటముడేసుగున్నాను!
కొందరు : 'అవునవును. కాని, పద్యంలో నడక ఉండడంచేత, పద్యం ' నన్ను పాడుకోవయ్యా రా రాజా!' అని పఠితని పిలుస్తూ న్నట్టు ఉంటుందిగనక, అటువంటి దీనాలాపం తోసిపుచ్చడం ధీర లక్షణం కాదు కాబట్టి, పద్యం పాడాలి, అన్నారు. కాని, పద్యం అల్లా పిలుస్తూన్నది గానంచేసి మెప్పించగల ప్రజ్ఞ గలవాళ్ళనేనా ? ప్రతివాణ్ణీ పిలుస్తుంది. అందుచేత, ఎవళ్ళ యథాశక్తిగానం వాళ్ళు దానికి అర్పించి ఆనందించుకోవచ్చు. ఎవ రాపగలరూ ? అప్పుడు వాళ్ళు తమ గానంతో కవి కవిత్వానికి ఎదురై స్వాగతమిచ్చి, తమ హృదయపీఠాలమీదికి దాన్ని ఎక్కించుకోవచ్చును. కాని, నాటక రంగంమీద అన్యుడై ఒప్పవలిసినవ్యక్తి తన గానం సంపుటీచేసి కవి యొక్క కవిత్వాన్ని అభినందించడానికి రాడు. మాటలలో ఉండే వృత్తాంతం శ్రోతలకి అవగాహన అయేరీతిగా నటుడు ఉచ్చారణ చెయ్యాలి. అతడు తనమాటలన్నీ లోగడ కంఠతాపట్టి ఉన్నా, అవి ప్రస్తుతసందర్భాన్ని అనుసరించి ఆ క్షణంలో అతడికే తోచాయా అన్నట్టు ఉచ్ఛారణ ఉండాలిగాని, ఎరిగున్న సరుకు ఏకరుపెట్టినట్టు ఉండకూడదు. ఆ పదాలవల్ల తనకి గలిగిన చిత్తవృత్తివంటిది సభ్యుల హృదయాల్లో పుట్టించాలని అతని ఆశయం. పద్యంలో అర్ధభావ రసాల్ని తన గానంలో రంగరించి ఆ గానాన్ని అతడు సభ్యులకి అంద జేస్తే, దానివల్ల వాళ్ళ హృదయాల్లో పద్యంలోని అర్ధభావరసాలు పుట్టవు. వాళ్ళు ఇతరానందంలో ఉంటారుకాని, నటుడి అవస్థలో ఉండరు. ఇదికాక, సరే ప్రతిపద్యంలోనూ నియమితమైన నడక ఉంటుంది. ఇంద్రగణాలు వచ్చే పద్యంలో నడక నియమితమేకాని స్థిరంకాదు. పోనీ స్థిరమైన నడకగల వృత్తాల్లో ఒకటైన ఉత్పలమాలని విచారణ చేద్దాం.
కేరడమయ్యె కమ్మ పరికింపగ నేడుకదా
ఈ విధి నద్దురాత్ము వధియింపకపోవుదునేని
కాచిన వాడ వీవ మము గౌరవు లెగ్గొన రించుచో
పైపద్యాలలో ప్రతీదాన్నీ ఏ షడ్జమంలోనో, ఏ మధ్యమం లోనో చదవగలంగదా ! అప్పుడు పద్యం ఎందుకు నడవదు? అది నడిచేటప్పుడు అమాంతంగా ఏ రాగం జనిస్తుందీ ? ఏ రాగమూ ఎంత మాత్రమూ జనించదు. యధార్థం ఏమిటంటే పద్యకర్త తన నాదం యొక్క—స్పష్టోచ్చారణ గల వర్ణంయొక్క - గురు లఘు ( పొడుగు— పొట్టి ప్రమాణాన్నిబట్టి మాత్రమే తన రచన చేస్తాడు. అంతేకాని, గాయకుడు గమనించవలిసిన నాదంయొక్క స్థాయులూ స్వరాలూ కుడా గమనిస్తూ నిల్చిపోడు. అనగా, స్వరజ్ఞానంతో నిమిత్తం లేకుం డానే పద్యకర్త తన పని చూపించగలడు. కాబట్టి పద్యంనడక అర్ధ స్ఫురణకి అనుగుణంగా ఉండాలిగాని, తేరగా కొట్టితెచ్చిన రాగం యొక్క జీవాన్ని నిలబెట్టడానికి తనే కుంటకూడదు. పద్యంలో నడక ఉందిగనక పరాయి రాగంకుడా తెచ్చి పద్యోచ్చారణ చెయ్యాలి అనే వాళ్లు, పద్యానికి సహజమైన నడకని నిలబెట్టక, రాగదాసులే అవు తూంటారు. నడకా నిలబెడతాం అనే వాళ్లు, కీర్తన పాడుతున్నా రన్నమాట. పద్యాన్ని కీర్తనగా పాడవచ్చా అనేది ప్రస్తుతసమస్య కాదు.
ఈ చిక్కులోంచి తప్పించుగోడానికి కొందరు : కవిత్వంలో కొంత ఆనందం ఉంది, గానంలో కొంత ఆనందం ఉంది. పద్యం పాడే టప్పటి ఆనందం పద్యం పఠించేటప్పటి ఆనందంకంటే పైన జేనడేనా ఉండితీరుతుంది. కాబట్టి పద్యం పాడాలి - అంటారు. కాని, పద్యం కేవల గణపంజరం కాకుండా కవిత్వమే అయుంటే, కొంత ఆనందం ఏమికర్మం, మిక్కిలి ఆనందం కలిగించాలి. ఆ ఆనందం ఏ యితర కళ తోనూ జోక్యం లేకుండానే కలిగించాలి. ఎవరికైనా బ్రహ్మానందం కలిగేటప్పుడు రెండు బ్రహ్మానందాల జోడింపుగురించి తర్కించడం రెండు అనంతాల మొత్తంగురించి పేచీపడ్డట్టు అవుతుంది. పద్యంలో కొంత ఆనందంమాత్రమే ఉంటుందని వాదించేవాళ్లు, ఆ పద్యం కవి త్వం కాదని ఒప్పుగుంటున్నా రన్న మాట. అల్లాగే, కొంత ఆనందం కలిగించే రాగమూ గానంకాదు. రెండు కళల సంపుటీవల్ల ఒక మిశ్ర కళజనించవచ్చుకదా అని నమ్ముతూ, రెండు కళాభావాల సమ్మేళన వల్ల కళజనిస్తుందని, ఇల్లా వాదించేవాళ్లు, భ్రమపడుతున్నారు.
రెండు వేర్వేరు కళల మిశ్రణంవల్ల కొత్తకళ జనింపచెయ్య డంలో తప్పేమి ఉండగలదూ ! అవి కొందరి బాధ. తప్పేమీలేదు. కాని, ఆ కలపడంలో ఏ ఒకటిగాని రెండూగాని నాశనం కాకూడదు. ఒక కళయొక్క విహరణస్థలాలతో అచ్చంగా ఏకీభవించే విహరణ స్థలాలు మరోకళకి ఉండవు. ఉంటే అవి వేరుకళలు కానేకావు. కాని, ఒక కళయొక్క కొన్నిపట్లు మరొక కళయొక్క కొన్నిపట్లకి తుల్యంగా ఉండవచ్చు, సరాసరిగా స్పర్శలో ఉండవచ్చు. ఆ రెండుకళల రహ స్యాలూ తెలిసినవాళ్ళకిగాని అటువంటి పట్లు తోచవు. కవనగానాలు రెండూ నాదాధారాలు. కవనంయొక్క సూక్ష్మప్రమాణం శబ్దం, గానంయొక్క సూక్ష్మప్రమాణం స్వరం. అర్ధవంతంఅయిన శబ్దానికి రసవంతంఅయిన స్వరం సంపుటీచేసి నవ్యకళ సృష్టించేవాడు కీర్తన కర్త. కాని, శబ్దప్రపంచం గేయ, పద్య గద్యరూపాలలో ఉండగలదు అందులో పద్యరూపంగురించి మన సమస్య. పద్యాలు రచించడాని కల్లామూలం రాగాలు నేర్చుగుంటూ కూచోరు, పద్యకర్తలు. కాని, చాలామంది పద్యకర్తలు తమ పద్యాన్ని రెండోవారు మూడోవారికి ప్రకటించవలసిన అవసరం వచ్చినప్పుడు పాడితీరాలి, అంటారు. కొందరు పద్యకర్తలకి కొన్ని రాగాలు వచ్చునుట, శ్రావ్యంగా పాడ గలరుట, అంచేత తమ పద్యాలు మంచిపీకవాడు పాడాలిట ! అటువంటి వాళ్లు తమ పద్యాల్ని స్వరపరిస్తే తీరిపోతుందిగదా ! అంత రాగప్రా వీణ్యం ఉన్న వాళ్లే ఆ పద్యంధరిమేనా వెడతారు. కాని, ఎందుచేతో కాని, వాళ్లు అట్లా చెయ్యక మెత్తగా ఊరుకుంటారు. ఊరుకుని, వినిపించేది తమరే అయినప్పుడు, రాగరథంమీద ఝమాయించేసి, శ్రోతల మెప్పు పొంది, ఆ మెప్పు పట్టిగెళ్లి తమ పద్యభావానికి జమ రాసుగుని, దానికి కవిత్వముద్ర వేసేసుగుని, రాగరహితంగా ఆపద్యాన్ని ఉచ్చరించేవాడు తమ కవిత్వాన్ని పాడుచేస్తున్నాడని గోలపెడతారు కొందరు శ్రోతలుకూడా ఆ గోలలో పద్యకర్తలు ఒంటరిగా ళ్లైపోకుండా కనిపెడతారు. ఇతర పద్యకర్తలకి రాగాలు రావుట. వాళ్లల్లో కొందరు నోరు మెదపకుండానే పద్యం రాసేస్తారట, అనగా వాళ్ల పద్యాలు నాదరహితంగానే వెలుస్తాయిట, మంచికంఠంవాళ్ళొచ్చి పాడితే, ఇంకా బాగుంటాయిట, . అసలులో ఎంతబాగున్నాయో తెలుసుకోడం, అవి నాదశూన్యంగా పుట్టడంవల్ల, అసంభవంట ! తక్కినవాళ్ళు కాస్తకాస్తే అనుకుంటూ, వెనక్కి వెడుతూ, ముక్కలు మారుస్తూ, నియమితస్థలాల్లో అక్షరసామ్యం ( పోనీ నాదసామ్యం ) కలిగేటట్టు చూసుగుంటూ, రాస్తారట! కాని, వాళ్ళనోళ్ళు మంచి వైనా, వాళ్ళ గొంతిగలు మంచివికావుట, అందుకని తమ పద్యాల్ని - రాసింది తమరేగనక తమ కవిత్వాన్ని - తీసిగెళ్ళి వాటితో జనాన్ని ఐక్యంచేసి ఆనందపరిచే పూచీ పడడానికి మంచిగొంతిగల ప్రతివాడికీ సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేశారుట! ఈ రకం పద్యకర్తలు తమరే రచించిన తమ పద్యాన్ని తమరు మళ్ళీ పైకి అనరు, పాడలేరుట, పాడరు. శ్రావ్యకంఠంవాడు వచ్చి వాళ్ళ పద్యాలు పాడడంతో టే, తమ పద్యరచన కవిత్వంగా మారి ప్రపంచాన్ని ఆకర్షించిందిగదా అని సంతోషించుగుంటారు. సహజంగానే రసాత్మకంఅయిన గానం వల్లకాక తమరు రచించిన పదాల అర్ధభావాలవల్లే రసోత్పత్తి అవు తోందని వాళ్ళ విశ్వాసం. అనగా, తను కనీవినీఎరగని ఏ పాకం వల్లైనాసరే జనం ఆనందిస్తున్నారుగదా అంతేచాలు, అని వాళ్ళ సంభరం! సాధారణ నటుడికి పద్యవిషయంలో మరికాస్త ఎక్కువ బాధ. అతడు అన్యుడుగా ఒప్పవలిసిఉన్నా స్వంతంతాలూకు గానం పద్యం వెలువరించేటప్పుడు మాత్రమే పాడాలి. అతడు పద్యశబ్దాలకి సంపుటీచేసే రాగం అర్థాన్ని పెంపొందించదు. పైగా తను పట్టు గొచ్చిన రాగానికి అనుగుణంగా రుబ్బినట్టు తల తిప్పడం, చేతుల్తో గాలిని నరకడమూ కావిస్తూండాలి. అటువంటి చేష్టలు అతడి అభిన యాన్ని పెంపొందించవు, సరిగదా దానికి ప్రతికూలంగా పనిచేస్తాయి. కాబట్టి, పద్యార్థం లోగడే తెలిసిన చదువరులకీ, ఎంత అపస్మారంగా మాటలు వెలువడ్డాసరే వాటి అర్థాలు నొల్లుకుని భావించుకోగల సూక్ష్మబుద్ధులకీ, నటుడి నవ్యరాగం రంజకం కావచ్చు. కాని, నాటక సభలో ఆ పద్యం విననివాళ్ళూ, ఒకసారి రాగధోరణిలో విసిరితే తెలుసుగోలేనివాళ్ళూ, అక్షరాస్యులుకానివాళ్ళూ కుడా ఉండగలరు. అర్ధం తెలిసిన అదృష్టవంతులు పద్యంమీద దృష్టి పెట్టుగోనక్కర్లేదు గనక, రాగాస్వాదన చేస్తూ 'ఒహో ' 'ఆహా' అంటూ తక్షణశ్లాఘ కోరే గానాన్ని మెచ్చుగుంటూండేటప్పుడు, అర్ధం తెలియనివాళ్ళు కుడా ఆలోచనాత్మకమైన పద్యాన్ని మెచ్చుగుంటూ ఉండాలా ? పద్యంలోని మాటలూ నటుడి గొంతిగయొక్క సంగతులూకుడా మొదటిసారి వినేవాళ్ళు తమ దృష్టి ఎటుఉంచాలి ? పద్యం పాడడం ద్వ్యర్థికావ్యం. అందులో పద్యం - దానికి అర్థ, భావ, రసాలుండాలి. అర్ధమిది, భావమిది—అని ఆ పదాలలోనే ఉంటుంది రసభేదం ఫలానా అని నిర్ణయం వీలుపడదు. అటువంటి రసభేదనిర్ణయం చెయ్యడానికి కుడా రాడు నటుడు. ఆ పదాల్ని తాను ఒకేసారి అభినయయుక్తంగా, ప్రపంచంలో అటువంటి పదాల్ని అర్థస్ఫురణ చెయ్యడానికి ఉచ్చారణ చేసే రీతిలోనే, ఉచ్చారణచేసి అన్యుడై ఒప్పాలని అతడి ఆశయం, అది ఒకటి. గానం రెండోది. గానానికి అర్ధం తెలియదు, భావం తెలియదు, కాని రసస్ఫురణ ఉంటుంది. వీటి కలయిక ఆస్వాదించి ఆనందించడంలో :
ఒక కథ వినియెడి తఱి వే
ఱొక కథపై దృష్టియిడిన నొక యర్థము దో
పక పోవుఁగాన నేకా
ర్థకావ్య మెట్లట్ల వినఁగఁదగు నొక టొకటిన్
అని సూరన్న హెచ్చరిక! – అనుకుందాంపోనీ, అంటే,
గానానికి అర్థం తెలియదు, ప్రతి పద్యంలోని ప్రతి ముక్కా రెండేసి
సార్లూ అనరు. కాని, సభ్యుల్లో మాటలు వినేవాళ్లకి రాగమూ
రాగం వినేవాళ్లకి మాటలూ అందకుండా పోతాయిగదా పాపం,
వాళ్లు చిక్కులోపడిపోయి చీలిపోతారుగదా, అని కొందరి నటులకి
అనిపిస్తూండి, సభ్యులు తమకి మిగిలిన రెండోపని చూసుగుని
ఆస్వాదన పూర్తిచేసుగోడానికి అనుకూలించేనిమిత్తం, పద్య పాదాన్ని
మరోసారి అంటూంటారు. కాని ప్రతీపాదాన్నీ రెండేసి సార్లు అంటే,
చాలా అసహజంగా పరిణమించవచ్చు ననే భయంచొప్పున, పద్యం
యొక్క మొదటిపాదాన్ని మాత్రమే రెట్టించి చక్కాపోతూంటారు.
కొందరి నటులకి అటువంటి మొహమాటం లేకపోవడంవల్ల వాళ్లు
పద్యంలోని శబ్దసమాసాలన్నింటినీ రెండుకాదు మూడుకాదు ఎన్నో
సార్లు వెనక్కీ ముందుకీ ఉప్పట్లాడినట్టు దంచి, పదార్థాన్ని గుండకొట్టి
వస్త్రకాళితం చేసేస్తారు. రాగసమ్మేళనం వీలుండదు అని అందరూ
అనుకునే గద్యలో పైవిధంగా మాటల్ని మళ్లీ మళ్లీ ఉచ్చారణ
చెయనీండి, ఆ నటుడికి మతిలేదని, పద్యరాగపాకం మెచ్చే శ్రోతే
సెలవిస్తాడు. మరి కొందరు : పోనీండి, ఏకొంచెం రాగం కలిపినా కలప
వచ్చు. సృతిలో ఉంటూ రాగం తేలిస్తే చాలు. ఆ కాస్త పీలిక
రాగమూ అంటేసినంతమాత్రంచేత పదార్థానికి వచ్చే లోటు ఏమీ
ఉండదు - అంటూ క్షుద్ర రాగమేనా ఉండాలని ముచ్చటపడేవారు
ఉన్నారు. కాని, నిజంగా గానకళ కంఠంలో ఉన్నవ్యక్తి కాస్తకూస్త
గానంచేస్తూ కూచోడు. తనివి తీరా మనస్ఫూర్తిగా పాడితేగాని,
అది గానంచేసే వాడికే గానంకాదు, తక్కిన వాళ్లకి గానం ఎట్లాఅవు
తుందీ ? గానజ్ఞులు అది గానంకాదని చెబుతూండేటప్పుడు, ఆ గానం
చేసేం మానేం? అర్ధంతో ప్రసక్తిలేకుండా, పదాలు చెయ్యలేని పని
చెయ్యగలిగి, గాయకుడి అభిమానకళఅయిన గానం, మరో పనిమీద
రంగంఎక్కి మరోవ్యక్తిగా ఒప్పవలసిన నటుడిచేత చిన్న చిన్న మోతా
దుల్లో సృష్టింప బడడం ఎట్లా? గానం చిన్నెలూవన్నెలూదాల్చి అభి
వృద్ధి గాంచనప్పుడు, అంతాకుడా అనియమితం అయిన దీర్ఘాలే తీస్తూండి
నప్పుడు, ఉత్కృష్టగానం ఇదీ అని ఏర్పాటుకానప్పుడు, త్యాగరాజు
పుట్టి కొంతవరకు గానం దారిని పడనప్పుడు, ఎవరు ఏ మోస్తరు
దీర్ఘాలు తీసినా తక్కినవాళ్లకి అది గానంలా కనిపించేదేమో ఎరగం.
ఆ బేరం నేటి కాలంలో ఎట్లా కుదురుతుందీ? ఇక, పామరులకి అర్ధం
తెలియకపోయినా పద్యం వాళ్ల చెవుల్లోకి శ్రావ్యంగా ప్రవేశించడం
గురించి మాట్టాడ్డం సంఘాన్ని మోసగించడం. ఏమంటే : జనసమ
క్షంలో ప్రకటింప తగ్గ పద్యానికి అర్థమే కాకుండా భావం కూడా
స్ఫురించాలి. అప్పుడుగదా జనానికి బోధ! నటుడు అది సానందంగా
నిర్వహించాలి. ఉచ్చారణరీతి నేర్చి రంగం ఎక్కాలి. అంతేగాని,
త నెరుగున్న క్షుద్రరాగం ఒకటి పట్టుగువచ్చి యధాశక్తి వ్యవసాయం
చేయడం మొదలెట్టి, శ్రద్ధతో విని అవగాహన చేసుగోవలిసిన
పద్యాన్ని పాడగానే, జనబాహుళ్యం శ్రద్ధతో విననవసరంలేని రాగపు మూలుగునే ఆస్వాదిస్తారుగాని, పద్యంలోని పదాల్ని లక్ష్యపెట్టనే
పెట్టరు. పామరజనం తరఫున వాదించి క్షుద్రరాగమేనా లేకపోతే
వాళ్లకి మహాయిబ్బంది అని చెప్పేవాళ్లు, కవిభావానికి ఆ పామరుల్ని
దూరంచెయ్యాలి అనడమేకాకుండా, పద్యాస్వాదన విషయంలో
వాళ్ల అజ్ఞానాన్ని ఖాయపరచి శాశ్వతం చేయదలిచిన పుణ్యం, అను
కోకుండా, కట్టుగుంటున్నా రన్నమాట! అటువంటి పామరుల నిరర్థక
శ్లాఘకుడా మూటకట్టుగుని మురిసిపోయి, దాన్ని పద్యశ్లాఘకిందా
నటనాశ్లాఘకిందా జమకట్టించాలనా, వాళ్లబాధ ! అజ్ఞానులచేత
'అవును' అనిపించడానికా రాగం ?
'పద్యంలో ఉండగల రసాన్ని ఆస్వాదించగా, అది రాగంలోకి దిగుతంది. ఆ మోస్తురుగా పద్యాన్ని ఆస్వాదించి ఇతరులచేత ఆస్వా దింప చెయ్యలేనివాళ్లు రాగం తియ్యలేక, తీసేవాళ్లని వద్దంటారు' అనే అభిప్రాయం కొందరు వెల్లడించారు. పై వాక్యంలో 'రసం' అనే మాట ప్రవేశించి ఉంది. అనిశ్చతమైన ఉత్కృష్టపదాలలో అది ఒకటి. ఇది ఫలానాఅని ఇన్ని ముక్కల్లో చెప్పాలంటే సామాన్యులకి కోపంవస్తుంది. తెలిసినవాళ్లని అడిగితే, కావలిసినంత గ్రంథం చెప్పి గభరాయింప చేస్తారు, అదేముటో తేల్చకుండా ! భాషల్లో ఉండే కొన్ని కొన్ని పదాలు అట్లాంటివి ! వాట్ల అర్థాన్ని ఎవరి త్రాణ ననుసరించి వాళ్లు గ్రహిస్తూం టారు. ప్రకృతి మానవుల స్థితిగతులూ మహిమాస్వభావాలూ ఆకార ఆంతర్యాలూ గ్రహించిన మానవుడు తన హృదయం ఈశ్వర సంకల్పాలకి ఉప్పొంగినప్పుడు ఆర్ద్రహృదయుడై ఒహో, ఆహా, ఒస్, అబ్బా, అల్లానా, పోనీలే, అయ్యో, ఔరా మొదలైనవి అనడం సార్థకఅనుభవం. అక్కడితో ఉండ బట్టలేక ఆ మానవుడు తత్తుల్యమైన అనుభూతి ఇతరమానవులకి కలిగించాలనే సదుద్దేశంతో బయల్దేరి తనకి మిక్కిలి అనువైన సాధనం అందునిమిత్తం ఎన్నుకుంటాడు, పదమో, స్వరమో, రంగో, రాయో! ఎన్నుకుని అప్పటి తన చిత్తవృత్తి సమగ్రంగా ప్రకటిస్తాడు. అతడు అనుకున్నరీతిగా పని జరిగిననాడు, తోడిమానవుల హృదయాల్లో ఆవిర్భవించేది 'రసం'. కవి స్వీకరించే సాధనం పదాలు. కవి పదాలు ప్రయోగిస్తాడు. కాబట్టి పద్యంలో రసం ఎంత విపులంగా ఉన్నా దాన్ని పదాల కూర్పుద్వారానే ఆస్వాదించాలి. ఆ పనిలో రాగమెందుకూ! రాగం అనేది ఏదో మున్ముందే మనకి వచ్చుండి, దాన్ని పలికించాలనే ఉద్దేశమే మనకి ఉన్నప్పుడు తప్ప దానంతట అది మనలోంచి బయల్దే రడం ఎట్లా? పద్యదర్శనం కాగానే రాగశూన్యుడికి రాగాలు పుడ తాయా! భోజమహారాజుని చూస్తే కవిత్వం పుట్టేదిట, అన్నట్టు ! తిన్నగా పద్యం చదవలేనివాడు మూలుగులోకి దిగచ్చుగాని రాగం లోకి ఎట్లా దిగుతాడూ! అసమర్దుడైన చదువరో పఠితో పద్యంలో ప్రవేశపెట్టిన మూలుగుని ఖండించడంబదులు, ఖాయపరిచి, ఖరీదుకట్టి అదిరాగం అయిపోవాలని పట్టుపట్టడం ఏమి సరసం ! ఇక, రాగపు మొహం ఎరక్కుండా పుట్టిన పద్యం, మనం దాన్ని ఎంత ఆస్వాదిస్తేం గనక, రాగంలోకి దానంతట అదే ఎల్లా దిగుతుందీ ? పోనీ, ఒక పద్యం లోని పదాలరసం యావత్తూ వెళ్లి ఒకేరాగపు సంగతుల్లోకి ఎట్లా దిగు తుందీ ? రంగంఎక్కిన నటుకు ఒక్కొక్క పద్యాన్ని ఎన్ని సార్లు తను ఆస్వాదించాలీ, ఇంతపనీ జరగడానికి ? ఎన్నిసార్లు శ్రోతలచేత ఆస్వా దింప చెయ్యాలీ ! పోనీ, ఒక నటుడికి గానంకుడా వచ్చు ననుకోండి, అతడికి తెలియకుండానే పద్యం ఏదో ఒక రాగంలోకి దిగుతుందను కోండి. కవిరచించిన పద్యంలోని పదాలన్నింటినీ సార్ధకంగా సభకి వడ్డిం చినపిమ్మట అన్యవ్య క్తిని స్ఫురింపచెయ్యవలసినవాడు, ఆ పదాలమధ్య తన స్వంత రాగ సంగతులు చిమ్ముతూ తన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుగోవడం ఎందుకొచ్చినపనీ ? తనకి రాగం వచ్చినట్టు సభకి తెలియ పరచడానికి అదా అదను ? పోనీ తనకి రాగాల ఆస్తి ఉన్నసంగతి మొదటే సభకి తెలియపరిస్తే ! మరో నటుడికి రాగాలన్న మాటేమిటి, కవిత్వం కట్టడంకుడా వచ్చు నను కోండి. నాటకపద్యం ఆస్వాదించగా ఆస్వాదించగా, అది వెళ్లి కవిత్వంలో దిగుతోందని చెబుతూ, అతడు తన స్వంతకవిత్వపైత్యం, నాటకపద్యంలోని శబ్దాలసందున జొనప వచ్చా! అప్పుడు నాటకపద్యానికి మెరుగు పెట్టినట్టై రసం ఇనుమడిం చదా? - అంటే, కూడదుట. ఎందుకు కూడదనగా, చేసే పనియొక్క అవకతవక వీధిని పడిపోతుంది. కాని, రాగంలో పదాలు కాక మనకి అర్ధంతెలియని స్వరాలుమాత్రమే ఉండడంచేత, జరుగుతూన్న హాని గోచరించడంలేదు. ఇంకోనటుడికి అనేకభాషలు వచ్చిఉండచ్చు. వచ్చి నంతమాత్రాన్ని, ఒకతెలుగురచయిత రచించిన నాటకపద్యం ఉచ్చా రణచేసే మధ్యరంగంలో అవన్నీ ఎట్లాదొర్లించడం? ఒక తెలుగుపద్యం అభినయించే పట్టులో, రసం అభివృద్ధిచెయ్యడానికి ఇంగ్లీషుమాటలు ( నటుడికి వచ్చునుగనక ) మిళావు చెయ్యవచ్చా ? - అదీ నాజనకమే గనక? అన్నింటికీ ఏమి, పోనీ, పద్యం ఆస్వాదించగా ఆస్వాదించగా శృతిమించి రాగాన్ని పడుతుందనేవాళ్లు, ఆ రాగాన్ని ప్రకటించి ఊరుకోకూడదూ, పద్యంలోని మాటల్ని పూర్తిగా వదిలేసి ? రాగాభి నయమే తెలుగునటుడి కళ అని నిర్ధారణేనా అయిపోతుంది !
ఒకరి అభిప్రాయం : ఒక కళ ఇతరకళల్ని ఉపాంగాలుగా తీసు కోవచ్చు. సాధారణంగా సంబంధంగల కళల్నే తీసుకుంటారు. గాయ కుడు తను గానంచేసేటప్పుడు కొన్నిపదాల్ని ఉపయోగించుగున్నట్టే ( రెండూ నాదజనకాలే గనక ), పద్యాన్ని ప్రకటించేవాడు కొన్ని స్వరాల్ని ఉపయోగించుకోవచ్చును — అని. కాని ఈ ఉపమాన ఉపమే యాలకిభర్జించని విషయం ఒకటుంది. గాయకుడు పదాలు ఉపయో గించుగునేమాట రూడే, కాని అతడు అప్పట్లో కల్పించుగున్న బాపతు కాదు. అంతకు పూర్వమే స్వయంగా తనో, లేక తనకి నచ్చిన అన్యుడో సృజించినవి. అనగా, ఆ పదాలు గాయకుడు ఆ క్షణంలో సృష్టించే కవిత్వం కాదు. కాని, గానం దారి వేరు. గానానికి వర్త మానమేకాని భవిష్యం లేకపోవడంవల్ల, ఎప్పటి గానం అప్పుడే సృజింపబడాలి, ఎవరి గానానికి వాళ్ళే రూపం ఇయ్యాలి. ఒక కవి రచించిన పదాల్ని మనం మరొకరితో చెప్పడానికి వీలుంటుందిగాని, ఒక గాయకుడి రాగం మనం మరొకరితో మనివిచెయ్యడం అసాధ్యం. కాబట్టి, రాగం అనేది అదివరకే రచింపబడి నిర్ణితమై వ్యవహరించడా నికి వీలైన ఆకారంలో ఏ సీసాలోనో ఉన్నట్టు - కాస్తంత రాగం కలుపుగుంటేం - అనడం, గానంయొక్క మహోత్కృష్టలక్షణం విస్మరించడం.
మరి కొందరు మొహమాటం విడిచి : కవిత్వం ఎంత గొప్ప దైనా పద్యాన్ని పఠించి ఊరుకుంటే బోసిగానూ బోడిగానూ ఉంటుంది. కాబట్టి పద్యవైధవ్యం తొలగించాలంటే రాగాలంకరణ విధాయకం. అందుచేత నాటకరంగంమీద నటుడు పద్యాలు పాడాలి-అంటారు. ఆంధ్రపద్యాన్ని బోసి, బోడి అనడం ఆంధ్రఛందశ్శాస్త్రానికి శూన్యం పెట్టడమేకాక, వెయ్యేళ్ళ కృషిమీద వెల్తిమాటాడి నోరు పారేసు గోవడంకుడానూ! అయినా, పుట్టువితంతువులైన ఆంధ్రపద్యాల వైధవ్యం తప్పించడానికి, వీరేశలింగంపంతుల్ని మించాలని చూసే ఉత్సాహవంతులు ఉండగలరు. చెడ్డరాగం, వాళ్ళు, తీసుగురానియ్యరు. అదీ వితంతువే! మంచి రాగానికి ఆకర్షణ ఉంటుంది. అదీ కాదు. ఆకర్షణగల రాగమే మంచిది గనక అల్లాంటిదే పట్టుగొచ్చి కలపాలని వాళ్ళ పట్టుదల. కాని, ఆకర్షణశక్తి ప్రతికళకీ ఉంటుంది. నటుడి కళ నటనం. నటనంమూలంగా ఒకడు జనాన్ని ఆకర్షించినప్పుడే అతడి నటనం ఒకకళ. అట్లా చెయ్యలేక, చెయ్యలేనివాడు ఊరుకోక, పై పెచ్చు అన్యకళకి ఆకర్షణ ఉందని ప్రకటిస్తూ, దాన్ని మాటు పెట్టి జనాకర్షణ చెయ్యడం తన కళకి తను శత్రువుననే సంగతి ఒప్పేసు గుని డప్పేసుగోడం. పెగా, గానం జనాన్ని ఆకర్షించడమే కాదు, పరవశుల్నిచేసి చుట్టపెట్టేసి మరి వాళ్ళని వదలదు. జనం గానలోకం లోనే ఉండడం జరుగుతుంది. నాటకానికిగాని నటుడికిగాని పరమా వధి అది కాదు.
పద్యం అనేదానికి రాగం అనేది ఇతరమానవహృదయాలకి దాన్ని పాకించడానికి సాధనం అని కొందరి వాదన. కాని, తన హృదయం ప్రవేశించడానికి అక్క ర్లేనిది, ఇతరమానవులగురించి కావా లనుకోడం పఠితయొక్క స్వాతిశయం. పద్యంలో స్వతస్సిద్ధంగా ఉండే నడకే ఆ పనికి సాధనం. నడిచే లక్షణం పద్యానికి సహజంగానే ఉంటూండేటప్పుడు దాన్ని పాకించడమూ డేకించడమూ కర్మం ఏమొచ్చె! నడక కవులకి ఒక ఆయుధం. ఛందస్సు వేదపురుషుడి పాదాలు. తెలుగుపద్యాలు ఎన్నోరీతుల్లో నడవగలవు. ఉన్న సాధనం గమనించక అగమ్యసాధనం మరో టేదో ఉంటేగాని వీల్లే దనడం, తెలియవలిసింది తెలుసుగోక, తెలియజాలనిది బహు స్పష్టంగా తెలుస్తోందని అనుకోడం.
కొందరు నిర్మొహమాటస్థులు అన్నారు: “ మేం నాటక పద్యాలు ప్రదర్శనానికి వెళ్లకపూర్వమే ఎరుగుదుం. చూశాం. వాటిల్లోని పదార్థం మాకు తెలుసు. అచ్చుపడ్డవి అప్పగించడంలో ఉండేవిశేషం గమనించడానికి వెళ్లం మేం. వాటిని పురస్కరించుగుని నటుడు తిప్పుగోడాలుకుడా మాకు తెలుసు. ఆ పద్యానికి నటుడు తన తాలూకు గాంధర్వం ఎంతవరకు ఉచితంగా అర్థభావాభినయాలకి భంగం రానీకుండా లుంగచుట్టగలడో చూడాలని,” అని. అనగా, పద్యంలోని పదాలమీద వాళ్లకి గణ్యత నశించి, నటుడి కంఠం మీదమాత్రమే మనసు పోతుందన్నమాట. కాబట్టి లోగడ నాటక పద్యం చదివినవాళ్లకి అందుతో చుట్టే అల్పరాగమే లక్ష్యం. ఇక చదవనివాళ్లకి సరేసరి. శృతి వెయ్యడం, ఏదో కొంత గానం చెలరేగ బోతుందని ఒక విధమైన బజానా వంటిదికదా ! పాత సరకు కాదు, శ్రద్ధ అవసరంలేని కొత్త దినుసు ప్రారంభం అవుతోంది అనే సూచన కదా! అందుకని చదవని వాళ్లూ అందుకే చెవులు నిక్కబొడుచుగుని ఉంటారు. 'మహారాజు వస్తున్నారు' అనే కేక వినబడగానే జనం దృష్టి మహారాజు వచ్చే వేపు మళ్లడం సహజంకదా! అందుకనే సంభా క్షణల్లో, ఈ వేళ హరిశ్చంద్రుడు ఎవరు వేస్తారండీ?', 'ఫలానా వారు', 'బాగా పాడతాడా, టిక్కట్టుసొమ్ముకి తిలోదకాలా?' అనే మోస్తరుగా వినబడుతూంటుంది, ఓ నలభై యేళ్లు సంగీత నాటకాలు ముమ్మరంగా జరిగాయి. సాహిత్యనాటకాల్లో చేర్చతగ్గ నాటకాలు కుడా సంగీతపరంగా చెల్లిపోయాయి, సంగీతనటులంతా ఆయా నాట కాల్లోని సాహిత్యమంతా నేర్చవలిసిన అవసరం కలిగినా తీరిపోను, వాళ్లు నేర్చిఉండేవాళ్లు, రాగస్మరణ లేకుండా భాషాభినయాల జాగర్త పడిఉండేవాళ్లు. మొదటి సంగతి, వాళ్ల భాషాజ్ఞానం పెరిగిఉండేది. దాన్ని బట్టి, నటనం—నటుడికళ, అభివృద్ధి చెందిఉండేది. సంగీత నటుల్లో వెయ్యి పద్యాలు రాగించగలవాళ్లు ఉన్నా, చాలా వాట్లకి సారస్యం గాని, భావంగాని, అర్థంగాని తమరికి ఎక్కడ తెలిసిపోతుందో అన్నట్టు తయారవుతారు. అనగా, పద్యపాదాలకి రాగరజ్జువులు బిగించి లాగుతూ పదశవాల్ని నోటితో ఈడ్చేస్తారు. కాని, ' రాగం చొరనియ్యకూడదు, అది గాయకుడి కళ, నేను గాయకుణ్ణైనా ఇక్కడ ఆకళ రానియ్య కూడదు, రా నిచ్చినా నాకూ గాయకుడికీ సాపత్యం తెస్తారు, తెస్తే - నావి పొలికేకలని తేలవచ్చు, కాబట్టి నేను పద్యాలు పఠించవలె' అని నటుడు అనుకోగలిగిననాడు, 'పద్యం అంటే ఏమిటి ? దాని లక్షణా లేమిటి ? దాని విశేషా లేమిటి? దాన్ని నేను ఎట్లా ఉచ్చారణచేస్తే అందులోఉండే పదాలు జీవించి, పాత్రసిద్ధి జరుగుతుంది ? కవిత్వరూపం ఎటువంటిది ? వృత్తనియమాలు ఏవి? అలంకారాలు ఏమిటి? నడక ఏమిటి ? పూర్వకవిత్వం ఎట్టిది ? మొదలైన ప్రశ్నలు నటుడిమనస్సులో పుడతాయి. కాని, సంగీతనటుడు, ఏమి చేస్తున్నాడూ! పద్యంలో దొరికే కవిత్వంసంగతి అవతలపెట్టి, తనకి వచ్చిన భైరవీ, కాంభోజీ, తోడీ పద్యానికి కలిపేరీతిగురించిన నిరంతరఆలోచనలో పడుతున్నాడు. అన్యు డెవడైనా ఎక్కడేనా ఏదేనా సంగతి వేస్తే, అది రంగంమీంచి తను ఎక్కడ దొర్లించవచ్చో చూసుగుంటూ ఉండడం, అన్యుడు ఆ సంగతి అభేదిలోవేస్తే తను ఆనందభైరవిలో వెయ్యడం. ఇల్లాంటి ఎత్తులతో గానంలోనూగాక, గానశాస్త్రంలోనూ కానటువంటి వ్యవ సాయంలో ఉండిపోయే సంగీతనటుడు పద్యోచ్చారణకి ఎట్లా అర్హుడూ? పద్యం అతడి సొమ్మెట్లా అవుతుందీ?
అదీకాక, అక్కడక్కడ పద్యాలు తగుల్తూంటాయికాబట్టి, పద్యాలు రాగాలుతో అనాలిట– అల్లా నటులు శ్రమరహితంగా పాడ డానికేట రచయితలు పద్యాలు అక్కడక్కడ రానియ్యడం ! కాని, నాటకం విశేషభాగం పద్యరూపంలోనూ అక్కడక్కడ గద్యాత్మ కంగానూ ఉంటే, అప్పుడు గద్యలే పాడతారా పద్యాలు మానేసి ? పోనీండి, నాటకం యావత్తూ పద్యరూపంలో ఉంటే అంతా రాగాలెట్టి పాడడమే? అయితే నాటకం ఆడడమా పాడడమా? ఒక పార్శీకంపెనీ వాళ్లు కాకినాడలో 1916లో ఒక నాటకం అంతాపాడేశారు. కారణం ఏమంటే, ఆ నాటకకర్త నాటకమంతా ఒక రకం ద్విపదలో రాసే శాడట! కాబట్టి రాజు, మంత్రి, బంటు, రాణి, దాసి అంతా కూడబ లుక్కుని వచ్చేసినట్టు ఒకే రాగం - (ఫీలు అని జ్ఞాపకం) జోడించి నాటకపద్యపాదాల్ని సభవాళ్లమీద దొర్లించేశారు - ఖై బరుప్యాన్ లోంచి రాళ్లు దొర్లించినట్టు! నాటకం జరుగుతూన్నంతసేపూ శృతి మోగుతూనే ఉంది. తబలా వాగుతూనే ఉంది. ఏ వృత్తరూపమో ఒకటి పదునెట్టి ఒక నాటకకర్త తెలుగులో నాటకం రాస్తే, అది పాడ డమేనా, ఆడడమా ?
కొందరు : గానం 'అమ్మయ్య' అనిపించి శ్రమోపశమనం చేస్తు దిగనక పద్యం రాగం తియ్యాలి, అన్నారు. నాటకకర్త శ్రమో పశమనంగురించి చాలా జాగర్త పడతాడు, అందుకనే, కధలో, ఘట్టాల్లో, ఉదంతాలలో, పాత్రల్లో, భాషలో - రకరకాల వైవిధ్యం గమనించి మరీ నిర్వహిస్తాడు. గంభీరరంగంతరవాత తేలికరంగం అందుకనే, అంక, రంగ విభజన అందుకనే - అనగా అప్పుడప్పుడు తెర పడుతూండడం, అన్ని పాత్రలూ ఒకరే ధరించక పాత్రకి ఒకరుచొప్పున ధరించడం అందుకనే. పైగా, పద్యం జరిగేకాలంలో రాగం ఎట్లా అని మన విషయంగాని, నాటకరంగాన్నించి గానాన్ని ఊడ్చి పారెయ్యాలని ఎవరూ అనలేదు, నేనూ అనను. రంగాలమధ్య, నాటకం రక్తి చెడకుండా, కవనగానరసజ్ఞులు మెచ్చేలాగ, గాయకుణ్ణి పెట్టి, అతడిచేత ప్రదర్శనశ్రోతలకి గానం ఇప్పించవచ్చు. నాటకసమా జానికి ఒక సార్ధకగాయకుడు చాలు. చిత్రకారుడు ఒకడు ఉండడం లేదూ! అతడు అదివరకే చిత్రించిన తెరలు ప్రదర్శనంలో చూపి స్తున్నారుగాని, పద్యం జరిగే క్షణంలో నటుణ్ణి, యధోచితంగా అభిన యిస్తూ, తెరలు చిత్రించమంటున్నారా?
కొందరు కళాభిమానులు : హరిదాసు పద్యాలుపాడి రక్తి కట్టించడంలేదుటండీ, పాడ్డంలో ఉంటుంది మజా ! అనేస్తారు. కాని, జరిగినట్టు నమ్మబడే సంగతి చెప్పేవాడు హరిదాసు, అప్పటికప్పుడు జరుగుతూన్నట్టు భ్రమింపచెయ్యడానికి రంగం ఎక్కేవాడు నటుడు. హరిదాసుమాత్రం అప్పుడప్పుడు నటించడా అంటే, మానసికంగా, వాచికంగా నటించవచ్చు. కాని, వెన్వెంటనే తనుగానే తోచి వ్యాఖ్యానం చేసుకోగలడు. వెనక ఎవరోరాజు తన చిక్కులు తను పడుతూ ఎట్లా విచారించాడో మనకి చెబుతూ, తన స్వంతగానం మిళితంచేసి మనల్ని, హరిదాసు, ఆనందయుతంగా విచారంలో పడే స్తాడు. నటుడు, ఎవరో రాజుయొక్క సంగతి చెప్పి మనల్ని ఆనంద యుతంగా ఏడ్పించడానికీ, అనందయుతంగా భయపెట్టడానికి రాడు. తనే ఆ రాజులా మనకి తోచాలనీ, కనిపించాలనీకుడా వస్తాను. ఏ రసంలో అయితేం, ఏదో ఒక అవస్థయొక్క అనుభవం ప్రకటించి వ్యాపింప చెయ్యదలిచినవాడికి ఆనందమూ గానమూ ఎల్లా పుడ తాయీ? సభ్యులకి తన అవస్థ అవగాహనఅయి వాళ్ళకి సానుభూతి కలిగి తద్వారా వాళ్ళకి ఆనందం కలగాలిగాని !
'నాటకం కొన్ని కళల సమీకరణంగనక పద్యాలు పాడడం మానకూడదు' అని ఒకాయన సెలవిచ్చారు. వారి అభిప్రాయంలో, తమరు వాడిన ' నాటకం ' అనేదానికి అర్ధం ' సంగీతనాటకప్రదర్శనం' అనిన్నీ, ' కళ ' అనే దానికి 'కవన గాన చిత్ర శిల్ప కళలలో ఒకటి ' అనిన్నీ, 'సమీకరణం' అనగా 'సంపుటి ' అనిన్నీ కుడా ప్రశ్నింప బడ్డమీదట అన్నారు. పై వాక్యంలోని మొదటి భాగం సత్యమే. నాటకప్రదర్శనం కంటికీ చెవికీకుడా ఉత్సవమిచ్చి ఆత్మానందం చేకూర్చాలి. కాబట్టి కళలన్నీ రంగంమీద ఉండవచ్చు. గద్యపద్యయుతమైన కవనం, గేయ యంత్రమూలకమైన గానం, యవని కాదికమైన చిత్రణం, పరికళవేషాదికమైన శిల్పం, అక్కడ ఉండవచ్చు. కాబట్టి, పద్యంయొక్కఉచ్చారణ జరిగేకాలంలో మాత్రమే రాగసృష్టీ, తత్పద్యరాగసంధానమూకుడా నటుడే చెయ్యాలి అనడం, ‘ఏదో నా యిష్టం, ఇల్లా పోనీండి, అన్నానుగదా మంచో చెడ్డో' అన్నట్టుంది కాని, సబబుగాలేదు, కనక, గాన, చిత్రకళల సంబంధాలు చెప్పడంలో రసానికి అనుగుణంగా బొమ్మలున్నాయని చెప్పేవాళ్లూ నమ్మేవాళ్లూ ఉన్నారు. కాని, ఎందుచేతో, నటుడు రంగం ఎక్కి, రసానికి అనుగుణంగా బొమ్మలు చిత్రించగలపాటి నేర్పరైనా అయిఉండాలి, పైగా ఆ బొమ్మలతడు నాటకకర్త రచించిన పద్యం వినిపించే క్షణం లోనే, అర్ధానికి ఏమీ భంగం రాకుండా, కనులపండువుగా, చిత్రిం చాలి, అప్పుడుగాని పద్యం బాగుండదు - అని వాదించేవాళ్లు లేరు. కాని, అట్లా చెయ్యగల చిత్రణనటుడు ప్రజ్ఞావంతుడు కాడా ? సంగీతనటుడు పద్యగానం చేసేవాడయితే చిత్రనటుడు పద్యచిత్రం అప్పటికప్పుడు వేసేవాడవుతాడు. నాటకప్రదర్శ నాలలో మనికి లభించే చిత్రకళ యావత్తూ, నటుడు తన పద్యమోక్ష కాలంలో ప్రసాదించే సరుకా ? సంగతి యేమిటంటే : చిత్రరచన రూపంపొంది నిలవగల కళ. అందువల్ల నటవర్గానికి చెందని ఎవరో చిత్రకారుడు లోగడే చిత్రించిపెట్టిన తెరలు వెనకదిక్కుగా ఉపయోగిస్తారు. ఒక బస్తీవీధి, ఒక అరణ్యం, ఒకవనం, ఒక డేరాలవరస - ఇవి సర్వసాధారణంగా ఉండే తెరలు. ప్రదర్శనరంగాలకి అనుగుణంగా తెరలు మారుస్తూంటారు. అది రక్తికరంగానే ఉంటుంది. కాని, చాలాచోట్ల రంగం మారిందికదా ఏదో తెరమార్పుగుడా చెయ్యక పోతే బాగుండదు అని చెప్పేసి, తెర పిరాయిస్తారు - ఒక్కొక్క వ్యాస లేఖకుడు మొహమాటంకోసం కొత్తపేరా మొదలెట్టినట్టు ! కాని ఏ ప్రదర్శనానికి ఆ ప్రదర్శనపు తెరలూ అంటూ ఉండవు. అన్ని ప్రద ర్శనాలకీ అవే తెరలు. అనగా ఒక ప్రదర్శనపుమాటలు మరోప్రదర్శ నానికి పనికిరావు గాని, తెరలు పనికొస్తాయి. కొత్త ప్రదర్శనానికి కొత్త తెరలంటూఉండవు. పాత తెరలు 'టచ్' చేస్తూండడానికీ, తెరమీద నాటితేదీ వేసి దాన్ని 'అప్-టు-డేట్ ' చెయ్యడానికీ, ఒక చిత్రకారుడు ఉంటాడు. తెరలపని అతడిది. అంతేగాని ఏ నటుడూ తెరలపని ఎన్నడూ చూడడు, పద్యం మాట్టాడే కాలంలోనూ చూడడు. చివరికి దమయంతి, సావిత్రిపాత్రలు ధరించే వ్యక్తులకైనా, భర్తల చిత్రపటాలు చిత్రించారని కథల్లో ఉన్నా, చిత్రాలు రచిం చడం రానక్కర్లేదుట! ఇదీ చిత్రరచన సంగతి! ఇక, నటుడు తను పద్యంలో ఉండేముక్కలు చెప్పి అభినయించవలిసిన అవసరంలో రాగం చుట్టుగోడం ఎందుకూ గొంతిక్కి? అల్లా చేస్తేగాని కళల సంపుటి సిద్ధించదా? అల్లాచేస్తే సిద్ధించదా? అతడు పోషిస్తూన్నది ఏ కళ? ఏ కళవల్ల ఇన్నీ వచ్చాయో, దేనివల్ల తను జనించాడో దాన్ని యధాగమనంతో ఎదటివాళ్ళకి మొట్టమొదట శ్రుతం చేసిన మీదట కదా కవి సృజించినపాత్రకి జననం ? అందునిమిత్తం చూపించ గలిగిన శ్రద్ధ చూపించి, చేయగలిగినంత ధ్యానం చేసి, తద్వారా తన మనస్సూ వాక్కూ చేష్ట మార్చుకోగలిగినంత మార్చుగుని, ఆ మార్పు నిలబెట్టుగుని, పోషించి, దాని పరమార్ధం తను గ్రహించి, గమనించి, ఆచరించి, సభాసదుల్ని రంజింపజేస్తున్నాడా ? అనగా, కవిత్వాన్ని అతడు గౌరవిస్తున్నాడా ? మూడుకళల సంపుటీముచ్చట సంగతి అల్లా ఉంచండి. తాళగమనం లేకుండా, పద్యగమనానికి భంగం రానీకుండా, రాగసంపుటి చేయగలడా ఎటువంటి అపూర్వసంగీతనటుడైనా?
'గానం దేవకళ. నాటకరంగాన్నించి దానికి స్వస్తి చెబితే అది నష్టం అవుతుంది. ఒక్కొక్కరి యిష్టానుసారం ఒక్కొక్క కండ తీసివేయుటకు వీలులేదు. అట్లుచేసిన నాటకప్పాకలు తగులడి పోవును, అని ఒకరిబాధ. ఉచ్చారణలో పద్యంయొక్క ప్రత్యేకజన్మ గురిం చినది చర్చావిషయం. నాటకరంగం ఒక రకం కాదు. ఇదివరకు భాగవత రంగం, వచన రంగం, సంగీత రంగం ఉన్నాయి. పద్య నాటక రంగంగురించి మన తర్జనభర్జన. గానం దివ్యకళే. అది రంగం మీద ఉండావచ్చు. ఒక పద్యానికి బయటినించి తెచ్చి తగి