అశ్వలక్షణసారము
తృతీయాంకురము
|
కరకటాక్షవిజయ
శ్రీకాంతా కృష్ణరాయ సిద్ధకృపాణా
స్వేకృత సత్వరపర
భీకరభటయూధకంప పృథ్వీనాథా.
| 1
|
క. |
వివరించి దశాక్షేత్రము
ల విభాగము లొనర చెప్పెదను నేరుపునన్
చెవి జేర్చి వినుము మనమున
తవరింపగ నిది సుమి ప్రభాపథములు రెండున్.
| 2
|
|
దశయన నెద్దియో క్షేత్రమున నెద్దియో బాగుగా బోధపడునల్లుగా చెప్పెదను, శ్రద్ధాళుఁడవై యాలింపుమని మనుమంచిభట్టు కృతిపతి నుద్దేశించి చెప్పుచున్నాడు.
|
|
సీ. |
అశ్వంబునకు పరమాయుఃప్రమాణంబు
వదలు ముప్పదిరెండు వత్సరములు
పరమాయు వందులో పదియవభాగంబు
తనరారు నొకదశ యనఁగఁ బరగు
|
|
|
[1]మూడేళ్ళు రెణ్ణళ్ళు మున్నాల్గు దివసంబు
లొకదశ గలదియై యొనరుచుండు
నత్తెరంగున దశ లైదైదు చెలువొందు
పన్ని యాక్షేత్రముల్ పదిలమైన
క్షేతమహిమంబుతోడ నాక్షేత్రములను
భావలక్షణంబులభాగ మెరిగి
జెప్పగాదగు తత్ఫల మొప్పగాద
రాజదేవేంద్ర యౌభళ రాజకంప.
| 3
|
|
హయములకు ముప్పదిరెండుసంవత్సరములు పరమాయువు. ఈ సంవత్సరముల యాయుఃప్రమాణమును 10 భాగములుగా చేసిన యొక్కొక భాగమునకు దశయని పేరు. దశాపరిణామము మూడుసంవత్సరముల రెండుమాసముల 12 దివములు.
|
|
వ. |
అట్టిదశాక్షేతభాగం బెట్టిదనిన ప్రపానాధిఫాలాంతంబు క్షేత్రం
బై జెల్లు నిగళస్తుత్యదాద్యుత్తమాంగంబులు రెండవక్షేత్రం బనం
బడు, వన్యగళస్కంధంబులు మూడవక్షేత్రం బనంబడు కడు దం
దకాకజతర్వక్షోభాగంబులు చతుర్థక్షేత్రం బై నెగడు బాహు
క్రోడంబులు పంచమక్షేత్రం బనంబరగు ఊరుబాహుకస్యక్సిండ
రాహిణసూలలు నవమక్షేత్రం బై వర్తిల్లు హృదయము పక్షపార్శ్య
ములు షష్ఠక్షేత్రం బనంబరకు ఊరు ఖరాంతంబుగా జంఘచతు
ష్టయంబులు దశమక్షేత్రం బనంబరగు అట్టి క్షేత్రంబులు కడపల
యట్లుగాగ గోడిగలమేన నిరీక్షింపునెడ దశమక్షేత్రంబు నాదిగా
నాదిక్షేత్రంబ దశమంబుగా నవసరోహక్రమంబున నెన్నదగును.
క్రమమున దశాక్షేత్రంబుల తెరం గెఱింగించెద.
| 4
|
క. |
అరుణాంభోరుహపత్ర
స్ఫురణ దురంగంబు జిహ్వ పొల్పుగ జిహ్వాం
తరమున దాలు స్థానము
సురుచిరముగ జహ్వ కాద సూనము తెలియన్.
| 5
|
క. |
పరుపడి వ్యంజనదంతము
నిరుణుగు మరియు నాలు గెసగగ దంష్ట్రాం
కురములు నాలుహనుజులు
నిరువదియును నాల్గు హరికి గంపనృపా.
| 6
|
సీ. |
..............................
| 7
|
చ. |
కనుగొని ప్రోధలోచనయుగంబుల మధ్యను భూమి ఘ్రోణముం
యెనుభయపార్శ్వదేశముల వర్తిలు గత్తియుగంబు దానిపై
యనువగు క్షీరికాయుగళ మారసిచూడ దురంగజాతికిన్
దనరిన నాసికాహనుపదంబుల సంధుల గండపాలికన్.
| 8
|
క. |
పలువరుసకు గప్పి పని
సలకడ నోష్టముల రెండు నవిగూడి సం
దులు సుక్స్రువమునగు (రెండు) తే
జుల కధరోష్టములక్రింద చుచికం బధిపా.
| 9
|
గీ. |
గండఘోతాంతరము సువ్వె మండలంబు
అశ్వపాదంబు లరయగ నశ్వములకు
కన్నులప్పారు దానిపై కార్తి మీరి
మహితవిభవేంద్ర కంప మారచంద్ర.
| 10
|
సీ. |
హరునకు నక్షిపక్ష్మావృతం బాశుక్ల
మండలం బాశుక్లమండలంబు
మధ్యంబునకు కృష్ణమండలం బాకృష్ణ
మండలంబులకును మధ్యదృష్టి
|
|
|
మండలం బావృష్టిమధ్యంబు నిర్ధంబు
......................................
అకనీ నికముల యాతభాగంబుల
భాగంబులను గండ మతిశయిల్లు
నేత్రయుగళిమీది నేత్రకూటంబులు
పొసగు దానిమీది భ్రూయుగంబు
భ్రూస్తవాంతములను పొలుపొందు ఫాలంబు
దానిపై స్థువంబు ధరణినాథ
|
|
గీ. |
స్తుపపదంబుమీద సురుచిరమగుచుండు
శిరము దానివడల జెవులు జెవుల
వెనుగపదయుగంటు విలసిల్లు శిరములు
ఖటము లబ్జనయన ఘనముగాను.
| 12
|
క. |
రూపైకటనయనాంతస
మీపంబున శంఖయగము మీకాశినిలుగా
నేపాదు శంఖకటముల
సైపరిఘోటంబు లమరు బర్బరబాహా.
| 13
|
గీ. |
ఘోటగండస్థలములను గదిసి నెలయు
బాహ్యభాగంబు హనువులై పరగుచుండు
కంఠహనువులసంధిని గళము వెలయు.
| 14
|
|
గళవక్షంబులనడుమను
పొలుపగు కంఠంబు కంఠమూలమునకు వా
జులువారు బాహులు మధ్యను
వలవదు క్రోడంబుక్రింద బాహువు లమరున్.
| 15
|
సీ. |
బాహులవెలుపల పరుగు జాంగలములు
జాంగ లలము క్రింద జాను లుండు
|
|
|
కిదాములు వెలుపల క్రిందబొత్రికములు
మసలు జానువుల మందరముల
జానులకిందట జంఘల జంఘల
వెలుపటిదెసలందు వెలయు గములు
జంఘలక్రిందుమార్చంబులకును మీదు
పడినాస్త మొనరు తత్పరిసరమును
బనరు గూర్చంబు తన్మధ్యమున గిరాంబు
పొలుచు గీర్చంబుకిందట చుష్టికంబు
దానికిందట ఖరసంధి దానిక్రింద
శిరము తరువాత నఖశిఖ నరవరేణ్య.
| 16
|
క. |
ఖరతలమున నిమ్మదె శ
క్షరమై మందూకి వేయు సక్షీకరమె
ఖరులు వెలుపల పార్శ్వము
కర మొప్పగ కంపభూప కాంతామదనా.
| 17
|
మ. |
కరమూలంబుల పృష్టపార్శ్వముల గక్షస్తానముల్ పొల్చు ద
త్కరమధ్యంబున గ్రోడపీఠ మమరున్ తత్క్రోడవీరోదరాం
తరమధ్యంబున హృత్తంబు వెలయుం తన్నాభిమధ్యంబునన్
గర మొప్ప జధరంబు ప్రక్కలను జక్కాన్నాభిమధ్యంబునన్.
| 18
|
క. |
ఉదరం బిరుపక్కియలన్
బదపడు గోష్టములు మధ్యభాగస్థనుపై
ఉదరత నాభీమధ్యం
సదమై రోమాని వెలయు సాళువకంపా.
| 19
|
క. |
కరమూలంబుల వెనుకం
గర మరుదుగ పార్శ్వయుగము గ్రమమున కుక్షి
|
|
|
స్ఫురణమగు క్షేత్రమూలము
తిరమగుచుం గాన కుధరంబు తేజుల కమరున్.
| 20
|
ఉ. |
తిన్నని కుక్షిమూలమున తేజులరంధ్రయుగంబుక్రిందటన్
బన్ననిరీతి నుండు నుపరంధ్రములందు తురంగజాతికిన్
పన్నుగ కంఠపార్శ్యముల పైకొని వన్నెలు నిల్పుచుండగా
సన్నుతి జాళుకీతిలక సాళువకంప నృసాలమన్మథా!
| 21
|
మ. |
హరిరత్నంబయి సముత్తమాంగభుజమధ్యస్థానసంప్రాప్తమై
కర మొప్పారును గ్రీవగ్రీవమునకు పై కంఠంబు కంఠంబుపై
సరిగేశాళి శిరంబు సంధి వెనుకన్ జెన్నొంద కేశాంతముల్
సరసోదార కుమారకంపనృపతీ చాళుక్యచూడామణీ!
| 22
|
క. |
కేశాంతస్థలముల య
ఖాస్యంబగు వనాపదంబు లావహయుగళీ
దేశము గదీయ గప్పని
దేశముపై గాకసంబు తెలియును హరికిన్.
| 23
|
క. |
పరువడి గాకసముకు పై
బరగున్ కకుదంబు తన్నిబంధము వైలో
సరి నొప్పు హంసఫలకలు
అరుదుగ హంసముల వెలికి ననుపుగ నుండున్.
| 24
|
చ. |
హరి కకుదప్రదేశమున నంతరమానము మానసస్థలిన్
పరిసరవర్తి పృష్టతలబంధుర పృష్టతలంబుచెంతనుం
బరిగు తికస్తలం బత్రిక పార్శ్వమునం జఘనంబు బొల్పుగా
నరసుతకీర్తిదౌభ సుగుణాధిప కంపకుమారమన్మథా.
| 25
|
క. |
పదపడి పుచ్ఛచ్ఛన్నము
గుదదేశము నుండు నడుము గుదమధ్యమునన్
|
|
|
గదిసిన శేఫశి వాజికి
పదపడియు న్నుభయపార్శ్వబాసట యుండున్.
|
|
సీ. |
పాసలంబుకు క్రింద భాసిల్లు రోహిణి
సంధుల గుదము పార్శ్వములయందు
సృక్సిందయుగళంబు చెలువొందు నూరువుల్
వానితో నడ్డము వానిమ్రోల
తగమోహమున గండపార్శ్వంబు లూరువు
ల్వక్కకుక్తులు నిల్చు వానిమీద
నెదరి వక్రకుక్తుల నిజమధ్య హరికిని
రెండుపాతంబులై యుండుకొలది
స్థూల మొప్పారు వక్త్రమౌ శుక్తులకును
వానికి్రిందటను దిరద్వయము వెలయు
నాది వినినట్లు ముందరిపాదములకు
రాజనుదారనౌభళ రాజకంప.
| 27
|
ప్రవాలలక్షణము
క. |
కరమూలకకుడములకును
ఖరకుప్పిక జానుదేశకూర్పంబులకున్
పరిమితిమారంగుళములు
పరికింపగ గంపభూప బంధునిధానా.
| 28
|
క. |
కాలవని గళస్తముల
పొడవును యంగళము మొగి దంష్ట్రములన్
చెలువుగ జూడగ నొప్పును
తలపంగా నృపసమూహ ధరణీనాథా.
| 29
|
చ. |
విసవిసనైన తాలుదళవీథియు నాలుగయు న్హయంచు కున్
బొసగిన యంగుళంబులని ముప్పదిరెండు గడంగ
|
|
|
లసనగు... వర్తిపదము పాటినట్టివై
మసలు గరారి సాళువసమంచిత గంప నృపాలధీమణీ.
| 30
|
క. |
పరువడి ప్రప్పపానపద్రము
కరుణాంబుదు కక్షలంబు కటశంఖములన్
తురగములకు పరిమాణము
లరదు న్రెండంగుళంబు లాహవభీమా.
| 31
|
చ. |
పటువగులోచనంబులును పద్మదళంబులు సృక్సునాసికా
పుటములు నశ్వపాతములు ప్రోధగుదంబు కకూదరంబునన్
చ్చటనగు సంఖ్య యనంబడు నశ్వజాతికిన్
భటభుజవక్త్రనక్తు నమితంబులు జూడ బదారునై చనున్.
| 32
|
సీ. |
పదహస్తయుగనాభి పాయూపయోష్ఠంబు
చతురంగుళంబులు సప్తులకును
వ్యంబనదంతముల్ నారంగుళోన్నతు
లట్టహాసవ్యంబు లశ్వములకు
ద్వాదశాంగుళంబులు దనరారుహృదయంబు
కుక్షదేశం బిట్లు ఘోటములకు
పోలంగ నిరువదియారంగుళంబులు
జత్రుదేశం బొప్పు సైంధవముకు
తనరరంధ్రోపరంధ్రము లెనిమిదంగు
ళములు పంచాంగుళంబులు నిలుచు నూరు
నేబదంగుళము లగుచు సొబగు మీరు
ఘనతరాధిపదాళుక్య కంపభూప.
| 33
|
సీ. |
అణుప్రమాణంబున యంగుళత్రయమును
వనర నట్లే కాడె హృదయవీథి
|
|
|
అమరంగ తద్దేశమంగళంబులు రెండు
నోష్టలోచనములు యొనరునట్లు
ఆననంబగు ముప్పదంగుళములు యుండు....
| 34
|
|
పద్యము పూర్తిగా లభింపలేదు.
|
|
చ. |
కడగి ఖురాగ్ర మాదిగను కాకసదేశముదాక గొల్వగా
పొడవు శతాంగుళంబునయి పొల్బుగ నుత్తరుమైన సప్తికిన్
నడుమున జూప మధ్యమగు వాజికి దొంబదియంగుళంబు లై
యదయగ నీచయశ్వమున కంగుళసంఖ్య యెనంబదై చనున్.
| 35
|
చ. |
హరులప్రపానపాళి మొదలై తగువర్తిక గాక చూడ నూ
రిరువదియంగళంబు లగు నెక్కడ మధ్యము నంతకంటె ని
........................................................................ ని
ట్లరువదియంగుళంబు లగు నయ్యది శ్రేష్టము కంపభూవరా.
| 36
|
క. |
పొడవునకు తగిన నిడుపును
నిడుపునకున్ దగినవలము నేడది గూడం
గడునొప్పు లక్షణంబులు
యడరినయది యశ్వరత్న మది గంపనృపా
| 37
|
క. |
వదనంబునకును వర్తిక
సదృశమై యుండవలయు జఘనంబున కొ
ప్పిదమై వరపుర కెనయౌ
పొదలగవలె హరికి గంపభూపాలమణీ.
| 38
|
వ. |
ఇంక వయోజ్ఞానం బెట్టిదనిన.
| 39
|
|
ప్రమాణలక్షణ మెఱిఁగించిన పిమ్మట వయఃపరిణామములు జెప్పెదను.
|
|
సీ. |
జన్మమాసంబున శనియుగమువడము
పొడమి రెండవనెల పూర్ణమగును
మధ్యమదంతయుగ్మంబు మూడవ నెల
పొడమి నాల్గవనెల పూర్ణమగును
పారిపక్షపుజోడు పరగ నేనవనెల
పొడమి నారవనెల పూర్ణమగును
తెలుపు వేడవనెల పొలుపారు క్రిందట
మొదలనుగా నెనిమిదవనెలయు
నవదశమాసములును దా పెదనిక్రింద
మీదిమద్యములు దెలుపు మీరినయిలు
బదునొకండును పండ్రెంట గోడిగలకు
బారిపక్షము లట్ల గుమారచంద్ర.
| 40
|
చ. |
క్రమమున నొక్కయేడున తురంగము శాలసమూహి కెల్ల దం
తములు సమస్తముల్ ధవళతామహిమం దనరారుచుండగా
నమరు గషాయవర్ణమున రెండవయేట... న
త్యమలయశోవిభూషిత సమస్తదిగంతరకంపభూవరా.
| 41
|
|
తురంగశాబకమునకు యొకయేడు నిండునంతకు దంతంబులన్నియును దోచుటయెగాక యవి తెల్లనైయుండు రెండువత్సరముల కయ్యవి కషాపురంగు గలిగియుండును.
|
|
క. |
మూడవేటను వద్దశనములు చతుర్ధ
హాయనంబున మధ్యదంతాంకురములు
పంచమాబ్దంబునను బారి పక్షయుగము
సొరిదిబడి వచ్చుపిల్లల కరనె యధిప.
| 42
|
|
మూడవయేటను దశనంబులును, నాలవవత్సరమధ్యంబున మధ్యదంతములును అయిదవయేట పారిపక్షములును దోచు.
|
|
క. |
పదపడియదశయందున
రదనంబులు నాలుగేండ్లు ప్రథమం బదిగా
గదియును వ్యంజనము తొ
మ్మిదియును మూడేసియేళ్ళు నిది యొక్కొకటై.
| 43
|
|
పండ్లు తోచినవత్సరము గానక మరివాలుగువత్సరము గడచినపిమ్మట వ్యంజనములు ప్రారంభమగును. ఒక్కొక వ్యంజనము మూడేండ్ల చొప్పున తొమ్మిది నడచును.
|
|
వ. |
అది యెట్లనిన కృష్ణవ్యఃంజనంబును మక్షికావ్యంజనంబును శంఖవ్యంజనంబు నులూఖలవ్యంజనంబును చలనవ్యంజనంబును పతనవ్యంజనంబును... ననం దొమ్మిది దెరంగులై యుండు, తరంగమ వయోజ్ఞానకారణంబులై యొప్ప తద్వ్యంజనంబులు వేరవేర వివరించి చెప్పెద.
| 44
|
|
1 కృష్ణవ్యంజనము 2 మక్షికావ్యంజనము 3 శంఖవ్యంజనము 4 ఉలూఖలవ్యంజనము 5 చలనవ్యంజనము 6 పతనవ్యంజనము అని తొమ్మిదివ్యంజనము లుండును. ఒక్కొకటి మూడేండ్లు నడచును.
నవవ్యంజనంబులును జెప్పి యొక్కవ్యంజనరూపంబును వేరువేర నిరూపింతునని జెప్పుచున్నాడు.
|
|
క. |
తనభాయంకృష్ణవ్యం
జన యారవయేట బుట్టు పెద్దశనయుగం
బున నేడవమధ్యంబున
మొనయు హరిపోరిపక్షముల నెనిమిదియున్.
| 45
|
కృష్ణవ్యంజననిరూపణము
గీ. |
అశ్వరత్నంబు మునుపళ్ళు హయము నడిమి
పళ్ళతురంగముకడ పతిపళ్ళకడను
క్రమముతో నవమాదివర్షములమూట
హరిణి విలసిల్లు రాయచోహత్తిమల్ల.
| 46
|
హరిణవ్యంజనము
శా. |
సద్వంశాదిమమద్యదంతములు కా చచ్ఛాయవక్షంబులున్
చందంబొంద వయఃపదీర సదృశద్ఛాయాసమోపేతమై
పొందుం ద్వాదశవత్సరంబు మొదలై! పోలంగ శుక్లాభిదం
జెందుం మూడు సమంబులై వరుసతో నైకాకుమారగ్రణీ.
| 47
|
శుక్లాభిదవ్యంజనము
చ. |
ఆదిమధ్యావసానదంతాంకురములు
కదళికాద్రూపమై తగ కాచ మెరయ
పంచదశ మొదలును షోడశాబ్జములను
దశనలాంఛనములు గంప ధరణినాథ.
| 48
|
ఉత్సాహ. |
మక్షికాభిధాన మరయ మక్షికాసమానకాం
త్యక్షయంబు శంఖసదృశ మగుచు మెరయు శం
వైలక్షణమున నలూఖలంబు పరగుబళ్లువృత్త
వైలక్షణములు చలనపతనలక్షణంబులట్లగున్.
| 49
|
మక్షికవ్యంజనము - నులూఖలవ్యంజనము
శా. |
పుష్పంబై మహిసత్వసంపదగడున్ బొల్పారి తేజోగుణో
త్కృష్టం బై కడుదూరభారవహమై దీపించు కృష్ణచ్ఛదా
దష్టాభంబుల రూపసంపద కడున్ బొల్పారుచుండున్ మహా
స్పష్టంబైన తురంగమంబు హరిణాంతస్వారంబు కంపాధిపా.
| 50
|
గీ. |
పొదపొద మూడేళ్ళును నిడు
పొదను నాలవయేట... నెమ్మెకటన్
గడు వయిదవేట దృఢమగు
గడుకొని వారిబలములను గంపకుమారా.
| 51
|
వ. |
వర్ణలక్షణంబుల జెప్పుచున్నాడు.
| 52
|
|
వివిధవర్ణముల లక్షణముల దెలుపుచున్నాడు.
|
|
|
ఈ పద్యము నశించినది. రెండుమూడుమాతృకలలో లేదు. ఉన్నదానిలో తప్పులు మిక్కుటముగా నుండుటచేతను అక్షరము లధికముగా లోపించుటచేతను విడువబడినది.
| 53
|
క. |
అచ్చపుదెలుపును నలుపును
బచ్చయు గడువొప్పుననుచు బాధింపంగా
నచ్చుపడ నాల్గుదెగలై
యిచ్చలుమనసుధ వర్ణ మెసగును హరికిన్.
| 54
|
గీ. |
బహ్మమున యక్షశమనవైశ్రవణశక్ర
సత్వమువలన శుద్ధసత్వములగు
సత్వులకు బరికింపగా సౌఖ్యదములు
రాజవాహిడములు నాభళి రాజకంప.
| 56
|
క. |
కామక్రోధంబులచే
పామరుల దగులమడక నూడరిదగ ను
ద్దామసుఖంబు లనుచు నభి
రామంబులు నిజము సత్వరాజోత్తంసా.
| 57
|
|
శుద్ధసత్వముల నిరూపించుచున్నాడు.
|
|
క. |
మదమోహద్వేషాదుల
మదిలో నూహింపనీక మహనీయగుణో
స్పదమై రుచిమైయుండెడి
యది దామునిసత్వమైన హరికంపనృపా.
| 58
|
గీ. |
సంతతమన్మథకేతా
చింతాకృతచిత్తవృత్తిచే వెలయుచు న
|
|
|
త్యంతప్రసాదలక్ష్మీ
కాంతకు తన కెపుడు సత్వగంధర్వ మిలన్.
| 59
|
క. |
నిరుపమతేజోవిభవా
దరమున గడఁగొప్పు మీరు గంధర్వము దా
పరికింప నింద్రసత్వము
ధరణీరమణీయబాహు ధరణివరాహా.
| 60
|
గీ. |
మథితరాగమోహమాయాప్రసంగమై
కొరలు యామ్యసత్వఘోటకంబు
నాటపాటలచేత వద్వరముల మెచ్చు
యక్షసత్వమైన యశ్వ మధిప.
| 61
|
వ. |
ఈయారును సుద్ధసత్వములు. ఇక మధ్యమంబుల జెప్పెద.
| 62
|
|
పైన చెప్పిన యూరును సుద్ధసత్వములు. ముందు మధ్యముల చెప్పును.
|
|
గీ. |
అసురపైశాచిప్రేతరాక్షసభుజంగ
పక్షిసత్వములనదగు భావములను
ప్రబలనిస్వనములవారు రాజసమున
మధ్యమంబులు ననగ సన్నుతికి నెక్కె.
| 63
|
సీ. |
సతతకోపంబును శౌర్యగుణంబులు
వదలు సత్వంబు దైతేయనాజి
నశుచిత్వభీతియు నాహారశక్తియు
చెన్నొందు పైశాచసత్వహయము
బహ్వాశయును దస్వభారభావితయును
సత్వహీనయు జిత్వ సత్వసత్తి
నిద్రాశువును చూడ నెరిదిండిపోతును
క్షణసత్వనామంబు సైంధవంబు
|
|
|
సంతతాశనమైథునచాపలంబు
... శాకుంతసత్యతరంగమంబు
చాపలంబును దోషంబుసాధ్వసవము
గలఫణిసత్వవాహంబు కంపనృపతి.
| 64
|
చ. |
అలసట భీతి జాడ్యమును నాకటిపెల్లును మీదిలావునున్
నలవడుచున్న వాహములు వాసనసత్వము లెల్లవేళలన్
జలములమీద వేడ్కగల సైంధవరత్నము తుత్స్యసత్వవై
యలజడి నిద్ర మానని హయంబులు బువ్వెలి శుద్ధసత్వముల్.
| 65
|
|
ఛాయాలక్షణముల తెరం గెఱింగించుచున్నాడు.
|
|
ఆ. |
అసనంబునడుమ నంబుజభాంధవు
గదిసి మేఘరాజి గప్పినట్లు
సప్తిమేననున్న సకలలక్షణములు
ఛాయ గప్పు ననిరి సాళువారిక.
| 67
|
ఆ. |
పార్థిని యన బరగు...............
వారణమనగ మది నాయుననగ
.....................వైదు చెరంగుల
వేరువేరువిధుల విస్తరింతు.
| 68
|
|
పాదభాగములు నశించినవి. అర్ధము ద్యోతకమగుట లేదు.
|
|
మ. |
వివిధంబైన విశేషవర్ణములచే విఖ్యాకమై కోమల
త్వవిభాతిం దనరారుకన్నులకు నుత్సాహంబు సంధింప రూ
పవిశేషంబు వహించి నిశ్చలగతి భూవ్యక్తమై యొప్పు
పార్థినకచ్ఛాయహయంబులు మేలు జయశ్రీ దానాంశకంపాధిపా.
| 69
|
ఉ. |
తోయజమిత్ర నూత్నరుచితో దులతూగు పద్మరాగర
త్నాయితగాంతితో గలయ నాడియలంతుకడినోప్పు గాం
|
|
|
గేయపుకన్నె నవ్వి కడుగెంపు వహించి వెలుంగు చూడనా
గేయవిశిష్టమై హరికి గీర్తివధూవర గంపభూవరా.
| 70
|
ఉ. |
సారపునీలమేఘములు చాయలచాయల బోవనాడి యం
భోరుహకోమలద్యుతికి బొమ్మలు పెట్టి ప్రసనన్నమైనకూ
రూరుచిరప్రభావముల బోరజయించి మనోహరాకృతిం
వారణ యొప్ప మీరునది వాజులకెల్ల కుమారమన్మథా.
| 71
|
క. |
ఈయెడ చపలత్వమునను
బాయక వర్షిల్లు పరుషభావమునైజం
బైయండు ఘోటకమునకు
రాయడి గడునింద్య మగుచు దగ కీర్తినిధీ.
| 72
|
క. |
నాభళి యల్పంబై గగ
నాచ్ఛాయ సనాథయైన చంచత్కలనా
వైభవము చొప్పుగలయది
యబ్భంగి తురంగములకు నాయం బరయన్.
| 73
|
క. |
రేపును పడమటిజామున
నేపున నుదరమున దృప్తి మెయినను వేళం
రూపుగ మెయిగరచిన హరి
యాపోవగ జాయజూడ నగు కంపనృపా.
| 74
|
ఆ. |
చక్కగాకనున్న సౌష్టంబుగలరీతి
వక్రమైనమొగ్గ వడలకున్న
నాలవిషయమైన వదలక సంకీర్ణ
గతుల కీను హరికి గంపభూప.
| 75
|
చ. |
శరభమురీతి పెద్దపులి చాడ్పున గోవృషభంబుజాతి గే
శరివలె రాజహంస వరుసంగతి నుష్ట్రమురీతి మత్తకుం
|
|
|
జరమున భాతి వానరము జూడ మయూరములాగునన్ మనో
హరగతి నొప్పుతేజి విజయప్రదమౌ భళ కంపభూవరా.
| 76
|
|
శరభమువలెను పెద్దపులివలెను ఆవు యెద్దు సింహమువలెను రాజహంసవలెను ఒంటెవలెను ఏనుగవలెనురు కోతివలెను నెమలివలెను మనోహరరూపము కలదైయుండు గుర్రము విజయప్రదము.
|
|
ఉ. |
ఆననభాగమందు నయనాబ్జయుగంబున నాసికంబునన్
వీనుల మేనిపై జెమట నీళ్బును మూత్రపురీషజాతియన్
రేనియనాఖ్య దుగ్ధకమదేభమదాంబితపుష్పగంధముల్
పూనినదానిసౌఖ్య మగు భూస్థలి నౌభళ కంపభూవరా.
| 77
|
|
ముఖంబునను నేత్రములయందును ముక్కునను వీనులందునను శరీరమునందునను పుట్టిన చెమటనీళ్ళును.
|
|
ఆ. |
మత్స్యమథకకూర్మి మానుగశలభోరు
ఖరవరాహశునకగంధమైన
హరులు చుట్టలు... యసయంగ నౌభళి
ప్రభునితనయ కంపరాజతిలక.
| 78
|
|
మూడవపాదంబున గొంతభాగమున సమునర్ధస్ఫురింపజేయు క్రియాపదము పోవుటచే యర్ధము దోచదు
|
|
శా. |
వేణుక్రౌంచ మృదంగదుంధిభిలసద్వేవేంద్రనాగోల్లస
ద్వీణావారిదమంజునాదములకుం బ్రియ్యంబులై యొప్ప
నిక్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిన్ కళ్యాణముల్ క్పరనా
క్షోణీపాలక సుప్రతాపశుభముల్ స్తోత్త్రైకపాత్రంబులన్.
| 79
|
|
వేణువు క్రౌంచము మృదంగము దుందుభి స్వర్గలోకసంబంధితమైన వీణ మేఘము మున్నగువానియొక్క సుశబ్దముల ననుకర్ణించురవముగల తురంగము యజమానునకు సకలకల్యాణముల నొసంగును.
|
|
ఆ. |
..........................................
........................................
జూడ నూరపంది జాతిని నుష్ట్రంబు
కరణి రవము సేయ కాంతి చెరుచు.
| 80
|
|
నశించినది. ఊరపందివలెను ఉష్ట్రము (ఒంటె) వలెను ధ్వనిచేయుగుర్రము యజమానిని ప్రతిభ జెరుచును.
|
|
చ. |
ఉడుగక కర్తకుం మిగుల నొప్ప విడెంబు తురంగమంబు బొ
ల్లెడ తెగియున్న ప్రోవుకడ కెక్కకయుండిన మోణ కడ్డమై
విడువకయున్న కొర్రెవలె ప్రక్కన యన్నిక జంపుభావనా
పొడమిన భావశృంఖలల వోలినచిత్రపురూపు దాల్చినన్.
| 81
|
మ. |
చెలువంబై యలశంఖుచక్రకలశశ్రీవక్షఖండేందుఖ
డ్గలతాష్టాపదవేదికాంకుశపతాకావజ్రకూర్నీగదా
కలితాదర్పణతారనీరజశుభాకారంబులై యొప్పువా
జి లతాస్థలినున్న బొల్లు పతికిన్ చేకూర్చు నిష్టార్థముల్.
| 82
|
క. |
స్వస్తరుణీవిలసనస
త్కస్తూరీవల్లికా వికాసగ్రధిత
ప్రస్తారనూత్నస్తబక
గ్రస్త్రాహితవీరయోధ ఘంటానాథా.
| 83
|
క. |
త్యంకారపూర్ణనిష్టుర
హుంకారవిదారితోధి దోర్వీర్యధను
ష్టంకారనిజశత్రుకులా
లంకృతపదపీఠ యోభళప్రభేతనయా.
| 84
|