అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి


   మేచబౌళి రాగం    త్రిపుట తాళం


ప: అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి || అయ్యయ్యో ||

అ.ప: వెయ్యారు జన్మాల వెత జెందితిగాని

చెయ్యన సద్గతి సాధింప లేనైతి || అయ్యయ్యో ||


చ 1: మోస మేమని తలచియుండు దోస

వాసనల తగిలి తేమందు ఆశా

పాశములను అరసి బ్రోచి ముందు

వాసిగ వైరాగ్య వాసన గననైతి || అయ్యయ్యో ||


చ 2: మూడు మేలని నమ్మియుంటి నిరు

మూడు శత్రుల కూడియుంటి మాటికి

రెంటి మార్చి శత్రు మూటికెక్కువైన

కూటస్థు పొగడ నేనుకూడ లేనయితి || అయ్యయ్యో ||


చ 3: వదలించి బంధముల విడజేసిన భద్ర

గిరి రాఘవులతో నేను కలసి

సదయుడవై గని శ్రీరామదాసుని

స్థిరముగ పోషించుడని వేడనైతి || అయ్యయ్యో ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.