అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా


            అసావేరి రాగం            ఆది తాళం

ప: అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా అ.. || అబ్బబ్బ ||


చ1: మేలుచేయుదు నంటిగదరా మేలుచేసితినేమి భయమంటి గదరా

వరహాలు మొహరీలు జమజేస్తిగదరా నీ పరిచారకులకు నే పెట్టితిగదరా || అబ్బబ్బ ||


చ2: పరులకొక్కరువ్వ యీయలేదుగదరా ఓ పరమాత్మ నీ పాదముల్‌ నమ్మితిరా

కొరడాలు తీసుక గొట్టిరిగదరా హరనుత గోవింద హరితాళలేరా|| అబ్బబ్బ ||


చ3: అంతటిలో నిన్ను నెరనమ్మినారా శరణాగత గోవింద హరితాళలేరా

శరధిబంధించిన శౌర్యమెక్కడరా రాక్షససంహార రక్షింపరారా || అబ్బబ్బ ||


చ4: రామ భద్రాద్రిసీతారామ రామా నీనామమెప్పుడు భజియించితిగదరా

రామదాసుని నిటుల చేయించితేరా అ..|| అబ్బబ్బ ||


This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.