అబ్బబ్బా రామనామం అత్యద్భుతము


            ధన్యాసి - చాపు రాగం            ఆది తాళం

ప: అబ్బబ్బా రామనామం అత్యద్భుతము

గొబ్బున నే భాగ్యశాలికబ్బునో రామనామమది అ..|| అబ్బబ్బా ||


చ1: సారములేని సంసారసాగరమీదే రామనామం

పారదోలు మున్నూటరువది భవరోగములన్నీ అ..|| అబ్బబ్బా ||


చ2: చేరి పంచేంద్రియములన్ని చేరనియ్యదు రామనామం

ఘోరమైన యమదూతలకొట్టెడిది రామనామం అ..|| అబ్బబ్బా ||


చ3: దినదినము జిహ్వకింపై దీయగనుండు రామనామం

ధనకనక వస్తువులు దయచేయు రామనామం అ..|| అబ్బబ్బా ||


చ4: ముక్కంటిసతికి శాశ్వతకీర్తినిచ్చే రామనామం

ఎక్కువై వాల్మీకిఋషికి యెప్పుడనుష్ఠాననామం అ..|| అబ్బబ్బా ||


చ5: కామక్రోధలోభ మోహగర్వంబణచు రామనామం

స్వామి భద్రగిరీశుని సద్గతి శ్రీరామనామం అ..|| అబ్బబ్బా ||


చ6: నీమముతో బిలిచినను నిత్యమోక్ష పదవినామం

రామదాసునేలిన శ్రీరామచంద్రునినామం అ..|| అబ్బబ్బా ||


This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.