అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
అసావేరి రాగం ఆది తాళం
ప: అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
జబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా || అబ్బబ్బా ||
చ1: అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో
కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య|| అబ్బబ్బా ||
చ2: రట్టుతీర్చీవేళ గట్టిగా నీవునను
జెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ || అబ్బబ్బా ||
చ3: శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాద
శరధిబంధించిన శౌర్యమేమాయెరా || అబ్బబ్బా ||
చ4: పరంధామ నీ పాదములాన వినరా
పరులకొక్క కాసు నే నివ్వలేదురా || అబ్బబ్బా ||
చ5: భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడు
ప్రేమతో భజియించు రామదాసునేలు || అబ్బబ్బా ||
This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.