అన్నమాచార్య చరిత్రము/గ్రంథ పాతము
వేద్యంబులగు వేద వేదాంతముఖ్య-
విద్యల నధికులై వెలసియుండుదురు
తెల్లంబుగా దేహదేహిభావమున-
నెల్లవస్తువులును నీవెకాఁ దలఁచి
పరచింత లుడిగి నాపైనె విన్యస్త-
భరుఁడవై యుండు శుభంబులన్నియును-
ననఘాత్మ ! నినుఁ జెందునని వరంబిచ్చి
జనని వాక్యముఁ ద్రోయఁజనదు కుమార !
పోయి రమ్మనిన నప్పుడు మేలుకాంచి
యా యచ్యుతునిఁ గొనియాడి మ్రొక్కుచును
జననియు దాను నిచ్చలుఁ దొంటిపురికిఁ
జనుదెంచి నిజనివాసముఁ బ్రవేశించె ; -