అధిక్షేపశతకములు/గువ్వలచెన్నశతకము-పీఠిక

గువ్వలచెన్న శతకము

వేమన చౌడప్ప శతకముల ధోరణిలో రచింపబడిన శతకము లందు గువ్వల చెన్న శతక మొకటి. ఈ శతక కర్తృత్వము వివాదాస్పదముగ నున్నది. క్రీ.శ. 1828 నాటికి తమకు లభించిన ఆధారము - ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రకటితమైన వ్యాసము - ననుసరించి వంగూరి సుబ్బారావు గారు వజ్రపంజర మరున్నందన - గువ్వల చెన్న శతకములను పట్టాభిరామ కవి కృతములుగ నూహించిరి. పదునేడవ శతాబ్దినాటి అప్పకవి వజ్రపంజర శతక పద్యమును లక్ష్యముగా నుదాహరించినందున పట్టాభిరామకవి అంతకు ముందె అనగా 1800 ప్రాంతమున జీవించియుండునని సుబ్బారావుగారు భావించిరి. కాకినాడ గ్రంథాలయము పారు ఈ శతక ప్రతిని సంపూర్ణముగ ప్రకటీంప నున్నట్లు సుబ్బారావుగారు అప్పటికే వినియుండిరి. వారు శతక కవుల చరిత్రలో చాటుపద్య మణిమంజరి చాటుపద్య రత్నాకరము లందుదాహృతములైన పదునాలుగు పద్యములను మాత్రమే బరిశీలించిరి.

శతక కర్తృత్వము, కవి కాలము అను అకమును గూర్చి వంగూ3 సుబా రావు గారి అభిప్రాయము పునఃపరిశీలనార్హము. గువ్వల చెన్న శతకము పట్టాభిరామ కృతమనుటకు స్పష్టమైన ఆధారములు లేవు. శతక నామము ననుసరించి మాత్రము గువ్వల చెన్నడు ఈ శతకమును రచించినట్లు లేదా అతని పేర రచింపబడినట్లు భావించవచ్చును. ఆత్మసంబుద్ధిపరముగ వేమన ననుసరించి, ఈ కవి శతకమును రచించియుండును. గువ్వల చెన్నని ప్రసక్తి శతకమునందొకటి రెండు సండర్భములందు ప్రస్తావింపబడినది. శతక పద్యము లందు పాశ్చాత్య సంస్కృతి తత్ర్పభావము తెలుగువారి పై ముద్రవేసిన అంశము బహుళముగ గలదు ఈ ఆదారము ననుసరించి గువ్వల చెన్న శతకము పచునెన్మిడవ శతాబ్దినాటి దని భావించుట కవకాశము కలదు. ఆత్మసంబుద్ధి పరముగ వ్రాసినచో గువ్వల చెన్నడే ఈ శతకకర్త అనుట కేట్టి సందేహము లేదు. గువ్వల చెన్నని కులమును గూర్చి ఆతనికి సంబంధించిన కథలనుగూర్చి కొందరు విపులముగా వ్రాసిరి. కాని ఆవి అన్నియు ఊహల పై అక్కడక్కడ ఆ నోట ఈ నోట ప్రచారముననున్న గాథల పై ఆధారపడినవి.

గువ్వల చెన్న శతక పద్యములు నూటికిమించి యున్నవి. వీనిలో కంద పద్యముల సంఖ్యయే ఆధికము. చాటుపద్య సంకలన గ్రంథములలో కొన్ని వృత్త పద్యములు కూడ ఉదాహృతములు. కందపద్యము లన్నిటియందు గువ్వల చెన్నా అను మకుటమే కలదు, ఒకదానిలో బిజనవేముల చెన్నా అని ఉన్నది. కొన్ని పద్యములకు పాఠాంతరములును కలవు. చౌడప్ప శతక పద్య పాదము లిందు కొన్ని చేరినవి. ఈ రెండును ఆత్మసంబుద్ధిపరమైన కంద పద్యశతకములు. వీనిలోని సామ్యము ననుసరించి జనుల వ్యవహారమున కొన్ని మార్పులు కూడ కలిగినవి. వీనిని కొంతవరకు పరిష్కరించి వావిళ్ళవారు 111 పద్యము లతో ఈ శతకమును ప్రకటించిరి. గువ్వలచెన్న శతకమున పద్యములు మరి కొన్ని కలవు. కొన్ని పాఠములుకూడ పరిష్కరించదగి యున్నవి,

చౌడప్ప వేమనల ససుకరించి గువ్వల చెన్న శతకకర్తకూడ సమకాలిక వ్యవస్థను సమీక్షించి రాజకీయ, మత, సాంఘిక, ఆచారవ్యవహార, ప్రకీర్ణాంగము లను గూర్చి నయమార్గమునను అధిక్షేపధోరణిలోసు తనకు తోచిన రీతిలో విమర్శించేను. కొన్ని పద్యములలో సామాన్య నీతులు, పూర్వ కవుల ధోరణిలో ప్రసిద్ధ నీతిశాస్త్రశోకానుసరణములుగ ఉపదేశాత్మక రీతిలో వచింపబడినవి. ఇండుసు కొన్ని నిజపరిశీలనకు వచ్చిన అంశములు చేర్చబడినవి. గొంగడి ప్రశస్తిని గోంగూర రుచిని చాటిన పద్యము లీ సంచర్భమున ప్రత్యేకముగ గమనింపదగినవి.

పాశ్చాత్య నాగరికత అప్పుడప్పుడే తెలుగుదేశముపై ముద్రవేసిన కొలమున చెల్లువడిన శతక మిది. మారిన వ్యవస్థను అస్తవ్యస్తమైన స్థితిగతులను పాశ్చాత్య నాగరికతా వ్యామోహము నొందిన మనః ప్రవృత్తులను, ఆచార వ్యవహారములను ఈ శతక కర్త నిశితముగ విమర్శించెను. తిలకము జుట్టు త్యజించి తెల్ల యిజారు టోపీ ధరించి శ్వేతముఖులుగా రాణించుటకు యత్నించిన ద్విజులను, కుక్కలను పెంచి ప్రక్కలనిడి ముద్దాడి అనుదినము సబ్బునీటిచే కడుగువారిని కవి నానావిధములుగ మందలించెను. పాశ్చాత్య నాగరికత పట్ల తెలుగువారికి కలిగిన వైముఖ్యమును వెల్లడించిన స్థితి యిది.

కులస్త్రీలు నృత్య నాట్య సంగీత విద్యలను కులవిద్యలుగా నభ్యసించుట-వకీళ్ళ దుర్వర్తనము-పాశ్చాత్య నాగరికతా వ్యామోహము కవిత్వము-మున్నగు వానిని వస్తువుగ స్వీకరించుటలో శతకకర్త కొత్తదనమును చూపెను, చౌడప్ప 'పస' గల అంశముల నన్నింటిని ఒకచో చేర్చి చెప్పినట్లు ఈ శతకకర్త వివిధ ధ్వనులను వాని ఆధార స్థానములను ధ్వన్యనుకరణ పదముల కన్వయించి విపులముగ వివరించెను. కసకస రుసధుస కరకర-పరపర-గుడగుడ-బుడబుడ-లొడలొడ మున్నగునవి ఇట్టివి. కవిత్వమునకు సంబంధించిన విద్యల పరిస్థితిని సమీక్షించి సరస్వతి చర్యలు కూడ చిత్రవిచిత్రగతిని సొగుచుండునని కొన్ని పద్యములలో చిత్రించెను.

సూక్తిప్రాయములైన నీతులు అధిక్షేప, అర్థాంతరన్యాస, అన్యాపదేశ దృష్టాంతరీతిలో సాగినవి. పందిరి మందిరమగునా? తల పరువు నోరె చెప్పును, చెలమైన మేలు కాదా కులనిధి యంబోధికన్న అన్న పద్యభాగము లిద్దవి. బూతు పదముల నుపయోగించుటలో ఈ కవి చౌడప్ప నసుకరించినట్లు తోచును. అఖీ లార్థ ద్యోతకములగు ఈ పద్యములందు హాస్య అధిక్షేప చమత్కృతి కనిపించును. ఇటువంటి పద్యములు రెండు మూడు మాత్రమే కలవు.

గువ్వలచెన్న శతకకర్త కందపద్య రచనగూర్చి తనకు గల సామర్థ్యము నెచటను ప్రస్తావించలేదు. అయినను కందపద్యపు నడక, శైలి, రచనా విధానము-సూక్తి విన్యాసము ఈ కవికి గల సామర్థ్యమును నిరూపించుచున్నది. వెలకాంత లేందరైనను -క లిమిగల లోభికన్నను-మున్నగు పద్యము లీ శక్తిని చాటుచున్నవి. సుపరిచితములైన నూత్నోపమానములు, నిశిత పరిశీలనాత్మక దృష్టితో కూడిన లోకజ్ఞత, మానవ మనస్తత్వ పరిశీలనాత్మక రీతులు భావ వ్యక్తీకరణకు భిగిని చేకూర్చినవి. సామాన్యమైన అంశములను సరసమైన ఉప మానములచే వ్యక్తీకరించుట యందు, గంభీరోదాత్త విశేషముల సలవోకగా సామాన్యరీతిలో వివరించుటయండు కవికి గల నేర్పు ప్రశంసార్హము.

గువ్వలచెన్నని లోకజ్ఞత బహుముఖముగ నున్నది, నీతిశాస్త్ర శ్లోక భావములను నిశితలోక పరిశీలనాత్మక దృష్టిలో రంగరించి వ్యక్తీకరించిన పద్యము లీ శతకమున ఎన్నియో కలవు. మిత్రుని విపత్తునందు- నీచున కధి కారంబును—అను పద్యము లిట్టివి.

నీతి అధిక్షేప శతకములలో సాధారణముగ కలియుగధర్మముల ప్రసక్తి వచ్చును, పాశ్చాత్య నాగరికత ముద్రపడిన అనంతరము సాంఘిక వ్యవస్థలో కలిగిన మార్పులను గమనించి గువ్వలచెన్న శతకకర్త పాస్తవిక దృక్పథము వహించెను. పర్ణభేదములు లేక కాలక్రమమున అందరును ఆచారాదులందు ఒకే విధానము సనుసరింతురని పచించిన సందర్భమిట్టిచి,