అంటువ్యాధులు/ఏడవ ప్రకరణము
ఏడవ ప్రకరణము
సూక్ష్మజీవులెట్లు వ్యాధిని కలుగజేయును ?
సూక్ష్మజీవులు గాయముగుండ గాని, నోరు ముక్కు మొదలగు మార్గములగుండగాని యేదో యొక విధమున మన శరీరమున ప్రవేశిచునని పైని చెప్పియుంటిమి. ఇవి ప్రవేశించినతోడనే మన రక్తమునదుండు తెల్లకణములకును వీనికిని యుద్ధము ప్రారంభమగును. మనకొక చిన్నకురుపు లేచినప్పుడు మన శరీరమునందు జరుగు పోరాట మీ ప్రక్కపటము నందు చూపబడినది. 25-వ పటమును జూడుము. ఇందు తెల్లకణములనుచూడుము. యివియెల్ల ప్పుడు సిద్ధముగనుండి వెనుదీయక తాము చచ్చువరకును పోరాడుమనభటులని చెప్పవచ్చును. ఇందు కొన్ని సూక్ష్మజీవులనుమ్రింగి నశింపజేయును. కొన్ని సూక్ష్మజీవులను నశింపజేయు విషపదార్థములను పుట్టించును. మరికొన్ని ఈ సూక్ష్మజీవులను యుద్ధరంగమునుండి మోసికొనిపోయి ఖయిదీలుగబట్టి యుంచును. కొన్ని సూక్ష్మజీవుల విషములకు విరుగుడుపదార్థములను పుట్టించును. ఇంకను కొన్ని ఆ యా స్థలములనుండెడి యితర భటులకు ఆహారమును దెచ్చి యిచ్చును. యుద్ధము ప్రారంభమయినతోడనే సూక్ష్మజీవుల యుద్రేకమునుబట్టి తెల్లకణముల క్రొత్తపటాలములు నిమిష నిమషము
25-వ పటము.
చితికిన యొకకురుపునందలి సూక్ష్మజీవులకును, మన శరీరములోనున్న నెత్తురు కాలువ లోని తెల్లకణములకును, జరుగు యుద్ధము.
- 26.వ.పటము.
- ఒక నెత్తురు చుక్కలోని మహాయుద్ధము.
తిండిపోతు తెల్ల కణములు, సన్ని పాత జ్వరపు టైఫాయిదు సూక్ష్మ జీవులపైబడి, వానిని ఎట్లు మ్రింగి చంపి, జీర్ణించుకొను చున్నవో చూడనగును. తెల్ల కణములు జయించిన రోగము కుదురును. సూక్ష్మ జీవులే గెల్చిన రోగి చచ్చును.
నకును యుద్ధస్థలమునకు వచ్చుచుండును. వీనితోపాటు వీని కాహారపదార్థమగు రసియు, రక్తము మొదలగు నితర పదార్థములను హెచ్చుగ యుద్ధరంగమునకు వచ్చుచుండును. ఈ పదార్థములయొక్కయు సూక్ష్మజీవులయొక్కయు కూడికనే మనము వాపు అని చెప్పుచున్నాము. సూక్ష్మజీవులయొక్కయు తెల్ల కణములయొక్కయు మృత కళేబరములును యుద్ధము యొక్క ఉద్రేకముచేత నశింపయిన కండ రక్తము మొదలగు ఇతర శరీర భాగములను, రసియు, సూక్ష్మజీవులచే విసర్జింప బడిన విషయమును, బ్రతికియున్నకొన్ని తెల్లకణములును చేరి యేర్పడుదానినే మనము చీము అనిచెప్పుదుము. పటములో కొన్ని తెల్లకణములు సూక్ష్మజీవులను మ్రింగియున్నవి. 26-వ పటము చూడుము. సూక్ష్మజీవులు కోటాన కోట్లుగా పెరుగుచుండుటచేత రోగియొక్క శరీరబలము సూక్ష్మజీవుల బలము కంటే తక్కువగనున్నయెడల సూక్ష్మజీవులే జయమునొంది శరీరములోనికి చొచ్చుకొనిపోవును. శరీరబలము హెచ్చుగనుండి సూక్ష్మజీవుల బలము తక్కువగ నున్నయెడల సూక్ష్మజీవులు నశించిపోవును; లేదా, వెలుపలకు గెంటివేయబడును. ఇట్లు గెంటివేయబడుటచేతనే 25-వ పటములో చూపిన కురుపు చితికి చీము బయట బడుచున్నది. సూక్ష్మజీవులబలము తక్కువగ నున్నయెడల కురుపు లోలోపలకు పోవును. అట్టి సమయములో శస్త్రముచేసి చీము బయటకు వచ్చుటకు మార్గమేర్ప
రచినగాని కురుపుమానదు. చీము బయటకు పోవుటకు దారి యేర్పడగానే మన దేహమునందలి తెల్లకణములకు సూక్ష్మజీవుల విషమంతగానంటదు. అందుచే నవి కొంచెము తెప్పరిలి క్రొత్త బలమును పొందినవై సూక్ష్మజీవులను బయటకు తరిమి వేయును. అందువలన పుండు శీఘ్రముగా మానును.
సూక్ష్మజీవులలో కొన్ని అంటిన స్థలముననే పెరుగుచు తమ విషమును మాత్రము శరీరము నందంతటను ప్రసరింపజేసి వ్యాధి కలుగజేయుననియు మరికొన్ని సూక్ష్మజీవులు మనశరీరములో ప్రవేశించినతోడనే శరీరమునందన్ని భాగములకు వ్యాపించుననియు పైన వ్రాసియున్నాము. పైన వర్ణించిన కురుపునందు సూక్ష్మజీవులు సామాన్యముగా ప్రవేశించిన చోటనే వృద్ధి పొందును. ధనుర్వాయువు (Tetanus) నందు నిట్లే సూక్ష్మజీవులు ఎక్కడ ప్రవేశించునో అక్కడ కొంత వాపు పోటుమొదలగు గుణములు కలిగించుచు ఆ ప్రదేశమునందే యవి నివసించియుండును. ఈ సూక్ష్మ జీవులు తా మక్కడనుండి కదలక తాము తయారుచేయు విషమును మాత్రము శరీరమంతటను వ్యాపింపజేసి మరణము కలిగించును. చలిజ్వరము మొదలగు కొన్ని వ్యాధులలో వ్యాధి కలిగించు సూక్ష్మజీవులు ప్రవేశించిన చోటనే యుండక రక్తముగుండ శరీరమంతను వ్యాపించును. రోగియొక్క నెత్తురుచుక్క నొక్కదాని నెక్కడ నుండి యైనను తీసి పరీక్షించిన యెడల సూక్ష్మజీవులు కాన
వచ్చును. దొమ్మును కలిగించు సూక్ష్మజీవులు నెత్తురుగుండను, ధనుర్వాయువు కలిగించు సూక్ష్మజీవుల విషములు నరముల గుండను వ్యాపించును.
ఒకానొక వ్యాధి ప్రారంభమైన తరువాత సూక్ష్మజీవు లెల్ల తమసైన్యములను, విషములను నలుదిక్కులకు ఎట్లు ప్రసరింప జేయుచుండునో అట్లే మన శరీరమందలి వివిధాంగములును సూక్ష్మజీవుల కపాయకరములగు వివిధ పదార్థములను పుట్టించుచు తమ యుద్ధభటులను వృద్ధిచేసికొనుచుండును. మన శరీరబలము సూక్ష్మజీవుల బలముకంటె మించినయెడల వ్యాధి కుదురును. లేదా వ్యాధి ప్రకోపించును. అతిమూత్రము మొదలగు కారణములచే శరీరబలము తగ్గియున్న వార లిందుచేతనే రాచపుండు మొదలగువానికి సులభముగ లోబడుదురు.
సూక్ష్మజీవుల ఆయుర్దాయము
తల్లి సూక్ష్మజీవియే రెండు ముక్కలయి యందు ప్రతి ముక్కయు తిరిగి యౌవనముగల సూక్ష్మజీవి యగుటచేత తల్లి కెన్నటికిని మరణమున్నదని చెప్పుటకు వీలులేదు. కావున సాధరణముగా సూక్ష్మజీవులన్నియు చిరంజీవులనిచెప్పనగును. కాని యొక చెరువు ఎండిపోయినప్పుడా చెరువులోని చేపలన్నియు నెట్లు చచ్చిపోవునో అట్లే యొకరోగి మృతినొందినప్పుడు ఆ రోగి నాశ్రయించియున్న సూక్ష్మజీవు లనేకములు వానికి
తగిన యాధారములేక నశించిపోవును.ఇట్లుగాక రోగికి రోగము కుదిరి సూక్ష్మజీవు లోడిపోవునప్పుడుకూడ సూక్ష్మజీవుల కనేక చోట్ల మరణము సంభవించుచున్నది.
ఇట్లుగాక వరిచేనునకు ఆరు నెలలనియు, నువ్వుచేనునకు మూడు నెలలనియు, కొబ్బరిచెట్టునకు ఇన్ని యేండ్లనియు, మామిడిచెట్టు కిన్ని యేండ్లనియు, ఇట్లే యొక్కొక జంతువుకును ఏప్రకారము ఆయుర్దాయమును, ముదిమియు గలవో అట్లే కొన్ని జాతుల సూక్ష్మజీవులకు యౌవనజరావస్థలును ఆయుః పరిమితియు నున్నట్లు తోచుచున్నది. టయిఫాయుడు సూక్ష్మజీవులు ఒకటి రెండు వారములలో విజృంభించి నాలుగు వారములలో చాలభాగము నశించి పోవును. మశూచకపు సూక్ష్మజీవులు 10 లేక 15 దినములలో తమ యుద్రేకమును పోగొట్టు కొనును. కొన్ని సూక్ష్మజీవులు కొంతకాలము విజృంభించిన తరువాత తమ స్వభావమును మార్చుకొని గ్రుడ్లుగా నగును. ఈ గ్రుడ్లకు సాధారణముగా జీవితకాల మింతింతని లేదు. ఒకా నొకప్పుడు మితిలేకుండ చాలకాలము పడియుండి యెప్పుడు తగిన తరుణము వచ్చునో అప్పుడుమొలకరించును. క్షయ, దొమ్మ మొదలగుకొన్ని వ్యాధుల సూక్ష్మజీవుల గ్రుడ్లిట్లు పడియుండి యోకానొకప్పు డకస్మత్తుగ ప్రబలి హాని కలుగజేయును.
సూక్ష్మ జీవులన్నియు గుంపులు గుంపులుగా పెరిగి సామాన్యముగా గుంపులుగానే చచ్చును. వీనిపెంపు పూవుల
పెంపువంటిది. ప్రతిదినము సాయంకాలమునకు మల్లెపూవు లెట్లు పూచి విజృంభించి మరునాటికి వాడిపోవునో అట్లే సూక్ష్మజీవులను ఒకానొక కాలమందు వృద్ధినొంది తమ ఆయుర్థాయపుమితి మీరినతోడనే పెంపు తగ్గియుండును. కావున ఆటలమ్మ, పొంగు, మశూచకము, కలరా మొదలగు అంటువ్యాధులు ఏమియు రోగములేనివానియందు అకస్మాత్తుగ కనుపడి దిగిపోవునప్పుడుకూడ నొక్క పెట్టున దిగిపోవును. అనగా అట్లు దిగిపోవునాటికి సూక్ష్మజీవులపొగరు అణగిపోవు ననిగాని, లేక సూక్ష్మజీవులవలన తయారుచేయబడు విషముల శక్తి విరిగిపోయినదనిగాని తెలియుచున్నది. ఒక్కొక్కజాతి సూక్ష్మజీవి ఎట్లుపెరుగుచు చచ్చుచుండునో అట్లే వానివలన కలుగు వ్యాధులయొక్క స్వరూపములును నిరూపింపబడు చుండును.
సూక్ష్మజీవు లెవరికంటును
ప్రతిసూక్ష్మజీవియు ఒక్కొక జాతిజంతువున కొక్కవిధముగను, ప్రజలలలోకూడ యొక్కొకదేశపు ప్రజలకొక్కొక విధముగను అంటును. అన్నిజంతువులకును అన్నిజాతుల ప్రజలకును ఒక టేరీతిగ నీవ్యాధు లంటవు. మానవుల కంటినట్లు సూక్ష్మజీవు లితరజంతువుల కంటవు. ఏవో కొన్ని జంతువులేకాని తక్కిన జంతువులు సూక్ష్మజీవులకు లెక్కచేయవు. పశువులకు, కోళ్లకు, పందులకువచ్చు అనేక వ్యాధులు మను
ష్యుల కంటుటలేదు. మనుష్యులకంటు పచ్చసెగ, ఆటలమ్మ మొదలగు వ్యాధులు పశువుల కంటుట కానరాదు. ఒకటే కుటుంబములోచేరిన రెండు తెగల జంతువులకుగూడ సూక్ష్మ జీవులొక్కరీతిగ అంటుటలేదు. పొలముచుంచులు అధికముగ క్షయవ్యాధితో చచ్చును. కాని యింటిచుంచులకు క్షయ వ్యాధిరాదు. కొన్నిదేశములలో గొర్రెలకు దొమ్మవ్యాధి మిక్కుటముగ వచ్చును. మరికొన్ని దేశములలో నీ గొర్రెలకా దొమ్మవ్యాధి అంటనే అంటదు. మానవులలో గూడ ఈ భేదము స్పష్టముగ కానవచ్చుచున్నది. ఆఫ్రికాదేశము నందలి నీగ్రోలను నల్లవారలకు చలిజ్వర మంతగారాదు. అక్కడ నున్న తెల్లవారల నిది మిక్కిలి యధికముగా బాధించును. కాని యీ నీగ్రోలు క్షయవ్యాధిచేతను, మశూచకముచేతను, తెల్లవారలకంటె మిక్కిలి సులభముగ మృతి జెందుదురు.
కడు మన్యప్రదేశములలో రేయింబగళ్లు నివసించుచున్నను కోయవాండ్రకు సాధారణముగ చలిజ్వరముఅంటదు. బయటిప్రదేశములనుండి పోవువా రచ్చట నొక్కదినము నివసించినను వారి కీ చలిజ్వరము వెంటనే యంటుకొనును.
ఒక్కటే జాతిలోకూడ సూక్ష్మజీవు లందఱకు నొక్క రీతిగా నంటవు. టీకాలు వేసినప్పుడు కొందరికి బాగుగ పొక్కుటయు కొందరికి బొత్తుగ పొక్కక పోవుటయు అందరకు తెలిసిన విషయమే. ఒక్కొక పైరున కొక్కొక తరహానేల స్వతస్సిద్ధముగ నెట్లు తగియుండునో అట్లేయొక్కొక జాతి సూక్ష్మజీవులకును కొందర ప్రజల శరీరములు మిక్కిలి ప్రీతిగ నుండును.
వంశపారంపర్యముగ వచ్చుచుండు అలవాటుచేతకూడ అంటువ్యాధులవ్యాప్తి మారుచుండును. తండ్రి తాతలందరు ఒక వ్యాధిచే పీడితులయినయెడల వారి సంతానమునకు ఆ వ్యాధి కలుగక పోవచ్చును. దీనికి ప్రతిగ క్షయ మొదలగు కొన్ని వ్యాధులు తరతరములకు హెచ్చుగకూడ వచ్చుచుండును. కొన్నివ్యాధులు కలిగినను మిక్కిలి తేలికగ పోవచ్చును. ఇందుకు ఉదాహరణము. మన దేశమునందు మనము పొంగు,తట్టమ్మ అని చెప్పెడు వ్యాధికెవ్వరును భయపడరు తనంతట అది వచ్చును పోవును. దీనిని ఎన్నడు నెరుగని ప్రదేశములలో నీయమ్మవారే ప్రవేశించినపుడు భయంకరముగ జననాశము చేయుచుండును. ౧౮౭౫ సంవత్సరములో ఫిజీదీవులలో (Fizi Islands) నీవ్యాధి ప్రవేశించి నాలుగు నెలలలో నలుబదివేలమంది ప్రజలను మ్రింగివేసెను. ఈవ్యాధి నా దేశము వారెవ్వరింతకు ముందెరిగి యుండకపోవుటచేత దాని యుద్రేకమునకు మితి లేక యుండెను. రమారమి ముగ్గురు ప్రజలకు ఒకడు చొప్పున మృత్యువు పాలబడిరి. ఇట్లే తట్టమ్మపేరు వినినప్పుడు ఐరోపియనులకు (Europeans) దేహము
కంపముజెందును. ఇదేప్రకారము కొన్ని జంతువులను లెక్క లేకుండ నశింపజేయు కొన్ని అంటువ్యాధులు ఇతర జంతువులకు అంటనే అంటవు. మహామారి (Plague) వ్యాధివలన ఎలుకలు కుప్పలు కుప్పలుగ చచ్చును. అదే ప్రదేశములయందుండి వీరితో సాంగత్యము కలిగియున్నను పందికొక్కులకు ఎంతమాత్రము భయములేదు. వృక్షజాతియందుకూడ ఆముదపు చెట్టునకు అంటుచీడ యదే ప్రదేశములోనుండు ఇతర జాతివృక్షములకంటునా?
ఇట్టి జాతి భేధములు దేశ భేదములేగాక వయస్సును బట్టియు భోజనాది సౌకర్యములనుబట్టియు ఇంక నితర కారణములనుబట్టియు అంటు వ్యాధుల వ్యాప్తిమారుచుండును. పసి వాండ్రకు అంటువ్యాధులు సులభముగ నంటును. మిక్కిలి వయస్సువచ్చిన పావురములకంటె చిన్నపావురములకు దొమ్మ వ్యాధి సులభముగ అంటునని శోధకులు పరీక్షించియున్నారు. ఇదిగాక ఆకలిచేగాని బడలికచేగాని బాధనొందు జంతువులకీ యంటువ్యాధులు మిక్కిలి శీఘ్రముగ నంటుననియు; అధికముగ నీటిలో నానినప్పుడును అతిదాహముగ నుండునప్పుడును ఈ వ్యాధులు సులభముగ అంటుననియు కుక్కలు కోళ్లు మొదలగు జంతువులమీద పరీక్షించి అనేకమంది విద్వాంసులు నిర్ధారణ జేసియున్నారు.
మానవులలో కూడ యొకానొకప్పుడు సూక్ష్మజీవుల కసాధ్యముగా నుండువారి శరీరము సయితము అధికాయాస
ముచేగాని తిండిలేమిచేగాని శరీరపటుత్వము తగ్గియున్నప్పుడును చలిగాలియందును ఎండ వానలయందును తిరుగుచున్నప్పుడును సూక్ష్మజీవులకు సులభముగ లొంగిపోవును. బలముగ నున్నప్పుడు మనశరీరములో ప్రవేశించినను మనకపకారము చేయలేని సూక్ష్మజీవులే మనము బలహీనస్థితిలోనున్నప్పుడు మనలను శీఘ్రముగ లోబరుచుకొనును. క్షామాదుల యందు వేనవేలు ప్రజ లంటువ్యాధుల పాలగుటకు ఇదియే కారణము.
మనోవిచారము, భయము మొదలగు కారణములు కూడ క్షయ మొదలగు వ్యాధుల వ్యాపకములో సహాకారులగునని తెలియుచున్నది. ఇదిగాక మనశరీరమునం దీ సూక్ష్మజీవులు ప్రవేశించు స్థలమునుబట్టికూడ వాని యుపద్రవము మారుచుండును. ఇందునకే ఇతరస్థలములందలి పుండుకంటే పెదవులమీదనుండు పుండు మిక్కిలి శీఘ్రముగ వ్యాపించును.
ఇది ఇట్లుండగా నొకానొకనికి అంటువ్యాధి తగులుటకు తగిన అవకాశములన్నియు నున్నను అది వాని నంటదు. మశూచకము ఊరంతయు వ్యాపించియున్నను ఇంటిలో చాల మందికి వచ్చినను, మశూచకపు రోగులకు దినదినము ఉపచారము చేయుచున్నను అందరికిని ఈ వ్యాధి యంటుననిభయములేదు. కొందరికి తేలుకుట్టినపుడు అమితముగ బాధపెట్టుటయు, మరికొందరికి బొత్తుగ ఎక్కక పోవుటయు ఇట్టిదియే.