8. పరీక్షిత్తుఁడు శుకుని ప్రపంచోద్భవాదికం బడుగుట

అధ్యాయము - ౮

మార్చు

సీ. వినుశుకయోగికి | మనుజేశుఁడిట్లను, మునినాథ ! దేవద | ర్శనము గలుగఁ

నారదమునికిఁ బం | కేరుహభవుఁ డెఱిం, గించిన తెఱఁగు సత్ | కృప దలిర్ప

గణుతింప సత్త్వాది | గుణశూన్యుఁడగు హరి, కమలాక్షు లోకమంగళములైన

కథలు నా కెఱిఁగింప | గైకొని నిస్సంగ, మైన నా హృదయాబ్జమందుఁ గృష్ణు

తే. భవ్యచరితుని నాద్యంత భావశూన్యుఁ , జిన్మయాకారు ననఘు ల | క్ష్మీసమేతు

నిలిపి యస్థిరవిభవంబు | నిఖిలహేయ, భాజనంబైన యీ కళే | బరము విడుతు. (217)


వ. అదియునుం గాక యెవ్వండు శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణు గుణకీర్తనంబులు వినుచుఁ బలుకుచుండునట్టివాని హృదయపద్మంబునందుఁ గర్ణరంధ్రమార్గబునఁ బ్రవేశించి,

కృష్ణుండు విశ్రమించి, సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబయిన మాలిన్యంబు నపకర్షించుఁ గావున, (218)


మ. భరితోదగ్రనిదాఘతప్తుఁడగు న | ప్పాంథుం డరణ్యాది సం

చరణ క్లేశ సముద్భవంబగు పిపా | సం జెంది యాత్మీయ మం

దిరముం జేఱి గతశ్రముండగుచు నెం | దేనిం జనంబోని భం

గి రమాధీశు పదరావిందయుగ సం | గీభూతుఁడై మానునే ? (219)


వ. అదియునుం గాక సకలభూత సంసర్గశూన్యంబైన యాత్మకు భూతసంగమం బే ప్రకారంబునం గలిగె ? అది నిర్ణిమిత్తంబునం జేసియో కర్మంబునం జేసియో యా

క్రమంబు నాకెఱిఁగింపుము. (220)


సీ. ఎవ్వని నాభియం | దెల్ల లోకాంగ సం, స్థానకారణ పంక | జంబు వొడమె

నందుదయించి స | ర్వావయవస్ఫూర్తిఁ దనరారునట్టి పి | తామహుండు

కడఁగి యెవ్వని యను | గ్రహమున నిఖిల భూ, తముల సృజించె ను | త్కంఠ తోడ

నట్టి విధాత యే | యనువున సర్వేశు, రూపంబుఁ గనుఁగొనె | రుచిరభంగి

తే. నా పరంజ్యోతియైన ప | ద్మాక్షునకును, నళినజునకుఁ బ్రతీక వి | న్యాసభావ

గతుల వలనను భేదంబు | గలదె చెపుమ ? యతిదయాసాంద్ర ! యోగి కు | లాబ్ధిచంద్ర ! (221)


వ. మఱియును భూతేశ్వరుండైన సర్వేశ్వరుం డుత్పత్తిస్థితిలయకారణంబైన తన మాయను విడిచి మాయానియామకుండై యేయే ప్రదేశంబుల శయనంబు సేసె

(నదియునుం గాక పురుషావయవంబులచేఁ బూర్వకాలంబున లోకపాలసమేతంబులైన లోకంబులు కల్పితంబులయ్యె ననియు లోఖంబులు

పురుషావయవంబులనియుఁ జెప్పఁబడియె). అదియునుం గాక మహాకల్పంబులును, నవాంతర కల్పంబులును (భూత భవిష్యద్వర్తమాన కాలంబులును)

స్థూలదేహాభిమానులై జనియించిన దేవపితృమనుష్యాదులకుం గలుగు నాయుఃప్రమాణంబులును, బృహత్సూక్ష్మకాలానువర్తనంబును నేయే కర్మంబులం జేసి జీవులేయే

లోకంబుల నొందుదురు ? మఱియు నేయే కర్మంబులం జేసి దేవాది శరీరంబులం బ్రాపింతురు ? అట్టి కర్మమార్గప్రకారంబున (సత్త్వాదిగుణంబుల) పరిణామంబులగు

దేవాదిరూపంబులఁ గోరు జీవులకు నేయే కర్మసముదాయం బెట్టు సేయందగు ? ఎవ్వఱికి నర్పింపం దగు ? అవి యెవ్వనిచేత గ్రహింపంబడు ? భూపాతళ కకుబ్ వ్యోమ

గ్రహనక్షత్త్రపర్వతంబులును, సరిత్సముద్రద్వీపంబులును, నే ప్రకారంబున సంభవించె ? ఆయా స్థానంబులం గలవారి సంభవంబులేలాఁటివి ? బాహ్యాభ్యంతరంబులం గలుగు

బ్రహ్మాండప్రమాణంబెంత ? మహాత్ముల చరిత్రంబులెట్టివి ? వర్ణాశ్రమ వినిశ్చయంబులును, ననుగతంబులై యాశ్చర్యావహంబులగు హరి యవతారచరిత్రంబులును,

యుగంబులును, యుగప్రమాణబులును, యుగధర్మంబులును, బ్రతియుగంబునందును మనుష్యులకేయే ధర్మంబు లాచరణీయంబు (లగునట్టి) సాధారణ ధర్మంబులును,

విశేషధర్మంబులును, జాతివిశేషధర్మంబులును, రాజర్షిధర్మంబులును, ఆపత్కాల జీవన సాధన భూతంబులగు ధర్మంబులును, మహదాదితత్త్వంబుల సంఖ్యయును,

సంఖ్యాలక్షణంబును, ఆ తత్త్వంబులకు హేతుభూతలక్షణంబులును, భగవత్సమారాధనవిధంబును, అష్టాంగయోగక్రమంబును, యోగీశ్వరుల అణిమాద్యైశ్వర్య ప్రకారంబును,

వారల యర్చిరాదిగతులును, లింగశరీరవిలయంబును, ఋగ్యజుస్సామాధర్వ వేదంబులును, ఉపవేదంబులైన యాయుర్వేదాదులును, ధర్మశాస్త్రంబులును,

నితిహాసపురాణంబుల సంభవంబును, సర్వభూతంబుల యవాంతరప్రళయంబును, స్థితిమహాప్రళయంబులును, నిష్టాపూర్తంబులను యాగాది వైదికకర్మజాలంబును,

వాపీకూపతటాక దేవాలయాది నిర్మాణంబు లన్నదానం బారామప్రతిష్ఠ మొదలగు స్మార్తకర్మంబులును, కామ్యంబులైన యగ్నిహోత్రంబుల యనుష్ఠానప్రకారంబును,

జీవసృష్టియును, ధర్మార్థకామంబులనియెడు త్రివర్గాచరణప్రకారంబును, మలినోపాధిక పాషండ సంభవంబును, జీవాత్మబంధమోక్షప్రకారంబును, స్వరూపావస్థాన

విధంబును, సర్వస్వతంత్రుండైన యీశ్వరుండాత్మమాయం జేసి సర్వకర్మసాక్షియై క్రీడించుటయును, మఱియు మాయ నెడఁబాసి యుదాసీనగతి విభుండై క్రీడించు

తెఱంగు మొదలగు సమస్తము క్రమంబున నాపన్నుండనైన నాకు నెఱింగింపుము. బ్రాహ్మణశాపంబునం జేసి శోకవ్యాకులితచిత్తుండనై యనశనవ్రతుండనైన నీవు వినుట

యెట్లని సందేహింపవలదు. త్వదీయ ముఖారవిందవినిఃస్రుత నారాయణ కథామృతపాన కుతూహలినైన నాకు నింద్రియంబులు వశంబులై యుండు. అది గావున

నేనడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు సవిస్తరంబులుగా నానతిచ్చి కృతార్థునిఁ జేయఁ బరమేష్ఠితుల్యుండవగు నీ వపూర్వసంప్రదాయానురోధంబున నర్హుండ వగుదువని

విష్ణురాతుండైన పరీక్షిన్నరేంద్రుండు బ్రహ్మరాతుండైన శుకయోగి నడిగిన నాతండు బ్రహ్మనారదసంవాదంబును, నేకసంప్రదాయానుగతంబును, గతానుగతికప్రకారంబును నై

తొల్లి సర్వేశ్వరుండు బ్రహ్మకల్పంబున బ్రహ్మకుపదేశించిన భాగవతపురాణంబు వేదతుల్యంబు నీ కెఱిఁగింతు వినుమని చెప్పెనని సూతుండు శౌనకాది మునులకుం

జెప్పినట్లు శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకిట్లనియె. (222)


అధ్యాయము - ౯

మార్చు

సీ. భూపాలకోత్తమ ! భూతహితుండు సు,జ్ఞానస్వరూపకుం | డైనయట్టి

ప్రాణికి దేహసం | బంధమెట్లగు నన్న మహినొప్పు నీశ్వర | మాయ లేక

కలుగదు, నిద్ర వోఁ | గలలోనఁ దోఁచిన దేహబంధంబుల | తెఱగు వలెను

హరియోగమాయా మ | హత్త్వంబునం బాంచభౌతికదేహ సం | బంధుఁ డగుచు

తే. నట్టి మాయాగుణంబుల నాత్మయోలి, బాల్యకౌమార యౌవన | భావములను

నర సుపర్వాదిమూ | ర్తులఁ బొరసి యేను, నా యదిది యను సంసార | మాయఁ దగిలి. (223)


వ. వర్తింపు చిట్లున్న జీవునికి భగవద్భక్తియోగంబున ముక్తి సంభవించుట యెట్లన్న నెప్పుడేని జీవుండు ప్రకృతిపురుషాతీతమయిన బ్రహ్మస్వరూపంబునందు

మహితధ్యాననిష్ఠుండగు నప్పుడు విగతమోహుండై యుండు. మఱియు జీవేశ్వరులకు దేహసంబంధంబు కానంబడుచుండు. అట్టి దేహధారియైన భగవంతునందు భక్తిం జేసి

జీవుని ముక్తి యే తెఱంగునం గలుగునని యడిగితివి. జీవుం డవిద్యామహిమం జేసి కర్మానుగతంబైన మిథ్యారూప దేహసంబంధుండు. భగవంతుండు

నిజయోగమాయామహిమం జేసి స్వేచ్ఛాపరికల్పిత చిద్ఘనలీలావిగ్రహుండు. కావున భగవంతుండయిన యీశ్వరుండు స్వభజనంబు ముక్తిసాధన జ్ఞానార్థంబు కల్పితంబని

చతుర్ముఖునకుఁ దదీయ నిష్కపట తపశ్చర్యాది సేవితుండై నిజజ్ఞానానంద ఘనమైన స్వరూపంబు సూపుచు నానతిచ్చె. అది గావున జీవునికి భగవద్భక్తి

మోక్షప్రదాయకంబగు. ఇందులకొక యితిహాసంబు గలదెఱిఁగింతు. ఆకర్ణింపుము. దాన భవదీయ సంశయనివృత్తి యయ్యెడుమని శుకయోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె.

(224)