5. గ్రంథకర్తృ వంశ వర్ణనము

సీ. కౌండిన్యగోత్ర సంకలితుఁ డాపస్తంబ, సూత్రుండు పుణ్యుండు సుభగుఁడైన

భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ కలకంఠి తద్భార్య గౌరమాంబ

కమలాప్తు వరమునఁ గనియె సోమనమంత్రి, వల్లభ మల్లమ వారి తనయుఁ

డెల్లన యతనికి నిల్లాలు మాచమ, వారి పుత్త్రుఁడు వంశవర్ధనుండు


ఆ.వె. లలితమూర్తి బహుకళానిధి కేసన, దానమాన నీతిధనుఁడు ఘనుఁడు

తనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతముఁ గనియె. 22