12. స్కంధాంతము
కం|| విని శౌనకుండు సూతుం, గనుగొని యిట్లనియె సూత ! కరుణోపేతా !
జననుత గుణసంఘాతా ! ఘనపుణ్య సమేత ! విగత | కలుషవ్రాతా ! (282)
వ. పరమభాగవతోత్తముఁడైన విదురుండు బంధుమిత్త్రజాలంబుల విడిచి, సకల భువన పావనంబులును గీర్తనీయంబులు నైన తీర్థంబులు నగణ్యంబులైన
పుణ్యక్షేత్రంబులును దర్శించి క్రమ్మఱ వచ్చి కౌషారవి యగు మైత్రేయుం గని యతని వలన నధ్యాత్మబోధంబు వడసెనని వినంబడు, అది యంతయు నెఱిఁగింపుమనిన
నతం డిట్లనియె. (283)
కం||| వినుమిపుడు మీరు నన్నడి, గిన తెఱఁగున శుకు మునీంద్ర | గేయుఁ బరీక్షి
జ్జనపతి యడిగిన నతఁడా, తని కెఱిఁగించిన విధంబుఁ | దగ నెఱిఁగింతున్. (284)
వ. సావధానులై వినుండు. (285)
ఉ|| రామ ! గుణాభిరామ ! దినరాజ కులాంబుధిసోమ ! తోయద
శ్యామ ! దశానన ప్రబల | సైన్య విరామ ! సురారిగోత్ర స్యఉ
త్రామ ! సుబాహు బాహుబల | దర్ప తమః పటు తీవ్రధామ ! ని
ష్కామ ! కుభృల్లలామ ! గర | కంఠసతీసుతనామ ! రాఘవా !
కం|| అమరేంద్ర సుత విచారణ ! కమలాప్త తనూజ రాజ్య | కారణ ! భవ సం
తమస దినేశ్వర ! రాజో, త్తమ ! దైవత సార్వభౌమ ! దశరథ రామా ! (287)
మాలిని.
నిరుపమ గుణజాలా | నిర్మలానంద లోలా !
దురిత ఘన సమీరా | దుష్ట దైత్య ప్రహారా |
శరధి మద విశోషా ! చారు సద్భక్త పోషా !
సరసిజ దళ నేత్రా | సజ్జన స్తోత్ర పాత్రా ! (288)
గద్య. ఇది పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర, కేసనమంత్రిపుత్త్ర, సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను పురాణంబునం బరీక్షిత్తు తోడ
శుకయోగి భాషించుటయు భాగవత పురాణ వైభవంబును, ఖట్వాంగు మోక్ష ప్రకారంబును ధారణాయోగ విషయంబైన మహావిష్ణుని శ్రీపాదాద్యవయవంబుల
సర్వలోకంబులున్న తెఱంగును, సత్పురుష వృత్తియు, మోక్ష వ్యతిరిక్త సర్వకామ్య ఫలప్రద దేవతాభజన ప్రకారంబును, మోక్షప్రదుండు శ్రీహరి యనుటయు, హరిభజన
విరహితులైన జనులకును హేయతాపాదనంబును, రాజప్రశ్నంబును, శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు
బ్రహ్మాధిపత్యంబు వడయుటయు, శ్రీహరి వలన బ్రహ్మరుద్రాది లోక ప్రపంచంబు వుట్టుటయు, శ్రీమన్నారాయణ్ అదివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత
సూచనంబును, భాగవత వైభవంబును, బరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నలును, అందు శ్రీహరి ప్రధానకర్త అయని తద్వృత్తాంతంబు సెప్పుటయు, భగవద్భక్తి
వైభవంబును, బ్రహ్మ తపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠ నగరంబు తోడఁ బ్రసన్నుండైన స్తోత్రంబు సేసి తత్ప్రసాదంబునం దన్మహిమ వినుటయు, వాసుదేవుం
డానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవత పురాణ ప్రధాన దశ లక్షణంబు లుపన్యసించుటయు, నారాయణ వైభవంబును, జీవాది తత్త్వసృష్టియు, శ్రీహరి నిత్య
విభూత్యాది వర్ణనంబును, గల్పప్రకారాది సూచనంబును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పుమని సూతు నడుగుటయు నను కథలు గల ద్వితీయ
స్కంధము సంపూర్ణము. (289)