138

హరిశ్చంద్రోపాఖ్యానము

నలవార్ధిజలము చుం యన నింకఁ గ్రోలి
బలసి లోకము లెల్ల భస్మీకరింప
సడ రెనో బడబాగ్ని యనఁ జుట్టు ముట్టి
పుడమియు దిశలు నభోమండలంబుఁ
గప్పి మండుచు వచ్చు కార్చిచ్చు రాక
తప్పక వీక్షించి ధరణివల్ల భుఁడు............2150
జాలి నెక్కొన నక్క జంబునఁ జింతఁ
దూలుచుఁ దన దేవితోడ నిట్లనియె
'నీవనవహ్ని నిం కేవిధిఁ గడచి
పోవచ్చుఁ జావక పోరాదు మనకు
నంకించి మునితోడ నాడినమాట
బొంకు గాకుండ నాపూనిన నాఁటి
మితికి ఋణం బెల్లం మేలుగాఁ దీర్చి
మృతిఁ బొంద లే నై తి మృగ నేత్రి వినుము
ఏవిఁ బుట్టిన వారికి నెల్ల

పేలఁగా, ఒరలుచుం = టోలుచు, వార్ధ జలము = సముద్రపునీరు, "చు'c యనక్ =చుం అని, ఇంక క్రోలి = ఇంకిపోవునట్లు త్రాఁగి, అడ రెనో = తలప డెనో- సముద్రపు నీళ్లంతయు ఆఁగా పిదపలోకముల నెల్ల చుట్టుక్రమ్మి నీరు సేయుటకు బడబాగ్ని తలపడి దోయన్నట్లు, నభోమండలము= ఆకా శము, రుచిచ్చు పుట్టినవిధ మెట్లనఁగా; - మొదటబిట్టుగా వాయువు వీవగా చెట్లకొమ్మలు ఒరసికొని వేఁడిమి పుట్టి దానివలన చిఱునిప్పులు గలిగి యవి కారాకుగుంపులంబడి రాఁజిచిన్న మంటలు పుట్టి యామంటలు కసవుజొంపము నంబడి కాలి క్రమముగా పొదరిండ్లు రగులుకొని మండి చెట్లకుఁదగిలి పెనుజ్వాల లుగా చుట్టు కమ్ముకొన్న దయ్యే ననుట. నెక్కొనన్ =కలుగఁగా, అక్క జండ

= మిక్కుట మైనది, అంకించి =పూని, నాపూనిననాఁటిమితికి = నేను ప్రతిజ్ఞ

ప్రథమభాగము.

139


జావక పో రాదు చర్చించి చూడ.........2160
ధరణీశుఁ డగునాకు దర్ప మేర్పడఁగఁ
బర బలంబులు సొచ్చి బలువిడిఁ గడచి
వెస నురగ్గాలిఁ గాఁడి వీపున "వెడలు
నిశితాస్త్రములఁ జచ్చి నెఱి నిందు నందు
వినుతి కెక్కుట మాని విన సైఁప రాని
వనవహ్నిఁ గాలంగ వల సె నీరీతి
నాతి నాదుర్మరణమునకు వగవ
బ్రాతి యైనట్టియీపట్టికి వగవ
గురుభక్తి మేరొని ఘోరాటవులకు
నరుదెంచి మనతోడ నలజడిఁ బొంది............. 1170
కడపట నేఁ డిట్లు కాలాగ్ని చేత
సుడివడు మునితనూజునకు నే వగతు
నీమహాపాతకం బేమిటఁ బాయుఁ
గామిని నా కింక గతి యొండు లేదు
కన్నుల నీపాతకము గనుంగొనక
మున్నె యిచ్చెదఁ బ్రాణముల వహ్ని కనుచు,
మనసులో శివు నిల్పి మంటకు నెదురు
చను చున్న యాహరిశ్చంద్రునిఁ జూచి
నిగుడు శోకము మది నిల్పి నవ్వుచును

........................................................................................................... సిననాఁటిగడువునకు, కాఁడి=దూసికొని, నిశీత అస్త్రముల = వాఁడి బాణ ముల చే,బ్రాఁతి = గారాబు, పట్టి =బిడ్డఁడు, మేకొని= సమ్మతించి, సుడివడు= చిక్కుకొన్న - తబ్బిబ్బుపడు, మునితనూజునకున్ = మునికుమారునకు, నిగుడుశోక ము=పయిపయి రేఁగుచున్న దుఃఖము, మదినిల్పి = మనస్సులో నేయడఁచి, నవ్వు 140

హరిశ్చంద్రోపాఖ్యానము


జగువమైఁ జంద్రమతీ దేవి వలికె..............2180
“దేవ మీ కి ట్లేల దృతి దూలి పలుక
బావింప నసమాన భాగ్యసంపదల
లలితముగళ సూత్రలక్ష్మీ నిక్కముగఁ
దల చెడుచో నాకు దైన మెంతయును
జగ గొని యిటు నగుఁ బాటు గావింప
వగల నొక్కించుక వడి నిన్నుఁ బాసి
కడులోల నై యుండఁగా నెట్టు లొర్తు
జడియక పది వేలజన్మం బులందుఁ
బతి నీవ కాఁ గోరి పడి వహ్ని గాలి
మృతిఁ బొంది పొందుదు మీఁద నీపొందు............ 2190
సమక మార నీచన విచ్చి నన్ను
బొమ్మని యానతీ పోరు వే వేగ,
యనిన భుగాలున నడరు శోకాగ్ని
మనసు సురుక్కని మనుజేశుఁ డనియె
“జలజాక్షి నీకిట్టిసాహసకృత్య
మలవడ నోపునే యక్కటా నీవు
తొడిబడఁ జచ్చిన తోడనే బెగడి

................................................................................................................ చును = దుఃఖాళ యముపట్ట లేక నవ్వుచును, లలిత మంగళసూత్రలక్ష్మి = ఒప్పుచున్న మంగళ సూత్రము యొక్క సంపత్తిని-మంగళ సూత్రపు బలిమి ననుట, నగుఁ బాటు ఇనవ్వులాట సేయుఁగా - నామంగళ సూత్రము ద్యార్థము కానిదని తలఁచియుండఁ గా దైవ మేయిట్లున్ను అగడు నేయు నేని యనుట, వగలన్ దుఃఖములచే, న మదము ఆరన్ = సంతోషమునిండఁగా, ఈ చనవు నేను మం దగ్నిలోబడి

మృతిఁబొందెడి స్వాతంత్యము, ఆనతీ - ఆనతిమ్ము తొడిఁబడన్ = తొందర

141

ప్రథమభాగము.

విడివడఁ బ్రాణముల్ విడుచు నీశిశువు
సుతుఁడు నీవును జావఁ జూచి ప్రాణంబు
ధృతి నిల్పి యెట్లు వర్తింపఁగ వచ్చు .....................2200
వచ్చు నే నో రాడి వాక్రుచ్చి నిన్ను
జిచ్చులోఁ బడు మని చెలఁగి వీడ్కొలుపఁ
గరుణ మాలినయట్టికఠినాత్ము డైన
నరునిఁ బల్కిన నయ మేది నన్ను
బలికితి పలుకని బాష్పపూరంబు
నెలమి రెప్పల నిల్పి యేఁగుచు నున్న
మనుజేశునకుఁ జంద్రమతి సాంగి మొక్కి
ఘన మైనభ క్తితోఁ గరములు మొగిచి
“నలినాప్తకులనాథ నావిన్నవించు
పలుకు వేరొకటి గా భావింప వలదు .........................2210
దలముగా నలుదిశల్ దలకొని మండఁ
జలిచీమ కొరివి వై జను దెంచినట్లు

....................................................................................................... పాటుతో, బెగడి . బెదరి, ధృతిన్ ఆ ధైర్యముతో, నోరాడివాక్రుచ్చి= నోరు కదల్చి చెప్పి, 'నిన్ను ... చిచ్చులో బడు మని నోరాడి వాక్రుచ్చి చెలఁగివీడ్కో లుపవచ్చు నే ' అని యన్వయము. కరుణ... నరునిన్ దయ లేక కఠిన హృదయుఁ డైనమనుష్యునితోఁ జెప్పీకట్లు, నయము ఏది = మెత్తనవిడిచి, 'నన్ను " బలుకు పలికితి' అని అన్వయము, వలము గా చను దెంచినట్లు = నలుప్రక్కల దట్టముగా కార్చిచ్చుక్రము కొని వచ్చుచుండఁగా చలిచీమ తప్పించుకొనుటకై నడుమనున్న యొక కొఱవి పై నెక్కి ప్రాఁకినట్లు నక్షత్రకుఁడు తమ్ము నండగొని యొదిఁగి యున్నాఁడనుట. తము కొఱవిగా రూపించుటచే తామును ఆ కార్చి చ్చులో కొరివివ లెఁగాలనుండుట చూచితము.చలిచీము కొఱని నాశ్రయించుట

యెట్లు వ్యర్ధమో అట్లే కాలనున్నత మ్మాశ్రయించుటయు వ్యర్థమనుట, ఉలికి=భ.
142

హరిశ్చంద్రోపాఖ్యానము


వలయంబుగా మండి వచ్చు కార్చిచ్చు
కులికి యెందును వేళ నురికి పో రాక
సుడి వడి మనలోనఁ జొచ్చి వా తెఱలు
దడుపుచు నున్న యీత పసికుమారుఁ
గొంకక వెస నెత్తుకొని వెర వైన
వంక గా నీవహ్నివలయంబు గడపు
మీవు గల్గినఁ దీజు నీముని ఋణము
నీవు గల్గినఁ గల్గు నెలఁతలపొందు....................2220
నీవు గల్గినఁ బుత్రనివహంబు గలుగు
నీవు గల్గినఁ గల్గు నిత్య సౌఖ్యములు
నీవు గల్గినఁ గల్గు నిత్యధర్మములు
నీవు గల్గినఁ గల్గు నిఖిలభోగములు
నీవు గల్గినఁ గల్గు నిత్యనంపదలు
నీవు గల్గినఁ గల్గు నిఖిల రాజ్యములు
నెడ లేదు భాషింప నిదె చేర వచ్చే
మిడుఁగుజు లడరంగ మి న్నంది వహ్ని
తెగువ లేకున్నను దెగుట నిక్కంబు
సుగుణాత్మ తొలుత నేఁ జొచ్చినపిదప.....................2230
భగవంతుఁడొనరించు పద్ధతి జరుగు


....................................................................................................................


యపడి, వెళ్లనురి కి = వెడలదూఁకి, సుడివడి - తబ్బిబ్బుపడి, వా తెఱలు = పేడ వులు, వెరవై నవంక గా = వీలయినదిక్కుగా, నివహము = సమూహము, ఎడ లేదు భాషింపన్ = మాటలాడుటకు అవకాశము లేదు, మిన్నంది =ఆకాశముముట్టి. మిక్కిలిపొడవుగా పెరిఁగియనుట, తెగువ లేకున్న ను తెగుటనిజంబు = సాహసము

చేయనియెడల చచ్చుటనిశ్చయము, తొలుత ...... జరుగు - మొదట నేనగ్ని

143

ప్రథమభాగము.

తగవు మీఱుఁగఁ దెంపు దయ సేయు' మనుచు
వేఁడినఁ దల వేల వేసి నిట్టూర్పు
వేఁడి యై నృపతి నివ్వెర నూర కున్న
వసుధీశు నతిభ క్తి వలగొని మ్రొక్కి
మసలక చను చంద్రమతి వెంటఁ దగిలి
'యమ్మమ్మ నీ విపు డగ్నిలో నుఱుక
సమ్మదం బొదవంగఁ జనియెద వేని
వత్తు నేనును నన్ను వదలక తిగిచి
యె త్తికొ" మ్మనుచుఁ బెల్లెసఁగుదైన్యమున్న .............................2240
గిదుకుచుఁ జిన్ని కెంగేలఁ బై కొంగుఁ
గదియించి బుడిబుడి కన్నీరు దెచ్చి
మోహ మేర్పడఁ గుచంబుల మోము రాచు
లోహితాస్యునిఁ జూచి లోనన పొక్కి
యక్కునఁ గదియించి మాదల నివిరి
చెక్కిలి నొక్కి యాచిన్నారిబొజ్జ
బుడికి చక్కిలిగింత పుచ్చి కన్నీరు
దుడిచి ముద్దులచుంచు దువ్వి మూర్కొనుచు
'నాయన్న నాకూన నాముద్దుపట్టి
మాయయ్య యీ పేర్చుమంటఁ జల్లార్చి ...................................2250
వత్తు వేవేగ రావలదు నా తోడఁ
మారఁగ నీకుఁ జేకూరు శుభము”

..................................................................................................................

లోఁ బ్రవేశింపఁగా పిదప దైవము "కావించుదారి కాఁగలదు, తెంపుదయ సేయు ము= తెగువ చేసి యగ్ని లోఁబడుటకు అనుమతి యిమ్ము,నివ్వెఱు = మిక్కిలిభయము,

వలగొని = ప్రదక్షిణము సేసి, కిదుకు చు= మెల్ల గాశబ్దించుచు, చిన్నికెంగేలన్
144

హరిశ్చంద్రోపాఖ్యానము


లని యెట్టకేలకు నాలోహితాస్యు
మను జేశుకడ నిల్పి మఱి యొండుదలఁపు
మది లేక నిల్చి యమగువ ప్రాణేశుఁ
బదిలంబుగా మనఃపద్మంబునందు
ధృతి నిల్పి చంద్రమతీ దేవి భ_క్తిఁ
బతిముఖం బై యగ్నిభట్టారకునకుఁ
దరుణ ప్రవాళ సుందర కాంతిఁ దనరు
కరపల్లవంబులు గర మొప్ప మొగిచి................................2260
'వరద వైశ్వానర వరదయాలోల
దురిత సముత్కరతూలవాతూల
మదిలోన వాక్కున మరి చేతలందు
వదలక పతిభ క్తి వరలుదు నేని
నరలోకనుతుడై ననాకూర్మివిభుఁడు
పరమసత్యంబు దప్పక మను నేని
పరమశీత లుఁడ వై ప్రాణదానంబుఁ
గరుణమైఁ దొలుత నక్షత్రున కొసఁగి
మునినాథుఋణమున మునిఁగి పోకుండ
మనుజేశుఁ గొడుకును మఱి కావు' మనుచుఁ ...........................2270
జెచ్చర రాయంచ చెంగల్వకొలను
జొచ్చినగతిఁ జిచ్చుఁ జొచ్చి యానడుమఁ


................................................................................................................

సొగ సైనచిన్న యెఱ్ఱని చేతితో, తరుణ ప్రవాళ సుందర కాంతిన్ = లేతచిగుళ్ల వంటి సొగసైన కాంతితో, దురిత ... తూల - దురితసముత్కర = పాపసమూహర సెడి, తూల = దూదికి, వాతూల= గాలియైనవాఁడా- గాలి దూదిని పింజేలుగా

నెగురఁగొట్టునట్లు పాపసమూహమును నాశము సేయువాఁడాయనుట, కలయ

145

ప్రథమభాగము.

గలయఁ బూసిన కింశుకంబులలోనఁ
జెలు వారు చున్న రాచిలుక చందమునఁ
బ్రబలసంధ్యా రాగపటలంబునందు
సొబ గొందు క్రొన్నె లసోగ బాగునను
మలసి మం డెడు పెనుమంటలలోన
నిలిచి మైఁదీఁ గె కాంతికి వన్నె నిగుడ
దీపింప రాని పాతివ్రత్య మహిమ
కేపార వెఱఁ గంది యెల్ల దేవతలుఁ.....................................2280
బొరిఁ బొరి నుతియింపఁ బువ్వుల వాన
గురి సె నప్పుడు వహ్ని గొబ్బున నడఁగ
నిగుడుకీలలు మాని నివురు పైగప్పి
పొగులుట లుడిగి నిప్పుకలు సల్లారె
నావిధంబునను దావాగ్ని సల్లారి
పోవుటయును మహాద్భుతముగా మెఱసి
తలపువ్వు వాడక తరుణీలలామ


.................................................................................................................

బూసినకింశుక ములు - అంతటను ఎఱ్ఱగా పూచియున్న మోదుగు చెట్లు, ప్రబల . . పటలమునందు = దట్టమైన సంజ కెంజాయలనమూహమునందు, సొబగు ఒందు-= అందగించునట్టి, క్రొన్నెలసోగ బాగునను= లేఁతయు నిడుద గానున్న చంద్ర రేఖ విధమున - ఇట చెంగల్వకొలను, పూచిన మోదుగు చెట్లు, దట్టంపు సంజ కెంజాయలు అగ్ని కిని, 'రాయంచ, రాచిలుక ,గ్రొన్నె ల సోగయనునివి చంద్రమతికి నిజెప్పి నాఁడని తెలియునది. మైదీఁగె... నిగుడ - తీగవంటి మేని కాంతికి యా యగ్నియందు మఱింత కాంతి హెచ్చఁగా, నిగుడుకీలలన్ = సాంగుచున్న జ్వా లలను, నివుఱు పైఁగప్పి =మండుటతీసి పైని నివుఱుగ్రమ్మి,పొగులుట= కుములుట.

తలపువ్వు వాడక = తలయందలి పువ్వు సైతను కందక - ఇంచుకై నను కసుగందక
146

హరిశ్చంద్రోపాఖ్యానము


యెలనవ్వు సిగురొత్త నెప్పటి యట్టు
లలవడఁ జేతు లల్లార్చుచు నెదుర
నలరి యాసండనృత్యముఁ జూపు చున్న......................2290
యాలోహితాస్యుని నక్కునఁ జేర్చి
పాలు చన్నుల జే(పి పయ్యెద దడియ
జడిగొని హర్షాశ్రుజలముల మేనిఁ
దడిపి ముద్దాడుచు ధవునకు నర్థి
నిలఁ జాఁగి మొక్కిన 'నింతి నీయట్టి
కులసతి నాకుఁ గల్గుటఁ గాదె యిట్టి
యాపద లెడఁబాసి యలరంగఁ గలిగె
నీపుణ్యవర్తన నెగడె లోకముల
నే రట్టుఁ దిట్టునా కెసఁగక యుండ
బోరన మునిపుత్రుఁ బ్రోచితి గాన.............................2300
నీనిమి త్తంబున నెలఁత నా కింక
బూని కౌశికుఋణంబును దీర్పఁ గలుగు'
నని యుచితోక్తుల నమ్మహీవిభుఁడు
తన దేవి ప్రియ మారఁ దగ గారవింప
నప్పు డాకౌశీకుం డవ్విధం బెల్ల
దప్పక వీక్షించి తద్దయు నలిగి
“కాలాగ్నిఁ బోనియీకార్చిచ్చు చేతఁ
గాలి వే భస్మంబు గాక తా నిలిచి
పతియును దాను నెప్పటియట్ల కలసి
సుతుని ముద్దాడుచు సురలు నుతింప .......................2310

........................................................................................................

యనుట - ఇది భాషా శైలి, ఎలనవ్వు = చిరునవ్వు, రట్టు=అపవాదము, సీమంత

ప్రథమభాగము.

147

నున్నది కళ్యాణి కొక్కింత యైనఁ
జె న్న రి యుండదు సీమంతవీథి
యలికంబు సెమరింప దలకలు గమర
వెలనవ్వు గడి వ దెసఁగదు దప్పి
చిలుకదు కన్నీరు జిగి దప్పి మేను
సొలయ దేమియుఁ బొగచూరదు వలువ
పసిమి దప్పదు కమ్మపసపు లేఁబూత
కసుగంద వడుగులుఁ గమరవుఁ జేతు
లీతగ వీ తెంపు నీ పెంపు సొంపు
లీ తెరంగీ మేర లీదిట్టతనము..................2320
లెందు మహాశ్చర్య మేమన వచ్చు
నిందుక ళా ధరుం డెఱుఁగు నొక్కరుఁడు
బాపురే నా తపోబలమునకంటే
దీపించు దీనిపాతివ్రత్య మహిమ
పతిభక్తి సతులకుఁ బరమశీలంబు
పతిభ క్తి సతులకు భాగ్యమూలంబు
పతిభ క్తిసతులకుఁ బరమభూషణము
పతిభక్తి సతులకు భాగ్యపోషణము
పతిభ క్తి సతులకు భయనివారణము

...........................................................................................................

వీధి = పాపట రేక, అలిక ము= నెత్తి, అలక లు=ముంగురులు, కమరవు= కాలవు, కడిపోవదు-= వాసన పోవదు- చెడిపోదు. చిలుకదు = తొరగదు-కన్నీరు కారదనుట. సొలయదు=బడలదు, పొగచూరదు వలువ=వస్త్రము మాఁడి పొగయదు, కమ్మపసపు లేఁబూత=మంచిపసపు పలుచగాఁబూసినపూఁత, కసు

గందవు=కొంచెమైనను వాఁడవు, ఇందుకళాధరుఁడు = శివుఁడు, బాపురే
148

హరిశ్చంద్రోపాఖ్యానము

పతిభ క్తి నిఖిలశోభనకారణంబు ................................2330
పతిభ క్తి నింతికిఁ బడయంగ రాని
యతులిత పుణ్యంబు లవి యెందుఁ గలవు
వెఱపింపఁ బోయి తా వెఱచినయట్టి
తెఱఁ గయ్యె నింక నే తెఱఁ గిట మీఁద'
'నని తలపోసి హా యని వెచ్చ నూర్చి
మనమునఁ జలముఁ గ్రమజ నూలుకొల్పి
యడ రెడు తనరూప మమ్యు లెవ్వరికి
బొడ గాన రాకుండఁ బొందుగాఁ గదిసి
వక్షంబు మోము మోవఁగఁ గౌఁగిలించి
నక్షత్రకునకుఁ దిన్నఁగ నిట్టు లనియె......................2340
'
జయ్యన బహువేదశాస్త్ర పారీణు
లయ్యున్న నా శిష్యు లందఱిలోన
వెలయునష్టాదశ విద్యలయందు
బలవంతుఁ గావించి పాటింతు నిన్ను
నేచందమున నైన నీ వధూమణికి
నీ చక్రవర్తిపై నెసఁగినకూరి
వీడి పోవఁగఁ బల్కి విరిపోటు సేసి
జోడుఁ బాపుము దాన సురసమై జరుగు
గైకొని నా సేయుక పటకృత్యములు

...............................................................................................

నెబాసు, వెఱపింపఁబోయి... తెఱఁగయ్యె - ఒక రిని భయ పెట్టఁబోయి తుదకు తానే భయపడినట్లు, చలము=పాఠము, మోము మోవఁగక్ = మొగము వఱకు. మోమును పక్షమును ఒండొంటికి తగులునట్లుగా, విరిపోటు= వీడ్పాటు-ఎడ

బాటు, జోడు= జంట 'దాననాచేయుక పటకృత్యములు సురసమై జరగ

ప్రథమభాగము.

149

లేకున్నఁ గొన సాఁగ లేవు నిక్కువము................................2350
సేయు సూపని కార్యసిద్ధి నా కోదవు
పోయి వచ్చెద'నని పోయె నమ్మౌని
యంత నక్షత్రకుం డామహారాజు
కాంతాశిరోమణిఁ గాంచి దీవించి
దేవి నీ దైన పాతివ్రత్య మహిమ
వేవేల దెఱఁగుల వినుతింప నరిది
యనలకీలావళి కాహుతి యైన
ననుఁ బ్రాణములు గాచి నయమునఁ బ్రోచి
తీక్ష!తి స్త్రీలలో నెన్నఁగా 'మొదలి
పక్ష. మేర్పడఁగ లోపాముద్ర నెన్ని
యాయరుంధతిఁ జెప్పి యనసూయఁ బొగడి
'శ్రీ యలరార శచీదేవిఁ దలఁచి
యలవడఁ గొనియాడ నగుఁ గాక యున్న
పొలఁతులు నీతోడఁ బురుడింపఁ గల రే
కరుణమై నీ యుపకారంబు నాకుఁ
బరఁగఁ జేసిననీకుఁ బ్రత్యుపకార
'మొనరఁ గావించెద నొకమాట వినుము
చనవుమైఁ గౌశిక సంయమి వేడి


.................................................................................................................

ననియన్వయము, సురసమై= మిక్కిలి రసవంతముగా, అనల కీల ఆవళికి = అగ్ని జ్వాలలవరుసకు, ఆహుతి=బలి, "మొదలిపక్షము, = మిక్కిలి మేలయినతరగతి, ఏర్పడఁగాన్ = తేటపడునట్లు, మొదట అరుంధతి మొదలుగా శచీదేవివఱకుఁ గలపతివ్రతల నెన్ని వారితో పోటిగా నిన్ను ను ఎన్న వలయునుగాని, ఉన్న

పొలఁతులు=తక్కియున్న ' కేవల స్త్రీలు, పురుడింపన్ సరిపోల,
150

హరిశ్చంద్రోపాఖ్యానము

క్రమజ నాకుఁగాఁ గైకొని రాజ్య
మిముల నీ కిచ్చి యీ లోహితాస్యుఁ................................2370
బట్టంబు గట్టింతుఁ బరఁగ నీ ముద్దు
పట్టిఁ దోడ్కొనుచు నీ పట్టణంబునకు
రమ్మునీ కిది పొందు రాదన వలదు
నమ్ముము మృష గాదు నా మాట లతివ
యెలమిమై నటు గాక యీరాజు వెంట
నలయక వర్తింప నాశించే దేని
వనహు తాశ నమహా జ్వాలాకరాళ
ఘనతరవిస్ఫులింగముల నంగములు
గమరక పోవచ్చుఁ గాక కల్పాంత
డమరు నిష్ఠుర ఢమఢమ రవ స్ఫురిత.............................2380
పటుతర బ్రహ్లాండ భాండ చండీశ
చటుల రౌద్రాకృతి సమకొనఁ బేర్చు


.............................................................................................................. కౌశికసంయమి :=విశ్వామిత్రమునిని, “నాకుఁగా రాజ్యము క్రమ్మఱఁ గైకొని నీ కిమ్ములనిచ్చి' అని యన్వయము, పొందు గాదు= ఉచితము గాదు. మృష =కల్ల, వన ...హుతాశన ... విస్ఫులింగములన్ వనహుతాశన = 'అడవినిప్పు యొక్క మహా జ్వాలా = గొప్పమంటలయొక్క, కరాళ = భయంకరములైన, మనతర విస్ఫులింగములన్ . మిక్కిలిగొప్పవైన మిడుఁగుఱుల చేత, కల్పాం... రౌద్రాకృతి-కల్పాంత = ప్రళయమందలి, డమరు డమరు వాద్యము యొక్క , నిష్ఠుర = కఠోరమైన, ఢమఢమరవణఢమఢమయనుశబ్దము చేత, స్ఫురిత = అల్ల లార్పలు డిన, పటుతర = మిక్కిలిపటు వైన, బ్రహాండభాండ = కుండలవంటి బ్రహాండ ములుగలవాఁడైన - తనడమరు మ్రోఁతల చేత బ్రహ్మాండముల నల్లలార్చువాఁడైన యనుట, చండీశ - శివునియొక్క, చటుల= మిక్కుటమైన, రాద్రఆకృతి= భయం గరమైన ఆకారము, సమకొనన్ = జతపడునట్లుగా, కుటిల కౌశికు = పంచకుఁ డైన


ప్రథమభాగము.

151

కుటిల కౌశికు తీవ్రకోపొగ్ని శిఖలఁ
బెట పెటఁ బ్రీలక ప్రిదిలి పో వశ మే
యదియును గాక నేఁ డాదిగా నింకం
బదిదినంబులు సిక్కెఁ బలికినమితికి
మునినాథుధన మెట్లు ముందజఁ జెల్లు
వెనుకఁ జెల్లిన దఱవీ సంబు లేదు
లే దుపాయం బింక లేశమాత్రంబు
మేదినీపతి కిట మీఁద నూహింప
నోదవు పేరాకట నుదరి హుమ్మనుచుఁ
గదియు బెబ్బులివ లెఁ గౌశికుఁ డలిగి
తడయక వచ్చి మాధనముఁ దెమ్మనుచు
నడిగి యజ్ఞాని బి ట్టదలించెనేని
కడువడి గర్భంబు గదలి కంపించి
సుడివడి నిన్ను నీ సుతుని నక్కఱకుఁ
యినంతకు నమి పుచ్చు భూవిభుఁడు
తోయజానన నాకుఁ బోఁచినబుద్ధి'
నావుడుఁ జిఱునవ్వు నవ్వి యారాజు
దేవి నక్షత్రకు దెసఁ జూచి పలికె....................................2400
'సతి కేడుగడయును జర్చింపఁ బతియె

.............................................................................................................


విశ్వామిత్రునియొక్క, పెట పెటఁబీలక = పెట పెటమని మాఁడక , ప్రిదిలిపోన్ = జారి తప్పించుకొనిపోవుటకు , నేఁడాది గాన్ = నేఁడు మొదలుకొని, చిక్కె = మిగిలెను, మితికి -గడువునకు, ముందఱుక్ =ఇఁకమీఁద, వెనుకళా = ఇంతకు ముందు, ఉదరి=చలించి, అర్రు ఆని= - మెడపట్టుకొని, సుడివడి తబ్బిబ్బుపడి అక్క ఱకు = ఆవశ్యకతకు- లేక - ఆవశ్యక కార్యమునకు, ఏడుగడ=స్వామి,

152

హరిశ్చంద్రోపాఖ్యానము


పతియ చూ దైవ, మెబ్బంగుల సతికి
బలవంత మగువిధి ప్రాణేశుఁ బాప
వలవంతఁ జెందినవరవధూమణికి
భారంబు హారంబు భాసురగంధ
సారం బసారంబు సారకాసార
తీరంబు దూరంబు తీవ్రసల్లాప
కీరంబు క్రూరంబు కిన్నర మంజు
నాదంబు భేదంబు నవచంద్ర కాంత
వేదులు సూదులు విరచితో ద్యాన
చూతంబు భూతంబు సురభిక సూరి
పూతలు రోతలు పూర్ణ చంద్రికల
మెఱపులు వెఱపులు మెత్తని దూది
పఱుపులు మఱుపులు పరభృతసమితి

.......................................................................................................

చర్చింపన్ =విచారింపఁగా, పాపన్=ఎడఁ బాపఁగా, వలవంతన్ =దుఃఖమును, వరవమణికిన్ - ఉత్తమురాలైన స్త్రీరత్నమునకు, హారము, భారంబు= బరువు, భాసురగంధ సారంబు=మనోజ్ఞ మైనచందనము, అసారంబు=పసలేనిది, సార కాసార తీరంబు = శ్రేష్టమైన సరస్సుయొక్క గట్టు,దూరంబు=దవ్వయినది - పోవనొప్పనిది, తీవ్రసల్లాపకీరంబు=వడిగల పలుకులుగ ల చిలుక , క్రూరంబు=కటు వైనది,కిన్నరమంజు నాదంబు= కిన్నెరవీణ యొక్కయింపయినధ్వని, భేదము = దుఃఖము-దుఃఖకరమనుట. నవచంద్ర కాంత వేదులు = క్రొత్తలై చంద్ర కాంత శిలలయముఁగులు, సూదులు= సూదులు లే నొప్పించునని, విరచిత ఉద్యాన చూతము=చక్కఁగా నేర్పరుపఁబడిన ఎలతోఁటయందలి మామిడి, భూ తంబు=భూత మువలె భయంకరమైనది, సురభి కస్తూరి పూఁతలు= వాసనగల కస్తురిపూతలు అసహ్యములు, పూర్ణచంద్రికల మెఱపులు= పండు వెన్నెల ప్రకా

రోతలు -అసహ్యములు, వెఱపులు=భయంకరములు, మజుంపులు=మఱపునకు పాత్రములు - మర

ప్రథమభాగము.

153

.

కూతలు ఘాతలు గొదమతు మెదల
మ్రోతలు చేతలు ముద్దురాయంచ
మురువులు పరువులు మోహంపుఁ జెలుల
సరసముల్ విరసముల్ చందనానిలపు
మెలఁకువ యలఁకువ మేలి, చెంగావి
జిలుగులు సిలుగులు చివురుఁజప్పరపుఁ.......................2420
బొంతలు వింతలు పూఁబొదరిండ్ల
క్రంతలు వంతలు కమనీయ సరసి
బిసములు నుసములు పృథుమక రంద
రసములు విసములు రమ్యహిమాంబు
పూరంబు గాదు కర్పూరంబు సేఁదు
వీరుండు మారుఁ డీవిధమును గాక
ముదమునఁ గులశీలములు మదిఁ గోరి


......................................................................................................................

చిపోవఁబడునవియనుట, పర భృతసమితి = కోవెలలసమూహము, ఘాతలు= దె బ్బలు- దెబ్బలవ లెగడు సైనవి, వ్రేతలు= దెబ్బలు, మురువులు ఇనడలమురిపములు, పరువులు=పరుగెత్తిపోవునవి - దూరముగా పలాయిత ములగుననుట, చందన అనిల పు=చందనపుఁగొండనుండి వీచుగా లియొక్క, మెలఁకువణ సంచారము-వీచుట, అలఁకువ - ఆయాసము - ఆయాసకరమనుట - జిలుగులు = సన్న వస్త్రములు, సిలు గులు= ఉపద్రవములు, చివుకు చప్పరపు పొంతలు= చిగురుటాకుల తోపన్ని నచౌ క పుపందిరి యొక్క సమీపనులు, వింతలు= ఆశ్చర్యము- అనుభ వించుటయరుద నుట, క్రంతలు=రచ్చలు- - స్థానములనుట, వంతలు=దుఖములు-దుఃఖకరముల నుట.కమనీయసర సి=మనోహర మైన కొలనుయొక్క,బీసములు= తామరతూండ్లు, నుసములు=క నరులు, పృథుమకరందరసములు= గొప్ప పూఁదే నిద్రవములు,రమ్య హిమాంబుపూరంబు = మేలైన పన్నీటిముంపు, కాదు = ఇష్టము గాదు, మారుఁడు వీరుండు = మన్మథుఁడో పరాక్రమశాలి- పురుషునిఁ బాసిన స్త్రీకి మన్మధునిపరా

154

హరిశ్చంద్రోపాఖ్యానము

బ్రదుకుపతి వ్రతారత్నంబులకును
బతి లేని రాజ్యసంపద లవి యేల
పతి లేనిసుతు లేల బంధువు లేల..............................2430

పతి లేనిహితు లేల ప్రాణంబు లేల
మతిఁ దలపోయ నీ మానవేశ్వరుడు
కూర్మి నిలుకడ నా తోడునీడ
సాకన్న పెన్నిధి నా నోముఫలము
నా మేలి చెలికాడు నా పట్టుఁగొమ్మ
నా మెచ్చువల రాజు న న్నేలు రాజు
చిక్కు నే కౌశీకుచిక్కులఁ దగిలి
'వెక్కురువడుగ యీ వెడమాట లుడుగు
నీవు నీ గురుఁడును నిఖిలనిర్జరులు
వేవేల దెఱఁగుల వినుతులు సేయ...................................2440

జగ మెఱుంగఁగ హరిశ్చంద్రభూవిభుఁడు
నెగడుసత్యవ్రతనియతిఁ బెం పొంది

..................................................................................................................

క్రమమునోర్చుట కష్టమనుట, ఈ విధమును గాక = ఈప్రకార మే కాక - అనఁగా నింతవఱకు పతిని బాసిన స్త్రీకి వలపు చేఁగ లుగు పట్టి బాధలు చెప్పియిప్పుడు పాతివ్ర త్యధర్మమునుబట్టి కలుగు నభోగ్యములను జెప్పుచున్నది, నాకూర్మినిలుకడ= నా ప్రేమము ఎడ తెగక నెలకొని యుండు స్థానము, నాతోడునీడ = నన్ను తోడు నీడవలె నెడఁబాయనివాఁడు, నాకన్న పెన్నిధి = నా కుదొర కిన పెద్దలిబ్బి- పెద్ద విధివ లెనాకుఁ బెంపుసొంపులన్ని యుఁ జేయువాఁడు, నానోముఫలము= నేను నోఁచిననోములకు ఫలముగా నుండువాఁడు, నా మేలి చెలి కాఁడు =నాకు మేల, యిన స్నేహితుఁడు, నాపట్టు గొమ్మ= నాకు ఆధారభూతుఁడు, నా మెచ్చు. వలరాజు= నేను మెచ్చిన మన్మథుఁడు, కౌశికు చిక్కులక్ తగిలి చిక్కు నే' అని యన్వయము. కౌశికుఁడుపెట్టుసంకటములందుఁ బడియు నియమముతప్పఁ

.

ప్రథమభాగము

.

155.


వెలయ నష్టాదశ ద్వీపసంధులను
నెలమిమైఁ గ్రమజ నేలు నిక్కముగ'
ననుటయు 'నిది తథ్య' మని వినువీథి
నను వెంద భాషించె నశరీరవాణి
యది విని మదిని నత్యాశ్చర్య మంది
కొదుకుచు నక్షత్రకుం డూరకుండె.

ప్రథమభాగము సమాప్తము.

.........................................................................................................

డనుట, వెడమాటలు=పిచ్చిమాటలు, నిఖిలనిర్జరులు= సమస్త దేవతలు, నెగడు సత్యవ్రతనియతిన్ = ప్రకాశించుచున్న సత్య మేపలి కెడి నియమము యొక్క నిలుకడ చేత, పెంపు= ఐశ్వర్యము, కొదుకుచున్ = సంకోచించుచు.