హిందూ కోడ్ బిల్ సమీక్ష
హిందూకోడ్ బిల్ సమీక్ష
ప్రథమ భాగము
కర్త :
శ్రీ ౧౦౦౮ శ్రీ కరపాత్రీ స్వామి
అనువాదము :
బులుసు ఉదయ భాస్కరము
సాధన గ్రంథమండలి, తెనాలి.
[· వెల రు. 1-0-0
శ్రీరామ జయ రామ జయ జయ రామ
ధర్మస్య జయో౽స్తు
అధర్మస్య నాశో౽స్తు
ప్రాణిషు సద్భావనా౽స్తు
విశ్వస్య కల్యాణ మస్తు
హర హర మహా దేవ
శ్రీహరిః
పూజ్యశ్రీ ౧౦౦౮ స్వామి శ్రీ కరపాత్రీజీ మహారాజువారి
ఆశీస్సులు
నారాయణస్మరణము
హిందూకోడ్ బిల్ దేశములోని సమస్త ప్రాంతముల హిందూమతము మీద హస్తాక్షేపము చేయునదై యున్నది. కావున హిందువు లందఱును దానియొక్క ఘాతకప్రభా వమునుగూర్చి బాగుగా తెలిసికొనుట అత్యావశ్యకమై యున్నది. భారతదేశములో వాస్తవిక బహుమతము (Majority) ధార్మిక ఆస్తిక హిందువులదే యైనను దానిలో ప్రచారలోప మగుటచే జాగృతి చాల తక్కువగా నున్నది. ఆకారణమున ప్రభుత్వము మతముమీద సవారి చేయుట కవకాశము కలుగుచున్నది. హిందూకోడ్ బిల్ ప్రమాణము విషయములో శ్రీ బులుసు ఉదయభాస్కరముగారు తెలుగున ననువాదము కావించిరి. దీని మూలమున తెలుగు మాట లాడువా రందఱు ఆబిల్లుయొక్క సమస్త ఘాతుకములను బాగుగా తెలిసికొని తమ కర్తవ్యమును నిర్ధారించుకొన గలుగుదురు. వస్తుతః ఇట్టి పుస్తకముల యనువాదము భారత దేశములోని సమస్త భాషలలో నవసరమగుచున్నది. భాస్క రముగా రొక ప్రాంతములోని లోపమును బూర్తిగావించినారు.
(సం.) కరపాత్రీ స్వామి
ॐ
ధర్మోరక్షతు
ఉల్లంఘ్య సిద్ధో స్సలీలం సలీలం య శ్మోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలి రాంజనేయమ్.
"రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు రూపొందిన ధర్మము. లోకములో ధర్మప్రతిష్ఠాపనము జేయుటకే శ్రీమహావిష్ణువు, శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినాడు. ఆనాడు దస్యువుల కధిపతియైన రావణాసురుడు, సాక్షాత్తు శ్రీరామచంద్రుని ధర్మరీతిరూపిణి యగు ధర్మపత్నిని, సీతాదేవిని అపహరించి, లోకముల కుపద్రవములను గొనివచ్చినాడు. రుద్రాంశమున ఆంజనేయుడు లోకములో అవతరించి, శ్రీరామచంద్రుని నమ్మిన దూతయై, సీతజాడలు ప్రభువున కెఱిగించి, రావణవధోద్యోగమున శ్రీరామచంద్రునకు చేదోడుగానిలిచి, శ్రీరామచంద్రుని పరమాశయసిద్ధికి మూలకంద మైనాడు.
ఈనాడు మరల లోకములో ధర్మము తారుమారు అగు గతి పట్టినది. దానిని మరల సక్రమముగ నుద్ధరింపవలసిన ఆవశ్యకత యేర్పడినది. అందుకు రామరాజ్య పరిషన్ముఖమున శ్రీ ౧0౦౮ శ్రీకరపత్రీజీ స్వామివారు నడుముకట్టినారు. శ్రీస్వామివారి ఆదేశము ననుసరించి, ఉత్సాహపూరితులు. సమర్థులు అగు పలువురు మహనీయులు, రామదూతలుగా శ్రీస్వామివారి కార్యక్రమమున సన్నద్ధులై నిలిచి యున్నారు. అట్టివారిలో శ్రీ ఈదర వేంకటరావు వంతులుగా రొకరు. శ్రీవంతులుగారు ధనవంతులైనందుకు సార్లకముగా ఎన్నూ దానములు చేసియున్నారు. వీరి ఔదార్యము లోక ములో నలుమూలల గంధవహమువలె అమోఘ యశః పరిమళముతో వ్యాపించుచున్నది. శ్రీ కరపాత్రీజీవారి సత్సం కల్పఫలమైన ధర్మప్రతిష్టాపనకు మూలసంస్థ యగు రామ రాజ్యపరిషత్తు శ్రీ ఈదర వేంకటరావు పంతులుగారి మహారధి త్వమున మనొ ధపార మధిగమింపనున్నది
శ్రీ కరపత్రీజీ స్వామివారిచే సువిపులముగ చర్చింపబడి గ్రంథరూపమున ప్రకటింపబడిన 'హిందూకోడ్ బిల్ సమీక్ష' ఆంధ్రలోకములో నైల్లెడ పుష్కల ప్రచారము గావించుటకు శ్రీ స్వామివారి నారాయణస్మరణానుగ్రహ పూర్వకమైన అనుమతి అయినది. అందులకు రామరాజ్యపరిషద్ధురంధరు లగు శ్రీ ఈదర వేంకటరావు పంతులుగారు తమ సహజ చార్యమునకు, ధర్మనిరతికి నిదర్శనముగా అన్ని విధముల చేయూతనిచ్చి తెలుగున ఈ "హిందూకోడ్ బిల్ సమీక్ష" పుస్తకరూపమున వెలువడుటకు మా సాధన గ్రంథమండలికి ఎంతయు సాయమొనరించిరి. ధర్మదూత యగు శ్రీ ఈదర వెంకట్రావు పంతులు గారికి ధర్మదేవత యగు శ్రీరామచంద్ర ప్రభువు ఇతోధిక ధర్మాభిరతిని, విభవములను, వంశాభివృద్ధిగ ననగునుగాక !
తెనాలి ఖర శ్రావణము
ఇట్లు
బులుసు సూర్యప్రకాశశాస్త్రి,
సంపాదకుడు
సాధన గ్రంథమండలి.
పూర్తి విషయసూచిక
మార్చువిషయసూచిక
1 |
18 |
80 |
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.