హిందూధర్మశాస్త్రసంగ్రహము/పీఠిక

పీఠిక

————

ఈగ్రంథము ముఖ్యముగా ధర్మస్థానములందు వాదించు వకీళ్లుమొదలగువారికి హిందూధర్మశాస్త్రవ్యవహారము క్రమముగా సుఖబోధమగుటకొఱకు రచియింపఁబడినది. ఇది నాతలంపని గ్రంథము చదువఁగా స్పష్టమగును. ఈసంగ్రహము మొదట 1856 సంవత్సరమందుఁ బ్రచురము చేయఁబడ్డది. నాతండ్రి సర్‌ తామసు స్ట్రెంజిగారిచే రచియింపఁబడి - 1824 సంవత్సరమందుఁ బ్రచురము చేయఁబడి సుప్రసిద్ధ మైయుండు "ఎలిమెన్టస్ ఆప్ హిందూలా" యనెడిగ్రంథము దీనికిమూలము. సర్ తామసు స్ట్రెంజిగారు, తాము చూడ ననుకూలించిన శాస్త్రములన్నిటిని ధర్మస్థానములవారుగాని యాపండితులుగాని శాస్త్రములన్ని శోధించి చెప్పిన వచనములన్నిటిని, శోధించి చూచినదిగాక శాస్త్రపఠనము చేసినవారివలన సాధ్యమయినంతసాహాయ్యముఁ బొందెను. అతఁడు దాను బూనుకొన్నవిషయ మదివఱకుఁ బూర్ణముగాఁ బరిశోధింపఁబడినది కాదని యెఱిఁగి యితరులకుఁ దెలుపఁబూనుకొన్నవానికి సరియైన మార్గము దెలుప నెంతవలయు నంత శ్రద్ధ పుచ్చుకొనెను. అతఁడు చేసినయత్నములు సర్వసమ్మతము లవుట నతనిగ్రంథము సర్వప్రదేశములందు మిక్కిలి ప్రామాణికమని యొప్పుకోఁబడియున్నది. నాఁటనుండి నేఁటివఱకు ముఖ్యముగా ధర్మస్థానములవారు జరిగిం