హలో...డాక్టర్/రక్షణ వికటత్వము (Anaphylaxis)
33. రక్షణ వికటత్వము (Anaphylaxis) జీవరాశులు అన్నీ యితరజీవులు, జీవాంశముల ఆక్రమణకు గురి అవుతుంటాయి. అందువలన అవి స్వరక్షణకు బయట, లోపల కూడా రక్షణవ్యవస్థలను వృద్ధిచేసుకుంటాయి. జంతువులు, పక్షుల రక్షణ వ్యవస్థలలో రక్షకకణములు, రక్షకస్రావకములు, రసిగ్రంథులు (lymph glands, ప్లీహము (spleen) ముఖ్యపాత్రను నిర్వహిస్తాయి.
విషజీవాంశములు (viruses), సూక్ష్మజీవులు (bacteria), పరాన్నభుక్తులు (parasites), సొంత దేహమునకు చెందని మాంసకృత్తులు (foreign Proteins), శర్కరమాంసకృత్తులు (glycoproteins) వంటి పదార్థములు దేహము లోనికి చొచ్చుకొన్నపుడు అవి రక్షణ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. రక్షణవ్యవస్థ స్పందనము వలన ప్రతిరక్షకములు ( antibodies) ఉత్పత్తి అవుతాయి. ప్రతిరక్షకముల ఉత్పత్తిని ప్రేరేపించు పదార్థములు ప్రతిజనకములుగా (antigens) వ్యవహరింపబడుతాయి. దేహము రక్షణకణములతోను, ప్రతిరక్షకములు (antibodies) తోను, ఇతర రక్షణస్రావకముల తోను దాడిని ప్రతిఘటించి, దాడి సలిపే సూక్ష్మజీవులను చంపుటకు, విషజీవాంశములను (viruses), విషపదార్థములను తటస్థీకరించుటకు యత్నము చేస్తుంది. శరీరరక్షణకు ఈ ప్రక్రియ అవసరము. కాని ప్రతిజనకములకు (antigens) ప్రతికూలముగా రక్షణవ్యవస్థ స్పందించుట వలన దేహమునకు ఒక్కొక్కసారి ప్రతికూల ఫలితములు కలుగ వచ్చును. వీటిలో అసహనము (allergy) వివిధ స్థాయిలలో ఉండవచ్చును.
రక్షణవ్యవస్థ ప్రతిస్పందన వలన తీవ్రపరిణామములు త్వరగా వాటిల్లి రక్షణవికటత్వము (anaphylaxis) కలుగవచ్చును. తీవ్ర రక్షణవికటత్వమును (anaphylaxis) అత్యవసర పరిస్థితిగా పరిగణించి చికిత్స
- 354 :: చేయాలి. రక్షణ వికటత్వము వలన ప్రాణాపాయము కూడా వాటిల్ల వచ్చును.
కారణములు : రక్షణవ్యవస్థ ద్వారా కలిగే వికటత్వము (Anaphylaxis mediated by Immune system) :
ఆహార పదార్థములు ; వేరుశనగ పిక్కలు, ఇతర పిక్కలు, కాయలు, పలుకులు, పాలు, గ్రుడ్లు, చేపల వలన, తేనెటీగలు (bees), కందిరీగలు (wasps), పులిచీమలు (fire ants) కుట్టడము వలన, ఔషధముల (medicines) వలన, రబ్బరు, రబ్బరుపాలు (latex) వలన, రక్తము, రక్తాంశముల వలన రక్షణవ్యవస్థ ఉత్పత్తి చేయు ప్రతిరక్షకములు (immunoglobulins) కలిగించే రక్షణ వికటత్వము కలుగ వచ్చును. సాధారణముగ ప్రతిరక్షకము -ఇ (Immunoglobulin- E, IgE) వలన ఈ వికటత్వము కలుగుతుంది. అసాధారణముగా ప్రతిరక్షకము - g (immunoglobulin- G, IgG) వలన వికటత్వము కలుగవచ్చును. ఉబ్బస వ్యాధి గలవారిలోను, ఇదివరలో ప్రతిజనకముల (antigens) బారిపడి ఐజి-ఇ IgE ఉత్పత్తిచే అసహనము, వికటత్వము పొందిన వారిలోను ఈ వికటత్వము కలిగే అవకాశములు హెచ్చు. రక్షణవ్యవస్థ ప్రమేయము లేక కలిగే రక్షణ వికటత్వములు : (Anaphylaxis not mediated by immune system) :
ఎక్స్ రే వ్యత్యాస పదార్థములు (Radio contrast materials), కొన్ని ఔషధములు (తాప అవరోధకములు (non steroidal antiinflammatory agents), నల్లమందు సంబంధిత మందులు (opioids), ఏస్ ఇన్హిబిటర్లు (ACE inhibitors), వేంకోమైసిన్ (vancomycin), కండర విశ్రామకములు (muscle relaxants), భౌతిక కారణములు (శీతలము, వ్యాయామము), రక్తశుద్ధి చికిత్సలు (Hemodialysis) రక్షణ వికటత్వమును కలిగించ వచ్చును. ఏబది సంవత్సరముల వయస్సు దాటిన వారిలోను, హృదయ
- 355 :: వ్యాధులు, మూత్రాంగ వ్యాధులు కలవారిలోను, యిదివఱలో వికటత్వ
లక్షణములు కలిగినవారిలోను, అసహనములు (allergies) కలవారిలోను ఈ వికటత్వము కలిగే అవకాశములు హెచ్చు. అయొడిన్ అసహనము వలనకాని, జలచరములకు అసహనము కలిగినవారిలో కాని రేడియో వ్యత్యాస పదార్థములకు (Radio contrast materials) అసహనము కలుగదు.
స్తంభకణ వ్యాధి (mastocytosis) కలవారిలో స్తంభకణములు అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యాధికలవారిలో రక్షణ వికటత్వములు కలిగే అవకాశములు హెచ్చు. వ్యాధి విధానము (Pathophysiology) :
ప్రతిజనకములు (antigens) శరీరములోనికి ప్రవేశించినపుడు రక్షకకణములు ప్రేరేపించబడి ఆ ప్రతిజనకములను ఎదుర్కొనే ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకములలో ప్రతిరక్షకము ఇ (Immunoglobulin E, IgE) అసహన ప్రక్రియను (allergy), వికటత్వ ప్రక్రియను (anaphylaxis) కలిగించుటలో పాల్గొంటుంది. ఈ ప్రతిరక్షకము - ఇ (IgE) క్షారాకర్షణ కణములకు (Basophils), సంధాన కణజాలములో (connective tissue) ఉండు స్తంభకణములకు (mast cells) అంటుకొని ఉంటుంది. ప్రతిజనకములు (antigens) మరల శరీరములోనికి చొచ్చుకున్నపుడు అవి ప్రతిరక్షకము - ఇ (IgE) కి సంధానమయి క్షారాకర్షణ కణముల (basophils) పైన, స్తంభకణముల (mast cells) పైన ఉండు fc గ్రాహకములకు (fragment crystallizable receptors) చేర్చబడుతాయి. అపుడు ఆ కణములు ప్రేరేపించబడి వాటిలో కణికల (granules) రూపములో ఉన్న హిష్టమిన్ (histamine), సీరోటోనిన్ (Serotonin), హెపరిన్ (heparin) వంటి రసాయనములను విడుదల చేస్తాయి. ఈ రసాయనముల వలన సూక్ష్మరక్తనాళికలు స్రవించుట (capillary leakage), కణజాలములో పొంగు, మృదు కండరముల
- 356 :: సంకోచములు దేహమంతటా కలిగి వికటత్వ లక్షణములను కలుగజేస్తాయి.
రక్షణవ్యవస్థ ప్రమేయము లేకుండా వికటత్వము కలిగించు పదారము ్థ లు ప్రత్యక్షముగా క్షారాకరణ ్ష కణములు (basophils), స్తంభకణములు (mast cells) నుంచి కణిక రూపములో (granules) ఉన్న రసాయనములను విడుదల చేసి వికటత్వ లక్షణములను కలిగిస్తాయి. రక్షణ వికటత్వ లక్షణములు :
అసహనము ఉండుటచే రక్షణ వికటత్వము ప్రతిరక్షకము -ఇ (immunoglobulin E) ద్వారా కలిగినా, అసహనము లేకుండా కలిగినా వికటత్వ లక్షణములలో తేడా ఉండదు. వ్యాధి లక్షణములు ప్రతిజనకముల (antigens) బారిపడిన కొద్ది నిముషములలో కాని కొద్ది గంటలలో కాని పొడచూపవచ్చును. కొందఱిలో వ్యాధి లక్షణములు రెండు దశలలో కలుగవచ్చును. కొద్ది మందిలో లక్షణముల నుంచి చాలా గంటల వఱకు ఉపశమనము కలుగక పోవచ్చును. అందువలన వ్యాధిగ్రస్థులను చాలా గంటలు పర్యవేక్షించాలి. దుఱద, దద్దుర్లు (urticaria), చర్మము ఎఱుపెక్కుట, రక్తనాళములు స్రవించి పొంగులు (angioedema), కలుగుతాయి. స్వరపేటికలో పొంగు (laryngeal edema), స్వరపేటిక కండర దుస్సంకోచము (laryngeal spasm), శ్వాసనాళికల దుస్సంకోచముల (bronchospasm) వలన ఆయాసము, శ్వాసకు ఇబ్బంది, శ్వాస వైఫల్యము ( Respiratory failure ) కలుగవచ్చును. రక్తనాళములలో బిగుతు తగ్గుట వలనను, రక్తనాళములు స్రవించుటచే రక్తనాళములలో రక్తపరిమాణము తగ్గుట వలనను రక్తపీడనము తగ్గి వివిధ అవయవములకు రక్తప్రసరణ తగ్గవచ్చును. రక్తపీడనము బాగా తగ్గి అవయవములకు రక్తప్రసరణ తగ్గుటను వైద్యులు ఆఘాతముగా (Shock) వర్ణిస్తారు.
మృదుకండరముల సంకోచము, బిగుతుల వలన కడుపు, పొత్తి
- 357 :: కడుపులలో పీకు, నొప్పి, వమన భావన ( వాంతి కలిగేటట్లు అనిపించుట
nausea ), వాంతులు, విరేచనములు కలుగ వచ్చును.
రక్తప్రసరణ వైఫల్యము, శ్వాసవైఫల్యము మృత్యువునకు దారితీయవచ్చును. అందువలన రక్షణ వికటత్వమును (anaphylaxis) అత్యవసర పరిస్థితిగా ఎంచి తక్షణ చికిత్స అందించవలసి ఉంటుంది. వైద్యులు రోగినుంచి రోగ సమాచారమును త్వరగా తీసుకొంటూ, సత్వర పరీక్ష చేస్తూనే, చికిత్స కూడా వెంటనే ప్రారంభించాలి. కాలయాపన తగదు. రోగి సమాచారములో, ఏ మందులు, ఏ ఆహారములు, లేక, ఏ ఇతర కారణముల వలన వికటత్వము కలిగినదో తెలుసుకోవాలి. వాటి బారినపడిన ఎంత సమయములో వ్యాధి లక్షణములు కలిగాయో, ఏ లక్షణములు పొడచూపాయో తెలుసుకోవాలి.
జీవ లక్షణములు (vital signs ): ధమని వేగము ( pulse rate), రక్తపీడనము ( blood pressure), శ్వాసవేగము (respiratory rate) ధమనీ ప్రాణవాయు సంపృక్తత (pulse Oxygen saturation) లను నిర్ణయించాలి. నోటిని, అంగుటిని, నాలుకను పొంగులకు, శ్వాస అవరోధమునకు పరీక్షించాలి. స్వరపేటికలో పొంగు ( laryngeal edema ), స్వరపేటిక బిగుతులకు (laryngeal spasm), ఊపిరితిత్తులను పరీక్షించి, శ్వాసనాళికల బిగుతును, శ్వాస స్థితిని తెలుసుకోవాలి. హృదయ పరీక్ష, ఉదర పరీక్షలు కూడా త్వరగా నిర్వర్తించాలి. చర్మమును దద్దుర్లకు, విస్ఫోటమునకు (rash), ఎఱ్ఱదనమునకు, పొంగులకు పరీక్షించాలి.
రక్షణ వికటత్వ లక్షణముల తీవ్రత తక్కువగాను, మధ్యస్థముగాను, ఎక్కువగాను ఉండవచ్చును. రక్షణ వికటత్వమును పోలు ఇతర వ్యాధులు :
ఆహార పదార్థములలో సల్ఫైటుల వలన, పాడయిన చేపలలో హిష్టమిన్
- 358 :: ను పోలిన పదార్థములు ఉండుట వలన ముఖము, శరీరము ఎఱ్ఱబడి రక్షణ
వికటత్వమును పోలవచ్చును.
వేంకోమైసిన్ (vancomycin) అనే ఔషధమును సిరలద్వారా బొట్లధారగా త్వరగా ఇచ్చునపుడు ముఖము, దేహము ఎఱ్ఱబడి, దురదను, మంటను కలిగించవచ్చును. దీనిని Redman syndrome గా వర్ణిస్తారు. అది అసహనము (allergy) కాదు. హిష్టమిన్ అవరోధకములను ( antihistamines ) ముందు ఇచ్చి, వేంకోమైసిన్ (vancomycin ) బొట్లధారను నెమ్మదిగా ఇచ్చుటచే ఈ ఎఱ్ఱమనిషి ఉపద్రవమును అరికట్టవచ్చును. కార్సినాయిడ్ సిండ్రోమ్ (carcinoid syndrome) అనే వ్యాధిలోను, ఫియోఖ్రోమోసైటోమా (pheochromocytoma) వ్యాధిలోను కూడా పరంపరలుగా ముఖము, దేహము ఎఱ్ఱబడుతాయి. మద్యము తాగినవారిలోను ఎఱ్ఱదనము కనిపించవచ్చును. హృద్రోగముల వలన, రక్తస్రావము వలన, సూక్ష్మజీవ విషమయ వ్యాధుల (sepsis) వలన రక్తపీడనము తగ్గి ఆయాసము, ముచ్చెమటలు కలుగవచ్చును. ఆఘాతమునకు (shock) సరియైన కారణమును నిర్ణయించాలి. వ్యాధి నిర్ణయము :
రక్షణ వికటత్వమును సత్వరముగ రోగ లక్షణములతో ధ్రువపఱచి వెనువెంటనే చికిత్స చేయాలి. రక్తపరీక్షలైనా , ఇతర పరీక్షలయినా ఇతర వ్యాధులను కనుగొనుటకు అసహనతలకు కారణాలు తెలుసుకొనుటకు మాత్రమే ఉపయోగపడుతాయి. రక్తములో సంబంధించిన ఐజి-ఇ (IgE ) ప్రతిరక్షకములను (antibodies) కనిపెట్టి వాటి విలువలతో అసహనములను నిర్ణయించవచ్చును.
రక్తములో ట్రిప్టేజ్ (tryptase) ప్రమాణములను కనుగొనవచ్చును. రక్షణ వికటత్వము కలిగిన ఒక గంటలో ట్రిప్టేజ్ విలువలు పెరుగుతాయి. ఆరు గంటల పిదప ఈ విలువలు క్రమముగా తగ్గుతాయి. చర్మపు పైపొరలో (intradermal) చాలా తక్కువ మోతాదులలో,
- 359 :: వినీలపఱచి అనుమానము ఉన్న పదార్థములను సూదిమందుగా ఇచ్చి
అసహనములను గుర్తించవచ్చును. ఈ పరీక్షలు నిర్వహించునపుడు జాగ్రత్త అవసరము. వికటత్వ లక్షణములు పొడచూపితే తక్షణ చికిత్స అవసరము. చికిత్స :
రక్షణ వికటత్వమును (Anaphylaxis) రోగ సమాచారము, లక్షణములబట్టి త్వరగా గుర్తించి చికిత్సను సత్వరముగా అందించాలి.
రక్షణ వికటత్వమునకు చికిత్స ఎపినెఫ్రిన్ (Epinephrine). ఎపినెఫ్రిన్ ను ఎడ్రినలిన్ అని కూడా వ్యవహరిస్తారు. దీనిని తొడ వెలుపలి భాగపు కండరములలో సూదిమందుగా (intramuscular injection) ఇయ్యాలి. (తొడ వెలుపలి భాగములో ముఖ్యమైన రక్తనాళములు, నాడులు ఉండవు.) వయోజనులలో 0.3 మి.గ్రా నుంచి 0.5 మి.గ్రా. వఱకు (1 : 1000 ద్రావణములో 0.3 - 0.5 మి.లీ) సూదిమందుగా ఇవ్వవచ్చును. రక్తపీడనము తక్కువగా ఉన్నవారిలోను, శ్వాస యిబ్బంది కొనసాగేవారిలోను ప్రతి 10- 15 నిముషములకు ఈ మోతాదును మఱల మఱల కొనసాగించాలి.
- 360 :: పిల్లలలో ఎపినెఫ్రిన్ ను 0.01 మి.గ్రా / 1 కిలో శరీరపు బరువు
చొప్పున మొత్తము 0.1 మి.గ్రా నుంచి 0.3 మి.గ్రా వఱకు ఇవ్వాలి (1 : 1000 ద్రావణములో 0.1 - 0.3 మి.లీ )
రక్తపీడనము తక్కువగా ఉన్నవారిలోను, శ్వాస శ్రమ అధికముగా ఉన్నవారిలోను ఎపినెఫ్రిన్ ను నాలుక క్రింద (sublingual) కూడా ఈయవచ్చును. కేంద్ర సిరల ద్నారా (అంతర కంఠసిర/Internal jugular vein, లేక అధోజత్రుసిర/Subclavian vein లేక ఊరుసిర/ Femoral vein) ద్వారా కూడా ఎపినెఫ్రిన్ 3 - 5 మి.లీ 1: 10,000 ద్రావణమును ఈయవచ్చును. శ్వాస నాళములో శ్వాసకై (శ్వాసనాళాంతర) కృత్రిమ నాళము (endotracheal tube) అమర్చితే, ఆ నాళము ద్వారా కూడా ఎపినెఫ్రిన్ 3-5 మి.లీ 1 : 10,000 ద్రావణమును 10 మి.లీ లవణ ద్రావణములో వినీలపఱచి ఈయవచ్చును.
వ్యాధిగ్రస్థుల శ్వాసక్రియను పరిశీలించాలి. 100 % ప్రాణవాయువు అందఱికీ అందించాలి. శ్వాసనాళికలలో మృదుకండరముల బిగుతు ఎక్కువయితే బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములను (beta adrenergic receptor agonists) శ్వాస ద్వారా ఇయ్యాలి.
నాలుక, కొండనాలుక, గొంతుకలలో పొంగు ఉన్నా, స్వరపేటికలో పొంగు ఉన్నా, స్వరపేటికలో కండరములు బిగించుకుపోయినా (laryngeal spasm), శ్వాస వైఫల్యము ఉన్నా, శ్వాసనాళములోనికి నోటిద్వారా కాని ముక్కుద్వారా కాని కృత్రిమ (శ్వాసనాళాంతర) నాళమును (endotracheal tube) చొప్పించి కృత్రిమశ్వాసలు అందించాలి. కృత్రిమ శ్వాసనాళమును చొప్పించుట సాధ్యము కాని వారిలో స్వరపేటిక క్రింద ఉన్న క్రైకో-థైరాయిడ్ పొరలో రంధ్రము చేసికాని (crico thyroidotomy), శ్వాసనాళములో రంధ్రము చేసికాని (Tracheosto:: 361 :: my) శ్వాసనాళములోనికి కృత్రిమనాళమును శ్వాసకై అమర్చి కృత్రిమ శ్వాసలను అందించాలి. ద్రావణములు:
రక్షణ వికటత్వము కల వారికి సిరలద్వారా లవణ ద్రావణములను (normal saline) ఇవ్వాలి. రక్తపీడనము తక్కువగా ఉంటే 500 - 1000 మి.లీ లవణ ద్రావణమును (normal saline) సిరద్వారా 15-30 నిముషములలో త్వరగా యిచ్చి ఆపై అవసరమునకు తగ్గట్టు సిరలద్వారా ద్రావణములను ఇయ్యాలి. గ్ లూ కగాన్ ( Glucagon ) :
బీటా గ్రాహక అవరోధకములు (beta adrenergic receptor blockers) వాడే వారిలో రక్షణ వికటత్వ లక్షణములు తీవ్రముగా ఉండి చికిత్సకు ప్రతిఘటన ఉంటుంది. వీరు త్వరగా కోలుకోరు. వీరికి గ్లూకగాన్ (Glucagon) అవసరము. 1 మి.గ్రా. సిర ద్వారా యిచ్చి ఆపై సిర ద్వారా గంటకు 1 మి. గ్రా ను బొట్లధారగా ఇవ్వాలి. గ్ లూ కోకార్టికాయిడ్స్ (Glucocorticoids) :
రక్షణవికటత్వము గల వారిలో గ్లూకోకార్టికాయిడ్స్ వలన తక్షణ ప్రయోజనము చాలా తక్కువ. దశల వారిగా వికటత్వము తిరుగబడకుండా ఉండుటకు మిథైల్ ప్రెడ్నిసలోన్ (methylprednisolone ) దినమునకు శరీరపు ప్రతి కిలోగ్రాము బరువునకు 1-2 మి.గ్రా. చొప్పున ఒకటి, రెండు దినములు వాడవచ్చును. హిష్ట మిన్ గ్రాహక అవరోధకములు ( Antihistamines ) :
దురద, దద్దుర్లు, చర్మ విస్ఫోటము గల వారిలో డైఫెన్ హైడ్రమిన్ (diphenhydramine (Benadryl) 25 మి.గ్రా - 50 మి.గ్రా లు కండరముల ద్వారా కాని, సిర ద్వారా కాని ఈయవచ్చును. వీటి వలన వికటత్వ లక్షణములు వెంటనే ఉపశమించవు. వీరిలో హిష్టమిన్ -2 గ్రాహక అవరోధకములను కూడా వాడవచ్చును.
- 362 :: తేనెటీగలకు, కందిరీగలకు, పులిచీమలకు అసహనము కలవారు,
వికటత్వ లక్షణములు కలిగినవారు తేనెటీగలు, కందిరీగలు కుట్టిన వెంటనే సత్వరముగ తమకు తాము ఎపినెఫ్రిన్ ను తొడకండరములలో తీసుకొనుటకు EpiPen లు లభ్యము . నివారణ :
అసహనము కల ఆహారపదార్థములను, ఔషధములను వాడకూడదు.
తేనెటీగలు, కందిరీగలకు దూరముగా ఉండాలి. వాటికి దగ్గఱలో మసలేటప్పుడు వాటిని రెచ్చగొట్టకూడదు. వైద్యులు వేంకోమైసిన్ (vancomycin) సిరల ద్వారా బొట్లగా ఇచ్చేటపుడు తగిన వ్యవధిలో నెమ్మదిగా ఇవ్వాలి. అవసరమైతే డైఫెన్ హైడ్రమిన్ ను (Diphenhydramine) కూడా ముందుగా ఈయవచ్చును.
రేడియో వ్యత్యాస పదార్థములను ‘ఎక్స్- రే’ ల కొఱకు వాడునపుడు అవసరమైన వారికి ముందుగా ప్రెడ్నిసోన్ (Prednisone), డైఫెన్ హైడ్రమిన్ (Diphenhydramine) వాడాలి. వై ద్యులు, వై ద్యశాలలు ఎపినెఫ్రిన్ ను ఎల్ల వేళలా అందుబాటులో ఉంచుకొవాలి.:
రక్షణ వికటత్వము కలిగిన రోగులకు అత్యవసర చికిత్స అవసరము కాబట్టి దగ్గఱలో ఉన్న వైద్యుల ఒద్దకో దగ్గఱలో అందుబాటులో ఉన్న వైద్యశాలలకో వెళ్ళుట మేలు. చికిత్సకై ఎపినెఫ్రిన్ వాడుటకు వైద్యులు సంశయించకూడదు. చికిత్సలో జాప్యము కూడదు. రక్షణ చికిత్స (Immunotherapy) :
వినీల ప్రతిజనకములను (allergens) తక్కువ మోతాదులలో మొదలుపెట్టి యిస్తూ, క్రమరీతిలో మోతాదులను పెంచుకొంటూ, శరీరములో అసహనమును అణచు రక్షణ చికిత్సలు (suppressive immunotherapies) లభ్యము. తేనెటీగలు, కందిరీగలు, పులిచీమల విషములకు రక్షణ చికిత్సలను విరివిగా వాడుతారు.
- 363 ::