హలో...డాక్టర్/మానసికస్థితి వైపరీత్యములు (Mood disorders)
25. మానసిక స్థితి వై పరీత్యాలు ( Mood disorders ) మనమంతా ఎవరికి వారు తాము ప్రత్యేక వ్యక్తులమని భావిస్తుంటాము. ప్రతి జీవి ఒక తల్లి, ఒక తండ్రి నుంచి ఉద్భవించి, తనచుట్టూ ఉన్న పరిసరములను అర్థము చేసుకొని, వాటికి అనుగుణముగా వర్తించి మనుగడ సాగించడానికి యత్నిస్తుంది. మరి జంతువులలోను, మనుజులలోను అవయవపుంజము, జీవితము మస్తిష్కముతో ముడిపడి ఉంటాయి. మస్తిష్కము విభిన్న ఆలోచనలకు, భావోద్రేకములకు స్థానమయి ఉంటుంది. ఈ మస్తిష్క కణజాలములో ఉత్పత్తి, రవాణా, ధ్వంసమయే రసాయన పదార్థములపై మనోప్రవృత్తులు, మానసికస్థితులు ఆధారపడి ఉంటాయి. మన అందఱి మానసిక స్థితులు కాల,పరిసర పరిస్థితులకు అనుగుణ్యముగా మార్పులు చెందినా కొందఱిలో ఆ స్థితులు విపరీతము అగుటయో, చాలాకాలము స్థిరముగా ఉండుటయో జరిగినపుడు మనోస్థితి వైపరీత్యములు, మానసిక రుగ్మతలు కలుగుతాయి. మానసికరుగ్మతలకు జీవిత కాలములో సుమారు 25 శాతము మంది కొద్దిగానో, హెచ్చుగానో గుఱి అవుతారు. అట్టివారిలో కొంతమంది దిగులుతో ఆత్మహత్యలకు పాల్పడుతారు. కొందఱు భావోద్రేకములతో హింసా ప్రవృత్తులను అలవరచుకుంటారు. మానసికశాస్త్రము ఒక శాస్త్రముగాను, నవీన వైద్యములో ఒక భాగముగాను పరిణామము చెందినది. దిగులు (Depression)
- 280 :: మనందఱికీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వలన
విచారము కలిగినా, ఆ కారణాలు తొలగుట వలన, లేక కాలము మాన్పుట వలనో ఆ విచారము క్రమముగా మరుగవుతుంది. అది సహజ సిద్ధమైన విచారమే కాని రుగ్మత కాదు. ఆ విచార సందర్భములను ఎదుర్కొని, సంబాళించుకొని చాలామంది జీవితమును కొనసాగిస్తారు. అది సహజము. అట్లు కాక దిగులు జీవనవృత్తికి ప్రతిబంధకము కావచ్చును. అప్పడు ఆ విషాదమును రుగ్మతగా పరిగణించవలసి ఉంటుంది. పెనుదిగులు ( Major depression ) :
ఈ మానసికపు దిగులునకు గుఱి అయిన వారిలో విచారము, అనాసక్తి, ఆందోళన, చిరాకు, ఎక్కువగా ఉంటాయి. వీరికి జీవితములో సుఖములపైనా సంతోషకరమైన విషయాలపైనా ఆసక్తి ఉండదు. బంధుమిత్రులకు దూరమయి ఒంటరులు అవుతారు. నిరాశ, నిస్పృహ, నిరుత్సాహములకు లోనవుతారు. వీరి ఆత్మవిశ్వాసము సన్నగిల్లుతుంది. తాము నిరుపయోగులమనే భావన కలిగి ఉంటారు. ఏదో అపరాథ భావనలచే పీడితులవుతారు. ఏవిషయముపైన నిమగ్నత చూపించలేరు. నిర్ణయాలు చెయ్యలేరు. మఱపు పెరుగుతుంది. విపరీతపు కుంగు ఉన్నవారిలో మతిభ్రంశము కూడా కలుగవచ్చును. విపరీతమైన నీరసము, నిద్ర ఎక్కువ అగుట, లేక నిద్ర పట్టకపోవుట, ఆకలి తగ్గుట, లేక హెచ్చగుట, బరువు తగ్గుట, లేక పెరుగుట కలుగుతాయి. రాత్రింబవళ్ళ తేడా జీవితములో తగ్గుతుంది. వీరికి మరణపు ఆలోచనలు తఱచు కలుగుతుంటాయి. కొందఱు మాదకద్రవ్యాలు, మద్యపాన దుర్వినియోగాలకు పాల్పడుతారు. కొందఱిలో దిగులు లక్షణాలు పొడచూపక, వేఱే బాధలతో వారు వైద్యులను సంప్రదిస్తారు. అలసట, నీరసము, తలనొప్పి, కడుపునొప్పి, నడుము నొప్పి ,ఆయాసము, గుండెదడ వంటి బాధలు చెబుతారు. కాని ఆ బాధలు ఒక వ్యాధి లక్షణాలలో ఇమడవు. సాధారణ వ్యాధులకు ఇచ్చే ఔషధాలతో ఆ బాధలు నివృత్తి చెందవు. కొందఱు ఆందోళనతో వస్తారు. ప్రతి చిన్న విషయానికి గాభరా, భయము, ఆందోళన పడతారు. వీరి ఆందోళన అవసరానికి మించి ఉంటుంది.
- 281 :: మందచలనము, విచారవదనము, కళ్ళలో అశ్రువులు వీరి మానసిక
ప్రవృత్తిని తెలుపుతాయి. విశేష మానసికపు క్రుంగు జీవితకాలములో 20 శాతపు స్త్రీలలోను 10 శాతపు పురుషులలోను పొడచూపుతుంది. ఈ రుగ్మత కలిగిన వారిలో సుమారు 10 శాతపుమంది జీవితకాలములో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రుగ్మత 25 శాతమువారిలో ఏదైనా బలవంతమైన కారణముచే ప్రస్ఫుటము అవుతుంది. చిన్నతనపు పెంపకములో అశ్రద్ధ, శారీరకక్షోభ, మానసికక్షోభ, లైంగికవేధింపులకు గుఱి అగుట, నిత్యజీవితములో ఒత్తుళ్ళకు గుఱి అగుట, నిరుద్యోగము, విద్యారంగములో వైఫల్యాలు, సహచరుల, కుటుంబసభ్యుల వేధింపులు యీ దిగులుకు దారితీయవచ్చును. మాదకద్రవ్యాలు, కొన్ని మందులు అకస్మాత్తుగా మానివేసినా దిగులు కలుగవచ్చును. చాలామందిలో పెద్ద కారణాలు ఉండక పోవచ్చును. చిన్న కుంగు ( Minor Depression ) :
కొందఱిలో ఆత్ములను, తల్లిదండ్రులను, జీవిత భాగస్వాములను కోల్పోయినప్పుడు, ఉద్యోగము పోయినా, ఆరోగ్యము సడలినా కలిగే విచారము దీర్ఘకాలము నిలువవచ్చును. మానసికపు కుంగు లక్షణాలు పరిమితముగా దీర్ఘకాలము ఉంటాయి. వీరిలో మద్యము, మాదకద్రవ్యాల దుర్వినియోగము కూడా ఉండవచ్చును. ప్రసవానంతరపు దిగులు (Postpartum Depression) :
- 282 :: కానుపు పిమ్మట 10 - 15 శాతము మందిలో దిగులువ్యాధి
కనిపిస్తుంది. కానుపు అయిన రెండువారముల నుంచి ఒక నెల లోపుల సాధారణముగా యీ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆందోళన, ఆకలి నిద్రలలో మార్పులు, చిరాకు, కన్నీళ్ళు, నిస్సత్తువ వీరికి కలుగుతాయి.
బంధుమిత్రుల తోడ్పాటు, సహకారము, స్మృతివర్తన చికిత్సలు (Cognitive Behavioral Therapy), అవసరమైనపుడు ఔషధములతో యీ దిగులును నివారించ వచ్చును. ఋతు సంబంధపు దిగులు ( Seasonal Depression)
కొంతమందిలో కొన్ని కాలములలో విచారము పొడచూపుతుంది. అమెరికాలో ప్రత్యేకముగా శీతాకాలములో చాలామంది విచారగ్రస్తులము అవుతామని చెబుతారు. వసంతకాలము రాగానే ఆ విషాదము తగ్గిపోతుంది. ద్విధ్రువ వ్యాధి ( Bipolar disorder )
కొందఱిలో ఉన్మాదపు పొంగు (Mania), అప్పుడప్పుడు విపరీతమైన దిగులు (Depression) కలుగుతుంటాయి. నిమ్న, ఉన్నతాలు కలిగే యీ వ్యాధిని ద్విధ్రువ వ్యాధిగా పరిగణిస్తారు. సుమారు 1 శాతము మంది ప్రజ యీ మానసికవ్యాధికి గుఱి అవుతారు. ఈ వ్యాధి పురుషులు, స్త్రీలలో సమాన నిష్పత్తిలో కలుగుతుంది. పొంగు ఎక్కువయినప్పుడు వీరికి ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది. భావములు పరంపరలుగా కలుగుతాయి. ఒక ఆలోచన నుంచి మరియొక ఆలోచనకు మస్తిష్కము ఉఱకలు పెడుతుంది. ఎక్కడలేని శక్తి వీరికి వస్తుంది. నిద్ర అవసరము తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది. ఉద్రేకము ఎక్కువగా ఉంటుంది. గట్టిగా మాట్లాడడము, అనవసరపు వాదనలకు, కయ్యాలకు దిగడము చేస్తారు. ఇతరులు తమకు హాని చేస్తున్నారు అనే ఆలోచనలు కలిగి సంశయ వర్తనముతో (Paranoid behaviour) నిత్యము ఉంటారు. వీరికి శ్రవణ, దృశ్య భ్రమలు (Auditory and Visual hallucinations) మతిభ్రాంతి కూడా కలుగవచ్చును. వీరిలో మాదకద్రవ్యాలు, మద్యముల వినియోగము ఎక్కువగా ఉంటుంది. వీరికి వారి పోట్లాట తత్వము వలన న్యాయ వ్యవస్థతో
- 283 :: గొడవలు ఎక్కువగా ఉంటాయి. వీరు మధ్యమధ్యలో మానసికముగా
కుంగిపోతుంటారు. అప్పుడు వీరి ప్రవృత్తి పూర్తిగా మారిపోతుంది. దిగులు లక్షణాలు అప్పుడు ప్రస్ఫుటమవుతాయి. ఈ ద్విధ్రువవ్యాధి వంశపరముగా రావచ్చును. ఈ ద్విధ్రువ వ్యాధిగ్రస్థులలో కుంగుదల కలిగినప్పుడు ఆత్మహత్యల అవకాశము పెరుగుతుంది. ఇరువది సంవత్సరాల కాలములో సుమారు ఆరుశాతపు వ్యాధిగ్రస్థులు ఆత్మహత్యకు పాల్పడుతారు. పిచ్చి (Schizophrenia )
పిచ్చివ్యాధి గలవారి మానసికస్థితి వాస్తవానికి వైరుధ్యముగా ఉంటుంది. దృశ్యభ్రాంతులు (లేని విషయాలు గోచరించడము; Visual hallucinations), శ్రవణభ్రాంతులు ( లేనివి వినిపించడము ; Auditory hallucinations) కలగడము వలన వీరు నిజ ప్రపంచములో కాక వేఱే లోకములో ఉంటారు. జీవితకాలములో వెయ్యిమందిలో మూడు నుంచి ఏడుగురు వ్యక్తులలో యీ రుగ్మత వేఱు వేఱు స్థాయిలులో కనిపించవచ్చు. వీరిలో కూడా కుంగుదల కలిగే అవకాశాలు మెండు. ఆత్మహత్యలకు వీరు కూడా పాల్పడవచ్చును. మానసికవ్యాధులు యితర వ్యాధుల వలన కూడా కలుగవచ్చును. మెదడు, ఊపిరితిత్తులు, క్లోమములలో కర్కటవ్రణముల (Cancers) వలన మానసిక విభ్రాంతి కలుగవచ్చును.
సూక్ష్మజీవులు కలిగించే, న్యుమోనియా, టైఫాయిడ్ జ్వరము, సిఫిలిస్, మెదడువాపు (Encephalitis), కాలేయతాపము వలన, గర్భనిరోధపు మందులు (Oral contraceptives), రిసెర్పిన్ (రక్తపుపోటుకు వాడే వారు. ఈ దినములలో దీని వాడకము లేదు) బీటా గ్రాహక అవరోధకములు (beta blockers), కార్టికోస్టీరాయిడులు, మూర్ఛమందులు, మైగ్రేను తలనొప్పి మందులు, మానసికవ్యాధుల మందులు, హార్మోనుల వంటి ఔషధముల వలన,. గళగ్రంథి ఆధిక్యత (hyperthyroidism), గళగ్రంథి హీనత (hypothyroidism), సహగళగ్రంథి ఆధిక్యత (hyper parathyroidism), ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడులు ఎక్కువ అగు కుషింగ్
- 284 :: సిండ్రోము (Cushing syndrome) వంటి వినాళగ్రంధి వ్యాధులు వలన,
విటమిన్ బి 3 (నయాసిన్) లోపము వలన వచ్చే పెల్లాగ్ర (pellagra) అనే వ్యాధి వలన, మానసిక ప్రవృత్తులలో మార్పులు కలుగవచ్చును.. చికిత్సలు :
మానసిక వ్యాధులను తేలికగా తీసుకొని, నిర్లక్ష్యము చేయుట మంచి విషయము కాదు. ముందుగానే వ్యాధిగ్రస్ల థు పై కాని, వ్యాధులపై కాని, చికిత్సలపై గాని సరియైన అవగాహన లేక స్థిరాభిప్రాయములు ఏర్పఱచుకొనుట తగదు. మానసికశాస్త్రము, మానసికవ్యాధుల శాస్త్రము దినదినము పరిణతి చెందుతునే ఉన్నాయి. పూర్తిగా నివారించలేకపోయినా యీ వ్యాధులను అదుపులో ఉంచవచ్చును. విషాదవర్తన కలిగిన వారికి కుటుంబసభ్యుల, మిత్రుల, సహచరుల అవగాహన, ఆదరణ, ఆలంబనము, భరోసా చాలా అవసరము. దిగులు స్వల్పకాలము, పరిమితముగా ఉన్నప్పుడు చికిత్సలు అవసరము కాక పోవచ్చును. దిగులు అధికమైనా, ఆత్మహత్య లక్షణాలు ఏ మాత్రము కనిపించినా అత్యవసర చికిత్సలు అవసరము. దీర్ఘ కా ల విషాదమునకు, దీర్ఘ కా ల ఆందోళనకు, పెనుదిగులుకు, ద్విధ్రువవ్యాధులకు చికిత్సలు అవసరము. పిచ్చి (Schizophrenia) గలవారికి చికిత్స తప్పనిసరి. మనస్తత్వవేత్తలు (Psychologists), మనోవ్యాధివైద్యులు (Psychiatrists) యీ వ్యాధులకు సాధారణముగా చికిత్సలు చేస్తారు. స్మృతివర్తన చికిత్సల (Cognitive Behavioral Therapy) వంటి చికిత్సలతో వారి ఆలోచనలను, బాహ్యప్రేరణలను ఏ విధముగా ఎదుర్కొని స్పందించాలో శిక్షణ గఱపుతారు. వ్యాయామము, యోగాభ్యాసములు, కొంత తోడ్పడవచ్చును. మందులు : 1.
అవసరమైనపుడు దిగులు చికిత్సకు ఔషధములను వాడుతారు. ఇవి :
సెలెక్టివ్ సీరోటోనిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు ( Selective Seotonin Reuptake Inhibitors SSRI s) :(ఫ్లుఆక్సెటిన్ ( fluoxetin ), పెరాక్సిటిన్ ( paroxetin ), సెర్ట్రలిన్ ( sertralin ), సిటలోప్రమ్
- 285 :: 2.
3. 4.
5. 6.
(citalopram) మొదలైనవి.
సీరోటోనిన్ నారెపినెఫ్రిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు, (SNRIs) : వెన్లఫాక్సిన్ (venlafaxine), డులోక్సిటిన్ (duloxetine), డెస్వెన్లఫాక్సిన్ (desvenlafaxine) మొదలైనవి.
నారెపినెఫ్రిన్ డోపమిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు (NDRIs) ఉద : బ్యుప్రోపియాన్ (bupropion). ట్రైసైక్లిక్ ఏంటి డిప్రెసెంట్లు (Tricyclic antidepressants): ఎమిట్రిప్టిలిన్ (amitriptyline), నార్ ట్రిప్టిలిన్ (nortriptyline), డెసిప్రమిన్ (desipramine) మొదలైనవి. మొనోఎమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్లు (Monoamine Oxydase Inhibitors).
టెట్రాసైక్లిక్ ఏంటి డిప్రస్సెంట్లు (Tetracyclic Antidepressants): ఉద ; మిర్టజపిన్ (mirtazapine), సాధారణంగా వాడే మందులు.
వాడే మందుల మోతాదులను సవరించుట, దుష్ఫలితములను గమనించుట, వ్యాధిగ్రస్థులను అవసరము బట్టి జాగ్రత్తగా గమనించుట వైద్యుల బాధ్యత. సామాన్య వైద్యులు (General Doctors) చికిత్సకులైతే అవసరమైనపుడు నిపుణులను సంప్రదించాలి. ద్విధ్రువవ్యాధికి (Bipolar disorder) దిగులు మందులు కుదరవు. మానసికవేత్తల సలహా చికిత్సకు తోడుగా, మానసికస్థితిని కుదుటపరచే (Mood Stabilisers) లిథియమ్ (Lithium); వేల్ప్రోయిక్ ఏసిడ్ (Valproic acid), లామిక్టాల్ (Lamictal) టెగ్రటాల్ (Tegretol), వంటి మూర్ఛమందులు; ఒలాంజపిన్ (Olanzapine), రిస్పెరిడోన్ (Risperidone) వంటి అసాధారణ మానసిక ఔషధములు (Atypical antipsychotics) ద్విధ్రువవ్యాధికి వాడుతారు. ఆందోళన ఎక్కువైనవారికి ఆందోళన తగ్గించే మందులు వాడుతారు. మానసికవ్యాధులకు కొత్తమందులు లభ్యమగుట చక్కని పరిణామము.
- 286 :: విద్యుత్ ప్రేరణ మూర్ఛచికిత్స ( Electro Convulsive Therapy ) :
ఔషధములకు లొంగని వ్యాధులకు, మానసిక చలనమాంద్యము (Psychomotor retardation) తీవ్రముగా ఉన్నపుడు, ప్రాణాపాయ పరిస్థితులలోను, మందులకు లొంగని మానసికవ్యాధులకు విద్యుత్ ప్రేరణ మూర్ఛచికిత్స పూర్తిగా మత్తుమందు ఇచ్చి చేస్తారు. ఈ చికిత్స పలు పర్యాయములు చేయవచ్చును. సత్ఫలితములు కలిగినవారిలో సంవత్సరములో ఏబది శాతపు మందిలో వ్యాధి లక్షణములు మరల కనిపించవచ్చును.
ఈ భూమిపై జన్మించిన వారందఱూ అదృష్టవంతులు కారు. మనోవ్యాధికి గుఱైనవారు బంధు, మిత్ర, సహచరులలో ఉంటే వారి వ్యాధులను అర్థము చేసుకొని వారికి బాసటగా నిలిచి, వారి చికిత్సకు తోడ్పడాలి. సమాజము, ప్రభుత్వము కూడా చికిత్స బాధ్యత తీసుకోవాలి.
- 287 ::