హరివారమైతిమి మమ్మవు
ప|| హరివారమైతిమి మమ్మవు గాదనగరాదు | తరముగా దికను మాతప్పులు లోగొనరో ||
చ|| వెన్నడించిసూడువట్టేవిష్ణుమాయ నీకు నేము | యిన్నిటా బంతమిచ్చేము యింక గానరో |
నన్నల వెట్టిగొనేటి సంసారబంధము నీకు | మున్నె కిందుపడితిమి ముంచి దయజూడవో ||
చ|| ఆడించేటి కామక్రోధాదిజూజరులాల | వోడితిమి మీకు దొల్లె వొరయకురో |
వీడనికర్మమ నీకు వెఱచి పూరి గఱచే- | మీడనె ధర్మదార మాకికనైనా బట్టవో ||
చ|| దక్కగొన్న మాలోనితనుభోగములాల | మొక్కితిమి మాకు గొంతమొగమోడరో |
యెక్కువ శ్రీవేకటేశు డేలె మాజన్మములాల | గక్కన వేడుకొంటిమి కపటాలు మానరో ||
pa|| harivAramaitimi mammavu gAdanagarAdu | taramugA dikanu mAtappulu lOgonarO ||
ca|| vennaDiMcisUDuvaTTEviShNumAya nIku nEmu | yinniTA baMtamiccEmu yiMka gAnarO |
nannala veTTigonETi saMsArabaMdhamu nIku | munne kiMdupaDitimi muMci dayajUDavO ||
ca|| ADiMcETi kAmakrOdhAdijUjarulAla | vODitimi mIku dolle vorayakurO |
vIDanikarmama nIku verxaci pUri garxacE- | mIDane dharmadAra mAkikanainA baTTavO ||
ca|| dakkagonna mAlOnitanuBOgamulAla | mokkitimi mAku goMtamogamODarO |
yekkuva SrIvEkaTESu DEle mAjanmamulAla | gakkana vEDukoMTimi kapaTAlu mAnarO ||
బయటి లింకులు
మార్చు
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|