స్వీయ చరిత్రము - రెండవ భాగము/భూమిక



సంపాద కీయభూమిక

శ్రీ రావు బహదూరు కందుకూరి వీరేశలింగము పంతులువారి స్వీయచరిత్రలోని మొదటి భాగమును 1911 సంవత్సరములోఁ బ్రకటించియున్నాము. అప్పటనుండి ప్రయత్నించుచున్నను: అనివార్యము లగు కొన్ని కారణములచేత, రెండవభాగమును, ఇంతవఱకును బ్రకటింపఁ జాలమైతిమి.

ప్రథమసంపుటము వెలువడినప్పటినుండియు వారికి శరీరారోగ్యము చక్కగా లేకున్నను, అధిక శ్రమలకోర్చి, దీనిని రచించి మాయుద్యమమునకుఁ బ్రోత్సాహముఁ గలిగించినందులకు వారికి మాకృతజ్ఞతా పూర్వక వందనముల నర్పించు చున్నాము.

గ్రoథమునందు సమకాలికులగు ననేకులంగూర్చి సందర్భానుసారముగ పంతులవారు, ఒక్కొకచో భూషించుచు నొక్కకచో దూషించుచును వ్రాసియున్నారు. స్వియచరిత్రమువంటి గ్రంథమునందు, ఇట్టి దూషణ భూషణములుండుట వింతకాదు. అట్లు కాని యెడల స్వీయ చరిత్రము, స్వభావమైన

viii

యథార్థ చరిత్రకాఁజాలదు. కొన్ని యెడల పంతులు వారికిని, మాకును అభిప్రాయ భేదములున్నను గ్రంథరచనాస్వాతంత్ర్యము సంపూర్ణముగా వారిదియేయగుటచే (వాసినది వ్రాసినట్లు ప్రకటించితిమి.

మన సాంఘిక విషయము లనేకము లీగ్రంథమునంధుఁ జర్చింపఁబడినవి. ఒక సంఘమునందలి మంచి చెడుగుల రెంటిని చెలిసికొనిననే తప్ప సంఘాభివృద్ధి కనువగు ప్రయత్నములఁ జేయ వీలుండదు. కావున నాంధ్రమహాజను లీ స్వీయచరిత్ర నాద రించుచు సంఘమునందలి గుణదోషములను గ్రహింతరుగాక యని కోరుచున్నాము.

ఇట్లు విధేయుఁడు,
సంపాదకుడు.

చింతాద్రిపేట

ఏప్రెలు 24-1915