సౌగంధికప్రసవాపహరణము/ద్వితీయాశ్వాసము





ద్వితీయాశ్వాసము


ఆవధరింపు నృపాల యవ్వలికధలు
పవమానతనయుండు ప్రత్యక్షమగుచు
నిలిచినఁ గనుఁగొని నృపకుమారుండు
సలలితానందాశ్రుచయములు దొరుగ
కరయుగంబున నున్న ఘనసాలభూజ
మురువడి ధరణిపై నొగి బారవైచి
భయభక్తి వినయసంభ్ర మచిత్తుఁ డగుచు
రయమునఁ బ్రణమిల్లి రహి గేలు మొగిచి

'భీముఁడు హనుమంతుని విశ్వరూపమును జూడఁగోరుట.

జయదయాపాథోధి! జయపుణ్యమూర్తి!
జయజయ, దశదిశాసాంద్రసత్కీర్తి
జయదీనపోషణ! జయసత్కృపాంగ!
జయజయ శ్రీరామ! చరణాబ్జభృంగ!



జయజిత దైతేయ! సన్మునిగేయ!
జయభక్తఫలదాయ! జయయాంజనేయ!
యపరాధి నపరాధి నమితదోషకుఁడ
కపటచిత్తుఁడ నన్నుఁ గాచి రక్షింపు
మని సన్నుతులు సేయ నాపాండుసుతుని
కనికరంబున గ్రుచ్చి కౌగిట చేర్చి
మోదంబుతో జెక్కు ముద్దు ఘటించి
యాదరింపుచు నున్ననగ్రజునకును
దోరంపు వేడ్కలు దుదిఁ బొందులాడు[1]
నేరుపుతో మ్రొక్కె నిలిచి యి ట్లనియె
వనచరకులచంద్ర! వరదయాసాంద్ర!
మునిదేవ నుతకీర్తి! మోహనమూర్తి!
శ్రీ రామపాద రాజీవంబు లర్థిఁ
జేరి సేవింపుచుఁ జెలగుచు నున్న
యానాటి ఘనతావకాకారమహిమ
లేను మాడఁగఁ గోరి యే ప్రొద్దు నుందు



నాచంద మాయంద మాదివ్యమూర్తిఁ
జూచెదఁ గరుణింపు సుజనమందార30
యని వేడుకొన్నట్టి యాపాండురాజ
తనయుని లాలించి తరుచరేశ్వరుఁడు
ఆకాలమున నున్న యట్టిరూపంబు
నీ కాలమునఁ జూప నెట్లగు నన్న?
బెక్కు మార్గంబుల భిన్నంబు లగుచు35
నొక్క విధంబున నుండవు నిలిచి;
తిర మొందఁగా గృతత్రేతాయుగములు
గరిమతో ద్వాపరకలియుగంబులును
వెలయు ససంఖ్యలై వేర్వేర నుండు;
నలచరాచరకోటులాప్రకారములు40
భిన్న మార్గంబులై పృథిని వర్తిలును;
నున్నతోన్నతములై యొనరుచు నుండు
ననిన నాయుగముల నాచారవిధుల
ఘనవర్తనలు దెల్పగా దగు ననిన
కురుకుమారునివమీఁద గూర్మి నెక్కొల్పి45
తరుచరాధీశుండు దగ నిట్లు పలికె




 హనుమంతుఁడు చెప్పిన యుగధర్మములు

పొలుపొందు గృతయుగంబున నాల్గు పాద
ముల ధర్మ మలరుచు భూమండలమున
వర్తిల్లు వర రుక్మవర్ణుఁ డచ్యుతుఁడు
కర్తయై బ్రాహ్మణక్షత్ర విట్కులము
లట యేక వేద క్రియాయోగ్యు లగుచు
పటుపుణ్యలోక సంపదలఁబొందుదురు
మరియుఁ గామక్రోధమదమత్సరముల
మరగరు రోగదుర్మరణముల్ లేవు,
ధర్మజునుజుఁడ త్రేతాయుగమ్మునను
ధర్మంబు మూఁడు పాదముల వర్తిల్లు;
పట్టుగా స్ఫుటరక్తవర్ణుఁడై విష్ణు
భట్టారకుం డుండి ప్రజల రక్షించుఁ;
బొదలుచు జనులు తపోదానసత్య
విదితయోగంబుల వెలయుదు రందు
ద్వాపరంబున ద్విపాదముల ధర్మంబు
చూపట్టుచుండునచ్యుతుఁ డుండు బీత
వర్ణుఁడై జనుల నుర్వర బ్రోచుచుండు



వర్ణాశ్రమంబుల వర్తన ల్గలిగి
స్థిదవేదశాస్త్రచోదితములు నగుచు65
ధరసర్వకర్మముల్ ధర్మముల్ బరగు,
వెలయు గామాదు లా వేశించి యుండు;
కల సత్యనీతిమార్గంబులు దఱుఁగు
ప్రోదిగా కలియుగంబున, ధర్మ మేక
పాదంబున మెలంగు పటుగృష్ణవర్ణుఁ70
డగుచు విష్ణుఁడు బ్రోచు నవనీతలంబు
నొగి జను ల్బహుతమోయుక్తులై యెపుడు
కామాదిదోషసంగతులై యధర్మ
భీమకర్మముల ఱంపిల్లు చుండుదురు[2]
పొలుపొందునట్టి తపోదానమహిమ75
లిల బహుఫలములై యెసగుచు నుండు
ననీ యుగ భేదంబు లన్నియుఁ దెల్పి
యనువొంద దీవించి యరుగు మిం కనిన
యనుమోదమున మ్రొక్కి యభినుతుల్చేసి
వనచరేంద్రుసకు భూవరుఁ డిట్లు బలికె 80



హనుమంతుడు విశ్వరూపమును జూపుట

ఆనాఁటి మీరూప మారసి కాని
పో నన నంజనీపుత్రుఁ డవ్వేళ
నపరిమితం బైన యాకార రేఖ
నిపుణత మెరయనానృపతికిఁ జూపె
గగనంబుఁ గబళించు కనకాద్రివోలె 85
తగిన గాత్రము దిగంతము లెల్లఁ గప్పి
యలమిన వాలయుతాకార మరసి
కలఁగి విస్మయమంది కనుదోయి మొగిని[3]
చింతించి యాభీమసేనుఁ డెంతయును
మంతు కెక్కిన హనుమంతుని కనియె 90

అతిభీషణం బది యత్యద్భుతంబు
వితతంబు నగుచు పృథ్వీగగనంబు
లలమియున్నది నీమహాకార రేఖ
సొలయక కనువిచ్చి చూడఁగా నోప
జాలింపుఁ డనిననాసహజన్ముపల్కు 95



లాలించి మునుపటి యాకృతి నిలచి
మనుజేంద్ర! రక్కసుల్ మార్కొన్న వేళ
నినుమడి ముమ్మడి నేతెంతు నేను
ఎప్పటి నిజరూప మిపుడు జూపితిని
తప్పక చూడుము ధరణీశ యనిన100
విని కాంచి భీముఁడు విస్మయమంది
హనుమంతునకు మ్రొక్కి హస్తము ల్మొగిచి
కనుగొంటి దేవ మీ కమనీయమూర్తి
నిటువంటిబల శౌర్యనిధి గల్గియుండ
నల రాఘవుఁడు రావణాది రాక్షసులఁ105
గెలుచుట చోద్యమే కేసరితనయ!
అరయక పలుమాట లాడితి మిమ్ము
కరుణించి నను బ్రోవఁగాఁదగు ననిన
మన్ననతో హనుమంతుఁ డి ట్లనియె
నన్ను నీ వాడిన నయమింతలేక 110
నిన్ను నేనాడిన నేరముల్గలవె!
అన్నదమ్ములపట్ల నరమర లేల?
జననాథ కన్నులు చల్లఁగా నిన్ను



గనుఁగొనఁగలిగె నాకాంక్ష లీడేరె
అహికేతనునిఁ గూర్చి హస్తినాపురము115
విహితంబుగా నిత్తు వేడ్కతో మీకు
మక్కువ నీవిందు మలయుచునుండు
గ్రక్కున సౌగంధికములు నేదెత్తు
ననిన సంతోషించి యంజనీకూర్మి
తనయుని పాండునందనుఁడు వీక్షించి120
కపినాథ మీ కటాక్షంబున మేమె
యపరాధి యగు కౌరవాధీశుఁ దునిమి
ధర్తనందను చేత ధారుణి యెల్ల
నర్మిలి యేలింతు మనఘచారిత్ర
తరలక నరునికేతనమున నిల్చి125
సొరిది మాబలశక్తి చూతురుగాని
గరిముతోఁ గాంచనకమలము లున్న
తెఱఁగు లామార్గము ల్దెలుపవె యనిన[4]

 



హనుమంతుడు సౌగంధికము లున్న నెలవు చెప్పుట

మనుజేంద్ర కనకపద్మము లున్న నెలవు
లొనరఁ దెల్పెద విను ముత్తరంబునను130
రజతాచలప్రాంతరమ్య దేశమున
రజతకాంచననపరత్న సంఖచిత
సాలగోపురథామ సౌధజాలములు
లాలితాగణ్యకల్యాణసంపదలు
నవనిధానంబులు నవ్యభాగ్యములు135
వివరింపఁగారాని వివిధవస్తువులు
సార్వభౌముఁనిసాటి సామజేంద్రములు
ఖర్వమహాఖర్వఘటసమూహములు
పరికింప పుష్పక ప్రతిమానమైన
సరస నానామణిస్యందనావళులు140
వలనొప్పు నుచ్చైశ్రవము గెల్వ జాలు
కలిత శంఖాసంఖ్య కంఖాణచయము
శతధృతికైన నెంచఁగ రానియట్టి '
యతిశౌర్యథనులు యక్షాదినాయకులు



గలిగి సర్వంసహాకామినీనుదుటఁ
బొలుపొందు పాపటబొట్టోయనంగ
నగ భేదిపుట భేదనంబునకన్న
నగణితంబై పొల్చునలకాపురంబు
ఆపట్టణంబున కధిపతిశౌర్య
దీపితాటోపుండు దినరాజతేజుఁ
డమితధీరోదారుఁ డరిభయంకరుఁడు
సమర నిశ్శంక ప్రచండ ప్రతాపుఁ
డతిబలశాలి ధనాధినాయకుఁడు
ప్రతిభచే సకలదిక్పతులలో నెల్ల
తతకీర్తి గాంచి యంతకు మంతుకెక్కి
శితికంధరుని చెల్మి చేయుచు నుండు;
నతని యధీనమై యఖిలమహీజ
వితతుల ననయంబు విలసిల్లుచున్న
వనమధ్యమున నొక్క వనజాకరంబు
..................సమై వెలయుఁ,
గొమరొందునట్టియాకొలనిలోపలను
కమనీయసౌగంధికమ్ములు గలవు;


పొసఁగ నాకొలనికిఁ బూర్వభాగమున
నసమానబలశౌర్యు లగునట్టి యక్ష
బలము ముక్కోటి నల్వదివేలు గొలువ 165
చలముతోఁ గావలి జాంబీరుఁ డుండు
కనుగల్గి యారులక్షల పదివేలు
దనుజవీరులతోడ దక్షిణంబునను
గంటికి రెప్పగాఁ గాపాడినటుల
నంటి కావలియుండు' హాటకాక్షుండు;170
నెలకొని సాహసాన్వితు లైదుకోట్ల
నలుబదివేలుగంధర్వులు గొలువ '
బలు హెచ్చరికలతోఁ బశ్చిమంబునను
జెలఁగి కావలియుండు చిత్రరథుండు,
నాలుగుకోట్ల కిన్నరసేనతోడ175
కాలకంరాభీల ఘనపరాక్రముఁడు
హత్తి మాణిక్యరథారూఢుఁ డగుచు
నుత్తమోజ్వలు డుండు నుత్తరముననుఁ
సమరంబులో వారి సాధించి నీవు
కమలము ల్దెచ్చుట గానఁగారాదు.180



వారితోఁ గలకంఠివాంఛలు దెలిపి
చేరిక ల్గావించి చెలిమి వాటించి
వినుతులు ప్రకటించి వినయముల్సేసి.
వనజము ల్గొనిరమ్ము వలదు వైరంబు;
మసలఁ జెల్లదు! నీవు మానవపతివి
వసుధాతలాధీశ! వారు దేవతలు;
మహి బలి హోమనమస్కారమంత్ర
మహిత భక్తి జ్ఞానమతులచే వారి
సాధింప నగుఁగాని సాహసక్రియల
సాధింపఁగూడ దాచారంబువలన
ధర్మంబు జనియించుఁ దనరారునట్టి
ధర్మంబువలన వేదములు వర్ధిల్లు
వారువేదముల యజ్ఞములు వర్ధిల్లు
వారక యజ్ఞంబువలన దేవతలు
పరితృప్తు లగుదురు పార్థివోత్తంస
స్థిరబుద్ధిచేఁ గాల దేశంబు లెఱిగి
సాధింప నగునయ్య సామాద్యుపాయ
సాధకంబుల సాహసము సేయవలదు


నుతకీర్తి నిగ్రహానుగ్రహప్రతిభ
లతిభక్తియుక్తి నీయందును గలవు200
అటు గావునను వశ్యు లందఱు నీకు
దిటమున నేతెంచి తెమ్ము పద్మములు
ధర్మమున్నట్టిచో దైవంబు గలదు
ధర్మవర్తను లన్నదమ్ములు మీరు
తలపోయ మీ కసాధ్యంబులు గలవె!205
గెలిచి రమ్మనుచు గౌంగిటఁజేర్చి యతని
శరశరాసనగ దాసాధన ప్రతతి
మరి గొన్ని వరదివ్యమార్గణంబులును
ధర నీడు లేనికోదండబు నొకటి
తిరమొందఁగా నిచ్చి దీవించి పనిచె.210
పనిచినఁదగ మ్రొక్కి పవనవేగమున
చని చని పాండురాజతనూభవుండు
కరిఘటానీకఘీంకారరావములు
నరుదైన తురగహేషారవంబులును
ఘనతర భేరిభాంకారరావములు215
ననుపమసైన్యవీరాలాపములును


భటుల శరాసనజ్యానినాదములు
పటుజయశంఖగుంభ ధ్వానములును
వీనుల విందుగా వినుచు నేతేర
పూనిక నరుదెంచు పుత్త్రునిచలము 220
బలము చలంబు శుంభత్ప్రభావంబు
వెలయు నుద్దండంబు వీక్షించి మెచ్చి
యనిలుండు కనకరత్నాభిషేకములు
తనివిదీరఁగ జేయఁదలంచి వేగంబె
యాయతపడి యున్న తాకారములుగఁ 225
బోయి కాంచనరత్నములరాసు లనఁగ
వినుతికెక్కిన బహువిధమహీజములు
తనరారురు నానాలతానికుంజములు
పరిపూర్ణ కోరకప్రసవజాలములు
బరగు నవ్వనభూమి భావించి చూచి 230
గరుడగంధర్వరాక్షసయక్షబలము
పరికించి జృంభించెఁ బాండునందనుఁడు
కలహంస శుకశారికాకలకంఠ
జలపతంగరథాంగజలయుతం బగుచు




భీముఁడు సౌగంధిక జలజాకరము సమీపించుట


విలసితా మోదముల్‌ వెదచల్లుదాని 235
సలలితసౌవర్ణ జలజాకరంబుఁ
గనుఁగొని చాల వక్కాణించి పొగడి
వనజాకరముఁ జేరవచ్చు నవ్వేళ
యక్షరాక్షససేన లనిలనందనుని
వీక్షించి యత్యంతవిస్మయు లగుచు 240
నారౌర ! యీతని యాకారశౌర్య
సారబలోద్దండసంరంభగరిమ!
పరువడి మనల నేపట్ల నింతైవ
సరకుసేయక నిదె చనుచున్న వాఁడు!
పదపదం డన బాణబాణాసనములు 245
పదపడి దాల్చి నిబ్బరమున, నేఁగి
యవ్వీర శేఖరు ననువెల్లఁ దెలిసి

భీమ, యక్ష రాక్షస సంవాదము

యెవ్వరివాఁడ నీ వెవ్వఁడ ? విచటి
కెవ్వఁడు బనిచెఁ? బే రెయ్యది నీకు?


నివ్వనభూమికి నేలవచ్చితివి? 250
తక్కులు దక్కక తత్తరపడక
నిక్క ౦బుఁ బలుకుమా నృపకులోత్తంస!
యనిన నావీరుల నందఱఁ జూచి
వినయుఁడై - పలికె నావిజయాగ్ర‌జుండు
వినరయ్య నే విన్నవించెద మీకు 255
జనసుతుం డగుపాండుజనపతిసుతుఁడ,
సకలధరాథీశసందోహరత్న
.మకుట ప్రభాజాలమహితపాదార
విందుఁడై జగతిపై విలసిల్లు థర్మ
నందనుతమ్ముడ నను భీముఁ డండ్రు, 260
వనములోఁ గాంచనననజంబుఁ గాంచి
ననబోణి యిటువంటి నలిన మి మ్మనిన
నిచ్చెద నని పల్కి యీజాడ దెలిసి
వచ్చితి; గృపఁ జూచి వనజ మీవలయు;
అన విని పాండురాజాత్మజుఁ జూచి 265
దనుజాధినాథుఁ లెంతయు నిట్టు లనిరి
మానవు లెక్కడ! మహనీయదేవ


సూనములెక్కడ! సులభమె నీకు!
నీలతాంతము లిట నిచ్చువా రెవరు?
పౌలస్త్యుఁ డున్నాఁడు ప్రభుఁ డందఱికిని; 270
నొయ్యన కావలియున్న వారలకు
నియ్య స్వతంత్రంబు లేలీలఁ గల్గు?
విచ్చేయు ధననాథు వేడుము శ్రీదుఁ
డిచ్చిన గైకొను మిట నిల్వఁ జెల్ల
దనిన పాండుతనూజుఁ డావీరవరులఁ 275
గనుఁగొని యిట్లను గలకల నగుచు
గురుతైన క్షత్రియకులమునఁ బుట్టి
శరశరాసనములు చాలఁగఁ బూని
ధూర్తారికోటులఁ ద్రుంచి నల్గడల
వార్తకు నెక్కి యావైఖరినుండి 280
వడిదప్పి నే నర్ధి వర్యుచందమున
నడుగంగఁ జెల్లునా నాబలంబునకు
నుడుగక కావలి యన్నవా రగుట
నడిగితి మిము రాజు నడుగంగ రాదు; 285
ఇచ్చిన మే లగు, నియ్యకయున్న

204

సౌగంధిక ప్రసవాపహరణము




చొచ్చి నేఁగొని సోదు సూనంబు లనినఁ;
గనుగవ విస్ఫులింగము లుప్పల్లి
జననాథుఁ గనుఁగొని సైనికు లనిరి
చనుపరివలెనే యిచ్చటికి నేతెంచి
మనుజకీటమ ! యోరి, మము సడ్డగొనక
శంకలేక మదించి శౌర్యంబు మించి
పంకజాకరతీరభాగంబుఁ జేరి
కొంకక బొంకించి కొని పోదలంచి
చంక దుడ్డును వెండి శరణార్థి దగు నె![5]
నరుఁడవు నీ దానవులము మేము
వెరువవు ప్రజ్ఞలు విడువవు నిన్ను
కరవాలముల కడికండలు చేసి
పరమహర్షంబున భక్షింతు మనుచు
నడిదముల్ ఝులిపించి యత్యుగ్రు లగుచు
వడి జుట్టుముట్టిన వాయానందనుఁ డు
కనుబొమ ల్ముడి పెట్టి కను లెఱ్ఱజేసి

---------------------



ధనువందుకొని గుణధ్వని చేసి యార్చి
ఘనభీకరాకారకఠినమానసుల
వినుతశౌర్యుల దైత్యవీరులఁ గాంచి
చండిపోతులు గుణసాధ్యులుగారు 305
దండసాధ్యులు మహోద్ధండులు మీరు
గాటంపు టమ్ములఁ గదియక మంచి
మాటల మీరు పద్మము లియ్యగలరె!
చేటుబుద్ధులు మాని చెడిపోక వేగ
హాటబ్జము లిచ్చి యనుపుట "లెస్స!310

భీముఁడు యక్షరాక్షసవీరులతో బోరుట

కాదేని నాచండకాండ జాలముల
భేదింతు నని యొక్క భీషణాస్త్రంబు
నారి సారించి యానరనాథమౌళి
ధీరత చెవియాస దివియు నవ్వేళ
యక్షరాక్షససేన లరువదినాల్గు315
లక్ష లొక్కుమ్మడి లావు రెట్టించి
ఆద్దిరో! యీతని హంకారమహిమ!



కొద్దిగా దని యెంచి క్రోధించి మించి
తడబడకడిదముల్ తళతళ మనఁగఁ
గడువడిఁ దొడరి యొక్కటఁ జుట్టుముట్టి 320
పొడువుఁడు పొడువుఁడు పోనీక గదిసి
యడువుఁడు నడువుఁ డత్యంతశస్త్రముల
వేయుడు డాయుడు నింతింత దునెలు
నేయుఁడు గూయుడు చీకాకుపడక
పట్టుఁడు గొట్టుఁడు బలిమి పగ్గములఁ 325
గట్టుఁడు బెట్టుగా ఖండించివైపుఁ
డని యార్చి వేర్చి మహారౌద్రు లగుచు
గొనకొని యత్యంతఘోరశస్త్రముల
ముసలజాలంబుల ముద్గరంబులను
నిశితశూలంబుల నిష్ఠురభింది.330
వాలంబులను గదావలులకుంతములఁ
గోలాహలంబుగా గుప్పి యుప్పొంగి
విక్రమింపుచు నున్న విబుథారి యక్ష
చకంబుఁ గని పాండుజనపాలసుతుఁడు




గహ్వరగగనము ల్గగ్గోలుపడగ![6] 335
సింహనాదము చేసి జృంభించి దనుజ
యక్షవీరులఁ గాంచి యరుణాయమాన
వీక్షణుండై ఘోరవివిధ బాణములు
నిగుడించి బెగడించి నెగులు బుట్టించి
పగయెల్ల సణఁగించి పడగలు ద్రుంచి 340
యురుములు బెకలించి యుదరము ల్సించి
శిరములు ఖండించి చెక్కులు చెక్కి
శరములు నురుమాడి కండలు చెండి
చరణము ల్నరికి పిచ్చలుచేసి జనప
తురగ సంఘముల రౌతుల నుగ్గుచేసి 345
కరివరాహంబుల గణములు గూర్చి
రథితుల జంపి సారధుల మర్దించి
రథరథ్యచయము చూర్ణంబు గావించి
గదఁ బూని విజయశంఖంబుఁ బూరించి

58

సౌగంధిక ప్రసవాపహరణము



యదరించి బెదరించి యటునిటుఁబరసి 350
బిట్టల్క వెన్నంటి భీకర ప్రౌఢి
నట్టహాసము చేసే నమ్మహాబలుడు
అంతట దానవయక్ష సైన్యములు
పంతము ల్చాలించి ప్రతిభలు డించి
యదరి పారెడువారు సరచెడివారు355

బెదరి చూచెడువారు భీతిల్లి 'నేలఁ
బడి కావు మనువారు పదరికల్" చెదరి
తదఁబడువారు పొద ల్డూరు వారు[7]
తరువు లెక్కెడివారు ధైర్యము ల్దూలి
శరణనువారు విచ్చలవిడి దిశల360

పరువు లెత్తెడువారు పడిన గాత్రముల
మరువు చేరెడువారు మరిగూయ వెఱచి
కన్నులు ముకుళించి కదలనివారు
అన్నన్న ! యికఁ బ్రోవు మనియెడు వారు


ద్వితీయాశ్వాసము

209




నదె వచ్చె నిదె వచ్చెననియెడువారు365

గుదిగొన్నదిగులున గుందెడిగారు
బొగులుచు మిగుల వాపోయెడివారు
నగుచు సైన్యాధీశునండకుఁ జేరి
హాహారవంబుల నడల నీక్షించి
సాహసబలశాలి జాంబీరుఁ డప్పు 370
డోహో! భయం బేల నుడుగుడ టంచు
మోహరంబుగ బలంబుల నేర్పరించి
వేరైన రథికులఁ బెంపు చేయించి
భోరునఁ బోరికిఁ బురికొల్పి తాను
వదరుచు సేనాధికతులతో గూడి375
కదియ సన్నద్ధుఁడై గడియ నేతేంచె;
అంతటఁ జెలరేఁగి యక్షాదిబలము
కౌంతేయుమీద నగ్గలికతో నురికి
కనలుచు గర్జించి కరకరి నొరనసి
తనరార సింహనాదములనుజేసి 380
కరవాల ముసల ముద్గర భిండివాల
శరపరంపరలచేఁ జలమున నరికి

210

సౌగంధిక ప్రసవాపహరణము


క్రుమ్మి రెమ్మియు జిమ్మి గ్రుచ్చి నాటించి
బిమ్మటి గొనతేనె పెరవూగినటుల[8]
గదిసిన యక్షరాక్షససేనఁ జూచి385
బెదరక నెదురేఁగి భీమసేనుండు
దురుసుగా నెడలేక తొలుకారువాన
గురియుచందంబున ఘోరబాణములు
సడలక నేయుట సంధించుటయును;
గడు నెఱుంగకయుండఁగా వప్పళించి[9] 390
పక్కలు బిక్కలు పాదము ల్దొడలు
చెక్కలు ముక్కలు చేతులు చెవులు
నడుములు మెడలును నరములు శిరము
లుడుగని గనుక నొక్కుమ్మడి చిదిమి
భటుల నెల్లను బటాపంచ గావించి 395
చటుల భయంకరజ్యారవం బెసఁగఁ
గమకించి తురగసంఘములు నూటాడి



సమదేభకోటులఁ జలమునఁ జంపి
వంతుకు నెక్క మావంతుల జెండి
పంతంబుతో సైన్యపతుల నుగ్గాడి400
పేరైన రథికులపీచంబు లడచి
ఘోరదానవయక్షకోటులనెల్ల
హరిణంపుగుంపుల సదలించి గదుము
హరికిశోరము లీల నార్చి తోలుటయుఁ;
గలఁగె నేనుఁగులు చీకా కయ్యె బలము405
బొరిసిరి దొరలు చప్పుడు మానె హరులు
నరదము ల్బొడియయ్యె హతు లైరి రథికు
లరిమురి గూలె మహాయోధకోటి;
అంతటఁ బోక రౌద్రావేశుఁ డగుచుఁ
గుంతీతనూజుండు కులిశ బాణమున410
నాహవస్థలి హాటకాక్షునిఁ ద్రుంచి
సాహసు నుత్తమోజ్వలు గంధవాహు
శరమున వధియించి జలధ రాస్త్రమున
ధరచిత్రరథుఁ గూల్చి దర్పంబు మెరసి
కనలి జంబీరు పైఁ గవిసి కేతనము 415



ఘనశిలీముఖమున ఖండించుటయును
మలసి జాంబీరుఁడు మార్గణత్రయము
విలయాంతకునిలీల వింట సంధించి
యోరి నరాధమ! యోరీ దుర్మార్గ
యీరీతి పొంగెద వేల నాచేతఁ
జావక పోవోరి చచ్చెద వేని
బోవక నిల్వు నీ పొంగెల్ల నణతు
ననుజూఁడు నినుజూఁడు నా సేన- జూఁడు
పనుపడ నా దివ్యబాణము ల్సూఁడు
మనుచు నాకర్ణాంత మగునట్టు దిగిచి
గొనకొని నేయనాఘోగరబాణములు
పెలుచ నేతెంచి యా భీమువక్షంబు,
గలయించి విలునారి ఖండించి గళము
భేదించుటయుఁ గాంచి బెట్టుగా నార్చి
పాదము ల్ధట్టించి బాహువు ల్సరచి
గదఁ బూని ఇడచి యుగ్రత మోదుటయును
జదియ ధారుణి గూలె జాంబీకుఁ డంత
ఘనతరం బై నసంగర భూమినెల్ల

గనుఁగొని భీముఁ డాగ్రహము చాలించి
వనజాకరము సొచ్చి వనజము ల్దెచ్చి 435
మొనసి వేఱొక్క యమ్ములపొది నించి
తన వచ్చురాక యాధనపతి వినక
చనఁజెల్ల దనుచు నచ్చట నిల్చి యుండె
అంతట హతశేషు లరిగి కుబేరు
నెంతయుఁ గనుఁగొని టుసటుఁ దొట్రు 440

హతశేషులు కుబేరునికి భీమునివృత్తాంతమును దెలుపుట



పడి మ్రొక్కి దత్తరపాటున లేచి
గడగడ వడఁకుచుఁ గలగి యిట్లనిరి
ఓదేవ వినవయ్య యొక వింత నేఁడు
మోదంబుతో నృపమూర్ధన్యుఁ డొకడు
చనుదెంచి బలములఁ జంపి జాంబీరుఁ 445
దునిమి యోధులఁగూల్చి తోయజ ప్రతతిఁ
గొనిపోవుచున్నాడు గురుశక్తి మెరసి

యని సారె సారెకు నదలుచుఁ దెలుప
విని ధనాధీశుఁడు విస్మయమొంది
కనుగవ మిణుగుర్లు గ్రమ్మ ని ట్లనియె,
వింటిరే! యిటువంటివింత లెం దైన!
కంటి రే! యెవరైన గణకతో మున్ను
విన్న కన్నదిగాదు వివరించిచూడ!
కిన్నరగంధర్వగీర్వాణసిద్ధ
పన్నగదై! తేయ పాలకులైన
నన్నుఁ జెన్కఁగ లేరు నరుఁ డొక్కఁడంట
దేవతాభూమి కేతెంచినా డంట!
కావరంబున యోధగణములఁ గూల్చి
గొనకొని కమలము ల్గొని చనె నంట!
కనఁగ నీవార్త నిక్కం బనఁదగునె!
యని బిట్టుగా నట్టహాసంబు చేసి
ఘనయక్షనాథులఁ గనుఁగొన నపుడు
నలు వగ్గలించి యానలకూబరుండు

గలిగె నా కిది కన్నె కయ్యం బటంచు[10]
గొలువుచావడినుండి గుప్పున దుమికి
వలనొప్పఁ దండ్రికి వలగొని మ్రొక్కి
యింతటి పనికి యక్షేశ్వర నీవు
చింతల్ల నేటికి సెల విమ్ము నాకు
చని దేవర యనుజ్ఞ జనపతిఁబట్టి
గొనివత్తు నిపుడె నీకొల్వులోపలికి
మలసి నాతోఁ గొంత మార్కొనెనేని
చలమునఁ గలనీలోఁ జక్కు. గావింతు
నన విని ధననాథుఁ డగుగాక యనుచు
వినుత ధైర్యౌదార్య విక్రమాన్వితుని
జాంగలు రావించి సకలసైన్యముల

నలకూబరుఁడు యుద్ధమునకు వెడలుట



బొంగుచుఁ బిలిపించి భూషాదు లొసఁగి

నలకూబరునిఁ జూపి నయవాక్యసరణి
చెలఁగి వేమరు జెప్పి సెలవిచ్చుటయును;
నెంతయుఁ గెరలి యక్షేశనందనుఁడు
వింతఁగా రణభేరి వేయించి వేడ్క.
నరుణవస్త్రంబులు నరుణభూషణము
లరుణమాల్యంబులు నరుణగంధములు
ధరియించి చండమార్తాండసంకాశ
నిరుపమమాణిక్యనికరసంఖచిత
ధగధగద్ధగిత నిస్తంద్రప్రదీప్తి
నగణితంబై మించు నరదంబు నెక్కి
తనచెలికాండ్రెల్లఁ దగ నలుగడల
ఘనరథారూఢులై ఖర్వము ల్నడుప
నెలమితో గిన్నరు లిరువది గోట్లు
చలమునఁ గెరలి విచ్చలవిడిఁ జనఁగ
యక్షులు పదికోటు లరువదిలక్ష
లక్షీణసాహసులై యేగుదేర
గంధర్వవరు లైదు ఖర్వము ల్పొదలి
బంధురస్ఫూర్తి వెంబడి, జనుదేర

పరువడి గరుడులు పదియారుకోట్లు 495
ధరణి గంపింప నుద్దండత నడువ
దనుజు లిర్వదికోట్లు దర్పము ల్మెరసి
కినిసి కయ్యమునకు గేరుచు నడువ
వరచతుర్ధంతు లిర్వదిరెండు లక్ష
లురుమదారూడి మహోద్వృత్తి గదలి 500
కాటుకకొండల కరణి శోభిల్ల
మేటి తరు ల్లెక్కమీరి యేతేర
జవన సైంధవముల సంఖ్యలు మించి
భువి తల్లడిల్ల నద్భుతముగా నేగ
విలసిల్లు కయ్యంపు వేడ్క బెక్కండ్రు 505
మలయుచు యక్షుకుమారకు ల్నడువ
పదరుచు మొనల నేర్పరచుచు లక్ష
పదివేలు సేనాధిపతులువే జనఁగ
గొడుగులు పడగలు కోటులు మించి
కడువడి వెనువెంట గ్రమ్ముకురాఁగ 510
గంభీర భేరికా కాహళధ్వనులు
కుంభినీగగనము ల్ఘూర్ణిల్లి నిండ

కరదీపమణిదీప కాంతులు దిశల
పరువడి గడుపట్టపగలుగావింప
చెలఁగి ముత్తైదువ ల్సేసలు జల్లి
యలవడ గెలిచి రమ్మనుచు దీవింప
వలనొప్ప తనదు లావణ్యవైఖరులు
నలువొంద యక్షకన్యాసమూహంబు !
గని సౌధవీథులఁగదలనియట్టి
కనకపుఁబొమ్మల గతి నిల్చి చూడ
ఘనబలోద్దండవిక్రమవైభపములఁ
జునుదెంచుచున్న యాసమయంబునందు

తూర్పు తెల్లవారుట



తనవచ్చురాక మార్తాండుండు వేగఁ
దనబాంధవులకెల్లఁ దగఁదెల్పు మనుచు
ననిచిన రయమున నరుదెంచు దూత
యనఁగ శుక్రుఁడు దోఁచె నతికళాస్ఫూర్తి
పనుపడ పద్మినీపరిణయంబునకు
దినరాజువేడ్క నేతెంచు నవ్వేళ

నలిమీర నుదయాచలంబనుభవ్య
విలసితకల్యాణ వేదికయందు 530
నిరువురి నడుమ నిం పెసఁగంగ నిల్వ
తిర మొంద వెలవల్వతెరయో యనంగ
నలవడ సకలజనానంద మగుచుఁ
బొలుపు మీరంగ తూర్పున తెల్లవారె

సూర్యోదయము



అలరుచు నాసమయమున భాస్కరుఁడు 535

మలయక నేతెంచు మార్గంబునందు
ధీరత నెదిరి మందేహాదిదైత్య
వీరులఁబోరిలో నిశిఖజాలముల
నలుకచే ఖండింప నప్పుడు దుముకు
గళగళద్రక్తసంఘాతం బనంగ 540

సరభసప్రతిభల జనుదెంచి పంచ
శరుఁడు ముల్లోకము ల్సాధించివచ్చి
వేవేగ శుకపికవీరసైన్యముల
రావించి తగుననురాగంబుతోడ

నందంద రావించి యలరువేడుకల
విందులు గావించి వెస మదిఁగోరి
బలుబింబముల నవపల్లవ ప్రతతి
నెలమితో రాశి బోయించెనో యనఁగ
పసుపడ నరుణప్రభావైభవములఁ
గనుపించె నుదయరాగంబు తూర్పునను 545
ఏపునఁ జెలరేగి యింద్రజాలికుఁడు
రూపించి సమయ గారుడవిద్యవాఁడు
సుర లెల్ల భావించి చూచి మెచ్చఁగను
హరిహయ! బహుపరా కని హెచ్చరించి
రంగు మీరఁగ నెఱ్ఱగఁ గాగినట్టి 550
బంగరుగుండ్లను బరువడి మ్రింగి
నడుము వే నులిబెట్టి నాలుక సాచి
మెడ గొంత నిక్కించి మిక్కులి గొంతు
సరసుచు జేతులఁ జప్పట లిడుచు
మరలఁ దెప్పించి విస్మయముగా నగుచు, 555
చెలఁగుచు మునిపండ్లచేఁ గొంత నిల్పి
యెలమితో నింగికి యెగసూపె ననఁగ

సముదగ్ర కరసహ స్ర ప్రభాజాల
మనురఁగా నుదయించె నబ్జబాంధవుడు

ఘటోత్కచుడు ద్రౌపదీసహితుఁడై ధర్మరాజుకడ కేగుట



అనఘాత్మ వినవయ్య యవలి సత్కధను 565
ననువొంద తొలినాఁడె యాఘటోత్కచుఁడు
బొదలుచు పాంచాలపుత్త్రిఁ దోడ్కొనుచు
బదరికావనము నిబ్బరమునఁ జేరి
యమసుతాదులకు సాష్టాంగంబు లెరఁగి
క్రమ మొప్పఁ గాంచనకమల మిచ్చుటయుఁ 570
బరమహర్షంబున బాండవాగ్రజుఁడు
పరికించి సంతోషభరితుఁడై యుండె
ప్రేమ నందరి జూచి భీమసేనుండు :
లేమికి బెగడి నల్దిక్కులుఁ జూచి

ధర్మజుఁడు భీమసేనుఁ డేడయని యడుగుట



కాంచనాబ్జముఁ జూచి కలఁగుచునున్న 575
పాంచాలిమోము తప్పక చూచి పలికె

చెలువరో మే మెంతఁ జెప్పిన వినక
చలపోరి కాననసంచారమునకుఁ
దొలగక భీముని దోడ నేఁగితిని
తెలిసె మీరంద ఱేతెంచితి రిటకు 580

కరుణాంబునిధి రానికారణ మేమి?
పరువడి నతని నే పనికిఁ బంచితివి?
అదె నాభుజాదండ మదరుచున్న దియు,
తుద లేక కన్నీరు దుముకుచున్న దియు,
ఇనుఁడు తేజము దక్క యినుపబిల్లవలె 585

గనుపించుచున్నాఁడు'కడలనుత్పాత
ములు దోఁచుచున్నవి పొలతి నిక్కంబు
బలుకుమటన్న నాపాంచాలతనయ
కలఁగుచుఁ దెలికన్ను గవ నశ్రు లొలుక
దల వాంచి ధర్మనందనున కి ట్లనియె 590

ద్రౌపది భీమునివృత్తాంతము ధర్మజుతోఁ జెప్పుట



జననాథ మీయాజ్ఞ జనుదెంచి ఘోర
ననమధ్యమున వాయువశమున వచ్చి

యీకమలము వ్రాలె నిది చూచి నేను
నీకూర్మి తమ్ముని నీరజమ్ములకుఁ
బనిచితి చనియె నాబలశౌర్యధనుఁడు, 595
అనఘ న న్నిటకుఁ బొ మ్మనిన వచ్చితిని!
అనిన చింతించి యా యమతనూభవుఁడు

ధర్మతనయ ఘటోత్కచుల సంభాషణలు



ఘనశౌర్యనిధి ఘటోత్కచుఁ జూచి పలికె.
దనుజాధినాథ మీతండ్రి దానొంటిఁ
జనుచుండ యక్ష రాక్షససిద్ధసాధ్య 600
గరుడగంధర్వశేఖరు లెల్లయెడల
జరియింతు రివ్వని సౌవర్ణ జలజ
ములు దెచ్చు టేరీతి! మోస మే మగునొ!
ఎలమి నచ్చటఁ గావ లెవ్వ రున్నారొ!
తలఁకెద మీయయ్య తడ వాలసించె 605
కలహంబు బహుళంబుగాఁ గల్గె నేమో!
అచ్చటి కరిగి నీ వామేలువార్తఁ
దెచ్చిన నామది దిగులు దీరెడిని

అని యానతిచ్చిన యమసూతిమోము
గనుఁగొని యాఘటోత్క చుఁ డిట్లు పలికె 610
పరమపావనమూర్తి బంధురకీర్తి
గురుకటాక్షనిరీక్ష. కురుకులాధ్యక్ష
చెలువొంద మీపాదసేవఁ జేయుచును
'గొలిచి నే నుండఁగాఁ గొంకు మీకేల?
కందర్పుఁ గన్నయ్య కమలలోచనుఁడు 615
ఇందిరారమణుఁ డహీశతల్పకుఁడు
భవరోగవైద్యుఁ డాపద్బాంధవుండు
రవికోటితేజుఁ డార్తశరణ్యమూర్తి
మదనగోపాలుండు మనపాలఁ గలుగఁ
బెదరి పల్కగ నేమి పృథ్వీతలేంద్ర! 620
అరయంగ యుష్మద్ధయావీక్షణములు
నెరవజ్ర కవచంబు నీతమ్ములకును;
నొనర నీసన్నిధి నున్న వారలను
'జెనకఁగా శక్తుఁడె శితికంఠు డైన?
అవనీశ నీమది ననుమానమైన 625
పవనజు చెంతకుఁ బనుపు పోయెదను

ఎదిరి ముల్లోకంబు లేతెంచెనేని
అదలింతు నేనె మాయయ్యకుఁ జూప
నను గారవించుచు నాతల్లి మెచ్చ
కనకాంబుజములందు గలవింత లెల్ల 630
సిరులొందఁ గొని భీమసేనునిఁగూడి
పర తెంతు నని వేగఁ బయన మౌ నపుడు

నారదాగమనము


పొలుపొంద నిద్దంపుభూతి మైఁ బూసి
కలితమౌ జప మాలికయుఁ గేలఁ దాల్చి
తళుకైన బెళుకు బెత్తము చేతఁ బూని 635
విలసిల్లు పెన్జడ ల్వీపున వ్రాల
సరిగమపదనిస స్వరములఁ బెంచి
వెరవొప్ప ఘనదండవీణె మీటుచును
హరి నమో నారాయణాయ యన్మంత్ర
మురవడి సారెకు నుగ్గడింపుచును 640
పారద నీహార పాటీరహార
తారకామందార తారాచలేంద్ర

శారదాశారద శర సుధాసార
సారవర్ణుఁడు దేశసంయమీంద్రుండు
చనుదెంచుటయుఁ గాంచి శమననందనుడు 645
వినయంబుతో మ్రొక్కి వేడ్కఁ బూజించి
నలువంద నుచితాసనంబున నునుప
నలరి ధర్మజుఁ జూచి యమ్మౌని పలికె
వసుధాతలాధీశ! వాయునందనుండు
మసలక కుసుమకోమలికోర్కెఁదీర్పఁ 650

నారదుఁడు ధర్మజునకు భీమనలకూబర యుద్ధము సంగతిని దెల్పి సహాయము సేయఁ బొమ్మనిచెప్పుట



గమలంబులకు నొగి కాననభూమి
నమితమోదంబున నంజనీతనయుఁ
గనుఁగొని యతనిచేఁ గమలంబు లున్న
యునికి నెల్ల నెఱింగి యొగి నేఁగుదెంచి
వనజాకరం బున్నవనవీథియక్ష 655
దనుజగంధర్వులఁ దార్కొని పోరి
యుక్కుమీరిన నెరయోధులఁ గూల్చి

తక్కినబలములఁ దర్పంబు లణఁచి
కయ్యంబునకుఁ జాల కాలుద్రువ్వుచును
నయ్యెడ నున్న వాఁ డనిలనందనుఁడు, 660
ఎలమి చారులవల్ల నిది యెల్లఁ దెలిసి
నలకూబరుండు సైన్యంబులతోడ
నడచె నాతనిమీఁద నలు వగ్గలించి
తడయక నీవు నీ తనుజులతోడ
ననుజులతోడ నీయబ్జాక్షితోడ 665
మునులతో విప్రసమూహంబుతోడఁ
జనఁదగు; మీర లిచ్చట నిల్వఁ జెల్ల
దని పల్కి త్రిదశమహాముని జనియె
శమననందనుఁ డంత సంతాపమంది
యమరారి కులనాథు నాననాబ్జంబుఁ 670
గనుఁగొని యి ట్లను గటకటఁ బడుచు
దనుజేంద్ర వేగమే తరలఁగాఁవలయు
నలకూబరుఁడు వాయునందను మీఁద
మలసి పోరక మున్నె మన మేఁగఁ దగును.
అనిపల్క, నంత సా యసురనాయకుఁడు. 675

ఘటోత్కచుఁడు తండ్రిసహాయార్థ మరుగుట



జనకుల నల్వుర జలజాతముఖిని
ధారుణీసురల రధంబున నునిచి
వీరాగ్రగణ్యుల వేర్వేఱఁ బిలిచి
బలములతోఁ గూడ బారులు
నలుదిక్కుల నమర్చి నరపతి మెచ్చ 630
తనసరి చెలికాండ్ర దైతేయపతుల
మొనచేసి బలిమిగా ముందఱ నిల్చి
రణభయంకరు లగురధికులతోడ
ప్రణుతి కెక్కిన మూలబలములతోడ
ననుపమ హేమరథారూఢుఁ డగుచు 685
వెనుక దా నిలిచి పృథ్వీమండలంబు
గ్రక్క తిలంగ దిగ్గజములు మ్రొగ్గ
గ్రక్కునఁ గదలె రాక్షసకులేశ్వరుఁడు
చనుమార్గమున రథచక్రఘాతముల
ఘనదైత్యబలపాదఘట్టనంబులను 690
హరిఖురాహతులు వేదండ ప్రచండ
చరణోద్ధతంబుల శైలముల్ ఘోర

కాంతారములు నేలఁ గలసి మాయంగ
నంత మహోద్వృత్తి నరుగుచుండఁగను,

నారదుఁడు కరిపురమునకుఁ బోవుట



అలరు వేడుకల కయ్యపుదిండితపసి 695
పొలుపొందు హస్తినాపురి కరుదెంచి
గురుకృప గాంగేయ గురుసుతకర్ణ
గురుబలాఢ్యులుతోడ కొలువున్నయట్టి
కురుపతియెదుట గ్రక్కున నిల్చుటయును
ధరణీశుఁడప్పుడు తమ్ములు దాను 700
నెదురేఁగి పూజించి హితభక్తి మ్రొక్కి
ముదమున మణిపీఠమునఁ దగ నుంచి
మునినాథ యేపని పూని వచ్చితిరి
నను దయఁబ్రోచి యానతి యియ్యవలయు
నన విని కౌరవాధ్యక్షునిమోము 705
గనుఁగొని యిట్లను గలహభోజనుఁడు,

నారదుఁడు భీమునివృత్తాంతము, ధర్మరాజాదులు సాయము వెడలుటయు, నాదిగాఁగలసంగతులు దెల్పుట



అలకాధిపతిసేన కనిలనూనునకు

గలనైన నెఱుఁగని కయ్యంబు గలిగె
నావార్త విని భూసురావళితోడ
పావనశీలయౌ పాంచాలితోడ 710
తక్కక కవలును ధర్మనందనుఁడు
పొక్కుచు నిదె యిదే పోవుచున్నారు
సమరభీకరుఁడు నిశ్శంకుఁ డర్జునుఁడు
అమరేందుపురి కేఁగె నతఁడు రాఁడాయె;
మంతు కెక్కిన యోధమండలిచేత 715
నింతకు పవనుజుం డేమెయి నగునొ!
యెట్టి వీరునకైన నిద్దరి కొకఁడు
కట్టిన గొరియయుఁ గాదె, భూపాల;
యనిలజు నిడిపించి యఖిలదిక్కులను
వినుతకీర్తుల నించు వీరాగ్రగణ్యు 720
లన్న దమ్ములలో నలుక లెన్నైన
నున్నను బరసేనను దరింపఁదగవు,
ధర నీడులేని భూతలపతి నీవు
నెరయోధు లున్నారు నీసమ్ముఖమునను
దెలిపితి నున్నంతఁ దేటగా నీకు 725

దలఁపఁ దల్లికి లేని దయ దాది కేల ?
ననుచు దిగ్గున లేచి యసురేంద్ర పురికిఁ
జనుదెంచె దేవతాసంయమీశ్వరుఁడు
కురురాజు తనమదిఁ గొంత యుప్పొంగి
పరగ యోధులకెల్ల పయనము ల్సెప్పి 730
కొలువు చాలించి దిగ్గున లేచి నగుచు
జలజా ప్తసుతుని హస్తంబుఁ జేపట్టి
రయమున నొకయంతరంగస్థలమునఁ
బ్రియముతోఁ గూర్చుండి భీమఫల్గునుల
సమధిక సాహస సత్వము ల్దలఁచి 735
కమలాప్తనందనుఁ గనుఁగొని పలికె
నోవీర శేఖర ! యోయిరాధేయ!
యీవేళ మనకోర్కె లెల్ల నీడేరె!

దుర్యోధనాదుల దుర్మంత్రము



నెలకొన్న కంటిలో నెరసులువోలె
విలసిల్లు నిశ్శంక విక్రమాన్వితుల 740
భీమార్జునులఁ గన్న ------- వాటిల్లు

మా మదిలో ననుమానంబు దీర
ధరణిపై భీముండు ధననాథు నెదిరి
దుర మొనరించిన, ద్రుంగుట నిజము;
కొలదీర్చవలె నని గోరుచుండఁగను 745
లలిమీర కాకతాళీన్యాయమయ్యె;
నర్జునుం డొకఁ డున్న నాహవస్థలిని
నిర్జింపఁగా వచ్చు నిజసేనఁ గూడి
తడయక మన మేఁగి ధర్మజుఁ గవలఁ
బడసేసి పాంచాలిఁ బట్టి తేవలయు 750
నని పల్క విని క్రోధుఁడై నరనాథుఁ
గనుఁగొని గద్దించి కర్ణుఁ డిట్లనియె.
మేలయ్య కురురాజ! మెచ్చితి నిన్ను !
స్థూల సూక్ష్మంబుల సుళు వెఱుంగుదువు
బలమరి బ్రాహ్మణపల్లియఁ జేరి 755
తలచెడి యిండిండ్లు తప్పక తిరిగి
తిరిపమెత్తుక తిని ధీరత్వ ముడిగి,
పరదేశులై గుళ్లపంచల మొఱఁగి[11]

బాములపడి వేదబాపలై యున్న
భీమార్జునుల నొకపెద్దఁజేసెదవు 760
సరకుసేయక నాదుసాహసప్రతిభ
గుఱిమేరగలవాఁడు గొలువఁడు నిన్ను
గకవికల్గా నిండ్లు గాల్చు నవ్వేళ
నొక పేదవాఁడైన నొదిగి తా నున్నె!
పోనాడి యాయుధముల దోచునపుడు 765
శూరత్వ మున్నను జూపకుండుదు రె!
కొలువులో నిల్లాలి కోక లూడ్చినసు
దలపడరే బంటుతనము గల్గినను!
నుల్లముల్ భేదిల్ల నుదిరించి పురము
వెళ్ల గా ద్రొబ్బించు వేళల నయిన 770
నొక్కింత జెనకక యుందురే యకట!
మక్కువ చెడి దొడ్డమలలోనఁ జేరి
గతిమాలి యున్న యా కష్టమానవుల
ప్రతిభ లెన్నెదవు నాబాహాబలంబు
దెలిసియు నొక్కింత దెలియవు నీవు; 775
కలఁగెడివాడ నిక్కడ నిల్వు మీవు

సెల విమ్ము నరనాథశేఖర నాకు
కలికి వీనులవిందుగా నిందు నధిప
నరభీము లేల పద్నాల్గు లోకంబు
లరుదెంచెనేని చక్కాడివై చెదను, 780
దలపడి గవలను ధర్మజుఁ దునిమి
బలువేగ పాంచాలి బట్టి తెచ్చెదను,
నావిని రారాజు నగుచు నేతెంచి
వేవేగ రాధేయు వెస గౌఁగిలించి
నర భీము లన నెంత నాయన్న నీకు!, 785
హరిహర బ్రహ్మాదు లైన సమంబె,
తిర మొంద నీమది తెలియంగవలనె
వెరువక నే నంటి వీరాగ్రగణ్య,
మలయ కీనేరము ల్మన్నించు! మనుచు,
వెలయంగ నొకకొన్ని వినయము ల్సేసి,
భూషించి, నవరత్న భూషాదు లొసఁగి,
భీషణంబుగ రణ భేరి వేయి౦చె.

దుర్యోధనుఁడు సైన్యములతో బదరికావనమున కరుగుట

సకలసన్నాహము ల్సవరించి దిశలు
గకవిక ల్గాఁగ శంఖములు పూరించి,
హితులు బంధులు భూతలేంద్రు లేతేర, 795
నతులిత ద్రోణభీష్మాదులు నడువ,
తతశక్తి నూర్గురు తమ్ములు నడుప,
నతులితాటోపులై యాత్మజు ల్నడువ ,
వితతనానావాద్యవిభవవై ఖరులఁ
జతురంగవాహినీ సహితుఁడై గదలె. 800
ఇంద్రునిఁ బోలె నాగేంద్ర కేతనుఁడు
సాంద్ర వైభన మహాత్సాహియై వెడలి
వడి నేగి బదరికావనమున కరిగి

పాండవు లందు లేకుండుట



తడయక పాండునందనుల శోధించి
యెవ్వరులేమి వా రేఁగినజాడ 805
దవ్వుగాఁ గదలి మార్తాండనందనుని



తనయుల హితుల బాంధవుల సోదరుల
గనుఁగొని చేఁజూపి కడిమి యి ట్లనియె
ఇదె యిదె పోయెద రిపుడు పాండవులు
కొదకక వెన్నంటి కూడ నేతెంచి 810
శమనతనూజునిఁ జక్కఁ గావించి
క్రమమున నకులుని ఖండించివైచి
సమరాంగణంబున సహదేవుఁ దునిమి
రమణీయగుణథామ, రామాభిరామ
అలికులవేణి రక్తాంభోజపాణి 815
సలలిత మృదుపాణి సైకత శ్రోణి
కాంచనసుమనాస, కౌముదిహాస
పాంచాల పుత్త్రిని బట్టి తె మ్మనిన
కౌరవాధిపుమోము గనుఁగొని కనలి
భోరున నరదంబు బోనిచ్చి యతనిఁ 820
గూడ నేతెంచి సక్రోధుఁడై మండి
కేడించి చూచి గాంగేయుఁ డిట్లనియె

భీష్ముఁడు దుర్యోధనునకు హితము చెప్పుట



గురుతైన యీమహా ఘోరపాపములు[12]
కురురాజ! నిను గట్టి కుడుపకపోవు'!
మంచివాఁడవువోలె మలసి యేతెంచి[13]

కొంచక యిటువంటి కుటిలముల్ మేలె?
నమ్మి శత్రుఁడవై పగఁ దీర్పవచ్చు.
నమ్మిన జెరచుట నాయమ్ముగాదు[14]
ఈ రేడుజగములు నీచేటుబుద్ధి
వారక దలచినవారికే హాని

పరికించి చూచిన పాండుతనూజు
లరుదైనసాహసుల్ హరి కృప గలదు
వారితోఁ బోర, నెవ్వరికి శక్యంబు!
నేరని యీపను ల్నీతి గాదన్న
యిందరిలోఁ బెద్ద లెవరు లేరైరె 835

యందురు జనులు మాయకీర్తి బాపు
కడిమిచే మాబుద్ధి గాదంటి వేని
యడరు దుష్టచతుష్టయంబును గూడి[15]
పొలియుసేన లటంచుఁ బుల్ల దా విరిచి[16]
యెలమితో జేతికి నిచ్చు నవ్వేళ[17] 840

కర్ణ గాంగేయ సంవాదము



కెరలి కర్ణుండు గాంగేయుని దిక్కు
మరలి పావకు లీల మండి యి ట్లనియె
గంగాతనూభవ కటకటా యిట్టి
వెంగలిపలుకులు వెస పల్కఁదగునె
అందఱికిని దాతవై యున్న యట్టి 845
మందె మేళంబున మము సడ్డఁగొనక
ప్రల్లదంబులు పల్కి, ప్రభువుసన్నిధిని
జెల్లించుకొంటివి చేగాచినాఁడ


మితిలేనియట్టి స్వామి ద్రోహు లగుట
హితశత్రు లగుట మిమ్మెఱుఁగమే మున్ను 850
పాండవు లన నెంత! పద్మాక్షుఁ డెంత:
దండింతు నాహనస్థలి నిల్చి రేని
చేరి మీ కొకబుద్ధి చెప్పెద వినుఁడు
ధారుణీధవుని చెంతల రంతు మాని
మేరతో నుండిన మీసిగ్గు దక్కు 855

క్రూరులై నేరని కూఁతలు గూసి
యడరు గల్పించియు హాస్యముల్ నెరపి
కొదువ లెన్ను చుఁ గోరి గ్రుడ్లెఱ్ఱఁజేసి
వీక్షించి యాపాండవేయులఁ బొగడి
పక్షపాతంబులు పలికితిరేని 860

గురుఁడును గృపుఁడును గురుపుత్రుఁ డీవు
నరిది దుష్టచుతుష్టయంబు నాచేత
జెడుట నిక్కువ మని చేచాచి చాటి
కడిమి మీరఁగ బల్కి గద్ధించుటయును
కురురాజు నీక్షించి గురుసూనుఁ డనియె 865



కురురాజ గురుసూనుల సంభాషణము


  
ధరణీశ నీయెడ తప్పేమి లేదు
నలువంద కమలాప్తనందనుం డనెడి
పలుకొంటె చేరిన పాప మొక్కటియె
ఇన్న రాధము పల్కు లిచ్చగించుటకు
నిన్నుంచి యిది యొక్క నేరంబు గలిగె870

మెలఁగుచు నీపాలిమృత్యువై చేరి
సొలవక నాసలఁ జూపి నమ్మించి[18]
శంకింప కిట నిన్నుఁ జంపింతు ననుచు
గంకణం బిదె చేతఁ గట్టి యున్నాఁడు
అదిగాక రాధేయు ననువెల్ల వినుము;875

కదలని నెరబంటు కైవడి వదలి
కదనంబునకు నిన్నుఁ గదియించి మీఁద
సదపడి కార్యంబు పైకొననేని
యనిలోన నిను డించి యరుగు వేగంబె ,
మన మెఱుంగమె! కర్ణు మగతనంబెల్ల 880


వరుస నీసామ్రాజ్య వైభవంబునకు
గెరలితోఁచిన ధూమకేతు వర్కజుఁడు
నలువంద దుర్యోచనలు మాని వారి[19]
గలసి సహాయంబు గమ్ము వేవేగ
జననాథ మీబుద్ధి సరిపోవదేని 885
యినతనూజునిఁగూడి యీసేన లడఁగు
ననఁ దోఁకద్రొక్కిన యహిరాజులీల
ఘనరోషచిత్తుఁడై కర్ణుఁ డి ట్లనియె

కర్ణ గురుసూనుల సంవాదము



ముది మది దప్పిన ముదుకఁ డటంచు
వదరినఁ గాచితి వాహినీసుతుని 890
బాపఁడ వీవు నీపని యన నెంత?
భూపతి వినుచుండఁ బొంగెద విపుడు[20]
కోపించి నిన్నంటి గూల్పక యున్న
నాపంత మేటికి ననుఁ జూడు మనుచుఁ

గరమున బెడిదంపు ఖడ్గ మంకించి 895
గురుతనూభవునిపై గురుశక్తి నడచె
కనలి యశ్వత్థామ కర్ణునిమీఁద
ఘనకరవాలంబు గైకొని కెరలి
యరదంబు దుమికి చయ్యన నగుదేర
గురుఁడుఁ గౌరవరాజు గొబ్బున నరిగి 900
కర మర్థి నెడసొచ్చి ఘనుల నిర్వురను
నరికట్టి వారించి ననునయింపుచును

ద్రోణుఁడు దుర్యోధనుఁడు వారి నిద్దఱిని వారించుట.



బరువడి నలుగడల్' బావించి చూచి
గురుఁ డిటులను నృపకుంజరుఁ గాంచి
నరవర కంటివే నా చేతిదిక్కు

ద్రోణుఁడు దుర్యోధనునితోఁ బ్రసంగించుట, ఆతఁడు చెప్పినహితము



నరధూమకేతువువలె మిన్ను ముట్టి
గాఢవిస్ఫూర్తులు గనుపట్టెనదిగొ
రూఢిగా గండభేరుండ ధ్వజంబు



వాఁడెపో భీముని వరనందనుండు
వాఁడి మించిన మహావరబలాధికుఁడు910
అరిది ఘటోత్కచుం డరుదెంచె నింక
హరిహర బ్రహ్మల కైన శక్యంబె!
యీకర్ణుసాహసం బెంతైనఁ గలదు!
చేకొని యొకబుద్ధి చెప్పెద వినుము
ఎవరైనఁ దనబల్మి యెదుటి బల్మియును 915
వివరించి చూడక వేగిరపడిన
మనుజేంద్ర మోసమౌ మానుము కినుక
చెనకిరో ని న్నేమి చేసిరో వారు
వారితో నీ కింత వైర మేమిటికి?
ఘోరరాక్షసులతోఁ గూడి యున్నారు 920
గరిమెతో బంధువర్గమ్ములు మీరు
వరుసతో బురిఁ జేరవలసితిరేని
పడుచుబుద్ధులు మాని పాండవేయులకుఁ
గడిమి సహాయంబు గండు వేవేగ;
అది సరిపోదేని యవనీతలేంద్ర925
కదలు శీఘ్రంబునఁ గరిపురంబునకు



మనము వచ్చినయట్టి మర్మము ల్వినిన
నిను సాగనీయఁడు నిర్జరాహితుడు,
అన విని కోపించి యాచార్యుమోముఁ
గనుఁగొని యిట్లను గమలాప్తసుతుఁడు. 930
పరమాన్న మొబ్బట్లు పప్పుబూరెలును

కర్ణుఁడు ద్రోణుని దూషించుట



బరువంపుశిఖరులు పచ్చళ్లు తేనె
లొరపైనకూరలు నూరగాయలును
బరకాళిపెరుగుతో బరిపూర్ణములుగ
బారణ ల్గావింపఁ బ్రౌఢులు గాని 935

మీరిన పనులకు విూ కెంత దవ్వు!
అధికు నల్పునిఁ జేయ నల్పమానవుని
అధికునిగాఁ జేయ నటునిటుఁ బొరల
విరిపోటుఁ గల్ఫింప వికలము ల్సేయ
బిరుదువాక్యము లాడ బెక్కులు ప్రేల 940
వేలారువిధముల విమతులఁ బొగడ
నేలిన పతికార్య మెంతయుఁ జెరుప


మీరె సమర్థులు! మిము నెర నమ్మి
ధారుణీపతి వచ్చెఁ దా వెఱ్ఱిగాఁడె!
గొంటుసుద్దులు చేరి గూయనేగాని 945

బంటుపంతము లేల బాపనయ్యలకు
అదె ఘటోత్కచుఁ డని యడరు గల్పింప
బెదరునే కర్ణుండు! వ్రేల నేమిటికి!
మొనమాట లనిన భీష్ముని గుండె లవియ
విను నీతనూజుండు వికలంబు నొంద 950

నీవు సిగ్గువహింపఁ గృపుఁడు భేదిల్ల
గోవిందుఁ డెందము గొందల మంద
గరుణ పాండవులపైఁ గలవారికెల్లఁ
విరవిర హృదయముల్ వ్రీలి బెగ్గిల్ల
దలపడి శమననందనుని ఖండించి 955

మలసిన మాద్రికుమారులు జంపి
తెగువ ఘటోత్కచుఁ దెగటార్చకున్న
నగరె! మీ రందఱు నను జూచి నపుడె
యన విని కృపుఁడు మార్తాండనందనుని 960

కర్ణకృపాచార్య సంవాదము



గనుఁగొని డగ్గరి గద్దించి పలికె 960
మేలు! మేలుర! కర్ణ! మేదినీరమణుఁ,
డాలించి వినుచుండ నాడినఁ జెల్లె
నదరెదు ద్రౌపదీపతులకు నీకు
మది నెంచఁగా హస్తిమశకాంతరంబు !
వారి యేవురిలోన వాసవతనయుఁ965
డీరేడుజగముల నెనలేని మేటి
అరయంగ నీకు దైత్యాధీశునకును
మరి తృణ మేరుసమానంబు లగుట;
నిరనొంద భీముని నెంచ నేమిటికి  ?
నరయ హిడింబ బకాసురు ల్సాక్షి 970
హరిపుత్త్రుబలిమికి యంత్రమత్స్యంబు
నరుదైన చిత్రసేనాదులు సాక్షి
పాండునందనులతో బగఁ గొనుటెల్ల
గొండతోఁ దగరు డీ కొనునట్లు గాదె ;
ఎందైన ఘనులవొ ప్పెఱుఁగంగ రాదు975
పందలకే పెద్ద బారెడునోరు


మాయురే! నినువంటిమగఁటిమి బంటు
ఈయోధవరులలో నెవ్వరు లేరు !
మీ దెఱుంగవు పద్దుమీరినపనులు
గాదన్న వారలఁ గరువఁ బోయెదవు!980
కలగవు సిగ్గెఱుంగవు మొఱ్ఱిఁ దెచ్చి
వలసి పైఁ బెట్టిన వైఖరి నీవు
తలపెట్ట పరువెత్తఁ దలఁచుకొన్నాఁడ ,
విల నీకు వగచు వా రెవ్వరు లేరు
నీపల్కు నెర నమ్మి నిక్కువ మనెడి 985
భూపతి కొకయింత బొక్కెద మిపుడు ?
నెలవైన మాబుద్ధి నీ వేల వినెదు
చెలఁగి దైత్యుఁడె బుద్ధిఁ జెప్పెడు నీకు
కలఁక పుట్టెడిని నిక్కంబుఁ బల్కినను
నిలుకడగా నీత నేరనివారి 990
గంగమ్మ కొనిపోవుగాని మాకేల?
అంగరాజ్యాధిప యరుగు పొమ్మనిన

కర్ణుడు కృపునిపై కురుకుట



నొదిరి కోపించి మహోగ్రుడై కర్ణుఁ

డుదుటునఁ గృష్ణునిపై కురికి ఖడ్గంబు
ఝళిపించి వేయ నశ్వత్థామ గినిసి 995
తళతళ మనుగదాదండంబు బూని

అశ్వత్థామ కర్ణుని శిరము మోదుట



వాలు చూర్ణముచేసి వనజా ప్తసుతుని
ఫాలంబు వ్రయ్యలై పగల మోదుటయు
బెడిదంపుమూర్ఛల బెట్టుగా ధాత్రిఁ
బడి లేచి యినజుండు ప్రళయమార్తాండ 1000
సదృశుఁడై నేర్చి యాచార్యనందనుని
గొదుకక నడిరొమ్ము గుప్పునఁ బొడువ
నది దాకి గురుసూనుఁ డర్కనందనుని
గుదికిలఁ బడద్రోచి గుండియ ల్బగులఁ
బిడికిటఁ బొడిచిన భేదిల్ల కతఁడు 1005

కర్ణ అశ్వత్థామల యుద్ధము



తడయక చంగున దాటి వేరొక్క
కరవాలు కేడెంబు గైకొని నడచె
కురువీరు లద్రువ గగ్గోలుగా నార్చి

యడిదంపు పలక రయంబునఁ బూని
నడతెంచె యాచార్యనందనుం డపుడు; 1010
తడఁబడి కార్యంబు దప్పె నటంచుఁ
దొడిబడి నరదంబు దుమికి యేతెంచి
నరపతి యిరువురనడుమ దాఁ నిలిచి
గురునందనునకు మ్రొక్కుచు మస్తరించి[21]
గరిమతోఁ గర్ణుని గౌఁగిటఁ జేర్చి 1015

దుర్యోధనుఁడు వారిని వారించుట



సరసోక్తులకు వారి సమ్మతిపఱచి
పలుమరు గర్ణుని భావించి చూచి
పలికె నెయ్యంబుతో ఫణికేతనుండు
ఇదియేమి రాధేయ యేల పోరెదవు
పదుగురు గా దన్నపని సేయఁదగదు 1020
విహితం బెఱుంగపు వినుము నాబుద్ధి
బహుజనద్వేషంబు భావ్యంబు గాదు

తనర నీ వేఁగి శాత్రవులఁ గెల్చినను
మనపెద్ద లెల్లను మనలోని వారె
అటుగాక వేరొక్కఱైన నీపుణ్యు 1025
లటువలె గావలె ననియెడివారె
ఈమహాత్ములమాట లెన్నైనఁ గలవు
నామాట మీరకు నాయన్న నీవు,
అని బుద్ధిచెప్పిన యటువలె కర్ణు
ననుజులసుతుల సేనాధినాయకులఁ 1030
గనుగీటుటయు మహీకాంతునిబుద్ధి
విననికైవడి! గురువిభు ధిక్కరించి
ధనువులు మ్రోయించి తమకము ల్మించి
ఘనవాహినులతోడఁ గదలి రెంతయును,
మచ్చరంబున మదోన్మత్తులై కెరలి 1035

ఘటోత్కచుఁడు ధర్మరాజునితోఁ కౌరవులరాక నెఱింగించుట



విచ్చలవిడి కురువీరపుంగవులు
వచ్చు నగ్గలిక భూవరుల మోహరము

లచ్చెరుగొని చూచి యనురాగ మొంది
శౌర్యవిస్ఫూర్తి రాక్షసచక్రవర్తి
తూర్యము ల్పూరించి దోశ్శక్తి మించి 1040
భేరులు మ్రోయించి పృథివి గంపింప
దారుణసింహనాదములు చేయించి
దండిబారులనెల్లఁ దగ నేర్పరించి
పాండవేయులచెంత భద్రము ల్చేసి
బలువడి దక్కిన బలముల నెల్ల 1045
నెలగోలుగావించి హెచ్చి క్రోధించి
తనరార ధర్మనందనునకు మ్రొక్కి
జననాథ కురువీరసైన్యంబు గెరలి
ప్రాకటంబుగ సప్తపాధోధు లెలమి
యేకార్ణవంబుగ నేతెంచులీల 1050
కొలదీర జగడంబుఁ గోరి వచ్చెదరు
తలకక మీకూర్మి తనయుని కిపుడె
సెల విమ్ము కరిపురి చేర్చి వచ్చెదను.
తొలఁగక నిల్చినఁ దునిమి వై చెదను
నావిని ధర్మనందనుడు చింతించి 1055

భావించి కౌరవబలము వీక్షించి
దిటము దొలంగించి తెగువ చాలించి

ధర్మజుని భయసంతాపములు



కటకట పడి ఘటోత్కచున కిట్లనియె
దనుజాధినాథ యెంతటి కార్య మొదవె
ధనపతిచే వాయుతనయుండు చిక్కె
మనము దుర్యోధన మండలేంద్రునకు
ననిలోనఁ జిక్కితి మయ్య కుమార
అక్కటా నిల్చి పోరాడఁగా నోప
మెక్కడఁ జనఁగల మెవ్వఁడు దిక్కు
చండబలోద్దండసాహసాంకుండు
గాండీవి వచ్చినఁ గాచుగా మనల
కవ్వడిదక్క యీ కౌరవావళుల
నెవ్వరు గెల్వలే రీధరాస్థలిని
కూరిమి చెక్కిల గొట్టితే పాలు
గారెడుబాలవు గదవన్న నీవు
గురు భీష్మ కృప కర్ణ గురుతనూభవులు

.

సురలతోఁ బోరి మెచ్చులు గన్న వారు
ధార్తరాష్ట్రులు పోమదత్త బాహ్లికులు
వార్త కెక్కిన శౌర్యవరబలాధికులు
శకుని భూరిశ్రవ సైంధవాదులును 1075

మకరాంకవైరితో మార్కొనఁ గలరు
పరువడి నిటువంటి బలియురతోడ
నరుదైన సకలయోధావళితోడ
నేరీతిఁ బోరెద వెట్లు గెల్చెదవు
వీరాగ్రగణ్య యేవిధ మింక ననిన ? 1080

ఘటోత్కచుఁడు ధర్మరాజునకు ధైర్యముఁ జెప్పుట



మేనెల్ల నిక్కించి మీసము ల్దీటి
పూని పెల్లుగ నార్చి భుజములు సరచి
ధారుణీపతిమోముఁ దప్పక చూచి
ఈరీతి చింతింప నేలయ్య మీకు
అక్షీణబలశాలి యావాసుసుతుఁడు 1085

యక్షుల ఖండించి యరుదెంచు నిపుఁడె

దుర్జను లగువీరిఁ దునుమ పోఁదరుమ
నర్జనుం డేల? యోధరాధీశచంద్ర
కురుబలంబుల నెల్లఁ గూల్చి నే నిపుడె
మెరువడి నీచేత మెచ్చు లందెదను 1090

వలనొప్ప నే చిన్న వాఁడను మీకు
కలనిలో రిపులకు గాలమృత్యువను
ఈకురుబల మెంత యెల్లలోకంబు
లేకమై వచ్చిన నేగెల్తు నిపుడె!
కలనిలోఁ జంపక గౌరవాధిపుల 1095

బలిమిచే పట్టుగ బట్టుకవచ్చి
కడిమి మీపాదపంకజముల చెంత
బడవైవకున్న మీపట్టిని గాను
ననుఁ జూడుమని సింహనాదముచేసి
జననాథు ననుమతి జయ్యనం గదలి 1100

తనసైన్యముల కెల్లఁ దగఁజేయి చూపి
కనలుచుఁ గలనికిఁ గదియించుటయును
ఆయెడ దనుజసైన్యము లేపుమీరి
కో యని దిశలు గగ్గోలుగా నార్చి

గుములైన హరిణంపుగుంపులమీఁద 1105
గమకించి దుముకు సింగములచందమునఁ
గురుబలంబుల నెల్ల గుంపులు చెరచి
వరుసతోఁ జిందరవందర ల్చేసి
పదియు నిర్వదియు నేఁబది నూరు వేయి
పదివేలమందిని బట్టి యొక్కరుని I110
గిటగిట కోరలు గీటించి తలలు
పటుకు పటుక్కున పగులంగ గొరికి
తుటుములౌ హయములఁ ద్రొక్కి వేదండ
ఘటలశిరంబులు కబళించి నమలి
వీరసేనలమీఁద వెగదండ నురికి 1115
పేరెము ల్బారించి ప్రేవులు దూరి
గళములు గరచి రక్తము లూర్పువిడక
గళగళఁ ద్రావి బెగ్గడిలంగఁ ద్రేల్చి
జుఱ్ఱున మెదడులు జుఱ్ఱి మదించి
గుఱ్ఱుగుఱ్ఱున రొప్పి గుండెలు నమలి 1120
కనుబొమ ల్ముడిపెట్టి గద్దించి గదిమి
ధనువులు విరిచి సాధనములుపెట్టు

చేసి ఛత్రంబులు చించి ధ్వజంబు
లాసించకుండ బోకార్చి శంఖములు
పూరించి బెట్టుగా బొబ్బలువెట్టి 1125
భేరులు మ్రోయించి భీతి పుట్టించి
పగటున చతురంగబలములఁ దరమి
పొగరెక్కి యటు బోకు పోకుఁ డటంచు
వెన్నంటి యురికట్టి వికలము ల్సేసి
మిన్ను పిట్టలుపార మెరసి యార్చినను 110

కావు కావు మటంచు గర్ణుఁ డున్నెడకు
వేవేగ గౌరవవీరసైన్యములు
పరతెంచుటయుఁ గాంచి, పావనిపట్టి
శరశరాసనములు సంధించి నిగుడి

కురుపాండవుల యుద్ధము



తక్కక కర్ణునిఁ దా విజృంభించి 1135
పెక్కుబాణంబుల భేదించి పలికె
మాయయ్యలకు నీకు మాయనిపగలు
పాయనిక్రోధముల్ బలసి యుండఁగను

గనుపడువేళల గౌరవకోట్ల
దునుమాడి ధర్మపుత్త్రునిచేత ధరణి 1140

నేలింతు నని మది నేఁగోరుచుండ
నేల వచ్చితి రిఁక నెందుఁ జొచ్చెదరు
రవిసుత నినుఁ జంపి రారాజు ద్రుంచి
కవిసి దుశ్శాసను ఖండించి శకుని
దునుమాడి తక్కిన దొరల మర్ధించి 1145

ఘనవైభవంబులఁ గరిపురి కరిగి
గట్టిగా పాండవాగ్రణికి నే నిపుడె
పట్టంబు గట్టుదుఁ బటుశక్తి మెరసి
అనితనయరదంబు నంటగాఁదోలి
ఘనశిలీముఖములు కర్ణునిమీఁదఁ 1150

గురిపించి పడగలు గొడుగులు సించి
వరధనుర్బాణముల్ వ్రయ్యలు చేసి
యరదంబు సారథి హరులఁ జెండాడి
కరవాలమును పల్క కవచంబు దునిమి[22]

పరువడి శకుని వెంపరలాడి గదిమి
వరయోధవర్యుల వరుస ఖండించి
యొగి దుస్ససేనుని యుదుటెల్ల నడచి
తెగి విజృంభించుదైతేయునిఁ గాంచి
వేఱొక్కరథ మెక్కి వి ల్లొండు దాల్చి
ధీరత నెదిరి రాధేయుఁ డి ట్లనియె
ఓరి నిశాచర యుప్పొంగ నేల
శూరతచే నెందు చొచ్చిన నిన్ను
మడియించి ధర్మజు మర్థించి కవలఁ
బడనేసి పాంచాలిఁ బట్టుకపోదు
నని నారసంబుల నతనివి ల్దునిమి .
ఘనతరధ్వజము చీకాకు గావించి
గొనకొని యరదంబు గూల్చి దైతేయు
తనువెల్ల జర్ఝరితంబు గావించి
బలముల శరపరంపరల జక్కాడి
తలపడి రథికులతలలు ఖండించి
కవల నారింట నాగ్రహమున నొంచి
కవిసి ధర్మజుమీఁద గమకించుటయును;

అలుక రెట్టించి యాయవనీశ్వరుండు
ప్రళయకాలాంతక ప్రతిమానుఁ డగుచు
పృథివి భేదిల నార్చి వేర్చి మాణిక్య 1175
రథ మొప్ప నెక్కి బల్ రథికులఁ జంపి
రవిసుతుఁ దాకి నారాచజాలముల
కవచంబు విలు తురంగముల సారథిని
చెల రేఁగి యింతింత చిద్రుపలుచేసి
మలసి యొక్కమ్మున మకుటంబుఁ గూల్చి 1180
యెక్కెడునరదంబు లెత్తెడువిండ్లు
చెక్కలు గావించి శరములు నఱికి
పాయకప్రతతిచే జళుకు పుట్టించి
కాయంబు జల్లెడగండ్లు సేయుటయు,
కలగి రాధేయుఁడు కౌరవాధిపుని 1185
బల మున్న యెడకు నిబ్బరమున బెగడి
తలనీడ భార నత్తఱి దైత్యవిభుఁడు
నిలునిలు మని యార్చి నిగుడి వెన్నంటి
యినసుత వాఁడె నిన్నేలినవాఁడు
గొనకొని నినుఁ గాచుకొనుగానిఁ పిలుపు 1190

తలఁప నేవేళ మంత్రములు బోధించు
చెలి వీవు గాపాడఁ జెల్లదె నిన్ను
మీరాజు బెగడ మా మేదినీశ్వరుఁడు
గారవింపఁగ నిన్ను ఖండింతు ననుచు
భాసిల్లు నొకదివ్య.బాణంబు దొడిగి 1195
యేసిన మూర్ఛిల్లి యిలఁ ద్రెళ్లె నతఁడు
ప్రకటించి కర్ణుని పాటెల్లఁ జూచి
శకుని దుశ్శాసనుల్ సైన్యంబుతోడ
రహి పేరుగల మహారథికులతోడ
వహి కెక్కు నెరయోధవర్యులతోడ 1200
దనుజాధినాథు నెంతయుఁ జుట్టుముట్టి
సునిశితాస్త్రంబులు పోన ముంచుటయుఁ
గనుఁగొని యాఘటోత్కచుఁ డుక్కు మీరి
.................................................
గురియించి బలము గగ్గోలుగా నఱికి 1205
కరిహరిరథయోధగణములఁ ద్రుంచి
చేరి యొక్కట దుస్ససేను మర్దించి
ధారుణి నతిరధోత్తములఁ జక్కాడి

వీరాధివీరహంవీరులఁ జంపి
కౌరవాధిపునిపై గమకించుటయును, 1210
అవనీశుసోదరు లరువదిమువ్వు
రవిరళధృతి నడ్డమై నిల్చుటయును
వారినందఱఁ గూల్చి పడి నేఁగుదేర
ధారుణీనాథునందనులు పెక్కండ్రు
గ్రక్కున నెడసొచ్చి గదిసి పోరుటయు; 1215
నక్కుమారులనెల్ల నవలీలఁ దునిమి
సమరాంగణమున మూర్ఛలఁ బడియున్న
ద్యుమణితనూభవ దుశ్శాసనులను
కడువడి శిరములు కబళించిపట్టి
బెడిదంపుఖడ్గంబుఁ బెరికి బెట్టార్చి 1220
కడిమితో గంఠముల్ ఖండింపఁబూని
తడయక మదిలోన దండ్రుల ప్రతిన
దలఁచి యంతట వారితలలు మన్నించి
నలువొంద నొక యోజనప్రమాణంబు
భోరున ద్రిప్పి నంభోవీథి వైచి 1225
కౌరవాధిపుమోముఁ గనుఁగొని పలికె

క్రూరాత్మ! దుర్మార్గ! కుటిలమానసుఁడ!
వీరె నీతమ్ములు వీరె నీసుతులు
వాఁడె నీయనుజుఁడు వాఁడె కర్ణుండు
పోఁడిమి జముఁజేరఁ బోవుచున్నారు; 1230
గొనకొని విడిపించుకో పోదు రమ్ము
జననాథ నీసాహసంబుఁ జూచెదను
అలగి వీరలఁ జంపునప్పుడుగాక
ఎలమితో నీశౌర్య మెపుడు చూపెదవు
చెలరేఁగి నీవు వచ్చిన పని యేమి? 1235
యులుకుపట్టక నూరకుండుట యేమి?
యీకలుషాత్మకు లీల్గినఁ జేరి
నీకు దుర్మంత్రముల్ నేర్పువా రెవరు?
ఇటువంటిచెలికాని నెడఁబాసి రాజ్య
మెటువలె నేలెద నీబ్రదు కేల? 1240
మావారి మును బలుమాయలఁ గెలుచు
క్రేవసంగరమున గెలువుమీ నన్ను
మున్ను నీ దుర్గుణంబులు చాల విందు
నన్నుంచి యెంత శాంతగుణంబు గలిగె!

దురమున నను డాసి తొడరలేవేని 1245
కరివురిపై యాస గదలించి చనుము;
అనుచు నుల్లాసంబు లా రాజు నాడి
వనజా ప్తసుతుని భూవరుసహోదరుని
ఇలమీఁదఁబడిరేని యీల్గుదు రనుచు
నులుకుచుఁ బట్టి వేఱొకచోట నునిచి 1250
శకునిపై దూరి నిశాతబాణముల
వికలంబు చేసిన వెన్ని చ్చుటయును
ఘాతచే నదలించి గర్జించి గోర్చి
నీతిగా దిది నీకు నృపతి చూడంగ
పోదువా? వెన్నిచ్చి పోరిలో నిటుల! 1255
నేదిక్కు నేఁగిన నేల పోనిత్తు
ఆనాఁడు బలుసహాయంబు చేసితిని
యీనాఁడు నినుఁ జావ నిచ్చునె రాజు!
అదిగాక నీకు మేనల్లుఁడు విభుఁడు
కదనంబులో నిన్ను! గావఁగా లేఁడె! 1260
పిలువుము యోధుల పిలువు రారాజు
దలవుము నీకులదైవంబు నిపుడె

ఖ్యాతికి నెక్కుసంగరభూమిగాని
తాతయ్య మాయజూదంబులు గావు:
వలనొప్ప ఘోరాహవస్థలి గాని
చలపట్టి పోర నీచావడి గాదు,
పొలుపొందు ఘనశరంబులుగాని నీవు
పలికిన ట్లనె బడ బాచిక ల్గావు
నలువంద దానవనాయకు ల్గాని
బలుమాయలను జన్న పాండవు ల్గారు;
పోకు పో కిట యెందుఁ బోయిన నిన్ను
చీకాకుపరచక చేగాచి విడువ,
నని పల్కి ఘోరదివ్యాస్త్రంబుఁ దొడిగి
గొనుఁగొని రథముపై గూల వేయుటయు
గనుఁగొని గురుఁడు గంగానందనుండు
కవలి మిక్కిలి ఘటోత్కచునిపై దాకి
విలు ద్రుంచి యరదంబు వికలము ల్చేసి
చలమున హయముల సారథిఁదునిమి
ఘనతరదివ్యమార్గణములు చొనిపి
దనుజేంద్రు దేహ మంతటను నించుటయును

పవనతనూజునిపట్టి పదునాల్గు
భువనము ల్గలఁగ నద్భుతముగ నార్చి
కాలాంతకుని లీల గద యొక్క చేత
శూలంబు నొకచేత సూటిగాఁ బట్టి
గురుభీష్మకులమీఁదఁ గ్రోధించి గదిమి 1285
వరమంత్రయుతముగా వై చె; వైచుటయు
నవి రెండు చండమార్తాండ తేజముల
వివిధాగ్ని లీలలు విస్ఫులింగములు
గ్రక్కుచు దశదిశల్ గ్రమ్మి యేతేర
మక్కువఁ గాంచి భీష్మద్రోణు లపుడు 1290
గరుడపావకరౌద్ర కమలాప్తకులిశ
వరుణపన్నగ మేఘవాయుబాణములు
నిగుడింప నవి యెల్ల నీఱు గావించి
తెగువ నేతెంచిన దివ్యాయుధములు
గనుఁగొని గురుఁడు గంగానందనుండు 1295
జననాథుసోదరు ల్జగతీశ్వరుండు
గురుతనూభవకృఫుల్ కుంభినీధవులు
పరువడి భగదత్తబాహ్లీకముఖ్యు

లవిరళ దివ్యశస్త్రాస్త్రము ల్జొనుప
నవియెల్లఁ బొడిసేసి యరుదెంచుటయును; 1300
అదియెల్లఁ బరికించి యాచార్యుఁ డఁదిరి
యిదె మహాప్రళయంబు లేతెంచె నింక
వడి నాయుధంబులు వాహనంబులును
విడిచి కరంబులు వెస ముకుళించి
యెదురుగా నిలిచిన యీసేన లన్ని 1305
బ్రదుకుట నిజము శౌర్యముఁ జూపఁ జెల్ల
దని యెలుగెత్తి సైన్యంబులఁ జాటి
జననాథురథముపైఁ జంగున దాటి
కౌరవాధీశుని కర మప్పళించి
ధారుణి లంఘించి తగ నిల్చుటయును, 1310
చిటిముడిపడి యోధ శేఖరు లెల్ల
దుటుకున నరదముల్ దుమికిరి సేన
లటువలె గరితురంగాయుథావళులు
పటుగతి విడిచి చొప్పడ నిల్చుటయును
నతిరయంబున నమ్మహాయుధద్వయము 1315
ప్రతిభ నేతెంచి శుంభద్దీప్తి మించి

బాలాతపములీల బలములమీఁద
శీలలు బర్వించి కేడించి మఱలె
దనుజాధినాథుఁ డంతటఁ బోక గెరలి
ఘవరథ మెక్కి సత్కాండాసనంబు 1320
కరమున సంధించి కాండజాలముల
గురురాజుమకుటంబు గూలంగ సేసి
గంగాతనూజు నొక్కట స్రుక్కఁజేసి
సంగరంబున రెంట సైంధవు నొంచి
గురుని మూడింట గగ్గోలు గావించి 1325
గురుసుతు నాల్గింట గుదియఁగా సేసి
దారుణంబుగ భగదత్తు నేనింట
నారింట బాహ్లికు నని దూలసేసి
కృపు నెన్మిదింట భూరిశ్రవు పదింట
నృపుసహోదరుల పూనికల నేనూట 1330
నలుకమై సేసి సైన్యము నుగ్గు చేసి
మలసి యాశకునిపై మరలి క్రోధించి
చలపట్టి రథముపైఁ జంగున దూకి
తలద్రెంప గమనించు తమకంబు గాంచి

యరదంబు నూకి డాయంగ నేతెంచి 1335
కురురాజుఁ గనుఁగొని గురుఁ డిట్లు పలికె
మనుజేంద్ర మీ మేనమామ యవస్థ
దనుజాదినాథు నుద్దండంబు జూఁడు
సాగవు మనసాహసంబు లిచ్చోట
ఏగతి, నిది మాన్ప నెవ్వరివశము 1340
కోపంబు చాలించి గురుబంధుజనులఁ
గాపాడి నిను నీవ గాచుకొ మ్మింక
చేరి రక్కసునితోఁ జెలిమి పాటించు
పోరాటములు మాని పురి చేరవలయు
పడుచు పాపఁ డటంచు బాటించవలదు 1345
పిడుగు కొంచెంబైన బెడిదంబె గాదె
ఈ నరభోజనాధీశ్వరు నెంచ
నానాటి రావణు నంతటి మేటి
యనిన నంతయు నిశ్చయం బని బెగడి
తనమది చింతించి ధరణీశ్వరుండు 1350
తనయులు హితులు బాంధవులు సోదరులు
ఘన యోధవర్యులు గలనఁ గూలుటయు

దనుజనాథుని గెల్వఁ దరముగా దనుచు
మనుజవల్లభుఁడు వేమరు దలంపుచును.
మదమున లంఘించి మగటిమి డించి 1355

యుదుటు దొలంగించి యుబ్బు దగ్గించి
యరదంబు దుమికి చయ్యన తలవాంచి
పరువడి నెడ సొచ్చి భళి యని మెచ్చి
కరము కరంబున గబళించిపట్టి
సురవైరి వదనంబు జూచి యిట్లనియె 1360

ధుర్యోధనుఁడు ఘటోత్కచునితో సంధి యొనర్చి పాండవులకుసహాయుఁడై పోవుట



అనఘాత్మ మీకు సహాయంబుగాఁగ
జనుదెంచువారితో సాహసం బేల
కాదుగా పాండవకౌరవు లనెడు
భేద మే మున్న ది! ప్రేమ నూహింప
నొగి వారు మేము నీ కొక్కట గాదె! 1365

పగవానివలె నెంత పనులు జేసెదపు
మలసి యుద్ధముచేయ మా మీఁదంగాక

బొలుపొంద దూరము పోయివచ్చెదవె
చను నింటగెల్చి రచ్చల గెల్వవలయు
ననెడిసాటువ నిజ మాయె మాయన్న 1370
ధనపతిమీఁద యుద్ధమునకు మనము
చనుటకు నీదివ్యశరకౌశలంబు
నీసాహసఫ్రౌఢి నేఁజూడవలసి
మాసైన్యముల నెల్ల మరలింపనైతి
నిన్ను నీశౌర్యంబు నీకౌశలంబుఁ 1375
గన్నులపండువగాఁ జూచినాఁడ
మాయయ్య వౌదువు మాయురే! మేలు
నీయంత ఘను లవనీస్థలిఁ గల రె!
యని ఘటోత్కచుఁ దన యక్కునఁ జేర్చి
తనరంగశకునిపైఁ దమకంబు మాన్పి 1380
దనుజవీరునితోడఁ దనసేనతోడఁ
జని ధర్మతనయునిచరణాబ్జములకు
గరిమతో మ్రొక్కిన గని ధర్మసుతుఁడు
వరుసతో దీవించి వారి కందఱికి
సరసలీలల మపచారము ల్చేసి 1385

ధర వ్రీల శంఖనాదంబు పూరించె
తతశక్తి ధర్మనందను నాజ్ఞఁ బూని
యతివేగ నుభయ సైన్యంబులు గదలె
శరజా ప్తతనయదుశ్శాసను ల్మూర్ఛ
లరయంగ దెలిసి విహ్వలచిత్తు లగుచు 1390

మొలకసిగ్గులు మొగంబుల నావహింపఁ
దలలు వంచకయున్నఁ దగ నిరీక్షించి
గురుసూనుఁ డంత నర్కుని సుతుఁ గాంచి
విరుగుట దిరుగుట వీరుల కెల్లఁ
గలదు నీతరమునఁ గలుగునే కర్ల[23] 1395

అల ఘటోత్కచుని సాహసముఁ జూచితివి
నెలవుగా మాబుద్ధి నిజమాయె నింక ,
ములును దాకఁగఁగాని మొగ్గ రెవ్వారు[24]
హాటకంబుగ మించి నాడరా దనెడి

మాట యొక్కటి గాక మఱియొండు గలదె 1400
పొలుపొందఁగా మించిపోయిన సిగ్గు
తలపోసు కొన్న నెంతయురాదు వినుము
పెక్కుమాటలు నేర్చి ప్రేలెడువాని
కెక్కడిసిగ్గు నీ కేల చింతింప
పొగరు నుద్దండంబుఁ బుట్టక యుండ 1405
సుగు లడంగించె రక్షోవల్లభుండు
నిలుపుము శాంతంబు నీతిధర్మంబుఁ
దలఁపుమీ యిఁకనైనఁ దలదాకె నంత
అనుచుఁ జిల్లులు వోవ నాడినమాట
లెనయంగ చిలుకులై హృదయంబు గాడి[25] 1410
వెనకముందఱఁ జూచి వికలంబు నొంది
వినియును విననట్లు వెస నేగుటయును

నలకూబరుఁడు యుద్ధమునకు సన్నద్ధుఁడగుట



అక్కడ సకల సైన్యసమేతుఁ డగుచు
జక్కులరాపట్టి చనుదెంచుటయును

దుర్వార శౌర్యసందోహ ప్రచండ 1415
గర్వితారి మదేభకంఠీరవుండు
భీమబలాఢ్యుండు భీమసేనుండు
భూమి తల్లడమంద భుజగేంద్రుఁ డదర
తారలు ద్రుళ్ల దిక్తటము లల్లాడ
భోరున శంఖంబుఁ బూరించుటయును; 1420
తనమది నుప్పొంగి తమకించి ధర్మ
తనయుండు నాగకేతను నిరీక్షించి
అదె విను భీమశంఖారావమహిమ
కదనంబు చాల నగ్గల మయ్యెనేమొ
పదపదం డని బెట్టు పలికిన వేగ 1425

ధర్మరాజుభీమునొద్దకువచ్చుట



గదలి యాభీముని గదియఁగా నేఁగి
తనకు మ్రొక్కిన వాయుతనయుని గ్రుచ్చి
యొనరఁ గౌఁగిటజేర్చి యుప్పొంగె రాజు
పావని యప్పు డాపాంచాలిపుత్త్రి
భావించి సంతోషభరితుడై చూచి

యరదంబు డించి నెయ్యమున లాలించి
తరుణికి గమలముల్ దండలు గూర్చి
గురుతుగా నొకకొన్ని కొప్పున నునిచి
మరికొన్ని చిత్రదామములు గూర్చి
కరుణతో నిఖిలాంగకముల నమర్చి 1435

అరవిందముఖినుతు లంగీకరించి
కవల ఘటోత్కచుఁ గౌఁగిట నలమి
కువలయాధిపుఁ జెంతఁ గొలిచియున్నంత

అమరావతిలో నర్జునునకు నారదుఁడు భీమునకును గుబేరునకును సంభవించిన యుద్ధము సంగతిని దెల్పుట.



తిలకింప నమరావతీపురంబునను
బలుదెఱగుల దిశాపతులు గొల్వఁగను 1440

తొలుగక రంభాది తోయజాననలు
నలువున చెలరేఁగి నాట్యము ల్సలుప
నాక గంధర్వ కిన్నర యక్ష గరుడ
రాకేందుముఖులు పరాకులు దెలుప
హాళి మీరంగ జయంతుఁ డర్జునుఁడు , 1445

మ్రోలఁ గూర్చుండి యామోదింపుచుండ
వలనొప్ప బలువైభవంబులతోడఁ
గొలువున్న సురరాజు కొలువులోపలను
నరుని వీక్షించి యానారదమౌని
వెరవొప్ప నందఱు వినఁగ ని ట్లనియె 1450

నరనాథ పవమాననందన యక్ష
గరుడ దానవులకుఁ గదనంబు గలిగె
నది విని మీయన్న యనుజులతోడ
మదవతితోడ భీమతనూజుతోడఁ
జనుచున్నఁ గురుపతి చయ్యనఁ గదలి 1455

యనిచేసి పిదప సహాయుఁడై యేఁగె
నలకూబరుండు సేనలగూడి వచ్చి
కలహంబు గావింపఁ గదిసి యున్నాఁడు
బలుకయ్య మగుఁగాని పరిపాటి గాదు
అలకాపురము చెంత కరుగు పొ మ్మనిన 1460

అర్జునుడు ధర్మరాజాదులకడ కేతెంచుట



నమరేంద్రునకు మ్రొక్కి యాపాండుతనయుఁడు

డమితవేగమున రథారూఢుఁ డగుచు
జనుదెంచి సాష్టాంగవిధు లాచరించి
భీమసేనాచార్య భీష్మాదులకును 1465
నామోదమున వందనాదు లమర్చి
తివిరి పెద్దలచేత దీవన లంది
కవలు మ్రొక్కిన వేడుకల గారవించి
యంచితం బగు తనయరదంబుమీఁద
పాంచాలపుత్త్రినిఁ బటుగతి నునిచి 1470
సురపతి యొసఁగిన సుమదామకములు
చిరమణిహారముల్ చిత్రాంబరములు
కరుణతో నొసఁగి వేడ్కల నాదరించి
ధరణీశుచెంతఁ బంతము మీర నిలిచె
ఆసమయంబున యమతనూభవుఁడు 1475
భాసిల్లు కిన్నరపతిసేనఁ జూచి,
తమబల మున్న చందము విలోకించి
యమరనదీసూను వాసనాబ్జంబుఁ
గనుఁగొని మ్రొక్కి యోకరుణాపయోధి
ఘనయక్ష రాక్షస గరుడ గంధర్వ 1480

బలముల రథికుల బరికింపు మయ్య
కిల కొట్టుచును దమకించు చున్నారు
మోసము రానీక మున్నె కన్గలిగి
యీసైన్యముల నెల్ల నేర్పాటుసేయు
బలువిడి సేనాధిపతివి నీ వగుచు 1485
నిలిచినకార్యంబు నేరవేఱు దేవ
అన విని గాంగేయుఁ డౌఁగాక యనుచుఁ
దనరారునట్టి పదాతివర్గములఁ
గనుఁగొని మొన నలగోలు గావించి
ఘనయోధవరులఁ జెంగట భద్రపఱిచి 1490
హరులను నిరుకోపులందు నమర్చి
కరులను బార్శ్వభాగంబులఁ జేర్చి,
కరిసైంధవపదాతిగణముల చెంత
సురవైరి గురుసుతార్జునుల నేమించి
వారిచెంగట ద్రోణ వనజాప్తతనయ 1495
భూరిశ్రవుల నద్భుతముగా నునిచి
వారికిఁ బ్రాపుగా వలనొప్పఁ గవల
మారుతి బాహ్లిక మగధుల నునిచి

ధారుణీధవుల మధ్యమ్మున నునిచి
వారక నెరయోధవర్యుల నెల్ల 1500
మోపైన తావుల మొన లేర్పరించి
యాపాండవాగ్రణి కావిధం బంత
గనిపించి విజయశంఖంబుఁ బూరించి
ధనువు మ్రోయించి సాధనములఁ బూని
పనుపడ సేనాధిపతి తానె యగుచు 1505
మొన నిల్చియుండె తెంపును బెంపు మిగుల
నలకూబరుండు మానవనాథుబలము
చెలరేఁగి యాశ్చర్యచిత్తుఁడై చూచి
చెంగటఁ జేరి మచ్చిక గొల్చియున్న
జాంగలు వదనాంబుజము గాంచి పలికె 1510
అన్న కంటివె దానవాధీశుబలము
లున్న చందంబు నాయోధులతెఱఁగు
గమకించుచున్నారు కదనంబునకును
కమలంబునకును నొక్కండు వచ్చి యెంత
పని చేసె నటువంటిబహుయోధవరులు 1515
మొన చేసినారు సముద్రంబువోలె

ఆవీర యోధుల నలఘు తేజంబు
భావింపఁ గన్నులపండు వయ్యెడిని;
మానవులే యని మసలఁగా వలదు
నీ నేర్పుఁ జూచెద నెరయోధవరుల 1520

బలముల సేనాధిపతుల నేర్పఱచి
కలనికి యరిమొనగా నిల్పు మనినఁ
జని సర్వ సేనల సమకట్టి నిలిపి
ఘనభేరికాహళఘంటికారావ
ముల బెట్టుగా మిన్నుముట్ట మ్రోయించి 1525

కలఁగి పద్నాల్గు లోకములు భేదిల్ల
తరుచుగా సింహనాదములు నేయించి
నిరుపమాటోవుఁడై నిఖిలసైన్యముల
పేరైన యోధుల పేరులు వాడి[26]
భోరున కలనికిఁ బురికొల్పుటయును 1530
భీష్మప్రతాపజృంభితశౌర్యధనుఁడు

భీష్ముఁ డుద్ధతి రణభేరి వేయించి
ఘనసైనికుల నెల్ల కదనంబునకును
గనలుచు వేవేగ గవయించుటయును
నురువడి నీరీతి నుభయబలంబు 1535
లరుదార మార్కొను నాసమయమున
భేరులు దశదిశల్' భేదిల్ల మొరసె
దారుణసింహనాదములు నెలంగె
కరిబృంహితములు వెక్కసముగాఁ గూడె;
హరిహేష లద్భతంబై నింగి నిండె 1540
వరరథనేమిరావము లుర్విఁ బర్వె;
గురుతరకోదండగుణగుణధ్వనులు
వెలసె పరాగంబు వినువీథిఁ గప్పె,
నిల తల్లడం బంది. నెలగోలు గవిసె
వీరు వా రని యింత వివరింపరాని 1545
పోరు ఘోరం బయ్యె భూతలాధీశ !
భల్లంబులను మించి పట్టిసంబులను
కెల్లుబ్బి నురికి మిక్కిలి దానిపెద్ద
బల్లెములను గ్రమ్మి బాకులఁ జిమ్మి

పెల్లుగా గదలచే భేదించి భిండి 1550
వాలమ్ములను గూల్చి వడినేగి ముసల
జాలమ్ములను మోది చక్రసంఘముల
నడుములు ఖండించి నరములు ద్రెంచి
తొడలు భేదించి కుత్తుకలు నుగ్గించి
కరములు ద్రుంచి వక్షములు నూటాడి 1555
సరభసప్రతిభలచలమునఁ గినిసి
పొదలి ఖడ్గాఖడ్గి పోరెడివారు
యెదిరి ముష్టాముష్టి సేసెడివారు,
బాకులచే గ్రుద్ది బరులు ప్రేవులును
చీకాకుఁ గావించి చెండెడివారు, 1560
చూరీలచేకరాచూరీలచేతఁ
జెరిచి చిందరలుగా జేసెడివారు,
కడు మెరుంగుల చివ్వగడలచే బొడిచి
తడయక చెంగున దాటెడివారు;
జిగి పెద్దయీటెలచే గుదుల్గ్రుచ్చి 1565
పగటున దూరము పడఁజిమ్మువారు,
తెగువతో సురియల తగనేసి డాసి

లగువుల దవ్వుగా లంఘించువారు;
చేరి పెద్దకటార్ల చే కొద్ది గ్రుమ్మి
కేరి చివ్వున గుప్పళించెడువారు[27]

ప్రేలుచు క్రొవ్వాడి పిడెముల నూని
లీలమీరఁగ చౌకళించెడువారు;
భోరున పొడిచినపోటు గండ్లబడి
దూరి యావలదాటి దూపెడువారు,
గుంపులు నొంటిగా గోరించువారు,

గుంపుగా నొక్కని గ్రుమ్మెడువారు
నివల కవ్వల నుంచి యేతెంచువారు,
నవల కివ్వల నుంచి యరుదెంచువారు,
నాథ పరాకయ్య ననుఁజూడు మనుచు
యోథావళుల మీఁద నురికెడువారు;

తలలు ఖండించి వింతగ నెగవైచి
సెలగో యనుచు నార్చి చేయెత్తువారు
అరుదొంద కల్లిల్లి కార్భటుల్చేసి

విరిగి పొడువుం డని వెన్నంటువారు
నలకూబరుం డేడి నరపతి యేడి 1585

పొలియింతు మని చొచ్చి పోయెడివారు
నలకూబరుఁడ నేనె నరపతి నేనె
మలసి నిల్వు డటంచు మార్కొనువారు
తేజీల తేజీల ధే యని నూకి
నేజెలచే గ్రుమ్మి నిగుడి వెన్నంటి [28] 1590

పాటించి రౌతును బల్లంబు హయము
వేటారుదునెలు గావించి భేదించి
కో యని యార్చి కగ్గోలుగా నరికి
హాయి! బాబు! శబాసు! రని వ్రేలు గరచి
అటె నీవేముస్తైదు లరి మురి ద్రుంచి 1595
తుటెములపైఁ జొరఁ దోలు రాహుతులు
గజముల గజముల గజిబిజి గొనఁగ
నిజభుజాబలశక్తి నిగుడి కవ్వించి

కొమ్ముకత్తుల మొనకొమ్ము లాడించి
యిమ్ముల కురికించి యేపు గల్పించి 1600
హేరాళ జయకాంక్ష లిచ్చలఁ బొదల
వారక పోరు మావంత వర్గములు
పదరుచు హయముల భటులపై నురికి
తుది చాపకట్టుగాఁ ద్రొక్కించువారు,
మొగముల నరుకుల ముదియుచుఁ జొచ్చి 1605
మొగి హల్లకల్లోలముగ నార్చువారు;
కెల్లుబ్బి హయముల కేడించి తగ్గి
చిల్లాడముల కొద్ది చిమ్మెడువారు;
నూకించి గజముల నొదికల బడఁగఁ
జేకొద్ది జముదాళ్లఁ జెండెడివారు; 1610
తెగువ సామంతులఁ దెగటార్చువార
లగుచు జెన్నొందె మహారణభూమి
అప్పుడు గాంగేయుఁ డమ రేంద్ర సుతుఁడు
తప్పక చూచి యుద్ధండకోపముల
భోరున నరదముల్ బోనిచ్చుటయును 1615
మారుతి ద్రోణుండు మార్తాండషతుఁడు

శకుని బాహ్లికులు సైంధవకృపులు
నకులుఁడు నాచార్యనందన సోమ
దత్తిలు రథము లుద్ధతి బోవ నిచ్చి
మత్తిల్లి బహుఘోరమార్గణంబులను
దురుసుగా నెడ లేని తొలుకారువాన
గిరులపై వర్షించు క్రియను బర్వించి
తరమిడి తురగవేదండసంఘముల
గరుడుల యక్షుల గంధర్వవిభుల
నరభోజనులను గిన్నరకులాధిపులు
పురుడింపరాని కింపురుషశేఖరుల
రథికుల దొరల సారథుల మావతుల
రథకేతనచ్ఛత్రరథ్యసంతతుల
ఖండించి దండించి గనెలు గావించి
చెండాడి భేదించి చిద్రుపలు చేసి
సమయించి తెగటార్చి చంపి మర్ధించి
తుమురులు గావించి త్రుంచు నవ్వేళ
ఇవి కరు లివి హరు లివి రథావళులు
ఇవి ఛత్రసంఘము లివి కేతనంబు

లివి ముక్కు లివి చెవు లివి మస్తకంబు 1635
లివి పక్క లివి పిక్క లివి భుజాలతిక :
లివి హస్తపద్మంబు లివి కాళ్లటంచు
నవయవ భేదంబు లరయంగ రాని
సంగరం బొనరించు జనపాలవరుల
బొంగుచు ధననాథపుత్త్రుండు గాంచి 1640
సారె సారెకు మౌర్వి సారించి దివ్య
నారాచ మంకించి నయనాంబుజముల
మినుకైన మినుగుర్లు మెండుగా రాల
తన యోధవరులతో; దద్దయుఁ బలికె
మా యన్నలార యామానవాధిపులు 1645
సేయుకయ్యములు నీక్షించితి రిపుడు
ఆరూఢి మీరు యక్షాధీశుతోడ
సారె పల్కిన ప్రతిజ్ఞలు చెల్లవలయు
మసల సామాన్యపు మానవు ల్గారు
కసిదీర యుద్ధంబు గల దిం దరికిని 1650
ధవళవాహనుఁ డల్లతాళకేతనుఁడు
దివురుచుఁ గెరలి నాదిక్కు చూచెదరు

వారితో నేఁబోరవలయు వేగంబె
ఘోరాజిఁ జీరికి గొనరెంతవారి
రణభూమి తక్కినరథికులతోడ 1655
గణుతింప నని గెల్వగాఁ దగు మీరు;
అని తనసారథి నదలించుటయును
గనుఁగొని యాచిత్ర గాత్రుఁ డి ట్లనియె
అనఘాత్మ మానవు లన నెంత నీకు
పనుపులు చేత దిక్పతుల గెల్చితివి 1660
తెలిసి పిచ్చుకలపై దివ్యనారాచ
ములఁ బూనఁ దగవౌనె! మోహనాకార
కనలి కోపింప లోక ప్రభుల్గారు
నిను మ్రోన పనిగల్గెనే నేను గలుగ
మనుజుల దనుజుల మర్దించి వత్తు 1665
ననుఁ జూడు మానవనాథులఁ జూడు
మని పల్కి గంధర్వు లర్వది కోట్లు
కినుకతో నడువ గాంగేయుని దాఁకె
కరకరకదనభీకరులైన గరుడు
లిరువదికోట్లు బెంపెక్కి యేతేర 1670

చెలఁగి కవ్వడిదాఁకె చిత్ర సేనుండు
నలువదికోట్లు పద్నాలుగువేలు
కిన్నరబలముతోఁ గేయూరభుజుఁడు
చె న్నొందఁగా భీమసేనుని దాఁకె
దిశలు భేదిల నార్చి తెగి విజృంభించి 1675
దశకోటియక్షు లుధ్ధండత నడువ
మణి కేతనుఁడు దాఁకె మార్తాండసుతుని .
రణభయంకరపరాక్రమ బలాన్వితులు
ఘోరసాహసు లారుకోట్లదైతేయ
వీరులతో పృథ్వి జలింపఁ గదలి 1680
ఘోటకాసురుఁడు దార్కొనియె నాచార్యు
థాటిగా బహుచతుర్దంతులతోడ
ననుపమ జయసాహసాంకుఁడై మీరు !
కొనియె జయంతుండు గురుతనూభవుని,
ముష్పదికోట్ల కింపురుషులతోడ 1685
నిప్పులు గ్రక్కుచు నిరుపమశూల
థారియై నిగుడి మార్తాండ కేతనుఁడు
ఈరసంబునను బాహ్లీకునిఁ దాఁకె,

తక్కిన యట్టియోధులు యోధవరులు
తక్కక దాఁకి యుద్ధము సేయుచుండ 1690
నాసమయంబున నంబుధు ల్గలఁగ
భాసురదశదిశాభాగము ల
మహితశౌర్యుడు హిడింబానందనుండు
బహుభేరి తమ్మటపటహనిస్సాణ
దాంధణ దంధణ ధణధణంథాన 1695
బంధురారావముల్ పరఁగ మ్రోయించి
అతిబలోద్దండ దైత్యాదినాయకులు
హితులు నెచ్చెలికాం డ్రనేకులు గొలువ
కరకరి నొరసి సంఖ్యల కెక్కుడైన
కరిసైంధవపదాతిగణములు నడువ 1700
జని మహోద్ధతి యక్షసైన్యంబు దాకి
గనలి దానవకోటి గవియించుటయును;
మేటిరక్కసు లుక్కు మీరి యయ్యక్ష
కోటుల ఘోరరక్షోబలంబులను
గరుడసైన్యముల జీకాకుగాఁ జంపి 1705
వరుసతో గంధర్వవరులఁ జెండాడి

కిన్నరసేనల గీ టణఁగించి
పన్నుగా వారణప్రతతులఁ దునిమి
పొలుపొందునట్టి కింపురుషులఁగూల్చి
నలకూబరునిమీఁద నడతెంచుటయును

జాంగళుఁ డొనర్చిన యుద్ధము



ఆవేళ జూంగళుం డధికరోషమున
వేవేగఁ జని దైత్యవీరులఁ జూచి
రణదక్షు లగు నతిరథమహారథుల
గణనకుమీఱిన కరితురంగముల
దానవమానవదళములమీఁద
పూనికఁ గదియించి భోరునఁ గదలి
ఘనతూర్య భేరిశంఖములు మ్రోయించి
వనదముల్ గిరులపై వర్షించులీల
చండ కాండములచే సకలసైన్యములఁ
జెండాడి చట్టలు సీల్చి గర్జించి
కాండలు దునిమి పక్కలు చక్కు చేసి
గుండెలు నలిచి ముక్కులు చెక్కి వైచి

తొడలు పాదంబులు తునియలు చేసి
నడుములు మెడలు భిన్నములు గావించి
మెండైన రథికుల మేదినిఁ గూల్చి 1725
మండలాధీశుల మదము లణంచి
సురవైరిఫై నంపసోనలు నించి
ధర వ్రీల సింహనాదములు సేయుటయు,
వరభయభ్రాంతి నిల్పఁగ లేక బెగడి
పరువెత్తెనరదైత్యబలము నల్గడల 1730
కడువేగ తురగసంఘంబులు జరిగె
నెర యోధవర్యులు నీల్గిరి ధరణి ;
అలిగి యంతట బోక నాజాంగలుండు
బలువేగ ధారుణీపతులపై నడిచె
కనుఁగొని యాఘటోత్కచుఁ డేపుమీరి 1735
మొనఁ జేసి నిజసైన్యములఁ బురికొల్పి
రాకురాకుఁ డటంచు రహి నార్చి పేర్చి
దీకొని నిల్చి గద్దించి పల్కుటయు,
తమకించి మదగజేంద్రములపైఁ బొదలి
గమకించి దుముకు సింగముల చందమున 1740

మొనసి రాక్షససైన్యముల జుట్టుముట్టి
ధనువులు దివ్యసాధనములు గూల్చి
పరువడి గొడుగులు పడగలు డుల్చి
యరదము సారథి హయములు నల్చి
రథచక్రవితతి ధరాస్థలిఁ గూల్చి 1745
రథిక శేఖరుల బీరము లణఁగించి
యరిమురి సురవై రి కడ్డమై వచ్చు
నర దైత్యపతుల పద్నాల్గుపద్మముల
బెట్టుగా పీనుంగు పెంటలుచేసి
కట్టల్కతో ఘటోత్కజుషకుటంబు 1750
పొట్టు గావించి నేర్పున విల్లు ద్రుంచి
దిట్టఁడై కవచ మిం తంతలు చేసి
హయసారథులతోడ నరదంబుఁ గూల్చి
రయమున జనుదేర రాక్షసేశ్వరుఁడు
వేరొక్క రథ మెక్కి వి ల్లొండు దాల్చి 1755
నారాచ మొక్కటి నారి సంధించి
సారవైశ్వానరసదృశుఁడై మండి
ధీరుఁడై జాంగలు దిక్కు వీక్షించి

ఓరి యక్షాధమ యొగి నిన్నుఁబట్టి
ఘోరబాణంబులఁ గూల్పక విడువ
నని యార్చి యేసిన నమ్మహాశరము
ఘనరత్న మకుటంబు ఖండించుటయును ;
సుర వైరి మఱికొన్ని సునిశితాస్త్రముల
హరులను నరదంబు నవనిపైఁ గూల్చి
సారథి మడియించి చక్రము ల్ద్రుంచి
ఘోరాస్త్రముల మేను గుదిగొన నేసి
యూనిన యరదంబు నొగి నుగ్గుచేసి
పూనిన విం డ్లెల్ల పొట్టు గావించి
కడకతో ఖండించి కాండజాలమును
నడిమికి రెండేసి నఱికి చెండాడి
యతనికి నడ్డమై యరుదెంచునట్టి
శతకోటియక్షుల చక్కు గావించి
పన్నుగా నెడసొచ్చు పదియారుకోట్లు
కిన్నరశ్రేష్ఠుల గీ టణఁగించి
మొనసొచ్చి పర తెంచు ముప్పదికోట్లు
ఘనసిద్ధసాధ్యుల గనెలు గావించి

గరుడుల పదికోట్లఁ గరకరి జంపె
పరగగంధర్వులఁ బదికోట్ల దునిమి
ఏయుట తొడుగుట లెఱుఁగ రాకుండ
సాయక వృష్టిచే సకలసైన్యముల 1780
గదిమిపారఁగ దోలి గద్దించి యార్చి
యెదు రెవ్వరును లేమి యేచి జాంగలుని
గదిసి మించులు గుల్కు కాండరాజమున
యెద దూర నాటించి యిలఁ గూలసేసి
కనలుచు మొల నున్నఖడ్గ మంకించి 1785
యొనర కంఠము ద్రెంచ నుంకించుటయును;

నలకూబరుని యుద్ధము


నలకూబరుండు దానవనాథుఁ గాంచి
యులుకుచు నొకవీతిహోత్రబాణంబు
నారి సంధించి దానవనాధుమీఁద
ప్రారూఢిమంత్ర పూర్వకముగా నేయ 1790
ఘనతరవిస్ఫులింగ ప్రకాండములు
పనుపడ దశదిశాభాగము ల్నిండ

రవిసహస్ర ప్రభాభాజితం బగుచు
పవనజుతనయువైఁ బర తెంచుటయును
నరుఁ డది గాంచి తా నారాచ మొక్క. 1795
వరుణాస్త్రమున ద్రుంచి వైచినఁ గెరలి
నలకూబరుం డింద్ర నందనుమీఁద
నలుక రెట్టించి బ్రహ్మాస్త్రంబు సొనిపి
నలువంద వాయుబాణంబు సంధించి
బలుక్రోధమున దైత్యపతి నేయుటయును 1900
సురరాజసూనుండు సురనదీసుతుడు
సరగున నాదిత్యశరము వీక్షించి
యవలీల బ్రహనాగాస్త్ర జాలముల
నవి రెండు వారింప యక్షేశ సుతుఁడు
గంగాతనూజుపై గరుడాంబకంబు 1805
బొంగుచు నరునిపై భూధరాస్త్రంబు
పవననందనుపట్టిపై మేఘశరము
తివిరి పెల్లార్చి గద్దించి యేయుటయుఁ
అరసి భీముండు రౌద్రాస్త్రంబుచేత
గరుడసాయకమును ఖండించి వైచె 1810

కులిశమార్గణముచే గురుతనూభవుఁడు
పొలియించె నప్పు డాభూధరాస్త్రంబు
గంధవాహశరంబు గాండీవి పూని
కంధరాశుగము వ్రక్కలు సేయుటయును
రూఢిగా బ్రహ్మశిరోనామకంబు 1815
గాఢవిస్ఫూర్తుల గాండీవి మీఁద
ప్రాకట దివ్యనారాయణాస్త్రంబు
భీకరప్రతిభచే భీష్మునిమీఁద
కలితో గ్రచండాంధకార బాణంబు
సొలవక నాచార్యసుతునిపైఁ జొనిసి 1820

ఘటోత్కచుఁడు గూలుట


చలమున నలిరేగి శక్తి సంధించి,
యలఘటోత్కచునిపై నయించి యేసె
సంచింపక కిరీటి వైష్ణవాస్త్రమునఁ
ద్రుంచె నా బ్రహ్మశిరోనామకంబు
నగణితం బైన నారాయణాస్త్రంబు 1825
నిగిడి తచ్ఛరమున నిలిపె భీష్ముండు

హరిదశ్వశరమున నంధకారాస్త్ర
మరుదుగా దునుమాడె నాచార్యసుతుఁడు
గురుఁడు మహాదివ్య ఘోరబాణములు
బరిపిన నవియెల్ల భగ్నము ల్సేసి 1830
కమలభవాండము ల్గలఁగ మార్తాండ
రమణమై చని శక్తి రాక్షసేశ్వరుని
ఫాలంబు దాఁకిన పక్షముల్ విరిగి
శైలంబు గూలీన చందంబు దోఁప
పొలదిండి మూకలు భూతలాధిపులు 1835
గలగి బెగ్గిల ఘటోత్కచుఁ డిలఁద్రెళ్లె
తనతనూభవుపాటు ధననాథుతనయు
ఘనతరోద్ధండ క్రమశక్తి గాంచి

భీముని యుద్ధము


యనిలతనూభవుం డశ్రు సంఘములు
కనదగ్ర విస్ఫులింగముల కాండములు 1840
పెనఁగొని కన్నుల చెట్టుగా కాల
ధనువస్త్రచయము రథంబుపై వైచి
నిట్టూర్పు వేడుముల్ నిగిడి యుప్పొంగ

ధట్టించి యలదండధరుఁడో యనంగ
గిరినుండి యిలకు లంఘించి యేతెంచు 1845
హరికిశోరములీల నరదంబు దుమికి
యదలించి బొదలి కో యని యార్చి వేర్చి
గద కరద్వయమున కబళించి నడచి
చని మహోద్ధతి యక్షసైన్యంబు దాఁకి
మునుమున నెదిరిన మొనల ముట్టాడి 1850
రథికసారథుల ధరాస్థలిఁగూల్చి
యధికవేగంబున నరుదేరఁగాంచి
నలకూబరుఁడు ఘోరనారాచతతులు
చలమున ములుదూర్ప సందు లేకుండ
కాయ మంతయు నించఁగా నవి పడ్డ 1855
సేయక గని భీమసేనుఁ డాఘనుని
రవికోటి సంకాశరమణీయరథము
నవలీల రేణువులై రాల మోదె
ఆట మున్న రాజరాజాత్మ జుం డుదిరి
దుటుకున నరదంబు దుమికి పోనురికి 1860
వేరొక్కరథ మెక్కి వెస జన నదియు

ఘోరగదాహతి గూల్చి మోదుటయు
ధననాథుసూనుఁ డంతకుమున్నె దుమికి
చని యొక్క రథ మెక్కి చయ్యన నడువ
ధీరుఁడై భీముఁ డాతేరుపై నురికి 1865
భోరున నొగలంట బొసఁగ సంధించి
గిరగిరఁ ద్రిప్పి మిక్కిలి పైకి నెత్తి
కరకరి భగ్నంబుగా థాత్రి మోదె
అట మున్నె దాటి యక్షాధీశుపట్టి
పటువేగమున నేగ పవమానసుతుఁడు 1870
ఆర్చుచు నాతని యరదంబుమీఁద
గూర్చుండనీయక గోరించుటయును
యక్షరాక్షసయోధవరు లరువదికోట్ల
యక్షతనయున కడ్డ మేతేర
తమకించి తనగదా దండఘాతమున 1875
నిమిషమాత్రంబున నీరు గావించి
నలకూబరుని మీఁద నడువ నా ఘనుని
జెలికాండ్రు పది కోట్లు శితసాయకముల
బరపి మార్కొనిన నాబలియుర నెల్ల

ధరఁగూల్చి నడువ గంధర్వులు నాల్గు 1880
కోటులు గ్రమ్మిన గోరించి మోది
ఘోటకంబులఁ గూల్చి కుంజరఘటలు
గరకరి వధియించి గద ద్రిప్పుకొనుచు
వరబలోద్దండుడై వచ్చుచుండఁగను
దనుజాల యక్షగంధర్వులఁ గూల్చి 1885
వనజముల్ గైకొన్న వాఁడీతఁ డనుచు
దెప్పరంబైన భీతిని దల్లడిల్లి
చప్పుడుల్ చాలించి చలములు డించి
చతురంగబలము లచ్చట నిల్వ వెరచి
పతి నొప్పగించి నిబ్బరమున నరిగె 1890
అంతట నాకుబేరాత్మజుం డలిగి
పంతంబుతో సార్వభౌముపై నెక్కి
పవనతనూభవుపై గవియింప
గవిసిన నామత్తకరిమీఁద దూరి
పటుగదాహతిని కుంభస్థలం బవియ 1895
వ్రేటు వేయఁగ చండ వేదండంబు బెగడి?[29]

కళవళమంది ఘీంకారము చేసి
తలకి యొక్కించుక ద వ్వరు దెంచి
ఆ త్తరి తెలి వొంది యాదిగ్గజంబు
మ త్తిల్లి భీముపై మరలి యే తెంచి 1900
కరమున గట్టిగాఁ గబళించిపట్టి
చరణముల్ గదియించి చలము రెట్టించి
కొమ్ముల గేడించి కుమ్మిన నతఁడు
పమ్మి తుండంబులోపల నింత బెళికి
జిలిబిలి రాహువుచేఁ జిక్కి వెడలి 1905
యలరారు చండమార్తాండుని లీల
దప్పించి మరలించి ధైర్యంబు మించి
గుప్పున గదకొద్ది గుమ్మి పోనీక
వాల మంకించి యావారణముల్ ద్రిప్పి
వేలారువిధముల వేధలు పెట్టి 1910
పాదముల్ తుండంబు బంధించి ధాత్రి
మీఁద నెంతయు పిల్ల మెరముగా నూకి
దీనత్వ మొందించి దిటము దూలించి .
పోనీక సర్వాంగములు గుద్ది వైచె

నలకూబరుండు నంతకు మున్నె కలఁగి 1915
తొలగి వేదండంబు దుమికీపో నురికి
గురుదివ్య రథ మెక్కి. కోదండ మొకటి
ధరియించి ఘనగుణధ్వనిచేసి కదిసి
వరశరాసారముల్ వర్షించుటయును
కరిహరిరథ యోధగణములు గ్రమ్మి 1920
అంతట జాంగలుం డతిమూర్ఛఁ దెలిసి
యంతకు గతి నట్టహాసంబు చేసి
పరువడి యేతెంచి పవనజు దాఁకి
సురు చిరాంబకముల సోనలు ముంచె
అడరి నియంతుఁ డత్యంత వేగమున 1925
కడుసార్వభౌముఁ డగ్గరఁ జేర నేఁగి
మస్తకంబు కరంబు మహితాంగకములు
మ స్తరించుచు దువ్వి మదము గల్పించి
థైర్యంబు తమకంబు దర్పం బవార్య
శౌర్యంబు చలము రోషంబు దెప్పించి 1930
పదరుచు గజరాజుపై నెక్కి నిక్కి
కదిసి భీమునిమీఁద గవియించుటయును

అంతట నమ్మేటి యందఱిమీఁద
వింత కయ్యముచేసి వెస విజృంభించి
మొనలు భేదించి తెంపున పెంపు మించి 1935
ఘనసైనికులఁ గూల్చి గజములఁ బేల్చి
యరదముల్ చెండాడి హరుల నుగ్గాడి
పొరిబొరి కాల్బలంబుల జక్కు చేసి
యోధుల జంపి మహోద్దండశక్తి
సాధనావళుల విచ్చలవిడి ద్రుంచి 1940
కరవాలములఁబట్టి కరులతోఁ గరుల
హరులతో హరుల రయంబున మోఁది
కట్టల్కతో నార్చి కవియవచ్చుటయు
బెట్టుగా నుండి కుబేరనందనుఁడు

నలకూబరభీమసేనుల సంవాదము



బ్రహ్మాండభాండముల్ పటపట పగుల 1945
బ్రహ్మాస్త్ర మరిపౌసి పావనీ కనియె
ధరణీశ యక్షగంధర్వదైతేయ
వరుల జాతుముగాని పరబాహుశక్తి

నినువంటి బలశౌర్య నిధిని మే మెందు
గనలేదు వినలేదు ఘనుఁడవు నీవు 1950
నీ సాహసఫ్రౌఢి నీబాహుబలిమి
నీ సముద్దండత నీగదా ప్రతిభ
నీ మహాటోపంబు నేఁ జూచినాఁడ
భీమసేనుఁడ నీకు భీముఁడే సాటి
కాక యన్యులయందు గలదె యీ మహిమ 1955
మాకు నిన్ జూచిన మది సంతసిల్లె
గట్టివాఁడవు తల్లిగర్భంబునందు
పుట్టిన నీవలెఁ బుట్టఁగా వలయు
మలసి నిన్ను వధింప మదిఁ దోఁచదయ్యె
కలుగఁడు నినువంటి ఘనుఁడు లోకముల 1960
నరదంబు బాణబాణాసనంబులను
నెరశక్తి జూడంగ నీయందు లేదు
హరిహర బ్రహ్మాదు లటు నిల్వఁజాల
రరుదుగాఁ జూడు బ్రహ్మాస్త్ర మీ శరము
ఇన్నారసంబున నీల్గఁగా వలవ 1965
దన్న నీ వెందైన నరుగుము వేగ

అన విని యి ట్లను ననిలనందనుఁడు
ధననాథతనయ యెంతటి బల్మి నాది
నీసాహసం బెంత నే నెంతవాఁడ
దోసంబు నన్నెంచె ద్రోణుఁ డుండఁగను 1970
గురు కృప కృత వర్మ గురుసుతు లుండ
నరఘటోత్కచ సింధునాథు లుండఁగను
తగిన బాహ్లిక సోమదత్తు లుండఁగను
బొగడొందు భూరిశ్రవుం డుండఁగాను
జగదేకవీరుండు శకుని యుండఁగను 1975
నగణితం బైన మాయన్న యుండఁగను
పరశురాముని గెల్చి ప్రఖ్యాతి గనిన
బిరుదాంకమూ ర్తి యాభీష్ము లుండఁగను
వన్నె కెక్కిన యోధనర్యు లండగను
న న్నెన్నఁదగునె కిన్నరనాథతనయ 1930
వీరుండ వనుచు నీవే నన్నుఁ బొగడి
పోరిలో వెన్నిచ్చి పొమ్మన్న దగునె!
మొనసినవేళల మొన నిల్వ లేక
వెనుకఁ దీసిన మీరె నిక విక నగరె

వల నొప్పఁగా రాచవారము మేము 1985
కలనైన విరుగడ గాన మోయయ్య
తొలఁగక నీసేనతోఁ గూడ నిన్ను
కళవళపఱచి చీకాకుగాఁ దరిమి
వూనికమీర మీపురము గన్గొనక
నే నెందుబోయెద నిటు చూడు మనుచు 1990
కొదకక కాలాంతకునిలీల నార్చి
గద ద్రిప్పుచును మహోగ్రతవచ్చుచుండ
నలకూబరుఁడు వాయునందనుమీఁద
నలుకమై కమలభవాంశుగం బేసె
నేసిన నది పటుహేరాళభాసు 1995
భాసురపానక ప్రతిభాసమాన
మగుచు పంకేజభవాండముల్ నిండి
తెగువతోఁ గూడి యేతెంచు నవ్వేళ
కని యర్జునుఁడు పంకజభవాస్త్రంబు
ధనువునఁ బూని మంత్రయుతంబుగాఁగ 2000
కడకతో సేసిన ఘనసాయకములు
తడవు బోరాడి యంతట శాంతి బొందె

మారుతి యప్పుడా మహనీయశరము
బీరువోవుట నార్చి బెట్టుగా నేసె
నలకూబరునిమీఁద నలు వగ్గలించి 2005
చలమున గవియ నాజాంగలుం డపుడు
ఎడ సొచ్చి యరికట్టి యిషుపరంపరలు
జడివాన గురిసినచందంబు దోఁప
పటుశక్తి నిగుడించె బహు యోధవరుల
భటు లశ్వములు గజపంక్తులు గవిసె 2010
ఆసమయంబున ననిలనందనుఁడు
ఆసైన్యముల నెల్ల నవనిపైఁ గూల్చి
జాంగలునరదంబు జక్కుగా మోది
పొంగుచు ధననాథుపుత్త్రుపైఁ గవిసె
అగ్గలికనువచ్చు నాభీముఁ గాంచి 2015
బెగ్గిల్లె సేనలు భీతిల్లెఁ గరులు
వీరపుంగవు లెల్ల వెన్నిచ్చి చనిరి
పారిరి యోధులు పరచె నశ్వములు
వేరైనరథికులు వెంపైనదొరలు
తీరైనచెలికాండ్రు దిక్కు దిక్కులను

చెదరిపోవుట గాంచి చెలగిఁ భీముండు
బొదలుచు యక్షేశుపుత్త్రుపైఁ గవిసి
గదహస్తయుగమున గట్టిగాఁ బూని
పదరుచు నమ్మహాబలియునిరథము
తొలగిపోనీయక తుమురుసేయుటయు 2025
తలకి యక్షేశనందనుఁ డటమున్న
చెన్ని చ్చి పారిన వెసనంట దరిమి
యన్న రాగ్రజుఁడు మహారౌద్రుఁ డగుచు
గదియ నేతెంచి వెక్కసముగా నార్చి
గదగొని మోదిన కళవళమంది 2030
దంభోళిథారచే ధారుణీధరము
కుంభినిఁ గూలిన కొమరు దీపింపఁ
బెట్టు మూర్ఛిలి, లేచి జేర్చి కుబేరు
పట్టి యొక్క రథంబు పైకి లంఘించి
ధనువు సంధించి సాధనములు పూని 2035
యనిలాత్మజునిమీఁద నరుదెంచుటయును
అంతని యంతుఁ డత్యంతవేగమున
నెంతయు నాదిగ్గజేంద్రము నెక్కి

వెస మస్తరించి కవించి నూఁకుటయు
వసుధాతలాధీశు వడువున నేఁగి 2040
తలవాంచి తుండంబు తగసాచి పొడువ
తలకక మారుతి ధైర్యంబు మెరసి
పెలుచ నొక్కింతయు బెళికి యోరైన
తొలగనీక గజంబు దుమి గ్రుమ్ముటయు
అది దప్పి మత్త వేదండకుంభములు 2045
గద కొద్ది జదిపిన గకవిక నొంది
యాలోన తెలివొంది యాదిగ్గజంబు
కీలున మేలున గేడించి మించి
చిమ్మి క్రుమ్మినను ఖచిక్కున నాల్గు
కొమ్ము కత్తులు గాడికొనలు దెల్వెడలి 2050

భీముఁడు మూర్ఛిలుట


మొనలు చూపిన బెట్టు మూర్ఛిల్లి పవన
తనయుండు రోఁజుచు ధరణిపై వ్రాలె
పవనతనూజుని పాటెల్లఁ జూచి
భువనైకవీరుండు పురుహూతసుతుఁడు

కెరలి వైశ్వానరు క్రియమండి యార్చి
తరుచుగా దేవదత్తంబు పూరించి
గురుతరగాండీవగుణము మ్రోయించి
గరుడసేనలతోడ ఘనచిత్ర నేను
దురమునఖండించి దోశ్శక్తి మించి

అర్జునుని యుద్ధము


యరదంబు రాజరాజాత్మజుమీఁద
పరువడి దరిమి కోపంబు రెట్టింప
శరపరంపరల రాక్షసయక్షబలము
నురుమాడి హయముల నుగ్గుగావించి
కరి ఘటావళి నెల్ల గనెలు గావించి
సార్వభౌముని నొక్క సాయకంబుననె
యుర్వీతలంబున నొగి ద్రబ్బనేసె
జాంగలుతోఁగూడ శతకోటి రధిక
పుంగవులను బొట్టు పొట్టు గావించి
క్రూరత్వమున నలకూబరుమేన
ఘోరనారాచములు గుప్పించి మించి

యతని నెచ్చెలికాండ్ర నరువదికోట్ల
శితసాయకంబుల జీకాకుపఱచి
గరుడ కిన్నర యక్ష, ఖచరుల నూట
యరువదికోట్ల యోధావళిఁ దునిమి
మునుమున్న మున్నూట ముప్పదికోట్ల 2075
దనుజగంధర్వ యోధుల చిక్కుపఱచి
బెడిదంపు పీనుఁగు పెంటలు చేసి
తడయక దేవదత్తంబు పూరించి
యరదంబు రాజరాజాత్మజుమీఁద
పరపుచు పడియున్న పావనిఁ గాంచి 2080
యమరేంద్ర నందనుం డడరి శోకించి
క్రమమున గొంత ధైర్యస్వాంతుఁ డగుచు
నరదంబు డిగి యెత్తి యక్కునఁ జేర్చి
తొరగు నెత్తురులు పోదుడిచి హా యనుచు
మోముమోమునఁ జేర్చి మూర్ఛిల్లి తెలిసి 2085
ధీమనంబున నలుదిక్కులు జూచి
యల శ్రీదనందను నదలించి గదిమి
యలవడ కన్నులు నశ్రులు దుముక

పలుమరు వీక్షించి పాంచాలిచెంత
వలనొప్పఁగా నుంచె వాయునందనుని 2090

ద్రౌపదిశోకము


పాంచాలపుత్త్రియుఁ బవమానసుతుని
గాంచి శోకించి కన్గవ నీరు నించి
విలపించి విలపించి విధిఁ దలపోసి
తలయూచి తలయూచి తడఁబడి వగచి
ముప్పిరిగొను పెనుమూర్ఛలఁ బొదలి 2095
తెప్పిరి యడలుచు దీనత్వమొంది
పవననందనుమీఁదఁబడి మోదుకొనుచు
కవగూడి యుసిరికెకాయ లంతేసి
కలితాశ్రుకణములు కన్ను లదుముక
నలబింబముల బోలు నధరము ల్వణక 2100
హావీరశేఖర! హా ప్రాణనాథ!
హావిక్రమాటోప! హావంశదీప!
హాపాండునందన! హాపుణ్యమూర్తి
హాపావనచరిత్ర ! హాదయాజలధి!

పూని కౌఁగిటఁజేర్చి పొసగ లాలించి 2105
నానావిధముల నయములు పలికి
వినయము ల్సేసిన వినక నేనిన్ను
పనిచితి నెంత పాపము గట్టుకొంటి
తిరమొంద నెందైన స్త్రీలకు బుద్ధు
లొరపుగా పెడతల నుండుట నిజము 2110

నీమీఁద నామీఁద నీరజాక్షుండు
తామసచిత్తుఁడై దయదప్పెనేమొ
చేకొని నాకు నీజీవ మిచ్చితిని
నీకు నాప్రాణము నిజముగా నిత్తు
భూనాథ నే చలపోరినందులకు 2115

ప్రాణహానియు నపఖ్యాతియుఁ గలిగె
కువలయాధిపుబుద్ధి కొంత కొంతైనఁ
జెవిఁ జేర్ప కనుభవించితి నింత ఫలము;
పతుల దీకొని మారుబలుకుచు మెలఁగు
సతులకు బెక్కు మోసములు రాకున్నె! 2120

యనుచు దుఃఖించు నయ్యంభోజముఖిని

ద్రౌపదిని అర్జునుఁడు ఊరార్చుట

గనుఁగొని లాలించి గాండీవి పలికె
మానినీమణి యనుమానంబు వలదు;
ప్రాణంబు లున్నవి పవనజుమేన
వూనిన బలుమూర్ఛ పొంది యున్నాఁడు; 2125
కాని విచారంబు కలనైన లేదు
మీనాక్షి వెరవకు మిక్కిలి యతని
ప్రాణంబునకు నాదు ప్రాణ మిచ్చెదను;
అనుచు దుఃఖము మాన్పి యక్కునఁ జేర్చి
నను జూడు మని సింహనాదము చేసి 2130

నలకూబరార్జునుల సమరము



నలకూబరుని గాంచి నారి మ్రోయించి
తలకొని దేవదత్తంబు పూరించి
యరదంబు దోలించు నాసమయమునను
సురవైరి పడియున్నఁ జూచి యర్జునుఁడు
అక్షుల మిణుగురు లశ్రు సంఘములు 2135
నక్షయంబుగ థాత్రి నవఘళింపఁగను

ధననాథసుతుని క్రోధమున నీక్షించి
తనయుని దనయురస్థలమున నలమి
యరదంబుపై నిడి యలి వేణి తాను
వరుసతో పలవించి వగపు చాలించి 2140
కరకరి నొగనొగల్ గదిసి తార్కొనిన
నరదంబు బోనిచ్చి యర్ధేశసుతుని
వివిథాస్త్రతతుల బల్విడి ముంచుటయును;
అవియెల్ల దునిమి యక్షాధీశుపట్టి
యమితసాయకముల యర్జునుమీఁద 2145
గమకించి వేయ నాగాండీవధన్వి
యలఘు బాణంబుల నవి దునుమాడి
నలకూబరుని నూట నాట నేయుటయు,
నలకూబరుఁడు నారసంబునను
నలిరేగి నరుని కంఠము దూరనేసె 2150
అదియెల్లఁ బరికించి యమతనూభవుఁడు
బెదరి యశ్రువులొలుక భీష్మునిఁ జూచి
కనుగొంటివే దేవ గాండీవితెఱఁగు
మన భీమసేనుండు మారుతిసుతుఁడు

పడినచందము మన బలములు తొట్రు 2155
పడిడిమార్గము, యక్షపతిపుత్త్రు చెలువు
నించుక దడసిన నింద్రజుం డొరగు
పాంచాలనందన పనియేమి యగునొ!
అని పల్కి వగనొంది యందరి జూచి
తనరథం బురువడి దరిమిన యపుడు 2160
శమనుజు వెనువెంట శతవర్మ శకుని
యమరనదీసూనుఁ డర్కనందనుఁడు
గురుఁడును గృపుఁడును గురుతనూభవుఁడు
కురు రాజు నకులుండు కురుకుమారులును
పొగడొందు భగదత్తభూరిశ్రవులును 2165
తగ దుస్ససేన సైంధవబాహ్లికులును
కడు సహదేవమాగధసోమదత్తు
లెడపక తమమీఁద నెదిరించి పోరు
నెరయోధవర్యుల నిమిషమాత్రమున
బరువడి ఖండించి బలములఁ గొల్చి 2170
రాజశేఖరశౌర్య రజితాద్రి ధైర్యు
రాజరాజతనూజు రమణీయతేజు

నారూఢి దాకి దివ్యాస్త్రజాలములు
భోరున బుంఖానుపుంఖముల్గాఁగఁ
గురియించి కెరలి గగ్గోలుగా నార్చి 2175
ధర వ్రీల సింహనాదములు జర్వించి
శమనుజుఁ డవ్వీరు సారథి జంపె
గమకించి భీష్ముండు కవచంబు జించె
నరదంబు నలిచేసె నర్క నందనుఁడు
తురగంబులను గూల్చె దుశ్శాసనుండు 2180
గురుఁడు కిరీటంబు గూలంగ నేసె
గురుతనూజుఁడు గొడుగులఁ గూలనేసె;
నకులుండు పడగ చూర్ణంబు గావించె,
శకుని కోదండంబు చయ్యన దునిమె;
కరవాలు దుమురులుగా జేసె కృపుఁడు, 2185
కురురాజు పలక గ్రక్కున నుక్క డంచె!
అధిపతి కడ్డమై యార్చుచువచ్చు
రథికుల మూఁడు ఖర్వంబుల దాకి
సుర రాజతనయుండు సునిశితాస్త్రముల
బరగించి రూపు లేర్పడకుండ జేసె 2100

దానవ మానవదళము లవ్వేళ
నానాదిశల సింహనాదము ల్నించి
యనువొంద కిల్లెల్లి కార్భటుల్చేసి
చని గరుడ యక్ష రాక్షసబలంబులను
గొరవి ద్రిప్పినమాడ్కి గోరించుటయును 2195
తిరుగ లేనట్టి భీతిని దల్లడిల్లి
దెసచెడి దగదొట్టి దీనులై బెగడి
కునీరప్పి బలుస్రుక్కి, కూఁతలు మాని
యలకాపురము త్రోవ నరుగు సైన్యముల
నలకూబరుఁడు గాంచి నగుచు నిట్లనియె 2200
ఏలపోయేద రన్న యిపుడు నాలావు
పోలించి కనుఁగొని సోదురుగాని
నిలు నిలుఁడని చాల నిగుడివెన్దగిలి
బలముల మరలించి భయముల మాంన్పి
నలువొంద సూతననవరత్న ఖచిత
సలలిత కాంచనస్యందనం బెక్కి
మహనీయ తరచండ మార్తాండకోటి
.................................వీర్యుఁడై కెరలి

ధననాథసూనుఁ డుద్దండవేగమున
ఘనరోష చిత్తుఁడై గదియ నవ్వేళ, 2210
కనుఁగొని చెలరేగి 'గాండీవధన్వి
ఘనదివ్యశరవృష్టిఁ గప్పిన నతఁడు
నవియెల్ల పొడిపొడియై రాలనేసె
నవశిలీముఖముల నరుని గప్పుటయు
విలయాంతకునిలీల విజయుఁ డవ్వేళ 2215
నలకూబరుని దొడ్డనారసంబులను
పరువడి గరిదూరి పారనేయుటయు
వెరగొంది మూర్ఛిల్లి వేవేగఁ దెలిసి
యమరేంద్రసుతునిపై యలుక రెట్టించి
రమణీయ దివ్యనారాచజాలములఁ 2220
గడిమి పింజాపింజ గదియ నేయుటయు
నడరి భీష్మద్రోణు లాదిగాఁగల్గు
రథికో త్తములు రాజరాజ తనూజు
నధిక రౌద్రాకారు లై చుట్టు ముట్టి
మునుకొని నవమేఘములు నేక మగుచు 2225
ఘనపర్వతంబుపై గప్పినలీల

విరివిగా బలుశరవృష్టి ముంచుటయు
గురుబలాడ్యుఁడు నలకూబరుం డలిగి
వివిధమహాఘోరవిశిఖజాలముల
నవియెల్ల నవలీల నవనిపైఁ గూల్చి 2230
పాండవేయాగ్రణి పదిట నొప్పించి
గాండీవి నారింట గళవళపరచి
గురుని మూఁడమ్ములఁ గుదియంగ సేసె
గురుసుతు నాల్గింట గోరించివేసి 2235
పరువడి కృపుని డెబ్బదిముల్కు లేసి
గాంగేయు నేడుమార్గణముల నొంచి
యంగాధిపుని దొమ్మి దమ్ములఁ గలంచి
శకుని పదేనింట చట్టలు సీల్చి
నకులుని పది రెంట నకనకల్జేసి 2240
శతవర్ము నైదింట జక్కు గావించి
ప్రతిభచే సహదేవు పదమూట నొంచి
చెలగి మూటను దుస్ససేనునిఁ గూల్చి
నలుబదేనింట సైంధవుని జెండాడి
భగదత్తు ఖండించి బాహ్లికుఁ జంపి 2245

తెగి సోమదత్తుని తెగటార్చి యార్చి
భూరిశ్రవుని ధాత్రి బొరలంగ నేసి
వీరసైన్యముల పృధ్వీస్థలిఁగూల్చి
శరనిధుల్గలఁగ సక్షత్రములు రాల
ధరవ్రీల విలుగుణధ్వనిసేయుటయును, 2250
అమరేంద్రసుతుఁడు గంగాత్మజుఁ జూచి
సమహితచారిత్ర చూచితే యతని
శౌర్యమాటోపంబు శరకౌశలంబు
ధైర్యంబు వీర్య ముద్దండంబు చలము
వలికలోచనునిదీ టనవచ్చు నతని 2255
నలముక దొమ్మి కయ్యంబు చేసినను
మనల మెచ్చరు మేటిమగలు చూచినను
వినుమయ్య సాహసవిహితంబు గాదు
ఇవ్వీరు, నందఱు నేకమై గొలువ
నెవ్వరి ప్రాభవం బెఱుగంగరాదు 2260
ఇత డందఱిని గెల్చెనేని దేశాధి
పతు లంకెకును రారు ప్రతిభలు తొలఁగు
తగవుగా దిదియె పాతక హేతు వండ్రు

నగుబాటుసేయక నన్ను మన్నింపు
నలకూబరునిమేలు నావిలు నేర్పు 2265
సొలవక కనువిచ్చి చూడుఁడు మీరు,
చెన్నొంద నన్నుఁ బెంచిన నీవు మెచ్చ
మన్ననఁ బెంచిన మాయన్న మెచ్చ
విలువిద్య నేర్పిన వీరపుంగవుఁడు
సలలితతేజుఁ డాచార్యుఁడు మెచ్చ 2270
నతని నే గెలిచెద నాయక్షసుతుఁడు
చతురత్వమున నన్ను సాధించెనేని
యప్పు డాతనిమీఁద ననిసేసి గెలువు
మిప్పుడే పనిసేయ నెన్నిక గాదు
నిలుఁ డని యందఱ నిలిపి గాండీవి 2275
నలకూబరునిఁ జూచి నగుచు ని ట్లనియె
నీచక్క దనమును నీరాజసంబు
చూచి మా ప్రద్యుమ్నుఁ జూచిన యట్ల
నుండఁగా నిందాక నోర్చుక యుంటి
నిందు సాహసశక్తి నీవు చూపితివి 2280
నీ పెంపు నీ తెంపు నీవిక్రమంబు

చూపుము నామీఁదఁ జూచెద నిపుడు
మీవారు నినుఁజూచి మేలు మే లనఁగ
మావారు ననుఁ జూచి మాయురే యనఁగ
పోరాడవలె నని పురుహూతసుతుఁడు 2285
నారసంబుల నూట నాట నేయుటయు
నవశిలీముఖముల నలకూబరుండు
కవిసి యర్జునుమేను గాడ నేయుటయు
కళవళ మందఁగా గాండీవధన్వి
బలునారసంబులు బరపినఁ గెరలి 2290
నలువొంద వేయుబాణములు సంధింప
యిల నవి గూల్చి యక్షేశనందనుండు
పదివేలశరములు పరసిన క్రీడి
పదరక నవియెల్ల భగ్నముల్ సేసి
లక్ష సాయకముల లక్షించి యేసె 2295
యక్షవల్లభపుత్త్రుఁ డవి దునుమాడి
కోటిబాణములు మిక్కుటముగా నేసె
పాటించి కనుగొని భళి యని మెచ్చి
శత మన్యుసుతుఁ డవి చక్కు గావించి

శతకోటిశరములు చలమున నేసె 2300
దోర్బలంబున నవి ద్రుంచి నిగుడ్చె
నర్బుదాంబకములు యక్షేశసుతుఁడు
పర్వసేయక నవి భంజించి వై చె
ఖర్వసాయకములు గాండీవి సొనిపె
యన్నింటి పొట్టు పొట్టయి రాలనేసె 2305
కిన్న రాధిపుపట్టి గేరి యుప్పొంగి
పద్మ సాయకములు పావకాశుగము
పద్మారికులజుని పై నేయుటయును
దొలఁగ నన్నింటిని దునిమి; కిరీటి
జ్వలనబాణ ప్రభాజాలంబు జూచి 2310
వరుణాంబకమున వారించి కినిసి
యిరవైన సమ్మోహనాస్త్ర మేయుటయు
దురుసైనమూర్ఛలు దొట్రుకొనంగ
నరదంబుపై వ్రాలె యక్షేశసుతుఁడు
అంతట నిలువక యమరేంద్ర సుతుఁడు 2315
పంతంబు శౌర్యంబు బాహుబలంబు
మిగులునం తంతకు మిక్కుటం బగుచు

నిగనిగన్ గులికెడి నిశితాంబకముల
గరికరి మెరయంగ గడు నిగుడించి
గరుడుర్వదికోట్లు గదిసిన దునిమి 2320
సింధురంబుల కోటి చించి చెండాడి
గంధర్వులను నాల్గుఖర్వంబు లైదు
లక్షలపదివేల లవములు చేసి
రాక్షసాధిపుల నిర్వదికోటు లైదు
లక్షల ధరణీతలంబునఁ గూల్చి 2325
యక్షాధిపుల పదుయారుఖర్వముల
నిరువదికోటుల నిలఁ గూల నేసి
యరయ సంఖ్యకు నెక్కు డైనకిన్నరుల
భువిఁ గూల్చి పెక్కు కింపురుషులఁ జంపి
దివిజేంద్రతనయుండు తేజంబు మెరసి 2330
నారసం బందుట నారి పూనుటయు
ధీరత నేయుట దెలియరాకుండ
నెడలేక గాండీవ మెపుడు గన్గొనిన
గుడిబడి యుండంగ గ్రోధించి కవిసి
మిక్కిలి కరు కెక్కి మించి యేసినను 2335

ఎక్కడఁ గనుఁగొన్న నెందుఁ జూచినను
ఎచ్చోటఁ బరికింప నెచట వీక్షింప
హెచ్చు గాయంబుల నీల్గెడిభటులు
సమయు నేనుంగులు చచ్చుగుఱ్ఱములు
తుమురు లౌనరదము ల్తునియు సారథులు 2340
మ్రగ్గెడి యోధులు మడియు దానవులు
మ్రొగ్గు మావంతులు మురియు కిన్నరులు
నరుదుగా బలు డొల్లియాడెడుతలలు
పరువు లెత్తుచు మిట్టిపడెడిగాత్రములు
పచ్చడల్ దరిగి గుప్పలు బోసినటుల 2345
నచ్చ టచ్చట రాసులైన మాంసములు
గాటంపు పెనురొంపిగా దండి నిండి
మేటులై దగుక్రొవ్వు మెదడునెత్తములు
మూల్గెడువారును మొరలిడువారు
నీల్గెడువారును నెరిదూలువారు 2350
పొరలెడివారు వాపోయెడివారు
గొరలెడివారు దగ్గుత్తిక నురికి
యరచెడువారు పెల్లార్చెడువారు

కొర ప్రాణముల బండ్లు గొరికెడువారు
కలువరించెడివారు కనులార్చువారు 2355
పలువరించెడివారు భ్రమసెడివారు
బెబ్బరించెడివారు భేదిల్లువారు
తబ్బిబ్బులై నేల తడవెడివారు
కలగి ఘూకాదిక కలకలం బగుచు
నలఘు భయంకరం బయ్యె నా వేళ 2360
వరకేశచయము శై వాలమ్ము గాఁగ
కరమొప్ప గొడుగులు కమలము ల్గాఁగ
రమణ నానారత్న రథనికాయములు
కమనీయకర్కాటకంబులుగాఁగ
నెరిదేలు క్రొవ్వుడిండీరంబుగాఁగ 2365
కరిగాత్రములు జలగ్రహములుగాఁగ
కలితరథాంగముల్ కమఠముల్గాఁగ
మెలువొందుఖడ్గముల్ మీనముల్లాగ
ననువొంద బాణబాణాసనప్రతతి
ఘనతరజలపన్నగంబులుగాఁగ 2370
పొరిపొరిఁ దేలెడు పురియలపిండు

సిరిగుల్కు ముత్యంపుచిప్పలు గాఁగ
సరసంపుశల్యముల్ శంఖము ల్గాఁగ
మరికొన్నిసాధనమండలావలులు
గురతరజలచరకులములు గాఁగ 2375
తరుచైనతరువులు ధ్వజములు గాఁగ
నడరి మెండైన గాయముల బెల్లుబ్బి
గడుజాలుకొని సాగి కాల్వలై వంక
లై వాగులై యేరులై నదు లగుచు
రయమున గడుబారె రక్తవాహినులు 2380
అత్తరిఁ జెలరేగి యతినూత్నరత్న
మత్తిష్కనవమాంసమత్తవిస్ఫూర్తి
కేలాకెల్లంబులై కేక లేయుచును
ఏలలు బాడుచు నెగిరి యాడుచును
మేలైన పరువుళ్లు మెరువుళ్లు మెరయ 2385
సోలుచు వ్రాలుచు సొక్కుచుఁ గెరలి
యోల యోల యటంచు నొనర నార్చుచును
నాలోలగతి నీదులాడె భూతములు
తాళముల్ గైకొని తగువీణెఁ బూని

తాళము దరువులు దప్పక యుండ 2390
పాళిపదక్రమవంతుమార్గముల
లాలితస్వరకాలలయకాలగతుల
వేలారువిధముల వీణమీటుచును
మేలని తనుదానె మెచ్చుచుఁ గెరలి
యోలలు వెట్టుచు నుదరంబు గదల 2395
హాలల్ల యని నాట్య మాడె నారదుఁడు
బెడిదంపుమూర్ఛ తెప్పిరిలి వేగ
చిడిముడిపడి లేచి శ్రీదునందనుఁడు
తనసేన భూతలాధ్యక్షుని బలము
కనువిచ్చి చూచి వెక్కసమైనరోష 2400
మున లేచి శంఖంబు పూరించి కనలి
ధనవంది దివ్యసాధనములు బూని
చెలికాండ్ర రథికుల సేనల నెల్ల
నలరుచు లాలించి యనికి నిల్చుటయు
చెలరేగి యాసునాసీరనందనుని 2405
బలము నుద్దండంబు బాణలాఘనము
తెగువయుఁ జొరవయుఁ దేజంబుఁ జూచి

తగధర్మతనయుఁ డెంతయుఁ గౌఁగిలించె,
గురుఁడు మూర్కొనియె, నక్కున జేర్చె భీష్ముఁ
డిరవొందగా జంక నిడికొనె గృపుడు,2110
కూర్మితో ముద్దాడె గురుతనూభవుడు,
నర్మితో మ్రొక్కి రలరుము గవలు
మెచ్చెఁ గౌరవరాజు మేలనె గర్ణుఁ
డచ్చెరుపడి యెంచి రతిరథోత్తములు,
కన్నులుండువు ల్గాఁగ వీక్షించి2415
మున్నుగా నెంచె జీమూతవాహనుఁడు

కుబేరుఁడు యక్షవీరులఁ బొగడుట


అంతకుమున్నె యక్షాధినాయకుఁడు
వింతకయ్యం బౌట విని రౌద్రుఁ డగుచు
మలసి మణిగ్రీవమణిమంతులాది
గలమహారథికులు ఖర్వముల్ నడుప2420
బహుసంఖ్యలౌ మూలబలములు గొలువ,
కహకహార్భటుల నాకాశంబు బగుల
పదఘట్టనలకు భూభాగంబు వ్రీల



సదసకాహళభేరికారిగంభీర
రావంబు లరికులగ్రావముల్ గ్రుంగ2425
ఠీవిచే శౌర్య పాండిత్యుఁడై వేగఁ
జనుదెంచి ఘనరణస్థలము వీక్షించి
నినుతించి యత్యంత విస్మయుం డగుచం
నందను నాలింగనంబు గావించి
యందలిరథికుల నందంద బొగడి2430
సమధికవాహినీసహితంబు గాఁగ
సమరసన్నద్ధుఁడై చయ్యన నిలచె
అనిలతనూభవుం డాతని ముద్దు
తనయుండు తెలివొంది తడయక లేచి,
యన్నకు మ్రొక్కి భీష్మాచార్యులకును2435
జెన్నొంద ప్రణమిల్లి చేరి పాంచాల
తనయను గవల నెంతయు నాదరించి
ఘనరథారూఢుడై గగనంబు వ్రీల
దరములు బూరించి, దారుణకఠిన
శరశరాసనములు సంధించి, నిలిచి2440
రనిన నాజనమేజయావనీశ్వరుఁడు



మునినాథునకు గేలు మొగిచి యి ట్లనియె
అనఘాత్మ యాహిడింబాత్మజు ప్రతిభ
అనిలనందనుని మహాటోపమహిమ
ధననాథసుతుని యుద్ధండశౌర్యంబు2445
జననుతుం డగుధనంజయుని సాహసము
కురుయోధ వర్యుల గురుపరాక్రమము
గరుడగంధర్వరాక్షసయక్షయోధ
వరుల విక్రమకళావైఖరులెల్ల
నరుఁదుగా వింటి యక్షాధినాయకుఁడు2450
చనుదెంచి సంగరస్థలమున నిలిచె
నని పల్కితిరి మీర లవ్వలికథయు
వినుపింపవలె నన్న వేడ్క నిట్లనియె
జనమేజయునకు వైశంపాయనుఁడు
అని శ్రీమహానందనాధీశ్వరాంఘ్రి 2455
వనరుహనిరతసేవానందుపేర
భామినీజనపంచబాణునిపేర
అమలకారుణ్యగుణానిధిపేర
కేరళీసౌవీరకేకయద్రవిళ




సౌరాష్ట్ర, జననాధసన్నుతుపేర
పరగు శ్రీరంగ మాంబాగర్భజలధి
సరసకళాపూర్ణచంద్రుని పేర
నసుపమరాయమన్నెకుమారు పేర
ఘనదాననిర్జితకర్ణుని పేర
భూరినానాకళాభోజభూవిభుని
పేర దీనశరణు పేర దేవేంద్ర
విభవునిపేర రావిళ్ల శ్రీకొండ
విభుచంద్రు లింగపృథ్వీభర్త పేర
దినరాజసంకాశతేజునిపేర
అనఘవర్తను పేర నంకితంబుగను
జననుతసత్కీర్తిశౌర్యచాతుర్య
ధనుడగణ్యుండు రత్నాకరకొండ
భల్లాణరాయ శుంభత్సప్త పాండ్య
వల్లభ ఘూర్జర వసుధేశహృదయ
భల్లాగ్ర బిరుద ప్రభావుని పేర
సల్లలితాచార సంపన్నునిపేర (క)



ఘనుని కృష్ణమరాజకవి సుతుఁ డార్య
వినుతుఁడు గోపాలవిద్వత్కవీంద్రుఁ
డెనయ వేడ్కల రచియించినట్టి 2475
 

ఘనతరసౌగంధిక ప్రసవాప
హరణకావ్యమునందు నాంజనేయుండు
పరువడి దీవించి పాండునందనుని
చెలగి తమ్ముల టెంకి జెప్పిపుచ్చుటయు
తలగక నతఁ డేగి దనుజుల యక్ష 2480
 

వరుల ఖండించి యవ్వని నిల్చుటయును
తరుచుగా నది విని ధననాథసుతుఁడు
పవననందునిమీఁద బర తెంచుటయును
దివిజారిపాంచాలి ధృతి నేగి ధర్మ
తనయుని యెదుట పద్మము నిల్చుటయును. 2485


అనిలజు లేమికి నన్న గుందుటయు,
సురముని పవమానసూనుకార్యంబు
లెరిగించి చనుట మహీవల్లభుండు
తడవు చింతించి ఘటోత్కచునితోఁ గూఢ2490



తడయక నచటి కందఱు నేగుటయు 2490

కురురాజు బలముల గూడి యేతెంచి
సురవైరితో బోరి సుగులెల్ల నడగి
సమరంబు చాలించి సంధి యొనర్చి
శమసునందను నాజ్ఞ సమ్మతి బూని
సకలసేసలుగూడి సామీరి కడకు 2495

ప్రకటించి చేరుట ఫల్గుణుం డపుడె
పరతెంచుటయు ధనపతినందనుండు
గరిమెతో గ్రక్కునఁ గదలివచ్చుటయు
బారులు దీర్చుట బలుదెఱంగులను
పో రొనరించుట బోరిలోపలను2500

అనిలజుం డసురేశు దర్థేశసుతుఁడు
మొనసిన మూర్చల మునిగి వేగంబె
తెలి వొంది యనిసేయ దివురుచుండుటయు
నలకాపురాధీశుఁ డావహం బగుట
నిని సైన్యములతోడ వెస నేగుదెంచి 2505
మొనసిన రిపుసైన్యముల నెల్లఁ జూచి



తనబలంబులఁ జూచి ధరణీతలమునఁ
బెనగొన్న పీనుఁగు పెంటలు జూచి
యధికవిస్మయ మండి యివ్వలి యవలి
రధికుల సుతుని భూరమణుని బొగడి
కలన నిల్చుటాదిగాఁగల కథల
నలరుచు నిది ద్వితీయాశ్వాస మయ్యె.2512

  1. (a) తోరంపు వేడ్కలు దుది బొమ్మలాడ (క)
    (b) తోకలపువేడ్కనేఁ దుది బొమలాడ (చ)
  2. భీమకరముల మొరపెట్టుచుండుదురు (చ)
  3. కలవియస్మయమంది కనుదోయి మూసి (1378)
  4. a .తెఱుగును మార్గము ల్దెలఁపవే యనిన (క )
        b. తెఱగుల మర్మము ల్దెలుపుడి యనిన (1378)
        c. తెరగుల మర్మంబు దెలుపుడీ యనిన (చ)
  5. చంక దుడ్డును వెంట శరణార్థి యగునె (త)
  6. 1.గంహరుల్ గగనంబు గగ్గోలుపడగ (క)2. గగనగహ్వరములు గగ్గోలుపడగ
    పగటెల్ల మడిగించి పడి గెలు ద్రుంచి, (చ)
  7. పడి కాపు మునువారు బడలికల్ దట్టి
    తలపడి పారి పొద ల్డూరు వారు (చ)
  8. బెమ్మెర గొని తేనె పెరమూగినటుల (ఛ)
  9. కడు నెఱుంగకయుండగా గట్ట ముంచి (క,చ)
  10. a. కలిగె నా కిది వేగ కయ్యం బటంచు
       కొలువుచావిడి నుంచి గప్పున దుమికి, (చ)
    b కలిగె నా కిది... న్నెకయ్యం బటంచు
       కొలువుచావడినుంచి గుప్పున దుమికి (క)
  11. పరదేశులై గుళ్లపంచల ముడిగి (క. చ)
  12. గురుతైన యీమహాఘోరపాపాలు. (క)
  13. మంచివాడవువోలే మలసి యేతెంచి. (ట)
  14. నమ్మించి చెరచుట నాయంబుగాదు (1378)
  15. యడరి దుష్ట చతుష్టయంబునుగూడి (4491)
  16. పొలియుసేన లటంచు పుడక దా విరచి (చ)
  17. యెలమి మీరఁగఁ జేతి కిచ్చె నావేళ (4491)
  18. తొలఁగక యుండినఁ దోర్బలంబునను (1378)
  19. నలువంద యీపుచ్చనలు మాని వారి
    గలసి సహాయంబు గమ్ము వేవేగ (క )
  20. భూపతి వినుచుండఁ బొక్కెద విపుడు (2421)
  21. 1.గురునందనునకు , క్కుచు కుస్తరించి (క)
    గురుసుతునకు మ్రొక్కి కోపంబు మాన్చి (చ)
  22. కరవాలమును వల్క కవ్వంబు దునిమి (ట)
  23. విరుగడ తిరుగడ వీరులకెల్ల
    గలదు నీ తెరగున గల్గెనే కర్ణ (త)
  24. ములును దాకినఁగాని ముగ్గ రెవ్వారు (చ)
  25. లెనయంగ ములుకులై హృదయంబుగాడి (క. చ)
  26. 1 a. పేరైనయోధుల పేరులు చాపి (క)
    b. పేరైనయోధుల పేరులఁ జీరి (చ)
  27. కేరి చివ్వున గుప్పగించెడువారు (క)
  28. a. నేజీలచే గ్రుమ్మి నిగుడివెన్నంటి (క)
    b. నేజలచే గ్రుమ్మి నిగుడివెన్నంటి (చ)
  29. నటువ్రేయ చండవేదండంబు బెగడి.