సౌగంధికప్రసవాపహరణము/ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము

ఈ ద్విపదకావ్యము క్రీ. శ. 1868 సంవత్సరమున చెన్నపట్టణములో నేలటూరి సుబ్రహ్మణ్యముగారి విద్యావిలాస ముద్రాక్షరశాలయందు పిళ్లారిసెట్టి రంగయ్యనాయనివారిచే ముద్రింపఁ బడి ప్రకటింపఁ బడియెను. ఆప్రతి నామిత్రులగు శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు నా కిచ్చి యందలి చరిత్రంశములఁగూర్చి వ్యాసమును వ్రాయఁగోరిరి. తర్వాత గ్రంథపీఠికభాగమును జదివి, ఆంధ్ర పరిషత్పుస్తక భాండాగారములోని తాళపత్రగ్రంథములను పరిశోధించి, లేఖకప్రసూదములను గొన్నిఁటి సంస్కరించి పరిషత్పత్రికసంచికలో (ఫిబ్రవరి-మార్చి-1937) నొక వ్యాసమును వ్రాసితిని.

రత్నాకరాన్వయుఁడైన ఈకవి భట్టుకులజుఁడు తండ్రిపేరు కృష్ణమరాజు, తనకులగోత్రములను గ్రంథమునందు చెప్పకపోయినను, ఈ రత్నాకరవంశజులు భట్టుకులమువా రని రత్నా కరము సుబ్బరాజు రచించిన తిమ్మభూపాలకాభ్యుదయములోని యీక్రింది సీసపద్యమువల్ల గ్రహింపనగును.


సీ. పృథుయజ్ఞవాటి నావిర్భవించిన వంది
           నరవృత్తి యెవ్యరి వర్తనంబు,
    బహువిధాభయదాన భాసమానపువిష్ణు
           భంజశాఖ యెవ్వారి పుట్టినిల్లు,
    శ్రీకాళహస్తిధాత్రీవల్లభ కటాక్ష
           పంక్తి యెవ్వారికిఁ బ్రాణరక్ష
    ననరపరసికుడా కవిపుంగవులను
           గ్రహపాత్ర మెవ్వారి కవనశైలి

గీ.‌ యట్టి రత్నాకరము వారి యన్వయమునఁ
   బ్రభవమునుబొంది దామరప్రభులవలన,
   నగ్రహారాదిబహుమతు లందియున్న
   యార్యదరితుల మావారి నభినుతింతు.

ఈకవి ద్విపదభాగవతమును, సకలలక్షణసార సంగ్రహ మను వ్యాకరణగ్రంథమును రచించెను. సకలక్షణసారసంగ్రహముయొక్క వ్రాతప్రతి పరిషత్పుస్తకభాండాగారములో నున్నది కానిప్రతి శిథిలము. మొదలును తుదయు గ్రంథమునందు లేవు. ఈ గ్రంథములోని గద్య యిట్లు గలదు,

"శ్రీమద్వేంకటాచలాధ్యక్ష కరుణాసంలబ్దా సాధారణ ప్రజ్ఞావిచక్షణాక్షణ ప్రబంథాంకాంధ్ర శబ్దజాలలక్షణ బహుచిత్రకవిత్వరచనా చమత్కార రత్నాకర కృష్ణమరాజ గర్భరత్నాకరసుథాకర గోపాలసత్కవిరాజ ప్రణీతంబున సకలలక్షణ సారసంగ్రహం బను ఛందంబునందు" (పరిషత్పుస్తక భాండాగారగ్రంథసంఖ్య 3471 ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక ఆరవసంపుటము పుట 353)


భాగవతము దశమస్కంధము

పూర్వభాగముప్రతి ప్రాచ్యలిఖితపుస్తక భాండారమున నున్నది (సంఖ్య 784) ఈగ్రంథములోని అవతారిక భాగము నిం దుదాహరించుచున్నాను.


శ్రీకరమూర్తి దేశికచక్రవర్తి
భట్టమ శ్రీచెన్నభట్టామి బొగడి

గట్టిగా నాదిమకవులు గీర్తించి
దిట్టఁడై మాకవులు దీమసం బెంచి
రత్నాకరాన్వయరాజిత
రత్నాకర సుధాకరత్వభాసితుఁడు
రాజిల్లు కృష్ణమరాజనందనుఁడు
రాజిత సకలకళాతిచక్షణుఁడు
గోపాలసత్కవికుంజరుఁ డనఁగ
నేప్రొద్దు మహిలోన నింపొందువాఁడ"


ఇందలి శైలినిమిత్తము కొన్నిపఙ్తుల నిచ్చుచున్నాను.

“కలధౌత నవహేమ కవితవిశాల
నలినారిమండలోన్నతసౌధచయము
తారాపథోన్నత తపనీయతార
సార భాసురరత్నసౌధజాలములు
కమలానివాస సత్కళ్యాణవిభవ
రమణీయమందిరారామభూములును
అరుదైన వేదశాస్త్రాదివిద్యలను
పరమేష్ఠి మెచ్చని బ్రాహ్మణోత్తములు
మంత్రతంత్రోపాయమహిమలదేవ
మంత్రిని మెచ్చని మంత్రిపుంగవులు"

పై రెండుగ్రంథములు నముద్రితములు. భాషో
ద్ధారకులు ముద్రింతురుగాక.

గ్రంథ ప్రాశస్త్యము

కృతికర్త యగు రావిళ్ల లింగభూపాలుఁడు
కమ్మకులతిలకుఁడు. వెల్లుట్లగోత్రసంజాతుఁడు. ఈ
లింగభూపాలుఁడును, ఇతని తండ్రి తాతలును,
విజయనగరసామ్రాజ్య మేలిన సాళువ, తుళువ,
ఆర్వీటి వంశనరపతుల సామంతులుగ నుండి, గజ
పతులతోడను, అశ్వపతులతోడను, వారొనర్చిన
సంగ్రామములయందు సహాయులై, విజయములఁ
జేకూర్చుచుండిరి బాహుబలదర్ప శౌర్యసంపన్ను
లగు ఈకమ్మసామంతనాయకుల యుదంతము
తత్కులమువారే గాక అఖిలాంధ్రలోకమును
బ్రశంసింపదగినది.
కుమారధూర్జటి కృష్ణరాయవిజయమునం
దీరావెలవారినిగూర్చి ప్రశంసించెను. రాయలు
కళింగ దిగ్విజయయాత్ర వెడలినప్పుడు తోడ్పడిన
వీరనికాయములో రావెలవంశీయులు గలరు. వీరు.. రాయలపక్షముననుండి సమరరంగమున గజపతి దళములతోఁ బోరాడినవిధము ఈక్రిందివిధమునఁ

గవి వర్ణించెను.

ఉ. రీనిగ నౌ కువారును గడిందిరహిన్ వెలుగోటివారలో
     రావెలవారుఁ గూడుకొని రాత్రి పగల్ చతురంగసేనతో
     నేనగఁ జూచినన్ తెలియనెంతయు శక్యముగాని దుర్గమా
     భూవరమౌళి గాంచి యొకపూలునె గీసెద నంచు నుగ్రుఁడై (3-59)

విశ్వనాథనాయనిస్థానాధిపతి వ్రాసిన రాయవాచకములో గమ్మనాయకుల ప్రస్తావన గలదు (పుటలు 65,84).

సౌగంధికప్రసవాపహరణమునందు కవి వర్ణించిన విషయములు గొన్ని విజయనగరసామ్రాజ్య మేలిన సాళువ తుళువ ఆర్వీటువంశనృపాలురు కృతులందిన ఆంధ్రకావ్యములందును వర్ణితము లయ్యెను. లింగభూపాలుని మూలపురుషుఁ డగు మల్లభూపతి గుడిపాటి సమీపమున కుతుబుషాహి బలముల నెదుర్కొని యోడించి రాయలచే పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/10 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/11 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/12 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/13 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/14 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/15 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/16 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/17 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/18 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/19 ఈయుద్ధములో లింగభూపాలుఁడు దళవాయి వేంకటధరణీశుచే మెచ్చులందె నని కవి వ్రాసినాఁడు. ఈవేంకటధరణీశుఁడు వెలుగోటి వెంకటపతినాయనింగారు గానోపు. నెల్లూరు ఉదయగిరి సీమల నీతడు రెండవ వెంకటపతిరాయలచే నమరముగ బడసెను.[1] క్రీ. శ. 1640 తర్వాత నీప్రాంతమంతయు గోలకొండ నవాబు వశమయ్యెను. (నెల్లూరు జిల్లా) ఇప్పటి అనంతపురము, చెంగల్పట్టు, కడప, తిన్నవిళ్లి, మైసూరుప్రాంతములు వేంకటపతిరాయలపరిపాలనక్రిందనే యుండెను.

లింగభూపతి “డాబాలుపై బడి డాగులుచేసె నని” కవి వర్ణించెను. ఈడబాలు అనునది పశ్చిమతీరముననున్న డాబుల్ (Debul)పట్టణ మేమో యని సందేహము గలుగుచున్నది. ఆకాలమున ఆపట్టణము పోర్చుగీసువారివశమున నుండెను. ఆ పట్టణముపై దండువెడలుటకును, పోర్చుగీసువారికిని, విజయనగరసామ్రాజ్యాధీశులకును బోరాట మేల సంభవించెనో తెలియదు. ఈవిషయము పరిశీలింపదగినది.

శాసనములందలి రావెళ్లవారిచరిత్ర

నెల్లూరిజిల్లా శాసనసంపుటములనుండి రావెల వంశీయులగు మఱికొందఱు కమ్మనాయకులచరిత్ర తెలియవచ్చుచున్నది. రాజరాజదేవుని పండ్రెండవ పరిపాలనసంవత్సరమునం దొక రావిళ్ల నాయకుని ప్రస్తావన గలదు. ఇదియె రావిళ్లవారినిగూర్చి చెప్పెడి యత్యంతమైన ప్రాచీనశాసనమును, బ్రథమశాసనమునై యున్నది. [2]వీరిలోఁ గొందఱు నెల్లూరు జిల్లాలో నుదయగిరి, పొదిలి, కొచ్చెర్లకోట సీమలఁ బాలించుచుండిన సామంతనాయకులు గలరు. వీరును వెల్లుట్లగోత్రులే. పొదిలి సీమను బరిపాలించిన రావెల తిప్పానాయకుఁడును, ఉదయగిరిసీమను బాలించిన రావెల కోనేటి చినతిమ్మానాయకుఁడును ముఖ్యులు. సౌగంధికప్రసవాపహరణములోని రావెలవంశీయులకును, శాసనములందలి రావెలవారికిని బరస్పరసంబంధము వీరివంశావళినిబట్టి నిర్ణయించుట దుర్ఘట పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/23 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/24 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/25 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/26 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/27 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/28 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/29 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/30 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/31 పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/32 కార్యాంతరవ్యగ్రుఁడయ్యును బంపించుచుండిన, పరిషత్కార్యదర్శియు, నామిత్రుఁడు నగు రాఘవాచారి (ఎం. ఏ, బి, యల్.) గారికి నమస్కారములు.

లేఖకదోషములు, ముద్రణస్ఖాలిత్యములు సవరించుటకు అవకాశము నాకు లభింపలేదు. ఈప్రమాదము మానవప్రకృతి. పాఠకులు మన్నింతురుగాక! దోషములు రెండవముద్రణకాలమున సంస్కరించెదము.

5-2-1949

కుందూరి ఈశ్వరదత్తు

  1. Nellore District Gazette Vol. I. Page 63. లేదా వెంకటధరణీశుఁడే పెదవెంటపతిరాయలు గావచ్చును. ఈ పెదవెంకటపతిరాయలు, రెండవరాయలకు (1614-1690) సామంతుడుగ తిరుచునాపల్లిఖండము నేలుచుండెను. మొదటి వెంకటరాయల మరణానంతరము సంభవించిన కుటుంబకలహ, రాజకీయవిప్లవములందు, రామరాయలకు వెంకటపతిరాయలు సహాయుఁడై, యాతనిరాజ్యమును స్థిరముగఁ బ్రతిష్టించియుండవచ్చును. ఆకాలముననే సుల్తానితో యుద్ధముపొసఁగియుండును. కాని యీయుద్ధము మూఁడవ శ్రీరంగరాయలకాలమున సంభవించియుండుననియు, సుల్తాని, రాయల పెనుగొండను స్వాధీకపఱచుకొనుటయందు సహాయుఁడై వచ్చియుండునని శ్రీ వెంకటరమణయ్యగారు తలంచుచున్నారు. (Sources of Vijayanagar. Vol I. P. 369)
  2. B. V. Nellore Inscriptions. S (6)